కార్తీక పురాణము 16వ రోజు

దీప స్థంభం ప్రశంస 


ఓ జనకమహారాజా! కార్తీకమాసం దామోదరునికి అత్యంత ప్రీతికరమైన మాసం.  ఈ మాసంలో ధ్వజస్తంభమునందు ఆకాశదీపము ఉంచిన వారు వైకుంఠములో సకల భోగాలు అనుభవిస్తారు. కార్తీకమాసం అంత స్త్రీ పురుషులు ఆకాశ దీపముగాని, స్థంభ దీపము గాని ఉంచి నమస్కరించిన స్త్రీ పురుషులకు సకలైశ్వర్యములు కలిగి, వారి జీవితం ఆనందదాయకం అవుతుంది. దీప స్థంబ ప్రాముఖ్యం గురించి ఒక కథ ఉంది చెపుతాను విను.....

దీపస్తంభము మానవుడు అవటం.............. 

ఋషులలో అగ్రగణ్యుడు అయినా మతంగ మహాముని ఒకచోట ఆశ్రమాన్ని ఏర్పరుచుకొని, దానికి దగరలో ఒక విష్ణు మందిరాన్ని కూడా నిర్మించుకొని, నిత్యము పూజలు చేస్తుండేవారు. కార్తీక మాసంలో ఆ ఆశ్రమము చుటుపక్కల ఉన్న మునులు అందరూ స్వామిని పూజించేవారు. ఒకరోజు ఆశ్రమములో మతంగ మహర్షి  అక్కడ ఉన్న మునులతో "ఓ మునీశ్వరులారా! కార్తీకమాసంలో హరిహరుల ప్రీతి కోసం దీపస్థంబము నుంచి వైకుంఠ ప్రాప్తికలుగుతుందని మనందరికీ తెలిసిన విషయమే కదా! కార్తీక పౌర్ణమి కనుక మనం అడవికి వెళ్లి పెచ్చులు, పేళ్ళులులేని ఒక స్తంభాన్ని తీసుకువచ్చి దానిని విష్ణు మందిరము ముందు పాతి ఆవునేయితో దీపాన్ని వెలిగిద్దాము" అన్నారు. అందుకు మునీశ్వరులు సరే అని అడవికి వెళ్లి మునీశ్వరుడు చేపినవిధంగా ఒక స్తంభాన్ని తీసుకువచ్చారు. దానిని విష్ణుమూర్తి మందిరం ముందు పాతి ఆవునెయ్యితో ఒక దీపాన్ని వెలిగించి దానిని స్తంభము చివర ఆకాశం వైపు ఉంచి పురాణ పాటిస్తున్నారు. ఇంతలో ఆ దీపస్థంభం పెళపెళమని విరిగి అందులోనుంచి ఒక పురుషుడు బయటకు వచ్చాడు. అతనిని చుసిన మునులందరూ ఇలా అడిగారు. "నువ్వు ఎవరు? నువ్వు ఈ దీపస్థంబము నుంచి ఎలా వచ్చావు?" అని అడిగారు. అందుకు ఆ పురుషుడు " మునీశ్వరులారా! నా పేరు ధనలోభుడు. కిందటి జన్మలో ఒక బ్రాహ్మణజమిందారుని. ఐశ్వర్యవంతుడిని అనే గర్వముతో ఎవరిని లెక్కచేయక పాపకార్యములు చేసేవాడిని. న్యాయాన్యాయవిచక్షణ లేకుండా అందరిని దుర్భాషలాడుతూ ఆడవారిని, పిల్లలను హింసిస్తూ సాటి బ్రాహ్మణులను గౌరవించకుండా ఉండేవాడిని. నాకు దానధర్మాలు తెలియవు. మరణించిన తరువాత గోరనరకము అనుభవించి లక్ష జన్మలు కుక్కనై, పదివేల జన్మలు కాకినై, ఐదువేల జన్మలు తొండనై, ఐదువేలజన్మలు పెడపురుగునై, తరువాత వృక్షజన్మమెత్తి కీకారణ్యమునుండి కూడా నేను పాపములను పోగొట్టుకొనలేకపోయాను. ఇన్నాళ్లకు మీ దయవలన స్థంబముగా ఉన్న నేను మానవజన్మ ఎత్తాను. నాకు పూర్వజన్మ జ్ఞానము లభించింది. మునీశ్వరులారా నాకు ముక్తిని పొందే మార్గము ఏదయినా ఉంటె ప్రసాదించండి స్వామి" అని వేడుకున్నాడు. అందుకు ఆ మునీశ్వరులలో ఉన్న అగిరస మహర్షి ఇలా చెప్పసాగారు కార్తీక మహత్యం ఎంతగొప్పది అని చెప్పసాగారు........... 

 ఇంకా ఉంది................









భగవద్గీత

అధ్యాయం 3

శ్లోకం 37

భగవాన్ ఉవాచ 

కామ ఏష క్రోధ ఏశారజోగుణసముద్భావః |

మహాశనో మహాపాప్మావిద్ధ్యేనామిహ వైరిణమ్ ||

అర్ధం :-

భగవానుడు పలికెను :- రజోగుణము నుండి ఉత్పన్నమయేదే  కామము. అదే క్రోధ రూపం దాలుస్తుంది. బోగనుభవముతో అది చల్లారేది కాదు. పైగా, అంతులేని పాపకర్ములకు ఇదే కారణం.


కార్తీక పౌర్ణమి

                

                ఈ కార్తీక పౌర్ణిమికి త్రిపుర పౌర్ణమి అని పేరు కూడా ఉంది. పూర్వం తరకాసురుడికి ముగ్గురు కుమారులు ఉండేవారు.  తారకాసుర సంహారం తరువాత అతని ముగ్గురు కుమారులు బ్రహ్మ కోసం తపస్సు చేస్తారు. వారి తపస్సుకి మెచ్చి బ్రహ్మ ప్రత్యక్షమై మీకు ఏమి వరం కావాలి అంటారు.  అందుకు ఆ ముగ్గురు మాకు మరణం లేకుండా వరం కావాలి అంటారు.  అందుకు బ్రహ్మదేవుడు ఇది సాధ్యం కాదు.  ఇంకా వేరే వరం ఏదయినా కోరుకోండి అంటారు. అందుకు వారు అయితే మాకు ఒకొకరికి ఓకో ఎగిరే నగరామును ప్రసాదించిండి అవి కేవలం 1000సంవత్సరాలకు ఒకసారి మాత్రమే రావాలి. మామాలిని చంపాలియాంటే రథంకాని రథంలో, విల్లుకాని విల్లుతో,అల్లు కానీ అల్లుతో,  బాణం కానీ బాణంతో మేము ముగ్గురము ఒకే సరళ రేఖపైన వచ్చినపుడు మాత్రమే మా ముగ్గురిని ఒకే బాణంతో చంపాలి. అందుకు బ్రహ్మ ఆ వరం ఇచ్చి అదృశ్యం అయిపోతారు. 

                 ఆ వర గర్వంతో మూడు లోకాలను ఆక్రమించి ఒకోకరు ఒకో లోకాని పాలిస్తూ అక్కడి లోకవాసులను నరక యాతనలు పెడుతూ ఎగిరే నగరాలలో సంచరిస్తున్నారు. వారు పెట్టే బాధలను తట్టుకోలేక వివిధ లోక వాసులు బ్రహ్మదేవుని వద్దకు వచ్చి మొరపెట్టున్నారు. అందుకు బ్రహ్మదేవుడు నా వరాలను నేను వెనక్కి తీసుకోలేను. మనం వెళ్లి విష్ణుమూర్తిని శరణు విడుదాము. అందరూ విష్ణుమూర్తి దగ్గరకు వెళతారు.  అప్పుడు విష్ణుమూర్తి ఆ ముగ్గురు అసురుల సంహారం శివకేశవుల వల్లనే జరుగుతుంది. మనం శివుని వద్దకు వెళదాము. అందరూ శివుని దగ్గరకు వెళతారు. శివునికి విషయం మొత్తం చేపి ఆ ముగ్గురు అసురుల సంహారం జరగటానికి సమయం వచ్చింది. రథంకాని రధం కోసం భూమి రధం అవుతుంది. విల్లు కానీ విల్లు కోసం మేరుపర్వతం విల్లు అవుతుంది. అల్లు కానీ అల్లు కోసం ఆదిశేషుడు అల్లు అవుతాడు. శివుడు యుద్ధనికి బయలుదేరుతారు. శివుడు ఆ ముగ్గురు అసురులతో యుద్ధం చేస్తుండగా విష్ణుమూర్తి సమయం కోసం ఎదురుచూస్తున్నారు. ఎలా కొంతకాలం కాగా అసురులు ముగ్గురు ఒకే సరళరేఖపైన రాగానే విష్ణుమూర్తి బాణం కానీ బాణం కోసం విష్ణుమూర్తి బాణం అయి శివుని చేతిలోకి వెళతారు. శివుడు వెంటనే ఆ బాణాన్ని వదిలి ఆ అసురుల సంహారం చేస్తారు. ఈ విధంగా శివకేశవుల చేతిలో ఆ అసురుల సంహారం జరుగుతుంది. ఆ రోజు కార్తీక పౌర్ణమి పౌర్ణమి అవటం చేత ఆ రోజుని త్రిపుర పూర్ణిమ అని పేరు వచ్చింది.


కేదారేశ్వర వ్రత కథ

హిందువులు ఆచరించే ఉత్తమమైన వ్రతం కేదారేశ్వరవ్రతం. ఈ వ్రతం కార్తీక మాసంలో పౌర్ణమి రోజున చేస్తారు. ఈ రోజు ఇంటిల్లపాది కఠోర ఉపవాసం ఉండి ఈ వ్రతమును ఆచరిస్తారు. 

          పూర్వం ఒకరోజు కైలాసంలో పార్వతి పరమేశ్వరులు ఆసీనులైవుండగా వారిని సేవించటానికి దేవగణములు, నందీశ్వరుడు, నారద తుంబురులు శివపార్వతులను స్తుతిస్తున్నారు. సప్తఋషులు ఆసీనులైయున్నారు. వినాయకుడు, కుమారస్వామి వీరభద్రుడు ఉన్నారు.  

        అందులో శివభక్త శ్రేష్ఠుడు అయినా బృంగురిటి అను అతను శివపార్వతుల ముందుకు వచ్చి హాస్యాస్పదముగా అందరిని నవిస్తూ కోలాహలం చేసాడు.  అతని క్రియకి మెచ్చు శివుడు కిందకి దిగివచ్చి అతనిని ఆశీర్వదించారు.  అదే అదునుగా భావించి అతను శివునికి మాత్రమే ప్రదక్షిణలు చేసాడు.  అందుకు పార్వతి మాతకు కోపం వచ్చి శివుని వద్దకు వచ్చి స్వామి వీళ్ళు మిమ్మలిని మాత్రమే ఎందుకు పూజిస్తున్నారు, నమస్కరిస్తున్నారు. నేను మీ అర్ధాంగిని కదా నాకు ఎందుకు మీతో సమానంగా పూజించి నమస్కరించటం లేదు.  అందుకు శివుడు దేవి వీరు విరాగులు, వైరాగ్యము కలవారు.  వీరు నా భక్తులు మాత్రమే అందుకే నాకు మాత్రమే నమస్కరించారు అని అన్నారు.  అందుకు కోపంతో పార్వతీదేవి కైలాసం నుంచి వెళ్లిపోతుంది. 

         పార్వతీదేవి గౌతమముని ఆశ్రమానికి వస్తుంది.  గౌతమముని పార్వతీదేవిని చూసి మాత తమరు ఎవరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అడిగారు.  అందుకు పార్వతీదేవి మునివర్యా నేను హిమవంతుని పుత్రికను, శివుని భార్యని పార్వతీదేవిని అనితెలిపింది.  నేను ఇక్కడికి తపస్సు చేయటానికి వచ్చాను.  నా భర్త శరీరంలో సగభాగం అవ్వాలనే సంకల్పంతో ఇక్కడికి వచ్చాను.  నా సంకల్పం నెరవేరడానికి నాకు మార్గం చెప్పండి అని అడిగారు. అందుకు గౌతమముని మాత నేను మీకు చెప్పగలిగేవాడిన నా ధ్వారా ఈ విషయం లోకానికి తెలియాలని మీసంకల్పం అయితే చెపుతాను వినండి మాత. కేదారేశ్వర వ్రతం ఈ వ్రతం ఆచరించేవారికి సకల కోరికలు, సకల సంపదలు కలిగి సుఖసంతోషాలతో జీవిస్తారు. శివుని కేదారేశ్వరునిగా భావించి పూజించాలి. ఆ రోజున శుచిగా స్నానాదులు ఆచరించి నిర్మలమైన మనస్సుతో మంగళకరములగు ఏకవింశతి దారముతో చేతికి తోరముని ధరించి షోడశోపచార విధులతో పూజను నిర్వహించి ఆ రోజున ఉపవాసముండవలెను. మర్నాడు బ్రాహ్మణులకి భోజనం పెట్టి ఆ తరువాత ఆహారమును తీసుకోవలెను. ధాన్యరాశిని పోసి అందు పూర్ణకుంభము నుంచి ఇరువది యొక్క పర్యాయములు సూత్రమును చుట్టి పట్టువస్త్రముతో దానిని కప్పియుంచి నవరత్నములు గాని సువర్ణమును గాని ఉంచి గంధ పుష్పాక్షలతో పూజించాలి. మాత ఇరవై ఒక్కమంది బ్రాహ్మణులను రప్పించి వారి పాదములను కడిగి కూర్చండబెట్టి యధావిధిగా ధూప దీప గంధ పుష్పాక్షతలతో పూజించి భక్ష్య - భోజ్య, నైవేద్యాదులు కదళీఫలాలు పనసలు ఆరగింపచేసి తాంబూల దక్షిణలిచ్చి వారలను తృప్తి పరచవలెను. ఈ తీరున వ్రతమాచరించిన వారిని శివుడు అనుగ్రహించి మనోభీష్టసిద్ధిని కలుగచేయునని గౌతముడు పార్వతికి వివరించాడు. పార్వతీదేవి అలాగే వ్రతము అచరించినది. శివుడి పార్వతీదేవి భక్తికి మెచ్చి ఆమె అభిష్టం మేరకు శివుని శరీరంలో సగభాగం ఇచ్చారు. అప్పటి నుండి పార్వతి పరమేశ్వరులు అర్ధనారీశ్వరులు అయ్యారు. 

      ఈ వ్రతమును భూలోకములో తేలియాలి అని చిత్రగదుడు అనే గంధర్వుడు నందీశ్వరుడి ద్వారా వ్రత విధానం తెలుసుకొని భూలోకములో ఉజాయిమి సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న వజ్రదంతుడు అనే రాజుకు వివరించాడు.  అతనుకూడా ఈ వ్రతమును ఆచరించి సార్వభౌముడు అయ్యాడు. అదే రాజ్యములో ఒక వైశ్యునికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారు ఒకరోజు తమ తండ్రి వద్దకు వచ్చి ఇలా అన్నారు తండ్రి మాకు కూడా కేదారేశ్వర వ్రతం చేయాలనీ ఆశగా ఉంది అని అడిగారు. అందుకు ఆ తండ్రి నాకు అంతస్తొమత లేదు అని చెప్పారు. అందుకు వారు ఒక చెట్టు కింద కూర్చొని వ్రత తోరములు కట్టుకొని శివుడిని ప్రాదించారు. శివుడు వారికీ వ్రతానికి కావలసినవన్నీ ఇచ్చారు. వాళ్ళు భక్తితో ఆ వ్రతం ఆచరించారు. శివుడు వారిని అనుగ్రహించారు. వారిని సౌందర్యవంతులుగా ఆశీర్వదించారు. కొంతగా కాలానికి వాళ్ళు యువతులు అయ్యారు. అందులో పెద్ద అమ్మాయిని ఉజాయిని రాజు వివాహం చేసుకున్నారు. చిన్న అమ్మాయిని చోళరాజు వివాహం చేసుకున్నారు. వారి తండ్రికి సకల ఐశ్వర్యాలు కలిగాయి. ఇలా ఉండగా అందుకు చిన్న అమ్మాయి కేదారేశ్వర వ్రతం మెచ్చిపోయేది. అందువలన ఆమె, ఆమెకుమారుడి రాజ్యమునుంచి పంపించివేశారు. ఆమె అడవిలో ఒక బోయవాని ఇంట్లోతల దాచుకుంది. ఆమె తన కుమారుడిని పిలిచి మీ పెద్దతల్లి దగరకు వెళ్లి పరిస్థితి వివరించి కొంత ధనము తీసుకురమ్మని పంపించింది. ఆ కుమారుడు ఉజాయిని వెళ్లి పేదతల్లికి చెప్పగా ఆమె కొంతధనము ఇచ్చింది. ఆ ధనము తీసుకొని వస్తుండగా శివుడు మార్గ మధ్యములో ఆ ధనాన్ని మాయం చేసారు. మళ్లీ వెనక్కి తిరిగి వెళ్లి అతని పెద్దమ్మకి చేపగా మళ్లీ కొంత ధనాన్ని ఇస్తుంది. మళ్లీ అదికూడా మాయమవుతుంది. మళ్లీ వాళ్ళ పెద్దమ్మ దగ్గరకి వెళుతుండగా ఆకాశవాణి ఇలా వినిపిస్తుంది. కుమార మీ తల్లి కేదారేశ్వర వ్రతమును మరచిన కారణంగా నీకు ఈ ధనము దక్కదు అని వినిపిస్తుంది. ఆ కుమారుడికి అర్ధం కాక వాళ్ళ పెద్దమ్మ దగరకు వెళ్లి విషయం చెపుతాడు. అందుకు వాళ్ళ పెద్దమ్మ అక్కడే ఆ కుమారుడి చేత వ్రతం చేయించి కొంత ధనాన్ని ఇచ్చి పంపిస్తుంది. ఆ కుమారుడు ఆ ధనాన్ని తీసుకొని వచ్చి తల్లికి జరిగిన విషయం చేపగా ఆమె తప్పు తెలుసుకొని ఆమెకూడా ఈ వ్రతాన్ని ఆచరిస్తుంది. చోళరాజు సపరివారంగా వెతుకుంటూవచ్చి ఆమెను ఆమె కుమారుడిని తీసుకొని వెళతాడు. అప్పటినుండి కేదారేశ్వర వ్రతం విడవకుండా చేస్తు సుఖ సంతోషాలతో జీవించింది.

 

భగవద్గీత

అధ్యాయం 3

శ్లోకం 36

అర్జునా ఉవాచ 

అథ కేన ప్రయుక్తో యం పాపం చరతి పురుషః|

అనిచ్ఛన్నిపి వార్ణ్షేయ బాలాదివ నియోజితః ||

అర్ధం :-

అర్జునుడు పలికెను-  ఓ శ్రీ కృష్ణా!  మానవుడు తనకు ఇష్టం లేకుండా ఇతరుల బలవంతముగా చేసినట్లుగా, దేని ప్రభావము వలన ప్రేరేపితుడై పాపములు చేస్తాడు.

కార్తీక పురాణము 15వ రోజు

దీపం వెలిగించటం వలన ఎలుక పూర్వజన్మ స్మృతితో మానవరూపము పొందుట

15వ అధ్యాయము 

ఓ జనకమహారాజా!  కార్తీక మాసము నెలరోజులు చేయలేనివారు  కార్తీక శుద్ధ త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి రోజుల్లో అయినా నిష్టతో పూజలు చేసి ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి.  కార్తీక మాసంలో ఆవు పాలు పితికినంతసేపు మాత్రము దీపం ఉంచిన మరుజన్మలో బ్రాహ్మణుడిగా జన్మిస్తారు.  ఇతరలు ఉంచిన ఆరిపోతున్న దీపంని వృత్తి చేసినా,  ఆరిన దీపాన్ని మళ్ళీ వెలిగించిన పాపాలు హరిస్తాయి.  ఇందుకు ఒక ఇతిహాసం ఉంది  వినుమని  వశిష్ఠులవారు ఇలా చెప్పసాగారు. 



             పూర్వము సరస్వతి నది తీరమున  శిధిలమైన దేవాలయం ఒకటి ఉంది. కర్మనిష్ఠుడనే యోగి  ఆ దేవాలయం దగ్గరకు వచ్చి కార్తీకమాసం అంతా అక్కడే ఉండి పురాణపఠనము చేయాలని అనుకొని ఆపాడుబడిన దేవాలయాన్ని శుభ్రంగా ఊడ్చి నీళ్ళతో కడిగి బొట్లు పెట్టి పక్కన ఉన్న గ్రామంకి వెళ్లి ప్రమిదలు తెచ్చి దూదితో వత్తులు చేసి ఆవు నెయ్యితో దీపాలు వెలిగించి స్వామిని పూజించి పురాణపఠనము చేస్తున్నారు.  కార్తీకమాసం మొదలైనప్పటి నుంచి చేస్తున్నారు.  ఒకరోజు ఎలుక  దేవాలయం లోకి ప్రవేశించి నాలుగువైపులా తిరిగి ఏమీ దొరకక  అక్కడ ఆరిపోయిన వత్తిని తినాలని అనుకొని నోటికి కరచుకుని వెళుతుండగా అక్కడ పక్కన వెలుగుతున్న దీపానికి ఈ వత్తి కూడా అంటుకొని వెలిగింది. అది కార్తీక మాసం అవటం వలన అ ఎలుక పాపములు నశించి ఎలుక రూపము నుంచి మానవరూపానికి వచ్చింది.  ధ్యాననిష్ఠలో ఉన్న యోగిపుంగవుడు తన కళ్ళు తెరచి చూడగా అక్కడ నిలిబడిఉన్న మానవుడిని గమనించి "నువ్వు ఎవరు? ఎందుకు ఇక్కడ నుంచున్నావు? అని ప్రశ్నించగా "ఆర్య! మునివర్యా నేను ఒక ఎలుకను రాత్రి నేను ఆహారము వెదుకుకొంటూ ఈ దేవాలయాములోకి వచ్చి ఇక్కడ కూడా ఏమి దొరకక నెయ్యి వాసనా వస్తున్న వత్తిని తినటానికి తీసుకువెళుతుండగా నా అదృష్టం కొద్దీ ఆ వత్తి వెలగటం వలన నా పాపములు పోయి నాకు మానవరూపం వచ్చింది. ఓ మహానుభావా! నేను ఎందుకు ఈ ఎలుక జన్మమము ఎత్తవలసి వచ్చింది. దానికి గల కారణం ఏమిటో వివరించండి"  అని కోరాడు.  అపుడు ఆ ముని దివ్యదృష్టిచే సర్వస్వము తెలుసుకొని "ఓయి! నువ్వు పూర్యజన్మలో ఒక బ్రాహ్మణుడవు.  కానీ నిన్ను బాహ్లికుడు అని పిలిచేవారు.  నీ కుటుంబాన్ని పోషించటానికి వ్యవసాయము చేస్తూండేవాడివి.  ధనముపై ఆశతో దేవపూ,జలు నిత్యకర్మలు మరచి నీచుల సహవాసము వలన నిషిద్ధ పదార్ధములు తినటం వలన మంచివారాలను, యోగ్యులను నిందించుచు పరులచెంత స్వార్ధచింత గలవాడై ఆడపిల్లలను అమ్మువృతిని చేస్తూ, దాని వలన సంపాదించిన ధనాన్ని కూడబెట్టుకొని, సమస్థ తినుబండారాలను కారుచౌకగా కొని తిరిగి వాటిని ఎక్కువ ధనానికి నీవు అనుభవించక ఇతరులకు ఇవ్వక ఆ ధనమును భూస్థాపితం చేసి పిసినారివై జీవవించావు. మరణించిన తరువాత ఎలుక జన్మమెత్తి వెనుకటి జన్మ పాపములు అనుభవిస్తునావు. నేడు భగవంతుని దగర ఆరిన దీపాన్ని వెలిగించినందువలన పుణ్యాత్ముడవు అయ్యావు. దానివలన నీకు తిరిగి పూర్వజన్మ ప్రాప్తించింది. కనుక నువ్వు నీ గ్రామానికి వెళ్లి ని పెరడులో నువ్వు దాచిన ధనాన్ని త్రవ్వి, ఆ ధనంతో దానధర్మాలు చేసి భగవంతుని ప్రార్థించికొని మోక్షము పొందుతావు" అని అతనికి హితబోధ చేసారు.

కార్తీక పురాణము 14వ రోజు

కార్తీకమాసంలో చేయకూడనివి

14వ అధ్యాయము



         ఈ మాసములో నీరుల్లిపాయ తినకూడదు. ఇతరుల ఎంగిలి తినరాదు. శ్రధ్ధాభోజనము తినరాదు. తిలదానము చేయకూడదు. శివార్చన, సంధ్యావందనం చేయనివారు వండిన వంటలు తినకూడదు. పౌర్ణమి, అమావాస్య, సోమవారములనాడు సూర్యచంద్ర గ్రహణపు రోజులయందున భోజనము చేయరాదు. కార్తీకమాసములో నెలరోజులు కూడా రాత్రులు భోజనము చేయకూడదు. ఏకాదశి,ద్వాదశీ వ్రతములు చేసేవారు ఆ రెండు రాత్రులు తప్పనిసరిగా జాగారము ఉండాలి. ఒక్కపూట మాత్రమే భోజనము చేయాలి. కార్తీకమాసములో నూనెరాసుకొని స్నానము చేయకూడదు. పురాణాలను విమర్శించకూడదు. కార్తీకమాసములో వేడినీటితో స్నానము  చేయకూడదు. ఒకవేళ అనారోగ్యముగా ఉండి ఎలాగైనా కార్తీకమాసా వ్రతం చేయాలి అనే కుతూహలం ఉన్నవారు మాత్రమే వేడినీటిస్నానము చేయవచ్చు. ఆలా చేసేవారు గంగ, యమునా, గోదావరి, సరస్వతి, సింధు, నర్మదా నదుల పేరులు మనసులో స్మరించి స్నానము చేయాలి. ఏదయినా నదీ దగరలో ఉంటే ఆ నదిలో ప్రాతఃకాలములో స్నానము చేయవచ్చు. ఒకవేళ నదులు అందుబాటులో లేనివారు నూతివద్దగాని, చెరువువద్దగాని స్నానము చేయవచ్చు. కార్తీకమాసా వ్రతము చేసేవారు పగలు పురాణపఠనము శ్రవణము, హరికథ కాలక్షేపములతో కాలము గడిపేవారు. సాయంత్రం సంధ్యావందనములు ముగించుకొని పూజామందిరంలో శివకేశవులను పూజించాలి. కార్తీక మాసములో తనశక్తిని భక్తి బ్రాహ్మణసమారాధన చేయాలి. ఈ కార్తీకమాసం నెల రోజులు బ్రాహ్మణ సమారాధన శివకేశవుల సన్నిధిని నిత్యదీపారాధన, తులసికోటవద్ద నిత్యదీపారాధన చేసిన వారికీ, వారి వంశస్థులు, పితృదేవతలకు మోక్షము కలుగుతుంది. ఈ వ్రతమును శాస్త్రోక్తముగా ఆచరించిన వారికీ, పురాణము చదివినను సకలైశ్వర్యములు కలిగి మోక్షప్రాప్తి కలుగును. 

భగవద్గీత

అధ్యాయం 3

శ్లోకం 35

శ్రేయాన్ స్వదర్మో పరధర్మాత్ స్వనుష్ఠితాత్ |

స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః ||

 అర్ధం :-

పరధర్మం నందు ఎన్ని సుగుణాలు ఉన్న,  స్వర్ణ మందు అంత సుగుణములు లేకుండా చక్కగా అనుష్టించబడి ఆ పరధర్మము కంటే స్వధర్మమే ఉత్తమము. స్వధర్మాచరణమునందు మరణించటమే శ్రేయస్కరము. పరధర్మాచారణము భయంకరమైనవి. 

భగవద్గీత

అధ్యాయం 3

శ్లోకం 34

ఇంద్రియస్యేంద్రియస్యార్థే రగద్వేషౌ వ్యవస్థితౌ |

తయోర్న వశమాగచ్ఛేత్ తౌ హ్యస్య పరిపన్థినౌ ||

అర్ధం :-

ఎవరైనా పట్టుబట్టి కర్మలను ఎట్లా త్యజింజగలరు.  ప్రతి ఇంద్రియ విషయం మీద రాగద్వేషాలు దాగి ఉన్నాయి. మానవుడు ఈరోజుటి వర్షము కాకూడదు.  ఎందుకంటే ఈ రెండే మానవునికి విఘ్నకరాకాలు, మహాశత్రువులు.

కార్తీక పురాణము 13వ రోజు

కన్యాదానఫలము 

13వ అధ్యాయము 

          ఓ జనకమహారాజా! కార్తీకమాసములో ఆచరించవలసిన ధర్మాలు చాలఉన్నాయి. 

             కార్తీకమాసములో నదీస్నానము ముఖ్యమైనది.  దానికంటే ఒక పేద బ్రాహ్మణ కుమారునికి ఉపనయనం చేయించుట ముఖ్యము.  ఒకవేళ ఉపనయమునకు అగు ఖర్చులు భరించాలేనివారు మంత్రాక్షతలు, దక్షిణ తాంబూలాది సంభవనాలతో తృప్తి పరచునను ఫలము కలుగును.  ఈ విధముగా ఒక పేద బ్రాహ్మణ బాలునికి ఉపనయనము చేసిన యెడల ఎంతటి మహాపాపములు అయినా నశిస్తాయి. అంతకన్నా ముఖ్యమైనది కన్యాదానము.  కార్తీక మాసమందు భక్తిశ్రద్ధలతో కన్యాదానము చేసిన తాను తరించుటమే కాక తన పితృదేవతలు కూడా తరింపజేసినవారవుతారు. ఇందుకు ఒక ఇతిహాసము ఉన్నది. 



        సువీర చరిత్రము 

          ద్వాపరయుగములో వంగదేశములో గొసువీర చరిత్రము ప్ప పరాక్రమవంతుడు, సురుడు అయినా సువిరుడు అను ఒక రాజు ఉండేవాడు.  అతనికి రూపవతి అను భార్య ఉన్నది. ఒకసారి సువీరుడు శత్రురాజులచే ఓడించబడినవాడయి, భార్యతో అరణ్యమునకు పారిపోయి ధనహీనుడయి నర్మదా నదీతీరమున ఒక పర్ణశాలను నిర్మించుకొని కందమూల ఫలాదులను భుజిస్తూ కాలము గడుపుతున్నారు. కొన్ని రోజులకు వారికీ ఒక బాలిక జన్మించింది.  ఆ బిడ్డను అతి గారాబముతో పెంచారు. కొంతకాలానికి ఆమెకు వివాహ వయస్సు వచ్చింది. ఒకరోజు వానప్రస్థుని కుమారుడు ఆమెను వివాహం చేసుకోవాలని ఆ రాజుని కోరతాడు. అందుకు ఆ రాజు "ఓ మునిపుత్ర! ప్రస్తుతము మేము బీదస్థితిలోఉన్నాము. అష్టదరిద్రములు అనుభవిస్తున్నాము. మా కష్టములు పోవటానికి కొంతధనము ఇచ్చిన నా  కుమార్తెను ఇచ్చి వివాహం చేస్తాను"  అని చెప్పాడు.  ఆ ముని కుమారుని దగ్గర ధనము లేకపోయేసరికి  నర్మదా తీరమున కుబేరుని గురించి ఘోర తపస్సు ఆచరించి కుబేరుని మెప్పించి సంపాదించారు.  రాజు ఆ పాత్రను తీసుకొని సంతోషించి తన కుమార్తెను ఇచ్చి వివాహం చేసి నవ దంపతులను అత్తవారింటికి పంపించారు. 

             ముని కుమారుడు భార్యను వెంటబెట్టుకొని వెళ్లి తల్లిదండ్రులకు నమస్కరించి అంతవరకు జరిగినదంతా చెప్పి తన భార్యతో సుఖంగా జీవిస్తున్నారు.  వీరుడు మన కుమార్ రెడ్డి జన తన పాత్రను తీసుకుని స్వేచ్ఛగా ఖర్చు పెడుతూ భార్యతో సుఖముగా జీవించారు. అలా కొంతకాలం జరిగిన తర్వాత ఆ రాజు భార్య మరొక బాలికకు జన్మనిచ్చింది.  నా బిడ్డకు కూడా యుక్త వయస్సు  రాగానే మళ్ళీ ధనానికి అమ్మాలని ఎదురుచూస్తున్నారు. 

               ఒకరోజు ఒక సాధు పుంగవుడు తపతీ నది తీరం నుండి నర్మదా నది తీరాన స్నానార్ధమై వచ్చి దారిలో ఉన్న సువీరుడిని కలుసుకొని "నువ్వు ఎవరు? నీ మొఖవర్చస్సు  చూస్తే రాజు అంశమున జన్మించినవాడై ఉన్నావు.  నువ్వు ఈ అరణ్యంలో ఏం చేస్తున్నావు?" అని ప్రశ్నించగా, సువీరుడు "మహానుభావా! నేను వంగదేశంను ఏలు సువీరుడు అను రాజును.  నా రాజ్యమును శత్రురాజులు ఆక్రమించుటవలన భార్యాసమేతముగా ఈ అరణ్యములో జీవిస్తున్నాను.  నాకు ఇద్దరు కుమార్తెలు. మొదటికుమార్తెను ఒక మునికుమారునికిఛ్చి వానివద్ద కొంత ధనమును తీసుకొని వారికీ వివాహం చేశాను.  ఇప్పటివరకు ఆ ధనముతోనే కాలక్షేపము చేస్తున్నాను" అని చెప్పాడు. అందుకు ఆ మునిపుంగవుడు  "ఓ రాజా! నీవు ఎంత దరిద్రుడైన ధర్మసూక్ష్మములు ఆలోచించకుండా కన్యను అముకొన్నావా.   కన్య అమ్ముకుంటూ మహాపాపం.  కన్యను అమ్మినవారు "అసిపత్రవన" అను నారకము అనుభవిస్తారు.  ఆ ధనముతో దేవునికి గాని  పితృదేవతలకు గాని వ్రతము చేసిన వారు నశిస్తారు.  కన్యను అమ్మినవారికి పితృదేవతలు పుత్రసంతతి లేకుండా శపిస్తారు.  కన్యను కొన్న వారికి కూడ గృహస్థ ధర్మాలు వ్యర్ధము అయి నరకము అనుభవిస్తారు.  కనుక రాబోయే కార్తీకమాసంలో నీ రెండవ కుమార్తెను నీ శక్తి కొలదీ బంగారు ఆభరణములతో అలంకరించి ధర్మబుద్ధి కలవానికి సదాచార సంపన్న కన్యను దానం చేయి.  అలా చేస్తే గంగాస్నానం చేసినంత ఫలము అశ్వమేధయాగం చేసినంత ఫలము పొందుతావు. మొదటి కన్యను అమ్మిన పాపము పోతుంది"  అన్ని రాజకీయ హితబోధ చేశారు.  అందుకు రాజు చిరునవ్వు నవ్వి "ఓ  మునివర్యా!  దేహ సుఖము వాళ్ళకంటే దానధర్మాలు వలన వచ్చిన ఫలములు ఎక్కువ? తాను బ్రతికిఉండగా భార్యాపిల్లలతో  దాన ధర్మాలతో సిరిసంపదలతో తను సుఖంగా ఉండక చనిపోయిన తర్వాత వచ్చే మోక్షము కొరకు ప్రస్తుతం అవకాశం జారవిడుచుకుంటారా? ధనము బంగారము కలవారు ప్రస్తుతం ఈ లోకంలో రాణించగలరు గుర్తింపును పొందగలరు.  నా రెండవ కుమార్తెను కూడా నేను అడిగిన అంత ధనం ఇచ్చిన వారికి వివాహం చేస్తాను కానీ నేను మాత్రం కన్యను దానం చేయను" అని నిక్కచ్చిగా చెప్పేను.  ఆ మాటలకు సన్యాసి ఆశ్చర్యపడి తన దారిన తాను వెళ్ళిపోయాడు.

         కొన్ని రోజులకు సువీరుడు మరణించాడు. వెంటనే యమభటులు వచ్చి వానిని తీసుకుపోయి యమలోకంలో  అసిపత్రవనమును నరక భాగమున పడవేశారు. అక్కడ  అనేక రకాలుగా నరక బాధలు అనుభవస్తునాడు. సువురుడి పూర్వికులు అయిన శ్రుతకీర్తి అని రాజు  ధర్మమును ఆచరిస్తూ ప్రజలను పాలించి ధర్మాత్ముడైన మరణించిన తరువాత  స్వర్గములో సర్వ సుఖాలు అనుభవిస్తున్నారు. సువీరుడు చేసిన కన్య విక్రయం వలన శ్రుతకీర్తి నీక్కూడా బంధించి యమకింకరులు స్వర్గం నుంచి నరకానికి తీసుకువచ్చారు.

             అప్పుడు శృతకీర్తి యమధర్మరాజుకి నమస్కరించి "ప్రభు! మీరు సర్వజ్ఞుడవు, ధర్మమూర్తివి, బుద్ధిశాలివి, ప్రాణులను సమానంగా చూస్తున్నావు. నేను ఏ పాపం చేయలేదు. నన్ను స్వర్గలోకము నుండి నరకానికి ఎందుకు తీసుకు వచ్చారు. కారణం చెప్పండి స్వామి" అని ప్రదించాడు.  యమధర్మరాజు శృతకీర్తి తో "రాజా! నువ్వు న్యాయమూర్తవి, ధర్మాత్ముడివి. నీవు ఎటువంటి పాపములు చేయలేదు.  నీ వంశమున సువీరుడు అను రాజు తన మొదటి కుమార్తెను ధనముపై ఆశతో అముకొన్నాడు.కన్యను అమ్ముకొనా వారి పూర్వికులు ఇటు మూడు తారలు అటు మూడు తారలు వారు ఎంత పుణ్యపురుషులు అయినా నరకమున బాధలు అనుభవిస్తారు.  నువ్వు ధర్మమూర్తి కనుక నీకు నేను ఒక ఉపాయం చెప్తాను.  నీ వంశమున సువీరుడికి ఇంకొక కుమార్తె ఉన్నది. ఆమె నర్మదా నది తీరంలో తన తల్లి వద్ద పెరుగుతుంది. నా ఆశీర్వాదంతో నువ్వు మానవ శరీరం ధరించి ఆమె తల్లి వద్దకు వెళ్లి ఆ కన్యను వేద పండితుడు శీలవంతుడైన ఒక బ్రాహ్మణునకు కార్తీకమాసమున సాలంకృత కన్యాదానం చేయించు. అలా చేస్తే నువ్వు నీ పూర్వికులు సువీరుడు కూడా స్వర్గలోకానికి వెళ్తారు. కార్తీక మాసంలో సాలంకృత కన్యాదానం చేసినవారు మహా పుణ్యాత్ములు అవుతారు.  నువ్వు వెంటనే భూలోకానికి వెళ్ళి నేను చెప్పిన విధంగానే ధర్మకార్యములు చేశారా" అని పలికాడు.

                 శృతకీర్తి యమధర్మ రాజుకు నమస్కరించి సెలవు తీసుకుని నర్మదా నది తీరం అన్నపూర్ణ కుటీరంలో నివసిస్తున్న సువీరుని భార్యను కుమార్తెను చూసి సంతోషపడి  అతను వచ్చిన విషయం చెప్పి కార్తీక మాసంలో సువీరుని రెండవ కుమార్తెను చతుర్వేదాలు చదివిన ఒక బ్రాహ్మణ యువకునికి కన్యాదానము చేసారు. అలా కన్యాదానం చేయటం వలన సువీరుడు కూడా  పాపము పోయి స్వర్గమునకు వెళ్ళాడు.

          కన్యాదానం వలన మహా పాపములు పోతాయి. వివాహ విషయంలో వారికి మాట సాయం చేసిన పుణ్యం కలుగుతుంది. కార్తీకమాసంలో కన్యాదానము చేయాలని దీక్షగా పెట్టుకొని ఆచరించే వారు విష్ణు సాన్నిధ్యం పొందుతారు.

కార్తీక పురాణము 12వ రోజు

                                              ద్వాదశీ ప్రశంస

12వ అధ్యాయము

               "మహారాజా! కార్తీకమాసమున కార్తీక సోమవారం, కార్తీక ద్వాదశి వ్రతము గురించి సాలగ్రామ మహిమల గురించి వివరిస్తాను విను"  వశిష్ట మహాముని ఈ విధంగా వివరిస్తున్నారు. 

               కార్తీక శుద్ధ ద్వాదశి నాడు పూర్ణ ఉపవాసం ఉండి ఆ రాత్రి విష్ణు ఆలయానికి వెళ్లి శ్రీహరిని మనసారా ధ్యానించి శ్రీహరి సన్నిధిలో పురాణ కాలక్షేపం చేసి మరునాడు బ్రాహ్మణ సమారాధన చేసిన  కోటి యజ్ఞముల ఫలితము కలుగుతుంది.  కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శ్రీమన్నారాయణ శేష పానుపు నుండి లెగుస్తాడు గనుక కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతం  శ్రీమన్నారాయణునికి ఇష్టం.  ఆ రోజున శ్రీమంతులెవరైనా ఆవు కొమ్ములకు బంగారు తొడుగులు తగిలించి ఆవు కాళ్ళకు వెండి డెక్కలు తగిలించి దూడతో సహా బ్రాహ్మణునకు దానమిచ్చి ఆ అవుకు ఎన్ని రోమాలు ఉన్నాయో అన్ని సంవత్సరాలు  ఇంద్రలోకంలో స్వర్గసుఖాలను అనుభవిస్తారు. కార్తీక మాసంలో వస్త్రదానం గొప్ప ఫలితాన్ని ఇస్తుంది.  కార్తీక శుద్ధ  పాడ్యమి రోజున, కార్తీక పౌర్ణమి రోజున కంచుపాత్రలో ఆవునెయ్యి పోసి దీపం ఉంచిన వారి పూర్వజన్మలో చేసిన పాపాలు హరిస్తాయి.  కార్తీక ద్వాదశినాడు యజ్ఞోపవీతమును దక్షిణతో బ్రాహ్మణులకు దానమిచ్చి పొందగలుగుతారు. కార్తీక ద్వాదశి రోజున బంగారు తులసి చెట్టును గాని సాలగ్రామములను ఒక బ్రాహ్మణునకు దానమిచ్చిన నాలుగు సముద్రాల మధ్య నున్న భూమిని దానమిచ్చిన ఫలితము కలుగుతుంది. దీనికి ఉదాహరణగా ఒక కథ ఉంది శ్రద్ధగా ఆలకించి మహారాజా.

సాలగ్రామ దాన మహిమ



              పూర్వ అఖండ గోదావరి నదితీరమునా ఒక పల్లెటూరిలో ఒక వైశ్యుడు నివసిస్తుండేవాడు.  అతను అత్యంత దురాశా పరుడై  నిత్యం ధనమును కూడా పెడుతూ తాను అనుభవించకుండా, ఇతరులకు పెట్టకుండా,  పేదవాళ్లకు దానధర్మాలు చేయకుండా, ఏప్పుడు పరులను నిందిస్తూ తానే గొప్ప శ్రీమంతుడుగా విర్రవీగుతూ  పరుల ధన్నాని ఎలా అపహరించాలి అనే ఆలోచనతో కాలం గడుపుతూ ఉండేవాడు.

            అతడు ఒకనాడు తన గ్రామమునకు సమీపంలో ఉన్న పల్లెలో నివసిస్తున్న ఒక బ్రాహ్మణునకు తన వద్ద ఉన్న ధనమును పెద్ద వడ్డీకి అప్పు ఇచ్చాడు. మరికొంత కాలానికి  సొమ్మును తనకిమ్మని అప్పుడు ఆ బ్రాహ్మణుడు " అయ్యా!  చేయవలసిన ధన్నాని నెల రోజుల గడువులో ఇస్తాను. నీ రుణము ఉంచుకోను.  ఆ మాటలకు వైశ్యునికి కోపం వచ్చి " అలా వీలు లేదు. నా సొమ్ము నాకు ఇప్పుడే ఇవ్వాలి. లేకపోతే నీ కంఠమును నరికి వేస్తాను" అని ఆవేశముతో ముందువెనుక ఆలోచించకుండా తన మొలకి ఉన్న కత్తితో ఆ బ్రాహ్మణుని కంఠమును నరికేశాడు. వెంటనే ఆ బ్రాహ్మణుడు మరణించాడు. ఆ వైశ్యుడు భయపడి అక్కడే ఉంటే రాజభటులు బంధిస్తారో అని తన గ్రామానికి పారిపోయాడు. బ్రాహ్మణుడిని హత్యా చేయటం వలన బ్రహ్మహత్య మహాపాపం చుట్టుకొని కుష్టివ్యాధి వచ్చి నానా భాదలు అనుభవిస్తూ కొన్నాళ్ళకు మరణించాడు. వెంటనే యమాదూతలు అతనిని తీసుకొని పోయి రౌరవాది నరక కూపముల పడవేశారు.

           ఆ వైశ్యునికి ఒక కుమారుడు ఉన్నాడు. అతని పేరు ధర్మవీరుడు.  ఆ పేరుకు తగినట్లుగానే తండ్రి సంపాదించిన ధనమును దానధర్మాలు చేస్తూ పుణ్యకార్యాలు ఆచరిస్తూ  మంచి కీర్తి సంపాదించాడు. కొంతకాలానికి త్రిలోకసంచారి అయినా నారదులవారు యమలోకమును దర్శించి భూలోకానికి వచ్చి, దారిలో ధర్మవీరుని ఇంటికి వెళ్లరు. ధర్మవీరుడు నారదులవారికి సాష్టాగానమస్కరం చేసి విష్ణుదేవునిగా భావించి ఆర్ఘ్యపాద్యములు చేత సత్కరించి, చేతులు జోడించి "మహానుభావా! నా పుణ్యము వలన నేడు తమ దర్శనం లభించింది. నేను ధన్యుడను. నా జన్మతరించింది. శక్తీ కొద్దీ నేను చేసే సత్కార్యమును స్వీకరించి తమరు వచ్చిన కార్యమును వివరించండి" అని వేడుకొన్నాడు. నారదులవారు చిరునవ్వు నవ్వి " ధర్మవీరా! నేను నీకొక హితవు చెప్పాలని వచ్చాను.  శ్రీమహావిష్ణువునకు కార్తీక మాసంలో శుద్ధద్వాదశి మహా ప్రీతికరమైన రోజు.  ఆరోజు స్నాన దాన జపాలు చేసిన అత్యంత ఫలితం కలుగుతుంది.  కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సూర్యుడు తులారాశి యందు వుండగా నిష్టగా ఉపవాసం ఉండి సాలగ్రామ దానము చేసిన  పూర్వ జన్మల యందు ఈ జన్మలలో చేసిన పాపములు పోతాయి. నీ తండ్రి యమలోకములో మహా నరకం అనుభవిస్తున్నాడు. నీ తండ్రిని ఉద్ధరించటానికి నువ్వు సాలగ్రామ దానం చేయక తప్పదు.  అలా చేసి నీ తండ్రి రుణం తీర్చుకో" అని చెప్పారు. ధర్మవీరుడు " నారద మునివర్యా!  నేను గోదానము, భూదానము, హిరణ్యదానము  మొదలగు  మహా దానములు చేశాను.  అటువంటి దానాలు చేసినా నా తండ్రికి మోక్షం కలగలేదు కానీ సాలగ్రామ దానం చేసినంత మాత్రాన ఆయనకు ఎలా ఉద్దరించబడతారు" అని సంశయం కలిగింది. నేను ఎందుకు దానం చేయాలి. నేను సాలగ్రామ దానం మాత్రం చేయను అని నిష్కర్షగా మాట్లాడాడు.

                  ధర్మ వీరుని అవివేకానికి విచారించిన నారదులవారు "వైశ్యుడు! సాలగ్రామము శిల అనే ఆలోచిస్తున్నావు. కానీ అది శిలా కాదు. శ్రీహరి యొక్క రూపము.  అన్ని దానాల కంటే సాలగ్రామ దానము చేస్తే గొప్ప ఫలితం దక్కుతుంది.  మీ తండ్రి నరక బాధల నుండి విముక్తి కలిగించడానికి ఈ దానం తప్ప వేరొక మార్గము లేదు అని చెప్పి నారదుల వారు వెళ్ళిపోయారు.

                  ధర్మవీరుడు ధనబలం కలవాడై ఉండీ దాన సామర్థ్యం కలిగి ఉండి కూడా సాలగ్రామ దానం చేయలేదు.  కొంత కాలమునకు అతడు చనిపోయాడు.  నారదుడు చెప్పిన హితబోధను పక్కన పెట్టినందుకు మరణానంతరము అతను మళ్ళి జన్మలో పులియై పుట్టి, ఇంకో మూడు జన్మలు కోతి అయి పుట్టి,  ఐదు జన్మలు ఎద్దులాగా పుట్టి, ప్రతి జన్మలో మానవ స్త్రీగా పుట్టి, ఇంకో పది జన్మలు పందిగా జన్మించి చివరకి పదకొండోవ జన్మలో ఒక  పేద బ్రాహ్మణుడి ఇంట్లో స్త్రీగా పుట్టగా  ఆమెకు యవ్వన కాలం రాగానే ఆ పేద బ్రాహ్మణుడు ఒక విద్వాంసునికి ఇచ్చి పెండ్లి చేశాడు. పెళ్లి అయిన కొంతకాలానికి ఆమె భర్త చనిపోయాడు.

         చిన్నతనమందే ఆమె అష్టకష్టాలు అనుభవిస్తునందుకు తల్లిదండ్రులు బంధువులు మిత్రులు చాలా దుఃఖించారు. తండ్రి ఆమెకు ఎందువలన ఇలాంటి కష్టం కలిగిందో  దివ్యదృష్టితో గ్రహించి వెంటనే ఆమె చేత సాలగ్రామ దానం చేయించి "నాకు  బాల వైధవ్యమునుకు కారణమైన పూర్వజన్మ పాపమూ నశించుగాక "అని చేపించి సాలగ్రామ దానఫలితము ధారపోయించారు. ఆ రోజు కార్తీక సోమవారం అవటం వలన ఆ సాలగ్రామ దాన ఫలితముతో ఆమె భర్త జీవించాడు. తరువాత ఆ దంపతులు చిరకాలము సకల సౌఖ్యములతో జీవించి జన్మతారము స్వర్గమునకు వెళ్లారు. మరికొంత కాలానికి బ్రాహ్మణ స్త్రీ మరొక బ్రాహ్మణుని ఇంట కుమారునిగా పుట్టి నిత్యము సాలగ్రామము దానము చేస్తూ ముక్తినిపొందెను

       కనుక జనకమహారాజా! కార్తీకశుద్ధ ద్వాదశీ రోజునా సాలగ్రామ దానము చేసిన దానిఫలితము చెప్పలేము. ఎంతో గొప్పది. కనుక నువ్వు ఆ సాలగ్రామ దానము చేయి.

భగవద్గీత

అధ్యాయం 3

శ్లోకం 33

సదృశం చేష్టతే  స్వస్యాః ప్రకృతేః జ్ఞానవానపి |

ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహః కిం కరిష్యతి ||

అర్ధం:-

 సమస్త ప్రాణులను తమతమ ప్రకృతులను అనుసరించి (స్వభావమునకు లోబడి) కర్మలు చేస్తుంటాడు.  జ్ఞాని తన స్వభావమును అనుసరించే క్రియలను ఆచరిస్తారు. 

కార్తీక పురాణము 11వ రోజు

మంధరుడు - పురాణమహిమ

11వ అధ్యాయము


 

             ఓ జనక మహారాజా! ఈ కార్తీకమాసమందు విష్ణుమూర్తిని అవిసె పూలతో పూజించిన చాంద్రాయణ వ్రతము చేసినంత ఫలితం దక్కుతుంది.  కృష్ణ పూజ అయిన తర్వాత పురాణపఠనం చేసినా, చేయించినా, విన్నా, వినిపించినా అటువంటివారు తప్పనిసరిగా వైకుంఠమును పొందుతారు.  దీనిని గురించి ఒక ఇతిహాసము ఉన్నది శ్రద్ధగా ఆలకించు అని  వశిష్టుల వారు ఇలా చెప్పసాగారు. 

                పూర్వకాలములో కళింగ దేశమందు ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు.  అతని పేరు మంధరుడు.  అతడు ఇతరుల ఇండ్లలో వంటలు చేస్తూ అక్కడే భుజించేవాడు. మద్యం సేవించుట, దుష్టసాంగత్యం వలన స్నాన జప దీపారాధన ఆచారాలను పాటించడం మానేసి తిరిగేవాడు. అతని భార్య మహాసాధ్వి, గుణవంతురాలు, భర్త ఎంత దుర్మార్గుడైన  విసుగు చెందకుండా సకల ఉపచారాలు  చేసేది. పతివ్రతాధర్మాలను నిర్వర్తించేది. మంధరుడు ఇతరుల ఇళ్లల్లో వంటవాడిగా పని చేసిన ఇల్లు గడవక  చిన్న వర్తకం కూడా చేశాడు.  ఆఖరికి దాని వలన కూడా పోట్టగడవక దొంగతనాలు చేశాడు. దారి కాచి బాటసారులను బాధించి వారి వద్ద ఉన్న ధనమును వస్తువులను దొంగతనం చేసి జీవించేవాడు.  అడవి దారిన వెళ్తున్నా ఒక బ్రాహ్మణుడిని భయపెట్టి ధనమును దొంగతనం చేస్తూ ఉండగా అక్కడికి ఇంకొక కిరాతకుడు  వచ్చి ధనమును అపహరించి ఇద్దరిని చంపి వెళుతుండగా దగరలో దగరలో ఉన్న గుహనుండి సింహము బయటకు వచ్చి కిరాతకునిపై పడింది.  కిరాతకుడు దానినికూడా చంపాడు.  కానీ ఆ పులి కూడా తన పంజాతో కిరాతకుని కొట్టటంవల్ల అతనుకూడా చనిపోయాడు.  ఆ విధముగా ఒకే కాలములో నలుగురు చనిపోయారు.  ఆ నలుగురు కూడా యమలోకంలో అనేక శిక్షలు అనుభవిస్తున్నారు.  

        మంధరుడు చనిపోయిన దగ్గర నుంచి అతని భార్య నిత్యం హరినామస్మరణ చేస్తూ  సదా చారిని భర్తను తెలుసుకునేది చేస్తూ కాలం గడిపేస్తుంది.  కొన్నాళ్ళకు ఆమె ఇంటికి ఒక ఋషి పుంగవులు వచ్చారు.   ఆ ఋషిని గౌరవంగా ఆహ్వానించి అర్ఘపాద్యాదులచే పూజించి "స్వామి! నేను దీనురాలను,  నాకు భర్త గానీ, పిల్లలు గానీ లేరు.  నేను సదా హరినామస్మరణ చేస్తూ జీవిస్తున్నాను.  నాకు మోక్షమార్గము ప్రసాదించండి"  అని ప్రార్థించింది.  ఆమె వినయమునకు, ఆచారానికి ఆఋషి సంతసించి "అమ్మ! ఈ రోజు కార్తీక పౌర్ణమి. చాలా పవిత్రమైన రోజు. ఈ రోజుని వృధాగా పాడు చేసుకోవద్దు.  ఈ రాత్రి దేవాలయములో పురాణము చదువుతారు.  నేను నూనెను తీసుకు వస్తాను.  నీవు ప్రమిదను వత్తిని తీసుకుని రావాలి. దేవాలయంలో ఆ వత్తిని తెచ్చిన ఫలితము నీకు కలుగుతుంది. అని చేపి వెళ్లరు.  అందుకు ఆమె సంతోషించి వెంటనే దేవలయానికి వెళ్లి  శుభ్రం చేసి గోమయంతో అలికి ముగ్గులు పెట్టి తానే స్వయముగా వత్తిని చేసి రెండు వత్తులు వేసి ఋషి తెచ్చిన  నూనె ప్రమిదలలో పోసి దీపారాధన చేసింది.  తరువాత ఇంటికి వెళుతూ తనకు కనిపించిన వారికలా "ఈరోజు రాత్రి ఆలయంలో జాగరణ పురాణకాలక్షేపం జరుగుతుంది రండి" అని చెప్పింది.  ఆమె కూడా రాత్రి అంతా పురాణము విన్నది.  ఆ నాటి నుండి ఆమె విష్ణు చింతనతో కాలం గడుపుతూ కొంతకాలానికి మరణించింది.  ఆమె పుణ్యాత్మురాలు అవటం వలన విష్ణుదూతలు వచ్చి విమానమెక్కించి వైకుంఠమునకు తీసుకొని పోయారు.  కానీ ఆమెకు పాపాత్ముడైన భర్తతో సహవాసం వల్ల కొంచెం దోషం ఉండటం చేత మార్గమధ్యంలో యమలోకానికి   తీసుకొని పోయారు.  అక్కడ నరకములో ఆ ముగ్గురితో బాధపడుతున్న తన భర్తను చూసి "ఓ విష్ణు దూతలారా! నా భర్త ఆ ముగ్గురు నరక బాధలు పడుతున్నారు.  కనుక నాయందు దయ ఉంచి వాడని ఉదహరించండి" అని ప్రాధేయపడింది.  అందుకు విష్ణుదూతలు "అమ్మ! నీ భర్త బ్రాహ్మణుడే ఉండి కూడా స్నాన సంధ్యాదులు మాని పాపాత్ముడు అయ్యాడు.  రెండోవవాడు బ్రాహ్మణుడైన అతను కూడా తన ప్రాణ స్నేహితుడు చంపి ధనం అపహరించాడు.  మూడోవాడు సింహము.  నాలుగో వాడు పూర్వము ద్రావిడ దేశమున బ్రాహ్మణుడై జన్మించిన అనేక అత్యాచారాలు చేసి ద్వాదశి రోజున కూడా తైల లేపనము,  మద్యమాంసం సేవించి  పాపాత్ముడు అయ్యాడు.  అందుకే ఆ నలుగురు నరక బాధలు పడుతున్నారు"  అన్ని వారి చరిత్రలు చెప్పారు. అందుకు ఆమె విచారించి "ఓ  పుణ్యాత్ములారా!  నా భర్తతో పాటు మిగిలిన ముగ్గురిని కూడా ఉద్ధరించండి" అని ప్రార్థించగా,  అందుకు విష్ణుదూతలు "అమ్మ ! కార్తీక పౌర్ణమి రోజు నీవు చేసిన  వచ్చి ఫలితము సింహానికి,  ప్రమిద ఫలితము కిరాతకునికి, పురాణా ఫలితము బ్రాహ్మణులకు ధారపోసిన వారికీ మోక్షం కలుగుతుంది" అని చెప్పారు. ఆమె అలాగే ధారపోసింది. నలుగురు ఆమెతో విమానము ఎక్కి వైకుంఠానికి వెళ్లారు.  కనుక ఓ రాజా!  కార్తీక పురాణం వినటం వలన, దీపం వెలిగించడం వలన ఎటువంటి ఫలితం కలుగుతుంది విన్నావా? అని వశిష్ఠులవారు చెప్పారు. 

భగవద్గీత

అధ్యాయం 3

శ్లోకం 32

యే త్వేతదభ్యసూయంతో నానుతిష్ఠంతి మే మతమ్ |

సర్వజ్ఞానవిమూఢాంస్తాన్ విద్ది నష్టానచేతసః ||

అర్ధం :-

నాయందు దోషారోపణ  చేయుచు, నా ఈ  ఉపదేశమును అనుసరించని మూర్ఖులు సమస్త జ్ఞాన విషయములు ఎందును  మోహితులై భ్రష్టులై,  కష్టనష్టాల పాలవుతారని తెలుసుకో.

కార్తీక పురాణము 10వ రోజు

 అజామీళుని పూర్వజన్మ వృత్తాంతము 

10 అధ్యాయము



                        జనకుడు వశిష్ఠమహర్షిని ఇలా అడిగారు. " మునిశ్రేష్టా!  ఈ అజామిళుడు ఎవరు?  అతని పూర్వజన్మ వృత్తాంతం ఏమిటి?  పూర్వజన్మమున ఎటువంటి పాపములు చేశాడు? విష్ణుదూతలు వైకుంఠమునకు తీసుకువెళ్ళిన తర్వాత ఏమి జరిగింది?  వివరించండి." అని ప్రార్థించాడు. వశిష్ఠులా వారు ఇలా చెప్పసాగారు.  

                 జనకమహారాజా! అజామిళుని విష్ణుదూతలు వైకుంఠమునకు తీసుకుపోయిన తర్వాత యమకింకరులు తమ ప్రభువు యమధర్మరాజు దగ్గరికి వెళ్లి " ప్రభు! తమ ఆజ్ఞ ప్రకారం అజామిళుని తీసుకురావడానికి వెళ్ళాము. అక్కడకు విష్ణుదూతలు వచ్చి మాతో వాదించి అజామీళుని విమాన మెక్కించి వైకుంటమునకు తీసుకొనివెళ్ళారు.  ఇంకా ఏమీ చేయలేక చాలా విచారంగా ఇక్కడికి వచ్చాము"  అని భయకంపితులై విన్నవించుకున్నారు. 

             "ఎంత పని జరిగింది? ఎప్పుడు ఇలా జరగలేదు? దీనికి బలమైన కారణం ఏమైనా ఉందా?"  యమధర్మరాజు దివ్యదృష్టితో అజామీళుని పూర్వ జన్మ వృత్తాంతం తెలుసుకొని " ఓ! ఆదా సంగతి! తన మరణ సమయములో 'నారాయణ' అని వైకుంఠవాసుని నామస్మరణ చేసినందు వలన విష్ణుదూతలు వచ్చి తీసుకుని వెళ్లారు. తెలిసి గాని తెలియక గాని ఎవరు  హరినామస్మరణ చేసిన వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది.  కనుక అజామిళుని వైకుంఠ ప్రాప్తి కలిగింది" అని అనుకొన్నారు. 

                అజామిళుడు పూర్వ జన్మలో మహారాష్ట్ర  దేశమున ఒకానొక శివాలయములో అర్చకునిగా ఉన్నాడు.  అతడు తన  అందము వలన, సిరిసంపదల వలన బలము వలన అహంకారి అయ్యాడు.  శివారాధన చేయక, శివాలయము యొక్క ధనమును అపహరిస్తూ, శివుని విగ్రహం వద్ద ధూపదీపనైవేద్యాలు పెట్టకుండా, చెడు సావాసాలు చేస్తూ విచ్చలవిడిగా తిరుగుతూ ఉండేవాడు. ఇతనికి ఒక బీదబ్రాహ్మణస్త్రీతో రహస్య సంబంధం ఉండేది. ఆమె కూడా అందమైనది అవటం వలన  చేసేదిలేక ఆమె భర్తగా కూడా చూసి చూడనట్టు ఉండేవాడు.  అతను బిక్షాటనకై ఊరూరా తిరుగుతూ ఎదోఒకవేళ ఇంటికి తిరిగి వచ్చేవాడు.  ఒకనాడు పొరుగూరికి వెళ్లి యాచనచేసి పెద్దమూటతో బియ్యము, కూరగాయలు నెత్తిన పెట్టుకొని వచ్చి అలసిపోయి ఇంటికి వస్తూనే భార్యతో "  నాకు ఈ రోజు ఆకలి ఎక్కువగా ఉంది. త్వరగా వంట చేసి పెట్టు" అని అన్నాడు.   అందుకు ఆమె చీదరించుకొని కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు కూడా ఇవ్వకుండా అతని వంక కన్నెత్తి అయినా చూడకుండా అజామీళునిపై ప్రేమాతో భర్తని తిట్టడంతో భర్తకు కోపం వచ్చి మూలనున్న కర్రతో కొట్టాడు. అందుకు ఆమె భర్త దగ్గర ఉన్న కర్రను లాకొని భర్తను రెండింతలు కోట్టి బయటకు తోసి తలుపు వేసింది. అతను చేసేది లేక భార్యపై విసుగు చెంది ఇంటి ముఖము చూడకూడదని దేశాటనకు వెళ్ళిపోయాడు. భర్త ఇంటినుండి వెళిపోయాడు అని సంతోషించి, ఆమె ఆ రాత్రి బాగా ముస్తాబు అయి వీధి అరుగుమీద కూర్చొని ఉండగా ఒక చాకలి వాడు ఆ దారిన వెళుతున్నాడు. అతనిని పిలిచి "ఓయి! నివు ఈ రాత్రికి నాతో ఉంటావా" అని కోరింది. అందుకు ఆ చాకలి "తల్లి! నీవు బ్రాహ్మణస్త్రీవి. నేను చాకలి వాడిని మీరు నన్ను ఇలా పిలవటం మంచిదికాదు. నేను ఇటువంటి పాపమూ చేయ్యను" అని బుద్ధిచెపి వెళిపోయాడు. ఆమె ఆ చాకలివాని అమాయకత్వానికి లోలోపల నవ్వుకొని అక్కడినుంది బయలుదేరి అజామీళుని దగ్గరకు రాత్రిఅంతా అతనివద్ద గడిపి ఉదయం ఇంటికివచ్చి "అయ్యో!నేను ఎంతపని చేశాను?ఎంతటి పాపమూ చేశాను? అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకొని భర్తను ఇంటినుండి వెళ్లగొట్టి క్షణికమైన ఆవేశానికి లోనయి. మహా అపరాధము చేశాను" అని పశ్చాత్తాపము చెందింది. ఒక కూలి వాడిని పిలిపించి కొంత ధనము ఇచ్చి తన భర్తను వెతికి తీసుకురావలసిందిగా పంపింది. కొన్ని రోజులు గడిచిన తరువాత భర్త ఇంటికి రాగానే అతని పాదాలపై పడి తన తప్పులు క్షమించమని వేసుకొంది. అప్పటినుండి ఆమె మంచి నడవడికతో భర్త అనురాగానికి పాత్రురాలి అయింది. కొంత కాలానికి అజామీళునికి వ్యాధి సంక్రమించి రోజురోజుకి క్షిణించి మరణించాడు. అతడు అనేక నరక భాధలు అనుభవించి పొంది మళ్ళి నరజన్మ ఎత్తి సత్యవ్రతుడు అని బ్రాహ్మణుడికి కుమారుడై కార్తీకమాసంలో నదీస్నానము చేసి దేవతదర్శనం చేసి ఉండటంవలన నేడు జన్మముల పాపమూ నశించటంవలన అజామీళుడై పుట్టాడు. ఇపుడు తన మరణసమయంలో 'నారాయణ' అని శ్రీహరి నామస్మరణా వలన వైకుంఠమునకు వెళ్ళాడు.

         బ్యాహ్మణుని భార్య కూడా రోగగ్రస్తురాలై చనిపోయేది. నరకములో అనేక నరకభాదలు అనుభవించి ఒక మలవాని ఇంట జన్మించింది. ఆ మలవాడు ఆ పిల్లను జన్మరాశి చూపించగా తండ్రిగండమున పుటింది అని జ్యోతిష్కుడు చెప్పాడు.  ఆ మాలవాడు ఆ పిల్లని తీసుకెళ్లి అడవిలో వదిలిపెట్టాడు. అంతలో ఒక విప్రుడు ఆ దారిన పోతున్నప్పుడు పిల్ల ఏడుపు విని జాలి కలిగి తీసుకొని పోయి తన ఇంటి పనివాళ్ళకి ఇచ్చి పోషించాని చెప్పాడు. ఆ బాలిక అజామీళుని ప్రేమించింది. ఇదివారి పూర్వజన్మ వృత్తాంతం.

             నిర్మలమైన మనసుతో శ్రీహరిని ధ్యానించటం, దానధర్మాలు చేయడం, శ్రీహరి కథలను వినడం, కార్తీక స్నానం ప్రభావము వలన ఎంతటి వారైనా మోక్షం పొందగలరు. కావున కార్తీకమాసంలో వ్రతములు, పురాణ శ్రవణం చేసిన వారికి ఇహపరసుఖమును పొందగలరు.

భగవద్గీత

అధ్యాయం 3

శ్లోకం 31

యే మే మతమిదం నిత్యమ్ అనుతిష్ఠంతి మానవః |

శ్రద్దావంతో నసూయంతో ముచ్యంయే తే పి కర్మభిః ||

అర్ధం :-

దోషదృష్టి లేకుండా శ్రధ్ధాయుక్తులై నా ఈ మతమును అనుసరించు మానవులు గూడ సమస్త కర్మబంధముల నుండి ముక్తులయ్యెదరు. 

కార్తీక పురాణము 9వ రోజు

విష్ణు దూతలు, యమదూతల వివాదం

9వ అధ్యాయము



           "ఓ యమదూతలారా! మేము విష్ణుదూతలము. వైకుంఠము నుండి వచ్చాము. మీ ప్రభువైన యమధర్మ రాజు ఎటువంటి పాపాత్ములను పాపాత్ములను తీసుకొని రమ్మని మిమ్మలిని పంపారు" అని ప్రశ్నించారు. అందుకు జవాబుగా యమదూతలు "ఓ విష్ణుదూతలారా! మానవుడు చేసే పాపపుణ్యాలను సూర్యుడు, చంద్రుడు, భూదేవి, ఆకాశము, ధనంజయాది వాయువులు, రాత్రి, పగలు, సంధ్యాకాలము సాక్షులుగా ఉండి ప్రతి రోజు మాప్రభువు దగరకు వచ్చి చెపుతుంటారు. మా ప్రభువులు వారి కార్యకలాపాలను చిత్రగుప్తునికి చూపించి ఆ మానవుని మరణసమయంలోమమ్మలిని పంపి రప్పిస్తారు. పాపాత్ములు ఇటువంటి వారో వినండి. 

             వేదోక్త సదాచారములు విడిచి వేదశాస్త్రములను నిందించే వారు, పరస్త్రీలను కామించేవారు, పరాన్నభుక్కులు, తల్లితండ్రులను, గురువులను, బంధువులను, కులవృత్తిని, తిట్టి హింసించేవారిని, జీవహింస చేసేవారు, దొంగపధ్ధులతో వడ్డీలు పెంచి ప్రజలను పీడించేవారు, శిశుహత్య చేసేవారు, శరణమన్నవారినికూడా వదలకుండా బాధపెటేవారు, చేసినమేలు మరచేవారు, వివాహశుభకార్యాలు జరగనివ్వకుండా అడ్డుతగిలేవారు పాపాత్ములు. వారు మరణించగానే  తన వద్దకు తీసుకు వచ్చి నరకములో పడవేసి దండించమని  యమధర్మరాజు గారి ఆజ్ఞ.

            ఈ  అజామిళుడు బ్రాహ్మణుడై పుట్టి దురాచారాలకులోనే  కులభ్రష్టుడై  జీవహింసచేసి కామాంధుడై వావివరుసలు మరచి  సంచరించిన పాపాత్ముడు.  వీనిని విష్ణులోకానికి  ఎలా తీసుకువెళతారు. అని యమదూతలు అడిగారు.  విష్ణుదూతలు ఇలా సమాధానమిచ్చారు "ఓ  యమదూతలారా!  మీరు ఎంత అవివేకులు.  మీకు ధర్మసూక్ష్మాలు తెలియవు. ధర్మ సూక్ష్మములు అంటే ఏమిటో చెబుతాను వినండి. సజ్జన సహవాసం చేసే వారు జపదానధర్మాలు చేసేవారు. అన్న దానము, కన్యాదానము, సాలగ్రామదానము చేసేవారు.   అనాధ శవాలకు దహనసంస్కారాలు చేసేవారు.  తులసి వనము పెంచేవారు. చెరువులను తవ్వించేరు.  శివకేశవులను పూజించేవారు. సదా హరినామస్మరణ చేసేవారు. మరణసమయంలో 'నారాయణ' అని శ్రీహరిని గాని 'శివ' అని శివుని గాని స్మరించేవారు.  తెలిసి గాని తెలియక గాని హరినామస్మరణ చెప్పిన వినిన వారు పుణ్యాత్ములు. కాబట్టి అజామిళుడు ఎంతటి పాపాత్ముడైన మరణ సమయంలో 'నారాయణ' అని స్మరిస్తూ మరణించాడు కాబట్టి మేము వైకుంఠమునకు తీసుకొని పోతాము"  అని పలికారు.

       అజామిళుడు  విష్ణుదూతలు, యమదూతల సంభాషణ విని ఆశ్చర్యంపొంది " విష్ణుదూతలారా! పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు శ్రీమన్నారాయణ పూజ గాని వ్రతము గాని ధర్మములు గాని చేయలేదు. నవమాసాలు మోసి కనిపెంచిన తల్లిదండ్రులకు ఎప్పుడూ నమస్కారం చేయలేదు. వర్ణ  ఆశ్రమాలు విడిచి కులభ్రష్టుడిని అయ్యాను.  నీచకుల కాంతలతో సంసారం చేశాను.  నా పుత్రుని ఎందున్న ప్రేమించే 'నారాయణ' అన్నంత మాత్రాన నన్ను ఘోర నరక బాధల నుండి రక్షించి వైకుంఠమునకు తీసుకుపోతున్నారు.  నేను ఎంత అదృష్టవంతుడిని నా పూర్వజన్మసుకృతం! నా తల్లిదండ్రుల పుణ్యఫలము నన్ను రక్షించింది"  అని చెప్పి సంతోషంగా విమానమెక్కి వైకుంఠమునకు వెళ్లెను.

          జనకమహారాజా! తెలిసి గాని తెలియక గాని నిప్పు తగిలిన  దహిస్తుందో అలాగే శ్రీ హరి నామస్మరణ చేసిన సకల పాపములు నశించి మోక్షము కలుగుతుంది ఇది ముమ్మాటికి నిజం.

          ఇంకావుంది.......................... 

భగవద్గీత

శ్లోకం 30

మయి సర్వాణి కర్మాణి సన్న్యస్యాధ్యాత్మచేతసా|

నిరాశీర్నిర్మమొ భుత్వా యుధ్యస్వ విగతజ్వరః ||

అర్ధం :-

అంతర్యామిని, పరమాత్మను ఐన నాయందే నీ చిత్తము ఉంచి, కర్మలనన్నింటినీ నాకే అర్పించి, ఆశ మమతా సంతాపములను వీడి, యుద్ధము చేయుము. 

కార్తీక పురాణము 8వ రోజు

శ్రీహరినామస్మరణ సర్వఫలప్రదము

8వ అధ్యాయము



వసిష్ఠుడు చేపినదంతా విని "మహానుభావా! తమరు చెప్పిన ధర్మములన్నింటినీ శ్రద్ధగా విన్నాను.  అందు ధర్మము బహు సూక్ష్మమైనది అని పుణ్యము సులభంగా కలుగుతుంది అని, అది నాదీ స్నానము, దీపదానము, ఫలదానము, అన్నదానము, వస్త్రధానము వలన కలుగుతుంది అని చెప్పారు. ఇటువంటి స్వల్పధర్మాల వల్లనే మోక్షం కలిగితే వేదముల పఠనము, యజ్ఞయాగాదులు చేసినగాని పాపములు పోవని మీవంటి మునిశ్రేష్టులే చెప్పుతున్నారు కదా! మరి తమరు ఇది సూక్ష్మములో మోక్షముగా కనబరచినందులకు నాకు ఆశ్చర్యము కలుగుతుంది. దుర్మార్గులు కొందరు సదాచారములు పాటించక, వర్ణసంకరులై రౌరవాది నరకహేతువులగు మహాపాపములను చేయువారు ఇంత తేలికగా మోక్షం పొందుట వజ్రపు కొండను గోటితో పెకలించుట వంటిది.  కావున దీని మర్మమును విడమర్చి చెప్పండి అని ప్రార్ధిస్తున్నాను.

            అప్పుడు విశిష్టులవారు చిరునవ్వు నవ్వి "ఓ జనకమహారాజా! నీవు వేసిన ప్రశ్న సహేతుకమైనదే, నేను వేదవేదాంగాలు కూడా పటించాను.వాటిలో కూడా సూక్ష్మమార్గాలున్నాయి. అవి ఏమిటంటే సాత్త్విక, రాజస,తామసములు అను మూడు రకాలధర్మాలు ఉన్నాయి.

          సాత్త్వికం అనగా దేశకాల పరిస్థితులు మూడు సమకూడిన సమయమున సత్త్వక గుణము జన్మించి ఫలితమంతా పరమేశ్వరార్పణం అనుకోని మనోవాక్కాయ కర్మలచే ఆచరించే ధర్మము.  ఈ ధర్మము అత్యంత ప్రాముఖ్యము కలిగినది. సాత్త్విక ధర్మము సమస్త పాపములను నశించేలాచేసి మానవులను పవిత్రులను చేసి దేవలోక, భూలోక సుఖములు చేకూరుస్తుంది. ఉదాహరణకు తామ్రపర్ణానది సముద్రములో కలినటే, స్వాతికార్తెలో ముత్యపు చిప్పలో చిప్పలో వర్షబిందువు పడి ధగధగ మెరిసి, ముత్యముగా మరీనా విధముగా సాత్వికత విహించి సాత్త్వికధర్మం ఆచరిస్తే గంగ, యమునా, గోదావరి, కృష్ణ నదులు పుష్కరాలు మొదలగు పుణ్యకాలముల యందు దేవాలయములయందు వేదములు పఠించి, సదాచారుడై, కుటుంబికుడైన బ్రాహ్మణునకు యంత స్వల్పదానము చేసిన, లేక ఆ నదీతీరాలలోని దేవాలయాలలో జపము, తపస్సు చేసిన విశేషఫలితము పొందుతారు. 

             రాజస ధర్మము అనగా ఫలాపేక్ష కలిగి శాస్త్రోక్తవిధులను విడిచి చేసిన ధర్మము. ఈ ధర్మము పునర్జన్మానికి కారణమై కష్టసుఖాలను కలిగిస్తుంది.

            తామస ధర్మము అనగా  శాస్త్రపరంగా విధులను విడిచి డాంబికాచరణార్ధము చేయు ధర్మము. ఆ ధర్మము ఫలితము ఇవ్వదు. 

         దేశకాల పరిస్థితులు సమకూడినపుడు తెలిసి కానీ తెలియక కానీ ఏ స్వల్పధర్మమును చేసిన గొప్ప ఫలితము వస్తుంది.  అనగా పెద్ద కట్టెల గుట్ట చిన్న అగ్నికణములతో భస్మమగునట్లు శ్రీమన్నారాయణుని నామము, తెలిసికాని, తెలియకగాని స్మరించిన వారి సకల పాపములు పోయి ముక్తిని పొందుతారు. దానికి ఒక ఇతిహాసము ఉంది విను మహారాజ. 

 అజామీళుని కథ 

           పూర్వకాలమున కన్యాకుబ్జమను నగరములో నాలుగువేదాలు చదివిన ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. అతని పేరు సత్యవ్రతుడు.  అతనికి సకల సద్గుణరాశియగు హేమావతి అను భార్య కలదు. వారు అన్యోన్యదాంపతులు. వారికీ చాలాకాలానికి ఒక కుమారుడు జన్మించాడు. అతని పేరు అజామిళుడు. అతనిని వారు అతిగారాబముగా పెంచారు. ఆ బాలుడు పెరుగుతున్న కొద్దీ  అతిగారాబము వలన పెద్దలను కూడా కూడా నిర్లక్షంగా చూస్తూ, దుష్టసహవాసము వలన విద్యను అభ్యాసము చేయకుండా,బ్రాహ్మణధర్మాలు పాటించకుండా సంచరింస్తునాడు. కొంతకాలానికి యవ్వనంలోకి అడుగుపెట్టగానే కామాంధుడై వావివరసలు మరచి తిరుగుతూ మద్యమాంసాలు సేవిస్తూ ఉండెను. ఒక ఎరుకలజాతికి చెందిన స్త్రీని వివాహము చేసుకొని ఆమె ఇంటివద్దనే ఉంటూ తల్లితండ్రులను పాటించుకోకుండా ఉన్నాడు.  పిల్లలను అతిగారాబముగా పెంచటం వలన కలిగిన ఫలితము చూసావా రాజా! పిల్లలమీద ఎంత ప్రేమ ఉన్న వారిని అదుపుఆజ్ఞలలో పెంచాకపోతే ఇలాంటి పరిణామాలే వస్తాయి. అజామిళుడు కులభ్రష్టుడు అయి, Kఅతని బంధువులు విడిచిపెట్టారు. అందుకు అజామిళుడు రెచ్చిపోయి వేటవలన పక్షులు, జంతువులను చంపి, వాటిని తిని కిరాతక వృత్తిలో జీవిస్తున్నాడు. ఒక రోజు ఆ ఇద్దరు వేటకు వెల్లారు. ఆ స్త్రీ తేనె పటునుండి తేనె తీయటానికి చెట్టుకొమ్మ ఎక్కి కొమ్మ విరిగి కింద పడి చనిపోయింది. అజామిళుడు ఆ స్త్రీపై పడి కొంతసేపు ఏడ్చి ఆమెను ఆ అడవిలోనే దహనం చేసి ఇంటికి వచ్చాడు. వారికీ ఒక కూతురు ఉన్నది. కొంతకాలానికి ఆ బాలికకు యుక్తవయస్సు రాగానే వావివరుసలు మరచి అజామిళుడు ఆమెను వివాహం చేసుకున్నాడు. వారికీ ఇద్దరు మొగపిల్లలు పుట్టి చనిపోయారు. కొంతకాలానికి వారికీ ఒక కుమారుడు జన్మించాడు. అతనికి నారాయణ అని పేరు పెట్టి అతి గారాబముగా పెంచుతున్నాడు. అతనిని క్షణం అయినా విడిచి పెట్టకుండా 'నారాయణ నారాయణ' అని అతని వెంట తిరిగేవాడు. కొంతా కాలానికి అజామిళుడు శరీరపటుత్వం తగ్గి రోగం వచ్చి మంచాన పాడాడు. మరణించు సమయంలో భయంకర ఆకారములో యమభటులు కనిపించగానే అజామిళుడు భయంతో కుమారుడిపై ప్రేమతో 'నారాయణ నారాయణ' అంటూ ప్రాణము విడిచాడు. నారాయణ అను శబ్దం వినగానే యమభటులు గజగజ వినికిపోయారు. అదేవేలకు వేలకు దివ్యమంగళ కారులు, శంఖ చక్ర గదాధారులు అయినా శ్రీమన్నారాయుని దూతలు విమానంలో అక్కడికి వచ్చి  "ఓ యమభటులరా! వీడు మావాడు. మేము వీనిని వైకుంఠమునకు తీసుకువెళతాము" అని చేపి అజామీళుడిని విమానం ఏక్కించి తీసుకొని వెళుతుండగా యమదూతలు "అయ్యా!తమరు ఏవరు? వీడు అతి దుర్మార్గుడు. వీడిని నరకమునకు తీసుకొని పోవుటకు మేము ఇక్కడికి వచ్చాము. అతనిని మాకు అప్పగించండి" అని కోరగా విష్ణుదూతలు ఇలా చెప్పసాగారు.......... 

         ఇంకాఉంది................... 

భగవద్గీత

అధ్యాయం 3

శ్లోకం 29

ప్రకృతేర్గుణసమ్ముఢాః  సజ్జంతే గుణకర్మసు |

తానకృత్స్నవిదో మందాన్ కృత్స్నవిన్న విచలయేత్ ||

అర్ధం :-

ప్రకృతిగుణములచే పూర్తిగా మోహితులైనా  మనుషులు ఆ గుణములు యందును,  కర్మలయందు మిక్కిలి  ఆసక్తులు అవుతారు. అట్టి మిడిమిడి జ్ఞానంగల  మందబుద్ధిలైన అజ్ఞానులను పూర్తిగా తెలిసిన జ్ఞాని అయినవాడు భ్రమకు గురిచేయరాదు.

కార్తీక పురాణము 7వ రోజు

శివ కేశవార్చనా విధులు

7వ అధ్యాయము



           మహారాజ! కార్తీక మాసము గురించి, దాని మహత్యం గురించి ఎంత చేపిన తనివితీరదు. ఈ మాసములో శ్రీమహావిష్ణువును సహస్రకమలములతో గాని తులసీదళములతో గాని  పూజించిన వారి ఇంట లక్ష్మీదేవి స్థిరముగా ఉంటుంది. శివునికి బిల్వపత్రములతో సహస్రనామపూజ చేసిన వారికీ జన్మరాహిత్యం కలుగుతుంది.  కార్తీక మాసములో ఉసిరి చెట్టు కింద సాలగ్రామమును ఉంచి భక్తితో పూజించిన వారికీ మోక్షం కలుగుతుంది. అలాగే బ్రాహ్మణులకు కూడా ఉసిరిచెట్టు క్రింద భోజనము పెట్టి తరువాత వాళ్ళు తిన సర్వ పాపాలు పోతాయి. కార్తక మాసములో కార్తీకస్నానాలు, వ్రతాలు, దీపారాధనలు చేయలేని వారు ఉదయం, సాయంత్రం, దేవాలయానికి వెళ్లి స్వామిని దర్శనం చేసుకోవాలి.  సంపనులు శివకేశవుల ఆలయాలకు వెళ్లి భక్తితో దేవతార్చన, యజ్ఞయాగాదులు, దానధర్మాలు, చేసిన వారికీ అశ్వమేధయాగము చేసిన ఫలితము కలుగుతుంది. వారి పితృదేవతలకు కూడా వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. శివాలయమునగాని, విష్ణువాలయమునగాని, జండా ప్రతిష్టుస్తే యమకింకరులు దగరకు కూడా రాలేరు. ఈ కార్తీక మాసములో తులసికోట వద్ద ఆవు పేడతో అలికి శంఖుచక్రాలు ఆకారాలు వేసి నువ్వులు ధాన్యము పోసి వాటి పైన ప్రమిద ఉంచి అందులో నువ్వులనూనె పోసి, వత్తిని వెలిగించలి. ఈ దీపాలు రాత్రి అంత ఆరకుండా చూడాలి. దీనినే నందా దీపము అంటారు. ఈ విధముగా చేసి నైవేద్యం పెట్టి కార్తీక పురాణము చదివితే హరిహరాదులు సంతసించి కైవల్యం ప్రసాదిస్తారు. కార్తీక మాసములో శివునికి జిల్లేడు పూవులతో అర్చించిన ఆయుష్షు వృద్ధి కలుగుతుంది. సాలగ్రామమునకు ప్రాతినిత్యం గంధము పటించి తులసితలములతో పూజించాలి. కార్తీక మాసములో నెలరోజులు పూజచేయలేనివారు ఒక సోమవారమైన చేసి శివకేశవులను పూజించిన మాసా ఫలితము కలుగుతుంది. కనుక జనకమహారాజా! నీవుకూడా యి వ్రతము ఆచరించి తరించు అని వసిష్ఠుడు జనకమహారాజుకు చెప్పారు. 

భగవద్గీత

అధ్యాయం 3

శ్లోకం 28

తత్వవేత్తు మహాబాహో గుణకర్మ విభాగయోః |

గుణా గుణేషు వర్తంత ఇతి మత్వా న సజ్జతే ||

అర్ధం :-

ఓ  అర్జునా! గుణవిభాగతత్వమును,  కర్మవిభాగతత్వమును  తెలుసుకొన్న జ్ఞానయోగి  గుణములే గుణములయందు ప్రవర్తిల్లుచున్నవని భావించి వాటి యందు ఆసక్తుడు కాడు. 

కార్తీక పురాణము 6వ రోజు

దీపధానవీధి మహత్యం 

6వ అధ్యాయము



ఓ మహారాజ! ఏ మానవుడు కార్తీకమాసము నెలరోజులు పరామేశ్వరుని, శ్రీ మహా విష్ణువును, పంచామృతస్నానము చేయించి కస్తూరి తిలకము కలిపినా మంచి గంధము గంధము నీటితో భక్తిగా పూజ చేసిన అట్టివానికి ఆశ్వమేధయాగము చేసిన ఫలితము వస్తుంది. అలాగే ఏ మానవుడు కార్తీక మాసమంతయు దేవాలయములో దీపారాధన చేసారో వారికీ కైవల్యము ప్రాప్తిస్తుంది. దీపదానము చేయుటం ఎలాగంటే పైడిప్రతి తానే స్వయముగా తీసి శుభ్రం చేసి, వత్తులను చేయవలెను. వరిపిండితో గాని, గోధుమపిండితోగాని ప్రమిదవలె చేసి వత్తులు వేసి, ఆవునేయి నిండుగాపోసి దీపమును వెలిగించి బ్రాహ్మణునికి దానము ఇవ్వాలి.శక్తికొద్దీ దక్షిణ కూడా ఇవ్వాలి. ఇదే విధముగా కార్తీక మాసములో ప్రతి రోజు చేసి ఆఖరి రోజునా వెండితో ప్రమిదను చేయించి బంగారముతో వత్తిని చేయించి ఆవునేయి పోసి  గోధుమపిండి ప్రమిదలో దీపమును వెలిగించి ప్రతిరోజు ఇస్తున్న బ్రహ్మణుడికే దానము ఇవ్వాలి. ఇలా చేసిన వారికీ సకలైశ్వర్యాలు కలుగటమే కాకుండా మోక్షప్రాప్తి కలుగుతుంది. ఈ విధముగా దీపదానము చేసిన తరువాత బ్రాహ్మణా సమారాధన చేయాలి. శక్తీ లేనివారు కనీసం పది పది మంది బ్రాహ్మణులకైనా భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలు ఇవ్వాలి. దీనికి ఒక కథ ఉంది చెపుతాను విను జనకమహారాజా.  అని వశిష్ఠుడు చెప్పసాగాడు. 

         లోభియైన వితంతువుకు మోక్షం కలుగుట 

పూర్వం ద్రవిడ దేశమున ఒక గ్రామములో ఒక స్త్రీ ఉన్నది. ఆమెకు పెళ్లి అయినా కొంతకాలానికే భర్త చనిపోయాడు. సంతానంగాని, ఆఖరికి బంధువులుగాని లేరు. అందుకే ఆమె ఇతరుల ఇంట్లో పని చేసుకొని భ్రాతుకుతుంది. అక్కడే భోజనంచేస్తూ వారు సంతోషముతో ఏమయినా వస్తువులు ఇస్తే వాటిని ఎక్కువధరకు అమ్ముకొని ఆ విధముగా తన వద్ద ఉన్న సొమ్మును వడ్డీలకు ఇచ్చి మరింత డబ్బును కూడబెట్టుకొని, దొంగలుతెచ్చిన బంగారు ఆభరణములు తక్కువధరకు తీసుకొని వాటిని ఎక్కువ ధరకు అమ్ముకొనేది. 

       ఈ విధిగా కూడబెట్టిన ధనమును తను తినక ఇతరులకి పెట్టక దానధర్మాలు చేయక లోభంబుద్ధితో ఉండటమే కాకుండా పూజలుచేసేవారిని, తీర్ధయాత్రలు చేసేవారిని చూసి అవహేళన చేసేది. 

         కొంతకాలము తరువాత ఆ గ్రామమునకు ఓక బ్రాహ్మణుడు వచ్చాడు. అక్కడే ఒక సత్రములో బస చేసారు. ఆ బ్రాహ్మణుడు గ్రామములో మంచిచెడులు తెలుసుకొని ఆ స్త్రీ గురించికూడా తెలుసుకొని ఆమెవద్దకు వెళ్లి "అమ్మ! నేను చెప్పే హితవచనములు విను నీకు కోపం వచ్చిన సరే నేను చెప్పే మాటలు విను అమ్మ. మన శరీరము శాశ్వతము కాదు.నీటి బుడగ వంటిది.  ఏక్షణము మృత్యువు మనలను తీసుకొని పోతుందో చెప్పలేరు.పంచభూతాలు, సప్తధాతువులు నిర్మిచబడిన ఈ శరీరములోని ప్రాణము, జీవము పోగానే చర్మము, మాంసము కుళ్ళి దుర్వాసన వస్తుంది. అసహ్యముగా తయారవుతాయి. అటువంటి ఈ శరీరాన్ని శాశ్వతమని భ్రమపడుతున్నావు. ఇప్పటికైనా నా మాట విని నీవు తినక ఇతరులకి పెట్టక అన్యాయముగా సంపాదించినా సంపదను కార్తీక మాసములో పేదలకు దానధర్మాలు చేసి ప్రతిరోజూ దేవాలయములో గోధుమపిండితోగాని బియ్యంపిండితో గాని ప్రమిద చేసి అందులో ఆవునేయి వేసి దీపము వెలిగించి బ్రాహ్మణుడికి దానముఇవ్వు. ఇలా నెల అంతాచేసి ఆఖరున వెండి ప్రమిదలో బంగారు వత్తి వేసి అదే బ్రాహ్మణుడికి దానము చేయి అమ్మ.  తరువాత బ్రాహ్మణ సమారాధన చేయాలి ఇట్లా ప్రతి సంవత్సరము చేయి నీవు చేసిన పాపములు పోయి సకలైశ్వర్యములు నీ మరణము తరువాత కైవల్య ప్రాప్తి కలుగుతుంది. అంతా విన ఆ స్త్రీకి జ్ఞానోదయము అయి మీరుచెపినటే చేస్తాను స్వామి అని నమస్కరించింది. ఆ బ్రాహ్మణుడు ఆ స్త్రీని ఆశీర్వదించి వెళిపోయాడు. అప్పటి నుంచి ఆ స్త్రీ తన లోభబుద్ధిని విడి ఆ బ్రాహ్మణుడు చేపినతే చేసింది. చివరికి ఆమె మరణానంతరం మోక్షం పొంది శైవల్యం పొందింది. 




భగవద్గీత

అధ్యాయం 3

శ్లోకం 27

ప్రకృతేః  క్రియమాణాని గుణైః కర్మాణి  సర్వశః|

 తెలుసుకున్న జ్ఞాన యోగి కర్తా హమితి మవ్యతే || 

అర్థం:-

వాస్తవానికి కర్మలన్నీ అన్నివిధాల ప్రకృతి గుణముల ద్వారానే  చేయబడును.  అహంకారం వలన మహితమైన అంతఃకరణంగల అజ్ఞాని ' ఈ కర్మలకు నేనే కర్తను' అని భావిస్తాడు.

కార్తీక పురాణము 5వ రోజు

వనభోజన మహిమ 

5వ అధ్యాయము 

         జనక మహారాజ! కార్తీకమాసములో  పెద్ద ఉసిరికాయలతో నిండిఉన్న ఉసిరి చెట్టు కింద సాలగ్రామమును పూజించి, విష్ణుమూర్తిని ధ్యానించి, శ్రీమధ్భగవద్గితా పారాయణము చేయాలి.  అందులో ఒక శ్లోకం అయినా కంఠస్తం చేసిన విష్ణుసాన్నిధ్యం పొందుతారు. ఉసిరి చెట్టునీడనే బ్రాహ్మణులకు భోజనం పెట్టి వారికీ దక్షిణతాంబులాలతో సత్కరించి నమస్కరించవలెను.  తరువాత ఉసిరి చెట్టునీడలో అందరు భోజనము చేయాలి.  

         వేలునిబట్టి ఉసిరిచెట్టుకింద పురాణ పారాయణము చేయాలి. ఈ విధముగా పురాణము విన ప్రమాణపుత్రునకు మూషిక జన్మము నుంచి విముక్తి లభించినది. అది విన జనకమహారాజు "మునివర్యా! ఈ బ్రాహ్మణ యువకుడిని మూషిక జన్మము ఎలావచ్చింది. దానికి కారణం ఏమిటి? అని అడిగారు. వశిష్ఠులవారు ఈ విధిముగా చెప్పసాగారు.

కిరాతగాకుడు, మూషికములు జ్ఞానము కలుగుట 

         రాజా! కావేరి నది తీరామున చిన్న గ్రామములో దేశశర్మయను బ్రాహ్మణుడు ఉన్నాడు. అతనికి ఒక కుమారుడు ఉన్నాడు. అతని పేరు శివశర్మ. శివశర్మ చిన్న తనము తనము నుంచి భయభక్తులు లేక అతిగారాబముగా పెరుగుటవలన చెడు సావాసములు సావాసములు చేసి దురాచారపరుడైనాడు. అతని ప్రవర్తన చూసి అతని తండ్రి చాల బాధపడేవాడు. ఒకరోజు తండ్రి తన కొడుకుని పిలిచి "శివశర్మ!నీప్రవర్తన అసలుబాగోలేదు. నీగురించి అందరూ నన్ను నిలదీస్తున్నారు. అందుకే నీవు కార్తీక మాసములో నది స్నానము చేసి శివకేశవులను ఆరాధించు సాయంకాల సమయంలో దేవాలయంలో దీపారాధన చేస్తే, నీవు చేసినపాపములు పోయి నీకు మోక్షప్రాప్తి కలుగుతుంది" నేను చేపినటు చేయి అని చెప్పారు. దానికి అతని కుమారుడు "నాన్న! స్నానము చేయుట చేయుట వలన ఒంటి మురికి మాత్రమే పోతుంది.స్నానము చేసి పూజలుచేసినంత మాత్రము చేత భగవంతుడు కనిపిస్తాడా! దేవాలయములో దీపాలు వెలిగిస్తే లాభం ఏమి ఉంటుంది వాటిని ఇంటిలో వెలిగిస్తే మంచిదికాద" అన్నాడు. కుమారుడిని సమాధానం విని అతని తండ్రి "ఓరి మందబుద్ధి! కార్తీక మాసా ఫలితమును చులకనగా చుస్తున్నావుకదా, నీవు అడవిలో రావిచెట్టు తొర్రలో ఎలుకవై బ్రతుకుతావు" అన్ని శపించాడు. ఆ శాపముతో కుమారుడికి జ్ఞానోదయం అయి "నాన్న! నన్ను క్షమించు. దైవాన్ని దైవకార్యములను చులకన చేశాను. ఇప్పుడు నాకు పశ్చాత్తాపము పశ్చాత్తాపము కలిగినది. నామీద దయవుంచి నాకు శాపవిమోచనం ఎపుడు కలుగుతుందో చెప్పండి" అన్ని ప్రాధేయపడదు. అందుకు అతని తండ్రి "శివశర్మ! నా శాపము అనుభవించుచు ఎలుకగా ఉండగా నీవు ఎపుడు ఎప్పుడు అయితే కార్తీక మాస మహత్యం వింటావో అపుడు నీకు శాపవిమోచనం కలుగుతుంది. వెంటనే శివశర్మ ఎలుక రూపము ధరించి కావేరినది తీరమున అడవిలో రావిచెట్టు తీరంలో నివసిస్తున్నాడు. 

       కొంత కాలానికి కావేరినది తీరమున విశ్వమిత్ర మహర్షి తన శిష్యసమేతంగా అక్కడికి వచ్చారు. మూషికమున్న వృక్షం దగరకు వచ్చి ఆగారు. అక్కడ ఒక కిరాతకుడు వీరి దగర ఏమైనా ఉంటె దోగిలించాలి అన్ని ఆ చెట్టు దగరకు వచ్చి వారి తేజస్సుని చూసి ఆ కిరాతకుని మనస్సు మారి వారి దగరకు వెళ్లి "స్వామి తమరు ఎవరు మిమ్మలిని చూసినంత మాత్రమే నా మనస్సు ఆనందముతో తేలియాడుతుంది. అప్పుడే చెట్టు తొర్రలో ఉన్న మూషికము కూడా తిను బండారాలకోసం అక్కడకు అక్కడకు వచ్చి దాకుంది. కిరాతకుని మాటలు విన్న విశ్వమిత్రులవారు " ఓ కిరాతక! మేము కావేరి నది స్నానార్ధమై ఎక్కడకు వచ్చాము. కార్తీక స్నానము ఆచరించి కార్తీక పురాణము పాటిస్తునావు. నీవు ఇక్కడ కూర్చొని విను".అని చెప్పారు. కారతకుడికి కార్తీక పురాణ మహత్యం వలన అతనికి పూర్వజన్మ జ్ఞానము కలిగి అతనిలో పరివర్తన కలిగి ఇకనుంచి దొంగతనము చేయనని మంచిగా కార్తీక మాసా వ్రతమును ఆచరిస్తాను అని వారికీ నమస్కరించి తన ఉరికి వెళ్లిపోతాడు.  

         చెట్టు మొదలులో దాగిఉన్న మూషకమునకు కూడా శాపవిమోచనం కలిగి బ్రాహ్మణా రూపము వచ్చి "మునివర్యా! ధన్యోస్మి. తమ దయవల్ల నేను కూడా ఈ మూషిక రూపము నుంచి విముక్తుడినైనను"అని తన వృత్తంతం చెప్పి మహర్షికి నమస్కరించి వెళిపోయాడు. 

       కనుక ఓ జనకమహారాజా!ఇహములో సిరిసంపదలు, పర లోకమున మోక్షము కోరువారు తప్పక ఈ కార్తీక పురాణమును చదివి, ఇతరులకు వినిపించాలి.



ప్రశ్న

కృష్ణుడు భగవద్గీతను చేప్పినపుడు ఎంత మంది విన్నారు?



భగవద్గీత

అధ్యాయం 3

శ్లోకం 26

న బుద్ధిభేదం జనయేత్ అజ్ఞానాంకర్మసంగినామ్ |

జోషియేత్ సర్వకర్మణి విధ్వాన్ యుక్తః సమాచారన్ ||

అర్ధం :-

పరమాత్మస్వరూపమునందు నిశ్చలస్థితిని పొందిన జ్ఞాని శాస్త్రవిహిత కర్మలను ఆసక్తితో ఆచరించు అజ్ఞానులబుధ్ధులను భ్రమకు లోను చేయకూడదు.  అనగా కర్మలయందు వారికీ ఆశ్రధ్ధను కలిగించరాదు. పైగా తానుకూడా శాస్త్రవిహితములైన సమస్త కర్మలను చక్కగా చేయుచు వారితోగూడ అట్లే చేయింపవలెను. 

కార్తీక పురాణము 4వ రోజు

దీపరాధనా మహిమ 

4వ అధ్యాయము 

        జనకమహారాజు వశిష్ఠునితో "మహతపస్వీ! మీరు చెపుతున్న ఇతిహాసాలు విన కొద్దీ వినాలి అనిపిస్తుంది.  కార్తీక మాసంలో ఇంకా ఏమేమి చేయాలి, ఎవరిని పూజించాలి వివరించండి. అని వశిష్ఠులవారిని కోరారు. 

         జనకమహారాజ! కార్తీక మాసంలో సర్వసత్కార్యములు చేయవచ్చును. దీపారాధన అందులో ముఖ్యమైనది. దీనివలన ఎంతో పుణ్యం కలుగుతుంది.  శివకేశవుల ప్రీతికొరకు శివాలయములో గాని, విష్ణు ఆలయములో గాని దీపారాధన చేయవచ్చును. సూర్యాస్తమయసమయంలో, అనగా సంధ్య చీకటిపడు సమయమున శివకేశవుల సన్నిధిని గాని దీపారాధన చేసినవారి సర్వపాపములు పోయి వైకుంఠమునకు వెళ్ళతారు. కార్తీక మాసములో హరిహరాదుల సన్నిధిలో ఆవునేతితో గాని, కొబ్బరి నూనెతో గాని, అవిసె నూనెతో గాని, విప్ప నూనెతో గాని,  ఏది దొరకనప్పుడు ఆముదముతో గాని దీపారాధన చేయాలి.  దీపారాధన ఏ నూనెతో చేసిన పుణ్యాత్ములు గాను, భక్తి పరులుగాను, నగుటయేగాక అష్టఐశ్యర్వములు కలిగి చివరికి శివసానిధ్యం చేరుకుంటారు.  ఇందుకు ఒక కథ ఉంది విను. 

  శతృజిత్కథ 

         పూర్వము పాంచాల దేశమును పాలించు రాజుకు సంతతి లేక అనేక యజ్ఞయాగాదులు చేసి, చివరకు విసుగు చెంది గోదావరి తీరములో నిష్ఠతో తపస్సు చేస్తున్న సమయంలో అక్కడికి పిప్పలాదుడను మునిపుంగవుడు వచ్చి " పాంచాల రాజా! నీవు ఎందుకు తపస్సు చేస్తున్నావు? నీ కోరిక ఏమిటి?" అని అడుగగా "ఋషిపుంగవా! నాకు అష్ట ఐశ్వర్యములు, రాజ్యము, సంపదలు, ఉన్న నా వంశం నిల్పుటకు పుత్రసంతానం లేక ఈ తీర్ధ స్థానమున తపమాచరిస్తున్నాను. అప్పుడు ముని పుంగవుడు "రాజా! కార్తీక మాసములో శివసన్నిధిలో శివుని ప్రీతికొరకు దీపారాధన చేసిన నీ కోరిక తీరుతుంది" అని చేపి వెళ్లిపోయారు. 

      వెంటనే రాజు రాజ్యమునకు చేరుకొని పుత్రప్రాప్తి కోసం అతి భక్తితో శివాలయమునకు వెళ్లి కార్తీక మాసము మొత్తం దీపారాధన చేయించి దానధర్మాలు నియమానుసారంగా వ్రతము విడువకుండా నెల రోజులు చేసారు. అందుకు ఫలితముగా రాజు భార్య గర్భవతి అయి ఒక శుభముహూర్తాన పుత్రునకు జన్మను ఇచ్చింది. రాజు సంతోషించి పుత్రోత్సవములు, బ్రాహ్మణులకు దానములు చేసారు. ఆ బాలునికి శత్రజిత్తు అని నామకరణం చేసారు. తనకి కార్తీకమాసవ్రత ఫలితముగా తనకు పుత్ర సంతానం కలగటం వలన దేశమంతా కార్తీకమాస వ్రతాలు దీపారాధనలు చేయాలనీ రాజు శాసనం చేసాడు. 

         రాకుమారుడు దినదిన ప్రవర్ధమానము అయి సకలశాస్త్రములు, ధనుర్విద్య, కత్తిసాము, మొదలైనవి నేర్చుకొన్నాడు. కానీ యవ్వనంలో అడుగుపెట్టిన తరువాత దుష్టుల సావాసం వలన రాకుమారుడు తన కంటికి ఇంపుగా ఉన్న స్త్రీలను బలాత్కరించుచు, ఎదిరించిన వారిని దడించెను. 

    తల్లిదండ్రులుకూడా తమకు లేకలేక కలిగిన సంతానని చూసి చూడనట్టు ఉండేవారు. ఇది ఇలాఉండగా ఒక రోజు రాకుమారుడు విధులలో తిరుగుతుండగా ఒక బ్రాహ్మణపడతిని చూసి మోహించెను.  రాకుమారుడు ఆమెవద్దకు వెళ్లి తన కోరికను తెలియజేసెను. ఆ బ్రాహ్మణపడతికూడా అంగీకరించెను. వీరి బంధం కొంతకాలం సాగింది. వీరి గురించి ఆమె భర్తకి తెలిసింది. ఒకరోజు వారు ఇంటికి దూరంగాఉన్న పాడుబడిన శివాలయములో కలుసుకోవాలంని అనుకొని ఎవరిదారిన వారు బయలుదేరారు. ఈ విషయం తెలుసుకున్న ఆమె భర్త వల్ల కన్నా ముందే అక్కడికి చేరుకున్నాడు. కొంత సేపటికి వారు వచ్చారు. అక్కడ చీకటిగా ఉండటంతో దీపముంటే బాగుండును అనుకొన్నారు. అక్కడే ఉన్న ఆముదము ప్రమిదగాలో ఆమె తన చీరను చించి వతిగాచేసి దీపము వెలిగించింది. అదును కోసం చూస్తున ఆమె భర్త తనతో తెచ్చుకొని కత్తితో ఆమెను రాకుమారుడిని ఒకేసారి చంపాడు. అతనుకూడా అదేకత్తితో మరణించాడు. 

           ప్రేమికులిద్దరిని తీసుకొనిపోవటానికి శివదూతలు వచ్చారు. ఆ బ్రాహ్మణుడిని తీసుకొని పోవటానికి యమదూతలు వచ్చారు. ఆ బ్రాహ్మణుడు యమదూతలతో "ఓ దూతలారా! నన్ను తీసుకొని పోవుటకు మీరు ఎలావచ్చారు. ఆ వ్యభిచారులు కొరకు శివదూతలు ఇలా వచ్చారు అని ప్రశ్నించెను".అందుకు యమదూతలు "ఓ బ్రాహ్మణుడా! వారు ఎంత నీచులైనను తెలిసోతెలియకో శివాలయములో కార్తీక పౌర్ణమి రోజునా దీపారాధన చేసారు.అందుకే వారు చేసిన పాపములు పోయి శివ సాన్నిధ్యం లభించింది". ఈ సంభాషణ విన రాకుమారుడు " అలా ఏనాటికి జరుగనివ్వను. తప్పొప్పులు ఎలాగున్నా మేము ముగ్గురము ఒకేరోజు, ఒకే స్టలములో, ఒకే సమయంలో మరణించాము. కనుక ఆ ఫలము మా అందరికి వర్తించవలసిందే".అని తాము చేసిన దీపారాధన ఫలములో కొంత ఆ బ్రాహ్మణునికి దానము చేసారు. ఆ బ్రాహ్మణుడు కూడా వారితో పాటు శివ సాన్నిధ్యం చేరెను.

         వినవుగా రాజా! కార్తీక మాసంలో శివాలయంలో దీపారాధన చేయట వలన ఆ ప్రేమికులు చేసిన పాపములు పోవటమే కాకుండా కైలాస ప్రాప్తి కలిగింది. కార్తీక మాసంలో నక్షత్రమాల యందు దీపముంచినవారు జన్మరాహిత్యం పొందుతారు.

భగవద్గీత

అధ్యాయం 3

శ్లోకం 25

సక్తా: కర్మణ్యవిద్వాంసో యథా కుర్వంతిభారత l

కుర్యాద్విద్వాంస్తథా సక్తాః చికీర్షుర్లోకసంగ్రహమ్ ll

అర్ధం :-

ఓ అర్జునా! అజ్ఞానులు కర్మలయందు ఆసక్తులై వాటిని ఆచరించినట్లుగా, విద్వాంసుడు కూడా లోకహితార్థమై ఆసక్తిరహితుడై కర్మలను ఆచరించవలెను. 

కార్తీక పురాణము 3వ రోజు

కార్తీక స్నాన మహిమ 

3వ అధ్యాయము 

            జనకమహారాజా! కార్తీక మాసమున ఏ ఒక చిన్న దానమును చేసినా, అది గొప్ప ప్రభావము ఉంటుంది. అటువంటి వారికీ సకలైశ్వర్యములు కలుగటమే కాకుండా మరణం తరువాత శివ సాన్నిధ్యమును చేరుతారు. కానీ కొంతమందు భోగభాగ్యములు విడువలేక కార్తీక స్నానములు చేయక,  అవినీతిపరులై చివరకు బ్రహ్మరాక్షస జన్మను ఎత్తుతారు.  దీనిని గురించి ఒక కధ ఉంది శ్రద్ధగా విను రాజా.

బ్రహ్మరాక్షసులు ముక్తి కలుగుట 

        ఈ భారతఖండమందు దక్షిణ ప్రాంతములో ఒక గ్రామములో మహావిద్యాసుడు, తపశ్శాలి, జ్ఞానశాలి, సత్యవాక్య పరిపాలకుడు అగు 'తత్వనిష్ఠు'డను బ్రాహ్మణుడు ఉండేవాడు. ఒకనాడు ఆ బ్రాహ్మణుడు తీర్థయాత్రాలకు ఆకాండ గోదావరికి బయలుదేరారు. ఆ తీర్థసమీపమున ఒక మహా వృక్షము పై భయంకరమైన ముఖంతో, పొడవైనాజుట్టుతో, బలమైనకోరాలతో, నల్లనిబానపొట్టతో భయంకరమైన ముగ్గురు బ్రహ్మరాక్షుసులు ఉండేవారు. ఆ దారిన వెళేవారిని చంపి భుజిస్తూఉండేవాళ్లు. అదే దారిన వచ్చిన ఆ బ్రాహ్మణుడిని కూడా చంపితినాలని అతని మీద దాడి చేసారు. ఆ బ్రాహ్మణుడు భయంతో నారాయణ స్తోత్రం చేసాడు. నారాయణ స్తోత్రం వినటం వలన బ్రహ్మరాక్షసులు పూర్వజన్మ జ్ఞానము కలిగింది. మమ్మలిని కాపాడండి అని ఆ బ్రాహ్మణుడి కాళ్లపై పడారు. వారి మాటలకూ కొంత ధర్యము తెచ్చుకొని "మీరు ఎవరు అని అడిగాడు" అందుకు ఆ బ్రహ్మరాక్షసులు "ఓ బ్రహ్మణోత్తమ! మీరు పూజ్యులు, వ్రతనిష్ఠగరిష్ఠులు, మీ దర్శమభాగ్యం వలన మాకు పూర్వజన్మ జ్ఞానము కలిగింది". 

 మొదటి బ్రహ్మరాక్షసుడి వృత్తంతం 

         నాది ద్రవిడదేశము. బ్రాహ్మణుడును. నేను మహా పండితుడిని అని గర్వముగల వాడినై ఉన్నాను. న్యాయాన్యాయవిచక్షణలు మరిచి పశువులాగా ప్రవర్తించాను. బాటసారులవధ్ధ, అమాయకపు గ్రామస్తులవద్ద దౌర్జన్యముగా ధనము లాకొనేవాడిని, చెడు అలవాటులతో భార్య, పిల్లలను పాటించుకోకుండా ఉండేవాడిని.

        ఇలా ఉండగా ఒక రోజు ఒక బ్రాహ్మణుడు కార్తీకమాస వ్రతమును యధావిధిగా ఆచరించి బ్రాహ్మణా సమారాధన చేయటానికి సరుకులు తీసుకొని తిరుగు ప్రయాణములో మా ఇంటికి అతిధిగా వచ్చాడు. వచ్చిన ఆ బ్రాహ్మణుడిని నేను కొట్టి, తిట్టి అతని దగరున్న సరుకులను లాకొని బయటకి గెంటాను. అందుకు ఆ బ్రాహ్మణుడుకి కోపం వచ్చి "ఓరి నీచుడ అన్యాక్రాంతముగా సంపాదిచినది చాలక తోటి బ్రాహ్మణుడిని అనికూడా ఆలోచించకుండా నావద్ద ఉన్న సమస్తాన్ని లాకున్నావు. నీవు రాక్షసుడవై నిర్మానుష్య ప్రదేశములో నరమాంసభక్షకుడవై జీవింతువు గాక అని శపించాడు". నేను అతని కాళ్ళ పై పడి క్షమించమని వేడుకొన్నాను. అందుకు ఆ బ్రాహ్మణుడు గోదావరి క్షేత్రములో ఒక వటవృక్షము ఉంది. ఒక బ్రాహ్మణుడు కార్తీక మాస వ్రతము ఆచరించుచు అక్కడికి వస్తాడు. అతని వలన నీకు మోక్షం లభిస్తుంది. అని తన వృత్తంతం చెప్పాడు. 

 రెండొవ బ్రహ్మరాక్షసుడి  వృతాంతం 

           ఓ బ్రహ్మణోత్తమ! నేను కూడా పూర్వజన్మలో బ్రాహ్మణుడినే. నేను నీచుల సావాసం చేస్తూ తల్లి తండ్రులకు తిండి పెట్టక మాడ్చి భాదపెట్టాను. వారి ఎదురుగానే నేను నా భార్య పిలల్లతో పంచనక్షపరమణలను భుజించాను. నేను ఏటువంటి దాన ధర్మాలను చేయలేదు. నా బంధువులను కూడా హింసించి వారినుండి దనమును అపహరించాను. అందుకే నాకు ఈ రాక్షస జన్మ వచ్చింది. నన్ను రక్షించు అని ఆ బ్రాహ్మణుడి పాదాలపై పడి వేడుకొన్నాడు.

మూడోవ బ్రహ్మరాక్షసుడి వృత్తంతం 

        మహాత్మ! నేను సంపన్న కుటుంబంలో పుటిన ఒక బ్రాహ్మణుడిని. నేను విష్ణు ఆలయంలో అర్చకుడిగా ఉన్నాను. స్నానము అయినా చేయకుండా ఆలయంలో తిరుగుతూ దేవునికి పూజచేయకుండా భక్తులు తెచ్చిన వస్తువులను నా ఉంపుడుగతేకు ఇచ్చి మధ్యమాంసలను సేవిస్తూ పాపకార్యములు చేశాను. మరణానంతరం ఇలా రాక్షసుడిని ఆయను. నన్ను కూడా పాపవిముక్తుడిని చేయమని ప్రార్ధించాడు. 

            ఓ జనకమహారాజ! తపోనిష్ఠుడగు ఆ బ్రాహ్మణుడు రాక్షసుల దీనాలాపనలను విని "ఓ రాక్షసులారా! భయపడకండి. మీరు పూర్వ జన్మలో చేసిన ఘోరకృత్యాలు వల్ల మీకు ఈ రూపము కలిగింది. నా వెంట రండి. మీకు విముక్తిని కలిగిస్తాను." వారిని ఓదార్చి తనతో తీసుకొని ఆ ముగ్గురిని యాతన విముక్తి కోసం సంకల్పము చెప్పుకొని తానే స్వయముగా గోదావరి స్నానమాచరించి స్నానపుణ్యఫలమును ఆ ముగ్గురు బ్రహ్మరాక్షసులు ధారపోయగా వారి రాక్షస రూపాలు పోయి దివ్యరూపాలు ధరించి వైకుంఠానికి వెళారు. 

          జనకమహారాజా! కార్తీక మాసములో ఏదయినా నాది స్నానమాచరించినచో హరిహరాదులు సంతృప్తి నొంది, వారికీ సకలైశ్వర్యములు ప్రసాదింతురు. అందువలన, ప్రయత్నిచయినా సరే కార్తీక స్నానాల నాచరించాలి.



భగవద్గీత

అధ్యాయం 3

శ్లోకం 24

ఉత్సీదేయురిమే లోక న కుర్యాం కర్మ చేదహమ్ l

సంకరస్య  చ కర్తా స్యామ్ ఉపహన్యామిమాః ప్రజాః ll

అర్ధం :-

నేను కర్మలను ఆచరించుట మానినచో ఈ లోకములన్ని నశించును. అంతేగాదు, లోకములందు అల్లకల్లోలములు చెలరేగును. ప్రజానష్టము వాటిల్లును. అప్పుడు అందుకు నేనే కారకుడిని అవుతాను.

కార్తీక పురాణము 2వ రోజు

సోమవార వ్రత మహిమ 

            జనకమహారాజా! ఇప్పటివరకు నీకు కార్తీకమాసంలో ఆచారించవలసిన విధివిధానాలను తెలియజేశాను. ఇపుడు కార్తీక సోమవార వ్రతము ప్రాముఖ్యాన్ని తెలియజేస్తాను.  

     కార్తీక మాసములో సోమవారం శివునికి అత్యంత ప్రీతికరమైన రోజు.  ఆ రోజున స్త్రీ, పురుష భేదము లేకుండా ఆ రోజు అంత ఉపవాసం వుండి శక్తికొద్దీ దానధర్మాలు చేసి నిష్టతో శివునికి బిల్వపత్రాలతో పూజ అభిషేకం చేసి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసి తరువాత భోజనము చేయాలి.  ఆ రాత్రు అంతా జగరాన చేసి పురాణపఠనము చేసి తెల్లవారిన తరువాత నదికి వెళ్లి స్నానం చేసి,  తిలాదానం,  తమశక్తి కొలది పేదలకు అన్నధానమును చేయాలి. కార్తీక మాసములో నిష్ఠతో సోమవార వ్రతము చేసిన వారికీ శివుని అనుగ్రహముతో కైలాసప్రాప్తి, విష్ణు పూజ చేసిన వారికి వైకుంఠ ప్రాప్తి లభిస్తుంది. జనకమహారాజా దీనికి ఉదాహరణగా ఒక కధ ఉంది. శ్రద్ధగా విను.

కార్తీక సోమవార ఫలముచే కుక్కకు కైలాసప్రాప్తి 

          పూర్వకాలములో కాశ్మీర దేశములో ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. అతను పురోహిత వృత్తిని చేపట్టి తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతనికి చాలాకాలానికి ఒక కుమార్తె జన్మించింది. ఆమె పేరు స్వాతంత్ర్య నిష్ఠురి. ఆమెకి వివాహ సమయం వచ్చిన తరువాత ఆమె తండ్రి ఆమెను సౌరాష్ట దేశములో ఉన్న మిత్రశర్మ అను 

         బ్రాహ్మణునికి ఇచ్చి వివాహం చేసారు. ఆ బ్రాహ్మణుడు నాలుగువేదాలు, సకల శాస్త్రాలు అభ్యసించాడు. అతను సదాచారుడు. భూతదయ కలిగినవాడు సత్యవాది. నిరంతరము భగవమమస్మరణం చేస్తాడు. అతనిని అందరూ అపరబ్రహ్మ అని పిలిచేవారు. ఇటువంటి ఉత్తమ పురుషునికి భార్య ఆయినా నిష్ఠురి యవ్వన గర్వముతో, కన్నుమినుగానక పెద్దలను ధూషించుచు, అత్తమామలను, భర్తను తిడుతూ కొడుతూ, వ్యభిచారిణి అయి తన వంశమునకు అప్రతిష్ట తెచ్చింది. అత్త మామలు తమ ఇంటినుండి వెళ్లగొట్టారు. కానీ ఆమె భర్త ఆమెయందు ప్రేమ పోక అమె తోనే కాపురము చేసెను.  అంతగా ప్రేమిస్తున్న భర్తను దయ అనేది అనేది లేకుండా భర్త నిద్రపోతున్నపుడు అతనిని బండరాయి వేసి చంపేసింది. ఒక్కర్తే ఊరిబయట ఉన్న బావిలో శవాన్ని పడేసింది. ఇంకా తనకు తనకు ఇటువంటి అడం లేదుఅని విచాలవిడిగా తిరిగింది. తాను పాపకృత్యాలు చేస్తున్నదే కాకుండా ఇతర పడుచు కన్యలను, ఆడపడుచులను కూడా చేరదీసి వారిని కూడా దుర్బుధ్ధులు నేర్పి పాడుచేసి విటులకు తార్చి ధనార్జన కూడా చేసేది. ఆమె పనులను చూసి లోకులు ఆమెను రక్కసి అని పిలిచేవాళ్లు.

      మహారాజ! యవ్వన బింకము ఎంతో కలం ఉండదు కదా! కాలం తన సమాధానం సమాధానం చెప్పే రోజు వచ్చింది. క్రమక్రమముగా ఆమెలోని యవ్వనము నశించింది. కుష్టివ్యాధి వచ్చి ఓలంతా కురుపులతో నరకయాతన పడి మరణించింది. ఆమె చనిపోయిన వెంటనే భయంకరమైన యమా భటులు వచ్చి తీసుకొని వెళ్లి యమధర్మ రాజు ముందు హాజరు పరిచారు. యమధర్మరాజు, చిత్రగుప్తులవారు ఆమె పాపా చరిత్రను చూసి ఈ శిక్షలు విధించారు. విటులతో సుఖించినదుకు గాను ఈమెను ఎర్రగా కాల్చిన ఇనుప స్తంబానికి కటండి. భర్తను చంపినందుకుగాను ఇనుపగదలతో కొట్టారు. పతివ్రతలు వ్యభిచారిణిలుగా మార్చినందుకు సలసలకేగిన నూనెలో వేశారు. పెద్దలను దూషించినందుకు ఇనుప కడ్డీలు కాల్చి వాతలు పెట్టారు. చెవిలో సీసము పోశారు. ఆమె చేసిన పాపములకు ఇటు ఏడూ తారలు అటు ఏడూ తారలు నరక భాధలు పడుతున్నారు. 

        మహారాజ ఆమె కొంత కాలానికి కళింగ దేశములో కుక్క జన్మమెత్తి ఆకలిబాధ తట్టుకోలేక తిరుగుతుండెను. కర్రలతో కోటేవారు కొడుతూ, తీటేవారు తిడుతూ ఉండేవారి. ఒక బ్రాహ్మణుడు కార్తీక సోమవార వ్రతము ఆచరించి ఉపవాసం ఉండి నక్షత్ర దర్శనం చేసినతరువాత బలిఅన్నము అరుగుపై పేటి కాలు చేతులు కడుకొనుటకు లోపలికి వేలాడు. అదే సమయంలో ఆకలి బాధతో తిరుగుతున్న కుక్క ఆ బలి అన్నము తిన్నది. ఆ బ్రాహ్మణుడు నిష్ఠతో వ్రతము చేసి వండిన అన్నము వలన ఆ కుక్కకు పూర్వ జన్మ జ్ఞానము వచ్చింది. వెంటనే ఆ కుక్క బ్రహ్మణోత్తమా నన్ను రక్షించు రక్షించు అని అరిచింది. ఆ అరుపులకు బయటకు వచ్చిన బ్రాహ్మణుడు అక్కడ కుక్క మాత్రమే ఉండటం చూసి మళ్ళి లోపలి వేలాడు. మళ్ళి రక్షిచమని అరుపులు వినిపించాయి. బ్రాహ్మణుడు బయటకు వచ్చి నువ్వు ఎవరు అని ప్రశ్నించెను. అపుడు కుక్క తన వృతాంతం మొత్తం చేపి తనని రక్షించమని వేడుకుంది. నేను ఏమిచేయగలను అని అడిగాడు. అందుకు కుక్క స్వామి మీరు నిష్ఠతోచేసిన ఒక కార్తీక సోమవార వ్రతఫలితమును నాకు దానంచేసి నాకు ఈ భాధలనుంచి విముక్తి ఇపించాడు అని వేడుకుంది. బ్రహ్మణోత్తముడు అలాగే ఒక కార్తీక సోమవార వ్రతము ఫలితాన్ని ఆ కుక్కకు ధనము చేసెను.  అందరూ చూస్తుండగా ఒక దివ్య విమానంవచింది. ఆమె అందరికి నమస్కరించి శివ సాన్నిధ్యం చేరుకుంది.

      వినవుకదా జనక మహారాజ! నీవు కూడా కార్తీక మాసా వ్రతమును ఆచరించి శివ సాన్నిధ్యం పొందు అని వశిష్ఠుడు హితబోధ చేసెను.

భగవద్గీత

అధ్యాయం 3

శ్లోకం 23

యది హ్యహం న వర్తేయం జాతు కర్మణ్యతంద్రితః l

మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః ll

అర్ధం :-

ఓ పార్థా! ఎప్పుడైనా నేను సావధానుడనై కర్మలయందు ప్రవర్తింపకున్నచో, లోకమునకు గొప్పహాని సంభవించును. ఎందుకనగా, మనుష్యులందరును అన్ని విధముల నా మార్గమునే అనుసరింతురు. 


కార్తీక పురాణము 1వ రోజు

కార్తీక మాస మహత్యం 

ఒకనాడు శౌనకాది మునులు సూతుని పిలిచి "మునివర్యా ! తమవలన ఎన్నో పురాణాలు వేదవేధగాములను వివరించారు.  అలాగే మాకు కార్తీక మాసా మహత్యం గురించి తెలుసుకోవాలని ఉంది" అని అడుగుతారు.  

సూతమహర్షి "ఓ శౌనకాది మునులారా! ఒకప్పుడు ఇదే కోరికను నారదుడు బ్రహ్మను కోరగా బ్రహ్మ ఇలా చెప్పారు.  ఈ కథను వినటం వలన మానవులకు ధర్మార్ధములు కలగటమే కాకుండా సకలైశ్వర్యములతో తులతూగుతారు. 

పూర్వకాలమునందు పార్వతి పరమేశ్వరులు ఆకాశంలో విహరిస్తుండగా పార్వతిమాత పరమేశ్వరుడుని స్వామి సకలైశ్వర్యములు కలుగచేసేది,  సకల మానవులు ఆచరించే వ్రతమును వివరింపుము అని కోరుకుంటుంది. 

దేవి! నీవు అడుగుతున్న వ్రతమును గురించి ఇపుడు మిథిలానగరములో వశిష్ఠుడు జనకమహారాజుకి చెపుతున్నాడు విందువు గాని అని మిథిలానగరమువైపు చూపించెను.

    మిథిలానగరానికి వశిష్ఠుడు జనకమహారాజు దగరకు వస్తాడు. జనకమహారాజు వశిష్ఠ మహర్షిని సాదరంగా ఆహ్వానించి అర్ఘ్య పాద్యములు ఇచ్చిన తరువాత జనకమహారాజు మహర్షిని మునివర్యా సంవత్యరములో గల మాసములో కార్తీక మాసము ఎందుకు అంత విశిష్టిమైనది. ఆ మాసము గురించి వివరించండి అని అడుగుతారు. 

  జనకమహారాజా ఈ కార్తీక మాసము హరిహర స్వరూపము. ఈ మాసమునందు ఆచరించు వ్రతము ఇచ్చే ఫలితము అంత ఇంత కాదు. వినినంతనే నరకబాధలను, పాపములను తొలగించేది. సుఖసంతోషాలను కలిగించేది. శ్రద్ధగా విను అని వశిష్ఠుడు వివరించెను. 

కార్తీకమాసా వ్రతవిధానము 

ఓ జనకమహారాజా! ఏ మానవుడైన, ఏ వయస్సువాడైనా, కార్తీక మాసంలో, సూర్యభగవానుడు తులారాశిలో ఉన్నపుడు వేకువజామునే లేచి కాలకృత్యాలు తీర్చుకొని, స్నామాచరించి, దేవతారాధన, దానధర్మములును  చేసినచో ఆకాండమైన పుణ్యఫలము లభిస్తుంది. విష్ణు సహస్రనామార్చన, శివలింగార్చన ఆచరించవలెను. ముందుగా కార్తీక మాసామునకు అధిదేవత అయినా దామోదరుని ప్రార్ధించాలి. ఓ దామోదర నేను ఆచరిస్తున్న ఈ వ్రతముకు ఎటువంటి ఆటంకము కలగకుండా కాపాడమని ప్రార్ధించి వ్రతమును ఆరంబించాలి.  

కార్తీక స్నానవిధానము

ఓ రాజా! ఈ వ్రతమును ఆచరించు రోజులలో సూర్యదయమునకు పూర్వమే నిద్ర లేచి కాలకృత్యాలు తీర్చుకొని నదీస్నానము ఆచరించి గంగకు శ్రీమన్నారాయణునకు, పరమేశ్వరునకు, భైరవునికి నమస్కరించు సంకల్పం చెప్పుకొని, మరల నీటమునిగి సూర్యభగవానునికి అర్ఘ్యపాద్యములు ఇచ్చి పితృదేవతలకు క్రమ ప్రకారం తర్పణములొసగి గట్టుపై మూడు దోసిలి నీళ్ళు పోయాలి.ఈ కార్తీక మాసములో నదులయందు స్నానమాచారించుట గొప్ప ఫలితము లభిస్తుంది. శ్రీ మహా విష్ణువుకు ప్రీతికరమైన పూవులతో ధూపదీప నైవేద్యాలతో పూజించాలి. తరువాత అతిధి అభ్యాగతులను పూజించి వారికీ ప్రసాదము తన ఇంటివద్దగాని, దేవాలయము వద్దగాని,  రావిచెట్టు వద్దగాని  కార్తీక పురాణం పారాయణం చేయాలి. సాయంకాలం శివాలయంలోగాని, విష్ణువులయంలోగాని, తులసికోటవద్దగాని దీపారాధనచేసి శక్తినిబట్టి నైవేద్యం తయారుచేసి స్వామికి సమర్పించి అందరికి పంచిపెట్టి తరువాత తాను తినాలి. తరువాతి రోజు మృష్ఠానముతో భోజనం చేయాలి. ఈ విధముగా వ్రతము ఆచరించు మానవులందరికి పాపమూ పోయే మోక్షం కలుగును.



          






దీపావళి

                  దీపావళి పండుగా రోజునా లక్ష్మి దేవిని పూజించటానికి ఒక విశిష్టత ఉంది.  పూర్వం దుర్వాస మహర్షి ఇంద్రుడి ఆతిధ్యానికి వెళతాడు.  ఇంద్రుడి సేవలను మెచ్చుకొని దుర్వాస మహర్షి అతనికి మహిమాన్విత హారాన్ని ఇస్తాడు.  ఇంద్రుడు దానిని తిరస్కరించి తన వాహనమైన ఐరావతానికి ఇస్తాడు. ఐరావతం ఆ మాలను కాలికింద వేసి తొక్కుతుంది. ఇది చూసి ఆగ్రహించిన దుర్వాస మహర్షి ఇంద్రుడుని శపిస్తాడు. ఇంద్రుడు తాత్కాలికంగా సర్వ సుఖాలను, సంపదలను పోగొట్టుకుంటాడు.

       ఇంద్రుడికి దిక్కుతోచక శ్రీహరిని శరణు వేడుకుంటాడు. అప్పుడు శ్రీమహా విష్ణువు అతనికి నూనెతో ఒక దీపాన్ని వెలిగించి శ్రీమహాలక్ష్మిని ప్రార్ధించమని చెపుతాడు. ఇంద్రుడు అదే విధంగా శ్రీమహాలక్ష్మిని ఉపాసిస్తాడు. ఇంద్రుడి ప్రార్థనలకు సంతోషించిన మహాలక్ష్మిదేవి అతనికి పూర్వ  వైభవాలను ప్రసాదిస్తుంది. 

           ఇంద్రుడు శ్రీమహాలక్ష్మిని ఇలా ప్రార్ధిస్తాడు. మాత నీవు ఎపుడు శ్రీహరి చెంతనే ఉంటే మమ్మలిని ఎవరు రక్షిస్తారు అని అడిగితారు. అపుడు శ్రీమహాలక్ష్మి ఇలా సమాధానమిస్తుంది. ఎవరైతే ననే ఉపాసన చేస్తూ ధ్యానిస్తుంటారో వారికీ నేను సకల సంపదలను ఇస్తాను అని చెపింది. 

      ఈ దీపావళి రోజునా ఎవరయితే శ్రీమహాలక్ష్మిని పూజిస్తారో వారికీ లక్ష్మీదేవి సకల సంపదలను ప్రసాదిస్తుంది. 




రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...