భగవద్గీత-అధ్యాయం2-శ్లోకం11

అధ్యాయం 2
శ్లోకం 11
శ్రీ భగవాన్ ఉవాచ 
అశోచ్యనన్వశోచస్త్వం ప్రజ్ఞాదాంశ్చ భషసే |
గతాసూనగతాసూంశ్చ నానుశోచంతి పండితాః ||

అర్ధం :-
శ్రీ భగవానుడు పలికెను :- ఓ అర్జునా ! శోకింపదగని వారికొరకై నీవు శోకించుచున్నవు. పైగా పండితుని వలె మాట్లాడుచున్నవు.  పండితులైన వారు ప్రణములు పొయీన వారిని గూర్చిగాని, ప్రణములు పొనివారిని గిఱించి గాని శోకింపరు.                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                             
                                                                                                                                                                                                                                                                                                                                                                                                                

భగవద్గీత-అధ్యాయం2-శ్లోకం10

అధ్యాయం 2
శ్లోకం 10
తమువాచ హృషికేశ్ణ ప్రహసన్నివ భారత |
సేనయోరుభయోర్మధ్యే విషీదంతమిదం వచః ||

అర్ధం :-
ఓ ధృతరాష్ర్టా ! ఉభయసేనల మద్య శోకసంతప్తుడైన అర్జునుని జూచి, శ్రీకృష్ణుడు మందహాసముతో ఇట్లు పలికెను.      








భగవద్గీత-అధ్యాయం2-శ్లోకం9

అధ్యాయం 2
శ్లోకం 9
సంజయ ఉవాచ
ఏవముక్త్వా హృషికేశం గుడాకేశ్ణ పరంతప |
న యోత్స్య ఇతి గోవిందమ్ ఉక్త్వా తూష్ణీం బభూవ హ ||

అర్ధం :-
సంజయుడు పలికెను :-  ఓ రాజా! ఈ విధముగా పలికిన పిమ్మట అంతర్యామియైన శ్రీకృష్ణునితో గుడాకేశుడైన అర్జునుడు, "నేను యుద్ధము చేయనే చేయను" అని సృష్టముగా నుడివి మౌనము వహించెను.






భగవద్గీత-అధ్యాయం2-శ్లోకం8

అధ్యాయం 2
శ్లోకం 8
న హి ప్రపశ్యామి మమాపనుద్యాత్ యచ్ఛోకముచ్ఛోషణమింద్రియాణామ్ |
అవాప్య భూమావసపత్నమృద్ధం రాజ్యం సురాణామపి చాధిపత్యమ్ ||

అర్ధం :-
ఈ శోకము నా ఇంద్రియములను దహించివేయుచ్చున్నది. సిరిసంపదలతో గూడిన తిరుగులేని రాజ్యాధికారము లభించినను, కడకు సురాధిపత్యము ప్రాప్తించినను, ఈ శోకదాహమును గాంచలేకున్నాను.   







భగవద్గీత-అధ్యాయం2-శ్లోకం7

అధ్యాయం 2
శ్లోకం 7 
కార్పణ్యదోషోవహతస్వభావః పృచ్ఛామి త్వాం ధర్మసమూఢచేతాః |
యచ్ర్ఛేయః స్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తే హం శాధి మాం త్వాం ప్రపన్నమ్ ||

అర్ధం :-
పిరికితనమునకు లోనై నా స్వభావమును కోల్పోయి గిలగిలలాడుచున్నాను. ధర్మాధర్మముల విచక్షణకు దూరమై నా కర్తవ్యమును నిర్ణయించుకొనలేకున్నాను. నాకు నిజముగా శ్రేయస్కరమైన దానిని తెలుపుము. నేను నీకు శిష్యుడను. శరణాగతుడను. ఉపదేశింపుము.       






 

భగవద్గీత-అధ్యాయం2-శ్లోకం6

అధ్యాయం 2
శ్లోకం 6
న చైతద్విద్మః కతరన్నో గరియో యద్వా జయేమ యది వా నో జయేయుః |
యానేవ హత్వా న జిజీవిషామః తే వస్థితాః ప్రముఖే ధార్తరాష్ర్టాః ||

అర్ధం :-
ఈ యుద్ధము చేయుట శ్రేష్ఠమా? లేక చేయకుండుట శ్రేష్ఠమా? అనునది ఎఱుగము. యుద్ధమున వారిని మనము జయింతుమా? లేక మనలను వారు జయింతురా? అను విషయమునుగూడ ఎఱుగము. మనకు ఆత్మీయులైన ధార్తరాష్ర్టులే ఇచట మనలను ఎదిరించి నిలిచియున్నారు. వారిని చంపి, జీవించుటకును మనము ఇష్టపడము.







భగవద్గీత-అధ్యాయం2-శ్లోకం5

అధ్యాయం 2
శ్లోకం 5
గురూనహత్వా హి మహనుభావాన్ శ్రేయో భోక్తుం భైక్ష్యమపిహ లోకే |
హత్వార్థకామాంస్తు గురూనిహైవ భుంజీయ భోగాన్ రుధిరప్రదిగ్ధాన్ ||

అర్ధం :- 
మహనుభావులైన ఈ గురుజనులను చంపకుండా బిచ్చమెత్తుకొని యైనను ఈ లోకమున జీవించుట నాకు శ్రేయస్కరమే. ఏలనన, ఈ గురుజనులను చంపినను, రక్తసిక్తములైన రజ్యసంపదలను, భోగములను మాత్రమే నేను అనుభవింపవలసి యుండునుగదా!




        

భగవద్గీత-అధ్యాయం2-శ్లోకం4

అధ్యాయం 2
శ్లోకం 4 :-
అర్జున ఉవాచ

కథం భీష్మమహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన |
ఇషుభి ప్రతియోత్స్యామి పూజార్హావరిసూదన ||


అర్ధం :- 
అర్జునుడు పలికెను :- ఓ మధుసూదనా! పూజ్యులైన భీష్మపితామహుని, ద్రోణాచార్యులను యుద్ధమున ఎదిరించి బాణములతో ఎట్లు పోరాడగలను? ఏలనన,ఓ అరిసూదనా! ఈ ఇరువురును నాకు పూజ్యులు.





       

భగవద్గీత-అధ్యాయం2-శ్లోకం3

అధ్యాయం 2
శ్లోకం - 3
క్లైబ్యం మా స్మ గమః పార్థనైతత్త్వయ్వుపపద్యతే |
క్షుద్రం హృదయదౌర్బల్యం త్యక్త్వోత్తిష్ఠ పరంతప ||

అర్ధం :-  కావున, ఓ అర్జునా! పిరికితనమునకు లోనుకావద్దు. నీకిది ఉచితము కాదు. ఓ పరంతపా! తుచ్ఛమైన ఈ హృదయదౌర్బల్యమును వీడి, యుద్ధమునకై నడుము బిగింపుము.









భగవద్గీత-అధ్యాయం2-శ్లోకం2

అధ్యాయం 2
శ్లోకం - 2
శ్రీభగవాన్ ఉవాచ
కుతస్త్వాకశ్మలమిదం విషమే సముపస్థితమ్ |
అనార్యజుష్టమస్వర్గ్యమ్ అకీర్తికరమర్జున ||

అర్ధం :-
శ్రీభగవానుడు ఇట్లనెను :-  ఓ అర్జునా! తగని సమయంలో ఈ మోహము నీకు ఎట్లు దాపురించినది? ఇది శ్రేష్టులచే ఆచరింపబడునదియు కాదు, స్వర్గమును ఇచ్చునదియు కాదు, కీర్తిని కలిగించునదియు కాదు.







        

భగవద్గీత-అధ్యాయం2-శ్లోకం1

అథ ద్వితీయో ద్యాయః - సంఖ్యయోగః

సంజయ ఉవాచ
శ్లోకం - 1

తం తథా కృపయావిష్టమ్ అశ్రుపూర్ణాకులేక్షణమ్ |
విషీదంతమిదం వాక్యమ్ ఉవాచ మధుసూదన: ||

అర్ధం :- 

సంజయుడు పలికెను :-  ఈ విధముగా కరుణాపూరితహృదయుడైన అర్జునుని కనులలో అశ్రువులు నిండియుండెను. అవి అతని వ్యాకులపాటును, శోకమును తెలుపుచుండెను. అట్టి అర్జునునితో శ్రీకృష్ణభగవానుడు ఇట్లనెను.





భగవద్గీత-అధ్యాయం1-శ్లోకం47

అధ్యాయం 1
శ్లోకం 47
                  సంజయ ఉవాచ

ఏవముక్త్వార్జునః సంఖ్యే రథోపస్థ ఉపవిశత్ |

విసృజ్య సశరం చాపం శోకసంవిగ్నమానసః ||


అర్ధం :-
సంజయుడు పలికెను :- అర్జునుడు ఈ విధముగా పలికి శోకసంవిగ్న మానసుడై, యుద్ధభుమియందు ధనుర్బాణములను త్యజించి, రథము వెనుకభాగమున చతికిలబడెను.


ఓం తత్సదితి శ్రీమద్బగవద్గీతాసూపనిషత్సుబ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే
శ్రీకృష్ణార్ణునసంవాదే అర్జునవిషాదయోగో నామ ప్రథమో ధ్యాయః  ||1||



        

భగవద్గీత-అధ్యాయం1-శ్లోకం46

అధ్యాయం 1
శ్లోకం 46
యది మామప్రతీకారమ్ అశస్త్రం శస్త్రపాణయః | 
ధార్తరాష్ట్రా రణే హన్యుః తన్మే క్షేమతరం భవేత్ ||

అర్ధం :-
శస్త్రరహితుడనై, ఎదిరింపని నన్ను శస్త్రములను చేబూని ధార్తరాష్ట్రులు యుద్ధమున వధించినను, అది నాకు మిక్కిలి క్షేమకరమే యగును.







        

భగవద్గీత-అధ్యాయం1-శ్లోకం45

అధ్యాయం 1
శ్లోకం 45
అహో బత మహత్పాపం కర్తుం వ్యవసితా వయమ్ |
యద్రాజ్యసుఖలోభేవ హంతుం స్వజనముద్యతాః ||

అర్ధం :-
అయ్యో! మనము బుద్ధిమంతులమైయుండియు రజ్యసుఖలోభముచే స్వజనులనే సంహరించుటకు ఉద్యుక్తులమై, ఈ ఘోరపాపకృత్యములకు ఒడిగట్టుచున్నము - ఇది యెంత దారుణము?






        

భగవద్గీత-అధ్యాయం1-శ్లోకం44

అధ్యాయం 1
శ్లోకం 44
ఉత్సన్నకులధర్మాణాం మనుష్యాణాం జనార్దన |
నరకే నియతం వాసో భవతీత్యనుశుశ్రుమః ||

అర్ధం :-
ఓ జనార్దనా ! కులధర్మములు నశించినవారికి నిరవధికముగా (కలకాలము) నరకప్రాప్తి తప్పదని ప్రతీతి.
        








భగవద్గీత-అధ్యాయం1-శ్లోకం43

అధ్యాయం 1
శ్లోకం 43
దోషైరేతైః కులఘ్నానాం వర్ణసంకరకారకైః |
ఉత్సాద్యంతే జాతిధర్మాః కులధర్మాశ్చ శ్చాశ్వతాః ||

అర్ధం :-
వర్ణసాంకర్యమునకు మూలములైన ఈ దోషములవలన కులఘాతకుల యొక్క సనాతన కులధర్మములు, జాతిధర్మములు నష్టమగును.






        

భగవద్గీత-అధ్యాయం1-శ్లోకం42

అధ్యాయం 1
శ్లోకం 42
సంకరో నరకాయైవ కులఘ్నానాం కులస్య చ |
పతింతి పితరో హ్యేషాం లుప్తపిండోదకక్రియాః ||


అర్ధం :-
వర్ణసాంకర్యము కులఘాతకులను, కులమును నరకమునందు పడవేయును. పిండోదకములు(శ్రాద్ధతర్పణములు) లోపించినందువలన వారి పితరులును అధోగతి పాలయ్యెదరు.





        

భగవద్గీత-అధ్యాయం1-శ్లోకం41

అధ్యాయం 1
శ్లోకం 41
అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రియః |
స్త్రిషు దుష్టాసు వార్ణ్షేయ జాయతే వర్ణసంకర: ||


అర్ధం :-
ఓ కృష్ణా ! అధర్మము(పాపము) పెచ్చుపెరిగిపోయినప్పుడు కులస్త్రీలు మిక్కిలి దూషితలగుదురు. ఓ వార్ణ్షేయా! స్త్రీలు దూషితలు ఐనచో వర్ణసాంకర్యము ఏర్పడును.





భగవద్గీత-అధ్యాయం1-శ్లోకం40

అధ్యాయం 1
శ్లోకం 40
కులక్షయే ప్రణశ్యంతి కులధర్మాః సనాతనాః|
ధర్మే నష్టే కులం కృత్న్సమ్ అధర్మో భిభవత్యుత ||


అర్ధం :-
కులక్షయమువలన సనాతనములైన కులధర్మములన్నియును నశించును. ధర్మము అంతరించి పోయినప్పుడు కులమునందు అంతటను పాపమే వ్యాపించును.





భగవద్గీత-అధ్యాయం1-శ్లోకం39

అధ్యాయం 1
శ్లోకం 39
కథం న జ్ఞేయమస్మాభిః పాపాదస్మాన్నివర్తితుమ్ |
కులక్షయకృతం దోషం ప్రపశ్వద్భిర్జనార్దన ||


అర్ధం :-
ఓ జనార్దనా! కులనాశనమువలన కలుగు నష్టములను ఎరింగిన మనము ఈ పాపములకు దూరముగా ఉండుటకు ఏల ఆలోచింపరాదు?






భగవద్గీత-అధ్యాయం1-శ్లోకం38

అధ్యాయం 1
శ్లోకం 38
యద్యప్యేతే న పశ్యంతి లోభోపహతచేతసః |
కులక్షయకృతం దోషం మిత్రంద్రోహే చపాతకమం ||

అర్ధం :-
లోభకారణముగ భ్రష్టచిత్తులైన వీరు కులక్షయమువలన కలుగు దోషములను, మిత్రద్రోహమువలన సంభవించు పాపములను చూడకున్నచో, 





        

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...