భగవద్గీత

అధ్యాయం 6

శ్లోకం 43

తత్ర తం బుధ్దిసంయోగం లభతే పౌర్వదేహికమ్ |

యతతే చ తతో భూయః సంసిద్ధౌ కురునందన||

అర్ధం :-

అచట పూర్వదేహమున సాధించిన బుధాది సంయోగమును అనగా సమబుద్ధిరూపయోగసంస్కారములను అతడు సులభముగనే పొందును. ఓ కురునందనా! ఆబుద్ధిసంయోగ ప్రభావమున అతడు మరల పరమాత్మ ప్రాప్తి సిద్దించుటకై మునుపటి కంటెను అదికముగా సాధన చేయును.


 

శ్రీ సుబ్రహ్మణ్య అష్టోత్తర శత నామావళి

 శ్రీ సుబ్రహ్మణ్య అష్టోత్తర శత నామావళి


ఓం స్కందాయ నమః

ఓం గుహాయ నమః

ఓం షణ్ముఖాయ నమః

ఓం ఫాలనేత్రసుతాయ నమః

ఓం ప్రభవే నమః

ఓం పింగళాయ నమః

ఓం కృత్తికాసూనవే నమః

ఓం శిఖివాహాయ నమః

ఓం ద్విషడ్భుజాయ నమః

ఓం ద్విషణ్ణేత్రాయ నమః (10)

ఓం శక్తిధరాయ నమః

ఓం పిశితాశ ప్రభంజనాయ నమః

ఓం తారకాసుర సంహారిణే నమః

ఓం రక్షోబలవిమర్దనాయ నమః

ఓం మత్తాయ నమః

ఓం ప్రమత్తాయ నమః

ఓం ఉన్మత్తాయ నమః

ఓం సురసైన్య సురక్షకాయ నమః

ఓం దేవసేనాపతయే నమః

ఓం ప్రాజ్ఞాయ నమః (20)

ఓం కృపాళవే నమః

ఓం భక్తవత్సలాయ నమః

ఓం ఉమాసుతాయ నమః

ఓం శక్తిధరాయ నమః

ఓం కుమారాయ నమః

ఓం క్రౌంచదారణాయ నమః

ఓం సేనాన్యే నమః

ఓం అగ్నిజన్మనే నమః

ఓం విశాఖాయ నమః

ఓం శంకరాత్మజాయ నమః (30)

ఓం శివస్వామినే నమః

ఓం గణ స్వామినే నమః

ఓం సర్వస్వామినే నమః

ఓం సనాతనాయ నమః

ఓం అనంతశక్తయే నమః

ఓం అక్షోభ్యాయ నమః

ఓం పార్వతీప్రియనందనాయ నమః

ఓం గంగాసుతాయ నమః

ఓం శరోద్భూతాయ నమః

ఓం ఆహూతాయ నమః (40)

ఓం పావకాత్మజాయ నమః

ఓం జృంభాయ నమః

ఓం ప్రజృంభాయ నమః

ఓం ఉజ్జృంభాయ నమః

ఓం కమలాసన సంస్తుతాయ నమః

ఓం ఏకవర్ణాయ నమః

ఓం ద్వివర్ణాయ నమః

ఓం త్రివర్ణాయ నమః

ఓం సుమనోహరాయ నమః

ఓం చతుర్వర్ణాయ నమః (50)

ఓం పంచవర్ణాయ నమః

ఓం ప్రజాపతయే నమః

ఓం అహస్పతయే నమః

ఓం అగ్నిగర్భాయ నమః

ఓం శమీగర్భాయ నమః

ఓం విశ్వరేతసే నమః

ఓం సురారిఘ్నే నమః

ఓం హరిద్వర్ణాయ నమః

ఓం శుభకరాయ నమః

ఓం పటవే నమః (60)

ఓం వటువేషభృతే నమః

ఓం పూష్ణే నమః

ఓం గభస్తయే నమః

ఓం గహనాయ నమః

ఓం చంద్రవర్ణాయ నమః

ఓం కళాధరాయ నమః

ఓం మాయాధరాయ నమః

ఓం మహామాయినే నమః

ఓం కైవల్యాయ నమః

ఓం శంకరాత్మజాయ నమః (70)

ఓం విశ్వయోనయే నమః

ఓం అమేయాత్మనే నమః

ఓం తేజోనిధయే నమః

ఓం అనామయాయ నమః

ఓం పరమేష్ఠినే నమః

ఓం పరస్మై బ్రహ్మణే నమః

ఓం వేదగర్భాయ నమః

ఓం విరాట్సుతాయ నమః

ఓం పుళిందకన్యాభర్త్రే నమః

ఓం మహాసారస్వతావృతాయ నమః (80)

ఓం ఆశ్రితాఖిలదాత్రే నమః

ఓం చోరఘ్నాయ నమః

ఓం రోగనాశనాయ నమః

ఓం అనంతమూర్తయే నమః

ఓం ఆనందాయ నమః

ఓం శిఖిండికృత కేతనాయ నమః

ఓం డంభాయ నమః

ఓం పరమడంభాయ నమః

ఓం మహాడంభాయ నమః

ఓం వృషాకపయే నమః (90)

ఓం కారణోపాత్తదేహాయ నమః

ఓం కారణాతీతవిగ్రహాయ నమః

ఓం అనీశ్వరాయ నమః

ఓం అమృతాయ నమః

ఓం ప్రాణాయ నమః

ఓం ప్రాణాయామపరాయణాయ నమః

ఓం విరుద్ధహంత్రే నమః

ఓం వీరఘ్నాయ నమః

ఓం రక్తశ్యామగళాయ నమః

ఓం సుబ్రహ్మణ్యాయ నమః (100)

ఓం గుహాయ నమః

ఓం ప్రీతాయ నమః

ఓం బ్రాహ్మణ్యాయ నమః

ఓం బ్రాహ్మణప్రియాయ నమః

ఓం వంశవృద్ధికరాయ నమః

ఓం వేదాయ నమః

ఓం వేద్యాయ నమః

ఓం అక్షయఫలప్రదాయ నమః (108)


ఇతి శ్రీసుబ్రహ్మణ్యాష్టోత్తరశతనామావళిః సమాప్తా

భగవద్గీత

 అధ్యాయం 6

శ్లోకం 42

అథవా యోగినామేవ కులే భవతి ధీమతామ్ |

ఏతద్ది దుర్లభతరం లోకే జన్మ యదీదృశమ్ ||

అర్ధం :-

విరాగియైన పురుషుడు ఆ పుణ్య (ఊర్ధ్వ)లోకములకు వెలకుండగానే జ్ఞానులైన యోగులకుటుంబములోనే జన్మిస్తాడు. కాని లోకమునందు ఇటువంటి జన్మ లభించటం మిక్కిలి దుర్లభము. 


శ్రీ రుద్రం నమకం చమకం

శ్రీ రుద్రం నమకం చమకం


శ్రీ రుద్ర ప్రశ్నః


కృష్ణ యజుర్వేదీయ తైత్తిరీయ సంహితా

చతుర్థం వైశ్వదేవం కాండమ్ పంచమః ప్రపాఠకః


ఓం నమో భగవతే’ రుద్రాయ ||

నమ’స్తే రుద్ర మన్యవ’ ఉతోత ఇష’వే నమః’ | నమ’స్తే అస్తు ధన్వ’నే బాహుభ్యా’ముత తే నమః’ | యా త ఇషుః’ శివత’మా శివం బభూవ’ తే ధనుః’ | శివా శ’రవ్యా’ యా తవ తయా’ నో రుద్ర మృడయ | యా తే’ రుద్ర శివా తనూరఘోరా‌உపా’పకాశినీ | తయా’ నస్తనువా శంత’మయా గిరి’శంతాభిచా’కశీహి | యామిషుం’ గిరిశంత హస్తే బిభర్ష్యస్త’వే | శివాం గి’రిత్ర తాం కు’రు మా హిగ్‍మ్’సీః పురు’షం జగ’త్| శివేన వచ’సా త్వా గిరిశాచ్ఛా’వదామసి | యథా’ నః సర్వమిజ్జగ’దయక్ష్మగ్‍మ్ సుమనా అస’త్ | అధ్య’వోచదధివక్తా ప్ర’థమో దైవ్యో’ భిషక్ | అహీగ్’‍శ్చ సర్వాం”జంభయంత్సర్వా”శ్చ యాతుధాన్యః’ | అసౌ యస్తామ్రో అ’రుణ ఉత బభ్రుః సు’మంగళః’ | యే చేమాగ్‍మ్ రుద్రా అభితో’ దిక్షు శ్రితాః స’హస్రశో‌உవైషాగ్ం హేడ’ ఈమహే | అసౌ యో’‌உవసర్ప’తి నీల’గ్రీవో విలో’హితః | ఉతైనం’ గోపా అ’దృశన్-నదృ’శన్-నుదహార్యః’ | ఉతైనం విశ్వా’ భూతాని స దృష్టో మృ’డయాతి నః | నమో’ అస్తు నీల’గ్రీవాయ సహస్రాక్షాయ మీఢుషే” | అథో యే అ’స్య సత్వా’నో‌உహం తేభ్యో’‌உకరన్నమః’ | ప్రముం’చ ధన్వ’నస్-త్వముభయోరార్త్ని’ యోర్జ్యామ్ | యాశ్చ తే హస్త ఇష’వః పరా తా భ’గవో వప | అవతత్య ధనుస్త్వగ్‍మ్ సహ’స్రాక్ష శతే’షుధే | నిశీర్య’ శల్యానాం ముఖా’ శివో నః’ సుమనా’ భవ | విజ్యం ధనుః’ కపర్దినో విశ’ల్యో బాణ’వాగ్మ్ ఉత | అనే’శన్-నస్యేష’వ ఆభుర’స్య నిషంగథిః’ | యా తే’ హేతిర్-మీ’డుష్టమ హస్తే’ బభూవ’ తే ధనుః’ | తయా‌உస్మాన్, విశ్వతస్-త్వమ’యక్ష్మయా పరి’బ్భుజ | నమ’స్తే అస్త్వాయుధాయానా’తతాయ ధృష్ణవే” | ఉభాభ్యా’ముత తే నమో’ బాహుభ్యాం తవ ధన్వ’నే | పరి’ తే ధన్వ’నో హేతిరస్మాన్-వృ’ణక్తు విశ్వతః’ | అథో య ఇ’షుధిస్తవారే అస్మన్నిధే’హి తమ్ || 1 ||


శంభ’వే నమః’ | నమ’స్తే అస్తు భగవన్-విశ్వేశ్వరాయ’ మహాదేవాయ’ త్ర్యంబకాయ’ త్రిపురాంతకాయ’ త్రికాగ్నికాలాయ’ కాలాగ్నిరుద్రాయ’ నీలకంఠాయ’ మృత్యుంజయాయ’ సర్వేశ్వ’రాయ’ సదాశివాయ’ శ్రీమన్-మహాదేవాయ నమః’ ||


నమో హిర’ణ్య బాహవే సేనాన్యే’ దిశాం చ పత’యే నమో నమో’ వృక్షేభ్యో హరి’కేశేభ్యః పశూనాం పత’యే నమో నమః’ సస్పింజ’రాయ త్విషీ’మతే పథీనాం పత’యే నమో నమో’ బభ్లుశాయ’ వివ్యాధినే‌உన్నా’నాం పత’యే నమో నమో హరి’కేశాయోపవీతినే’ పుష్టానాం పత’యే నమో నమో’ భవస్య’ హేత్యై జగ’తాం పత’యే నమో నమో’ రుద్రాయా’తతావినే క్షేత్రా’ణాం పత’యే నమో నమః’ సూతాయాహం’త్యాయ వనా’నాం పత’యే నమో నమో రోహి’తాయ స్థపత’యే వృక్షాణాం పత’యే నమో నమో’ మంత్రిణే’ వాణిజాయ కక్షా’ణాం పత’యే నమో నమో’ భువంతయే’ వారివస్కృతా-యౌష’ధీనాం పత’యే నమో నమ’ ఉచ్చైర్-ఘో’షాయాక్రందయ’తే పత్తీనాం పత’యే నమో నమః’ కృత్స్నవీతాయ ధావ’తే సత్త్వ’నాం పత’యే నమః’ || 2 ||


నమః సహ’మానాయ నివ్యాధిన’ ఆవ్యాధినీ’నాం పత’యే నమో నమః’ కకుభాయ’ నిషంగిణే” స్తేనానాం పత’యే నమో నమో’ నిషంగిణ’ ఇషుధిమతే’ తస్క’రాణాం పత’యే నమో నమో వంచ’తే పరివంచ’తే స్తాయూనాం పత’యే నమో నమో’ నిచేరవే’ పరిచరాయార’ణ్యానాం పత’యే నమో నమః’ సృకావిభ్యో జిఘాగ్‍మ్’సద్భ్యో ముష్ణతాం పత’యే నమో నమో’‌உసిమద్భ్యో నక్తంచర’ద్భ్యః ప్రకృంతానాం పత’యే నమో నమ’ ఉష్ణీషినే’ గిరిచరాయ’ కులుంచానాం పత’యే నమో నమ ఇషు’మద్భ్యో ధన్వావిభ్య’శ్చ వో నమో నమ’ ఆతన్-వానేభ్యః’ ప్రతిదధా’నేభ్యశ్చ వో నమో నమ’ ఆయచ్ఛ’ద్భ్యో విసృజద్-భ్య’శ్చ వో నమో నమో‌உస్స’ద్భ్యో విద్య’ద్-భ్యశ్చ వో నమో నమ ఆసీ’నేభ్యః శయా’నేభ్యశ్చ వో నమో నమః’ స్వపద్భ్యో జాగ్ర’ద్-భ్యశ్చ వో నమో నమస్తిష్ఠ’ద్భ్యో ధావ’ద్-భ్యశ్చ వో నమో నమః’ సభాభ్యః’ సభాప’తిభ్యశ్చ వో నమో నమో అశ్వేభ్యో‌உశ్వ’పతిభ్యశ్చ వో నమః’ || 3 ||


నమ’ ఆవ్యాధినీ”భ్యో వివిధ్య’ంతీభ్యశ్చ వో నమో నమ ఉగ’ణాభ్యస్తృగం-హతీభ్యశ్చ’ వో నమో నమో’ గృత్సేభ్యో’ గృత్సప’తిభ్యశ్చ వో నమో నమో వ్రాతే”భ్యో వ్రాత’పతిభ్యశ్చ వో నమో నమో’ గణేభ్యో’ గణప’తిభ్యశ్చ వో నమో నమో విరూ’పేభ్యో విశ్వరూ’పేభ్యశ్చ వో నమో నమో’ మహద్భ్యః’, క్షుల్లకేభ్య’శ్చ వో నమో నమో’ రథిభ్యో‌உరథేభ్య’శ్చ వో నమో నమో రథే”భ్యో రథ’పతిభ్యశ్చ వో నమో నమః’ సేనా”భ్యః సేనానిభ్య’శ్చ వో నమో నమః’, క్షత్తృభ్యః’ సంగ్రహీతృభ్య’శ్చ వో నమో నమస్తక్ష’భ్యో రథకారేభ్య’శ్చ వో నమో’ నమః కులా’లేభ్యః కర్మారే”భ్యశ్చ వో నమో నమః’ పుంజిష్టే”భ్యో నిషాదేభ్య’శ్చ వో నమో నమః’ ఇషుకృద్భ్యో’ ధన్వకృద్-భ్య’శ్చ వో నమో నమో’ మృగయుభ్యః’ శ్వనిభ్య’శ్చ వో నమో నమః శ్వభ్యః శ్వప’తిభ్యశ్చ వో నమః’ || 4 ||


నమో’ భవాయ’ చ రుద్రాయ’ చ నమః’ శర్వాయ’ చ పశుపత’యే చ నమో నీల’గ్రీవాయ చ శితికంఠా’య చ నమః’ కపర్ధినే’ చ వ్యు’ప్తకేశాయ చ నమః’ సహస్రాక్షాయ’ చ శతధ’న్వనే చ నమో’ గిరిశాయ’ చ శిపివిష్టాయ’ చ నమో’ మీఢుష్ట’మాయ చేషు’మతే చ నమో” హ్రస్వాయ’ చ వామనాయ’ చ నమో’ బృహతే చ వర్షీ’యసే చ నమో’ వృద్ధాయ’ చ సంవృధ్వ’నే చ నమో అగ్రి’యాయ చ ప్రథమాయ’ చ నమ’ ఆశవే’ చాజిరాయ’ చ నమః శీఘ్రి’యాయ చ శీభ్యా’య చ నమ’ ఊర్మ్యా’య చావస్వన్యా’య చ నమః’ స్త్రోతస్యా’య చ ద్వీప్యా’య చ || 5 ||


నమో” జ్యేష్ఠాయ’ చ కనిష్ఠాయ’ చ నమః’ పూర్వజాయ’ చాపరజాయ’ చ నమో’ మధ్యమాయ’ చాపగల్భాయ’ చ నమో’ జఘన్యా’య చ బుధ్ని’యాయ చ నమః’ సోభ్యా’య చ ప్రతిసర్యా’య చ నమో యామ్యా’య చ క్షేమ్యా’య చ నమ’ ఉర్వర్యా’య చ ఖల్యా’య చ నమః శ్లోక్యా’య చా‌உవసాన్యా’య చ నమో వన్యా’య చ కక్ష్యా’య చ నమః’ శ్రవాయ’ చ ప్రతిశ్రవాయ’ చ నమ’ ఆశుషే’ణాయ చాశుర’థాయ చ నమః శూరా’య చావభిందతే చ నమో’ వర్మిణే’ చ వరూధినే’ చ నమో’ బిల్మినే’ చ కవచినే’ చ నమః’ శ్రుతాయ’ చ శ్రుతసే’నాయ చ || 6 ||


నమో’ దుందుభ్యా’య చాహనన్యా’య చ నమో’ ధృష్ణవే’ చ ప్రమృశాయ’ చ నమో’ దూతాయ’ చ ప్రహి’తాయ చ నమో’ నిషంగిణే’ చేషుధిమతే’ చ నమ’స్-తీక్ష్ణేష’వే చాయుధినే’ చ నమః’ స్వాయుధాయ’ చ సుధన్వ’నే చ నమః స్రుత్యా’య చ పథ్యా’య చ నమః’ కాట్యా’య చ నీప్యా’య చ నమః సూద్యా’య చ సరస్యా’య చ నమో’ నాద్యాయ’ చ వైశంతాయ’ చ నమః కూప్యా’య చావట్యా’య చ నమో వర్ష్యా’య చావర్ష్యాయ’ చ నమో’ మేఘ్యా’య చ విద్యుత్యా’య చ నమ ఈధ్రియా’య చాతప్యా’య చ నమో వాత్యా’య చ రేష్మి’యాయ చ నమో’ వాస్తవ్యా’య చ వాస్తుపాయ’ చ || 7 ||


నమః సోమా’య చ రుద్రాయ’ చ నమ’స్తామ్రాయ’ చారుణాయ’ చ నమః’ శంగాయ’ చ పశుపత’యే చ నమ’ ఉగ్రాయ’ చ భీమాయ’ చ నమో’ అగ్రేవధాయ’ చ దూరేవధాయ’ చ నమో’ హంత్రే చ హనీ’యసే చ నమో’ వృక్షేభ్యో హరి’కేశేభ్యో నమ’స్తారాయ నమ’శ్శంభవే’ చ మయోభవే’ చ నమః’ శంకరాయ’ చ మయస్కరాయ’ చ నమః’ శివాయ’ చ శివత’రాయ చ నమస్తీర్థ్యా’య చ కూల్యా’య చ నమః’ పార్యా’య చావార్యా’య చ నమః’ ప్రతర’ణాయ చోత్తర’ణాయ చ నమ’ ఆతార్యా’య చాలాద్యా’య చ నమః శష్ప్యా’య చ ఫేన్యా’య చ నమః’ సికత్యా’య చ ప్రవాహ్యా’య చ || 8 ||


నమ’ ఇరిణ్యా’య చ ప్రపథ్యా’య చ నమః’ కిగ్ంశిలాయ’ చ క్షయ’ణాయ చ నమః’ కపర్దినే’ చ పులస్తయే’ చ నమో గోష్ఠ్యా’య చ గృహ్యా’య చ నమస్-తల్ప్యా’య చ గేహ్యా’య చ నమః’ కాట్యా’య చ గహ్వరేష్ఠాయ’ చ నమో” హృదయ్యా’య చ నివేష్ప్యా’య చ నమః’ పాగ్‍మ్ సవ్యా’య చ రజస్యా’య చ నమః శుష్క్యా’య చ హరిత్యా’య చ నమో లోప్యా’య చోలప్యా’య చ నమ’ ఊర్మ్యా’య చ సూర్మ్యా’య చ నమః’ పర్ణ్యాయ చ పర్ణశద్యా’య చ నమో’‌உపగురమా’ణాయ చాభిఘ్నతే చ నమ’ ఆఖ్ఖిదతే చ ప్రఖ్ఖిదతే చ నమో’ వః కిరికేభ్యో’ దేవానాగ్ం హృద’యేభ్యో నమో’ విక్షీణకేభ్యో నమో’ విచిన్వత్-కేభ్యో నమ’ ఆనిర్ హతేభ్యో నమ’ ఆమీవత్-కేభ్యః’ || 9 ||


ద్రాపే అంధ’సస్పతే దరి’ద్రన్-నీల’లోహిత | ఏషాం పురు’షాణామేషాం ప’శూనాం మా భేర్మా‌உరో మో ఏ’షాం కించనామ’మత్ | యా తే’ రుద్ర శివా తనూః శివా విశ్వాహ’భేషజీ | శివా రుద్రస్య’ భేషజీ తయా’ నో మృడ జీవసే” || ఇమాగ్‍మ్ రుద్రాయ’ తవసే’ కపర్దినే” క్షయద్వీ’రాయ ప్రభ’రామహే మతిమ్ | యథా’ నః శమస’ద్ ద్విపదే చతు’ష్పదే విశ్వం’ పుష్టం గ్రామే’ అస్మిన్ననా’తురమ్ | మృడా నో’ రుద్రోత నో మయ’స్కృధి క్షయద్వీ’రాయ నమ’సా విధేమ తే | యచ్ఛం చ యోశ్చ మను’రాయజే పితా తద’శ్యామ తవ’ రుద్ర ప్రణీ’తౌ | మా నో’ మహాంత’ముత మా నో’ అర్భకం మా న ఉక్ష’ంతముత మా న’ ఉక్షితమ్ | మా నో’‌உవధీః పితరం మోత మాతరం’ ప్రియా మా న’స్తనువో’ రుద్ర రీరిషః | మా న’స్తోకే తన’యే మా న ఆయు’షి మా నో గోషు మా నో అశ్వే’షు రీరిషః | వీరాన్మా నో’ రుద్ర భామితో‌உవ’ధీర్-హవిష్మ’ంతో నమ’సా విధేమ తే | ఆరాత్తే’ గోఘ్న ఉత పూ’రుషఘ్నే క్షయద్వీ’రాయ సుమ్-నమస్మే తే’ అస్తు | రక్షా’ చ నో అధి’ చ దేవ బ్రూహ్యథా’ చ నః శర్మ’ యచ్ఛ ద్విబర్హా”ః | స్తుహి శ్రుతం గ’ర్తసదం యువా’నం మృగన్న భీమము’పహంతుముగ్రమ్ | మృడా జ’రిత్రే రు’ద్ర స్తవా’నో అన్యంతే’ అస్మన్నివ’పంతు సేనా”ః | పరి’ణో రుద్రస్య’ హేతిర్-వృ’ణక్తు పరి’ త్వేషస్య’ దుర్మతి ర’ఘాయోః | అవ’ స్థిరా మఘవ’ద్-భ్యస్-తనుష్వ మీఢ్-వ’స్తోకాయ తన’యాయ మృడయ | మీఢు’ష్టమ శివ’మత శివో నః’ సుమనా’ భవ | పరమే వృక్ష ఆయు’ధన్నిధాయ కృత్తిం వసా’న ఆచ’ర పినా’కం బిభ్రదాగ’హి | వికి’రిద విలో’హిత నమ’స్తే అస్తు భగవః | యాస్తే’ సహస్రగ్‍మ్’ హేతయోన్యమస్మన్-నివపంతు తాః | సహస్రా’ణి సహస్రధా బా’హువోస్తవ’ హేతయః’ | తాసామీశా’నో భగవః పరాచీనా ముఖా’ కృధి || 10 ||


సహస్రా’ణి సహస్రశో యే రుద్రా అధి భూమ్యా”మ్ | తేషాగ్‍మ్’ సహస్రయోజనే‌உవధన్వా’ని తన్మసి | అస్మిన్-మ’హత్-య’ర్ణవే”‌உంతరి’క్షే భవా అధి’ | నీల’గ్రీవాః శితికంఠా”ః శర్వా అధః, క్ష’మాచరాః | నీల’గ్రీవాః శితికంఠా దివగ్‍మ్’ రుద్రా ఉప’శ్రితాః | యే వృక్షేషు’ సస్పింజ’రా నీల’గ్రీవా విలో’హితాః | యే భూతానామ్-అధి’పతయో విశిఖాసః’ కపర్ది’నః | యే అన్నే’షు వివిధ్య’ంతి పాత్రే’షు పిబ’తో జనాన్’ | యే పథాం ప’థిరక్ష’య ఐలబృదా’ యవ్యుధః’ | యే తీర్థాని’ ప్రచర’ంతి సృకావ’ంతో నిషంగిణః’ | య ఏతావ’ంతశ్చ భూయాగ్‍మ్’సశ్చ దిశో’ రుద్రా వి’తస్థిరే | తేషాగ్‍మ్’ సహస్రయోజనే‌உవధన్వా’ని తన్మసి | నమో’ రుధ్రేభ్యో యే పృ’థివ్యాం యే”‌உంతరి’క్షే యే దివి యేషామన్నం వాతో’ వర్-షమిష’వస్-తేభ్యో దశ ప్రాచీర్దశ’ దక్షిణా దశ’ ప్రతీచీర్-దశో-దీ’చీర్-దశోర్ధ్వాస్-తేభ్యో నమస్తే నో’ మృడయంతు తే యం ద్విష్మో యశ్చ’ నో ద్వేష్టి తం వో జంభే’ దధామి || 11 ||


త్ర్యం’బకం యజామహే సుగంధిం పు’ష్టివర్ధ’నమ్ | ఉర్వారుకమి’వ బంధ’నాన్-మృత్యో’ర్-ముక్షీయ మా‌உమృతా”త్ | యో రుద్రో అగ్నౌ యో అప్సు య ఓష’ధీషు యో రుద్రో విశ్వా భువ’నా వివేశ తస్మై’ రుద్రాయ నమో’ అస్తు | తము’ ష్టుహి యః స్విషుః సుధన్వా యో విశ్వ’స్య క్షయ’తి భేషజస్య’ | యక్ష్వా”మహే సౌ”మనసాయ’ రుద్రం నమో”భిర్-దేవమసు’రం దువస్య | అయం మే హస్తో భగ’వానయం మే భగ’వత్తరః | అయం మే” విశ్వభే”షజో‌உయగ్‍మ్ శివాభి’మర్శనః | యే తే’ సహస్ర’మయుతం పాశా మృత్యో మర్త్యా’య హంత’వే | తాన్ యఙ్ఞస్య’ మాయయా సర్వానవ’ యజామహే | మృత్యవే స్వాహా’ మృత్యవే స్వాహా” | ప్రాణానాం గ్రంథిరసి రుద్రో మా’ విశాంతకః | తేనాన్నేనా”ప్యాయస్వ ||

ఓం నమో భగవతే రుద్రాయ విష్ణవే మృత్యు’ర్మే పాహి ||


సదాశివోమ్ |


ఓం శాంతిః శాంతిః శాంతిః’



శ్రీ వేంకటేశ్వర అష్టోత్తర శత నామావళి

శ్రీ వేంకటేశ్వర అష్టోత్తర శత నామావళి


ఓం శ్రీ వేంకటేశాయ నమః

ఓం శ్రీనివాసాయ నమః

ఓం లక్ష్మీపతయే నమః

ఓం అనామయాయ నమః

ఓం అమృతాశాయ నమః

ఓం జగద్వంద్యాయ నమః

ఓం గోవిందాయ నమః

ఓం శాశ్వతాయ నమః

ఓం ప్రభవే నమః

ఓం శేషాద్రినిలయాయ నమః (10)

ఓం దేవాయ నమః

ఓం కేశవాయ నమః

ఓం మధుసూదనాయ నమః

ఓం అమృతాయ నమః

ఓం మాధవాయ నమః

ఓం కృష్ణాయ నమః

ఓం శ్రీహరయే నమః

ఓం జ్ఞానపంజరాయ నమః

ఓం శ్రీవత్సవక్షసే నమః (20)

ఓం గోపాలాయ నమః

ఓం పురుషోత్తమాయ నమః

ఓం గోపీశ్వరాయ నమః

ఓం పరస్మై జ్యోతిషే నమః

ఓం వ్తెకుంఠ పతయే నమః

ఓం అవ్యయాయ నమః

ఓం సుధాతనవే నమః

ఓం యాదవేంద్రాయ నమః

ఓం నిత్య యౌవనరూపవతే నమః

ఓం చతుర్వేదాత్మకాయ నమః (30)

ఓం విష్ణవే నమః

ఓం అచ్యుతాయ నమః

ఓం పద్మినీప్రియాయ నమః

ఓం ధరాపతయే నమః

ఓం సురపతయే నమః

ఓం నిర్మలాయ నమః

ఓం దేవపూజితాయ నమః

ఓం చతుర్భుజాయ నమః

ఓం చక్రధరాయ నమః

ఓం త్రిధామ్నే నమః (40)

ఓం త్రిగుణాశ్రయాయ నమః

ఓం నిర్వికల్పాయ నమః

ఓం నిష్కళంకాయ నమః

ఓం నిరాంతకాయ నమః

ఓం నిరంజనాయ నమః

ఓం విరాభాసాయ నమః

ఓం నిత్యతృప్తాయ నమః

ఓం నిర్గుణాయ నమః

ఓం నిరుపద్రవాయ నమః

ఓం గదాధరాయ నమః (50)

ఓం శారంగపాణయే నమః

ఓం నందకినే నమః

ఓం శంఖధారకాయ నమః

ఓం అనేకమూర్తయే నమః

ఓం అవ్యక్తాయ నమః

ఓం కటిహస్తాయ నమః

ఓం వరప్రదాయ నమః

ఓం అనేకాత్మనే నమః

ఓం దీనబంధవే నమః

ఓం ఆర్తలోకాభయప్రదాయ నమః (60)

ఓం ఆకాశరాజవరదాయ నమః

ఓం యోగిహృత్పద్మమందిరాయ నమః

ఓం దామోదరాయ నమః

ఓం జగత్పాలాయ నమః

ఓం పాపఘ్నాయ నమః

ఓం భక్తవత్సలాయ నమః

ఓం త్రివిక్రమాయ నమః

ఓం శింశుమారాయ నమః

ఓం జటామకుట శోభితాయ నమః

ఓం శంఖమద్యోల్ల సన్మంజుకింకిణ్యాఢ్యకరండకాయ నమః (70)

ఓం నీలమోఘశ్యామ తనవే నమః

ఓం బిల్వపత్రార్చన ప్రియాయ నమః

ఓం జగద్వ్యాపినే నమః

ఓం జగత్కర్త్రే నమః

ఓం జగత్సాక్షిణే నమః

ఓం జగత్పతయే నమః

ఓం చింతితార్థప్రదాయ నమః

ఓం జిష్ణవే నమః

ఓం దాశార్హాయ నమః

ఓం దశరూపవతే నమః (80)

ఓం దేవకీ నందనాయ నమః

ఓం శౌరయే నమః

ఓం హయగ్రీవాయ నమః

ఓం జనార్దనాయ నమః

ఓం కన్యాశ్రవణతారేజ్యాయ నమః

ఓం పీతాంబరధరాయ నమః

ఓం అనఘాయ నమః

ఓం వనమాలినే నమః

ఓం పద్మనాభాయ నమః

ఓం మృగయాసక్త మానసాయ నమః (90)

ఓం అశ్వారూఢాయ నమః

ఓం ఖడ్గధారిణే నమః

ఓం ధనార్జన సముత్సుకాయ నమః

ఓం ఘనసార లసన్మధ్యకస్తూరీ తిలకోజ్జ్వలాయ నమః

ఓం సచ్చితానందరూపాయ నమః

ఓం జగన్మంగళ దాయకాయ నమః

ఓం యజ్ఞరూపాయ నమః

ఓం యజ్ఞభోక్త్రే నమః

ఓం చిన్మయాయ నమః

ఓం పరమేశ్వరాయ నమః (100)

ఓం పరమార్ధప్రదాయకాయ నమః

ఓం శాంతాయ నమః

ఓం శ్రీమతే నమః

ఓం దోర్దండ విక్రమాయ నమః

ఓం పరాత్పరాయ నమః

ఓం పరస్మై బ్రహ్మణే నమః

ఓం శ్రీవిభవే నమః

ఓం జగదీశ్వరాయ నమః (108)


ఇతి శ్రీవేంకటేశ్వరాష్టోత్తర శతనామావళీస్సంపుర్ణా

శ్రీ షిరిడీ సాయి అష్టోత్తర శతనామావళి

శ్రీ షిరిడీ సాయి అష్టోత్తర శతనామావళి



ఓం  శ్రీ సాయి నాథాయ నమః

ఓం  లక్ష్మీ నారాయణాయ నమః

ఓం  శ్రీకృష్ణ శివమారుత్యాది రూపాయ నమః

ఓం  శేషశాయినే నమః

ఓం  గొదావరీతట షిరిడివాసినే నమః

ఓం  భక్త హృదాలయాయ నమః

ఓం  సర్వ హృన్నిలయాయ నమః

ఓం  భూతవాసాయ నమః

ఓం  భూత భవిష్యత్ భావ వర్జితాయ నమః

ఓం  కాలాతీతాయ నమః (10)

ఓం  కాలాయ నమః

ఓం  కాల కాలాయ నమః

ఓం  కాలదర్ప దమనాయ నమః

ఓం  మృత్యుంజయాయ నమః

ఓం  అమర్త్యాయ నమః

ఓం  మర్త్యాభయప్రదాయ నమః

ఓం  జీవాధారాయ నమః

ఓం  సర్వాధారాయ నమః

ఓం  భక్తావన సమర్థాయ నమః

ఓం  భక్తావన ప్రతిఙ్ఞాయ నమః (20)

ఓం  అన్నవస్త్రదాయ నమః

ఓం  ఆరోగ్య క్షేమదాయ నమః

ఓం  ధన మాంగల్య ప్రదాయ నమః

ఓం  బుద్ధి సిద్ధి ప్రదాయ నమః

ఓం  పుత్రమిత్రకళత్ర బంధుదాయ నమః

ఓం  యోగక్షేమవహాయ నమః

ఓం  ఆపద్బాంధవాయ నమః

ఓం  మార్గబంధవే నమః

ఓం  భుక్తి ముక్తి స్వర్గాపవర్గదాయ నమః

ఓం  ప్రియాయ నమః (30)

ఓం  ప్రీతి వర్ధనాయ నమః

ఓం  అంతర్యామినే నమః

ఓం  సచ్చిదాత్మనే నమః

ఓం  నిత్యానందాయ నమః

ఓం  పరమసుఖదాయ నమః

ఓం  పరమేశ్వరాయ నమః

ఓం  పరబ్రహ్మణే నమః

ఓం  పరమాత్మనే నమః

ఓం  ఙ్ఞానస్వరూపిణే నమః

ఓం  జగతః పిత్రే నమః (40)

ఓం  భక్తానాం మాతృదాతృ పితామహాయ నమః

ఓం  భక్తాభయప్రదాయ నమః

ఓం  భక్తపరాధీనాయ నమః

ఓం  భక్తానుగ్రహకరాయ నమః

ఓం  శరణాగత వత్సలాయ నమః

ఓం  భక్తి శక్తి ప్రదాయ నమః

ఓం  ఙ్ఞాన వైరాగ్య ప్రదాయ నమః

ఓం  ప్రేమప్రదాయ నమః

ఓం  దౌర్బల్య పాపకర్మ సంక్షయ హృదయవాసనా క్షయకరాయ నమః

ఓం  హృదయగ్రంధి భేదకాయ నమః (50)

ఓం  కర్మధ్వంసినే నమః

ఓం  శుద్ధ సత్వ స్థితాయ నమః

ఓం  గుణాతీత గుణాత్మనే నమః

ఓం  అనంత కల్యాణగుణాయ నమః

ఓం  అమిత పరాక్రమాయ నమః

ఓం  జయినే నమః

ఓం  దుర్దర్ష క్షోభ్యాయ నమః

ఓం  అపరాజితాయ నమః

ఓం  త్రిలోకేశు అవిఘాత గతయే నమః

ఓం  అశక్య రహితాయ నమః (60)

ఓం  సర్వ శక్తి మూర్తయే నమః

ఓం  సురూప సుందరాయ నమః

ఓం  సులోచనాయ నమః

ఓం  బహురూప విశ్వమూర్తయే నమః

ఓం  అరూప అవ్యక్తాయ నమః

ఓం  అచింత్యాయ నమః

ఓం  సూక్ష్మాయ నమః

ఓం  సర్వాంతర్యామినే నమః

ఓం  మనోవాగతీతాయ నమః

ఓం  ప్రేమమూర్తయే నమః (70)

ఓం  సులభదుర్లభాయ నమః

ఓం  అసహాయ సహాయాయ నమః

ఓం  అనాథనాథ దీనబాంధవే నమః

ఓం  సర్వభారభృతే నమః

ఓం  అకర్మానేక కర్మ సుకర్మణే నమః

ఓం  పుణ్యశ్రవణకీర్తనాయ నమః

ఓం  తీర్థాయ నమః

ఓం  వాసుదేవాయ నమః

ఓం  సతాంగతయే నమః

ఓం  సత్పరాయణాయ నమః (80)

ఓం  లోకనాథాయ నమః

ఓం  పావనానఘాయ నమః

ఓం  అమృతాంశవే నమః

ఓం  భాస్కర ప్రభాయ నమః

ఓం  బ్రహ్మచర్య తపశ్చర్యాది సువ్రతాయ నమః

ఓం  సత్యధర్మ పరాయణాయ నమః

ఓం  సిద్ధేశ్వరాయ నమః

ఓం  సిద్ధ సంకల్పాయ నమః

ఓం  యోగేశ్వరాయ నమః

ఓం  భగవతే నమః (90)

ఓం  భక్త వత్సలాయ నమః

ఓం  సత్పురుషాయ నమః

ఓం  పురుషోత్తమాయ నమః

ఓం  సత్య తత్వ బోధకాయ నమః

ఓం  కామాది షడ్వైరి ధ్వంసినే నమః

ఓం  అభేదానందానుభవ ప్రదాయ నమః

ఓం  సమసర్వమత సమ్మతాయ నమః

ఓం  శ్రీ దక్షిణా మూర్తయే నమః

ఓం  శ్రీ వేంకటేశ రమణాయ నమః

ఓం  అద్భుతానంతచర్యాయ నమః (100)

ఓం  ప్రపన్నార్తిహరాయ నమః

ఓం  సంసార సర్వ దుఖః క్షయకరాయ నమః

ఓం  సర్వ విత్సర్వతో ముఖాయ నమః

ఓం  సర్వాంతర్బహిస్థితాయ నమః

ఓం  సర్వ మంగళకరాయ నమః

ఓం  సర్వాభీష్టప్రదాయ నమః

ఓం  సమరస సన్మార్గ స్థాపనాయ నమః

ఓం  సమర్థ సద్గురు సాయి నాథాయ నమః (108)

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయి నాథ్ మహారాజ్ కి జై!












భగవద్గీత

 అధ్యాయం 6

శ్లోకం 41

ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ ఉషిత్వా శాశ్వతీః  సమాః |

శుచినాం శ్రీ మతాం గేహే యోగభ్రష్టో భిజాయతే ||

అర్ధం :-

యోగభ్రష్టుడు పుణ్యాతులు పొందు లోకములను అనగా స్వర్గాది ఉత్తమ లోకములను పొంది, ఆయా లోకములలో పెక్కు సంవత్సరములు గడిపి, పిదప పవిత్రులైన సంపన్నుల గృహమున జన్మించును.



        

శ్రీకాళహస్తి సమాచారం

 శ్రీకాళహస్తి దేవస్థానం నిత్య సేవలు 


దోష పూజ:

అన్ని రోజులలో 6.00 AM - 6.00 PM


అభిషేకం:

స్లాట్ 1 (ప్రధమ) -5.30, స్లాట్ 2 (ద్వితీయ) -AM 6.30 AM, స్లాట్ 3 (ఉచ్చి) -10.00AM శని, ఆది, సోమవారాల్లో


స్లాట్ 1 (ప్రధమ) -6.00, స్లాట్ 2 (ద్వితీయ) -AM 7.00 AM, స్లాట్ 3 (ఉచ్చి) -10.00AM మంగళవారం, బుధ, గురు, శుక్రవారాల్లో


స్లాట్ 4 (ప్రదోష) - 5.00 PM, శని, ఆది, సోమ, మంగళ, బుధ, గురువారాలలో


స్లాట్ 4 (ప్రదోష) - 4.00 PM మాత్రమే శుక్రవారం


దర్శనం:

5.30 AM - 9.30 PM శని, ఆది, సోమవారాల్లో


5.30 AM - మంగళ, బుధ, గురు, శుక్రవారాల్లో 9.00 PM


సుప్రబాత సేవ:

5.00 AM - 5.30 AM శని, ఆది, సోమవారాలలో


బుధవారం, బుధ, గురు, శుక్రవారాల్లో ఉదయం 5.30 - 6.00 AM


గోపూజ:

4.30 AM - 5.00 AM శని, ఆది, సోమవారాలలో


బుధవారం, బుధ, గురు, శుక్రవారాలలో 5.00 AM - 5.30 AM

శ్రీ కాళ హస్తి రాహు కేతు

పూజ సమయం మరియు

పూజ స్థలం .

శ్రీకాళహస్తి ఆలయ సమయాలు:

6.00 AM నుండి 9.00 PM వరకు


శ్రీకాళహస్తి రాహు కేతు

పూజ టిక్కెట్ ధరలు:

రూ .500, రూ .750, రూ. 1500, రూ. 2500, 

రూ .5000


తిరుమల సమాచారం





ఈ రోజు తిరుమలలో స్వామివారి నిత్య కైంకర్యాలు 

25-08=2021 బుధవారం 



02: 30-03: 00 గంటలు

సుప్రభాతం

03:30 - 04:00 గంటలు

తోమల సేవ

04:00 - 04:15 గంటలు

బంగారు వాకిలి (ఏకాంతం) లోపల కొలువు మరియు పంచాంగ శ్రవణం

04:15 - 05:00 గంటలు

మొదటి అర్చన అంటే సహస్రనామ అర్చన (ఏకాంతం)

06:00 - 08:00 గంటలు

సహస్ర కలశ అభిషేకం రెండవ అర్చన (ఏకాంతం) మరియు గంట 

09:30 - 19:00 గంటలు

సర్వదర్శనం

12:00 - 17:00 గంటలు

కళ్యాణోత్సవం, బ్రహ్మోస్తవం, వసంతోస్తవం, ఊంజల్ సేవ

17:30 - 18:30 గంటలు

సహస్ర దీపాలంకరణ సేవ

19:00 - 20:00 గంటలు

సుద్ధి, రాత్రి కైంకర్యాలు (ఏకాంతం) మరియు రాత్రి గంట 

20:00 - 00:30 గంటలు

సర్వదర్శనం

00:30 - 00:45 గంటలు

సుద్ది మరియు ఏకాంత సేవ కోసం సన్నాహాలు

00:45 గంటలు

ఏకాంత సేవ


పంచాంగం

పంచాంగం 



25 -08-2021 

శ్రావణ మాసం - ప్లవ నామ - దక్షిణాయనం

వర్ష ఋతువు, కృష్ణ పక్షం 

సూర్యోదయం  : 05:47 సూర్యాస్తమయం : 06:19

తిథి:  తదియ సా. 4.26

వారము:  బుధవారము

నక్షత్రం:  ఉత్తరాభాద్ర రా. 10.15

యోగం:  ధృతి 05:56 am

కరణం:   వణిజ 04:06 am

విష్టి 04:18 pm

రాహుకాలం: ప.12.00ల1.30

యమగండము: ఉ.7.30ల9.00

వర్జ్యం: ఉ. 7.13 ల 8.53

దుర్ముహుర్తం: ప.11.36ల12.24

శుభసమయం : ఉ 9.00 నుంచి 11:00

                        మ 2:30 నుంచి 4:00

*   సంకటహర చతుర్థి  *

శ్రీ స్వామి అయ్యప్ప అష్టోత్తర శతనామావళి

 శ్రీ స్వామి  అయ్యప్ప అష్టోత్తర శతనామావళి



ఓం శ్రీ మహాశాస్త్రే నమః

ఓం విశ్వవాస్త్రే నమః

ఓం లోక శాస్త్రే నమః

ఓం మహాబలాయ నమః

ఓం ధర్మ శాస్త్రే నమః

ఓం వేద శాస్త్రే నమః

ఓం కాల శాస్త్రే నమః

ఓం మహాజసే నమః

ఓం గజాధిపాయ నమః

ఓం అంగపతయే నమః 10

ఓం వ్యాఘ్రపతయే నమః

ఓం మహాద్యుతాయ నమః

ఓం గణాధ్యక్షాయ నమః

ఓం అగ్రగణ్యాయ నమః

ఓం మహా గుణ గణాలయ నమః

ఓం ఋగ్వేదరూపాయ నమః

ఓం నక్షత్రాయ నమః

ఓం చంద్రరూపాయ నమః

ఓం వలాహకాయ నమః

ఓం దూర్వాయ నమః 20

ఓం శ్యామాయ నమః

ఓం మహా రూపాయ నమః

ఓం క్రూర దృష్టయే నమః

ఓం అనామయాయ నమః

ఓం త్రినేత్రాయ నమః

ఓం ఉత్పాలాకారాయ నమః

ఓం కాలాంతకాయ నమః

ఓం నరాధిపాయ నమః

ఓం దక్షమూషకాయ నమః

ఓం కాల్హారకు సుమప్రియాయ నమః 30

ఓం మదనాయ నమః

ఓం మాధవసుతాయ నమః

ఓం మందారకుసుమ ప్రియాయ నమః

ఓం మదాలసాయ నమః

ఓం వీర శాస్త్రే నమః

ఓం మహా సర్ప విభూషితాయ నమః

ఓం మహాసూరాయ నమః

ఓం మహాధీరాయ నమః

ఓం మహాపాపవినాశకాయ నమః

ఓం ఆసిహస్తాయ నమః 40

ఓం శరదరాయ నమః

ఓం హలహల ధరసుతాయ నమః

ఓం అగ్ని నయనాయ నమః

ఓం అర్జునపతయే నమః

ఓం అనంగామదనాతురాయ నమః

ఓం దుష్టగ్రహాధిపాయ నమః

ఓం శాస్త్రే నమః

ఓం శిష్టరక్షణధీక్షితాయ నమః

ఓం రాజరాజర్చితాయ నమః

ఓం రాజ శేఖరాయ నమః 50

ఓం రాజోత్తమాయ నమః

ఓం మంజులేశాయ నమః

ఓం వరరుచయే నమః

ఓం వరదాయ నమః

ఓం వాయువాహనాయ నమః

ఓం వజ్రాంగాయ నమః

ఓం విష్ణుపుత్రాయ నమః

ఓం ఖడ్గప్రాణయే నమః

ఓం బలోధ్యుతయ నమః

ఓం త్రిలోకజ్ఞానాయ నమః 60

ఓం అతిబలాయ నమః

ఓం కస్తూరితిలకాంచితాయ నమః

ఓం పుష్కలాయ నమః

ఓం పూర్ణధవళాయ నమః

ఓం పూర్ణ లేశాయ నమః

ఓం కృపాలయాయ నమః

ఓం వనజనాధి పాయ నమః

ఓం పాశహస్తాయ నమః

ఓం భయాపహాయ నమః

ఓం బకారరూపాయ నమః 70

ఓం పాపఘ్నాయ నమః

ఓం పాషండ రుధిశాయ నమః

ఓం పంచపాండవసంరక్షకాయ నమః

ఓం పరపాపవినాశకాయ నమః

ఓం పంచవక్త్ర కుమారాయ నమః

ఓం పంచాక్షక పారాయణాయ నమః

ఓం పండితాయ నమః

ఓం శ్రీ ధరసుతాయ నమః

ఓం న్యాయాయ నమః

ఓం కవచినే నమః 80

ఓం కరీణామదిపాయ నమః

ఓం కాండయుజుషే నమః

ఓం తర్పణ ప్రియాయ నమః

ఓం సోమరూపాయ నమః

ఓం వన్యధన్యాయ నమః

ఓం సత్పందాపాప వినాశకాయ నమః

ఓం వ్యాగ్ర చర్మధరాయ నమః

ఓం శూలినే నమః

ఓం కృపాళాయ నమః

ఓం వేణువదనాయ నమః 90

ఓం కంచు కంటాయ నమః

ఓం కరళవాయ నమః

ఓం కిరీటాధివిభూషితాయ నమః

ఓం దూర్జటినే నమః

ఓం వీరనిలయాయ నమః

ఓం వీరాయ నమః

ఓం వీరేంద్రవందితాయ నమః

ఓం విశ్వరూపాయ నమః

ఓం విరపతయే నమః

ఓం వివిధార్దఫలప్రదాయ నమః 100

ఓం మహారూపాయ నమః

ఓం చతుర్భాహవే నమః

ఓం పరపాపవిమోచకాయ నమః

ఓం నాగ కుండలధరాయ నమః

ఓం కిరీటాయ నమః

ఓం జటాధరాయ నమః

ఓం నాగాలంకారసంయుక్తాయ నమః

ఓం నానారత్నవిభూషితాయ నమః 108

ఇతి శ్రీ స్వామి అయ్యప్ప అష్టోత్తర శతనామావళి సంపూర్ణం

భగవద్గీత

 అధ్యాయం 6

శ్లోకం 40

శ్రీ భగవాన్ ఉవాచ 

పార్ధ నైవేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే |

న హి కల్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్ఛతి||

అర్ధం :-

శ్రీ భగవానుడు పలికెను :-

ఓ పార్థా! అట్టి పురుషుడు ఈ లోకమున గాని, పరలోకమున గాని అధోగతిపాలుగాడు. ఏలనన, నాయనా! ఆత్మోద్ధరణమునకు అనగా భగత్ర్పాప్తికై కర్తవ్యకర్మలను ఆచరించువాడెవ్వడును దుర్గతి పాలుగాడు. 




హనుమ అష్టోత్తర శత నామావళి

 హనుమ అష్టోత్తర శత నామావళి



ఓం శ్రీ ఆంజనేయాయ నమః

ఓం మహావీరాయ నమః

ఓం హనుమతే నమః

ఓం మారుతాత్మజాయ నమః

ఓం తత్త్వజ్ఞానప్రదాయ నమః

ఓం సీతాదేవీముద్రాప్రదాయకాయ నమః

ఓం అశోకవనికాచ్చేత్రే నమః

ఓం సర్వమాయావిభంజనాయ నమః

ఓం సర్వబంధవిమోక్త్రే నమః

ఓం రక్షోవిధ్వంసకారకాయనమః (10)

ఓం వరవిద్యా పరిహారాయ నమః

ఓం పరశౌర్య వినాశనాయ నమః

ఓం పరమంత్ర నిరాకర్త్రే నమః

ఓం పరమంత్ర ప్రభేదకాయ నమః

ఓం సర్వగ్రహ వినాశినే నమః

ఓం భీమసేన సహాయకృతే నమః

ఓం సర్వదుఃఖ హరాయ నమః

ఓం సర్వలోక చారిణే నమః

ఓం మనోజవాయ నమః

ఓం పారిజాత ధృమమూలస్థాయ నమః (20)

ఓం సర్వమంత్ర స్వరూపవతే నమః

ఓం సర్వతంత్ర స్వరూపిణే నమః

ఓం సర్వయంత్రాత్మకాయ నమః

ఓం కపీశ్వరాయ నమః

ఓం మహాకాయాయ నమః

ఓం సర్వరోగహరాయ నమః

ఓం ప్రభవే నమః

ఓం బలసిద్ధికరాయ నమః

ఓం సర్వవిద్యాసంపత్ర్పదాయకాయ నమః

ఓం కపిసేనా నాయకాయ నమః (30)

ఓం భవిష్యచ్చతురాననాయ నమః

ఓం కుమార బ్రహ్మచారిణే నమః

ఓం రత్నకుండల దీప్తిమతే నమః

ఓం సంచలద్వాల సన్నద్ధలంబమాన శిఖోజ్జ్వలాయ నమః

ఓం గంధర్వ విద్యాతత్త్వజ్ఞాయ నమః

ఓం మహాబలపరాక్రమాయ నమః

ఓం కారాగృహ విమోక్త్రే నమః

ఓం శృంఖలాబంధవిమోచకాయ నమః

ఓం సాగరోత్తారకాయ నమః

ఓం ప్రాజ్ఞాయ నమః (40)

ఓం రామదూతాయ నమః

ఓం ప్రతాపవతే నమః

ఓం వానరాయ నమః

ఓం కేసరీసుతాయ నమః

ఓం సీతాశోక నివారణాయ నమః

ఓం అంజనా గర్భసంభూతాయ నమః

ఓం బాలార్క సదృశాననాయ నమః

ఓం విభీషణ ప్రియకరాయ నమః

ఓం దశగ్రీవ కులాంతకాయ నమః

ఓం లక్ష్మణ ప్రాణదాత్రే నమః (50)

ఓం వజ్రకాయాయ నమః

ఓం మహాద్యుతయే నమః

ఓం చిరంజీవినే నమః

ఓం రామభక్తాయ నమః

ఓం దైత్యకార్య విఘాతకాయ నమః

ఓం అక్షహంత్రే నమః

ఓం కాంచనాభాయ నమః

ఓం పంచవక్త్రాయ నమః

ఓం మహాతపసే నమః

ఓం లంకిణీభంజనాయ నమః (60)

ఓం శ్రీమతే నమః

ఓం సింహికాప్రాణభంజనాయ నమః

ఓం గంధమాదన శైలస్థాయ నమః

ఓం లంకాపుర విదాహకాయ నమః

ఓం సుగ్రీవ సచివాయ నమః

ఓం ధీరాయ నమః

ఓం శూరాయ నమః

ఓం దైత్యకులాంతకాయ నమః

ఓం సురార్చితాయ నమః

ఓం మహాతేజసే నమః (70)

ఓం రామచూడామణి ప్రదాయ నమః

ఓం కామరూపిణే నమః

ఓం శ్రీ పింగళాక్షాయ నమః

ఓం వార్ధిమైనాకపూజితాయ నమః

ఓం కబళీకృత మార్తాండమండలాయ నమః

ఓం విజితేంద్రియాయ నమః

ఓం రామసుగ్రీవ సంధాత్రే నమః

ఓం మహారావణ మర్దనాయ నమః

ఓం స్ఫటికాభాయ నమః

ఓం వాగధీశాయ నమః (80)

ఓం నవవ్యాకృతి పండితాయ నమః

ఓం చతుర్బాహవే నమః

ఓం దీనబంధవే నమః

ఓం మహాత్మనే నమః

ఓం భక్తవత్సలాయ నమః

ఓం సంజీవన నగార్త్రే నమః

ఓం శుచయే నమః

ఓం వాగ్మినే నమః

ఓం దృఢవ్రతాయ నమః (90)

ఓం కాలనేమి ప్రమథనాయ నమః

ఓం హరిమర్కట మర్కటాయనమః

ఓం దాంతాయ నమః

ఓం శాంతాయ నమః

ఓం ప్రసన్నాత్మనే నమః

ఓం శతకంఠ మదాపహృతేనమః

ఓం యోగినే నమః

ఓం రామకథాలోలాయ నమః

ఓం సీతాన్వేషణ పండితాయ నమః

ఓం వజ్రనఖాయ నమః (100)

ఓం రుద్రవీర్య సముద్భవాయ నమః

ఓం ఇంద్రజిత్ప్రహితామోఘ బ్రహ్మాస్త్రనివారకాయ నమః

ఓం పార్థధ్వజాగ్ర సంవాసినే నమః

ఓం శరపంజర భేదకాయ నమః

ఓం దశబాహవే నమః

ఓం లోకపూజ్యాయ నమః

ఓం జాంబవతీత్ప్రీతివర్ధనాయ నమః

ఓం సీతాసమేత శ్రీరామపాదసేవాదురంధరాయ నమః (108)


హనుమ అష్టోత్తర శత నామావళి సమాప్త:

భగవద్గీత

అధ్యాయం 6

శ్లోకం 39

ఏతన్మే సంశయం కృష్ణ ఛేత్తుమర్హస్యశేషతః|

త్వదన్యః సంశయస్యాస్య ఛేత్తా న హ్యుపపద్యతే ||

అర్ధం :-

ఓ కృష్ణ! ఈ నా సందేహమును పూర్తిగా నివృత్తి చేయుట నీకే చెల్లును. ఏలనన, ఈ సందేహమును తొలగించుట నీకు తప్ప మరెవ్వరికిని శక్యము కాదు. 



శివ అష్టోత్తర శత నామావళి

 శివ అష్టోత్తర శత నామావళి



ఓం శివాయ నమః

ఓం మహేశ్వరాయ నమః

ఓం శంభవే నమః

ఓం పినాకినే నమః

ఓం శశిశేఖరాయ నమః

ఓం వామదేవాయ నమః

ఓం విరూపాక్షాయ నమః

ఓం కపర్దినే నమః

ఓం నీలలోహితాయ నమః

ఓం శంకరాయ నమః (10)

ఓం శూలపాణయే నమః

ఓం ఖట్వాంగినే నమః

ఓం విష్ణువల్లభాయ నమః

ఓం శిపివిష్టాయ నమః

ఓం అంబికానాథాయ నమః

ఓం శ్రీకంఠాయ నమః

ఓం భక్తవత్సలాయ నమః

ఓం భవాయ నమః

ఓం శర్వాయ నమః

ఓం త్రిలోకేశాయ నమః (20)

ఓం శితికంఠాయ నమః

ఓం శివాప్రియాయ నమః

ఓం ఉగ్రాయ నమః

ఓం కపాలినే నమః

ఓం కామారయే నమః

ఓం అంధకాసుర సూదనాయ నమః

ఓం గంగాధరాయ నమః

ఓం లలాటాక్షాయ నమః

ఓం కాలకాలాయ నమః

ఓం కృపానిధయే నమః (30)

ఓం భీమాయ నమః

ఓం పరశుహస్తాయ నమః

ఓం మృగపాణయే నమః

ఓం జటాధరాయ నమః

ఓం కైలాసవాసినే నమః

ఓం కవచినే నమః

ఓం కఠోరాయ నమః

ఓం త్రిపురాంతకాయ నమః

ఓం వృషాంకాయ నమః

ఓం వృషభారూఢాయ నమః (40)

ఓం భస్మోద్ధూళిత విగ్రహాయ నమః

ఓం సామప్రియాయ నమః

ఓం స్వరమయాయ నమః

ఓం త్రయీమూర్తయే నమః

ఓం అనీశ్వరాయ నమః

ఓం సర్వజ్ఞాయ నమః

ఓం పరమాత్మనే నమః

ఓం సోమసూర్యాగ్ని లోచనాయ నమః

ఓం హవిషే నమః

ఓం యజ్ఞమయాయ నమః (50)

ఓం సోమాయ నమః

ఓం పంచవక్త్రాయ నమః

ఓం సదాశివాయ నమః

ఓం విశ్వేశ్వరాయ నమః

ఓం వీరభద్రాయ నమః

ఓం గణనాథాయ నమః

ఓం ప్రజాపతయే నమః

ఓం హిరణ్యరేతసే నమః

ఓం దుర్ధర్షాయ నమః

ఓం గిరీశాయ నమః (60)

ఓం గిరిశాయ నమః

ఓం అనఘాయ నమః

ఓం భుజంగ భూషణాయ నమః

ఓం భర్గాయ నమః

ఓం గిరిధన్వనే నమః

ఓం గిరిప్రియాయ నమః

ఓం కృత్తివాససే నమః

ఓం పురారాతయే నమః

ఓం భగవతే నమః

ఓం ప్రమథాధిపాయ నమః (70)

ఓం మృత్యుంజయాయ నమః

ఓం సూక్ష్మతనవే నమః

ఓం జగద్వ్యాపినే నమః

ఓం జగద్గురవే నమః

ఓం వ్యోమకేశాయ నమః

ఓం మహాసేన జనకాయ నమః

ఓం చారువిక్రమాయ నమః

ఓం రుద్రాయ నమః

ఓం భూతపతయే నమః

ఓం స్థాణవే నమః (80)

ఓం అహిర్బుధ్న్యాయ నమః

ఓం దిగంబరాయ నమః

ఓం అష్టమూర్తయే నమః

ఓం అనేకాత్మనే నమః

ఓం స్వాత్త్వికాయ నమః

ఓం శుద్ధవిగ్రహాయ నమః

ఓం శాశ్వతాయ నమః

ఓం ఖండపరశవే నమః

ఓం అజాయ నమః

ఓం పాశవిమోచకాయ నమః (90)

ఓం మృడాయ నమః

ఓం పశుపతయే నమః

ఓం దేవాయ నమః

ఓం మహాదేవాయ నమః

ఓం అవ్యయాయ నమః

ఓం హరయే నమః

ఓం పూషదంతభిదే నమః

ఓం అవ్యగ్రాయ నమః

ఓం దక్షాధ్వరహరాయ నమః

ఓం హరాయ నమః (100)

ఓం భగనేత్రభిదే నమః

ఓం అవ్యక్తాయ నమః

ఓం సహస్రాక్షాయ నమః

ఓం సహస్రపాదే నమః

ఓం అపవర్గప్రదాయ నమః

ఓం అనంతాయ నమః

ఓం తారకాయ నమః

ఓం పరమేశ్వరాయ నమః (108)


ఇతి శ్రీశివాష్టోత్తరశతనామావళిః సమాప్తా

 

Panchangam

23-08-2021 - శ్రావణ మాసం - ప్లవ నామ - దక్షిణాయనం

సూర్యోదయం : 05:47    సూర్యాస్తమయం : 06:19

వర్ష ఋతువు, కృష్ణపక్షం, మఖకార్తె 

తిథి:  పాడ్యమి సా. 4.27

వారము:  సోమవారము

నక్షత్రం:  శతభిష రా. 8.41

రాహుకాలం: ఉ.7.30ల9.00

యమగండము: ఉ.10.30ల12.00

వర్జ్యం: తె. 3.13 ల 4.51

దుర్ముహుర్తం: ప.12.24ల1.12,ప2.46ల3.34

శుభసమయం : ఉ 10:00 నుంచి మ12:00 వరకు 

                          సా 4:00 నుంచి 6:00వరకు 



శ్రీ సూర్యాష్టోత్తర శతనామవళిః

 శ్రీ సూర్యాష్టోత్తర శతనామవళిః



1. ఓంసూర్యాయనమః    

2. ఓంఆర్యమ్ణేనమః    

3. ఓంభగాయనమః    

4. ఓంవివస్వతేనమః    

5. ఓందీప్తాంశవేనమః    

6. ఓంశుచయేనమః    

7. ఓంత్వష్ట్రేనమః    

8. ఓంపూష్ణేనమ్మః    

9. ఓంఅర్కాయనమః    

10. ఓంసవిత్రేనమః    

11. ఓంరవయేనమః    

12. ఓంగభస్తిమతేనమః    

13. ఓంఅజాయనమః    

14. ఓంకాలాయనమః    

15. ఓంమృత్యవేనమః    

16. ఓంధాత్రేనమః    

17. ఓంప్రభాకరాయనమః    

18. ఓంపృథివ్యైనమః   

19. ఓంఅద్భ్యోనమః    

20. ఓంతేజసేనమః    

21. ఓంవాయవేనమః    

22. ఓంఖగాయనమః    

23. ఓంపరాయణాయనమః    

24. ఓంసోమాయనమః    

25. ఓంబృహస్పతయేనమః    

26. ఓంశుక్రాయనమః    

27. ఓంబుధాయనమః    

28. ఓంఅంగారకాయనమః    

29. ఓంఇంద్రాయనమః    

30. ఓంకాష్ఠాయనమః    

31. ఓంముహుర్తాయనమః    

32. ఓంపక్షాయనమః    

33. ఓంమాసాయనమః    

34. ఓంౠతవేనమః    

35. ఓంసవంత్సరాయనమః    

36. ఓంఅశ్వత్థాయనమః    

37. ఓంశౌరయేనమః    

38. ఓంశనైశ్చరాయనమః    

39. ఓంబ్రహ్మణేనమః    

40. ఓంవిష్ణవేనమః    

41. ఓంరుద్రాయనమః    

42. ఓంస్కందాయనమః    

43. ఓంవైశ్రవణాయనమః    

44. ఓంయమాయనమః    

45. ఓంనైద్యుతాయనమః    

46. ఓంజఠరాయనమః    

47. ఓంఅగ్నయేనమః    

48. ఓంఐంధనాయనమః    

49. ఓంతేజసామృతయేనమః    

50. ఓంధర్మధ్వజాయనమః    

51. ఓంవేదకర్త్రేనమః    

52. ఓంవేదాంగాయనమః    

53. ఓంవేదవాహనాయనమః    

54. ఓంకృతాయనమః    

55. ఓంత్రేతాయనమః

56. ఓంద్వాపరాయనమః

57. ఓంకలయేనమః

58. ఓంసర్వామరాశ్రమాయనమః

59. ఓంకలాయనమః

60. ఓంకామదాయనమః

61. ఓంసర్వతోముఖాయనమః

62. ఓంజయాయనమః

63. ఓంవిశాలాయనమః

64. ఓంవరదాయనమః

65. ఓంశీఘ్రాయనమః

66. ఓంప్రాణధారణాయనమః

67. ఓంకాలచక్రాయనమః

68. ఓంవిభావసవేనమః

69. ఓంపురుషాయనమః

70. ఓంశాశ్వతాయనమః

71. ఓంయోగినేనమః

72. ఓంవ్యక్తావ్యక్తాయనమః 

73. ఓంసనాతనాయనమః

74. ఓంలోకాధ్యక్షాయనమః

75. ఓంసురాధ్యక్షాయనమః

76. ఓంవిశ్వకర్మణేనమః

77. ఓంతమోనుదాయనమః

78. ఓంవరుణాయనమః

79. ఓంసాగరాయనమః

80. ఓంజీముతాయనమః

81. ఓంఅరిఘ్నేనమః

82. ఓంభూతాశ్రయాయనమః

83. ఓంభూతపతయేనమః

84. ఓంసర్వభూతనిషేవితాయనమః

85. ఓంమణయేనమః

86. ఓంసువర్ణాయనమః

87. ఓంభూతాదయేనమః

88. ఓంధన్వంతరయేనమః

89. ఓంధూమకేతవేనమః

90. ఓంఆదిదేవాయనమః

 91. ఓంఆదితేస్సుతాయనమః

92. ఓంద్వాదశాత్మనేనమః

93. ఓంఅరవిందాక్షాయనమః

94. ఓంపిత్రేనమః

95. ఓంప్రపితామహాయనమః

96. ఓంస్వర్గద్వారాయనమః

97. ఓంప్రజాద్వారాయనమః

98. ఓంమోక్షద్వారాయనమః

99. ఓంత్రివిష్టపాయనమః

100. ఓంజీవకర్త్రేనమః

101. ఓంప్రశాంతాత్మనేనమః

102. ఓంవిశ్వాత్మనేనమః

103. ఓంవిశ్వతోముఖాయనమః

104. ఓంచరాచరాత్మనేనమః

105. ఓంసూక్ష్మాత్మనేనమః

106. ఓంమైత్రేయాయనమః

107. ఓంకరుణార్చితాయనమః

108. ఓంశ్రీసూర్యణారాయణాయనమః


ఇతి శ్రీ సూర్యాష్టోత్తర శతనామవళిః సమాప్తం

Sri sakthi peetham

 

శ్రీ వరలక్ష్మి అష్టోత్తర శతనామావళి

 శ్రీ వరలక్ష్మి అష్టోత్తర శతనామావళి




ఓం ప్రకృత్యై నమః

ఓం వికృత్యై నమః

ఓం విద్యాయై నమః

ఓం సర్వభూతహితప్రదాయై నమః

ఓం శ్రద్ధాయై నమః

ఓం విభూత్యై నమః

ఓం సురభ్యై నమః

ఓం పరమాత్మికాయై నమః

ఓం వాచే నమః

ఓం పద్మాలయాయై నమః (10)

ఓం పద్మాయై నమః

ఓం శుచ్యై నమః

ఓం స్వాహాయై నమః

ఓం స్వధాయై నమః

ఓం సుధాయై నమః

ఓం ధన్యాయై నమః

ఓం హిరణ్మయ్యై నమః

ఓం లక్ష్మ్యై నమః

ఓం నిత్యపుష్టాయై నమః

ఓం విభావర్యై నమః (20)

ఓం అదిత్యై నమః

ఓం దిత్యై నమః

ఓం దీప్తాయై నమః

ఓం వసుధాయై నమః

ఓం వసుధారిణ్యై నమః

ఓం కమలాయై నమః

ఓం కాంతాయై నమః

ఓం కామాక్ష్యై నమః

ఓం క్రోధసంభవాయై నమః

ఓం అనుగ్రహపరాయై నమః (30)

ఓం ఋద్ధయే నమః

ఓం అనఘాయై నమః

ఓం హరివల్లభాయై నమః

ఓం అశోకాయై నమః

ఓం అమృతాయై నమః

ఓం దీప్తాయై నమః

ఓం లోకశోక వినాశిన్యై నమః

ఓం ధర్మనిలయాయై నమః

ఓం కరుణాయై నమః

ఓం లోకమాత్రే నమః (40)

ఓం పద్మప్రియాయై నమః

ఓం పద్మహస్తాయై నమః

ఓం పద్మాక్ష్యై నమః

ఓం పద్మసుందర్యై నమః

ఓం పద్మోద్భవాయై నమః

ఓం పద్మముఖ్యై నమః

ఓం పద్మనాభప్రియాయై నమః

ఓం రమాయై నమః

ఓం పద్మమాలాధరాయై నమః

ఓం దేవ్యై నమః (50)

ఓం పద్మిన్యై నమః

ఓం పద్మగంథిన్యై నమః

ఓం పుణ్యగంధాయై నమః

ఓం సుప్రసన్నాయై నమః

ఓం ప్రసాదాభిముఖ్యై నమః

ఓం ప్రభాయై నమః

ఓం చంద్రవదనాయై నమః

ఓం చంద్రాయై నమః

ఓం చంద్రసహోదర్యై నమః

ఓం చతుర్భుజాయై నమః (60)

ఓం చంద్రరూపాయై నమః

ఓం ఇందిరాయై నమః

ఓం ఇందుశీతులాయై నమః

ఓం ఆహ్లోదజనన్యై నమః

ఓం పుష్ట్యై నమః

ఓం శివాయై నమః

ఓం శివకర్యై నమః

ఓం సత్యై నమః

ఓం విమలాయై నమః

ఓం విశ్వజనన్యై నమః (70)

ఓం తుష్ట్యై నమః

ఓం దారిద్ర్య నాశిన్యై నమః

ఓం ప్రీతిపుష్కరిణ్యై నమః

ఓం శాంతాయై నమః

ఓం శుక్లమాల్యాంబరాయై నమః

ఓం శ్రియై నమః

ఓం భాస్కర్యై నమః

ఓం బిల్వనిలయాయై నమః

ఓం వరారోహాయై నమః

ఓం యశస్విన్యై నమః (80)

ఓం వసుంధరాయై నమః

ఓం ఉదారాంగాయై నమః

ఓం హరిణ్యై నమః

ఓం హేమమాలిన్యై నమః

ఓం ధనధాన్య కర్యై నమః

ఓం సిద్ధయే నమః

ఓం స్త్రైణ సౌమ్యాయై నమః

ఓం శుభప్రదాయై నమః

ఓం నృపవేశ్మ గతానందాయై నమః

ఓం వరలక్ష్మ్యై నమః (90)

ఓం వసుప్రదాయై నమః

ఓం శుభాయై నమః

ఓం హిరణ్యప్రాకారాయై నమః

ఓం సముద్ర తనయాయై నమః

ఓం జయాయై నమః

ఓం మంగళాయై నమః

ఓం దేవ్యై నమః

ఓం విష్ణు వక్షఃస్థల స్థితాయై నమః

ఓం విష్ణుపత్న్యై నమః

ఓం ప్రసన్నాక్ష్యై నమః (100)

ఓం నారాయణ సమాశ్రితాయై నమః

ఓం దారిద్ర్య ధ్వంసిన్యై నమః

ఓం సర్వోపద్రవ వారిణ్యై నమః

ఓం నవదుర్గాయై నమః

ఓం మహాకాళ్యై నమః

ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః

ఓం త్రికాల జ్ఞాన సంపన్నాయై నమః

ఓం భువనేశ్వర్యై నమః (108)

ఇతి శ్రీలక్ష్మీ దేవీ అష్టోత్తర శతనామావళి సంపూర్ణం.

వరలక్ష్మి వ్రతకథ

వరలక్ష్మి వ్రతకథ 

పూర్వం శౌనకాది మహర్షులను ఉద్దేశించి సూత మహార్షి ఇలా చెప్పారు. మునులారా! స్త్రీలకు సౌభాగ్యాన్ని ప్రసాదించే ఒక వ్రతాన్ని పరమ శివుడు పార్వతికి చెప్పారు. లోకోపకారం కోరి ఆ వ్రతాన్ని గురించి మీకు తెలియజేస్తాను .శ్రద్ధగా వినండి అన్నారు. ఒకనాడు పార్వతీదేవి పరమేశ్వరుడ్ని ఉద్దేశించి నాథా! స్త్రీలు సర్వసౌఖ్యాలు పొంది, పుత్ర పౌత్రాభివృద్ధిగా తరించుటకు తగిన వ్రతం ఒకదానిని చెప్పండి అని కోరింది. అందుకా పరమేశ్వరుడు దేవీ! నీవు కోరినవిధంగా స్త్రీలకు సకల శుభాలు కలిగించే వ్రతం ఒకటి ఉన్నది. అది వరలక్ష్మీవ్రతం. దానిని శ్రావణమాసం రెండో శుక్రవారం నాడు ఆచరించాలని తెలిపాడు.










అప్పుడు పార్వతీదేవి…

దేవా! ఈ వరలక్ష్మీ వ్రతాన్ని ఆదిదేవతలు ఎవరుచేశారు? ఈ వ్రతాన్ని ఎలా చేయాలో వివరంగా చెప్పండని కోరింది. 

పరమేశ్వరుడు......

కాత్యాయనీ…పూర్వకాలంలో మగధ దేశంలో కుండినం అనే పట్టణం ఒకటి ఉండేది. ఆపట్టణం బంగారు కుడ్యములతో రమణీయంగా ఉండేది. ఆ పురంలో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె సుగుణవతి. వినయ విధేయతలు, భక్తిగౌరవాలు గలయోగ్యురాలు. ప్రతిరోజూ ప్రాతఃకాలాన నిద్రలేచి భర్త పాదాలకు నమస్కరించి ప్రాతఃకాల గృహకృత్యాలను పూర్తిచేసుకుని అత్తమామలను సేవలో తరించేంది.

వరలక్ష్మీ సాక్షాత్కారం..

వరలక్ష్మీ వ్రతానికి ఆదిదేవతయైన వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయంలో చారుమతికి కలలో సాక్షాత్కరించింది. ఓ చారుమతీ…ఈ శ్రావణ పౌర్ణమి నాటికి ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించు... నీవు కోరిన వరాలు, కానుకలను ఇస్తానని చెప్పి అంతర్థానమైంది. చారుమతి సంతోషించి. హే జననీ! నీకృపా కటాక్షాలు కలిగినవారు ధన్యులు. వారు సంపన్నులుగా, విద్వాంసులుగా మన్ననలు పొందుతారు. ఓ పావనీ! నా పూర్వజన్మ సుకృతం వల్ల నీ దర్శనం నాకుకలిగింది’ అని పరిపరివిధాల వరలక్ష్మీని స్తుతించింది.

అంతలోనే మేల్కొన్న చారుమతి అదంతా కలగా గుర్తించి తన కలను భర్తకు, అత్తమామలకు తెలియజేసింది. వారు చాలా సంతోషించి చారుమతిని వరలక్ష్మీవ్రతాన్ని చేసుకోమని చెప్పారు. పురంలోని మహిళలు చారుమతి కలను గురించివిని వారు కూడా పౌర్ణమి ముందు రాబోయే శ్రావణ శుక్రవారం కోసం ఎదురుచూడసాగారు.

శ్రావణ శుక్రవారం రోజున పట్టణంలోని స్త్రీలందరూ ఉదయాన్నే లేచి తలారాస్నానం చేసి పట్టువస్త్రాలు ధరించి చారుమతి గృహానికి చేరుకున్నారు. చారుమతి తన గృహంలో మండపం ఏర్పాటుచేసి ఆ మండపంపై బియ్యంపోసి పంచపల్లవాలైన రావి, జువ్వి, మర్రి, మామిడి, ఉత్తరేణి మొదలైన ఆకులతో కలశం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్ప విధులతో సర్వమాంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవీ నారాయణి నమోస్తుతే ! అంటూ ఆహ్వానించి ప్రతిష్టించింది.



అమ్మవారిని షోడశోపచారాలతో పూజించి, భక్ష్య, భోజ్యాలను నివేదించారు. తొమ్మిది పోగుల తోరాన్ని చేతికి కట్టుకుని, ప్రదక్షిణ నమస్కారాలు చేశారు. మొదటి ప్రదక్షిణ చేయగానే కాలి అందియలు ఘల్లుఘల్లున మోగాయి. రెండో ప్రదక్షిణ చేయగానే హస్తాలకు నవరత్నఖచిత కంకణాలు ధగధగా మెరవసాగాయి. మూడో ప్రదక్షిణ చేయగానే అందరూ సర్వాభరణభూషితులయ్యారు. వారు చేసిన వరలక్ష్మీ వ్రతం ఫలితంగా చారుమతి గృహంతో పాటు, ఆపట్టణంలో ఇతర స్త్రీల ఇళ్లు కూడా ధన, కనక, వస్తు వాహనాలతో నిండిపోయాయి. వారి వారి ఇళ్ల నుంచి గజతరగరథ వాహనాలతో వచ్చి ఇళ్లకుతీసుకెళ్లారు. వారంతా మార్గమధ్యంలో చారుమతిని వేనోళ్ళ పొగుడుతూ ఆమెకు వరలక్ష్మీ దేవి కలలో సాక్షాత్కరించి అనుగ్రహించగా ఆమె చేసిన వ్రతంతో తమని కూడా మహద్భాగ్యవంతులను చేసిందని ప్రశంసించారు. వారంతా ఏటా వరలక్ష్మీవ్రతం చేసి సకల సౌభాగ్యాలతో సిరిసంపదలుకలిగి, సుఖజీవనం గడిపి ముక్తిని పొందారు.

మునులారా… 

శివుడుపార్వతికి ఉపదేశించిన ఈ వరలక్ష్మీవ్రత విధానాన్ని సవిస్తరంగా మీకువివరించాను. ఈ కథ విన్నా, ఈ వ్రతం చేసినా, ఈ వ్రతం చేసినప్పుడు చూసినా కూడా సకల సౌభాగ్యాలు, సిరిసంపదలు, ఆయురారోగ్వైశ్వర్యాలు సిద్ధిస్తాయని సూత మహాముని శౌనకాది మహర్షులకు చెప్పారు. ఈ కథ విని అక్షతలు శిరసుపై వేసుకోవాలి. ఆ తరువాత ముత్తైదువులకు తాంబూలాలు ఇవ్వాలి. అందరికీ తీర్థప్రసాదాలు ఇచ్చి, పూజ చేసినవారు కూడా వాటిని తీసుకోవాలి. అమ్మవారికి పెట్టిన నైవేద్యాన్ని వాళ్లే ఆరగించాలి. రాత్రి ఉపవాసం ఉండి, భక్తితో వేడుకుంటటే వరాలందించే తల్లి వరలక్ష్మీ దేవి.


పంచాంగం

20-08-2021 తేదీ పంచాంగం

ప్లవనామ సంవత్సరం

  1. మాసము 
  2.  శ్రావణ మాసము 
తిథి
  1. శుక్లపక్షం త్రయోదశి  - 08:50 PM వరకు తరువాత 
  2. శుక్లపక్షం చతుర్దశి   - 08:50 PM నుంచి 
నక్షత్రం
  1. ఉత్తరాషాఢ - 09:25 PM వరకు తరువాత 
  2. శ్రవణం - 9:25 PM నుంచి 
  3. వారము - శుక్రవారము 
  4. ఈ రోజు విశిష్టత 
  5. వరలక్ష్మి వ్రతం 
  6. ప్రదోష వ్రతం 
  7. తిరుమల శ్రీవారి తెప్పోత్సవం సమాప్తి
  8. సూర్య, చంద్రుడు సమయం
    1. సూర్యోదయము - 6:04 AM
    2. సూర్యాస్తమానము 6:35 PM
    3. చంద్రోదయం - Aug 20 5:11 PM
    4. చంద్రాస్తమయం - Aug 21 4:36 AM
    5. అననుకూలమైన సమయం
      1. రాహు - 10:45 AM – 12:19 PM
      2. యమగండం - 3:27 PM – 5:01 PM
      3. గుళికా - 7:37 AM – 9:11 AM
      4. దుర్ముహూర్తం - 08:34 AM – 09:24 AM, 12:44 PM – 01:34 PM
      5. వర్జ్యం - 01:14 AM – 02:46 AM
      6. శుభ సమయం
        1. అమృతకాలము - 03:21 PM – 04:52 PM
        2. బ్రహ్మ ముహూర్తం 04:27 AM – 05:15 AM


Bhagavadgita


శ్రీ శక్తీ పీఠం

 

భగవద్గీత

అధ్యాయం 6
శ్లోకం 38
కచ్చిన్నోభయవిభ్రష్టః  ఛిన్నాభ్రమివ నశ్యతి|
అప్రతిప్ఠో మహాబాహో విమూఢో బ్రహ్మణః పథి||
అర్ధం :-
హే మహాబహో! అతడు (యోగభ్రష్టుడు) భగవత్ర్పప్తిమార్గమునుండి జారునవాడై, ఆశ్రయరహితుడై, ఊభయభ్రష్టుడై, ఛిన్నాభిన్నమైన మేఘమువలె అధొగతి పాలు కాడు గదా !


Sri sakthi peetam

 

భగవద్గీత

 అధ్యాయం 6

శ్లోకం 37

అర్జున ఉవాచ 

అయతిః శ్రద్దయోపే యోగాచ్చలితమానసః|

అప్రాప్య యోయాగసంసీదధిమ్ కామ్ గతిమ్ కృష్ణ గచ్చతి||

అర్ధం :-

అర్జునుడు పలికెను :-

ఓ కృష్ణా! యోగమునందు శ్రద్దదరములతో యోగసాధన చేయుచు మనస్సు వశమునందుండని కారణమున అవసాన దశలో మనస్సు చలించి, యోగసిద్దిని పొందకయే మరణించిన సాధకుని గతియేమగును?




తులసి

 తులసి మాత కథ 








గోలోకం శ్రీరాధ కృష్ణుల నివాసం. శ్రీకృష్ణుడు తన నుండి శ్రీధాముడిని సృష్టిస్తాడు. రాధాదేవి తన నుంచి తులసిని సృష్టిస్తుంది. తులసిదేవి రూపం రాధాదేవి రూపం ఒకలాగా ఉంటుంది. తులసి దేవి కూడా రాధ దేవి లాగానే శ్రీ కృష్ణుడిని ఆరాధిస్తుంది. శ్రీకృష్ణుడిని భర్తగా పొందడానికి తపస్సు చేస్తుంది. ఆమె తపస్సుకి మెచ్చి శ్రీకృష్ణుడు ప్రత్యక్షం అయి ఏమి వరం కావాలో కోరుకోమన్నారు. అపుడు తులసీమత కోరుకునేటపుడు రాధాదేవి అక్కడికి వస్తుంది. తులసీమత శ్రీకృష్ణుడుని భర్తగా కావాలి అని కోరుకుంటుంది. శ్రీకృష్ణుడు నవ్వి ఊరుకున్నారు. రాధాదేవి ఆ మాట విని కోపంతో నా భర్తనే కావాలి అన్నికోరుకుంటావా! నువ్వు రాక్షసుడికి భార్యవి అవుతావు అని అనిపిస్తుంది. దానికి తులసి దేవి రాధాదేవి పాదాలపై పడి వేడుకుంటుంది. దానికి రాధాదేవి నేను నిన్ను ఊరికే శపించలేదు. నీవల్ల మానవులకి మంచి జరుగుతుంది. ఇంకా నువ్వు అడిగిన వరం కూడా నెరవేరుతుంది. అని చెపుతుంది. 

           కొనాలకి తులసీదేవి భూలోకంలో  మానవ స్త్రీగా జన్మిస్తుంది. ఆమె పేరు బృంద. చిన్ననాటి నుంచి విష్ణుమూర్తిని భక్తిగా పూజిస్తుంది. యుక్త వయస్సు వచ్చిన తరువాత శంఖచూడుడు అనే రాక్షసుడిని వివాహం చేసుకుంటుంది. ఆ శంఖచూడుడు బ్రహ్మ కోసం తపస్సు చేసి నా భార్య పాతివ్రతగా ఉన్నతకాలం నాకు మరణం రాకూడదు అని వరం కోరుకుంటాడు. బ్రహ్మ తధాస్తు అంటారు. ఆ వరగర్వంతో లోకాలనన్నిటిని బాధిస్తాడు. దేవతలు ఆ బాధాభరించలేక బ్రహ్మదేవుని దగరకు వెళతారు. బ్రహ్మ వారిని తీసుకొని కైలాసానికి వెళతారు. పరమశివుడు వీరి బాధలను విని శంఖచూడుడీతో యుద్ధనికి వెళతాడు. బ్రహ్మదేవుడు ఇచ్చిన వరం వలన పరమేశ్వరుడు శంఖచూడుని వధించలేకపోతాడు. అపుడు పరమేశ్వరుడు విష్ణుమూర్తిని సహాయం కోరుకుంటాడు. విష్ణుమూర్తి శంఖచూడుడి భార్య అయినా బృంద దగరకు శంఖచూడుడి రూపంలో వెళతాడు. అపుడు బృంద వచ్చింది నిజంగా తన భర్తే అనుకోని విష్ణుమూర్తికి పాదపూజచేసి తన భర్తేఅనుకొని ప్రేమదగరకు వెళుతుంది. విష్ణుమూర్తిని ముట్టుకోగానే బృంద పాత్రవత్యం పోతుంది. అక్కడ యుద్ధంలో పరమేశ్వరుని చేతిలో శంఖచూడుడు మరణిస్తాడు. వచ్చింది తన భర్త కాదు అని తెలుసుకొంటుంది. విష్ణుమూర్తిని కోపంతో నువ్వు నదిలో రాయివై పడియుండు అని శపిస్తుంది. విష్ణుమూర్తి నవ్వి నీ భర్త లోకాలని భాదిస్తునాడు. లోకానికి న్యాయం చేయటానికి నాకు ఈ ధారితప్పా వేరేది కనిపించలేదు. నువ్వి కిందటి జన్మలో తులసీదేవివి నివ్వు అపుడు నన్ను అడిగిన వరం నెరవేరింది. నువ్వు ఈ భూలోకంలో పవిత్రమైన చెట్టువై పూజలు అందుకొంటావు అని వరం ఇస్తారు. విష్ణుమూర్తి వరం వల్ల బృంద భూలోకంలో 108 రకాల తులసిచేట్టులుగా మారుతుంది. అలాగే ఆమె గొల్ల నుంచి ఉసిరి చెట్టు వస్తుంది. 


రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...