adthyamikam లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
adthyamikam లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

ఓంకరం అమరేశ్వర జ్యోతిర్లింగం విశిష్టత

 ఓంకరం అమరేశ్వర జ్యోతిర్లింగం విశిష్టత 



            ఒకసారి నారదమహర్షి గోకర్ణనికి వెళ్లరు.అక్కడ ఉన్న ఆత్మలింగాన్ని దర్శనం చేసుకొని వస్తుంటే వెదురుగా వింధ్య పర్వతం పురుష రూపం ధరించి వచ్చారు. వింధ్య పర్వతం నారదమహర్షికి నమస్కరించి మహర్షి దయచేసి నా కోసం వేచి ఉంటారా నేను వెళ్లి ఆత్మలింగాన్ని దర్శనం చేసుకొని వస్తాను అన్నారు. నారద మహర్షి అంగికరించారు. వింధ్య పర్వతం వెళ్లి ఆత్మలింగాన్ని దర్శనం చేసుకొని వచ్చారు. నారదమహర్షి నాకు ఒక సందేహం అన్నారు. ఏమిటి అడుగు అన్నారు నారద మహర్షి. ఈ ప్రపంచంలో ఎవరైనా నాకన్నా గొప్పవాళ్ళు ఉన్నారా. అందుకు నారదమహర్షి ఎందుకు లేరు నీకన్నా గొప్పవాళ్ళు చాలామంది ఉన్నారు. వింధ్య పర్వతంకి కోపం వస్తుంది. వాళ్ళు అందరూ నాకన్నా ఎందుకు గొప్పవాళ్ళు అన్నారు. అందుకు నారదమహర్షి వాళ్ళ అందరిపైనా శివుడు వెలిశారు. నీపైన ఈ శివలింగం లేదుగా అందుకే వాళ్ళు అందరూ గొప్పవాళ్ళు అన్నారు. వింధ్య పర్వతానికి అహంకారం వచ్చింది. ఎలాగైనా శివుడిని నాపై వెలిసేలా చేసుకోవాలి అని తన చోటుకి వచ్చారు.  

                 వెంటనే వింధ్య పర్వతం మట్టితో పార్ధవలింగం చేసి దాని మీద ఓంకారాన్ని గీసి నియమ నిష్ఠలతో ఆరు నెలలు పాటు తపస్సు చేసారు. అతని తపస్సుకి మెచ్చి శివుడు పార్వతితో సహా వచ్చి ప్రత్యక్షమయ్యారు. వింధ్య పర్వతం సంతోషించి శివపార్వతులను ప్రార్ధన చేసారు. శివుడు వింధ్య పర్వతంతో నీ తపస్సుకి మెచ్చాను నీకు ఏమి వరం కావాలో కోరుకో అన్నారు. అందుకు వింధ్య పర్వతం  స్వామి! నా కొండా ప్రపంచంలో గొప్ప కొండా అవ్వాలి. నేను ఎంత పొడుగు కావాలంటే అంత పొడుగు పెరగాలి. ఇంకా మీరు నా కొండా మీద జ్యోతిర్లింగంగా వెలవాలి. నా కొండా రెండుగా చీలిపోయింది. మధ్యలో నర్మద నది ప్రవహిస్తుంది. అందువల్ల మీరు నా రెండు కొండలమీద వెలవండి అని అడిగారు. అందుకు శివుడు వింధ్య నీవు అడిగినట్టుగా రెండు లింగములుగా వెలుస్తాను. నీవు ఓంకారంగా నన్ను తపస్సు చేసావు కాబట్టి ఎక్కడ నేను ఓంకార జ్యోతిర్లింగంగా వెలుస్తాను. అవతల కొండా మీద అమరలింగేశ్వర జ్యోతిర్లింగంగా వెలుస్తాను. కానీ రెండు కలిపి ఒకటే జ్యోతిర్లింగం. ఈ క్షేత్రానికి వచ్చి రెండిటిని దర్శనం చేసుకుంటేనే పూర్తి దర్శన ఫలితం వస్తుంది. ఇక నేను ఇచ్చే వరం ఇతరులకి దుఃఖానికి కారణం కాకూడదు. నీవు ఎంతపొడవు కావాలి అంటే అంత పొడవు పెరగగలవు. కానీ నీవు లోకనాశనానికి ఉపయోగించదు అని చేపి శివుడు జ్యోతిర్లింగంగా వెలిశారు. 


భగవద్గీత

 అద్యాయం 8

శ్లోకం 18

అవ్యక్తాద్వ్యక్తయః సర్వాః ప్రభవంత్యహరాగమే |

రాత్ర్యాగమే ప్రలీయంతే తత్రైవావ్యక్తసంజ్ఞకే ||

అర్థం :-

చరాచరప్రణులన్ని బ్రహ్మయొక్క పగటి కాలం ప్రారంభము కాగానే అవ్యక్తము నుండి అనగా బ్రహ్మయొక్క సూక్ష్మ శరీరము నుండి ఉత్పన్నమవుతాయి. మళ్ళి బ్రహ్మయొక్క రాత్రికాలము ప్రారంభసమయంలో అవి అదే అవ్యక్తమునందు లీనమగును.



శ్రీ శైల మల్లికార్జున జ్యోతిర్లింగం విశిష్టత

 శ్రీ శైల మల్లికార్జున జ్యోతిర్లింగం విశిష్టత


కైలాసంలో వినాయకుడి వివాహం జరిగింది. ఆ వివాహసానికి కుమారస్వామికి ఆహ్వానం అందలేదు. ఈ విషయం తెలిసి తల్లి తండ్రుల మీద అలిగి శ్రీశైలం కొండకి వచ్చేసారు. అక్కడ కుమారస్వామి కొన్నాళ్ళు తపస్సు చేసుకుంటూ ఉన్నారు. ఆ శ్రీశైల కొండా మీద ఒక కిరాత జాతి ఉండేవారు వారి ప్రధాన వృత్తి వేట. వారిలో కిరాత రాజుకి ఒక కుమార్తె ఉంది. ఆమె శ్రీవల్లి. ఒక రోజు కుమారస్వామి శ్రీవల్లిని చూసి ఇష్టపడి పెళ్లి చేసుకుంటాను అని అడిగారు. అందుకు శ్రీవల్లి దానికి మా తండ్రి గారిని అడగమంది. మీ తండ్రి ఎవరు అని అడిగారు. నా తండ్రి కిరాత రాజు అని చెపింది శ్రీవల్లి. అందుకు కుమారస్వామి కిరాత రాజుకి పెళ్లి అవలేదుగా అతనికి పిల్లలు ఎలా ఉన్నారు. అందుకు శ్రీవల్లి నేను సర్ప రాజు ఆదిశేషుడు కుమారుడు కుముదుడు కుమార్తెని. కిరాత రాజు కుముదుడు, ఆదిశేషుడి పరమ భక్తుడు అయన భక్తికి మెచ్చి వరం కోరుకోమన్నారు. అందుకు కిరాత రాజు మేము అడవులలో ఉంటాము సర్పాలవల్ల మాకు ఎటువంటి ప్రమాదం జరగకుండా వరం ఇవ్వు అని నాకు పెళ్లి లేదు నాకు ఒక కుమారుడిని ప్రసాధిచామని అడిగారు. అందుకు ఆదిశేషుడు అలాగే మీకు మా సర్పాలవల్ల మీకు ఎటువంటి ప్రమాదం ఉండదు అన్నారు. ఇక నీకు కుమారుడి యోగం లేదు. నా కుమారుడు కుముదుడికి చాల మంది కుమార్తెలు ఉన్నారు. వారిలో ఒకరిని నీకు ఇస్తాను ఆమెను పెంచుకో అని చెప్పారు పేరు శ్రీవల్లి. అది నేనే నా వయసు పదివేల సంవత్సరములు మాకు మరణం లేదు మేము నాగమృతం తాగాము అందులో నేను ఎపుడు 16 సంవత్సరాల వయసులో ఉంటాను. వచ్చి మా తండ్రిగారిని అడుగు అని చేపి వెళిపోయేది. కుమారస్వామి దిగులుగా కూచున్నారు. శివుడు ఇది అంత చూసి కుమారుడిని ఓదార్చటానికి ఒక వృధుడిలా వచ్చారు. కుమారస్వామిని ఓదార్చి నీకు ఆమెతో వివాహం జరుగుతుంది నువ్వు వెళ్లి వాళ్ళ తండ్రిని అడుగు అని పంపిస్తారు. అయన కొన్ని నియమాలు పెడతారు. కుమారస్వామి వెళ్లి కిరాత రాజుని కలుసుకుంటారు. నేను మీ అమ్మాయిని వివాహం చేసుకుంటాను అని అడుగుతారు. అందుకు కిరాత రాజు అయితే నీవు మాతో కలిసిపోవాలి మా జాతిలో ఒకడిల ఉండాలి అని అంటారు. కుమారస్వామి ఒప్పుకుంటారు. శ్రీవల్లి వచ్చి నేను ఒక సర్పాన్ని అందుకే మీరు నా కోసం సర్పంగా మారతారా అని అడుగుతుంది. కుమారస్వామి వెంటనే ఆరు ముఖముల సర్పముగా మారిపోతారు. అప్పటినుండి కుమారస్వామికి సుబ్రహ్మణ్యుడు అని పేరు వచ్చింది. కిరాతరాజు సంతోషించి మీ తల్లీతండ్రులని తీసుకొని రమ్మని చెప్పారు. కుమారస్వామి దిగులుగా ఆ వృద్దుడి దగరకు వెళ్లి నేను మా తల్లితండ్రుల మీద అలిగి ఎక్కడికి వచ్చాను. ఇపుడు ఎల్లా వాళ్లను వెళ్లి అడగను అని బాధపడరు. అపుడు వృధుడు కాస్త శివుడిగా మారిపోయారు పార్వతి దేవి కూడా వచ్చింది. కుమారస్వామి సంతోషించి తన తల్లితండ్రులను తీసుకొని కిరాత రాజు దగరకు వెళతారు. కిరాత రాజు సంతోషించి నను ఎంత అదృష్టవంతుడిని ఆదిశేషుడిని పూజించటం వాళ్ళ నాకు శివపార్వతుల దర్శనం కలిగింది. నాగ కన్య నాకు కుమార్తె అయింది. శివపార్వతుల కుమారుడు అల్లుడు అయ్యారు అని సంతోషిచారు. వెంటనే బ్రహ్మదేవుడు అక్కడికి వచ్చి పురోహితునిగా మారి కుమారస్వామి శ్రీవల్లిల వివాహం చేసారు. దేవతలందరు వచ్చి శివుడిని ఇక్కడే మీరు జ్యోతిర్లింగంగా వెలిసి మానవుల కష్టాలు తీర్చమని ప్రాదించారు. అందుకు మహాదేవుడు ఒప్పుకున్నారు. నేను ముందు ఎక్కడకు వృద్దుడిగా వచ్చాను కాబట్టి ఎక్కడ కిందన వృధామాలికార్జునగా, కొండపైన మల్లికార్జునస్వామిగా వెలుస్తాను. పార్వతీదేవి ఇంతకుముందే ఇక్కడ అరుణుడు అనే రాక్షసుడిని వధించి భ్రమరాంభగా వెలిసింది. అంతేకాక సతీదేవి అంశ కూడా ఆమెలో కలిసిపోయింది కనుక ఇది శక్తీ పీఠం అయింది. కలిగుగంథం వరకు ఇక్కడే ఉంది భక్తుల కష్టాలు తీరుస్తాము. తరువాత త్రేతాయుగం రాముడు వనవాసం చేస్తున్నపుడు ఎక్కడకు వచ్చి వృధామాలికార్జున లింగం పక్కనే రామలింగాని ప్రతిష్టించారు. ఇంకా సీతాదేవి, లక్ష్మణస్వామి కూడా శివలింగాన్ని ప్రతిష్టించి పూజించారు. తరువాత ద్వాపరయుగంలో పాండవులు వనవాసం చేస్తున్నపుడు ఎక్కడకు వచ్చి పాండవులు ఐదుగురు ద్రౌపది ఇక్కడ శివలింగాలను ప్రతిష్టించి పూజించారు. 

శ్రీ కృష్ణ అష్టోత్తర శతనామావళి

 శ్రీ కృష్ణ అష్టోత్తర శతనామావళి



ఓం శ్రీ కృష్ణాయ నమః

ఓం కమలానాథాయ నమః

ఓం వాసుదేవాయ నమః

ఓం సనాతనాయ నమః

ఓం వసుదేవత్మాజాయ నమః

ఓం పుణ్యాయ నమః

ఓం లీలామానుష విగ్రహాయ నమః

ఓం శ్రీవత్స కౌస్తుభ ధరాయ నమః

ఓం యశోదావత్సలాయ నమః

ఓం హరిఃయే నమః || 10 ||

ఓం చతుర్భుజాత్త చక్రాసిగదా నమః

ఓం శంఖాంబుజాయుధాయ నమః

ఓం దేవకీ నందనాయ- శ్రీ శాయ నమః

ఓం నందగోప ప్రియాత్మజాయ నమః

ఓం యమునావేగసంహారిణే నమః

ఓం బలభద్ర ప్రియానుజాయ నమః

ఓం పూతనాజీవితహరణాయ నమః

ఓం శకటాసురభంజనాయ నమః

ఓం నందవ్రజజానందినే నమః

ఓం సచ్చిదానందవిగ్రహాయ నమః || 20 ||

ఓం నవనీతవిలిప్తాంగాయ నమః

ఓం నవనీతనటాయ నమః

ఓం అనఘాయ నమః

ఓం నవనీతనవహారాయ నమః

ఓం ముచుకుద ప్రసాధకాయ నమః

ఓం షోడశ స్త్రిసహస్రేశాయ నమః

ఓం త్రిభంగినే నమః

ఓం మధురాకృతయే నమః

ఓం శుకవాగమృతాబ్ధీందనే నమః

ఓం గోవిందాయ నమః || 30 ||

ఓం యోగినాంపతయే నమః

ఓం వత్సవాటచరాయ నమః

ఓం అనంతాయ నమః

ఓం ధేనుకాసుర భంజనాయ నమః

ఓం తృణీకృత తృణావర్తాయ నమః

ఓం యమళార్జున భంజనాయ నమః

ఓం ఉత్తాలోత్తాలభేత్రే నమః

ఓం తమా శ్యామలకృతయే నమః

ఓం గోపగోపీశ్వరాయ నమః

ఓం యోగినే నమః || 40 ||

ఓం కోటిసూర్య సమప్రభాయ నమః

ఓం ఇళాపతయే నమః

ఓం పరంజ్యోతిషే నమః

ఓం యాదవేంద్రాయ నమః

ఓం యధూద్వహాయ నమః

ఓం వనమాలినే నమః

ఓం పీతవాససే నమః

ఓం పారిజాతపహారకాయ నమః

ఓం గోవర్ధన చలోర్దర్త్రే నమః

ఓం గోపాలాయ నమః || 50 ||

ఓం సర్వపాలకాయ నమః

ఓం అజాయ- నిరంజనాయ నమః

ఓం కామజనకాయ నమః

ఓం కంజలోచనాయ నమః

ఓం మధుఘ్నే నమః

ఓం మధురానాథాయ నమః

ఓం ద్వారకానాయకాయ నమః

ఓం బలినే నమః

ఓం బృందావనాంతసంచారిణే నమః

ఓం తులసి దామ భూషణాయ నమః || 60 ||

ఓం శ్యామంతమణిహర్త్రే నమః

ఓం నరనారాయణాత్మకాయ నమః

ఓం కుబ్జాకృష్ణాంబర ధరాయ నమః

ఓం మాయినే నమః

ఓం పరమ పురుషాయ నమః

ఓం మిస్టి కాసు ర చాణూర నమః

ఓం మల్లయుద్ధ విశారదాయ నమః

ఓం సంసార వైరిణే నమః

ఓం కంసారినే నమః

ఓం మురారి నే నమః || 70 ||

ఓం నరకాంతకాయ నమః

ఓం అనాది బ్రహ్మచారిణే నమః

ఓం కృష్ణావ్యసనకర్శ కాయ నమః

ఓం శిశుపాలశిరచ్చేత్రే నమః

ఓం దుర్యోధన కులాంత కృతే నమః

ఓం విదుర క్రూర వరదాయ నమః

ఓం విశ్వరూప ప్రదర్శ కాయ నమః

ఓం సత్య వాచయే నమః

ఓం సత్యసంకల్పాయ నమః

ఓం సత్యభామారతాయ నమః || 80 ||

ఓం జయినే నమః

ఓం సుభద్రా పూర్వజాయ నమః

ఓం విష్ణవే నమః

ఓం భీష్మ ముక్తి ప్రదాయ కాయ నమః

ఓం జగద్గురవే నమః

ఓం జగన్నాధాయ నమః

ఓం వేణునాద విశారదాయ నమః

ఓం వృషభాసుర విధ్వంసినీ నమః

ఓం బాణాసుర కరాంత కృతే నమః

ఓం యుధిష్టర ప్రతిష్ట త్రే నమః || 90 ||

ఓం బర్హిబర్హవతంసకాయ నమః

ఓం పార్ధసారధియే నమః

ఓం అవ్యక్తాయ నమః

ఓం గీతామృతమశ్రీహోదధయే నమః

ఓం కాళీయఫణిమాణిక్య రంజితశ్రీ పదాంబుజాయ నమః

ఓం దామోదరాయ నమః

ఓం యజ్ఞభోక్ష్యె నమః

ఓం దానవేంద్రవినాశకాయ నమః

ఓం నారాయణాయ నమః

ఓం పరబ్రహ్మణే నమః || 100 ||

ఓం పన్నాగాశనవాహయ నమః

ఓం జలక్రీడాసమాసక్త నమః

ఓం గోపి వస్త్రాపహారకాయ నమః

ఓం పుణ్యశ్లోకాయ నమః

ఓం తీర్ధకృతే శ్రీ  వేధవేద్యాయ నమః

ఓం దయానిధాయే నమః

ఓం సరస్వతీర్దాత్మకాయ నమః

ఓం సర్వగ్రహరూపిణే శ్రీ పరాత్పరాయ నమః

ఇతి శ్రీ కృష్ణ అష్టోత్తర శతనామావళి సంపూర్ణం

భగవద్గీత

అద్యాయం 8

శ్లోకం 17

సహస్రయుగపర్యంతమ్ అహర్యద్బ్రహ్మణోవిదుః |

రాత్రిం యుగసహస్రాంతం తే హోరాత్రవిదో జనాః ||

అర్థం :-

వేయి చతుర్యుగముల కాలము బ్రహ్మకు ఒక పగలు అని, అంతే కాలము రాత్రి అని తెలిసిన యోగులు కాలతత్త్వమును నిజముగా తెలిసిన వారు.


 


        

భగవద్గీత

 అద్యాయం 8

శ్లోకం 16

అబ్రహ్మభూవనాల్లోకాః పునరావర్తినోర్జున |

మాముపేత్య తు కౌంతేయ పునర్జన్మ న విద్యతే ||

అర్థం :-

అర్జునా! బ్రహ్మలోకపర్యంతము ఉన్న సమస్తలోకములను పునరావృతాలు. కౌతేయా! నన్ను చేరే వారికి పునర్జన్మ ఉండదు. 




శ్రీ ప్రత్యంగిరా మాలా మంత్రః

 శ్రీ ప్రత్యంగిరా మాలా మంత్రః

ఓం నమః కృష్ణ వాససే శత సహస్ర కోటి సింహాసనే సహస్ర వదనే అష్టా దశ భుజే మహా బలే మహా బల పరాక్రమే | అజితే అపరాజితే మహా ప్రత్యంగిరే ప్రత్యంగిరసే అన్య పరాక్రమ విధ్వంశిని పరమంత్రో ఛాధిని పరమంత్రోత్ సాధిని సర్వభూతధమని ఘ్రాం శౌం ప్రేమ్ ఘ్రీం క్రోమ్ మమ సర్వ ఉపధ్రవేప్యః సర్వ ఆపత్హో రక్ష రక్ష హ్రం ఘ్రీం క్షీరీమ్ క్రోమ్ సర్వ దేవానామ్ ముఖం స్తంభయ స్తంభయ సర్వవిఘ్నం చింది చింది సర్వ ధుష్టానాం భక్షయ భక్షయ వక్ట్రాలయా జ్వాలా జిహ్వే కరాళ వధనే సర్వ యంత్రాణి స్పోటయ స్పోటయ త్రోటయ త్రోటయ ప్రత్యసుర సముధ్రాన్ విద్రావయ విద్రావయ సం రౌద్ర మూర్తె మహా ప్రత్యంగిరే మహా విధ్యె శాంతిమ్ కురు కురు మామ శత్రూన్ భక్షయ భక్షయ

ఓం హ్రాం హ్రీం హ్రూం  జంభే జంభే మోహే మోహే స్తంభే స్తంభే

ఓం హ్రీం హుం ఫట్ స్వాహా | ఓం హ్రీం ఈం గ్లౌం ఐం హుం కృష్ణ వాససే శత సహస్ర సింహ వదనె అష్టా దశ భుజే మహాభలే శత పారాక్రమ పూజితే అజితే అపరాజితే దేవి ప్రత్యంగిరే పర సైన్య పర కర్మ విధ్వంశిని పర మంత్ర పర యంత్ర పర తంత్ర ఉచ్చాటినీ పర విద్యా గ్రాశకరే సర్వ భూత ధమని క్షాం గ్లౌం సౌం ఈం గ్రాం గ్రీం గ్రాం ఏహిఏహి ప్రత్యంగిరే చిత చిత్రూపె సర్వ ఉపద్రవెభ్యయః సర్వ గ్రహ దోషేభ్యః ప్రత్యంగిరే మమ రక్ష రక్ష ఘ్రాం ఘ్రీం ఘ్రూం ఘ్రైం ఘ్రౌం హన హన

క్షాం క్షీం క్షూం క్షైo క్షౌం క్షః

గ్లాం గ్లీం గ్లూం గ్లైం గ్లౌుం గ్లహః

ప్రత్యంగిరే పర బ్రహ్మ మహిషి పరమకారునికే యెహి యెహి మమ శరీరే ఆవేశయ ఆవేశయ మమ హృదయే స్పుర స్పుర మమాంక్ష్ ప్రస్పుర ప్రస్పుర సర్వ ధుష్టానాం వాచంముఖం పధం స్తంభయ స్తంభయ జిహ్వం కీలయ కీలయ బుద్ధిం వినాశయ వినాశయ ప్రత్యంగిరే మహా కుండలిని చంద్రకళావధంశిని భేతాళ వాహనే ప్రత్యంగిరే కపాల మాలా ధారిణి త్రీశూళ వజ్రాంకుశబాణ భానసర పాని పాత్ర: పూరితం మమ శత్రూన్ శ్రోనితం పిబ పిబ మమ శత్రూన్ మాంసయ ఖాదయ ఖాదయ మమ శత్రూన్ తాడయ తాడయ మమ వైరి జనాన్ దహా దహా మమ విధ్వేశ కారినం శీగ్రమెవ భక్షయ భక్షయ శ్రీ ప్రత్యంగిరే భక్త కారునికే శీగ్రమేవ ధయాం కురు కురు సధ్యో జ్వర జాధ్య ముఖ్‌తిమ్ కురు కురు భేతాళ బ్రహ్మరాక్షధీం జహి జహి మమ శత్రూన్ తాడయ తాడయ ప్రారబ్ధ సంచిత క్రియమానాం దహా దహా ధూషకాన్ సధ్యో ధీర్గ రోగ యుక్తాన్ కురు కురు ప్రత్యంగిరే ప్రాణ శక్తి మయె మమ వైరి జన ప్రాణాన్ హన హన మర్ధయ మర్ధయ నాశయ నాశయ

ఓం శ్రీం హ్రీం క్లీం సౌం గ్లౌుం ప్రత్యంగిరే మహామాయె దేవి దేవి మమ వాంఛితం కురు కురు మాం రక్ష రక్ష మమ ప్రత్యంగిరే స్వాహా  ||

భగవద్గీత

 అద్యాయం 8

శ్లోకం 15

మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయమశాశ్వతమ్ |

నాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాం గతాః ||

అర్థం :-

పరమసిద్ధిని పొందిన మహాత్ములు నన్ను చేరిన పిదప, దుఃఖములకు నిలమైన, క్షణభంగురమైన పునర్జన్మను పొందరు. 




 దేవి భుజంగ స్తోత్రం


విరించ్యాదిభిః పంచభిర్లోకపాలైః – సమూఢే మహానందపీఠే నిషణ్ణమ్ |

ధనుర్బాణపాశాంకుశప్రోతహస్తం – మహస్త్రైపురం శంకరాద్వైతమవ్యాత్ || 1 ||


యదన్నాదిభిః పంచభిః కోశజాలైః – శిరఃపక్షపుచ్ఛాత్మకైరంతరంతః |

నిగూఢే మహాయోగపీఠే నిషణ్ణం – పురారేరథాంతఃపురం నౌమి నిత్యమ్ || 2 ||


విరించాదిరూపైః ప్రపంచే విహృత్య – స్వతంత్రా యదా స్వాత్మవిశ్రాంతిరేషా |

తదా మానమాతృప్రమేయాతిరిక్తం – పరానందమీడే భవాని త్వదీయమ్ || 3 ||


వినోదాయ చైతన్యమేకం విభజ్య – ద్విధా దేవి జీవః శివశ్చేతి నామ్నా |

శివస్యాపి జీవత్వమాపాదయంతీ – పునర్జీవమేనం శివం వా కరోషి || 4 ||


సమాకుంచ్య మూలం హృది న్యస్య వాయుం – మనో భ్రూబిలం ప్రాపయిత్వా నివృత్తాః |

తతః సచ్చిదానందరూపే పదే తే – భవంత్యంబ జీవాః శివత్వేన కేచిత్ || 5 ||


శరీరేఽతికష్టే రిపౌ పుత్రవర్గే – సదాభీతిమూలే కలత్రే ధనే వా |

న కశ్చిద్విరజ్యత్యహో దేవి చిత్రం – కథం త్వత్కటాక్షం వినా తత్త్వబోధః || 6 ||


శరీరే ధనేఽపత్యవర్గే కలత్రే – విరక్తస్య సద్దేశికాదిష్టబుద్ధేః |

యదాకస్మికం జ్యోతిరానందరూపం – సమాధౌ భవేత్తత్త్వమస్యంబ సత్యమ్ || 7 ||


మృషాన్యో మృషాన్యః పరో మిశ్రమేనం – పరః ప్రాకృతం చాపరో బుద్ధిమాత్రమ్ |

ప్రపంచం మిమీతే మునీనాం గణోఽయం – తదేతత్త్వమేవేతి న త్వాం జహీమః || 8 ||


నివృత్తిః ప్రతిష్ఠా చ విద్యా చ శాంతిస్తథా శాంత్యతీతేతి పంచీకృతాభిః |

కలాభిః పరే పంచవింశాత్మికాభిస్త్వమేకైవ సేవ్యా శివాభిన్నరూపా || 9 ||


అగాధేఽత్ర సంసారపంకే నిమగ్నం – కలత్రాదిభారేణ ఖిన్నం నితాంతమ్ |

మహామోహపాశౌఘబద్ధం చిరాన్మాం – సముద్ధర్తుమంబ త్వమేకైవ శక్తా || 10 ||


సమారభ్య మూలం గతో బ్రహ్మచక్రం – భవద్దివ్యచక్రేశ్వరీధామభాజః |

మహాసిద్ధిసంఘాతకల్పద్రుమాభానవాప్యాంబ నాదానుపాస్తే చ యోగీ || 11 ||


గణేశైర్గ్రహైరంబ నక్షత్రపంక్త్యా – తథా యోగినీరాశిపీఠైరభిన్నమ్ |

మహాకాలమాత్మానమామృశ్య లోకం – విధత్సే కృతిం వా స్థితిం వా మహేశి || 12 ||


లసత్తారహారామతిస్వచ్ఛచేలాం – వహంతీం కరే పుస్తకం చాక్షమాలామ్ |

శరచ్చంద్రకోటిప్రభాభాసురాం త్వాం – సకృద్భావయన్భారతీవల్లభః స్యాత్ || 13 ||


సముద్యత్సహస్రార్కబింబాభవక్త్రాం – స్వభాసైవ సిందూరితాజాండకోటిమ్ |

ధనుర్బాణపాశాంకుశాంధారయంతీం – స్మరంతః స్మరం వాపి సంమోహయేయుః || 14 ||


మణిస్యూతతాటంకశోణాస్యబింబాం – హరిత్పట్టవస్త్రాం త్వగుల్లాసిభూషామ్ |

హృదా భావయంస్తప్తహేమప్రభాం త్వాం – శ్రియో నాశయత్యంబ చాంచల్యభావమ్ || 15 ||


మహామంత్రరాజాంతబీజం పరాఖ్యం – స్వతో న్యస్తబిందు స్వయం న్యస్తహార్దమ్ |

భవద్వక్త్రవక్షోజగుహ్యాభిధానం – స్వరూపం సకృద్భావయేత్స త్వమేవ || 16 ||


తథాన్యే వికల్పేషు నిర్విణ్ణచిత్తాస్తదేకం సమాధాయ బిందుత్రయం తే |

పరానందసంధానసింధౌ నిమగ్నాః – పునర్గర్భరంధ్రం న పశ్యంతి ధీరాః || 17 ||


త్వదున్మేషలీలానుబంధాధికారాన్విరించ్యాదికాంస్త్వద్గుణాంభోధిబిందూన్ |

భజంతస్తితీర్షంతి సంసారసింధుం – శివే తావకీనా సుసంభావనేయమ్ || 18 ||


కదా వా భవత్పాదపోతేన తూర్ణం – భవాంభోధిముత్తీర్య పూర్ణాంతరంగః |

నిమజ్జంతమేనం దురాశావిషాబ్ధౌ – సమాలోక్య లోకం కథం పర్యుదాస్సే || 19 ||


కదావా హృషీకాణి సామ్యం భజేయుః – కదా వా న శత్రుర్న మిత్రం భవాని |

కదా వా దురాశావిషూచీవిలోపః – కదా వా మనో మే సమూలం వినశ్యేత్ || 20 ||


నమోవాకమాశాస్మహే దేవి యుష్మత్పదాంభోజయుగ్మాయ తిగ్మాయ గౌరి |

విరించ్యాదిభాస్వత్కిరీటప్రతోలీప్రదీపాయమానప్రభాభాస్వరాయ || 21 ||


కచే చంద్రరేఖం కుచే తారహారం – కరే స్వాదుచాపం శరే షట్పదౌఘమ్ |

స్మరామి స్మరారేరభిప్రాయమేకం – మదాఘూర్ణనేత్రం మదీయం నిధానమ్ || 22 ||


శరేష్వేవ నాసా ధనుష్వేవ జిహ్వా – జపాపాటలే లోచనే తే స్వరూపే |

త్వగేషా భవచ్చంద్రఖండే శ్రవో మే – గుణే తే మనోవృత్తిరంబ త్వయి స్యాత్ || 23 ||


జగత్కర్మధీరాన్వచోధూతకీరాన్ – కుచన్యస్తహారాంకృపాసింధుపూరాన్ |

భవాంభోధిపారాన్మహాపాపదూరాన్ – భజే వేదసారాంశివప్రేమదారాన్ || 24 ||


సుధాసింధుసారే చిదానందనీరే – సముత్ఫుల్లనీపే సురత్రాంతరీపే |

మణివ్యూహసాలే స్థితే హైమశాలే – మనోజారివామే నిషణ్ణం మనో మే || 25 ||


దృగంతే విలోలా సుగంధీషుమాలా – ప్రపంచేంద్రజాలా విపత్సింధుకూలా |

మునిస్వాంతశాలా నమల్లోకపాలా – హృది ప్రేమలోలామృతస్వాదులీలా || 26 ||


జగజ్జాలమేతత్త్వయైవాంబ సృష్టం – త్వమేవాద్య యాసీంద్రియైరర్థజాలమ్ |

త్వమేకైవ కర్త్రీ త్వమేకైవ భోక్త్రీ – న మే పుణ్యపాపే న మే బంధమోక్షౌ || 27 ||


ఇతి ప్రేమభారేణ కించిన్మయోక్తం – న బుధ్వైవ తత్త్వం మదీయం త్వదీయం |

వినోదాయ బాలస్య మౌర్ఖ్యం హి మాతస్తదేతత్ప్రలాపస్తుతిం మే గృహాణ || 28 ||

భగవద్గీత

 అద్యాయం 8

శ్లోకం 14

అనన్యచేతాః సతతం యో మాం స్మరతినిత్యశః |

తస్యాహం సిలభః పార్థ నిత్యయుక్తస్య యోగినః ||

అర్థం :-

పార్థా! నిత్యము నిరంతరము అనన్యభావముతో చిత్తమును నాయందే నిలిపి, పురుషోత్తముడనైన నన్నేస్మరించుచు, సంతతము మత్పరాయణుడైన యోగికి నేను సులభుడను. అనగా అతనికి సహజముగానే నేను లభింతును.



 శ్రీ ధన్వంతరీ మహా మంత్రం



ఓం అం మహా ధన్వంతరియే ఆయురారోగ్య ఐశ్వర్య ప్రధాయకాయ వాతజనిత రోగాన్, పిత్త జనిత రోగాన్,  శ్లేష్మ జనిత రోగాన్, నిర్మూలనాయ, అన్నమయ, మనోమయ, ప్రాణమయ, విజ్ఞానమయ, ఆనందమయ, కోశామే సుధ్యన్తాం త్వకూం చర్మా మాంస రుధిర శుక్ర అస్తి తేజో మధ్య ప్రాణో పాన వ్యానోదాన సమానాః ఇహ ఆయాంతు సుఖం చిరంతు స్వాహ అమృతం వై ప్రాణః అమృతం ఆపః ప్రాణా నేవయదా స్థాన ముపహ్వాయతే ||

 శ్రీ ధన్వంతరీ మంత్రం

ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశ హస్తాయ వజ్రజలౌక హస్తాయ సర్వామయవినాశనాయ త్రైలోక్య నాథాయ శ్రీ మహా విష్ణవే నమః


భగవద్గీత

 అద్యాయం 8

శ్లోకం 13

ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరన్ |

యః ప్రయతి త్యజన్ దేహం స యాతి పరమాం గతిమ్||

అర్థం :-

అక్షర బ్రహ్మస్వరూపమైన ఓంకారమును ఉచ్చరించుచు, ఆ ఓంకారమునకు అర్థస్వరూపుడను, నిర్గుణబ్రహ్మను ఐన నన్ను చింతించుచు దేహత్యాగ మొనర్చువాడు పరమగతిని పొందును.




 ధన్వంతరి జయంతి సందర్బంగా


ధన్వంతరి ఆయుర్వేద చరిత్రలో ఒక విశిష్టమైన వ్యక్తి. అతను దేవతల వైద్యుడు మరియు అద్భుతమైన శస్త్రవైద్యుడు. ధన్వంతరిని ఆయుర్వేద పితామహుడిగా పిలుస్తారు.  చరక సంహిత ప్రకారం, ఆయుర్వేదం యొక్క జ్ఞానం శాశ్వతమైనది మరియు విశ్వం యొక్క సృష్టి ప్రతి చక్రంలో వెల్లడి చేయబడింది. ధన్వంతరి, శ్రీ మహావిష్ణువు యొక్క అవతారం. 

ఆయుర్వేదం పుట్టుక

బ్రహ్మ మానవజాతిని సృష్టించడానికి ముందే ఆయుర్వేదాన్ని కంపోజ్ చేశాడని ధన్వంతరి పేర్కొన్నాడు, 1,000 అధ్యాయాలలో అమర్చబడిన 100,000 శ్లోకాలలో అథర్వవేదంలోని ఉపాంగాలలో ఒకదాన్ని ఏర్పరిచాడు, ఇది మనుష్యుల పరిమిత తెలివితేటలు వారి స్వల్ప జీవిత కాలంలో నేర్చుకోవడం సులభం కాదు. కాబట్టి ధన్వంతరి ఋషుల అభ్యర్థనకు కట్టుబడి, బ్రహ్మ ఆయుర్వేదాన్ని 8 విభాగాలుగా విభజించారు. అవి 

శల్య, శలాక్య, కాయాచికిత్స, భూతవిద్య, కౌమారభృత్య, అగాదతంత్ర, రసాయనతంత్ర, వాజీకరణతంత్రం పునర్నిర్మించి భోదించారు.

ధన్వంతరి అవతారం

దేవతలు, రాక్షసులు కలిసి క్షిరసాగర మధనం చేస్తున్నపుడు. మొదట హాలాహలం వచ్చింది. దానిని మహాదేవుడైన శివుడు స్వీకరించారు. తరువాత కల్పవృక్షం, అపసరసాలు, ఐరావతం, ఉచైస్రావం, శ్రీమహాలక్ష్మి, అమృతాన్ని తీసుకొని ధన్వంతరి అవతరించారు. ఆయనా పీనాయుత బాహు దండాలను, కంబుకంఠాన్ని, పద్మారుణ లోచనాలను, విశాల వక్షఃప్రదేశాన్ని, సుస్నిగ్ధ కేశజాలాన్ని, నీల గాత్ర తేజాన్ని కలిగి, పీతాంబరం కట్టి, మణికుండలాలు ధరించి, పుష్పమాలా సమలంకృతుడై, హస్తతలాన అమృత కలశాన్ని దాల్చి ఆవిర్భవించారు. అతని విష్ణుదేవుని అంశాంశ వలన పుట్టినవారు, యజ్ఞభాగ భోజనుడు, ఆయుర్వేదజ్ఞుడు, మహనీయుడని బ్రహ్మాదులు గ్రహించి అతనికి "ధన్వంతరి" అని పేరు పెట్టారు. ఆయనా దేవతల వైద్యుడుగా ఉన్నారు. తరువాత ఆయుర్వేదాన్ని దానిని మూలలను మానవులకి అందించటానికి ధన్వంతరిని అవతరించామని ఇంద్రుడు ఆయనను నియమించారు.  

భాగవతంలోనే నవమ స్కంధంలో కాశీరాజు ధన్వంతరి గురించి పురూరవ వంశక్రమంలో ఉంది. ఆ ప్రకారం పురూరవునికి క్షత్రవృద్ధుడు, అతనికి సుహోత్రుడు, సుహోత్రునకు కాశ్యుడు, అతనికి కాశి, కాశికి దీర్ఘతపుడు, దీర్ఘతపునికి ధన్వంతరి జన్మించారు. ధన్వంతరి హరి అంశతో ప్రభవించి ఆయుర్వేద ప్రవర్తకుడయ్యాడు. ధన్వంతరి ఆయుర్వేద శాస్త్రాన్ని ఎనిమిది భాగాలుగా (ఆష్టాంగాలుగా) విభజించారట. అవి.

1. కాయ చికిత్స 

2. కౌమారభృత్య లేదా బాలచికిత్స 

3. భూతవైద్యం లేదా గ్రహచికిత్స 

4. శలాక్యతంత్ర 

5. శల్యతంత్ర

6. విషతంత్ర 

7. రసాయన తంత్ర 

8. వశీకరణ తంత్ర

ధన్వంతరి ఆలయాలు 

తమిళనాడు:-  శ్రీరంగం రంగనాధస్వామి ఆలయం ఆవరణలో ఒక ధన్వంతరి మందిరంలో నిత్య పూజలు జరుగుతున్నాయి. మందిరం వద్దనున్న శిలాఫలకం ప్రకారం అది 12వ శతాబ్దానికి చెందినది. అప్పటి గొప్ప ఆయుర్వేద వైద్యుడు గరుడవాహన భట్టార్ ఈ మందిరంలో మూర్తిని ప్రతిష్ఠించినట్లు తెలుస్తున్నది. ఇక్కడ తీర్ధంగా కొన్ని మూలికల రసం (కషాయం) ఇస్తారు.

కేరళ:- గురువాయూర్, త్రిస్సూర్‌లకు మధ్య 20 కి.మీ. దూరంలో "నెల్లువాయ" అనే గ్రామంలో ఒక ధన్వంతరి గుడి ఉంది. ఇది గురువాయూర్ దేవస్థానం అంత పురాతనమైనదని భావిస్తారు. తమ చికిత్సావృత్తి ప్రాంభానికి ముందు చాలా మంది ఆయుర్వేద వైద్యులు ఈ మందిరాన్ని దర్శిస్తుంటారు. కేరళలోనే కాలికట్ పట్టణం పరిసరాలలో ఒక "ధన్వంతరి క్షేత్రం" ఉంది. ఈ మందిరం ఇప్పుడు అధికంగా జనాదరణ పొందుతున్నది. వ్యాధి నివారణకు, ఆరోగ్యానికి ఇక్కడి దేవుడిని దర్శించి ప్రార్థనలు చేస్తుంటారు.

ఆంధ్రప్రదేశ్:-  తూర్పు గోదావరి జిల్లాలోని చింతలూరులో ప్రసిద్ధమైన ధన్వంతరి భగవానుని దేవాలయం ఉంది.

ధన్వంతరి ఆలయాలు ప్రత్యేకంగా కనిపించడం అరుదు. వారాణసిలోని సంస్కృత విశ్వవిద్యాలయం మ్యూజియంలో ఒక ధన్వంతరి విగ్రహం ఉంది. ఢిల్లీలోని "ఆయుర్వేద, సిద్ధ పరిశోధన మండలి కేంద్రం" లో ఒక పెద్ద, ఒక చిన్న ధన్వంతరి విగ్రహాలున్నాయి.

ఆరోగ్య దేవుడైన ధన్వంతరి పుట్టినరోజు వేడుకలు ఉత్సాహభరితమైన మరియు ఆహ్లాదకరమైన వాతావరణంలో జరుగుతాయి. ధన్వతరి జయంతిని భారతదేశం అంతటా భారతీయ సాంప్రదాయ వైద్యమైన ఆయుర్వేద అభ్యాసకులు జరుపుకుంటారు. ఈ ఆలయాల్లో ధన్వంతరి జయంతిని అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు. 


 శ్రీ మానసా దేవీ ద్వాదశ నామాల శ్లోకం


ఓం నమో మానసాయై  !!

జరత్కారు జగత్ గౌరి మానసా సిద్ద యొగినీ |

వైష్ణవి నాగ భగిని శైవీ నాగేశ్వరీ తధా ||

జరత్కారు ప్రియాస్థీక మాతా విష హరీతి చ |

మహాజ్ఞాన యుథాచైవ సా దేవీ విశ్వపూజితా ||

ద్వాదశైతానీ నామాని పూజా కాలేతు యః పఠేత్ |

తస్య నాగభయం నాస్తి తస్య వంశోత్బవశ్య చ ||

ఇదం స్తోత్రం పఠిత్వాతు ముచ్యతే నాత్ర సంశయః |

నాగభీతే చ శయనే నాగగ్రస్తే చ మందిరే ||

నాగక్షతే నాగదుర్ర్గే నాగ వేష్టిత విగ్రహే |

నిత్యం పఠేత్ యతుంధ్రుష్టవా నాగవర్గాః పలాయతే ||

నాగౌషధం భూషణః కృత్వా న భవేత్ గరుడ వాహనాః |

నాగాసనో నాగతల్పో మహాసిద్ధో భవేన్నరః ||


భగవద్గీత

 అద్యాయం 8

శ్లోకం 12

సర్వద్వారాణి సంయమ్య మనో హృది నిరుధ్య చ |

మూర్థ్న్యాధాయాత్మనః ప్రాణమ్ ఆస్థితో యోగధారణామ్ ||

అర్థం :-

సర్వేంద్రియములను నిగ్రహించి, మనస్సును హృదయమునందే స్థిరముగా నిలిపి, అట్లు వశమైన మనస్సుద్వారా ప్రాణములను సహస్రారమునందు స్థిరమొనర్చి, పరమాత్మధ్యానము నందే నిమగ్నుడై




భగవద్గీత

 అద్యాయం 8

శ్లోకం 10

ప్రయాణకాలే మనసాచలేన భక్త్యా యుక్తో యోగబలేన చైన |

భ్రువోర్మద్యే ప్రాణమావేశ్య సమ్యక్ స తం పరం పురుషముపైతి దివ్యమ్ ||

అర్థం :-

అట్టి పరమభక్తుడు అంత్యకాలమునందు యోగబలము చేత భ్రుకుటీ మధ్యమున ప్రాణములను స్థిరముగానిల్పి, నిశ్చలమైనమనస్సుతో స్మరించుచు దివ్యస్వరూపుడును, పరమపురుషుడును ఐన పరమాత్మనే చేరును.



||శ్రీ దేవి సుక్తం||

||యాదేవి సర్వభూతేషు||
||దేవ ఉవాచ||

నమో దేవ్యె మహా దేవ్యె శివాయై సతతం నమః |
నమః ప్రకృత్యే భద్రయై నియతః ప్రణతః స్మతామ్ ||

యా దేవీ సర్వభూతేషు విష్ణుమయేతి శబ్ధితా |
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః ||

యా దేవీ సర్వభూతేషు చేతనేత్యభిధీయతే |
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః ||

యాదేవీ సర్వ భూతేషు బుద్ధి రూపేణ సంస్థితా |
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః ||

యా దేవీ సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థితా |
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః || 

యా దేవీ సర్వభూతేషు క్షుధా రూపేణసంస్థితా | నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః ||

యా దేవీ సర్వభూతేషు ఛాయా రూపేణ సంస్థితా | నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః ||
యా దేవీ సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థితా | నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః ||
యా దేవీ సర్వభూతేషు తృష్ణా రూపేణసంస్థితా | నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః ||

యా దేవీ సర్వభూతేషు క్షాంతి రూపేణ సంస్థితా |
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః ||

యా దేవీ సర్వభూతేషు జాతిరూపేణ సంస్థితా |
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః ||

యా దేవీ సర్వభూతేషు లజ్జా రూపేణ సంస్థితా |
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః ||

యా దేవీ సర్వభూతేషు శాంతిరూపేణ సంస్థితా |
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః ||

యా దేవీ సర్వభూతేషు శ్రద్ధారూపేణ సంస్థితా |
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః ||

యా దేవీ సర్వభూతేషు కాంతిరూపేణ సంస్థితా | నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః ||

యా దేవీ సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థితా |
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః ||

యా దేవీ సర్వభూతేషు వృత్తిరూపేణ సంస్థితా |
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః ||

యా దేవీ సర్వభూతేషు స్మృతి రూపేణ సంస్థితా |
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః ||

యా దేవీ సర్వభూతేషు దయారూపేణ సంస్థితా |
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః ||

యా దేవీ సర్వభూతేషు తుష్టిరూపేణ సంస్థితా |
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః ||

యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా | నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః ||

యా దేవీ సర్వభూతేషు భ్రాంతి రూపేణ సంస్థితా |
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః ||

ఇంద్రియాణం మధిష్ఠాత్రి భూతానం చాఖిలేషు యా |
భూతేషు సతతం తస్యై వాప్తిదేవ్య నమోనమః ||

చితిరేణ యా కృత్స మేత ద్వా ప్య స్థితా జగత్ |
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః ||

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః||
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః||
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః||
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః||

||ఇతి శ్రీ దేవి సూక్తం||

భగవద్గీత

 అద్యాయం 8

శ్లోకం 9

కవిం పురాణమనుశాసితారమ్ అణోరణీయాంసమనుస్మరేద్యః |

సర్వస్య ధాతారమచింత్యరూపమ్ ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ ||

అర్థం :-

సర్వజ్ఞుడును, సనాతనుడును, అందరిని శాసించువాడును, అణువుకంటెను సూక్ష్మమైనవాడును, అందరినిపోషించువాడును, అచింత్య రూపుడును, సూర్యుని వలె నిత్యచేతన ప్రకాశరూపుడును, అజ్ఞానాంధకారమును పారద్రోలువాడును ఐన సచ్చిదానంద ఘనపరమేశ్వరుని స్మరించువాడగును.



భగవద్గీత

అద్యాయం 8

శ్లోకం 8

అభ్యాసయోగయుక్తేన చేతసా నాన్యగామినా|

పరమం పురుషం దివ్యం యాతిపార్థానుచింతయన్ ||

అర్థం :-

మనస్సును ఎటూ పోనియక నిరంతరము పరమేశ్వరుని ధ్యానరూపయోగమునే సాధనచేయు మనుష్యుడు దివ్యపురుషుడైన పరమాత్మనే చేరును. 



శ్రీ లలిత సహస్రనామావైభవం 5

 ఉద్యద్భానుసహస్రాభా – చతుర్భాహుసమన్వితా



లలితాసహస్రనామస్తోత్త్రములో ఇక్కడ పెద్ద రహస్యము ఉన్నది. దేవతల ఆ కార్యము కోసమని వస్తున్న అమ్మవారిని వశిన్యాదిదేవతలు స్తోత్త్రము చేస్తూ కేశపాదాదిపర్యంతము అనగా తలదగ్గరనుంచి పాదములవరకు అందించారు. ముందు తల చెప్పకుండా చతుర్భాహుసమన్వితా అని తల, చేతుల గురించి చెప్పడానికి ముందు ఉద్యద్భానుసహస్రాభా చేతులు – ఆయుధములు చెప్పారు. ఉద్యద్భానుసహస్రాభా అనగా ఉదయిస్తున్న వేయిసూర్యుల కాంతి కలిగిన తల్లి. సూర్యుడు ఉదయిస్తున్న సమయములో కాంతి ఎంతో ఎఱ్ఱగా ఉంటుంది. వేయిమంది సూర్యులు ఒకేసారి ఉదయిస్తే ఎంత కాంతి ఉంటుందన్న ఊహకికూడా అందదు. ముందు ఎఱ్ఱటికాంతి కనపడుతున్నదని ‘ఉత్’ అన్న శబ్దము వేశారు. ఉత్ అనగా పైకెత్తడము. కొన్ని కోట్లజన్మల తరవాత ఈ నామము వినబడి లోపల దర్శనమయితే ఆ జీవుడి జీవయాత్రలో పైకి ఎక్కడము ప్రారంభమయింది. బ్రహ్మ, విష్ణు, శివుడనే మూడుతత్త్వములను కలిపి ముద్ద చేసిన ఒకగుళిక అన్నట్టుగా సూర్యబింబము ఉన్నది. లలితాపరాభట్టారిక ఎరుపురంగులో ఎందుకు ఉంటుంది? ఆకాశము అంతా ఆ కాంతితో నిండిపోయి అన్నీ లేత ఎరుపులోకి వచ్చేస్తాయి. అమ్మవారి ఆవిర్భావమును ఎర్రటికాంతితో ధ్యానము చేస్తే ఏమవుతుంది ? ఆ ఎరుపునకు సౌందర్యలహరిలో శంకరాచార్యుల వారు చెప్పిన విషయమును పట్టుకుంటే జీవనయాత్రలో కొత్తమలుపు వస్తుంది. సూర్యబింబము ఉదయిస్తున్నప్పుడు ఎఱ్ఱటికాంతి – ‘శ్రీసరణిభిః’ ముందు వచ్చి కూర్చున్న ప్రాంతము అంతా ఎరుపులో మునిగిపోయి ఆ ఎరుపులో ధ్యానము చేస్తే ఊర్వశితో సహా మూడులోకములలోని దేవవేశ్యలు అంతా వశమైపోతారని అన్నారు. ఈ శ్లోకము స్త్రీలకు ఉపాసన చెయ్యడానికి, వృద్ధిలోకి వద్దామని అనుకున్న వారికి పనికిరాదు. జగద్గురువైన శంకరులు ఇటువంటి శ్లోకము ఇవ్వడమేమిటి? ఎరుపురంగు గురించి ఈ మాట చెప్పడము ఏమిటి? అనిపిస్తుంది. గురువుల బిగింపు చాలా విచిత్రముగా ఉంటుంది. వారి వెంటపడితే తప్ప దాని రహస్యము దొరకదు. మూడులోకములలోని అందగత్తెలు వశమయ్యారు అంటే మూడులోకములలోని ఆనందము ఏది ఉన్నదో అది తామైపోయి, జ్ఞాని అయి పూర్ణులయినట్టు. ఆనందమును బయట వెతుక్కోక లోపలే అనుభవిస్తూ ఆనందస్వరూపులై ఉంటారు. ‘చిదానంద రూపం శివోహం శివోహం’ అన్న భావనలు ఏర్పడడానికి కావలసిన అమ్మవారి అనుగ్రహపు ఎర్రటికాంతులను సూర్యమండలమునందు దర్శనము చేసి ఉపాసన చెయ్యడము. అమ్మవారి ఈ అనుగ్రహము ఎర్రగా ఉండే క్రియాశక్తిగా ఉంటుంది. అన్నిపనులు చేసే చేతిని క్రియాశక్తి అంటారు. కరమే కిరణము. ఆ కిరణముల వలన మొదట వచ్చిన కాంతి ఎరుపు. ఆ ఎరుపే అమ్మవారు. ఆవిడే భగవంతునిలో కలపగలదు. ఎరుపుని ధ్యానిస్తే పూర్ణత్వం వస్తుంది. ఈ ఎరుపు కారుణ్యము. ఈ ఎరుపులో రాజసం ఉన్నది. చిక్కబడిన ఎరుపు మెల్లగా ప్రవహిస్తుంది. పలుచగా ఉన్నది తొందరగా పరిగెడుతుంది. అమ్మవారి అనుగ్రహము బాగా ప్రసరించి ఎరుపుతో కలసిపోయినవారు మెల్లమెల్లగా కదిలి వెళ్ళి ఈశ్వరునిలో కలసిపోతారు. గొప్ప అనుగ్రహము అక్కడ మొదలయితే అనుభవించవలసిన ఆనందము ఇంకొకటి ఉండదు. అమ్మవారు అందరికీ దర్శనము కావాలన్న కోరికతో వశిన్యాదిదేవతలతో స్తోత్రము చెప్పిస్తూ ఈ కాంతి పడని వారికి తన దర్శనము కుదరదని, అలా తనను చూడలేని వారికి తల దగ్గరనుంచి చూడడము కుదరదని చెప్పింది. చేతులు క్రియాశక్తి. చేతుల వలన ఆ శక్తిని దర్శనము చేసి జీవితమును మార్చుకుంటున్నవారు వారిని తలనుంచి పాదముల వరకు చూడగలుగుతారు. అందుకని ముందు కాంతి మీద పడాలి. ఆవిడ ఆవిర్భావము ధ్యానము చేస్తే ఆ ఎరుపుకాంతిలో మునిగిపోతే ఆనాడు జన్మకు ధన్యత కలుగుతుంది. ఎరుపు దర్శనము చేసి అనుభవిద్దామని తాపత్రయము ఏర్పడనంత కాలము జీవయాత్ర సాగుతూనే ఉంటుంది. ఏదో ఒకనాడు ఒకసారి అమ్మవారి అనుగ్రహమును బలముగా సంపాదించుకుంటే వాళ్ళయందు క్రియాశక్తి ప్రారంభము అవుతుంది. ఇది కేవలము ఒక శ్లోకములో చెప్పడము కాదు. గురుముఖతః తెలుసుకుని ధ్యానములో అనుభవించగలగాలి. గురువు అనుగ్రహముగా ముడి విడిపోతే ధ్యానము చేసి పూర్ణులు కావాలి. ఎరుపుకాంతి వెనక ఇంత రహస్యము ఉన్నది.

శ్రీ లలిత సహస్రనామావైభవం 4

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...