ఓంకరం అమరేశ్వర జ్యోతిర్లింగం విశిష్టత

 ఓంకరం అమరేశ్వర జ్యోతిర్లింగం విశిష్టత 



            ఒకసారి నారదమహర్షి గోకర్ణనికి వెళ్లరు.అక్కడ ఉన్న ఆత్మలింగాన్ని దర్శనం చేసుకొని వస్తుంటే వెదురుగా వింధ్య పర్వతం పురుష రూపం ధరించి వచ్చారు. వింధ్య పర్వతం నారదమహర్షికి నమస్కరించి మహర్షి దయచేసి నా కోసం వేచి ఉంటారా నేను వెళ్లి ఆత్మలింగాన్ని దర్శనం చేసుకొని వస్తాను అన్నారు. నారద మహర్షి అంగికరించారు. వింధ్య పర్వతం వెళ్లి ఆత్మలింగాన్ని దర్శనం చేసుకొని వచ్చారు. నారదమహర్షి నాకు ఒక సందేహం అన్నారు. ఏమిటి అడుగు అన్నారు నారద మహర్షి. ఈ ప్రపంచంలో ఎవరైనా నాకన్నా గొప్పవాళ్ళు ఉన్నారా. అందుకు నారదమహర్షి ఎందుకు లేరు నీకన్నా గొప్పవాళ్ళు చాలామంది ఉన్నారు. వింధ్య పర్వతంకి కోపం వస్తుంది. వాళ్ళు అందరూ నాకన్నా ఎందుకు గొప్పవాళ్ళు అన్నారు. అందుకు నారదమహర్షి వాళ్ళ అందరిపైనా శివుడు వెలిశారు. నీపైన ఈ శివలింగం లేదుగా అందుకే వాళ్ళు అందరూ గొప్పవాళ్ళు అన్నారు. వింధ్య పర్వతానికి అహంకారం వచ్చింది. ఎలాగైనా శివుడిని నాపై వెలిసేలా చేసుకోవాలి అని తన చోటుకి వచ్చారు.  

                 వెంటనే వింధ్య పర్వతం మట్టితో పార్ధవలింగం చేసి దాని మీద ఓంకారాన్ని గీసి నియమ నిష్ఠలతో ఆరు నెలలు పాటు తపస్సు చేసారు. అతని తపస్సుకి మెచ్చి శివుడు పార్వతితో సహా వచ్చి ప్రత్యక్షమయ్యారు. వింధ్య పర్వతం సంతోషించి శివపార్వతులను ప్రార్ధన చేసారు. శివుడు వింధ్య పర్వతంతో నీ తపస్సుకి మెచ్చాను నీకు ఏమి వరం కావాలో కోరుకో అన్నారు. అందుకు వింధ్య పర్వతం  స్వామి! నా కొండా ప్రపంచంలో గొప్ప కొండా అవ్వాలి. నేను ఎంత పొడుగు కావాలంటే అంత పొడుగు పెరగాలి. ఇంకా మీరు నా కొండా మీద జ్యోతిర్లింగంగా వెలవాలి. నా కొండా రెండుగా చీలిపోయింది. మధ్యలో నర్మద నది ప్రవహిస్తుంది. అందువల్ల మీరు నా రెండు కొండలమీద వెలవండి అని అడిగారు. అందుకు శివుడు వింధ్య నీవు అడిగినట్టుగా రెండు లింగములుగా వెలుస్తాను. నీవు ఓంకారంగా నన్ను తపస్సు చేసావు కాబట్టి ఎక్కడ నేను ఓంకార జ్యోతిర్లింగంగా వెలుస్తాను. అవతల కొండా మీద అమరలింగేశ్వర జ్యోతిర్లింగంగా వెలుస్తాను. కానీ రెండు కలిపి ఒకటే జ్యోతిర్లింగం. ఈ క్షేత్రానికి వచ్చి రెండిటిని దర్శనం చేసుకుంటేనే పూర్తి దర్శన ఫలితం వస్తుంది. ఇక నేను ఇచ్చే వరం ఇతరులకి దుఃఖానికి కారణం కాకూడదు. నీవు ఎంతపొడవు కావాలి అంటే అంత పొడవు పెరగగలవు. కానీ నీవు లోకనాశనానికి ఉపయోగించదు అని చేపి శివుడు జ్యోతిర్లింగంగా వెలిశారు. 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...