మహాకాళేశ్వర జ్యోతిర్లింగ విశిష్టత 2

మహాకాళేశ్వర జ్యోతిర్లింగ విశిష్టత 2



మహాకాళేశ్వర జ్యోతిర్లింగ విశిష్టత

మహాకాళేశ్వరలింగ ఆవిర్భవించిన తరువాత కొంతకాలానికి అక్కడ చంద్రశేనుడు అనే రాజు పరిపాలించేవాడు. అతను ఉజాయిని మహా కాళేశ్వరునిడిని భక్తి శ్రద్ధలతో పూజించేవారు. ఒకసారి నారదుడు కైలాసానికి వెళ్లి అక్కడ శివుడు అతని పరివారంతో మాట్లాడుతూ మధ్యలో ప్రమథగణాలరా మీరు పూర్వజన్మలో చేసిన పుణ్యం వలన శివుని పరివారముతో ఒకరు అయ్యారు. కానీ భూలోకములో ఉజాయినిలో చంద్రశేనుడు అనే రాజు ఉన్నాడు. అతను శివునికి పరమ భక్తుడు అని చేపి వెళ్లిపోయారు. తరువాత శివుడు తన ప్రమథగణాలలో ఒకరైన మణిభద్రుడు అనే అతనిని వెళ్లి పరీక్షించామని పంపించారు. మణిభద్రుడు వచ్చి చంద్రషేనుడి భక్తికి మెచ్చి అతనికి చింతామణి అనే మణిని ఇచ్చారు. ఆ మణిని అతనికి ఇస్తూ చంద్రశేనుడికి ఇస్తూ దీనిని ఏదైనా లోహానికి తాకిస్తే అది బంగారం అవుతుంది. కానీ శత్రువులను చంపటానికి ఉపయోగపడదు. నీవు జీవించి అనంతవరకు ఈ మణి నీ దగర ఉంటుంది తరువాత నా దగరకు వస్తుంది. దీనిని ఎవరికీ ఇవ్వకూడదు అని చేపి వెళ్లిపోయారు. రాజు ఆమణిని లోహములకు తాకిస్తూ అన్నిటిని బంగారంగా మార్చేశారు. అతని రాజ్యం మొత్తం బంగారుమయం అయిపోయింది. చంద్రశేనుడి కీర్తి ప్రతిష్టలు వచ్చాయి. ఈ విషయం అన్ని రాజ్యాలకు చేరి అన్ని రాజ్యాలవారి ఏకమైయి మా మణిని మాకు అప్పగించు అని చంద్రశేనుడికి లేఖ పంపించారు. చంద్రశేనుడు లేఖ చదివి వారికీ తిరిగి లేఖ రాస్తూ ఈమణిని నాకు శివ పరివారముతో ఒకరైన మణిభద్రుడు నాకు ప్రసాదించారు. దీనిని ఎవరికీ ఇవ్వదు అని చెప్పారు. కాబ్బటి నేను మీకు ఈ మణిని ఇవ్వలేను అని రాసారు. రాజులందరికి కోపం వచ్చింది అతను అబద్ధం చెపుతున్నాడు మణి మనకి ఇవ్వవలసి వస్తుంది అని అందరూ దండయాత్రకు బయలుదేరారు. ఆ రాజులందరూ ఉజాయిని సరిహద్దులకు చేరి అవకాశం చుస్తునారు. రాజు కోటపైకి వచ్చి ఆ సమూహాన్ని చూసి భయపడి నన్ను ఆ మహాదేవుడే కాపాడతాడు అని మహాకాళేశ్వరలింగాని పూజించటానికి ఆలయానికి వెళ్లారు.

అపుడే అక్కడికి ఆలయాన్ని శుభ్రం చేయటానికి ఒకామె వచ్చింది. ఆమెకి ఒక ఎనిమిది సంవత్సరాల కుమారుడు ఉన్నాడు. ఆమెకి భర్తలేడు కుమారుడు చిన్నప్పుడే మరణించారు. ఆమె రాజుగారిని చూసి అయన పూజ అయినా తరువాత ఆలయాన్ని శుభ్రం చెందామని అక్కడే కూర్చుంది. ఇంతలో ఆమె కుమారుడు రాజు పూజ చేస్తున్న చోటికి వెళ్లరు. చిన్న పిల్లడు అవటం వాళ్ళ అతనిని ఎవరు ఆపలేదు. ఆ చిన్న కుర్రడు రాజు పూజని శ్రద్ధగా చూస్తూ అదంతా మనస్సులోనే గుర్తుపెట్టుకున్నారు. రాజు పూజ అయిపోయింది. అయన వెళ్లిపోయారు. తరువాత ఆమె ఆలయంలో పని పూర్తి చేసుకొని కుమారుడిని తీసుకొని ఇంటికి వెళ్లిపోయింది. ఆ రాత్రి అంత ఆ కుర్రాడికి నిద్రపట్టలేదు. నేను కూడా రాజులాగే పూజ చేయాలి అని మనస్సులో మననం చేసుకున్నాడు. తరువాత ఆమె ఆ కుర్రడిని ఇంటిలోనే ఉంచి పనికి వెళ్లిపోయింది. వాళ్ళ అమ్మ వెళ్లిన తరువాత ఆ కుర్రడు బయటకు వెళ్లి శివలింగంలాగా ఉన్న ఒకరాయిని తీసుకువచ్చి ఇంటిలో పెట్టి పెరడులో ఉన్న కొని పూవులు ఆకులూ తీసుకు వచ్చి ఆ శివలింగంలా ఉన్న రాయిమీద స్నానం సమర్పయామి అని నీటిని పోయటం. గంధం సమర్పయామి అని పక్కనే ఉన్న మట్టిని తీసి గంధం కాగా పెట్టాడు. పుష్పం సమర్పయామి అని పూవులు వేసాడు. అతను అలాగే రాజు పూజచేసినట్టు చేసి తరువాత ఆ శివలింగంలాగా ఉన్న రాయిని పట్టుకొని శివ శివ అని ఏడుస్తూ కూర్చున్నాడు. ఇంతలో వాళ్ళ అమ్మ వచ్చి వీరి ఇంటికి పక్కన వంటకోసం చిన్న గుడిసె వేసుకున్నారు. ఆమె వస్తూనే వంట గదిలోకి వెళ్లి వంటచేసి తన కుమారుడిని తినటానికి పిలిచింది. ఆ పిల్లవాడు శివ శివ అని ఏడుస్తూ ఉన్నాడు కానీ అతని తల్లి మాట వినిపించుకోలేదు. ఎంత పిలిచినా పిల్లవాడు రావటం లేదు అని వచ్చి చూసింది. పిల్లవాడు ఏడవటం చూసి ఏమిటిరా ఏపని ఒకరాయిని పట్టుకొని ఏడుస్తున్నారు. ఈ రాయి శివుడు ఏమిటి అని పక్కకు లాగింది. అయినా పిల్లవాడు శివశివ అనే ఏడుస్తున్నాడు. అతనిని బాగా కోటింది. ఈ రాయి ఎక్కడేఉంటే మామూలువాడు కాదు అని ఆ రాయిని భయటపడేసింది. ఆమె వెళ్లి పోయి వంట గదిలో నిద్రపోయింది. ఆ కుర్రవాడు ఇంకా శివ శివ అని ఏడుస్తూనే ఉన్నాడు.

తరువాత అతని పూజచేసి చోట ఒక రత్నలు, మణులు తాపడం చేసిన ఒక శివలింగం ప్రత్యక్షం అయింది. ఆ పిల్లవాడు సంతోషించి మళ్ళి శివలింగాన్ని పట్టుకునాడు. అంటే అతను ఉన్న గుడిసె కాస్త బంగారం మణులు, రత్నాలతో భవనం అయిపోయింది. కైలాసం నుంచి గంటలు వచ్చి మారుమోగటం మొదలు పెట్టాయి. ఆ శబ్దానికి అతని తల్లి నిద్ర లేచింది. బయటకు వచ్చి తన గుడిసె బంగారు భవనం అవతాన్ని చూసి లోపలి వెళ్లి తన కుమారుడిని పట్టుకొని ఏడవటం మోసాలు పెటింది. నేను ఎంత తప్పు చేశాను. నువ్వు ఏదో పిచ్చి అర్థాలు ఆడుతున్నావు అనుకోని నిను కొట్టనురా నువ్వు ఇంత భక్తిగా శివుడి పూజచేస్తునావు అనుకోలేదు అని ఏడిచింది. ఇంతలో చుటుపక్కలవాళ్ళు వచ్చి ఏమిజరిగింది అని అడగ్గగా జరిగినంత చెప్పింది. క్షణాలలో రాజ్యం మొత్తం రాజుగారికి ఈ విషయం తెలిసి అక్కడకు వచ్చి ఆ కుర్రవాడిని నీవు ఎంత భక్తుడివిరా నేను చేసిన పూజకి శివ పరివారముతో ఉన్న మణిభద్రుడు వచ్చి నాకు రత్నం ఇచ్చారు. కాని భక్తికి మెచ్చి సాక్షాత్తు శివుడే వచ్చాడు. 

ఈ వార్త గుప్తచారుల ద్వారా రాజ్యం బయట ఉన్న రాజులకు తెలిసింది. వారు భయపడిపోయి ఈ చంద్రశేనుడు నిజంగా గొప్ప శివ భక్తుడు. అందకే అతని రాజ్యంలోని వారందరు పిలిస్తే శివుడు వస్తున్నాడు. ఇంకా అతని రాజ్యం మీద దండయాత్ర చేయలేదు చేస్తే శివుడే మన ప్రాణాలను తీసేవారు అని రాజులంతా కలిసి చంద్రశేనుడికి రాయభారం పంపారు. చంద్రశేనమహారాజా! మేము మా తప్పులను తెలుసుకున్నాము. నీవు అనుమతి ఇస్తే మహాకాళేశ్వరుడిని దర్శనం చేసుకొని వెళతాము. రాజు వారిని అనుమతించి రాజ్యం లోనికి రాణించారు. రాజులందరూ ముందు మహాకాళేశ్వరుడిని దర్శంచేసుకొని తరువాత మణిరత్నశివలింగాని దర్శనం చేసుకోవటానికి వెళ్లరు. అపుడు ఆ రాజులూ అందరూ ఆ కుర్రడితో నీవు ఇంతగొప్ప శివ భక్తుడివిరా నీ కోసం సాక్షత్తు శివుడే వచ్చారు. 

అపుడే అందరూ చూస్తుండగా అక్కడ ఆంజనేయస్వామి ప్రత్యక్షమైనారు. అందరూ కలిసి రామభక్త హనుమాన్ శ్రీ ఆంజనేయం ప్రాదించారు. అపుడే ఆంజనేయ స్వామి జనులారా నేను శ్రీ విష్ణు భగవానుడి వరమును మీకు తెలపటానికి వచ్చాను ఏమిటంటే ఈ కుర్రవాడు తన భక్తితో సాక్షాత్తు ఆ మహా దేవుడినే ప్రసన్నం చేసుకున్నారు. అందుకే ఇతని వంశంలో ఎనిమిదొవ తరంలో వసువులలో ఒకరైన నందుడు, యశోదలు జన్మిస్తారు. నేను వారికీ పెంపుడు పుత్రుడికి శ్రీకృష్ణుడుగా జన్మిస్తాను ఏది శ్రీమహా విష్ణువు వరం. ఇకనుంచి నేను ఈ క్షేత్రానికి క్షత్రపాలకునిగా ఉంటాను. ఇతను ఇకనుంచి శ్రీకరుడు అనే నామంతో ప్రసిద్ధిచెందుతాడు అని చేపి ఆంజనేయస్వామి అదృశ్యమైపోయారు. 

తరువాత శ్రీకరుడు రాజుకి ముఖ్య పరిచారికుడై శివభక్తుడిగా ప్రసిద్ధి చెందాడు. కొంతకాలానికి శ్రీకరుడు మరణించి కైలాసానికి వెళుతూ శివుడితో మహాదేవ నేను ఉన్నతవరకు ఈ శివలింగము బాగానే ఉంది తరువాత ఈ ఆలయాన్ని నువ్వే చూసుకోవాలి అని చెప్పారు. వెంటనే శివుడు ఆ ఆలయాన్ని మాములు బండరాళ్లతో చేసిన ఆలయంగా శివలింగాన్ని మాములు శివలింగంగా మారిపోయింది 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...