రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.  




1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రాముడు శివధనుర్భగం చేసారు అని ఆయనమీదకి యుద్ధనికి వచ్చి చివరికి శ్రీరాముడే శ్రీమహావిష్ణువు అని తెలుసుకొని వెళ్లిపోతారు.  ఇటు మహాభారతంలో భీష్ముడికి,  కర్ణుడికి గురువుగా కనిపిస్తారు. 

2. హనుమంతుడు = రామాయణంలో సీతారాములను కలపటానికి కీలకంగా వ్యవహరిస్తారు.  అంతేకాకుండా శ్రీరాముడిని తన దైవంగా పూజిస్తారు. మహాభారతంలో భీముడు పారిజాత పువ్వుల కోసం కుబేరుని వనం లోకి వెళుతుండగా  గంధమాదన పర్వతం పైన బీముడికి దర్శనం ఇచ్చి దిశా నిర్ధేశం చేస్తారు.

3 జాంబవంతుడు = రామాయణంలో  రామరావణ యుద్ధంలో రాముని పక్షం వహించి యుద్ధం చేస్తారు. అలాగే మహా భారతంలో శ్రీకృష్ణుడికి తన కుమార్తె జాంబవతిని ఇచ్చి వివాహం చేస్తారు.

4. విభీషణుడు = రామాయణంలో లంకలో రావణుని తమ్మునిగా రావణుని మరణానంతరం రాక్షస రాజుగా సింహాసనాన్ని అధిష్టిస్తారు. మహాభారతంలో సహదేవునికి రాజసూయ యాగం కింద తన మంత్రుల ద్వారా కప్పం  చెలిస్తారు. 

5. మాతలి =ఇంద్రుడి రధసారధి. ఈయన రామాయణంలో రాముడికి మహాభారతంలో అర్జునుడికి సారధ్యం వహిస్తారు.

6. నారద మహర్షి = ఈయన రామాయణంలోను మహాభారతంలోని కనిపిస్తారు.


ద్రోణుడు ఏకలవ్యుడిని బొటనవేళ్లుని అడగటం ధర్మమా? అధర్మమా ?

 ద్రోణుడు ఏకలవ్యుడిని బొటనవేళ్లుని అడగటం ధర్మమా? అధర్మమా ?



ఏకలవ్యుడు హిరణ్యధనువు అనే నిషాదరాజు పుత్రుడు.


ఏకలవ్యుడు ఒకరోజు ద్రోణుడి దగ్గరకు వచ్చి తనకు విల్లు విద్య నేర్పమని అడిగాడు. దానికి ద్రోణుడు అంగీకరించాడు. అప్పుడు ఏకలవ్యుడు తిరిగి తాను ఉండే అరణ్యానికి వెళ్ళిపోయి ద్రోణుడినే గురువుగా భావిస్తూ విల్లువిద్య నేర్చుకున్నాడు.


ఒకరోజు కౌరవాపాండవులు వేటకు అడవికి వెళ్ళగా అక్కడ శబ్దబేది అనే అస్త్రం ప్రయోగించి ఏడు భాణాలు కుక్క నోట్లో పాడేటట్లు ఏకలవ్యుడు కొట్టాడు. అదిచూసి కౌరవ పాండవులు ద్రోణుడి వద్దకు వెళ్లి జరిగినది చెప్పారు. అతను ఎవరో చూద్దామని ద్రోణుడు ఏకలవ్యుడి వద్దకు వెళ్ళాడు. ఏకలవ్యుడు తననే గురువుగా భావించి విల్లువిద్య నేర్చుకున్నట్లు తెలిసింది. అప్పుడు ద్రోణుడు జరిగినది అర్ధం చేసుకొని నీవు నాకు గురు దక్షిణ చెల్లించాలి అన్నారు. అందుకు ఏకలవ్యుడు మీకు ఏమి ఇవ్వాలో అజ్ఞాపించండి అన్నారు. అప్పుడు ద్రోణుడు "నీ కుడి చేతి బొటన వెలు నివ్వు" అన్నారు. ఏకలవ్యుడు తన బొటన వెలునీ కోసి గురువు పాదాల దగ్గర ఉంచి గురువుని నమస్కారం వెళ్ళిపోయాడు. ఇది ధర్మమా? అధర్మమా?


అసలు ద్రోణుడు ఏకలవ్యుడికి విద్య ఎందుకు నేర్పలేదు?


అందుకు కారణం మహాభారతం అప్పటి కలమాన పరిస్థితులను బట్టి ద్రోణుడు హస్తినా పురంలో భిష్ముడి ద్వారా కురుపాండవులకు విద్యా నేర్పటానికి నియమించబడిన ఉద్యోగి. ఉద్యోగికి స్వాతంత్రం లేదు. యజమాని చెప్పే ధర్మలను పాటించవలసిందే. ఆ కాలపు నీయమాలను బట్టి బ్రాహ్మణక్షత్రియులకు తప్ప యుద్ధవిద్యాలు ఇతరులకు నేర్పటం నిషిద్ధం. అందుకనే ద్రోణుడు ఏకలవ్యుడికి విద్య నేర్పలేదు.


మరి 


ద్రోణుడు ఏకలవ్యుడి బొటనవేళ్లుని ఎందుకు అడిగాడు?


దానికి కారణం


అడవిలో జరిగిన విషయం కురుపాందవుల ద్వారా తెలుసుకున్న ద్రోణుడు దివ్యస్త్రాలు ఎప్పుడు జంతువులపైకాని నిరాయుధులపైకాని దివ్యస్త్రా విద్యా తెలియని వారిపై కానీ ప్రయోగించకూడదు. ఈ ధర్మాన్ని అతిక్రమించాడు ఏకలవ్యుడు. అందుకనే ఇతనిని ఈ విధముగా వదిలేస్తే తరువాతి కాలంలో అమాయకప్రజలపైన తన ప్రతాపాన్ని చూపిస్తాడు లోకానాశనానికి పునుకుంటాడు. ఇతనికి ఏది మంచి, ఏది చెడు తెలియదు. ఎక్కడ ఏమివాడాలో విచక్షణా జ్ఞానం లేదు. అందుకే ద్రోణుడు ఏకలవ్యుడిని బొటనవేళ్ళుతనకు గురుదక్షిణగా ఇవ్వమన్నారు. విల్లువిధ్యకు మూలం బొటనవిల్లే. గురుదక్షిణ సమర్పించిన ఏకలవ్యుడు అలాగే ఉండకుండా ఆ నాలుగు వేళ్ళతోనే విల్లు విద్యా అభ్యసించాడు.


ద్రోణచార్యులు అనుకున్నదే నిజంగా జరిగింది. ఏకలవ్యుడు ధర్మం వైపు కాకుండా అధర్మం వైపు అడుగులు వేసాడు. అధర్మానికి మారుపేరుగా నిలిచిన జారాసందునీతో చేరాడు. ఏకలవ్యుడు జరసందునికి విశ్వాసపాత్రుడిగా మారాడు. జరసంధుడు శ్రీకృష్ణుడితో యుద్ధనికి వచ్చినప్పుడు జరసంధుడి సైన్యంతో పాటు వచ్చిన ఏకలవ్యుడు శ్రీకృష్ణుడితో యుద్ధం చేసి అయన చేతిలో మరణించాడు. 


ద్రోణుడు నిజంగా స్వార్ధపరుడే అయితే తనని చంపటానికి పుటింది ధ్రుష్టద్యుమ్నుడు అని తెలిసిన అతనికి గురువై సకల విద్యాలు నేర్పించారు.

భగవద్గీత -అధ్యాయం 2

అధ్యాయం 2




































































































భగవద్గీత

 భగవద్గీత

అధ్యాయం 1
                                                


































లోకారాక్షనార్ధం భూభారాని తగ్గించి తిరిగి వైకుంఠనికి మారాలిని పరంధామ్ముడు



యాదవులు తమలో తాము మద్యపానంచేసి మత్తిల్లి, ఈర్ష్యతో పరిహాసంగా పోట్లాడుకోవడం మొదలుపెట్టారు. అది నిజమైన పోట్లాటగా మారింది. ఏనుగులు, గుఱ్ఱాలు, రథాలు, కాల్బలములు తోకూడి అడ్డు ఆపు లేకుండా వారిలో వారే యుద్ధాలు మొదలుపెట్టారు. మునిశాపం కారణంగా ఎత్తుగా పెరిగిన తుంగ బెత్తాలతో అలసిపోయేలా కొట్టుకుంటూ బాదుకుంటూ యుద్ధాలు చేయసాగారు. ఆ తుంగబెత్తాలు వజ్రాయుధంతో సమానమైన ఆయుధాలవలె తాక సాగాయి. అలా ఒకరినొకరు పొడుచుకుంటూ భయంకరంగా యుద్ధం చేశారు. రణరంగమంతా ముక్కలు ముక్కలై చెదరిన మొండెములతో, వికలమైన దేహాలతో, విరిగిన రథాలతో, కూలిన గుఱ్ఱాలతో, వాలిన ఏనుగులతో నిండిపోయింది. యాదవులు అందరూ ఆ సమరంలో చచ్చిపోయారు. వారి నందరిని గోలోకానికి పంపించి నవ్వుకుంటూ శ్రీకృష్ణుడు బలరాముడు ఎటో వెళ్ళిపోయారు. కొంతదూరం వెళ్ళిన తరువాత బలరాముడు ఒక్కడు వేరు మార్గాన పోయి యోగమార్గంతో అనంతునిలో కలిశాడు. పరమేశ్వరుడు శ్రీకృష్ణుడు మరో మార్గంలో వెళ్ళి ఒక గుబురు పొద చాటున విశ్రాంతిగా పడుకుని ఒక కాలు మీద మరొక కాలు పెట్టి వినోదంగా ఆడిస్తున్నాడు. ఆ సమయంలో, ఒక బోయవాడు వేటకు వచ్చి అన్ని ప్రక్కలకు నిక్కి చూస్తూ ఉంటే, ఆ చెట్టుచాటున ఆ పరమపురుషుని కదలుతున్న కాలు లేడి చెవిలాగా కనిపించింది. అది చూసి, అంబులపొది నుంచి బాణం తీసి విల్లెక్కుపెట్టి గురిచూసి కొట్టాడు. ఆ బాణం తగిలి శ్రీకృష్ణుడు హాహాకారం చేయసాగాడు. వాడు దగ్గరకు వచ్చి చూసి జగదీశ్వరుడైన కృష్ణుడని తెలుసుకుని భయంతో, “అపరాధం చేసాను పాపాత్ముడిని వక్రబుద్ధిని.” అని రకరకాలుగా దీనంగా ఏడుస్తూ కన్నీరు కార్చసాగాడు. వానిని చూసి కృష్ణుడు దయతో ఇలా అన్నాడు. “నీవు దుఃఖిచనక్కర లేదు. నీవు పూర్వజన్మలో వాలివి. నేను రామావతారంలో నిన్ను చెట్టు చాటునుండి వాదించాను. కనుకనే ఎలా జరిగింది. పూర్వజన్మల కర్మలు అనుభవించక ఎంతటి వారికి అయినా తప్పవు. వాటి ఫలితాల ఊరకే పోవు. నీవు నిమిత్రమాతృడివి మాత్రమే.” ఇలా వాడికి నచ్చ చెప్పినా వాడు, “ఇంత పెద్ద తప్పు చేసాక ఊరకే పోదు. దైవానికి, గురువులకు, వైష్ణవులకు, ద్రోహం చేసినవాడు ధరణిపై నిలువరాదు.” అని పలికి, పవిత్రమైన మనస్సుతో ప్రాయోపవేశం చేసి ప్రాణాలు వదిలి వైకుంఠానికి వెళ్ళాడు. అదే సమయంలో రథసారథి అయిన దారుకుడు వచ్చి సర్వజ్ఞుడు, మేరుపర్వతధీరుడు, దనుజ సంహారుడు అయిన శ్రీకృష్ణుడు ఒంటరిగా ఉండటం చూసాడు. అలా చూసి మిక్కిలి భయ భక్తులతో చేతులు జోడించి దారుకుడు ఇలా అన్నాడు. నిన్ను చూడని కన్నులు నిష్ఫల మైనవి; నిన్ను వర్ణించని నాలుక నీరసమైనది; నిన్ను కనుగొనని దినాలు నిందింపదగినవి; స్వామీ! నీ కనులెత్తి మమ్ము దయతో చూడు. అంటూ దారుకుడు మిక్కిలి దుఃఖంతో ఇలా విన్నవించాడు. “సముద్రమంత యాదవ సమూహం నశించింది. బంధువులు, గురువులు, మిత్రులు అందరు అటు ఇటూ చెల్లాచెదురైపోయారు. ద్వారకకు పోయి మిత్రులతో ఏమని చెప్పాలి.” అని అంటూండగానే, శ్రీకృష్ణుని దివ్యమైన ఆయుధాలు, గుఱ్ఱాలూ మాయమైయి తిరిగి వైకుంఠనికి చేరాయి. ఇంధ్రుడు ద్వారకా నగర నిర్మాణం అయినపుడు శ్రీకృష్ణుడికి ఇచ్చిన సుదర్మ అనే సభ మాయమాయి తిరిగి స్వర్గానికి చేరింది. శ్రీకృష్ణుడు దారుకుడితో, “అక్రూరునికీ విదురునికీ జరిగిందంతా చెప్పు. స్త్రీలను, పిల్లలను, పెద్దవారిని హస్తినాపురానికి తీసుకుని వెళ్ళమని అర్జునుడితో చెప్పు. వెళ్ళు.” అన్నాడు. దారుకుడు తిరిగివెళ్ళి కృష్ణుడి మాటలు వివరంగా అందరికీ చెప్పాడు. ఆయన చెప్పినట్లు చేసేటంతలో ద్వారకానగరం పూర్తిగా జలాలలో మునిగిపోయింది. ఎవరికీ ప్రవేశించటానికి వీలులేని స్థితికి వెళ్ళిపోయింది.
అప్పుడు పరమేశ్వరుడైన శ్రీకృష్ణుడు నూరుకోట్ల సూర్యుల దివ్యతేజస్సుతో వెడలి నారదుడు మున్నగు మునులు, బ్రహ్మదేవుడు, రుద్రుడు, మొదలయిన దేవతలు జయజయ నినాదాలతో వెంట రాగా తన స్థానానికి వెళ్ళిపోయాడు. ఆ నారాయణుని విగ్రహము సముద్ర ప్రాంతంలో జగన్నాథుడి రూపంతో ఉంది(ఆ విగ్రహానే తరువాతి కాలంలో ఆదిశంకరచార్యుల వారు ద్వారకాలో ప్రతిష్టించారు). ధారకుడు శ్రీకృష్ణ నిర్యాణం గురించి చెప్పగానే శ్రీకృష్ణుడి అష్ట భార్యలు దైవాంసంబూతులు కాబ్బటి వారుకూడా తమ అవతారం చలించే సమయం వచ్చింది అని అగ్నిప్రవేశం చేసి యోగమార్గములో వైకుంఠనికి చేరుతారు. మిగిలిన 16,000మంది భార్యలు వారికీ మాయ విడువక భూమిపైన ఉండిపోతారు. వారినే అర్జునుడు తీసుకువెలుతుందగా దొంగలు దోచుకుంటారు. శ్రీకృష్ణుడు వెళ్లిపోగానే భూమాత ఏడుస్తూ కొద్దీ కొద్దిగా కంపించాసాగింది. శ్రీకృష్ణుడు వెళిపోయాడు అన్న విషయాన్ని అర్జునుడికి ద్వారా తెలుసుకున్న మిగిలిన పాండవులు కూడా పరీక్షితుకి పట్టభిషేకం చేసి వారు ద్రౌపదితో కలసి నిర్వణానికి వెళ్లిపోతారు.  శ్రీకృష్ణుడు కేవలం ఒక పతివ్రత ఇచ్చిన శాపాన్ని గౌరవించి ఇది అంత చేయవలసి వచ్చింది. ఆయన జీవితం ఒక అద్భుతం. జీవితంలో ఓడిపోయాము అనిపించినా ఒకసారి ఈ కథ చదివిన వారికీ మళ్ళీ జీవితం పై ఉత్సాహం వస్తుంది. వైకుంఠములో ఉన్న స్వామి మానవులను రక్షించటానికి భూమిపైకి వచ్చి అందరిని సరైన మార్గంలో నడిపించి జగతుకి గురువైయారు.

కృష్ణం వందే జగత్ గురుం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

నేను ఈ రచనలో ఏమైనా అక్షర దొషాలు ఉన్న క్షమించి ఇంతవరకు ఈ కథను చదివినందుకు ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏

                                                           సమాప్తం


రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...