భగవద్గీత

అధ్యాయం 4

శ్లోకం 42

తస్మాదజ్ఞానసంభూతం హృత్ స్థం జ్ఞానాసినాత్మనః |

ఛిత్త్వైనం సంశయం యోగమ్ ఆతిష్టోత్తిష్ట భారత ||

ఓం తత్పాదితి శ్రీమధ్భగవద్గిత్తాసుపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే జ్ఞానకర్మసన్న్యాసయోగోనామ చతుర్ధోధ్యాయ: ||4||

అర్ధం :-

ఓ భారత! నీ హృదయమునందు గల అజ్ఞాన జనితమైన ఈ సంశయమును వివేకజ్ఞానమును ఖడ్గముతో రూపుమాపి, సమత్వరూప కర్మయోగమునందు స్థితుడైన యుధ్ధామునకు సన్నధ్ధుడవగుము. 

భగవద్గీత

అధ్యాయం 4

శ్లోకం 41

యోగసన్న్యస్తకర్మాణం జ్ఞనసఛిన్నసంశయమ్  |

ఆత్మవంతం న కర్మాణి నిబధ్నాoతి ధనంజయ | |

అర్ధం :-

ఓ ధనుంజయా! విధిపూర్వకముగా కర్మలను ఆచరించుచు, కర్మ ఫలములను అన్నిటిని భగవదర్పణము చేయుచు, వివేకముద్వారా సంశయములన్నింటిని తొలగించుకొనుచు, అంతఃకరణమును వశమునందుంచు కొనిన వానిని కర్మలు బంధింపజాలవు. 

భగవద్గీత

అధ్యాయం 4

శ్లోకం 40

ఆజ్ఞశ్చశ్రధ్దధా నాశ్చ సంశయాత్మా వినశ్యతి |

నాయం లోకో స్తి న  పరో న సుఖం సంశయాత్మనః ||

అర్ధం :-

అవివేకియు, శ్రధ్ధారహితుడును అయిన సంశయాత్ముడు పరమార్ధ విషయమున అవశ్యము భ్రష్ఠుడేయగును. అట్టి సంశయాత్మునకు ఈ లోకములోకాని పరలోకములోగాని ఎట్టి సుఖమూ ఉండదు. 

భగవద్గీత

అధ్యాయం 4

శ్లోకం 39

శ్రధ్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః |

జ్ఞానం లబ్ధ్వా పరమ్ శాంతిమ్ అచిరేనదిగఛ్చతి ||

అర్ధం :-

జితేంద్రియుడు, సాధనాపరాయణుడు శ్రధ్ధాలువైన మనుజునకు ఈ భగవత్తత్త్వ జ్ఞానము లభించును. ఈ జ్ఞానము కలిగిన వెంటనే అతడు భగవత్తత్త్వ రూపమైన పరమశాంతిని పొందును. 

భాగవతం

పరీక్షితు మహరాజుకు శుక మహర్షి భాగవత కథను ఎన్ని రోజులో చెప్పరు? 



భగవద్గీత

అధ్యాయం 4

శ్లోకం 38

న హి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే |

తత్స్వయం యోగసంసిధ్ద: కాలేనాత్మని విందతి ||

అర్ధం :-

ప్రపంచమున జ్ఞానముతో సమానముగా పవిత్రమైనది మరియొకటి లేనేలేదు. శుధ్ధాతఃకారణముగల సాధకుడు బహుకాలమువరకు కర్మయోగాచారణము చేసి, ఆత్మయందు అదే జ్ఞానమును తనంతటతానే పొందగగలడు. 

భగవద్గీత

అధ్యాయం 4

శ్లోకం 37

యథైధాంసి సమిద్ధోగ్నిః భస్మసాత్కురుతేర్జున |

జ్ఞానాగ్నిః సర్వకర్మాణి భస్మసాత్కురుతే తథా ||

అర్ధం :-

ఓ అర్జునా! ప్రజ్వలించుచున్న ఆగ్ని సమిధులను భస్మముచేసినట్లు జ్ఞానమును ఆగ్ని కర్మల నన్నింటిని భస్మమొనరించును. 

భగవద్గీత

అధ్యాయం 4

శ్లోకం 36

అపి చేదసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః |

సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి ||

అర్ధం :-

పిమ్మట స్చచిదానందఘనపరమాత్ముడనైనా నాలో చూడగలవు. ఒకవేళ పాపాత్ములందరికంటేను నీవు ఒక మహాపాపివి అయినచో, జ్ఞాననౌక సహాయములో పాపసముద్రము నుండి నిస్సందేహముగా పూర్తిగా బయట పడగలవు. 

భగవద్గీత

అధ్యాయం 4

శ్లోకం 35

యద్ జ్ఞాత్వా న పునర్మోహమ్ ఏవం యాస్యసి పాండవ |

యేన భూతాన్యశేషేణ ద్రక్ష్యస్యాత్మన్యథో మయి ||

అర్ధం :-

ఓ అర్జునా! ఈ తత్త్వజ్ఞానమునెరింగినచో మరల ఇట్టి వ్యామోహములో చిక్కుకొన్నావు. ఈ జ్ఞాన ప్రభావములో సమస్త ప్రాణులను నీలో సంపూర్ణముగా చూడగలవు. 

భాగవతం

 శ్రీ కృష్ణుడి కన్న తల్లి ఎవరు ?

(1) దేవకి     (2) యశోద    (3) రోహిణి     (4) కుంతి




భగవద్గీత

అధ్యాయం 4

శ్లోకం 34

తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా |

ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్త్వదర్శినః ||

అర్ధం :-

నీవు తత్త్వమును దర్శించిన జ్ఞానుల కడకేగి, ఆ జ్ఞానమును గ్రహింపుము. వారికీ దండప్రణామములాచరించుటవలనను, సేవలొనర్చుటవలనను, కపటము లేకుండ భక్తిశ్రద్ధలతో సముచితరీతిలో ప్రశ్నించుటవలనను, పరమాత్మతత్త్వమును చక్కగానేరంగిన జ్ఞానులు సంప్రీతులై, నీకు ఆ పరమాత్మతత్త్వనమును ఉపదేశించెదరు. 

శ్రీకృష్ణ

తృణవ్రతుడి వధ 

నందనవనంలో కొన్నిరోజుల తరువాత ఒకరోజు ఆరుబయట యశోద, రోహిణి కృష్ణుడిని కూర్చుబెట్టుకొని ఉన్నారు. కొంతసేపటికి ఉన్నటుండి కృష్ణుడు బరువు పెరిగిపోయాడు. యశోద కృష్ణుడిని మోయలేక కింద కుర్చోపెటింది. నందనవనంలో ఉన్నటుండి సుడిగాలి వచ్చింది. వస్తూనే కృష్ణుడిని తీసుకెళ్లింది. సుడిగాలినుంచి తేరుకొని చూసేసరికి పక్కన కృష్ణుడు లేడు. యశోద ఏడుస్తూ అంత వెతకసాగింది. ఈలోపు సుడిగాలి రూపములో వచ్చిన తృణవ్రతుడు సంతోషపడుతూ ఎవరూ చంపలేక పోయారు  నేను చంపేస్తునాను కృష్ణుడిని అనుకున్నాడు. కృష్ణుడిని ఇంకా పైకి పైకి తీసుకువెళ్ళుతున్నాడు. ఉన్నటుంది కృష్ణుడు మళ్ళి బరువు పెరిగాడు. తృణవ్రతుడు పైకి వేలేవాడు కాస్త కిందకి పడిపోవటం మొదలు పెట్టాడు. కృష్ణుడు తృణవ్రతుడి పీక పట్టుకొని నలిపి సంహరించాడు. తృణవ్రతుడు ప్రాణాలు కోల్పోయి కింద పడిపోయాడు. రాక్షుసుడి మీద కృష్ణుడు పడి ఆడుకుంటున్నాడు. యశోద ఏడుస్తూ కృష్ణుడిని వెతుకుంటూ వస్తుంది. కృష్ణుడిని తీసుకొని ఇంటికి వెళ్లి ఆవుపేడతోను, గోమాత తోకతోను కృష్ణుడికి అయన 12 నామాలతోనే ఆయనకి దిష్టి తీస్తుంది. 

భగవద్గీత

అధ్యాయం 4

శ్లోకం 33

శ్రేయాన్ ద్రవ్యమయాద్యజ్ఞాత్ జ్ఞానయజ్ఞః పరంతప |

సర్వం కర్మాఖిలం పార్ధ జ్ఞానే పరిసమాప్యతే ||

అర్ధం :-

ఓ పరంతపా! పార్ధ! ద్రవ్యమాయయజ్ఞముకంటేను జ్ఞానయజ్ఞము మిక్కిలి శ్రేష్టమైనది. కర్మలన్నియును జ్ఞానమునందే పరిసమాప్తమగును. 

శ్రీకృష్ణ

శేకటాసుర సంహారం 

పూతన మరణం తెలుసుకొని కంసుడి కోపం పెరిగిపోతుంది. శేకటాసురుడిని పిలిచి శ్రీ కృష్ణుడిని చంపమని పంపిస్తాడు. ఈ లోపు నందనవనంలో నందుని ఇంట్లో చిన్ని కృష్ణుడు బోర్లాపడతాడు. తల్లి యశోద అదిచూసి నందునితో "స్వామి! నా బిడ పుట్టిన తరువాత మొదటిసారి బోర్లా బడ్డాడు వెంటనే ఉత్సవాలు జరిపించాలి" అని అంటుంది. నందనవనంలో ఉన్న ప్రజలందరినీ పిలిచి విషయం చెపుతుంది. అక్కడే ఉన్న శేకటాసురుడు ఒక బండి రూపం ధరించి నందుని ఇంటి ముందు ఉన్నాడు. నందుడు దానిని చూసి నిజంగా బండే అనుకోని అందులో పాలకుండలు, పెరుగుకుండలు, నెయ్యికుండలు పెట్టారు. దాని పక్కనే యశోదమ్మ చిన్న మంచం వేసి దానిమీద చిన్ని కృష్ణుడిని పొడుకోబెడుతుంది. అవకాశం కోసం చూస్తునా రాక్షసుడిని కృష్ణుడు చూసాడు. చిన్ని కృష్ణుడు ఆడుకుంటూ, ఆడుకుంటూ ఆ బండిని తన కాలితో తన్నాడు. ఆలా తనంగానే బండి గాలిలోకి వెళ్లి పెద్ద  శబ్దంతో ముక్కలై పడిపోతుంది. లోపల ఉన్న నందుడు, యశోద, గోకులవాసులు కంగారుపడతారు. 


భగవద్గీత

అధ్యాయం 4

శ్లోకం 32

ఏవం బహువిధా యజ్ఞా వితతా బ్రాహ్మణో ముఖే |

కర్మజాన్ విద్ది తాన్ సర్వాన్ ఏవం జ్ఞాత్వా విమోక్ష్యసే ||

అర్ధం :-

ఈ ప్రకారంగానే, ఇంకను బహువిధములైన యజ్ఞములు వేదములలో విస్తృతముగా వివరింపబడినవి. ఈ యజ్ఞములనన్నింటిని త్రికరణశుద్దిగా ఆచరించినప్పుడే, అవి సుసంపన్నములగునని తెలిసికొనుము. ఇట్లు ఈ కర్మతత్త్వమును తెలిసికొని, అనుష్ఠించుటవలన నీవు ప్రాపంచిక బంధములనుండి సర్వథా విముక్తుడయ్యెదవు. 

భగవద్గీత

అధ్యాయం 4

శ్లోకం 31

యఙ్ఞశిష్టామృతభుజో యాంతి బ్రహ్మ సనాతనమ్ |

నాయం లోకో స్త్యయజ్ఞస్య కుతో న్యః కురుసత్తమ ||

అర్ధం :-

ఓ కురుసత్తమా ! యజ్ఞపుతశేషమైన అమృతమును అనుభవించు యోగులకు సనాతనుడును, పరబ్రహ్మమును అగు పరమాత్మ యొక్క లాభము కలుగును. యజ్ఞము చేయనివారికి ఈమర్త్యలోకమే సుఖప్రదము కాదు. ఇంకా పరలోక విషయము చెప్పనేల? 

భగవద్గీత

అధ్యాయం 4

శ్లోకం 30

ఆపరే నియతాహారాః ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి |

సర్వే ప్యేతే యజ్ఞవిదో యఙ్ఞక్షపితకల్మషాః ||

అర్ధం :-

ఇంకను కొందరు నియమితాహార నిష్ఠితులై, ప్రాణాయామ పరాయణులైనవారు ప్రాణాపానాగమనములను నిలిపి, ప్రాణములను ప్రాణములయందే హవనము చేయుదురు. యజ్ఞవిదులైన ఈ సాధకులందరును యజ్ఞముల ద్వారా పాపములను రూపుమాపుదురు. 

భగవద్గీత

అధ్యాయం 4

శ్లోకం 29

అపానే జుహ్వతి ప్రాణం ప్రాణే పానం తథాపరే |

ప్రాణాపానాగతీ రుధ్వా ప్రాణాయామపరాయణః ||

అర్ధం :-

కొందరు యోగులు అపానవాయువునందు ప్రాణవాయువును, మరికొందరు ప్రాణవాయువునందు అపానవాయువును హవనము చేయుదురు. 

తిరుప్పావై

పాశురము 30

        వఞ్గక్కడల్ కడైన్ద మాడవనై క్కేశవనై

        త్తిఙ్గళ్ తిరుముగత్తు చ్చేయిళ్ళై యార్ శేన్ణిఱైఞ్ఙ

        అఞ్గప్పఱైకోణ్ణవాత్తై, యణిపుదువై

        పైఙ్గమలత్తణ్దెరియల్ పట్టర్ పిరాన్ కొదైశొన్న

        శజ్ఞత్తమిళ్ మాలై ముప్పుదుమ్ తప్పామే

        ఇఙ్గిప్పరిశురైప్పా రీరిరణ్దు మాల్వరైత్తోళ్

        శేఙ్గిణ్ తిరుముగుత్తు చ్చెల్వ త్తిరుమాలాల్

        ఎఙ్గమ్ తిరువరుళ్ పెత్తుఇంబరువరెమ్బావాయ్

        అణ్దాల్ తిరువడిగళే శరణమ్

అర్ధం :-

ఓడలుగల పాల సముద్రమును దేవతలకోసం మధించి, వారికి అమృతాన్ని ప్రసాదించినవాడును, బ్రహ్మరుద్రాదులకు ప్రభువైనట్టి నారాయణుని చంద్రముఖలైన గోపికలు ఆలంకృతులై చేరి, మంగళాశాసనము చేసి, గోకులమునందు 'పఱై' అను వంకతో స్వామీ కై౦కర్యమును పొందారు.

వీరు పొందిన యీ కై౦కర్య విధమునంతను అలంకారమైన శ్రీవిల్లిపుత్తూరులో అవతరించినట్టియును, తామర పూసల మాలలను ధరించిన పేరియాళ్ళార్ల (విష్ణుచిత్తుల) పుత్రికయైన గోదాదేవి (అండాళ్ తల్లి) సాయించింది. ఇది గోపికలు గుంపులు గుంపులుగ కూడి అనుభవించిన ప్రబంధమై, ద్రావిడ భాషలో పాశురరూపంగా ప్రవహించింది.

ఈ ముప్పుది పాశురాలను ఒక్కటిని కూడా విడువకుండ యీ సంసారమున అనుసంధి౦చువారు గొప్ప పర్వతవలెనున్న నాల్గు భుజములును ఆశ్రిత వాత్సల్యముచే ఎఱ్ఱబారిన కనుదోయిగల శ్రీముఖమును. ఉభయ విభూతి ఐశ్వర్యములందునుగల శ్రియ: పతియొక్క సాటిలేని దివ్య కృపను పొంది, బ్రహ్మనందముతో కూడినవారై యుండగలరు. శ్రీ గోదా రంగనాథుల అవ్యాజకృపచే యీ 'తిరుప్పావై' ద్రవిడ దివ్య ప్రబంధమును తెలుగున' శ్రీసూక్తిమాలిక' గ' ప్రవహింపచేసి పాడించుకున్న వారి దివ్యవాత్సల్యమునకు యీ దాసుడు రంగనాథుడు ఆజన్మ కృతజ్ఞతాంజలు ఘటిస్తున్నాడు. 





తిరుప్పావై

పాశురము 29

        శిత్తమ్ శిఱుకాలే వన్దున్నై చ్చేవిత్తు ఉన్   

        పొత్తామరై యడియే పోత్తుమ్ పోరుళ్ కేళాయ్;

        పెత్తమ్మేయ్ త్తుణ్ణు జ్కులత్తిన్ పిఱన్ద నీ,

        కుత్తేవల్గెళై క్కోళ్వామల్ పోకాదు;

        ఇతైప్పఱై కోళ్వానన్దుకాణ్ గొవిన్దా:

        ఎత్తైక్కు  మేళేళు పిఱవిక్కుమ్, ఉన్దన్నో

        డుత్తోమే యావో మునక్కే నామాళ్ శేయ్ వోమ్,

        మత్తైనజ్కా మఞ్గళ్ మాత్తేలో రెమ్బావాయ్

అర్ధం :-

ఓ స్వామీ! శ్రీకృష్ణా! నీ పాదారవింద దాసులమగు మేము మిక్కిలి వేకువనే లేచి, నీ సన్నిధికి వచ్చి, నిన్ను దర్శించి నీ సుందర తిరివడులకు మంగళాశాసనము చేయుటే మాకు పరమావధి, ఎందుకనగా పశువులను మేపి మా జీవిక నడుపుకొను అజ్ఞానులమైన మేము చేసే అంతరంగ సేవలను నీవు స్వీకరించకుండ వుండరాదు. ఏలన నీవు మా గోల్లకులములో జన్మించి మా కులమును , మమ్ములను ధన్యులను చేసినవాడవు , ఓ గోవిందా! పుండరీకాక్షా! మేము నీ వద్దకు 'పఱ' అను వాద్యమును పొందుటకు రాలేదు. అది ఒక నిమిత్తమే! వ్రతమూ నిమిత్తమే! మేము ఏడేడు జన్మముల వరకును మరియు యీ కాలతత్వముండు వరకును నీకు అనవార్యశేషభూతులమై నీతోడ చేరి, నీ దాస్యమును చేయుచచుండువారము కామా? మా యందు , యితరములై ఆపేక్షలేవైన యున్నచో వానిని తొలగించి మమ్ము కృపజూడుము స్వామీ! సదా నీ సేవలను మాకోసగమును అని వ్రత ఫలమును అండాళ్ తల్లి వివరించింది.



భగవద్గీత

అధ్యాయం 4

శ్లోకం 28

ద్రవ్యయజ్ఞాస్తపోయజ్ఞా యోగయజ్ఞాస్తథాపరే |

స్వాధ్యాయజ్ఞానయజ్ఞాశ్చ యతయః సంశితవ్రతాః ||

అర్ధం :-

అట్టివారు పూర్తిగా పరమాత్మయందే స్థితులై యుందురు.  అప్పుడు ప్రాణ ఇంద్రియాల ప్రభావం వారిపై ఏమాత్రం ఉండదు.  ఎందుకంటే వారు బుద్ధి ఎందు పరమాత్మ మాత్రమే నిలిచి ఉంటారు.  కొందరు ద్రవ్య సంబంద యజ్ఞమును,  మరికొందరు తపో రూప యజ్ఞములను,  కొందరు యోగ రూపా యజ్ఞానములు చేస్తారు. మరికొందరు అహింసాదితీక్షణవ్రతములను చేపట్టి, యత్నశీలురై స్వాధ్యాయరూపజ్ఞానయజ్ఞములను ఆచరింతురు. 

తిరుప్పావై

పాశురము 28

       కఱవై పిన్ శేస్టు కానమ్ శేర్ న్దుణ్బోమ్

        అఱివోన్ఱు మిల్లాత వాయ్ క్కులత్తు, ఉన్ఱన్నై

        ప్పిఱవి పెఱున్దనై పుణ్ణియమ్ యాముడై యోమ్

        కుఱైవోన్ఱు మిల్లాదగోవిన్డా! ఉన్ఱన్నోడు

        ఉఱవేల్ సమక్కు ఇంగోళిక్క వోళియాదు

        అణియాద పిళ్ళైగాళోం అన్బినాల్, ఉన్ఱన్నై?

        శిరు ఇఱైవా నీ తారయి పరమేలో రెంబావాయ్

 అర్ధం :-

ఓ కృష్ణా! మేము అవివేక శిఖామణులము, తెల్లవారగానే చద్దిత్రాగి పశువుల వెంట అడవికిపోయి, పశువులను మేపి సాయంకాలము తిరిగి చేరేవారము . వువేకమేమాత్రమును లేనివారము. అజ్ఞానులము. గొల్లపడుచులము . నీవు మా గొల్లకులంలో జన్మించటయే మాకు మహాభాగ్యము . నీతోడి సహవాసమే మాకదృష్టము. యీ బంధమెన్నటికినీ తెగనిది. త్రెంచిలేనిది. అందుకే మా గోపికాకులం ధన్యమైంది. పరిపూర్ణ కళ్యాణగుణగుణాలతో ప్రకాశించే నీవు గోవిందుడువు. మాకు లోక మర్యాద మేమాత్రము తెలియక నిన్ను చిన్నచిన్న పేర్లతో కృష్ణా! గోవిందా! అని పిలిచాము. స్వామీ! అందుకు కోపగించుకోకు! జ్ఞానులు పొందవలసిన ఆ పద వాద్యమును యీ కారణమున మాకు యివ్వననబోకుము. నీతో మెలిగిన సుఖలమనే యెంచి మాపై కృపచేయుము . అని గోపికలందరూ స్వామికి శరణాగతిని చేశారు. తమను అనుగ్రహించి వ్రతమును పూర్తిచేయగ ఆశీర్వదించుమని, తమ తప్పులను సైరించమని క్షమాయాచన చేశారు.



శ్రీకృష్ణ

పూతన సంహారం 

యోగమాయ మాయం అవగానే కంసుడు కోపంతో అక్కడినుంచి వెళ్ళిపోయాడు. కంసుడు వెంటనే మంత్రిమండలిని సమావేశపరిచి "జరిగినది మీకు తెలుసుకదా నన్ను చంపేవాడు తపించుకొని పోయాడు వాడు బ్రతికివుంటే నేను మరణించటం కాయం ఇప్పుడు కర్తవ్యం ఏమిటి?" అని మంత్రి మండలిని అడిగాడు. "యధా రాజా తధా ప్రజా" ఆనటు అందరూ కలిసి "పుట్టిన పసిపిల్లలను అందరిని చంపేయండి" అని చెప్పారు. వారు ఇచ్చిన సలహా బాగుంది అని కంసుడు సంతోషించి పూతన అనే రాక్షసిని పిలిచి రాజ్యములో ఉన్న పసిపిల్లలందరిని చంపేయి అని ఆజ్ఞ ఇచ్చాడు. పూతన రాజ్యములో ఉన్న పసిపిల్లలకు తన విషపు పాలను ఇచ్చి చంపేస్తుంది. ఇలా జరుగుతుండగా ఒకరోజు నందుడు వసుదేవుడిని చూడటానికి చెరసాలకు వస్తాడు. తమకు సంతానం కలిగింది అని చేపి తమ రాజ్యంలో విశేషాలు చెపుతాడు. ఇంతలో వసుదేవుడు నందునితో "నందా! ఎదో అరిష్టం జరుగుతుంది అని నా మనసుకి అనిపిస్తుంది నువ్వు తొందరగా నీ రాజ్యానికి వేళ్ళు" అని నందుడిని పంపించివేస్తాడు. నందుడు వెంటనే బయలుదేరుతాడు. పూతన పసిపిల్లలను చంపుకుంటూవచ్చి శ్రీకృష్ణుడు ఉన్న స్థలానికి వచ్చి వేషం మార్చుకొని శ్రీకృష్ణుడిని చూసి తన మనస్సులో ఈ బాలుడు ఎంత బాగున్నాడు అనుకోని నిద్రపోతున్న కృష్ణుడిని ఎత్తుకొని బయటకు తీసుకువెళ్లి పాలు ఇవ్వబోతుంటే వెనక రోహిణి, యశోద వద్దు వద్దు అని వారిస్తున్నా వినకుండా కృష్ణుడుని నిద్రలేపి పాలు ఇచ్చింది. కృష్ణుడు ఆమె పాలను రెండు గుక్కలు తాగిన్నా వెంటనే ఆమె వదులు వదులు అని అరుస్తూ తన నిజరూపాన్ని ధరించి కిందపడి చనిపోతుంది. ఆమె శరీరం 13 కిలో మీటరులు మేర పడుతుంది. యశోద ఆ శరీరం పైన వెతికి కృష్ణుడుని వెతుకుంతుంది. ఈ లోపు నందుడు నందనవనానికి వస్తాడు. దారిలో ఆడాంగా ఉన్న  పూతన శరీరాని గ్రామస్తుల సహాయంతో కాటేపులలు వేసి తగలబెడతారు. దుర్వాసన వస్తుందని ముక్కుకి ఆడంపెట్టుకుంటారు. కానీ చిత్రంగా ఆమె శరీరం నుంచి అగరబత్తుల వాసనవస్తుంది. దానికి కారణం శ్రీకృష్ణుడు పరమాత్మ పూతన కృష్ణుడు తనని తల్లిలా దగ్గరకి తీసుకుంది కాబట్టి ఆమె పాలు తాగుతుండగా మొదటిగుకలో ఆమె పాపాన్నీ రెండొవ గుక్కలో ఆమెకు మోక్షాన్ని ఇస్తాడు స్వామి.......... 

భగవద్గీత

అధ్యాయం 4

శ్లోకం 27

సర్వాణీంద్రియకర్మాణి ప్రాణకర్మణి చాపరే |

ఆత్మసంయమయోగాగ్నౌ జుహ్వతి జ్ఞానదీపితే ||

అర్ధం :-

మరి కొందరు యోగులు ఇంద్రియాల క్రియలను,  ప్రాణముల క్రియలను అన్నింటినీ జ్ఞానముచే ప్రకాశవంతమైన ఆత్మసంయమయోగ  రూపాగ్నిలో హవనం చేయుదురు. 

తిరుప్పావై

పాశురము 27

       కూడారై వెల్లుమ్ శీర్ గోవిన్డా వుందన్నై

        ప్పాడిప్పఱై కొణ్ణు యామ్ పెరు శమ్మానమ్       

        నాడుపుకళుమ్ పరిశినాల్ నన్డాక

        శూడగమే తోళ్ వళై యేతోడేశేవిప్పూ

        యామిణిహొమ్ పాడగమే యేన్ఱనైయ పల్ కలనుమ్

        అడైయుడుప్పోమ్ అతన్ పిన్నే పాల్ శోఱు

        మూడ, నెయ్ పెయ్ తు మళుంగైవళివారకూడి యిరుస్టు కుళిర్ న్దేలో రెమ్బావాయ్. 

అర్ధం :-

నిన్ను ఆశ్రయింపని వారిని కూడా వారి మనసులను మార్చి నీకు దాసులౌనట్లు చేసి విజయాన్ని సాధించగల ధీమంతుడౌ ఓ గోవిందా! నిన్ను సుత్తించి నీ నుండి 'పఱ' అనే వాద్యాన్ని పొంది లోకులచే సన్మానింపబడలేనని మా కోరిక నీ అనుగ్రహానికి పాత్రులమైన మమ్ము లోకమంత పొగడాలి. మేము పొందు ఆ సన్మానము లోకులందరూ పొగుడునట్లుండాలి. అనాటి మా రూపాలు ప్రకాశవంతంగా, తేజోమయంగా విరాజిల్లుతూ వుండాలి. దానికై మాకు కొన్ని భూషాణాలు కావాలి. ముంజేతులకు కంకణాలు కావాలి. భుజముల నాలంకరించుకొనుటకు భుజకీర్తులు కావాలి. దండలకు తోడవులును __ ఇంకా ఎన్నో అభూషణములను నీవనుగ్రహించగ మేము ధరించాలి. సన్మానమొందాలి. వీటన్నింటిని ధరించి ఆపై మేలిమి చీరలను కట్టుకోవాలి. అటుపై క్షీరాన్నము మునుగునట్లు పోసిన నేయి మోచేతిగుండా కారుచుండగ మేమంతా నీతో కలసి చక్కగా అరిగించాలి. ఇదీ మా కోరిక . ఇట్లైన మా వ్రతము మంగలప్రదమైనట్లే!



భగవద్గీత

అధ్యాయం 4

శ్లోకం 26

శ్రోత్రాధీనీంద్రియాణ్యాన్యే సంయమాగ్నిషు జుహ్వతి |

శబ్ధాద్దీన్ విషయానన్య ఇంద్రియాగ్నిషు జుహ్వతి ||

అర్ధం :-

 కొందరు యోగులు శ్రోత్రాది - ఇంద్రియములను సంయమన రూపాగ్నుల యందు హోమము చేయుదురు. మరికొందరు యోగులు శబ్దాది సమస్తవిషయములను ఇంద్రియరూపాగ్నులయందు హవనము చేయుదురు. అనగా యోగులు మనో నిగ్రహము ద్వారా ఇంద్రియాలను అదుపు చేయుదురు. తత్పలితముగా శబ్దాది విషయములు ఎదురుగా ఉన్నాను లేకున్నను వాటి ప్రభావము వారి ఇంద్రియములపై ఏ మాత్రము ఉండదు. 

తిరుప్పావై

పాశురము 26

        మాలే! మణివణ్ణా! మార్గళి నీరాడువాన్;

        మేలైయార్ శేయ్యనగళ్ ; వేణ్ణువన కేట్టియేల్;

        ఞ్ లతై యెల్లామ్ నడుజ్ఞ మురల్వన

        పాలన్న శజ్ఞజ్ఞళ్, పోయ్ ప్పాడు డైయనవే,

        శాలప్పేరుమ్ పఱైయే, పల్లాణ్ణిశైప్పారే,

        కోలవిళక్కై, కోడియే, వితానమే,

        ఆలినిలై యామ్! ఆరుళేలో రేమ్బావాయ్

అర్ధం :-

ఆశ్రిత వ్యామోహమే స్వరూపముగా కలిగిన ఇంద్రనీలమణి వంటి శరీరముకలవాడా! ఓ వటపత్రశాయీ! మార్గశీర్ష మాస స్నానం చేయగా వచ్చాము. మా పూర్వులున్నూ యీ స్నాన వ్రతాన్ని ఆచరించియున్నారు. ఈ వ్రతానికవసరమగు పరికరములను నిన్నర్ధింపగా వచ్చాము. దయచేసి ఆలకింపుము. భూమండలమంతయు వణుకు కల్గించునట్లు ద్వనించే పాలవంటి తెల్లనైన శఖంములు __ సరిగా నీ పాంచజన్యము వంటివి కావలెను. అతిపెద్దవైన పరవంటి వాద్యములు కావలెను. మృదుమధురమైన కంఠములతో మంగళ గానాలను పాడే భాగవతులను కావాలి. వ్రతంలో ముందుకు సాగే నిమిత్తం మంగళదీపము కావాలి. వ్రాత సంకేతములుగా అనేక చాందినీలు కావాలి. లోకలన్నింటినీ నీ చిరుబొజ్జలో దాచుకుని, ఒక లేత మఱ్ఱి యాకుమీద పరుండిన నీకు చేతకానిదేమున్నది స్వామీ! కరుణించి మా వ్రతము సాంగోపాంగముగ పూర్తీయగునట్లు మంగళాశాసనము చేసి వీనిని ప్రసాదింపుము.



భగవద్గీత

అధ్యాయం 4

శ్లోకం 25

దైవమేవాపరే యజ్ఞం యోగినః పర్యుపాసతే |

బ్రహ్మాగ్నావపరే యజ్ఞం యజ్ఞేనైవోపజుహ్వతి||

అర్ధం :-

కొందరు యోగులు దైవపూజారుపాయజ్ఞమును చక్కగా అనుష్టింతురు. మరికొందరు యోగులు బ్రహ్మగ్నియందు అనగా పరబ్రహ్మపరమాత్మ రుపాగ్ని యందు అభేదదర్శనరూపాయజ్ఞము ద్వారా ఆత్మరూపయజ్ఞమును ఆచరింతురు. 

తిరుప్పావై

పాశురము 25

        ఒరుత్తి మగనాయ్ పిఱన్దు, ఓరిరవిల్

        ఒరుత్తి మగనాయ్ ఒలిత్తు వళర,

        తరిక్కిలానాగిత్తాన్ తీజ్ఞనినైన్ద

        కరుతై ప్పిళ్ళైత్తు కఞ్ఙన్ వయిత్తిల్

        నెరుప్పెన్న నిన్ఱ నెడు మాలే! యున్నై

        ఆరుత్తిత్తు వన్దోమ్; పఱై తరుతియాకిల్ యామ్పాడి

        వరుత్తముమ్ తీర్ న్దు మగిళ్ న్దేలో రెమ్బావాయ్.

 అర్ధం :-

ఓ కృష్ణా ! పరమ భాగ్యవతియగు శ్రీ దేవకీదేవికి ముద్దుల పట్టిగ అవతరించి, అదే రాత్రి శ్రీ యశోదాదేవికి అల్లారు ముద్దుబిడ్డవై రహస్యముగా శుక్లపక్ష చంద్రునివలె పెరుగుచుండగా. గూఢచారులవలన యీ విషయము నెరిగిన కంసుడు నిన్ను మట్టుబెట్టుటకు అలోచించుచుండగా అతని యత్నములన్నిటిని వ్యర్ధముచేసి అతని గర్భమున   చిచ్చుపేట్టినట్లు నిల్చిన భక్తవత్సలుడవు! అట్టి నిన్ను భక్తీ పురస్సరముగా ప్రార్ధించి నీ సన్నిధికి చేరినాము. మాకు యిష్టార్దమైన 'పఱ' అను వాద్యమును అనుగ్రహింపుము. ఇట్లు మమ్మనుగ్రహించిన శ్రీ లక్ష్మీదేవి యాశపడదగిన సంపదను, దానిని సార్ధిక పరచు నీ శౌర్యమును కొనియాడి నీ విశ్లేషములవలన కలిగిన సంకటమును నివారణ చేసికొని మేము సుఖింతుము . నీ విట్లు కృపచేయుటవలన మా యీ అద్వితీయమైన వ్రతము శుభమగు సంపూర్ణమగును.





శ్రీకృష్ణ

శ్రీకృష్ణ జననం

యోగ మాయ ద్వారా గర్భం ధరించిన రోహిణికి బలరాముడు పుడతాడు. తరువాత కొన్నాళ్లకి దేవకీదేవి గర్భం ధరిస్తుంది. ఆమె గర్భం ధరించిన దగర నుంచి కంసునికి అన్ని అపశకునాలే కనిపించాయి. రోజు గడుస్తున్నా కొద్దీ కంసుడు భయంతో గడిపాడు. శ్రీమహా విష్ణువు దేవకీగర్బంలో ఉన్నాడు అని తెలిసి దేవతలు, యక్షులు, కీనేరా, కింపురుషులు స్వామిని సేవించటానికి చెరసాలకు అదృశ్య రూపములో వచ్చేవాళ్లు. ఇలా కొన్నాళ్ళు గడిచినతరువాత దేవకీ దేవికి నిండునెలలు వచ్చాయి. కంసుడు భయంతో చెరసాలలో కూడా వారిని స్వచ్ఛగా తిరగనివ్వకుండా వసుదేవుడిని కదలనివ్వకుండా కళ్ళకి చేతులకి సంకెళ్లు వేసాడు. శ్రావణ శుద్ధ అష్టమి రోజునా శ్రీకృష్ణ భగవానుడు జన్మించాడు. ఆయన జన్మించగానే వసుదేవుడు బ్రాహ్మణులకి దానాలు ఇస్తాను అని మనసులోనే సంకల్పం చేస్తాడు. శ్రీకృష్ణ పరమాత్మ జన్మించగానే మధుర నగరంలో అందరూ గాఢ నిద్రలోకి వెళ్లిపోయారు. పుట్టిన బాలుడు శ్రీమహావిష్ణువు రూపాని పొంది దేవకీదేవి, వసుదేవులకు నమస్కారం చేసి "నేను పుట్టిన ఇదే సమయంలో నందనవనంలో యోగమాయ యశోద గర్భానా జన్మించింది. నా మాయచేత పశుపక్షాదులు తప్ప మానవులందరు గాఢ నిద్రలో ఉన్నారు. కనుక నువ్వు వెళ్లి నందనవనంలో యశోద పక్కన నన్ను ఉంచి అక్కడ ఉన్న యోగమాయను ఇక్కడికి తీసుకొని రా అనిచెపి అదృశ్యము అయిపోయారు. వెంటనే వసుదేవునికి ఉన్న సంకెళ్లు తెగిపడిపోయాయి. చెరసాల తలుపులు అవే తెరుచుకున్నాయి. దేవకీదేవి ఏడుస్తూ తన బిడ్డను వదలకే పంపించింది. చెరసాల నుంచి బయటకు వచ్చి చుస్తే కుండపోతగా వాన కురుస్తుంది. అంత ఆ పరమాత్మయే చూసుకుంటాడు అని వరదల పొంగుతున్న యమునా నదిని దాటుతూ మనసులో శ్రీహరిని తలుస్తున్నాడు. వసుదేవుడు శ్రీకృష్ణుని తన శిరస్సు మీద పెట్టుకొని నడుస్తున్నాడు. కొంతదూరం వెళ్లక శ్రీకృష్ణుని పాదాలు యమునానదిలో తడవగానే యమునా నది వచ్చింది పరమాత్మ అని తెలుసుకొని రెండు పాయలుగా చీలి ధరిస్తుంది. శ్రీకృష్ణుడు తడుస్తునాడు అని ఆదిశేషుడు పాడగా పట్టాడు. ఇలా వసుదేవుడు యమునానదిని ధాటి నందన వనానికి చేరుతాడు. అక్కడ నందుని ఇంటిలో యశోద దగర శ్రీకృష్ణుని ఉంచు అక్కడ పుట్టిన పాపని తీసుకొని మధుర చెరసాలకు వచ్చాడు. ఆ బిడ్డ ఏడుపు వినపడగానే మాయ తొలగిపోయి అందరికి మెలకువ వచ్చింది. కాపలాదారులు వెంటనే వెళ్లి కంసునికి ఈ విషయం చెపుతారు. కంసుడు వెంటనే వచ్చి ఆ పాపను తీసుకోబోతే దేవకీదేవి కంసుడి కళ్ళు పట్టుకొని అన్నయ ఈ బిడ్డ కుమారుడు కాదు కూతురు. అడ పిల్ల నిన్ను ఏమిచేస్తుంది. ఈమెను వదిలేయి అని బ్రతిమిలాడుతుంది. అయినా కంసుడు వదలకుండా మిగతాపిల్లలను చంపినాటే ఈ పాపని కూడా నేలకేసి విసురుతాడు. ఆ పాపా నేలకేసి వెళ్లకుండా ఆకాశంలోకి వెళ్లి అదిశక్తీ అవతారం ఎత్తి "కంసా!నిన్ను చంపేవాడు వేరొకచోట పెరుగుతున్నాడు" అని చేపి అదృశ్యమయిపోతుంది.

భగవద్గీత

అధ్యాయం 4

శ్లోకం 24

బ్రహ్మార్పణం బ్రహ్మ హవిః బ్రహ్మగ్నౌ  బ్రాహ్మణా హుతమ్|

బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మసమాధినా||

అర్ధం :-

యజ్ఞకార్యములయందు ఉపయుక్తమగు స్రువాదిసాధనములు బ్రహ్మము. హోమము చేయబడు ద్రవ్యము బ్రహ్మము. అగ్నియు బ్రహ్మము. యజ్ఞమును ఆచరించు కర్త బ్రహ్మము. హవనక్రియయు బ్రహ్మము. ఈ బ్రహ్మకర్మయందు స్థితుడై యుండు యోగి ధ్వారా పొందదగిన యజ్ఞఫలంగూడ బ్రహ్మమే. 

తిరుప్పావై

పాశురము 24

        అన్ణి వ్వులగ మళన్దాయ్! ఆడిపొత్తి;

        చ్చేన్ణజ్ఞ తైన్నిలజ్ఞేశేత్తాయ్! తిఱల్ పొత్తి;

        పోన్ణ చ్చగడ ముద్దైత్తాయ్! పుగళ్ పొత్తి;

        కన్ఱుకుడై యావేడుత్తాయ్! గుణమ్ పొత్తి;

        వెన్ణుపగై కెడుక్కుమ్ నిన్ కైయిల్ వేల్ పొత్తి;

        ఎన్ణెన్ణున్ శేవగమే యెత్తిప్పఱై కోళ్వాన్

        ఇన్ఱి యామ్  వన్దొన్  ఇరజ్గేలో రెమ్బావామ్

అర్ధం :-

అలనాడు బలివలన దుఃఖితులైన దేవతలను రక్షించుటకు త్రివిక్రముడవై మూడు లోకాలను కొలిచిన వామనుడా! నీ రెండు పాదములకు మంగళము! సీతమ్మ నపహరించిన దుష్టడగు రావణుని లంకను గెల్చిన ఓ శ్రీరామా! నీ ధీరతకు మంగళము! బండి రూపంలో శకటాసురుడనేరాక్షసుడు నిన్ను చంపప్రయత్నింపగా వాని కీళ్ళూడునట్లు తన్నిన నీ కీర్తి ప్రభలకును మంగళము! దూడ రూపమున నిన్ను చంపవచ్చిన వత్సాసురుడనే రాక్షసుని. వెలగచెట్టుగా దారికి ప్రక్కన నిల్చిన కపిత్డాసురుడనే రాక్షసుని ఒక్కసారిగా సంహరించిన నీ పాదమునకు మంగళము! దేవేంద్రుడు రాళ్ళ వర్షమును కురిపించగా గోవర్దనగిరిని గోడుగుగా నెత్తి గోకులమును రక్షించిన నీ ఆశ్రిత రక్షణ గుణమునకును మంగళమగుగాక! శత్రువులను చీల్చి చెండాడునట్టి నీ చేతి చక్రమునకు మంగళ మగుగాక! ఇట్లు నీ వీర గాధలన్నేన్నింటినో నోరార సుత్తించును నీ నుండి మా నోమునకు కావాల్సిన పరికరములను పొందుటకై మేము నేడు యిచ్చాటకు వచ్చి యున్నాము. కావున మా యందు దయచేసి వానిని కృపతో ప్రసాదింపుము. అని గోపికల్లెలరు స్వామిని వేడుకొన్నారు.



శ్రీకృష్ణ

శ్రీకృష్ణ జననం 

మధురా నగరాన్ని శూరసేన మహారాజు పరిపాలిస్తుండేవాడు. ఆయన యాదవ వంశానికి చెందిన వాడు. ఆయనకు వసుదేవుడు అనే కుమారుడు ఉన్నాడు. వసుదేవునికి ఉగ్రసేన మహారాజు కుమార్తె అయినా దేవకిని ఇచ్చి వివాహం చేస్తారు. వివాహం అయినా తరువాత వసుదేవుడిని,దేవకిని తీసుకొని దేవకీ అన్న కంసుడు ఆమెను అత్తవారి ఇంటిలో దిగబెట్టటానికి వెళతాడు. వారిని రథంలో తీసుకొని వెళుతుండగా దారిలో ఆకాశవాణి "కంసా! నిన్ను చంపేది నీ చెల్లెలు కడుపున్న పుట్టిన ఎనిమిదొవ కుమారుడే" అని చెపుతుంది. అది విన్న కంసుడు కోపంతో రథం మీద నుంచి దిగి దేవకిని రథము మీదనుంచు లాగి ఆమెని చంపబోతాడు. వాసుదేవుడు వెంటనే అడ్డు పడి "ఏమిటి బావ నువ్వు చేస్తున్న పని నీ చెల్లెలిని నువ్వే చంపుతావా నీకు ఇది తగిన పనేనా అయినా నిన్ను చంపేది నీ చెల్లెలి కుమారుడు. నీ చెల్లెలు కాదు. నేను మాట ఇస్తున్నాను. నీ చెల్లెలికి పుట్టిన ప్రతి బిడ్డని నికు తీసుకువచ్చి ఇస్తాను వారిని చంపు నీ చెల్లెలిని వదిలేయి" అంటాడు. అందుకు కంసుడు అంగీకరించి వారిని వారి రాజ్యానికి పంపకుండా కంసుని రాజ్యానికె తీసుకువచ్చి వారిని అంతఃపుర బంధీలుగా చేస్తాడు. కొన్నాళ్లకి దేవకీదేవికి ఒక కుమారుడు జన్మిస్తాడు. వాసుదేవుడు ఇచ్చిన మాటప్రకారం తన కుమారుడిని తీసుకువచ్చి కంసునికి ఇస్తాడు. కంసుడు ఆ బిడ్డ మొఖం చూసి చంపలేక "నన్ను చంపేది ఈబిడ్డ కాదు. మీకు కలిగే ఎనిమిదొవ కుమారుడు. వీడిని నేను  చంపలేను వీడిని సంతోషంగా తీసుకువెళ్ళు" అని అంటాడు. ఇలా కొన్నాళ్లకి వారిని ఆరుగురు కుమారులు జన్మిస్తారు. వారందరిని కంసుడు గారాబంగా చూస్తాడు. ఇలా ఉండగా ఒకరోజు నారదమహర్షి కంసుని దగరకు వచ్చి నువ్వు గత జన్మలో కాలనేమి అనే రాక్షసుడివి అని నిన్ను చంపటానికి శ్రీమహావిష్ణువే అవతరించబోతున్నాడని అతను వచ్చేటపుడు అతని సోదరుడిని కూడా వెంటబెట్టుకొని తీసుకువస్తాడు అని ఇపుడు ఉన్న పిల్లలో ఎవరూ తమ సోదరుడికి సహాయం చేస్తారో తెలియదు అని చేపి వెళ్లిపోతాడు. దానికి కోపం తటుకోలేక కంసుడు వాసుదేవుని అంతఃపురానికి వెళ్లి పిల్లలు అందరిని గిరగిరా తీపి నేలకేసికోటి చంపాడు. అడ్డు వచ్చిన దేవకిని వసుదేవుడిని సంకెళ్లతో చెరసాలలో బంధించాడు. ఏమిటి ఈ అన్యాయం అని అడిగిన ఉగ్రసేనుని బందించి రాజ్యాన్ని వశం చేసుకున్నాడు. మళ్ళి నారద మహర్షి వచ్చి కంసునితో అయ్యాయో ఎంతపని చేశావయ్యా ఆ ఆరుగురు గత జన్మలో నీ కుమారులే హిరణ్యకశిపుడు వారందరిని మీరు మీ తండ్రి చేతిలోనే చనిపోతారు అని శాపం ఇస్తాడు. ఆ మాట విన్న కంసుడు చాల బాధపడి ఎనిమిదొవ గర్భం కోసం ఎదురు చూస్తున్నాడు. కొంత కాలానికి దేవకీదేవి మళ్ళి గర్భం ధరిస్తుంది. కానీ  దేవకీదేవి గర్భంలో ఉన్న పిండిని యోగమాయ వసుదేవుని మొదటిభార్య ఆయన రోహిణి గర్భంలో ప్రవేశపెడుతుంది. ఎడొవ గర్భం విచ్చినం అయిందని కంసుడు తెలుసుకొని సంతోషిస్తాడు. ఎనిమిదొవ కుమారుడి కోసం ఎదురు చూస్తున్నాడు. 

భగవద్గీత

అధ్యాయం 4

శ్లోకం 23

గతసంగస్య ముక్తస్య జ్ఞానావస్థితచేతసః |

యజ్ఞాయాచరతః కర్మ సమగ్రం ప్రవిలీయతే ||

అర్ధం :-

ఏలనన, ఆసక్తి, దేహాభిమానము, మమకారము ఏ మాత్రమూ లేనివాడును, పరమాత్మజ్ఞానమునందే నిరంతరము మనస్సును లగ్నమొనర్చినవాడును, కేవలము యజ్ఞార్ధమే కర్మలను ఆచరించువాడును అగు మనుష్యుని యొక్క కర్మలన్నియును పూర్తిగా విలీనములగును. అనగా మిగిలియుండవు. 

తిరుప్పావై

పాశురము 23

    మారి మలై ముళఞ్జిల్ మన్నిక్కిడన్దుఱఙ్గుమ్

    శీరియు శిఙ్గ మఱివిత్తు త్తీ విళిత్తు

    వేరి మయిర్ పొఙ్గ వెప్పాడుమ్ పేర్ న్దు దఱి

    మూరి నిమిర్ న్దు ముళఙ్గిప్పుఱప్పట్టు

    పోదరు మాపోలే; నీ పూవైప్పూవణ్ణా! ఉన్

    కోయిల్ నిన్ఱిఙ్గనే పోన్దరుళి, కోప్పుడైయ

    శీరియ శిఙ్గాసనత్తిరున్దు, యామ్ వన్ద

    కారియమారాయ్ న్దరుళే లో రెమ్బావాయ్.

అర్ధం :-

వర్షా కాలములో చలనము లేకుండ పర్వత గుహలో ముడుచుకొని పరుండి నిద్రించుచున్న సింహము మేల్కొని, తీక్షణమైన తన చూపులతో నలుదెసలా పరికించినట్లును, పరిమళముగల తన జూలునిక్కబొడుచునట్లు అటునిటు దొర్లి, లేచి తన శరీరమును బాగుగ సాగదీసి, ఒళ్లు విరుచుకొని ఒక్క పెట్టున గర్జించి, గుహనుంచి రాజఠీవితో బయటకు వచ్చిన విధంగా అతసీ పుష్పపు రంగును కలిగిన ఓ స్వామీ! నీవు నీ భవనము నుండి ఆ సింహరాజము రీతిని వచ్చి, మనోహరంగా అలంకరింపబడిన యీ దివ్య సింహాసనమును అలంకరించవలె! అటుపై మేము వచ్చిన కార్యము ఎరుగవలె! ఎరిగి మా అభీష్టాన్ని అనుగ్రహించవలె!' అని స్వామిని గోపికలతో కూడిన ఆండాళ్ తల్లి తమ మనోభీష్టాన్ని తెలియజేసింది.



భగవద్గీత

అధ్యాయం 4

శ్లోకం 22

యదృచ్ఛాలాభసంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః|

సమః సిద్ధావసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే||

అర్ధం :-

తాను కోరకుండగనే లభించిన పదార్ధములతో సంతుష్టుడైనవాడు, అసూయలేనివాడు, హర్షశోకాదిద్వంద్వములకు అతీతుడు అతీతుడు అయినవాడు సిద్ధియందును, అసిద్ధియందును సమదృష్టి కలిగియుండును. అట్టి కర్మయోగి కర్మలనాచరించుచున్నను. వాటి బంధములలో చిక్కుపడడు.

తిరుప్పావై

పాశురము 22

    అఙ్గణ్ మాఞాలత్తరశర్, అబిమాన

    బఙ్గమాయ్ వన్దు నిన్ పళ్లిక్కటిల్ కీళే

    శఙ్గమిరుప్పార్ పోల్ వన్దు తలైప్పెయ్ దోమ్

    కిఙ్గిణివాయ్ చ్చెయ్ ద తామరై ప్పూప్పోలే

    శెఙ్గణ్ శిఱిచ్చిణిదే యెమ్మేల్ విళియావో;

    తిఙ్గళు మాదిత్తియను మెళున్దాఱ్పోల్

    అఙ్గణిరణ్డు ఙ్గొణ్డు ఎఙ్గళ్ మేల్ నోక్కుదియేల్

    ఎఙ్గళ్ మేల్ శాబ మిళిన్దులో రెమ్బావాయ్.

అర్ధం :-

ఈ సుందర సువిశాలమైన భూమిని ఏకఛత్రాధిపత్యముగ నేలిన రాజులందరును తమ కెదురెవ్వరు లేరను అహంకారమును వీడి, అభిమానులై నీ శరణు జొచ్చిరి. అనన్య శరణాగతిని చేయుచు నీ సింహాసనము క్రింద గుంపులు గుంపులుగా చేరినట్లు మేమును అనన్య ప్రయోజనులమై వారివలె నీ శరణుజొచ్చినాము. మాకు నీవు తప్ప వేరు దిక్కులేదు స్వామీ! చిరుమువ్వలు నోళ్ళు తెరచినట్లుగను, సగము విరిసిన తామరపూవువలెను మెల్లమెల్లగా విప్పారిన నీ సుందర నేత్రాల నుంచి జాలువారు వాత్సల్య కరుణారస దృక్కులను మాపై ప్రసరింపనిమ్ము. సూర్యచంద్రులుదయించెయనునట్లు కనిపించు నీ కన్నుదోయి నుంచి జాలువారే కరుణ వాత్సల్యం రసదృక్కులు మాపై ప్రసరించినచో మా కర్మ బంధములన్నీ తొలగిపోవును కనుక మా కర్మబంధములు తొలగగనే మేము నిన్ను చేరుకొందము కద! మా వ్రతమునకు పొందవలసిన ఫలము గూడ యిదియేగదా! యని ఆండాళ్ తల్లి కర్మ బంధం. తొలగితే ముక్తి లభిస్తుందని' తెలియజేస్తోంది.



భగవద్గీత

అధ్యాయం 4

శ్లోకం 21

నిరాశీర్యతచిత్తాత్మా త్యక్తసర్వపరిగ్రహః |

శారీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషమ్|

అర్ధం :-

అంతఃకరణమును,  శరీరేంద్రియములను జయించినవాడు, సమస్త భోగసామగ్రిని పరిత్యజించినవాడు, ఆశారహితుడు ఐన సాంఖ్యయోగి కేవలము శారీరికకర్మలను ఆచరించుచును పాపములను పొందడు. 

తిరుప్పావై

పాశురము 21

    ఏత్తకలఙ్గళ్ ఎదిర్ పొఙ్గి మీదళిప్ప     

    మాత్తాదే పాల్ శొరియుమ్ వళ్లల్ పెరుమ్ పశుక్కళ్

    ఆత్తప్పడ్తెత్తాన్ మగనే! యఱివుఱాయ్;

    ఊత్తముడైయాయ్ పెరియాయ్! ఉలగినిల్

    తోత్తయాయ్ నిన్ఱశుడరే. తుయిలెళాయ్;

    మాత్తారునక్కు వలితులైన్దు ఉన్ వాశఱ్కణ్

    ఆత్తాదు వన్దు ఉన్నడి పణియు మాప్పోలే

    పోత్తియామ్ వన్దోమ్ పుగళన్దు ఏలోరెమ్బావాయ్

అర్ధం :-

పాలను పిడుకుటకై పొదుగల క్రింద ఎన్ని భాండములుంచినను అవన్నియు పొంగి పొరలి పోవునట్లు క్షీరధారలను వర్షించే గోసంపద గల్గిన శ్రీ నందగోపుని కుమారుడవైన ఒ శ్రీకృష్ణా! మేల్కొని మమ్ము కనరా వయ్యా! అప్రతిహత ధైర్య సాహసములను కల్గియును ఆశ్రితపక్షపాతివై, సర్వులకును ఆత్మ స్వరూపుడవైన నీవు యీ భూలోకమునందు అవతరించిన ఉజ్జ్వల రత్న దీపమా! వేద ప్రమాణ ప్రసిద్ధుడా! ఆ వేదము చేతనైనను ఎరుక పడనంతటి మహా మహిమాన్వితుడా! ఈ దీనులను కటాక్షించి మేలుకొనుము. శత్రువులెల్లరు నీ పరాక్రమమునకు తాళజాలక భయపడి నీకు ఓడిపోయి, నీవాకిట నిల్చి, నన్ను శరణుజొచ్చిన రీతిని మేమందరమూ అనన్య ప్రయోజనులమై 'నీవే తప్ప ఇతః పరంబెరుగ'మని నీ పాదానుదాసులమై వచ్చితిమి. నీ దాసులమైన మేమందరమును నీ దివ్య కల్యాణ గుణ సంకీర్తనము చేయగా వచ్చినాము. నీ దివ్య మంగళ విగ్రహమునకు దివ్య మంగళా శాసనము చేయ నిల్చినాము స్వామీ! నిన్నాశ్రయించి వచ్చిన మమ్ము కరుణించుటకు మేలుకొనుస్వామీ! లేచి రావయ్యా! అని వేడుకొంటున్నారు.



భగవద్గీత

అధ్యాయం 4

శ్లోకం 20

త్యక్త్వా కర్మఫలాసంగం నిత్యతృప్తో నిరాశ్రయః|

కర్మణ్యభిప్రవృత్తోపి నైవ కింపిత్ కరోతి సః||

అర్ధం :-

సమస్తకర్మలయందును, వాటిఫలితములయందును సర్వథా ఆసక్తిని వీడి,  సంసార ఆశ్రయరహితుడై, పరమత్మయందే నిత్యతృప్తుడైన పురుషుడు, కర్మల యందు చక్కగా ప్రవృత్తుడైనప్పటికిని వాస్తవముగా వాటిని కర్త కాడు.

తిరుప్పావై

పాశురము 20

    ముప్పత్తు మూవర్ అమరర్కు మున్ శెన్ఱు

    కప్పమ్ తవిర్కుమ్ కలియే! తుయిలెళాయ్;

    శెప్పముడైయాయ్! తిఱలుడైయాయ్! శెత్తార్కు

    వెప్పఙ్గొడుక్కుమ్ విమలా! తుయిలెళాయ్;

    శెప్పన్న మెన్ములైచ్చెవ్వాయ్ చ్చిఱు మరుఙ్గుల్

    నప్పిన్నై నఙ్గాయ్! తిరువే! తుయిలెళాయ్;

    ఉక్కముమ్ తట్టొళియుమ్ తన్దున్ మణాళనై

    ఇప్పోతే యెమ్మై నీరా ట్టేలో రెమ్బావాయ్

అర్ధం :-

ముప్పది మూడు కోట్ల దేవతలకు ఏ విధమైన సంకటములు వచ్చినను ముందుగనే అటకుపోయి వారిని రక్షించు సమర్ధతగల ఓ స్వామీ! నిద్రలేచిరమ్ము. ఆశ్రితులను రక్షించుటకై వారి విరోధులను దునుమాడు బలాఢ్యుడా! ఆశ్రిత రక్షకా! ఓ బలశాలీ! శత్రువులకే అతి దుఃఖమునిచ్చే నిర్మలుడా! నిద్ర నుండి మేల్కొను స్వామీ!' అని స్తుతిస్తూ మేల్కొల్పినను స్వామి మేల్కొనకుండుట చూచి, జగన్నాటక సూత్రధారియైన ఆ జగన్నాధుని మేల్కొలుపుమని నీళాదేవిని ప్రార్ధిస్తున్నారు గోపికలు. బంగారు కలశముల వంటి స్తనద్వయమును, దొండపండు వంటి అధరములను, సన్నని నడుమును కల్గి అతిలోక సుందరముగ విరాజిల్లుచున్న ఓ నీళాదేవీ!మాయమ్మా! నీవు శ్రీమహాలక్ష్మీ దేవికి సమానురాలవు! కరుణించి నీవైన మేల్కొనవమ్మా! 'నేను లేచి మీకేమి చేయవలెనందువేమో!' వినుము - మన స్వామియైన శ్రీకృష్ణునకు శరీరముపై చిరుచెమట పట్టినపుడు దానిని ఉపశమింపచేయగా వీవన కైంకర్యమును చేయుటకు ఒక దివ్యమైన వీవన (విసనకర్ర) నిమ్ము! ప్రబోధ సమయాన స్వామి తిరుముఖ మండలము జూచుకొనుటకు ఒక దివ్య మణిదర్పణము (అద్దము) నిమ్ము. వీటన్నింటిని మాకనుగ్రహించి, స్వామిని మేల్కొలిపి, మమ్ము అతనితో కూర్చి మంగళస్నానము చేయింపుము తల్లీ! నీ యనుగ్రహమున్ననే కద మా యీ వ్రతము మంగళముగ పూర్తికాగలదు?' అని ఆండాళ్ తల్లి నీళాదేవిని వేడుకొంటున్నారు యీ పాశురంలో. 



భగవద్గీత

అధ్యాయం 4

శ్లోకం 19

యస్య సర్వే సమారంభాః కామసంకల్పవర్జితాః|

జ్ఞానాగ్నిదగ్ధకర్మాణం తమాహుః పండితం బుధాః||

అర్ధం :-

ఎవని కర్మలన్నియును, శాస్త్రసమ్మతములై, కామసంకల్ప వర్జితములై జరుగునో,అట్లే ఎవని కర్మలన్నియును జ్ఞానాగ్నిచే భస్మమగునో, అట్టి మహపురుషుని జ్ఞానులు పండితుడని అందురు.

తిరుప్పావై

పాశురము 19

    కుత్తువిళక్కెరియ క్కోట్టుక్కాల్ కట్టిల్ మేల్

    మెత్తెన్ఱ పఞ్చశ యనత్తిన్ మేలేఱి,

    కొత్తలర్ పూఙ్కుళల్ నప్పిన్నై కొఙ్గైమేల్

    వైత్తుక్కి డన్దమలర్ మార్ పా! వాయ్ తిఱవాయ్

    మైత్తడ జ్కణ్నినాయ్ నీ యున్మణాళనై

    ఎత్తనై పోదుమ్ తుయిలెళ వొట్టాయికాణ్

    ఎత్తనై యేలుమ్ పిరివాత్తగిల్లాయాల్

    తత్తువ మన్ఱుతగవేలో రెమ్బావాయ్

 అర్ధం :-

గుత్తి దీపపు కాంతులు నలుదెసలా వెలుగులు ప్రసరించుచుండగా ఏనుగు దంతములచే చేయబడిన కోళ్లు గల మంచముమీద అందము, చలువ, మార్దవము, పరిమళము, తెలుపులనే - ఐదు గుణములు కలిగిన హంస తూలికా తల్పముపై పవ్వళించియుండు గుత్తులు గుత్తులుగా వికసించిన పువ్వులచే అలంకరించబడిన శిరోజములు కలిగిన నీళాదేవి యొక్క స్తనములను తన విశాల వక్షస్థలముపై వైచుకొని పవళించియున్న ఓ స్వామీ! నోరు తెరచి ఒక్క మాటైననూ మాటాడకూడదా? లేక కాటుకచే అలంకరింపబడిన విశాలమైన నేత్రములు కల ఓ నీళాదేవీ! జగత్స్యామియైన శ్రీకృష్ణుని స్వల్పకాలమైనను పడక విడిచి బయటకు వచ్చుట కనుమతింపకున్నావు! క్షణమైనను శ్రీకృష్ణుని విశ్లేషమును సహింపజాలవే? ఇది నీ స్వరూపమునకు, నీ స్వభావమునకును తగదు. నీవలె మేము కూడా అతనికి అనన్యార్హ శేషభూతులమేకదా! కాన కరుణించి కొంచెమవకాశమీయము తల్లీ! అట్టి అవకాశము నీవిచ్చితివేని మేము చేసే యీ అద్వితీయమైన ధనుర్మాస వ్రతము భగవత్కైంకర్యరూప మంగళ వ్రతముగా సాంగోపాంగముగ సమాప్తి చెందును. ఇందేమాత్రమూ సంశయము లేదు అని ఆండాళమ్మగారు నీళా శ్రీకృష్ణులను వేడుకొంటున్నారు. 



భగవద్గీత

అధ్యాయం 4

శ్లోకం 18

కర్మణ్యకర్మ యః పశ్యేత్ అకర్మణి చ కర్మ యః|

స బుద్ధిమాన్ మనుష్యేషు మనుష్యేషుస యుక్తః కృత్స్నకర్మకృత్||

అర్ధం :-

కర్మయందు 'అకర్మ'ను, అకర్మయందు 'కర్మ'ను దర్శించువాడుమానవులలో బుద్ధిశాలి.  అతడు యోగి మరియు సమస్త కర్మలు చేయువాడు. 

తిరుప్పావై

పాశురము 18

    ఉన్దు మదకళిత్త నోడాద తోళ్ వలియన్

    నన్దగోపాలన్ మరుమగళే! నప్పిన్నాయ్!

    కన్దమ్ కమళుమ్ కుళలీ! కడై తిఱవాయ్;

    వన్దెజ్గమ్ కోళియళైత్తగాణ్; మాదవి

    ప్పన్దల్ మేల్ పల్ కాల్ కుయిలినజ్గళ్ కూవినగాణ్;

    పన్దార్ విరలి! ఉన్ మైత్తునన్ పేర్ పాడ,

    చ్చెన్దామరైక్కైయాల్ శీరార్ వళైయొలిప్ప

    వన్దు తిఱవాయ్ మగిళ్ న్దు ఏలో రెమ్బావాయ్,

అర్ధం :- 

నంద గోపులు మొదలుగా బలరాముని వరకు మేల్కొలిపి తలుపులు తీయమని ప్రార్ధించినను వారు తెరువకపోవుటచేత, మదజలము స్రవించుచున్న ఏనుగువంటి బలము కలవాడై శత్రువులకు భయపడని భుజములుగల నందగోపుని యొక్క కోడలా! ఓ నప్పిన్న పిరాట్టీ! పరిమళిస్తున్న కేశ సంపద కలదానా! తలుపు తెరువుమమ్మా! కోళ్లు వచ్చి కూయుచున్నవి. జాజి పందిళ్లమీద కోకిలలు గుంపులు గుంపులుగా కూడి మాటిమాటికి కూయుచున్నవి సుమా! నీవు, నీ భర్తయును సరసనల్లాపములాడు సందర్భములలో నీకు ఓటమి గలిగినచో మేము నీ పక్షమునేయుందుము. దోషారోపణకు వీలుగా ఆయన పేర్లను మేమే పాడెదములే! కావున అందమైన నీ చేతులకున్న ఆ భూషణములన్నీ ధ్వనించేటట్లుగా నీవు నడచి వచ్చి ఎర్ర తామరలవంటి నీ సుకుమారమైన చేతులతో ఆ తలుపులను తెరువుమమ్మా!' అని గోపాంగనలు నీళాదేవి నీ పాశురంలో మేల్కొల్పుచున్నారు.



రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...