bhakthi లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
bhakthi లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

Bhagavad gita_adhyatmikam1

భగవద్గీత

అధ్యాయం 11

శ్లోకం 25

దంష్ట్రాకరాళాని చ తే ముఖాని దృష్ట్వకాలానలసన్నిభని |

దిశో న జానే న లాభే చ శర్మ ప్రసీద దేవేశ జగన్నివాసా ||

అర్థం :-

ఓ జగన్నివాసా! భయంకరములైన కోరలతో కనిపిస్తున్న నీ ముఖములు ప్రళయాగ్నిజ్వాలలవలె 

భీతిగొల్పుచున్నవి. వాటిని చూసి నాకు దిక్కుతోచటంలేదు. శాంతి శూన్యమైనది. ఓ దేవేశా! 

ప్రసన్నుడవు కమ్ము.



Bhagavad gita_adhyatmikam1

భగవద్గీత

అద్యాయం 11

శ్లోకం 24

నభఃస్పృశం దీప్తమనేకవర్ణం వ్యాత్తాననం దీప్తవిశాలనేత్రమ్ |

దృష్ట్వా హి త్వాం ప్రవ్యథితాంతరాత్మా ధృతిం న విందామి శమం చవిష్ణో ||

అర్థం :-

ఏలనన, హే విష్ణో! నీ రూపము అంతరిక్షమును తాకుచున్నది. అది అనేక వర్ణములతో దేదీప్యమానమై వెలుగుచున్నది. కాంతులను విరజిమ్ముచున్న విశల నేత్రములతో, విస్తరించినముఖములతో అద్భుతముగా ఒప్పుచున్నది. అట్టి నీ రూపమును చూచిన నా మనస్సు తత్తరపడుచున్నది. అందువలన నా ధైర్యము సడలినది. శాంతి దూరమైనది.



Bhagavad gita_adhyatmikam1

భగవద్గీత

అద్యాయం 11

శ్లోకం 23

రూపం మహత్తే బహువక్ర్తనేత్రం మహాబాహో బహుబాహూరుపాదమ్ |

బహూదరం బహుదంష్ట్రాకరాళం దృష్ట్వా లోకాః ప్రవ్యథితాస్తథాహమ్ ||

అర్థం :-

హే మహబాహో! అసంఖ్యాకములైన వక్త్రములను, నేత్రములను, చేతులను, తొడలను, పాదములను, ఉదరములను, కోరలను కలిడిన మిక్కిలి భయంకరమైన నీ రూపమును చూచి, అందరును భయకంపితులగుచున్నారు. నేనుకూడ భయముతో వణకిపోవుచున్నాను. 



Bhagavad gita_adhyatmikam1

భగవద్గీత

అద్యాయం 11

శ్లోకం 22

రుద్రాదిత్యా వసనో యే సాధ్యా విశ్వే శ్వినౌ మరుతశ్చోష్మపాశ్చ|

గంధర్వయక్షాసురసిద్ధసంఘా విక్షంతే విస్మితాశ్చైవ సర్వే ||

అర్థం :-

ఏకాదశరుద్రులును, ద్వాదశదిత్యులును, అష్టవసువులును, సాద్యులును, విశ్వేదేవతలును, అశ్వినీ కుమారులును, మరుద్గణములును, పితరులును అట్లే గంధర్వయక్షాసుర సిద్ధసముదాయములును సంభ్రమాశ్చర్యములతో నిన్నే దర్శించుచున్నారు.




Bhagavad gita_adhyatmikam1

భగవద్గీత

అద్యాయం 11

శ్లోకం 21

అమీ హి త్వాం సురసంఘో విశంతి కేచిద్భీతాః ప్రాంజలయో గృణంతి |

స్వస్తీత్యుక్త్వా మహర్షిసిద్ధసంఘాః స్తువంతి త్వాం స్తుతిభిః పుష్కలాభిః ||

అర్థం :-

ఇదిగో! ఆ దేవతలు అందరు నీలో ప్రవేశించుచున్నారు. భయపడినవారై అంజలి ఘటించి, నీ నామ గుణములను కీర్తించుచున్నారు. మహర్షులును, సిద్ధులును స్వస్తివచనములతోడను, ఉత్తమోత్తమస్తోత్రముల తోడను నిన్ను ప్రస్తుతించుచున్నారు.



Bhagavad gita_adhyatmikam1

భగవద్గీత

అద్యాయం 11

శ్లోకం 20

ద్యావాపృథివ్యోరిదమంతరం హి వ్యాప్తం త్వయైకేన దిశశ్చ సర్వాః |

దృష్ట్వాద్భుతం రూపముగ్రం తవేదం లోకత్రయం ప్రవ్యథితం మహాత్మన్ ||

అర్థం :-

ఓ మహత్మా! దివి నుండి భువివరకుగల అంతరిక్షము నందంతటను అన్ని దిశలను నీవే పరిపూర్ణుడవైయున్నావు. అద్భుతమైన నీ భయంకర రూపమును చూచి, ముల్లోకములను గడగడలాడుచున్నవి. 



Bhagavad gita_adhyatmikam1

భగవద్గీత

అద్యాయం 11

శ్లోకం 19

అనాదిమధ్యాంతమనంతవీర్యమ్ అనంతబాహుం శశిసూర్యనేత్రమ్ |

పశ్యామి త్వాం దీప్తహుంతాశవక్త్రం స్వతేజపా విశ్వమిదం తపంతమ్ ||

అర్థం :-

నీవు ఆదిమధ్యాంతరహితుడవు. అపరిమితశక్తిశాలివి. అసంఖ్యాకములైన భుజములు గలవాడవు. సూర్యచంద్రులు నీ నేత్రములు. అగ్నివలె నీ ముఖముప్రజ్వరిల్లుచున్నది. నీ తేజస్సులో ఈ జగత్తును సంతప్తమొనర్చుచున్నావు. అట్టి నిన్ను నేను చూచుచున్నాను.



 

Bhagavad gita_adhyatmikam1

భగవద్గీత

అద్యాయం 11

శ్లోకం 18

త్వమక్షరం పరమం వేదితవ్యం త్వమస్య విశ్వస్య పరం నిధానమ్ |

త్వమవ్యయః శాశ్వతధర్మగోప్తా సనాతనస్త్వం పురుషో మతో మే ||

అర్థం :-

పరమ - అక్షరస్వరూపుడవైన పరబ్రహ్మపరమాత్మవు నీవే, కనుక, అందరికిని తేలిసికొనదగినవాడవు. ఆ జగత్తునకు నీవే పరమాశ్రయుడవు. సనాతన ధర్మరక్షకుడవు. నీవు అవ్యయుడవు. సనాతనపురుషుడవు. అని నా విశ్వాసము.




Bhagavad gita_adhyatmikam1

భగవద్గీత

అద్యాయం 11

శ్లోకం 17

కిరీటినం గదినం చక్రిణం చ తేజోరాశిం సర్వతో దీప్తిమంతమ్ |

పశ్యామి త్వం దుర్నిరీక్ష్యం సమంతాత్ దీస్తానలార్కద్యుతిమప్రమేయమ్ ||

అర్థం :-

హే విష్ణో! కిరీటమును, గదను, చక్రమును ధరించి, అంతటను తేజఃపుంజములను విరజిమ్ముచున్న నిన్ను దర్శించుచున్నాను. ప్రజ్వలితాగ్నివలెను, జ్యోతిర్మయుడైన సూర్యునివలెను వెలుగొందుచున్న నీ అప్రమేయరూపము దుర్నిరీక్ష్యమైయున్నది.





Bhagavad gita_adhyatmikam1

భగవద్గీత

అద్యాయం 11

శ్లోకం 16

అనేకబాహూదరవక్త్రనేత్రం పశ్యామి త్వాం సర్వతో నంతరూపమ్ |

నాంతం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప ||

అర్థం :-

ఓ విశ్వేశ్వరా! విశ్వరూపా! నీ బాహువులు, ఉదరములు, ముఖములు, నేత్రములు అసంఖ్యాకములు. నీ అనంతరూపము సర్వతోముఖముగా విలసిల్లుచున్నది. నీవు ఆదిమధ్యాంతరహితుడవు. మహత్త్వపూర్ణమైన నీ దివ్యరూపమునకు ఆది మధ్యాంతములను తెలిసికొన లేకున్నాను.



Bhagavad gita_adhyatmikam1

భగవద్గీత

అద్యాయం 11

శ్లోకం 15

అర్జున ఉవాచ

పశ్యామి దేవాంస్తవ దేవ దేహే సర్వాంస్తథా భూతవిశేషసంఘాన్ |

బ్రహ్మాణమీశం కమలాసనస్థమ్ ఋషీంశ్చ సర్వానురగాంశ్చ దివ్యాన్ ||

అర్థం :-

అర్జునుడు పలికెను :-

ఓ దేవాదిదేవా! నీ విరాట్ - రూపమునందు సకల దేవతలను, నానావిధప్రాణికోటిని, కమలాసనుడైన బ్రహ్మను, మహాదేవుడైన శంకరుని, సమస్త ఋషులను, దివ్యసర్పములను చూచుచున్నాను.



Bhagavad gita_adhyatmikam1

భగవద్గీత

అద్యాయం 11

శ్లోకం 14

తతః స విస్మయావిష్టో హృష్టరోమా ధనంజయః |

ప్రణమ్య శిరసా దేవం కృతాంజలిరభాషత ||

అర్థం :-

అద్బుతమైన ఆ పరమాత్ముని విశ్వరూపమును జూచి, అర్జునుడు ఆశ్చర్యచకితుడై పులకితగాత్రుడయ్యెను. తేజ్యోమయమైన ఈ విశ్వ రూపమునకు భక్తిశ్రద్ధలతో సాష్టాంగప్రణామములాచరించెను. తదనంతరము చేతులు జోడించి యిట్లు పలికెను.



Bhagavad gita_adhyatmikam1

భగవద్గీత

అద్యాయం 11

శ్లోకం 13

తత్రైకస్థం జగత్ కృత్స్నం ప్రవిభక్తమనేకధా |

అపశ్యద్దేవవస్య శరీరే పాండవస్తదా ||

అర్థం :-

ఆ సమయమున అర్జునుడు ఆ దేవదిదేవుని శరీరమునందు అసంఖ్యాకుములైన వివిధబ్రహ్మాండములు వేర్వేరుగా ఒకేచోట కేంద్రీకృతమై యున్నట్లు చూచెను.



Bhagavad gita_adhyatmikam1

భగవద్గీత

అద్యాయం 11

శ్లోకం 12

దివి సూర్యసహస్రస్య భవేద్యుగదుత్థితా |

యది భాః సదృశీ సా స్యాత్ భాసస్తస్య మహాత్మనః ||

అర్థం :-

ఆ రూపము సర్వాశ్చర్యకరము, అనంతము, సర్వతో ముఖము ఆకాశమున వేలకొలది సూర్యులు ఒక్కుమ్మడిగా ఉదయించినచోవచ్చు కాంతి పుంజములును ఆ విరాట్ - రూపతేజస్సులకు సాటిరావు.



Bhagavad gita_adhyatmikam1

భగవద్గీత

అద్యాయం 11

శ్లోకం 11

దివ్యమాల్యాంబరధరం దివ్యగంధానులేపనమ్ |

సర్వాశ్చర్యమయం దేవమ్ అనంతం విశ్వతోముఖమ్ ||

అర్థం :-

దివ్యములగు మాలలను, వస్త్రములను ధరించియుండెను. ఆ దివ్యశరీరము నుండి దివ్య చందన పరిమళములు దశదిశల గుభళించుచుండెను.      



Bhagavad gita_adhyatmikam1

 భగవద్గీత

అద్యాయం 11

శ్లోకం 10

అనేకవక్త్రనయనమ్ అనేకాద్భుతదర్శనమ్ |

అనేకదివ్యాభరణం దివ్యనేకోద్యతాయుధమ్ ||

అర్థం :-

అర్జునుడు చూచిన ఆ పరమేశ్వరుని విశ్వ రూపమునందలి ముఖములు అనంతములు నేత్రములు అసంఖ్యాకములు. అందలి దృశ్యములు అద్భుతములైనవి. ఆ రూపము అనేకదివ్యాభరణశోభితము. ఆ పరమేశ్వరుడు పెక్కు దివ్యస్త్రములను చేపట్టియుండెను.




Bhagavad gita_adhyatmikam1

భగవద్గీత

అద్యాయం 11

శ్లోకం 9

సంజయ ఉవాచ

ఏవముక్త్వా తతో రాజన్ మహాయోగేశ్వరో హరిః |

దర్శయామాస పార్థాయ పరమం రూపమైశ్వరమ్ ||

అర్థం :-

సంజయుడు పలికెను :-

ఓ రాజా! మహాయోగేశ్వరుడును, పాపములను హరించువాడను ఐన భగవానుడు ఈ విధముగా పలికి, అనంతరము షడ్గుణైశ్వర్య సంపన్నమైన తన పరమదివ్యస్వరూపమును అర్జునునకు చూపెను.



Bhagavad gita_adhyatmikam1

భగవద్గీత

అద్యాయం 11

శ్లోకం 8

న తు మాం శక్యసే ద్రుష్టుమ్ అనేనౌవ స్వచక్షుషా |

దివ్యం దదామి తే చక్షుః పశ్య మే యోగమైశ్వరమ్ ||

అర్థం :-

కాని, చర్మ చక్షువు(కళ్ళ)లతో నా ఈ రూపమును నీవు నిజముగా చూడలేవు. కనుక, నీకు దివ్య దృష్టిని ప్రసాదిస్తున్నాను. ఈ దివ్యదృష్టితో నా ఈశ్వరీయ యోగశక్తిని చూడుము.





రుద్రాక్షలు - విశేషాలు

రుద్రాక్షలు - విశేషాలు



మన హిందువులలో "రుద్రాక్ష" పేరు విననివారుండరు అంటే అతిశయోక్తి కాదేమో. ఐతే ఈ రుద్రాక్షలు ఏమిటి? వాటి ప్రాముఖ్యత ఏమీటి అనే విషయాలు ఈ కాలంలో చాలా మందికి తెలియదు. రుద్రాక్ష వృక్షం ప్రపంచంలోని ప్రాచీన వృక్షాలలో ఒకటి. రుద్రాక్ష వృక్షం భారతదేశంలో దిగువ హిమాలయాలలో, నేపాల్ లో మరియూ ఇండోనేషియాలో విరివిగా పెరుగుతాయి. రుద్రాక్ష దేవదేవుడైన పరమేశ్వరుని స్వరూపమని హిందువుల నమ్మకం. రుద్రుడు అంటే శివుడు, రాక్షసులతో పోరాడి, మూడు పురములను భస్మం చేసినప్పుడు మరణించిన వారిని చూసి విచారించాడు. అలా ఆయన విచారించినప్పుడు జాలు వారిన కన్నీరు భూమిపై పడి చెట్లుగా మారాయి. అలాంటి వృక్షాలకు కాసిన కాయలను రుద్రాక్షలు అంటారు. రుద్రాక్ష అనగా రుద్రుడి కళ్ళు, కన్నీళ్ళు అని అర్థం. రుద్రాక్షలను శివ రూపాలుగా భావించి పూజించడం . ధరించడం అనాదిగా వస్తోంది. సాధారణంగా శివారాధకులలో కొందరు రుద్రాక్షలను మాలగా ధరించగా, మరికొందరు కంఠం వరకు మాత్రమే ధరిస్తుంటారు. ఇంకొందరు ముంజేతికి ... భుజాలకి ధరిస్తుంటారు. రుద్రాక్షలు పవిత్రమైనవి, శక్తివంతమైనవి, మహిమాన్వితమైనవి. రుద్రాక్షలు ధరించడం వల్ల అనుకున్న పనులు నెరవేరతాయి. ఎలాంటి కష్టనష్టాలు రావు. అడ్డంకులు తొలగిపోయి, సుఖసంతోషాలతో గడిపేందుకు పరమశివుడు ప్రసాదించిన దివ్యమైన కానుక రుద్రాక్ష. ఆత్మసాక్షాత్కారాన్ని పొందడానికి రుద్రాక్ష అసలైన మార్గం చూపుతుంది. రుద్రాక్షను ఋషులు భూమికీ, స్వర్గానికీ మధ్య వారధిగా భావిస్తారు. రుద్రాక్షలలో వివిధ ముఖాలున్నవి మనకు లభ్యమవుతాయి. ముఖ్యంగా 38 రకాల ముఖాలుండే రుద్రాక్షలు ఉన్నట్లు పురాణాల్లో పేర్కొనబడినప్పటికీ, పండితులు మాత్రం 21 ముఖాలు ఉన్న రుద్రాక్షలు మాత్రమే ఉన్నట్లు చెబుతారు. మొత్తం మీద పరిశీలిస్తే 14 ముఖాలున్న రుద్రాక్షలు మాత్రమే ప్రస్తుతం లభ్యవుతున్నాయి. వీటిని మానవులు ధరిస్తున్నారు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేక లక్షణం ఉంది. రుద్రాక్షలను ధరించడం ద్వారా కష్టాలు తొలగిపోయి.. సకల సంపదలు కలుగుతాయని స్కాంద పురాణం వివరిస్తోంది. వీటిని గురువులు, యోగుల సూచనలతో ధరించాలి. మహా శివరాత్రి, మాస శివరాత్రి, సోమవారం, పుష్యమి నక్షత్రం రోజు, ఏదైనా శుభ సమయంలో రుద్రాక్షలను శుద్ధి చేసి శివపూజ చేయాలి. ఆ తర్వాతే రుద్రాక్షను ధరించాలి. పౌర్ణమి, త్రయోదశి, చతుర్దశి తిథుల్లో రుద్రాక్షలను ధరించడం శుభదాయకం. నుదుట విభూతి, కంఠంలో రుద్రాక్షమాల ధరించి శివనామ జపం చేసే వ్యక్తిని దర్శించుకుంటే త్రివేణీ సంగమ స్నానం చేసినంత పుణ్యం ఫలం కలుగుతుంది. రుద్రాక్షలను ధరించిన వారికి అపజయాలు ఉండవు. రుద్రాక్షమాలను ఉంగరంలా ధరించ కూడదు. కుటుంబ సభ్యులు ధరించిన రుద్రాక్ష మాలను మరొకరు వేసుకోరాదు. తీవ్రమైన మానసిక ఒత్తిడితో బాధపడుతున్నవారు, అనారోగ్యం బారినపడ్డవారు రుద్రాక్షలను ధరిస్తే సమస్యలు మటుమాయమవుతాయి. దురలవాట్లకు బానిసలుగా మారిన వ్యక్తులు, అందులోంచి బయట పడలేకపోతే రుద్రాక్షమాలను ధరిస్తే మంచి ఫలితం ఉంటుంది.

                        

ఏకముఖి రుద్రాక్ష (ఒక ముఖము కలిగినది)


అత్యంత శ్రేష్టమయినది. శివుని త్రినేత్రంగా, ఓంకార రూపంగా, శివుని ప్రతిరూపంగా నమ్ముతారు. ఇది దరించిన వ్యక్తికి ఏ విషయంలోనూ కొరత ఉండదు. వ్యక్తి వికాసం, జ్ఞాన సమృద్ది, సంపద చేకూరతాయి. సర్వతోముఖ అభివృద్ధి. అన్ని పాపాలను హరించి అన్ని కోరికలను సిద్ధింపచేస్తుంది.


ద్విముఖి (రెండు ముఖములు కలిగినది)


దీనిని శివపార్వతి రూపంగా-అర్ధనారీస్వర తత్వానికి సంకేతంగా నమ్ముతారు. దీనిని ధరించడం వల్ల కుండలినీ శక్తి పెరుగుతుంది. సౌభాగ్య ప్రదాయని, సర్వపాపహారిణి. ఈ రుద్రాక్ష ఏకత్వాన్ని సూచిస్తుంది. దుష్ట ఆలోచనలు అదుపు చేస్తుంది. వైవాహిక సంబంధాలను మెరుగు పరుస్తుంది. 


త్రిముఖి (మూడు ముఖములు కలిగినది)


దీనిని త్రిమూర్తి స్వరూపంగా, అగ్నికి సంకేతంగా నమ్ముతారు. దీనిని ధరిస్తే ఆరోగ్యానికి, అభ్యుదయానికీ ఉపకరిస్తుంది. సకల సౌభాగ్య దాయని. తరచుగా వచ్చే జ్వరం వంటి వ్యాదులనుండి ఉపశమనం


చతుర్ముఖి (నాలుగు ముఖాలు కలిగినవది)


నాలుగు వేదాల స్వరూపం. బ్రహ్మకు ప్రాతినిధ్యం వహిస్తుంది. పాలలో వేసి త్రాగితే మానసిక రోగాలు నయం అవుతాయి. విద్యార్థులకు బాగా ఉపకరిస్తుంది. ధర్మార్ధ కామ మోక్ష ప్రదాయని. మానవుడు హత్య ద్వారా చేసిన పాపాన్ని హరిస్తుంది. జ్ఞాపకశక్తి ని, తెలివితేటలను పెంపొందిస్తుంది. నరాలకు సంబంధించిన వ్యాధులకు మంచిది.


పంచముఖి (అయిదు ముఖాలు కలిగినది)


పంచభూత స్వరూపం. గుండె జబులున్న వారికి మంచిది. శతృవులను సులభంగా జయించవచ్చు. పాము కాటునుంచి రక్షణ కలుగుతుంది. కోపాన్ని అదుపుచేసి మనసుకు శాంతిని కలగ చేస్తుంది. రక్తపోటు, చక్కెర వ్యాధి, పంటి నొప్పులు మూల వంటి వ్యాదులను నివారిస్తుంది.


షణ్ముఖి (ఆరు ముఖములు కలది)


కార్తికేయునికి ప్రతీక. రక్తపోటు, హిస్టీరియా పోతాయి.కుడి చేతికి కట్టుకుంటే లో బిపి తగ్గుతుంది. బ్రహ్మహత్యా పాతకం నుండి విముక్తి పొందుతారు


సప్తముఖి (ఏడు ముఖాలు కలిగినది)


కామధేనువుకి ప్రతీక. అకాల మరణం సంభవించదని ప్రజల విశ్వాసం. ధన మరియు అభివృద్ధిని ప్రసాదిస్తుంది.


అష్టముఖి (ఎనిమిది ముఖాలు కలిగినది)


విఘ్నేశ్వరునికి ప్రతీక. కుండలినీ శక్తి పెరుగుతుంది. ప్రమాదాల నుండి, ఆపదల నుండి రక్షణ కల్పిస్తుంది


నవముఖి (తొమ్మిది ముఖాలు కలది)

 

నవగ్రహ స్వరూపం. భైరవునికి ప్రతీక. దుర్గ ఆరాధకులకు మంచిది. దీనిని ఎడమ చేతికి ధరించాలి. వివాహ సంబంధిత సమస్యల నుండి విముక్తి. ఆధ్యాత్మిక చింతనను పెంపొందిస్తుంది.


దశ ముఖి (పది ముఖాలు కలిగినది)


దశావతార స్వరూపం. జనార్ధనుడికి ప్రతీక. అశ్వమేధ యాగం చేసినంత ప్రయోజనం కలుగుతుంది. దీనిని స్త్రీలు ఎక్కువగా ధరిస్తారు. నరాలకు సంబంధించిన వ్యాధులకు, జ్ఞాపకశక్తికి సంబంధించిన వ్యాధులకు పనిచేస్తుంది.


ఏకాదశ ముఖి: 11ముఖాలు


రుద్రుని 11 రూపాలకు ప్రతీక. దుష్ట శక్తుల నుంచి కాపాడుతుంది. సంతాన ఆరోగ్య సమస్యలకు మంచిది.


ద్వాదశ ముఖి: 12ముఖాలు

12 మంది ఆద్యులకు ప్రతీక గౌరవం పెరుగుతుంది. రక్త, హృదయ సంబంధిత వ్యాధులకు మంచిది. ధైర్యాన్ని పెంచి శత్రువుల నుండి రక్షణ కలిగిస్తుంది


త్రయోదశ ముఖి: 12ముఖాలు


కామధేవునికీ, కార్తికేయునికీ ప్రతీక.  పాలలో వేసి, ఆ పాలను త్రాగితే అందం పెరుగుతుంది. అభివృద్ధి, ఆత్మవిశ్వాసం పెంపొందిస్తుంది.


చతుర్ధశ ముఖి - 14ముఖాలు


ఉపనిషత్తుల ప్రకారం ఇది పరమశివుని కన్ను. శని సంబంధిత సమస్యలకు మంచిది.


నక్షత్రము ధరించవలసిన రుద్రాక్ష :-

అశ్వని - నవముఖి

భరణి - షణ్ముఖి

కృత్తిక - ఏకముఖి,  ద్వాదశముఖి

రోహిణి - ద్విముఖి

మృగశిర - త్రిముఖి

ఆరుద్ర - అష్టముఖి

పునర్వసు - పంచముఖి

పుష్యమి - సప్తముఖి

ఆశ్లేష - చతుర్ముఖి

మఖ - నవముఖి

పుబ్బ - షణ్ముఖి

ఉత్తర - ఏకముఖి, ద్వాదశముఖి

హస్త - ద్విముఖి

చిత్త - త్రిముఖి

స్వాతి - అష్టముఖి

విశాఖ - పంచముఖి

అనురాధ - సప్తముఖి

జ్యేష్ఠ - చతుర్ముఖి

మూల - నవముఖి

పూర్వాషాఢ - షణ్ముఖి

ఉత్తరాషాఢ - ఏకముఖి లేదా ద్వాదశముఖి

శ్రవణం - ద్విముఖి

ధనిష్ట - త్రిముఖి

శతభిషం - అష్టముఖి

పూర్వాభాద్ర - పంచముఖి

ఉత్తరాభాద్ర - సప్తముఖి

రేవతి - చతుర్ముఖి.

ఓం నమః శివాయ

Bhagavad gita_adhyatmikam1

భగవద్గీత

అద్యాయం 11

శ్లోకం 7

ఇహైకస్థం జగత్ కృత్స్నం పశ్యాద్య సచరాచరమ్ |

మమ దేహే గుడాకేశ యచ్చాన్యద్ద్రష్టుమిచ్ఛసి ||

అర్థం :-

ఓ అర్జునా! నా ఈ రూపమునందు ఒకేచోట స్థితమైయున్న సమస్తచరాచర జగత్తును చూడుము. అంతేగాక, ఇంకను నీవు చూడదలచుకొన్న వాటినన్నింటిని చూడుము.



రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...