భగవద్గీత-అధ్యాయం1-శ్లోకం8

అధ్యాయం 1
శ్లోకం 8
భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః |
అశ్వత్థమా వికర్ణమా సౌమాదత్తిస్తథైవ చ ||     

అర్ధం:-

మీరును, భీష్ముడు, కర్ణుడు, సంగ్రామవిజయుడగు కృపాచార్యుడు, అశ్వత్థమ, వికర్ణుడు, సోమదత్తుని కుమారుడైన భూరిశ్రవుడు ఇందు ముఖ్యులు.   


భగవద్గీత-అధ్యాయం1-శ్లోకం7

అధ్యాయం 1
శ్లోకం 7
అస్మాకం తు విశిష్టా యే తాన్నిబోధ ద్విజోత్తమ |             
నాయక మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమి తే ||

అర్ధం:-

ఓ బ్రాహ్మణోత్తమా! మన పక్షముననున్న ప్రధానయోధులను గూడ గమనింపుడు. మీ యెఱుకకై  మన సేనానాయకులను గూర్చియు తెలుపుచున్నాను.  



భగవద్గీత-అధ్యాయం1-శ్లోకం6

అధ్యాయం 1
శ్లోకం 6
యుధామన్యుశ్చ విక్రాంత ఉత్తమౌజశ్చావీర్యవాన్ |
సౌభద్రో ద్రోపదేయాశ్చ సర్య ఏవ మహారథాః ||

అర్ధం:-

పరాక్రమవంతుడైన యుధామన్యుడు మరియు వీరుడగు ఉత్తమౌజుడు, 
సుభద్రపుత్రుడు అభిమన్యుడు, ద్రౌపది యొక్క ఐదుగురు పుత్రులు కలరు. వీరి అందరూ మహారథులు.    

భగవద్గీత-అధ్యాయం1-శ్లోకం5

అధ్యాయం 1

శ్లోకం 5 

దృష్టకేతుశ్చేకితనః  కాశీరాజశ్చ వీర్యవాన్ |
పురుజిత్ కుంతిభోజశ్చ శైభ్యశ్చ నరపుంగవః ||


అర్ధం :-

ధృష్టకేతువు, చేకితానుడు, బలశాలి కాశీరాజు, పురుజిత్తు,
కుంతిభోజుడు, మానవశ్రేష్ఠుడగు శైల్యుడు. 

భగవద్గీత-అధ్యాయం1-శ్లోకం4

అధ్యాయం 1

శ్లోకం 4 :-

అత్ర శూరా మహేష్వాసా భీమార్జునసమా యుధి |          
యుయుధానో విరాటశ్చ  ద్రుపదశ్చ మహారథః ||


 అర్ధం:- 

 ఈ పాండవ సేనలందు శూరులను గొప్ప ధనుర్విద్య సంపనులును 
భీమార్జునులతో సామానులను గలరు మరియు సాత్యకి విరాటుడు 
మహారథి ద్రుపదరాజు.   
   

భగవద్గీత-అధ్యాయం1-శ్లోకం3

అధ్యాయం 1

శ్లోకం 3:-
పశ్యైతాం  పాండుపుత్రాణాం ఆచార్యమహతీం చ మూమ్ |
వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమతా ||

అర్ధం :- 
ఓ ఆచార్యా! బుద్ధిమంతుడైన మీ శిషుడును, ద్రుపదపుత్రుడును అయిన 
దృష్టద్యుమ్నునిచే వ్యూహాత్మకంగా నిల్పబడిన పాండవుల ఈ మహా సైన్యమును చూడుడు.  

భగవద్గీత-అధ్యాయం1-శ్లోకం2

అధ్యాయం 1

శ్లోకం 2:-
దృష్ట్వాతు పాండవానీకం వ్యూడం  దుర్యోధనస్తదా | 
ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్ ||   







అర్ధం:-
సంజయుడు పలికెను :-

ఆ సమయమున రాజైన దుర్యోధనుడు వ్యూహరచనతో సమరమునకు 
మోహరించియున్న పాండవసైన్యమును చూచి, ద్రోణాచార్యుని కడకేగి యిట్లు పలికెను. 

 

భగవద్గీత-అధ్యాయం1-శ్లోకం1

అధ్యాయం 1

అథప్రథమో ధ్యాయః - అర్జునవిషధయోగః
ధృతరాష్ట్ర ఉవాచ

శ్లోకం 1 

ధర్మక్షేత్రే కురుక్షేత్రే సామవేతా యుయుత్సవః |
మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ ||    

అర్ధం :-
ధృతరాష్టుడు పలికెను:-

ఓ సంజయ! యుద్ధసన్నద్ధులై ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమునకు 
చేరియున్న నా కుమారులను పాండు పుత్రులను ఏమి చేసిరి?  


గణపతి శ్లోకం

గణపతి శ్లోకం
శ్లోకం:-
 
అంతరాయ తిమిరోపశాంతయే శాంతపవనామచింత్య వైభవం |
తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః || 

అర్ధం:-

"ఆటంకాలు అనే చీకట్లను పోగొడుతూ, శాంతమై, పావనమై ఊహాతీతమైన 
వైభవంతో శరీరమున నరరూపం, ముఖమున గజరూపం గలిగిన దివ్యతేజాన్ని (గణపతిని) ఉపాసిస్తున్నాను."

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...