భగవద్గీత-అధ్యాయం1-శ్లోకం37

అధ్యాయం 1
శ్లోకం 37
తస్మాన్నార్హా వయం హంతుం ధర్తరాష్ట్రాన్ స్వబాంధవాన్ |
స్వజనం హి కథం హత్వా సుఖింనః స్వామ మధవ ||
 
      
అర్ధం:-
ఓ మాధవ! మన బంధువులైన ఈ ధార్తరాష్టులను చంపుట మనకు తగదు. స్వజనులను చంపిన మనకు సుఖము ఎట్లు అబ్బును?







భగవద్గీత-అధ్యాయం1-శ్లోకం36

అధ్యాయం 1
శ్లోకం 36
నిహత్య ధార్తరాష్ట్రాన్నః కా ప్రీతిః స్యాజ్జనార్దన |
పాపమేవాశ్రయేదస్మాన్ హత్వైతానాతతాయినః ||   

అర్ధం:-
ఓ జనార్ధన! ఈ ధార్తరాష్ట్రులను చంపి, మనము బావుకొనునది ఏమి ? (మనము మూట కట్టుకొనునది యేమి?)
ఈ ఆతతాయులను చంపుటవలన మనకు పాపమే కలుగును.  





భగవద్గీత-అధ్యాయం1-శ్లోకం35

అధ్యాయం 1
శ్లోకం 35
ఏతన్న హంతుమిచ్ఛామి ఘ్నతో పిమదుసూధన |
అపి త్రైలోక్యరాజ్యస్య హేతోః కిం ను మహికృతే ||    

అర్ధం:-
ఓ మధుసూధనా ! ముల్లోకాధిపత్యముకొరకైనను నేను ఎవ్వరినీ చంపను. ఇక ఈ భూమండలవిషయమై చెప్పనేల? అట్లే వీరిలో ఎవ్వరైనను నన్ను చంపబూనిననూ నేను మాత్రము వీరిని చంపనే చంపను.  





భగవద్గీత-అధ్యాయం1-శ్లోకం34

అధ్యాయం 1
శ్లోకం 34
ఆచార్యాః పితరః పుత్రాః తథైవ చ పితామహాః |
మాతులాః శ్వశురాః పౌత్రాః శ్యాలాః సంబంధినస్తథా ||


అర్ధం:-
గురువులు, తండ్రులు, తాతలు కొడుకులు, మనుమలు, మేనమామలు, మామలు,
బావమరుదులు, ఇతర బంధువులు మొదలగువారు అందరును ఇచ్చటికి  చేరియున్నారు.  

భగవద్గీత-అధ్యాయం1-శ్లోకం33

అధ్యాయం 1
శ్లోకం 33
యేషామర్థే కాంక్షితం నో రాజ్యం భోగః సుఖాని చ |
త ఇమే వస్థితా యుద్ధే ప్రాణాంస్త్యక్త్వా ధనాని చ ||



అర్ధం :-
మనము ఎవరికై ఈ రాజ్యమును, భోగములను, సుఖములను కోరుకొనుచున్నామో, వారే ధనప్రాణములయెడ ఆశలు వదులుకొని యుద్ధములకు వచ్చియున్నారు. 





భగవద్గీత-అధ్యాయం1-శ్లోకం32

అధ్యాయం 1
శ్లోకం 32
న కాంక్షే విజయం కృష్ణ న చ రాజ్యం సుఖాని చ |
కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా ||


అర్ధం:-
ఓ కృష్ణ ! నాకు విజయము గాని, రాజ్యం గాని, సుఖములు గాని అక్కరలేదు. 
గోవిందా! ఈ రాజ్యమువలన గాని ఈ భోగమువలనగాని ఈ జీవితమువలన గాని ప్రయోజనం ఏమి? 





భగవద్గీత-అధ్యాయం1-శ్లోకం31

అధ్యాయం 1
శ్లోకం 31
నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ |
న చ శ్రేయో నుపశ్యామి హత్వా స్వజననుమహానే ||

అర్ధం :-
ఓ కేశవ ! పెక్కు ఆపశకునములు కనబడుతున్నవి. 
యుద్ధమున స్వజనమూహమును చంపుటచే శ్రేయస్సు కలుగునని అనిపించుటలేదు.








భగవద్గీత-అధ్యాయం1-శ్లోకం30

అధ్యాయం 1
శ్లోకం 30
గాండీవం స్రంసతే హస్తాత్ త్వక్వైవ పరిదహ్యతే |
న చ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః || 


అర్ధం :-
గాండీవము చేతినుండి జారిపోవుచున్నది. చర్మము తపించిపోవుచున్నది. మనస్సు భ్రమకు గురియైనట్లు ఆనిపించుచున్నది. కనుక ఇక్కడ నిలబడలేక పోవుచున్నాను.






భగవద్గీత-అధ్యాయం1-శ్లోకం28,29

అధ్యాయం 1
శ్లోకం 28
కృపయా పరయావిష్టో విషీధన్నిదమబ్రవీత్ |
దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సుం సముపస్థితమ్ || 

శ్లోకం 29
సీదంతి మామ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి | 
వేపథుశ్చ శేరీరే మే రోమహర్షశ్చ జయతే || 

అర్ధం:- 
సమరభూమికి వచ్చియున్న బంధువులను అందరిని చూచి, కుంతీపుత్రుడైన అర్జునుడు అత్యంత కరుణాసమంచితుడై శోకసంతప్తుడై ఇట్లు పలికెను. 

అర్జునుడు పలికెను :- ఓ కృష్ణా ! సమరోత్సాహముతో రణరంగమున నిలిచియున్న ఈ స్వజనసమూహమును జూచి, నా అవయవములు శిథిలముగుచున్నవి. నోరు ఎండిపోవుచున్నది. శరీరమునందు వణుకు, గగుర్పాటు కలుగుచున్నవి. 


భగవద్గీత-అధ్యాయం1-శ్లోకం26,27

అధ్యాయం 1
శ్లోకం 26
తత్రాపశ్యత్  స్థితం పార్థః పితౄనథ పితామహన్ |
ఆచార్యాన్ మాతులాన్ భ్రాతౄన్ పుత్రన్ పౌత్రాన్ సఖీంస్తథా ||
శ్లోకం 27
శ్వశురాన్ సుహృదశ్చైవ సేనయోరుభయోరపి |
తాన్ సమీక్ష్య స కౌంతేయః సర్వన్ బందూనవస్థితాన్ ||   



అర్ధం:- 
పిమ్మట పార్థుడు ఆ ఉభయసేనలయందును చేరియున్న పెదతండ్రులను, పినతండ్రులను, తాతముత్తాతలను, గురువులను, మేనమామలను, సోదరులను, పుత్రులను, పౌత్రులను, మిత్రులను, పిల్లనిఛ్చిన మామలను మున్నగు ఆత్మీయులను చూచెను.     






భగవద్గీత-అధ్యాయం1-శ్లోకం25

అధ్యాయం 1
శ్లోకం 25
భీష్మద్రోణప్రముఖతః సర్వేషాం చమహీక్షితామ్ |
ఉవాచ పార్ధ పశ్యైతాన్ సామవేతాన్ కురూనితి ||

అర్ధం:-
భీష్మద్రోణులకును, ఆ పక్షమునందలి మహారాజులందరికిని ఎదురుగా ఉభయసేనలమధ్య నిలిపేను. పిదప 
కృష్ణుడు అర్జునునితో " పార్ధా! ఇక్కడ సమావేశమైన ఈ కౌరవ వీరులందరిని పరికింపుము" అని పలికెను.  






భగవద్గీత-అధ్యాయం1-శ్లోకం24

అధ్యాయం 1
శ్లోకం 24
                   సంజయ ఉవాచ 

ఏవముక్తో హృషీకేశో గుడాకేశేనా భారత |
సేనయోరుభయోర్మధ్యే స్థాపయిత్వా రధోత్తమమ్ ||


అర్ధం :-
సంజయుడు పలికెను :- 
ఓ ధృతరాష్ట్రా! అర్జునుని కోరికమేరకు శ్రీకృష్ణుడు ఆ దివ్యరథమును నిలిపేను.






భగవద్గీత-అధ్యాయం1-శ్లోకం23

అధ్యాయం 1
శ్లోకం 23
యోత్స్యమానానవేక్షే హం య ఏతే త్ర సమాగతః |
ధార్తరాష్ట్రస్య దుర్బుద్దేః యుద్ధే ప్రియచికీర్షవః   ||


అర్ధం :-
దుర్భుద్ధియైన దుర్యోధనునకు ప్రియమునుగుర్చుటకై యుద్ధమున 
పాల్గొనదలచి వచ్చియున్న రాజులను అందరిని ఒకపరి పరికించెదను.







భగవద్గీత-అధ్యాయం1-శ్లోకం22

అధ్యాయం 1
శ్లోకం 22
యావదేతాన్ నిరీకే హం యోద్ధుకామానవస్థితాన్ |
కైర్మయా సహా యోద్ధవ్యమ్ అస్మిన్ రణసముద్యమే ||




అర్ధం:-
రణరంగమునందు  యుధాభిలాషులై నిలిచియున్న ప్రతిపక్షయోధు 
లందరిని బాగుగా పరిశీలించునంతవరకును, వారిలో ఎవరితో నేను యుద్ధము చేయవలసియున్నదో గమనించునంతవరకును రధమును నిలిపియుంచుము.  


 

భగవద్గీత-అధ్యాయం1-శ్లోకం20,21

అధ్యాయం 1
శ్లోకం 20
అథ వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిద్వజః |
ప్రవృత్తే శాస్త్రసంపాతే ధనురుద్యమ్య పాండవః  |
హృషీకేశం తదా వాక్యమ్ ఇదమాహ మహీపతే |
శ్లోకం 21
అర్జున ఉవాచ 

సేనయోరుభయోర్మధ్యే రథం స్తపయో మేచ్యుత |


అర్ధం :-
ఓ ధృతరాష్ట్ర మహారాజా! పిమ్మట యుద్దమునకై నడుము బిగించి సమర సన్నద్ధులైయున్న 
ధార్తరాష్ట్రులను చూచి, కపిధ్వజుడైన అర్జునుడు ధనస్సును పైకెత్తి శ్రీకృష్ణునితో ఇట్లనెను.

                                            అర్జునుడు పలికెను 

 " ఓ అచ్యుతా! నా రథమును ఉభయసేనల మధ్య నిలుపుము."    

ధృవచరిత్ర

పార్ట్ 3


శ్రీమహావిష్ణువు శ్రీమహాలక్ష్మి సహితముగా బయలుదేరి ధ్రువుడు ఉన్న చోటికి వచ్చారు. ధ్రువుడు కళ్ళు తెరిచి స్వామిని చూసి ఏమి మాట్లాడాలో తెలియక అలాగా స్వామిని చూస్తూ ఉండిపోయాడు. అపుడు స్వామి నాలుగు అడుగులు ముందుకు వేసి ధ్రువుడు దగ్గరకి వచ్చి స్వామి చేతిలో ఉన్న శంఖంను ధ్రువుడు తలపై పెట్టారు. శంఖం తలపై పెట్టగానే ధ్రువుడికి సకల విద్యలు, సకల వేదాలు, జ్ఞానం వచ్చాయి. అపుడు ధ్రువుడు స్వామి నీవు ఎవరివో నాకు తెలుసు. సమస్త బ్రమండములు సృష్టి అందు లేవు ఇవి అని మాయ కేవలం త్రిగుణాత్మకంగా ఏర్పడ్డాయి. సృష్టి అది, అంతము, నడుస్తున్నపుడు ఉన్న వాడివి నీవే . నీవు పురాణ పురుషుడవు. నిన్ను మరచిన వాడు జీవం మరణ చక్రంలోనే తిరుగుతూనే ఉంటాడు. నిన్ను శేరాను వేడిన వాడు ముక్తిని పొందుతాడు. అని స్తోత్రం చేసాడు ధ్రువుడు. 




శ్రీ మహా విష్ణువు విని సంతోషించి ధ్రువుడికి వరం ఇవ్వాలి అనుకున్నారు. ధ్రువా ! నీవు దేనికోసం తపస్సు చేసావో నాకు తెలుసు. నీ తండ్రి తొడపై నీ చిన్న తల్లి కుర్చోనివ్వలేదు అని అందరి కన్నా పెద్ద పదవి కావాలి అని తపస్సు చేసావు ఆ పదవి ఏమిటో కూడా నీకు తెలియదు. నీకు అది నేను ప్రసాదిస్తాను.  సామాన్యంగా ఆ పదవి ఎవరికీ ఇవ్వరు కానీ నీవు ఇంత చిన్న వయస్సులో చేసిన తపస్సు వలన నీకు అది ఇచ్చేస్తున్నాను. ధర్మమూ, అగ్ని, సూర్యుడు, నక్షత్రాలు, కశ్యపుడు, సప్తఋషులు, కాలము, రుతువులు, చంద్రులు అది కదలకపోతే దాన్ని ఆధారం చేసుకొని తిరుగుతాయో అటువంటి ధ్రువమండలంగా నిను మార్చేస్తున్నాను. నిను ఆధారం చేసుకొని సమస్త జ్యోతి చక్రం తిరుగుతుంది. అటువంటి పదవిని నీకు అనుగ్రహిస్తునాను అన్నారు స్వామి. కానీ ఇపుడే కాదు నీవు ముందు ఇంటికి వేలు నీకు రాజ్యాభిషేకం జరుగుతున్నది. నీకు భవిషత్తు చెపుతున్నాను. నీ తమ్ముడు మరణిస్తాడు. నీ చిన్న తల్లి కూడా మరణిస్తుంది. అని భోగాలు అనుభవించిన తరువాత నీకు వైరాగ్యము సిద్ధిస్తుంది. నీవు మళ్ళి తపస్సు చేస్తావు. నిన్ను అటువంటి ధ్రువమండలానికి తీసుకెళ్లి తరువాత నిన్ను నాలో ఐక్యం చేసుకుంటాను ఇదే నీకు చిట్టచివరి జన్మ అని చేపి స్వామి వెళ్లిపోయారు. 

భగవద్గీత-అధ్యాయం1-శ్లోకం19

అధ్యాయం 1
శ్లోకం 19
స ఘోషో ధార్తరాష్ట్రాణాం హృదయాని వ్యధారయత్ |
నభశ్చ పృథివీం చైవ తూములో వ్యనునాదయన్||

అర్ధం :-

పాండవపక్షమహాయోధుల శంఖనినాదములకు భూమ్యాకాశములు దద్ధరిల్లినవి.
ఆ శంఖారావంలు ధార్తరాష్ట్రుల హృదయములు కకావికలమయ్యాయి.




  

భగవద్గీత-అధ్యాయం1-శ్లోకం18

అధ్యాయం 1
శ్లోకం 18
ధ్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశః పృథివీపతే |
సౌభద్రశ్చ మహభహుః శంఖాన్ దధ్ముః పృథక్ పృథక్ || 


అర్ధం:-
ద్రుపద మహారాజు, ద్రౌపది యొక్క ఐదుగురు పుత్రులను, భుజబలశాలి సుభద్ర పుత్రుడు 
అయిన అభిమన్యుడును తమ తమ శంఖములను వేర్వేరుగా పూరించిరి. 

ధృవచరిత్ర

పార్ట్ 2



ఇది గమనించిన నారదుడు ధ్రువుడు వద్దకు వచ్చి అతనిని పరీక్షించతలచి నీవు ఎక్కడికి వెళుతున్నావు అని అడిగాడు. అపుడు ధ్రువుడు నేను శ్రీ మహా విష్ణువు కోసం తపస్సు చేయటానికి వెళుతున్నాను అని చెప్పాడు. నారదుడు ఆడుకోవలసిన వయసులో తపస్సు ఎందుకు చెప్పు హాయిగా ఇంటికి వేలు. ఇంట్లో అమ్మ నాన్న ఎదురుచూస్తుంటారు అని చెప్పాడు. అందుకు ధ్రువుడు నేను ఇంటికి వేళ్లను అని జరిగినదంతా వివరించి చెప్పాడు. నారదుడు చిరునవ్వునవీ నీవు మీ చిన్న తల్లీ మీద కోపంతో తపస్సుకు వెళతాను అంటున్నావు కానీ నీ కోపాన్ని విడి ఆ పరమాత్మా పైన భక్తితో ధాన్యం చేస్తే స్వామి తప్పకుంటా కరుణిస్తాడు. కేవలం శ్రీ మహా విష్ణువుని మాత్రమే ధ్యానం చేయి వేరే ఆలోచన కూడా నీ మస్తిష్కములోనికి రానివ్వకు. స్వామి కి అర్చన చేయి ప్రతిరోజు నీకు ఏది దొరికితే దానినే నివేదించు . పండు, పూవులు, ఆకులూ ముఖ్యంగా తులసి దొరికితే అవి నివేదించు. ఆహారం మితంగా తీసుకో. నేను నీకు చెప్పే మంత్రాన్ని అనుక్షణం ధ్యానం చేయి అని ధ్రువుడి చెవి దగ్గర 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అను మంత్రనీ ఉపదేశించి నారదుడు ధ్రువుడితో నీవు యమునా నది ఒడ్డున మధువనం ఉన్నది అది నిరంతరం శ్రీ మహా విష్ణువు పాదస్పర్శతో పావనమౌతుంది నీవు అక్కడికి వేళ్ళు అని నారదుడు దీవించి వేళాడు.




వెంటనే ధ్రువుడు యమునా నది ఒడ్డుకు వేళాడు. అక్కడ స్నానం చేసి శ్రీ మహా విష్ణువును నారదుడు చేపినట్టుగానే ఆరాధించాడు. పద్మాసనం వేసుకొని మనసును లగ్నం చేసి స్వామిని ధాన్యం చేయటం మొదలు పెట్టాడు. మొదటి నెలలో మూడు రోజులకు ఒకసరి వెలగ పండు, రేగిపండు తినేవాడు. రెండొవ నెలలో ఆరు రోజులకు పూర్తి అయినా తరువాత కొంచం గడ్డి, ఆకులూ తినేవాడు. మూడవ నెలలో తొమ్మిది రోజులకు ఒకసారి కొంచం నీళ్లు తాగేవాడు. నాలుగోవ నెలలో పనేండు రోజులకు ఒక సారి గాలి పీల్చి వదిలేవాడు. అయిదోవ నెలలో బోటనవేలు మీద నిలబడి స్వామిని ధాన్యం చేసేవాడు. ధ్రువుడు తపస్సు తీవ్రమై అతను బొటనవేలు మార్చినపుడు అలా భూమి అటువయపుకి ఒరిగిపోయేది. దేవతలకు భయం వేసింది. వారందరు వెళ్లి శ్రీ మహా విష్ణువుని వేడుకున్నారు. 


           

ధృవచరిత్ర

పార్ట్ 1
           
   పూర్వం ఉత్తానపాదుడు అను రాజు ఉండేవారు. ఆయనకి ఇద్దరు భార్యలు. వారు సునీతి, సురుచి. వారికీ ఇద్దరు కుమారులు. సునీతి కుమారుడు ధ్రువుడు. సురుచి కుమారుడు ఉత్తముడు. ఉత్తానపాదుడు సునీతిని నిర్లక్ష్యం చేసి సురుచి మాటే వినేవారు. ఒక రోజు ఉత్తానపాదుడు అంతఃపురంలో ఉండగా సురుచి కుమారుడు ఉత్తముడిని తన తొడపైన కూర్చోబెట్టుకున్నాడు . అపుడే అక్కడికి వచ్చిన ధ్రువుడుకి కూడా తన తండ్రి తొడపైన కూర్చోవాలి అనిపించింది. వచ్చి తన తండ్రి తొడపైన కూర్చుదాము అనుకుంటుండగా సురుచి వచ్చి నీవు నీ తండ్రి తొడమీద కుంచుంటానికి విలేదు. నీవు నా కడుపునా పుట్టివుంటే నీవు కూర్చోవచ్చు. నీవు సునీతి కడుపునా పుట్టావు. నీకు శ్రీ మహా విష్ణువు అనుగ్రహము లేదు. అందుకే నీవు నా కడుపునా పుట్టలేదు అని ధ్రువుడిని తిడుతుండగా  అతనికి అర్ధంకాలేదు.



          అపుడు అతని వయసు ఐదు సంవత్సరములు. తనకు అర్ధం కాకా ఏడుస్తూ తన తల్లీ ఐనా సునీతి దగరకు వేళాడు. సునీతి ఏడుస్తున్న తన బిడను చూసి ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగింది. ధ్రువుడు ఏమి చెప్పాలో అర్ధం కాకా ఏడుస్తున్నాడు అపుడు అనంతపురంలో ఉన్న చెలికతేలు జరిగిన విషయం చెప్పారు. సునీతి ధ్రువుడితో మీ చిన్న తల్లీ చెప్పిన మాట నిజమే నీవు ఈ దురదృష్టవంతురాలి కడుపునా పుట్టావు కనుకనే నీకు ఇలా జరిగింది. నీకు శ్రీమహా విష్ణువు అనుగ్రహం కలిగితే అని నీకు సిద్ధిస్తాయి. నీవు వెంటనే అరణ్యంలో తపస్సుకు వేళ్ళు శ్రీ మహా విష్ణువు అనుగ్రహం దొరికినాకే నీవు ఇంటికి తిరిగిరా అని పంపించింది. వెంటనే ధ్రువుడు అరణ్యానికి బయలుదేరివెళ్లడు. 

భగవద్గీత-అధ్యాయం1-శ్లోకం17

అధ్యాయం 1
శ్లోకం 17
కాశ్యశ్చ పరమేష్వాసః శిఖండి చ మహారాధః |
దృష్టధ్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చపరాజితః ||   

అర్ధం:-
మహాధనుర్థిరియైన కాశీరాజు, మహారథుడైన శిఖండి, ధృష్టద్యుమ్నుడును,
విరాటరాజు, అజేయుడైన సాత్యకి తమ తమ శంఖములను పూరించారు. 






     

భగవద్గీత-అధ్యాయం1-శ్లోకం16

అధ్యాయం 1
శ్లోకం 16
అనంతవిజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠరః |
నకులః సహదేవశ్చ సుఘోషమణిపుష్పకౌ  || 

అర్ధం:-
కుంతీపుత్రుడును, రాజును ఐన యుధిష్టిరుడు అనంతవిజయము అను శంఖమును, నకులసహదేవులు సుఘోష మణిపుష్పకములను శంఖములను పూరించిరి. 

సర్వస్య శరణాగతి గురించి చూపిన కథ ?


క్షిరసాగరం మధ్యలో  ఉన్న ద్విపంలో అనేక అరణ్యాలతో కూడుకున్న త్రికూట పర్వతం దగ్గర కొన్ని కోట్ల ఏనుగులు జీవించేవి. వీటి అన్నిటికి రాజు గజేంద్రుడు. ఈ గజేంద్రుడికి అనేక మంది భార్యలు ఉన్నారు.ఆ అడవి అంత చందం చెట్లతో నింది ఉన్నది. ఒక రోజు గజేంద్రుడు తన పరివారముతో కలిసి వన విహారానికి వేలాడు. మార్గం మధ్య లో ఏనుగులకు దాహం తీర్చుకోవటానికి అక్కడే ఉన్న సరస్సులోకి వెళ్లి నీళ్లు తాగి రాకుండా ఆ సరస్సు లోని నీటితో ఆడుకోవటం మొదలుపెట్టాయి. వీటి ఆటలకి సరస్సు చెల్లచెదురు అయింది. సరస్సులో ఉన్న కమలాలు అని పోయాయి. ఈ సరస్సులో ఉన్న మొసలి ఏనుగుల రాజు అయినా గజేంద్రుడి కాళ్ళని పట్టుకుంది. 

ఈ గజేంద్రుడు తన బలాన్ని అంతటిని ఉపయోగించి మొసలితో యుద్ధం చేసింది. ఈ యుద్ధం లో రాను రాను గజేంద్రుడి బలం తగిపోయి తాను చనిపోయే స్థితికి వచ్చింది. అపుడు గజేంద్రుడు చుట్టు చూసాడు తన పరివారం అంత తనకు సహాయం చేయకుండా సరస్సు నుంచి పారిపోయే చూస్తున్నాయి. తనకు సహాయం ఆ సర్వేశ్వరుడే తప్ప ఇంకా ఎవరు చేయలేరు అని గజేంద్రుడికి అర్ధం అయింది.

ఓ సర్వేశ్వరా! నాకు నీవు తప్ప వేరే దిక్కు లేదు. నీవే నను రక్షించే నాధుడవు. నీవే సృష్టిని సృష్టించి నడిపించి లయం చేసే వాడివి నీవే. నన్ను నీవు పరిపూర్ణ పురుషుడవు. నను రక్షించు స్వామి అని గజేంద్రుడు ప్రాదించాడు. ఇంకా గజేంద్రుడు నేను ఎలాగో చనిపోతాను నన్ను రక్షించి నాకు మోక్షాన్ని ప్రసాదించు స్వామి అని వేడుకున్నాడు. 

ఈ ప్రార్ధనలు విన్న శ్రీమహావిష్ణువు గజేంద్రుడిని రక్షించడానికి పరుగు పరుగునా బయలుదేరాడు స్వామి. తన చెంతనే ఉన్న శ్రీ లక్ష్మికి కూడా చెప్పకుండా శంఖు చక్రాలు ధరించకుండ గరుడ వాహనము తీసుకోకుండ స్వామి పరుగు పరుగునా వస్తుంటే వెనక శ్రీ మహా లక్ష్మి, శంఖు చక్రాలు, గరుడుడు, వైకుంఠ వాసులు అందరూ స్వామి తో భయాలు దేరివచ్చారు. విష్ణుమూర్తి రాగానే గజేంద్రుడు మనసులో తలచుకుంటున విరాట స్వరూపం కళ్లముందు వచ్చేసరికి పక్కనే ఉన్న కమలంను స్వామికి ప్రసాదించాడు. స్వామి తన చేతిలో ఉన్న కమలంను పక్కన పెట్టి గజేంద్రుడు ప్రసాదించిన కమలంను తీసుకున్నారు. అదే చేతితో స్వామి గజేంద్రుడి తల నిమిరారు. వెంటనే సుదర్శన చక్రంతో మొసలిని చంపేశారు స్వామి. 

ఈ కధలో పరమాత్మనిన్నమి నీవే దిక్కు అని తలచిన వారికీ నీవే సత్యం మిగిలిన జగతి అంత అసత్యం అని తలచిన వారికీ తపకుండ కాపాడతారు అని వివరించిన కథ.




భగవద్గీత-అధ్యాయం1-శ్లోకం15

అధ్యాయం 1
శ్లోకం 15
పాంచజన్యం హృషీకేశో దేవదత్తం ధనంజయః |
పౌండ్రం దద్మౌ మహాశంఖం భీమకర్మా వృకోదరః ||

అర్ధం:-
శ్రీకృష్ణుడు పాంచజన్యమును, అర్జునుడు దేవదత్త శంఖమును పూరించిరి. ఆరివీరభయంకరుడైన భీముడు పౌడ్రము అను మహా శంఖమును పూరించెను.  




భగవద్గీత-అధ్యాయం1-శ్లోకం14

అధ్యాయం 1
శ్లోకం 14
తతః శ్వేతైర్హయైర్యుక్తే మహతి స్యందనే స్థితౌ |
మాధవ: పాండవశ్సైవ దివ్యౌ శంఖౌ ప్రదద్మతుః ||

అర్ధం :-
తదనంతరము శ్వేతాశ్వములను పూన్చిన  మహారథముపై  
ఆసీనులైయున్న శ్రీకృష్ణార్జునులు తమ దివ్యశంఖములను పూరించిరి. 


సప్తఋషులు అంటే ఎవరు?


సప్తఋషులు బ్రహ్మ మానసపుత్రులు. వారు ఏడుగురు 


మరీచి 
అత్రి,
అంగీరసుడు,                                    
పులహు,
క్రతు, 
పులస్త్యుడు,
వశిష్టుడు. 

  
        

భగవద్గీత-అధ్యాయం1-శ్లోకం13

అధ్యాయం 1
శ్లోకం 13
తతః శంఖాశ్చ భేర్యశ్చ పణవనకగోముఖాః |
సహసైవాభ్యహన్యంత స శబ్దస్తుములో భవత్ ||
అర్ధం:-
మరుక్షణమునందే శంఖములు, తప్పెటలు, మృదంగములు, గోముఖవాద్యములు, మొదలగునవి 
ఒక్కసారిగా మ్రోగినవి. దిక్కులను పిక్కటిల్లజేయు ఆ వాద్యనాధములు భయంకరములైనవి.  

  

ఏరువాక పున్నమి

వర్షఋతువులో జ్యేష్ఠశుద్ధ పూర్ణిమను తెలుగు రైతులు ఏరువాక పున్నమిగా జరుపుకుంటారు. తొలకరి జల్లుల ఆగమనంతో రైతులు ఆనందోత్సాహాల మధ్య అరక దున్నటంతో పొలం పనులు మొదలుపెడతారు.

ఏరు అంటే దున్నడానికి సిద్ధం చేసిన నాగలి అని, ఏరువాక అంటే దున్నడానికి ప్రారంభమనీ అర్థం. అంటే వ్యవసాయం మొదలుపెట్టడం. సాంప్రదాయికంగా రైతులు ఏరువాక పున్నమిని పండుగలా జరుపుకుంటారు. ఆ రోజు ఎద్దులను కడిగి చక్కగా అలంకరిస్తారు. వాటికి పొంగలి పెడుతారు. అనంతరం రైతులందరూ సామూహికంగా ఎద్దులను తోలుకుని పొలాలకు వెళ్లి దుక్కి దున్నుతారు.

ఆరోజున ఆడపడుచులు పుట్టింటికి వస్తారు. ఈ పండుగనాడు చేసే మరో ముఖ్యమైన వేడుక ఎడ్ల పందేలు. ఎద్దులను బాగా అలంకరించి పరిగెత్తిస్తారు. వాటి వెనుక యువకులు పరుగులు తీస్తారు. అంతేకాకుండా ఎద్దులకు బండలు (బరువైన రాళ్ళూ) కట్టి పరుగులు తీయిస్తారు. దీన్ని బండలాగుడు పోటీ అంటారు.

ఏరువాక పౌర్ణమి రోజునే ఇళ్ళలో పనిచేసే జీతగాళ్ళ సంవత్సరం ముగిసి కొత్త సంవత్సరం మొదలవుతుంది. విష్ణుపురాణములో ఈ ఏరువాక పున్నమికి సీతాయజ్ఞము అని పేరు ఉంది. “మంత్ర యజ్ఞా పరా విప్రాః” – అంటే బ్రాహ్మణులు మంత్రాదులు జపం చేయడంలో యజ్ఞం వలె ఆ దీక్షతో, లక్ష్యంతో వ్యవహరిస్తారు. అలాగే కర్షకులు సీతా యజ్ఞము – సీత అంటే నాగలి. నాగలితో దుక్కి దున్నుతూ వ్యవసాయాన్ని ఆరంభించి పంటలు పండిస్తారు. ఇది వారికి యజ్ఞంతో సమానం. అని వివరిస్తుంది విష్ణుపురాణం. 

ఇది ఏరువాక పున్నమి మనకు చేసే బోధ. చెట్లను నాటుదాం. కనీసం ఒక మొక్కనైనా సంరక్షిద్దాం. ఈ పండుగను అందరం పాటిద్దాం. అందరమూ కలిసి నవ్య ప్రపంచాన్ని నిర్మిద్దాం.

భగవద్గీత-అధ్యాయం1-శ్లోకం12

అధ్యాయం 1
శ్లోకం 12
తస్య సంజనయన్ హర్షం కురువృధఃపితామహః |
సింహనాదం వినద్యోచ్చైహః  శంఖం దధ్మౌ ప్రతాపవాన్ ||   

అర్ధం:-
కురువృద్దుడు, ప్రజ్ఞాశాలి ఐన భీష్మ పితామహుడు (దుర్యోధనుని ఈ మాటలు విని) అతనిని
సంతోహపరచుటకై ఉఛ్చాస్వరముతో సింహనాదమొనర్చి, తన శంఖమును పూరించెను. 

హిందూ సామ్రాజ్య దినోత్సవం

నేడు హిందూ సామ్రాజ్య దినోత్సవం




ఛత్రపతి శివాజీగా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోంస్లే పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించాడు.


 హిందూ ధర్మాన్ని, హిందూ సంస్కృతిని, హిందూ సమాజాన్ని సంరక్షించిన వారిలో అగ్రగణ్యుడుగా పేరుగాంచిన వీరుడు ఛత్రపతి శివాజీ. 1674 జూన్ 6న (జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి) రాయఘడ్ కోటలో వేద పఠనాల మధ్య శివాజీని క్షత్రియరాజులందరికీ అధిపతిగా కీర్తిస్తూ 'ఛత్రపతి' అని బిరుదును ప్రదానం చేసారు. ఛత్రపతి బిరుదుగాంచి హిందూ పదుపాదుషాహీ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసి చక్రవర్తి అయిన శివాజీ మహరాజ్ పట్టాభిషిక్తుడైన జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు హిందూ సామ్రాజ్య దినోత్సవమును జరుపుకుంటారు.

శివాజీ క్రీ.శ. 1630 ఫిబ్రవరి 19వ సంవత్సరం వైశాఖమాసం శుక్లపక్ష తదియనాడు పూణే జిల్లాలోని జున్నార్ పట్టణం దగ్గర గల శివనేరి కోటలో షాహాజీ, జిజియాబాయి పుణ్యదంపతులకు జన్మించాడు. శివాజీ విద్య నలుగురు గురువుల మధ్య సాగింది. వీరందరి శిక్షణలో శివాజీ  రాజనీతి వ్యవహారాలు యుద్ధ తంత్రాలలో నిష్ణాతుడయ్యాడు. మొదటి గురువు తల్లి జిజియాభాయి, రెండవ గురువు దాదాజీకొండదేవ్, మూడవ గురువు తుకారాం, నాలుగోవ గురువు సమర్ధ రామదాసు వీరి దగ్గర శివాజీ సకల విద్యలు నేర్చుకున్నారు. 17 ఏళ్ళ వయసులో శివాజీ మొట్టమొదటి యుద్ధం చేసి బిజాపూర్ సామ్రాజ్యానికి చెందిన తోర్నా కోటను సొంతం చేసుకున్నాడు. హిందూ సామ్రాజ్య స్థాపనే లక్ష్యంగా శివాజీ ప్రయాణం జరిగింది. సుల్తానులతో యుద్ధాలు, కొల్హాపూర్ యుద్ధం, పవన్‌ఖిండ్ యుద్ధం, మొఘలులతో యుద్ధాలు, సూరత్ యుద్ధం, ఆగ్రా కుట్ర, సింహగఢ్ యుద్ధాలు చేసి హిందూ సామ్రాజ్య స్థాపన 1674 జూన్ 6 న శివాజీ ఛత్రపతి శివాజీగా పట్టాభిషిక్తుడైనాడు. శివాజీ మహిళల క్షేమం కోరిన మహానుభావుడు. సతి సహగమనాని నిషేదించారు . మహిళల చేత అన్నయ్య అని పిలిపించుకునే మహానుభావుడు. 
    


భగవద్గీత-అధ్యాయం1-శ్లోకం11

అధ్యాయం 1
శ్లోకం 11
ఆయనేషు చ సర్వేషు యథాభాగమవస్థితాః |
భీష్మమేవాభిరక్షంతు భవంతః సర్వ ఏవ హి ||  

అర్ధం:-
మీరందరును మీమీ స్థానములలో సుస్థిరంగా నిలిచి, 
అన్నివైపులా నుండి నిశ్చియముగా భీష్ముని రక్షించుచుండుడు 





గంగావతరణం

భగీరథుని తపఃఫలితంగా గంగమ్మ అవతరించిన తిథి, జ్యేష్ఠ మాసం, శుక్ల ద్వాదశి(రామ లక్ష్మణ ద్వాదశి).


రామాయణంలో రామలక్ష్మణులు విశ్వామిత్రునితో అరణ్య మార్గంగుండా  విశ్వామిత్రుని ఆశ్రమానికి వెళుతుండగా తాటక సంహారం తరువాత గంగనది చెంతకు వెళతారు. అపుడు రాముడు విశ్వామిత్రుని గంగ నది గురించి అడుగగా విశ్వామిత్రుడు ఇలా వివరిస్తారు.     

సగరులు
ఇక్షుకు వంశపు రాజైన సగరునకు మహర్షుల వర ప్రభావం వలన మొదటి భార్య కేశినికి మహాతేజోవంతుడైన అసమంజసుడు, రెండవ భార్య సుమతికి చిన్న చిన్న తిత్తులతో కూడిన పిండం ప్ర్రసవింపబడింది, ఆ పిండానికి వున్న తిత్తులను దాదులు 60 వేల నేతికుండలలో భద్రపరచగా 60 వేల మంది కుమారులు కలిగిరి వీరు ప్రత్యేక నామాలతో కాక సగరులుగా ప్రసిద్ధి చెందారు. కాని పెద్దవాడైన అసమంజశుడు తనతోపాటు ఆడుకోవడానికి వచ్చె పిల్లలను సరయు నదిలో తోసివేసి వారు తమ ప్రాణాల కోసం పడే నరకయాతనను చూసి సంతోషపడే వాడు ఇది తెలిసిన ప్రజానీకం రాజుగారి కుమారుడు  అనే ఉద్దేశంతో రాజుగారికి చెప్పటానికి భయపడేవారు కానీ ఎంత వయసు వచ్చిన అసమంజసుడు ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాకపోయేసరికి భరించలేని ప్రజలు అసమంజసుడి  ఆగడాల గురించి మహారాజుకు తెలియజేయడంతో రాజు తన కుమారుడికి రాజ్య బహిష్కారం శిక్ష విధించి నిష్పక్షపాతమైన, ప్రజారంజకంగా పరిపాలన చేస్తున్నారు.


సగరుని అశ్వమేధ యాగం

ఆ తరువాత కాలంలో మహారాజు తన రాజ్యా విస్తరణ కొరకు తన అశేష సేనా వహిని కాక తన 60 వేల మంది పుత్రులే తనకు ఒక సేనలా కనిపించగా తాను మహర్షుల అనుమతి తీసుకొని అశ్వమేధ యాగాన్ని ఆర్యవర్తంలో చేయాలనీ సంకల్పించి యాగాశ్వమును విడిచిపెట్టెను యాగాశ్వ రక్షణకు తన కుమారులను పంపి తాను యాగ కంకణధారి అయి వుండెను. కాని మహారాజు ఈ అశ్వమేధ యాగాల పుణ్యఫలంతో తన ఇంద్రపదవికి పోటీ వస్తాడేమోనని భయపడిన ఇంద్రుడు యాగం భగ్నం చేయడానికి యాగాశ్వమును పాతాళం లోని కపిల మహర్షి ఆశ్రంమంలో దాచాడు. ఆ అశ్వానికి రక్షణగా వెళ్ళిన సగరుని 60 వేల మంది పుత్రులు భూ మండలమంతా గాలించిననూ యాగాశ్వపు ఆచూకి దొరక లేదు. తండ్రి సగర చక్రవర్తి ఆదేశాల మేరకు వారు పాతాళంలో వెతికేందుకు భూమిపై అనేక గుంతలను తీసి పాతాళ ప్రవేశం చేశారు. వీరి అత్యుత్సాహం భూదేవికి విపరీతమైన భాద కలిగింది. పాతాళంలో వెతుకుతున్న సగరులకు కపిల మహర్షి ఆశ్రమంలో యాగాశ్వం కనిపించడంతో ఇతనెవరో మాయోపాయంతో తమ యాగాశ్వమును తస్కరించి వుంటాడని భావించి, కోపోద్రికులై కపిల మహర్షి పైకి లంఘించారు. ఈ అలజడికి ధ్యాన సమాధి నుండి మేల్కొన్న మహర్షి తనపైకి వస్తున్న సగరుల వంక చూసి ఒక్క హుంకారం చేసాడు. మహర్షి కోపాగ్నికి 60 వేలమంది సగర పుత్రులు భస్మమై 60 వేల బూడిదకుప్పలై పోయారు.


భగీరథుని తపస్సు

యాగాశ్వము కొరకు వెళ్ళిన తన పుత్రులు ఎంతకీ తిరిగి రాకపోవడంతో యాగ పరిసమాప్తి కాక మథనపడుతున్న సగరుడు  అసమంజసుని కుమారుడు ఆంశుమంతుని పిలిచి ఈసారి నువ్వు పాతాళానికి వేళ్ళు అని చెప్పారు. అంశుమంతుడు యాగాశ్వమును వెతుకుతూ పాతాళానికి వెళ్ళాడు. పాతాళంలోని కపిల మహర్షి ఆశ్రమం చేరి అచ్చట గల యాగాశ్వమును గుర్తించి, కపిల మహర్షికి నమస్కరించి ఆయన అనుమతితో యాగాశ్వమును తీసుకొన్నాడు. అక్కడ పడివున్న బూడిద కుప్పలు తన తండ్రులవని మహర్షి కోపానికి బలియైనందున, వారికి ఉత్తమగతులు కలుగక ప్రేతములై అకలి దప్పులచే పీడింపబడుచున్నారని తెలుసుకున్నాడు. వారికీ తర్పణాలు ఇద్దామని నీటికోసం బయలుదేరారు. అపుడు ఆంశుమంతుని మేనమామ అయినా గరుత్మంతుడు ఇలా అన్నారు. వీరు మరణించినది. కపిల మహర్షి కోపాగ్నితో వీరికి ఉత్తమగతులు కలగాలి అంటే  దివిలో ఉండే సురగంగను పాతాళానికి తెచ్చి సగరుల బూడిద కుప్పలపై ప్రవహింపజేసినట్లయితే వారు ఉత్తమగతులను పొందుతారని చెప్పారు. తన తండ్రులకు జలతర్పణలు విడిచి యాగాశ్వముతో రాజ్యము చేరి యాగము పూర్తి చేయించాడు. సగర చెక్రవర్తి విశ్వ ప్రయత్నం చేసారు తన కుమారులకి ఉత్తమగతులు కల్పిదామని కుదరలేదు. తరువాత సగరుడు స్వర్గస్తుడైనాడు.



అయన తరువాత అంశుమంతుడు రాజు అయ్యాడు. తన తండ్రులకి ఉత్తమగతులు కలుగలేదనే చింత ఆంశుమంతునికి వీడలేదు ఆయనకి కుదరలేదు. ఆంశుమంతుని తరువాత దిలీపుడు రాజు అయ్యాడు. అయన తన పూర్వుకులకు ఉత్తమగతులు కల్పించాలని పరితపించారు. దిలీపుడు వల్లకూడా అవలేదు. దిలీపుడు తరువాత భగీరధుడు రాజు అయ్యాడు. అయన రాజు అవుతూనే తపస్సుకు వెళ్లరు. రాజ్య పరిపాలనా బాధ్యతలను చేపట్టిన  తన వంశజులకు అప్పగించి తాను సురగంగను భువికి తెచ్చుటకు గాను 10,000 సంవత్సరాలు బ్రహ్మ గురించి ఘోర తపస్సు చేసాడు. అతని తపస్సుకు మెచ్చిన బ్రహ్మ భగీరధునికీ ప్రత్యక్షమయ్యారు. పాతాళలోకంలో వున్న తన పూర్వీకుల ప్రేతత్వం తొలగి అమరలోకం చేరేందుకు గాను, అమరలోకవాసిని అయిన సురగంగను భూలోకానికి అనుమతించమని ప్రార్థించాడు. అందుకు సృష్టికర్త గంగ భువికేగే వరమిచ్చాడు. కానీ గంగ దేవి ఉధృతని భూమి తట్టుకోలేదు. అందుకు నీవు పరమేశ్వరుని గురించి తపస్సు చేయమన్నారు. భగీరధుడు  సంతోషించి పట్టువిడవక ఇనుమడించిన దీక్షతో కాలి బోటనవేలుపై మరియొక సంవత్సరం పరమేశ్వరుని గూర్చి ఘోర తపస్సు చేసాడు. భగీరధుని తపస్సుకు మెచ్చినా మహేశ్వరుడు దర్శనమిచ్చి, అతని ప్రార్థనను మన్నించి గంగ తన తలపైకి దూకవచ్చని చెప్పాడు. చంద్రశేఖరుడు హిమత్ పర్వతాగ్రమున నిలచి తన ముడివేసి వున్న తన జటాజుటమును విదల్చి, ఓరకంట దివి నుండి భువిని బ్రద్దలుచేయగలనన్న అహముతో వున్న గంగను చూచి చిరుమందహాసం చేసాడు. తన నడుముపై చేతులను వుంచి నిలచిన శంకరుని పరిహాస దృష్టితో చూచిన గంగ, ఉత్తుంగ తరంగాలతో, వడితిరుగుతున్న సుడులతో, మహోగ్రధృతితో తనలోని మకరాలు, మీనాలు, కూర్మాలతో జలచరములన్నింటితో సహా పరమేశ్వరుని పాతాళానికి తొక్కాలన్న తన అహంతో ఆకాశమంతా పరుచుకున్న తన జలాలతో మహావేగంతో శివుని పైకి దూకింది. అంతట పరమేశ్వరుడు గంగాదేవి అహంకారం గ్రహించి చాపిన తన జటలను చుట్టి ఇంతటి గంగను తన జటలలో బంధించివేసాడు. గంగ ఆకాశం నుండి పడుతునే ఉంది శివుని జటలో తిరుగుతూనే వుంది సంవత్సరాలు గడుస్తున్నాయి కానీ కనీసం ఒక్క చుక్క గంగాజలమైనా భూమిపై పడలేదు.


ఇంతటి తన శ్రమ తరువాత, భువికి చేరిన గంగ శివుని జటలలో బందీ అవడాన్ని చూచిన భగీరధుడు, గంగను విడుచి, కరుణించమని శివుడిని ప్రార్థించాడు. భక్తవరదుడైన శివుడు గంగను ఒక సన్నని పాయగా తన జటాజూటము నుండి విడువగా గంగ ధరిత్రిని చేరింది. గంగను చూచి సంతోషించిన భగీరధుడు గంగను అనేక విధాల స్తుతించాడు. అతంట మహదానందముతో భగీరధుడు ముందుకు సాగాడు. గంగ అతణ్ణి అనుసరించుచూ తన మార్గంలోని వాటిని తనలో కలుపుకుంటూ అంతకంతకు తనవేగాన్ని, పరిమాణాన్ని విస్తరింపజేస్తూ భగీరధుని వెంట సాగింది. 

ఈ క్రమంలో తన మార్గంలో వున్న జహ్ను మహర్షి ఆశ్రమమును తన ప్రవాహంతో ముంచెత్తింది. జహ్నుమహర్షి కుపితుడై తన ఆశ్రమమును ధ్వంసము చేసిన గంగానదిని తన యోగశక్తితో బంధించాడు. ఒక్కసారిగా తనను ఆనుసరిస్తున్న జలధారల గలగల సవ్వడులు వినపడకపోయేసరికి వెనుతిరిగి చూచిన భగీరధుడు నిశ్చేష్టుడయ్యాడు. మహర్షి ద్వారా జరిగినది తెలుసుకున్న భగీరథుడు గంగను విడువమని మహర్షిని పరిపరి విధముల స్తుతించగా మహర్షి గంగను తన కుడిచెవి నుండి విడిచిపెట్టెను. జహ్ను మహర్షి నుండి ఉద్భవించినది కాబట్టి గంగ జాహ్నవి అయింది. గంగ భగీరథుని అనుసరించి పాతాళలోకం చేరి అతని పూర్వీకుల బూడిదపై ప్రవహించి వారికి ఉత్తమగతులను ప్రసాదించింది. ఆలా గంగదేవి జ్యేష్ఠ మాసంలో శుక్ల ద్వాదశి అనగా రామలక్ష్మణ ద్వాదశి రోజున భూమి మీదకు వచ్చింది. 


             

భగవద్గీత-అధ్యాయం1-శ్లోకం10

అధ్యాయం 1
శ్లోకం 10
అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం | 
పర్యాప్తం త్విధమేతేషాం బలం భీష్మాభిరక్షితం ||

అర్ధం :-

భీష్మపితామహునిచే సురక్షితము, అపరిమితముగానున్న మన సైన్యం అజేయమైనది. భీమునిచే రక్షింపబడుచు పరిమితముగానున్న ఈ పాండవ సైన్యము జయించుట సులభము.

పుత్రప్రాప్తికై రామ లక్ష్మణ ద్వాదశి కథ

రేపు అనగా 03.06.2020న వచ్చే ద్వాదశి  రామ లక్ష్మణ ద్వాదశి.
జ్యేష్ఠ , శుక్ల ద్వాదశి.
ప్రారంభం:-  జూన్ 02, మ12:04.                                          
ముగింపు:- జూన్ 03, ఉ 9:05.  


రామ లక్ష్మణ ద్వాదశి గురించి:

ద్వాదశి  ప్రతి మాసంలో పన్నెండవ రోజు, శుక్ల పక్షం లేదా కృష్ణ పక్షంలో వస్తుంది. పవిత్రమైన తులసి మొక్కను ఆరాధించడానికి అన్ని నెలలలోని ద్వాదశి ముఖ్యమైనదని చెబుతారు. రామ-లక్ష్మణ ద్వాదశి  చాలా శుభప్రదమైన వ్రతం. రామ-లక్ష్మణ ద్వాదశి జ్యేష్ఠ మాసంలో, శుక్ల పక్షం యొక్క పన్నెండవ రోజు, చాలా ప్రభావవంతమైన నిర్జల ఏకాదశి తరువాత రోజు వస్తుంది. 

రామ లక్ష్మణ ద్వాదశి యొక్క ప్రాముఖ్యత మరియు పురాణం:

త్రేతాయుగంలో అయోధ్య పాలకుడైన దశరధుడు జ్యేష్ఠ మాసంలో  ద్వాదశి రోజున  పుత్రుల కోసం  ప్రార్థించారు. ఆ తరువాత దశరథుడికి నలుగురు కుమారులు జన్మించారు. ఈ రోజున భక్తులు పుత్రుల కోసం ప్రార్థించి కఠినమైన ఉపవాసం ఉంటారు. శ్రీ రామ పూజను ఈ రోజు షోడసోపాచారతో నిర్వహిస్తారు. పూజా కార్యక్రమాలలో పాల్గొనడానికి భక్తులు సమీపంలోని విష్ణు దేవాలయాలను సందర్శిస్తారు. రామ-లక్ష్మణ ద్వాదశిని దేశంలోని కొన్ని ప్రాంతాల్లో చంపక ద్వాదశిగా, ఒడిశాగా కూడా పాటిస్తారు. ఇది ఒక ముఖ్యమైన పండుగ, ఇది పూరిలోని జగన్నాథ్ ఆలయంలో జరుపుకుంటారు. ఈ రోజున రామలక్ష్మణులను పూజిస్తే రామానుగ్రహం కలుగుతుంది. ఉత్కళ రాష్ట్రము మొదలైన కొన్ని ప్రాంతాలలో ప్రత్యేకంగా చంపక ద్వాదశి అను పేరిట , జగన్నాథునకు సంపెంగలు మొదలైన అనేక పువ్వులతో విశేష అర్చనాదులు చేస్తారు. కనుక ఏ ప్రాంతంలోని వారైనా సంపెంగ పూలతో విష్ణువును ఆరాధించాలి.


జ్యేష్ఠశుద్ధ ఏకాదశినాడు బంగారముతో రామలక్ష్మణ విగ్రహములను తయారుచేయించి , పూజించి మరునాడు అనగా ద్వాదశి నాడు బ్రాహ్మణులకు దానముచేయవలెనని వరాహపురాణము చెప్పుచున్నది. కనుకనే ఆ ద్వాదశి రామలక్ష్మణ ద్వాదశి అని పేరుగల్గినది.


జగద్గురువులు శ్రీ ఆదిశంకరులు కైలాసగమనం చేసిన రోజు కూడా ఇదే కావడం వలన వారి స్మరణ, పూజాదులు గురువు అనుగ్రహాన్ని కలుగజేస్తాయి.

భగవద్గీత-అధ్యాయం1-శ్లోకం9

అధ్యాయం 1
శ్లోకం 9 

అన్యే  చ బహవః శూరా మదర్థే త్యక్తజీవితాః|
నానాశాస్త్రప్రహరణా సర్వే యుద్ధవిశారదాః ||



అర్ధం :-
ఇంకను ఎక్కువమంది వీరులను, శూరులను, మన సైన్యము నందు ఉన్నారు. వీరందరును యుద్ధవిశారదులు. నానాశాస్త్రధారులు. నా కొరకు తమ ప్రాణములు నొద్దియైనను యుద్ధము చేయుటకు సిద్ధముగా నున్నవారు.


నిర్జల ఏకాదశి వ్రతకథ

సంవత్సరానికి మొత్తం 24 ఏకాదశులు. రేపు అనగా 02.06.2020న వచ్చే ఏకాదశి 11 వ ఏకాదశి నిర్జల ఏకాదశి. 
జ్యేష్ఠ , శుక్ల  ఏకాదశి. 
ప్రారంభం - 02:57 PM, జూన్  01
ముగింపు - 12:04 PM, జూన్ 02



నిర్జల ఏకాదశి వ్రతకథ :-

పూర్వము మహాభారత కాలంలో వనవాస సమయంలో ఒక రోజు పాండవుల దగ్గరకి శ్రీ కృష్ణుడు వచ్చారు. అపుడు ధర్మరాజు శ్రీ కృష్ణుడుతో మా దోషాలు పోవటానికి ఏ వ్రతం ఆచరిస్తే మంచిది అని అడిగారు. అపుడు శ్రీ కృష్ణుడు ధర్మరాజుతో అన్ని వ్రతాలలో విశిష్టమైనది ఏకాదశి వ్రతం. అది ఆచరించండి. దానికి ధర్మరాజు ఆ వ్రతం ఎలా ఆచరించాలి అని అడిగారు. శ్రీ కృష్ణుడు వివరిస్తూ సంవత్సరానికి మొత్తం 24 ఏకాదశులు ఉంటాయి. ఏకాదశి వ్రతం అనగా దశమి రోజు రాత్రి ఉపవాసం ఉండి మరునాడు ఏకాదశి రోజు పగలు, రాత్రి ఉపవాసం చేసి మరునాడు అనగా ద్వాదశి రోజునా  బ్రాహ్మణులతో సహపంక్తి భోజనం చేసి  బ్రాహ్మణులతో వేదపారాయణం, శాస్త్రవచనం, విష్ణు సహస్త్రనామ పారాయణము, ఇష్టదేవతారాధన చేయాలి. ఆ రోజు రాత్రి ఉపవాసం ఉండాలి అని చెప్పారు. అందుకు పాండవులు వ్రతం ఆచరిస్తాము అన్నారు. కానీ భీముడు మాత్రం ఉపవాసమా అన్నారు. భీముడు భోజనప్రియుడు. ఉపవాసం చేయలేను అని శ్రీ కృష్ణుడితో చెప్పేను. అందుకు శ్రీకృష్ణుడు అని ఏకాదశులు వ్రతం చేయకపోయినా జ్యేష్ఠమాసంలో శుక్లపక్షంలో వచ్చే నిర్జల ఏకాదశి ఒకటి మాత్రం చేయమన్నారు. నిర్జల ఏకాదశి అంటే నీరుకూడా తీసుకోకుండా చేసే ఏకాదశి అన్ని అర్ధం . అందుకు భీముడు సంతోషించి ఏకాదశి వ్రతం చేసారు.    

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...