భగవద్గీత-అధ్యాయం13-శ్లోకం1

భగవద్గీత

అధ్యాయం 13

అథ త్రయోదశోద్యాయః - క్షేత్రజ్ఞవిభాగయోగః

శ్రీభగవాన్ ఉవాచ

శ్లోకం 1

ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధియతే|

ఏతద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః||

అర్ధం :-

శ్రీభగవానుడు పలికెను - ఓ కౌంతయా!ఈ శరీరాన్ని క్షేత్రము అని ప్రేర్కోనభడింది. ఈ క్షత్రమును గురించి ఎరిగిన వాడిని క్షేత్రజ్ఞడు అని తత్త్వము తెలిసిన జ్ఞానులు తెలుపుతారు.



పాండవులకి మార్కండేయ మహర్షి ద్వారా ధర్మబోధ చేపిన శ్రీకృష్ణుడు


కొంతకాలం తరువాత పాండవులు అరణ్య వాసంలో ఉండగా శ్రీకృష్ణుడు పాండవులని పలకరించటానికి సత్యభామను కొంతమంది యాదవపరివారాన్ని తీసుకొని వెళ్లారు. శ్రీకృష్ణుడిని చూసిన పాండవులు సంతోషించి సాధారంగా ఆహ్వానించి కూర్చోపెట్టారు. కుశలప్రశ్నలు అడిగారు. అప్పుడు శ్రీకృష్ణుడు పాండవులను పలకరించి ద్రౌపది పుత్రులు ఇప్పుడు మాదగ్గరే ఉన్నారు. నా కుమారుడు ప్రద్యుమ్నుడు వారికీ యుద్ధంలో శిక్షణ ఇస్తున్నాడు. అభిమాన్యుడితో కలిసి సంతోషంగా ఉన్నారు. మీరు వారిమీద బెంగపెటుకోవద్దు అని చెప్పారు. వారి కుమారులు శ్రీకృష్ణుడి దగ్గర సంతోషంగా ఉన్నారు అని తెలుసుకొని పాండవులు ద్రౌపది సంతోషించారు. శ్రీకృష్ణుడు వచ్చాడు అని తెలుసుకొని మార్కండేయ మహర్షి శ్రీకృష్ణుడిని పాండవులను చుడటానికి వచ్చారు. ధర్మరాజు మార్కండేయ మహర్షిని చూసి సాధారంగా ఆహ్వానించారు. శ్రీకృష్ణుడు మార్కండేయ మహర్షికి నమస్కరించి మార్కండేయ మహర్షి! కురుపాండవులకు భవిష్యుత్తులో యుద్ధం రానున్నది. వారికీ ధర్మభోద చేయమని చెప్పారు. శ్రీకృష్ణుడు సాక్షాత్తు విష్ణుభగవానుడు అని తెలుసు కాబ్బటి అయన సమక్షంలో తనకు పురాణం, ధర్మాబోధ చేసే అవకాశం దక్కినందుకు సంతోషించాడు. ధర్మరాజుకు అతని తమ్ముళ్లకు ధర్మరాజు దగ్గర ఉన్న 10,000మంది పురోహితులకు చెప్పటం మొదలు పెట్టారు. మార్కండేయ మహర్షి వారికీ యుగాలా గురించి యుగదర్మాల గురించి సంకటపరిస్థితులలో ఎలా ధర్మ పాటించాలి అని చెప్పారు. అంత వినా ధర్మరాజు మహర్షికి నమస్కరించి మహర్షి!మీరు చిరంజీవులు కదా మీ వయస్సు కల్పంతాలు కదా మీకన్నా పెద్దవారు ఎవరైనా ఉన్నారా ఉంటే చెప్పండి అని అడిగారు. అందుకు మార్కండేయ మహర్షి తనకన్నా పెద్దవారు ఈ భూమిపై ఇంకా ముగ్గురు ఉన్నారు అని వారి గురించి వివరించిన కథలో దానం వలన వచ్చిన ఫలితం గురించి చెప్పారు. తరువాత ధర్మరాజు మహర్షి! మీరు కల్పంతా వయస్సు ఉంది కదా మీరు ఇప్పటివరకు ఎన్నో ప్రళయలు చూసారు కదా దానిగురించి మాకూ వివరించండి అని అడిగారు. అప్పుడు మహర్షి మత్యావతారం గురించి వివరించారు. అంతకు ముందు ప్రళయంలో ములోకలు భూమండలం అన్ని జలమయం అయిపోయాయి. నక్షత్రాలు, గ్రహాలు సూర్యచంద్రులు ఇంధ్రుడు దిక్పాలకులు అందరు నశించిపోతారు. బ్రహ్మదేవుడికి అప్పుడు రాత్రికాలం బ్రహ్మదేవుడు నిద్రకు ఉపక్రమిస్తారు. ఎట్టు చుసిన అంత శున్యం చీకటి ఆ జలలలో అల్లలలో తేలను కొంతకాలం నీళ్లలో ఈదాను ఇంకా ఓపిక నీశించి పోయింది. మనస్సులో శ్రీమన్నారాయనూడిని తలచుకున్నాను. అంతలోనే అంత చీకటిలో ఇంకా వెలుగు కనిపించింది. ఆ వెలుగును చూసి ఇంత చీకటిలో వెలుగు ఎక్కడి నుంచి వస్తుంది అని ఆ వెలుగు దగరకు వెళ్ళాను. అక్కడ ఈ ఆధారం లేకుండా ఒక మర్రి చెట్టు ఉంది. ఈ నీళ్లలో ఈ చెట్టు ఎలావచ్చింది అని చూస్తూ ఉండగా ఆ మర్రి చెట్టు లోని ఒక ఆకు మీద ఒక చిన్న పసిబాలుడు తన కాలి బొట్టనా వెళుని నోట్లో పెట్టుకొని చీకుతూ కనిపించాడు. నేను ఈదుకుంటూ ఆ బాలుడి దగరకు వెళ్ళాను. ఆ బాలుడు నన్ను చూసి ఏమిటి అలసిపోయావా!బయపడుతున్నావా!అన్నారు. అంత చిన్న బాలుడు మాట్లాడుతున్నాడు ఏమిటి అని అశ్చర్యపోయాను అవును అన్నాను. అయితే నా నోట్లోకి వెళ్లి విశ్రాంతి తీసుకో అన్నాడు. అప్పుడు నేను నీది చిన్న నోరు నేను ఎలా నీ నోట్లో పడతాను అన్నాను. అప్పుడు ఆ చిన్న బాలుడు నోరు తెరిచారు. ఆ నోరు ఎరగా సమస్త బ్రహ్మాండాలు పటేలా తెరిచాడు. నేను అందులోకి ప్రవేశించాను. నేను పొట్టలోకి వెళ్ళాను. ఆ పొట్టలో సూర్యచంద్రులు, దిక్పాలకులు, ఇంధ్రుడు, సమస్తదేవతలు, 14లోకాలు, బ్రహ్మ, రుధ్రుడు అందరు అందులోనే ఉన్నారు. నేను కొంతసేపు పాతాళంలో కూర్చున్న మరికొంతసేపు భూలోకంలో కూర్చునా మరికొంతసేపు స్వర్గంలో కూర్చునా ఇంకా ఎక్కడ నిలవలేక బయటకు వచ్చాను. అప్పుడు నాకు అర్ధం అయింది. సమస్త బ్రహ్మడాలను తన పొట్టలో దాచుకొని ఎక్కడ చిన్న పిల్లవాడిగా ఉన్న ఈ బాలుడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే అని ఆయనకు స్తోత్రం చేసి నమస్కరించాను. ఇంకా భయపడకు మళ్ళీ మొదలయే సమయం వచ్చింది. బ్రహ్మ ఇప్పుడు నిద్రాలేస్తాడు. అని చెప్పారు. ఆ మహానుభావుడే ఇప్పుడు ఇక్కడ శ్రీకృష్ణుడి రూపములో మనపక్కనే ఉన్నారు. నేను ఆ విషయాలను మరచి పోయాను. శ్రీకృష్ణుడు నాకు గుర్తు చేస్తున్నాడు. కాబట్టే నేను ఇవి అన్ని మీకు చెప్పగలుగుతున్నాను అని చెప్పారు. కొంతకాలం తరువాత మార్కండేయ మహర్షి శ్రీకృష్ణుడిని అనుమతి అడిగి అక్కడినుండి వెళ్లిపోయారు. మరికొంతకాలం తరువాత అక్కడికి దుర్వస మహర్షి వచ్చారు. ధర్మరాజు వారిని సాధారంగా ఆహ్వానించి కూర్చోపెట్టారు. దూర్వసుడు ధర్మరాజుతో మేము శిష్యసమేతంగా నీ ఇంటికి అతిధ్యానికి వచ్చాము. మేము నదికి వెళ్లి స్నానం సంధ్యా ముగించుకొని వస్తాము ఏర్పాట్లు చేయి అని నదికి వేళ్ళిపోయాడు. అప్పటికే అందరి భోజనాలు అయిపోయి చివరికి ద్రౌపది కూడా భోజనం చేసింది. ఇంకా అక్షయ పాత్రనుంచి భోజనం రాదు అందరు కంగారు పడుతుండగా ద్రౌపది వెళ్లి తమని రక్షించమని శ్రీకృష్ణుడిని వేడుకుంది. అప్పుడు శ్రీకృష్ణుడు వెళ్లి అక్షయపాత్ర తీసుకురా అంటాడు. ద్రౌపది వేళ్లి అక్షయపాత్రను తీసుకువస్తుంది. శ్రీకృష్ణుడు దానిని తీసుకొని చూడగా అందులో ఒక మెతుకు ఉంటుంది. దానిని తీసుకొని శ్రీకృష్ణుడు నోటిలో వేసుకుంటాడు. శ్రీకృష్ణుడు అల నీటిలో వేసుకోగానే భూమిమీద ఆకలితో ఉన్న వారందరికీ ఆకలి తీరుతుంది. అక్కడ నది వడ్డున ఉన్న దూర్వశమహామునికి అయన శిష్యులకు ఆకలి తిరిగి బుక్తయాసంతో తేనుపులు వస్తాయి. వారు ధర్మరాజు దగరకు వచ్చి ఇంకా ఈ పూట ఏమి తినలేము. నేను నిన్ను పరీక్షంచటానికి వచ్చాను. కానీ ఈ శ్రీకృష్ణుడు నా ఆకలిని తీర్చేశాడు. అయినా శ్రీకృష్ణుడు ఎటువైపు ఉంటే అటువైపు ధర్మం ఉంటుంది. భవిష్యత్తు యుద్ధంలో మీకు విజయం తద్యం అని ఆశీర్వాదించి వెళ్లిపోయారు. మరికొంతకాలం శ్రీకృష్ణుడు అక్కడే ఉండి తరువాత ద్వారకకు వెళిపోయాడు. 

Bhagavad gita_adhyatmikam1

 భగవద్గీత

అధ్యాయం 12

శ్లోకం 20

యే తు ధర్మ్యామృతమిదం యథోక్తం పర్యుపాసతే |

శ్రద్దధానా మత్పరమా భక్తాస్తే తీవ మే ప్రియాః||

ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతీసూపనిషత్సుబ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే భక్తియోగోనామ ద్వాదశోద్యాయః

అర్ధం :-

ఉపర్యుక్తధర్మ్యామృతమును సేవించుచు, నిష్కామ భక్తిశ్రద్ధలతో మత్పరాయణులైన భక్తులు నాకు అత్యంత ప్రియులు.





        

పాండవులకు ధైర్యం చేపిన శ్రీకృష్ణుడు


పాండవులు అరణ్యవాసంలో ఉండగా ఒకసారి శ్రీకృష్ణుడు వారిని చూడటానికి వేళారు. శ్రీకృష్ణుడితో పటు కొంతమంది యాదవులు, ద్రౌపది సోదరుడు దృష్టదుమ్నుడు కూడా పాండవులను చూడటానికి వచ్చారు. శ్రీకృష్ణుడు వారిని చూసి ఈ కష్టాలు ఎక్కువకాలం ఉండవు అని ఓదార్చి ధైర్యం చెప్పారు. అప్పుడు పాండవుల మధ్యముడు అయినా అర్జునుడు శ్రీకృష్ణుడితో శ్రీకృష్ణా! ఒకప్పుడు గంధమాదన పర్వతం మీద తపస్సు చేసిన శ్రీమన్నారాయణుడిని నువ్వు దుష్టులను శిక్షించి చట్టానికి భూమండలంలో రకరకాల అవతారాలు ఎత్తుతూ ఉంటావు. మహా తపస్సు నీవే చంద్రుడివి నీవే అగ్ని సకల దిక్పాలకుల నీవే ఇప్పుడు మీరు మండలం లో కృష్ణుడు గా అవతరించావు. అటువంటి నీకు నమస్కరిస్తున్నాను. నీవే మమ్మలిని రక్షించాలి అని వేడుకున్నాడు అర్జునుడు. అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునితో నాయన అర్జునా! నీకు ఇప్పుడు నిజం చెపుతున్నాను విను. మనం ఇద్దరము ఒకటే. నరనారాయణులము. నేను భగవంతుడిని అని నాకు గుర్తు ఉంటుంది కనుక నేను నారాయణుడిని. నీకు మరుపు వస్తుంది. అంటే ఇప్పుడు నేను భగవంతుడిని అంటున్నావు. కొంతకాలం తరువాత మళ్ళీ నువ్వు మా బంధువువి అంటావు అందుకని నివ్వు నరుడివి. మనం ఇద్దరము నరనారాయణులము. అయినా లౌకిక ప్రయోజనం కోసం మనం ఇద్దరు ఇలా కనిపిస్తున్నా ము నిజానికి ఇద్దరు ఒక్కటే. ఇంకా కొద్దిరోజులలోనే ఈ అరణ్య అజ్ఞాత వాసాల నుండి మీకు విముక్తి కలుగుతుంది. మీకు విజయం వరిస్తుంది అని అన్నాడు. అప్పుడు ద్రౌపది దేవి శ్రీకృష్ణుడితో ఏడుస్తూ ఈ లోకంలో ఏ స్త్రీకి జరగని అన్యాయం నాకు జరిగింది. నువ్వు నన్ను రక్షించావు కాబ్బటి సరిపోయింది. లేకపోతే నా పరిస్థితి ఏమాయేది అని అన్నది. మళ్ళీ నేను పిలిచినా వెంటనే ఎందుకు రాలేదు ఆలస్యంగా వచ్చావు అని అడిగింది. అందుకు శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వి అమ్మ ద్రౌపది నివ్వు నన్ను గోవిందా అనిపిలవగానే వద్దాము అనుకున్నాను. కానీ నేను ద్వారకావాసిని, వైకుంఠవాసిని అన్నావు ఆఖరికి హృదయంలో కొలువై ఉన్న వాడిని హృదయనివాసి అన్నావు. అప్పుడు వచ్చాను. రెండోది అయినా నీ చీర పైట కొంగును గట్టిగా పట్టుకొని ఆపటానికి నీఆత్మరక్షణ ప్రయత్నం నువ్వు చేసావు. తరువాత ఓడిపోయావు. అప్పుడు నేను వచ్చాను. భగవంతుడు మానవప్రయత్నం ఉనంతవరకు రాదు. మానవ ప్రయత్నం ఆగిపోతే భగవంతుని లీల మొదలవుతుంది. అలాగని మొత్తం భగవంతుని మీద వదిలేయకూడదు. ముందు మానవ ప్రయత్నం చెయ్యాలి అని అన్నాడు. సమయానికి నేను ఇంద్రప్రస్థంలో లేను. నేను మీదగరే ఉండిఉంటే మీకు ఈ కష్టం వచ్చేది కాదు. ఆ సమయంలోనే సాల్వుడితో నాకు యుద్ధం వచ్చింది. యుద్ధం అంత అయి మీ గురించి తెలుసుకునే తప్పటికే అంత జరిగిపోయింది అని అన్నాడు. శ్రీకృష్ణుడు ధర్మరాజుతో ధర్మరాజా! మీ పాండవులకు ద్రౌపదికి అరణ్యవాసం అజ్ఞాత వాసం తప్పదు. నేను ఈ పదముడు సంవత్సరాలు సుభాద్రను అభిమాన్యుడిని నా వెంట తీసుకు వెళతాను వారు మాతోపాటు ద్వారకాలో ఉంటారు. నేను అప్పుడప్పుడు మిమల్ని చూడటానికి వస్తూ ఉంటాను అని చెప్పు పాండవుల దగ్గర సెలవు తీసుకొని శ్రీకృష్ణుడు యాదవుల సుభాద్ర అభిమన్యూలను తీసుకొని ద్వారకకు వెళ్లారు. తరువాత దృష్టదుమ్నుడు కూడా ద్రౌపది కుమారులను కూడా తీసుకొని పాంచాలానికి వెళ్లారు. 

పాండవుల అరణ్యవాసం


దూర్యోధనుడు మాయసభలో అవమానపడనని హస్తనకి వచ్చిన దగ్గరనుండి కుమిలిపోతు పాండవుల వైభవని చూసి సహించలేక వల్ల రాజ్యాని ఎలాగైనా లాకోవాలని కుట్రలు పన్నాడు. అంతేకాకుండా ధర్మరాజు రాజసూయయాగం జరిగేటప్పుడు వచ్చిన కానుకలను లేకుంచే బాధ్యతని దూర్యోధనుడికి ఆపగించాడు. ఆ సమయంలో పాండవులకు వచ్చిన సంపదలను చూసి అసూయపడాడు. ఈ సంపాదలను ఎలాగైనా నా వశం చూసుకోవాలి అనుకున్నాడు. ఒకరోజు శ్రీకృష్ణుడు ఇంద్రప్రస్థం నుండి ద్వారకకు వేలాడు అని తెలుసుకొని తన మామ శకుని, కర్ణుడు, దుశాసనుడితో సమావేశం అయ్యాడు. నాకు పాండవుల సంపదలు చూస్తుంటే అసూయగా ఉంది. వాటిని ఎలాగైనా నావశం చేసుకోవాలి మయా సభలో నాకు జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలి అని అన్నాడు. అందుకు కర్ణుడు అయితే వాళ్ళమీదకి యుద్ధనికి వెళదాము అన్నాడు. అందుకు శకుని నీ ప్రతాపము ద్రౌపది స్వయం వరంలో చూసాముగా అర్జునుడు నిను చిత్తకొట్టాడు. అందులోనూ ఇప్పుడు ధర్మరాజు ఈ భూమాండలానికి చక్రవర్తి అయ్యాడు అతని బలం పెరిగింది. అతనితో మనం యుద్ధం చేయకూడదు. మాయోపాయంతో రాజ్యాని లాకోవాలి అనుకోని అని నా దగ్గర అగోర మంత్ర పాచికలు ఉన్నాయి నేను మంత్రం చదివి పాచికలు వేస్తే మనకి అనుకూలంగా పడతాయి. వాటితో వారిరాజ్యని లాకొందాము. వారిని అవమానిదాము అన్నారు. అప్పుడు దుశసనుడు మనం జూదానికి పిలిస్తే ధర్మరాజు వస్తాడా అన్నారు. అందుకు శకుని మనం పిలిస్తే రాదు మీ తండ్రి ధృతరాష్టుడు పిలిస్తే వస్తాడు. ఎందుకంటే తండి, తండ్రీవరుసవారు, సమానరాజులు యుద్ధనికి, జూదానికి పిలిస్తే తప్పకుండా వేలాలి. అది ధర్మం. ధర్మరాజు ధర్మం తప్పడు తప్పకుండా వస్తాడు. అని అన్నాడు. అందరు కలిసి ధృతరాస్టుని దగరకు వెళ్లి అతనిని ఓపించి విధురిని చేత కబురు పంపించారు. ధర్మరాజు తన తమ్ములు, ద్రౌపది సమేతంగా హస్తినాపురానికి వచ్చారు. భీష్మ, ద్రోణ, విధుర, దృతారాష్ట్ర మొదలినవారు ఆ సభలో ఉన్నారు. దూర్యోధనుడు ధర్మరాజు జూదం ఆడటానికి కూర్చున్నారు. దూర్యోధనుడు తన బదులు పాచికలు శకుని మామ వేస్తాడు అని తాను ఆటలో అంత నేర్పరిని కాదు అని అంటాడు. ధర్మరాజు సమస్త సంపదలు, రాజ్యాని, తన తమ్ముళ్లని తనని ఒడిఓడిపోయాడు. చివరికి ద్రౌపదిని కూడాఓడిపోయాడు. దూర్యోధనుడు అహంకారంతో రెచ్చిపోయి ద్రౌపది సభకి లాకురమ్మని ఒక పనివాడిని పంపారు. అతను ద్రౌపది దగరకు వెళ్లి జరిగిన విషయం చెప్పాడు. ద్రౌపది దేవి ధర్మరాజు తాను ఓడిపోయినా తరువాత నన్ను ఓడడా, నన్ను ఓడినా తరువాత తాను ఓడేనా అని అడిగింది. ఈ ప్రశ్నకు సమాధానం అడుగు అయిన నేను రాజస్వలాలో ఎక వస్త్రను ఎప్పుడు సభకు రాలేను అన్నది. పనివాడు వచ్చి జరిగినది దూర్యోధనుడికి చెప్పాడు. అప్పుడు దూర్యోధనుడు దాసికి సమాధానం చెప్పవలసిన పనిలేదు దుశాసన వెళ్లి ఆ ద్రౌపదిని లక్కునిరా అని దుశాసానుడిని పంపారు. దుశసనుడు ద్రౌపది దేవిని జుట్టుపట్టుకొని లాకొచ్చాడు. ఆమె సభకి వచ్చిన తరువాత కూడా ఈ ప్రశ్ననే అడిగింది. కానీ ఎవరు సమాధానం చెప్పలేదు. అప్పుడు కర్ణుడు లేచ్చి ఏక వస్త్ర అయితే ఏమిటి ఐదుగురు పురుషులతో కాపురం చేసే స్త్రీకి ఒకటిమీద బట్టలు ఉన్న లేకున్నా ఒకటే అన్నాడు. కర్ణుడు దూర్యోధనుడికి వస్త్రపహరణం అనే లేని ఆలోచనను పుటించింది. దుశసానుడిని పిలిచి ఈమె ఒంటిమిద చిరను లాగేయి అన్నారు. బీముడు లేచి నువ్వు ఈమె ఒంటిమిద చేయివేసావా నీ ఛాతిని చీల్చి నీ రక్తం తాగుతాను అన్ని శబధం చేసాడు. దుశసనుడు బిముడి మాటలు లెక్క చేయకుండా నువ్వు ఇప్పుడు మా బానిసవి నువ్వు మమ్మలిని ఏమి చేస్తావు. ద్రౌపది చీరాలాగటానికి వేలాడు. దూర్యోధనుడి తమ్ముడు వికర్ణుడు దుశసానుడిని అడ్డుకొని అన్నయ్య ఆమె మనకు వదిన మాతృసమానురాలు మీరు ఎలాచేయకండి అన్నాడు. అప్పుడు కర్ణుడు మళ్ళి లేచి ఇక్కడ ఉన్న పేదలకు లేని మంచి నీకు కనిపించిందా వెళ్లి కూర్చో అన్నాడు. ఆ వస్త్రాపహారణాని చూడలేక ఆ అన్యాయని ఆపలేక భీష్మడు, ద్రోణుడు, విధురుడు కళ్లు మూసుకున్నారు. ఇక తనను రక్షించేవారు ఈ సభలో ఎవరు లేరు అని ద్రౌపది శ్రీకృష్ణుడిని ప్రార్ధించింది. శ్రీకృష్ణా! గోవిందా! ద్వారకవాస! గోపీజనవలభ!ఆనాడు గజేంధ్రుడిని మొసలి బారినుండి రక్షించునట్టు నన్ను వీరి భారీ నుండి రక్షించు స్వామి హృదయనివాస కృష్ణా!కాపాడు అని ప్రార్ధించింది. దుశసనుడు ఆమె చీరను లాగుతుంటే ఒకచిరా వెంట ఒకచిరా వస్తూనే ఉన్నాయి. దుశసనుడు లాగిలాగి ఆ చీరలు ఒక చిన్నా కొండల తయారయయి. దుశసానుసు లాగలేక కళ్ళు తిరిగి పడిపోయాడు. అది చూసినా ఇంకా దూర్యోధనుడికి ఇంకా బుద్ధిరాక తన ఒడిలో కూర్చోమని ద్రౌపదిని పిలిచాడు. ఇది వినా బీముడు కోపంతో నీ తొడలు విరగొడతాను అని ప్రతిజ్ఞ చేసాడు. బీముడు అల ప్రతిజ్ఞ చేయగానే కౌరవులకు విరుద్ధంగా ఆపశకునాలు కనిపించాయి. దానితో భయపడిన గాంధారి ఏమి జరిగిందో విషయం తెలుసుకున్ని తన బిడ్డలకు ఆపద ఎక్కడ వస్తుందో అని పరుగు పరుగున సభకు వచ్చి ధృతరాష్టునీతో ఈ సభలో ఒక ఆడపిలకు అన్యాయం జరుగుతుంటే మీరు ఎలావురుకున్నారు. ఇది ధర్మమేనా. మీ అధ్యర్యంలో ఇంతటి అన్యాయం జరుగుతుంటే మీరు ఎలా ఊరుకున్నారు అని ప్రశ్నించ్చింది. అప్పటికే ఆపశకునాలకు భయపడిన ధృతారాష్టుడు  ద్రౌపదిని క్షమించమని నీకు ఏమి వరం కావాలో కోరుకో అన్నారు. అందుకు ద్రౌపది నా భర్త ధర్మరాజునూ దస్యావిముక్తుడిని చేయండి అన్నది. అందుకు ధృతారాష్టుడు సంతోషించి అలాగే చేస్తాను. ఇంకో వరం కోరుకో అన్నాడు. అందుకు ద్రౌపది ధర్మరాజు మిగిలిన తమ్ముళ్లని వారి అస్త్రాలతో సహా దాస్య విముక్తులను చేయండి అని కోరుకుంది. అందుకు ధృతారాష్టుడు సరే అలాగే చేస్తున్నాను అన్నాడు. ఇంకోవరం కోరుకో అన్నాడు. అప్పుడు ద్రౌపది క్షత్రియ కాంతకు రెండు వరాలు మాత్రమే కోరుకోవాలని ధర్మశాస్త్రం చెపుతుంది మహారాజ అన్నది. అందుకు ధృతారాష్టుడు ధర్మం గురించి ఎంతభాగా చెప్పవమ్మా మరి నిన్ను దాస్య విముక్తి చేయమని అడగలేదే అన్నాడు. అందుకు ద్రౌపది మహారాజ ధర్మరాజు దాస్యావిముక్తిని పొందగానే అయన భార్యను అయినా నేను దాస్య విముక్తిని అయ్యాను కదా మహారాజ అన్నది. అందుకు ధృతారాష్టుడు ధర్మశాస్త్రం గురించి ఎంత జ్ఞానం ఉంది. నీకు ఉన్న జ్ఞానంలో కొంత అయినా నా కుమారులకు జ్ఞానం ఉంటే నీకు ఈ అన్యాయం జరిగేది కాదు మీ సమస్త రాజ్యాని మీకు ఇస్తున్నాను అని అందరిని తిరిగి ఇంధ్రప్రస్థానికి పంపారు. దూర్యోధనుడు కొంతకాలం తరువాత మళ్ళీ తండ్రి దగరకు వచ్చి నాన్న మేము అన్ని పాణగాలు పన్ని వారి సంపదను లాకుంటే అమ్మ చెప్పింది అని వారిని పంపారు. ఎలాగైతే నేను ఆత్మహత్య చేసుకుంటాను అని తన తండ్రి బెదిరించాడు. అందుకు భయపడిన ధృతారాష్టుడు అల చేయకు నువ్వు ఏమి చేయమంటే అధిచేస్తాను అన్నాడు. అయితే మళ్ళీ వాళ్ళని జూదానికి పిలవండి అన్నాడు. చేసేది లేక ధృతారాష్టుడు పాండవులకి కబురు పెట్టాడు. ధర్మరాజు జరిగేది తెలిసే ధర్మానికి కట్టుపడి విధికి తలవొంచి మళ్ళీ వచ్చారు. ఈ సారి దూర్యోధనుడు ధర్మరాజుతో ఈసారి ఒకటే పందెం నేను గెలిస్తే నువ్వు నీ తమ్ముళ్లు ద్రౌపదితోసహా 12ఏళ్ళు అరణ్యవాసం ఒక సంవత్సరం అజ్ఞాతవాసం చెయ్యాలి నీ రాజ్యం నాకు చెందుతుంది. నేను ఒడిపోతే నేను నా తమ్ముళ్లతో కలిసి అరణ్యానికి వెళతాను అన్నాడు. ధర్మరాజు చేసేదిలేక ఒప్పుకున్నాడు. పందెం దూర్యోధనుడు గెలిచాడు. ధర్మరాజు  తన తమ్ముళ్లు, ద్రౌపదతో  అరణ్యవసానికి వెళ్ళిపోయాడు.







శ్రీకృష్ణ -సాల్వ యుద్ధం



శ్రీకృష్ణుడుని చుసిన సాల్వుడు భయంకరమైన శక్తి అనే ఆయుధాన్ని కృష్ణుడి రథసారథి అయిన దారుకుడి మీద ప్రయోగించాడు. అది ఆకాశం నుండి రాలిపడే కాంతిమంతమైన నక్షత్రంలా దూసుకు వస్తోంది. శక్తి ఆయుధాన్ని శ్రీకృష్ణుడు ఒక్క బాణంతో మార్గం మధ్యలోనే పొడిపొడి చేసి నేలరాల్చాడు. కృష్ణుడు అంతటితో శాంతించకుండా మొక్కవోని పరాక్రమంతో కొరవి త్రిప్పుతున్నట్లు ఆకాశంలో గిరగిర తిరుగుతూ దుర్నరీక్ష్యంగా ఉన్న ఆ సౌభకాన్నీ అందులోని సాల్వుడిని తీక్షణమైన సూర్యకిరణాలతో సమానమైన పదహారు బాణాలను వేసి నొప్పించాడు. సాల్వుడు కోపంతో తన ధనుస్సును మేఘగర్జనలా మ్రోగిస్తూ కృష్ణుని ఎడమ భుజంలో దిగబడేలా వాడి బాణాలు వేసాడు. అ దెబ్బకు కృష్ణుడు శార్ఙ్గము అనే పేరు కల తన ధనుస్సును రథంమీద జారవిడిచాడు. ఆకాశంలో దేవతలు భయపడుతూ చూడసాగారు. రథంలోని కృష్ణుడు తెప్పరిల్లడం చూసి, అహంకారి అయినా సాల్వుడు ఉత్సాహంతో ఇలా అన్నాడు. ఇప్పుడు రణరంగంలో బెదిరి పారిపోకుండా నా ఎదుట ధైర్యంగా నిలబడితే నా మిత్రుడిని చంపిన పాపానికి ప్రాయశ్చిత్తంగా నిన్ను నా కర్కశ బాణాగ్ని జ్వాలలలో ముంచి పగతీర్చుకుంటాను." ఇలా అంటున్న సాల్వుడితో శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వి ఇలా అన్నాడు. “ఓరోరి! మూర్ఖుడా! గొప్ప బలము, పరాక్రమం కల వీరుడిలా వాగుతున్నావు. నీకు చావు మూడిన సంగతిని గుర్తించలేకుండా ఉన్నావు.” అని పలికి తన గధాయుధాన్ని గిరగిర త్రిప్పి ఎదురుగా వస్తున్న సాల్వుడి మీదకు విసిరాడు. శ్రీకృష్ణుని గదాఘాతంచేత సాల్వుడి నోటినుండి ముక్కునుండి రక్తం కారుతుండగా స్పృహ తప్పాడు. కొంతసేపటికి తేఱుకుని తెలివి తెచ్చుకున్నాడు. వెనువెంటనే సౌభకంతోపాటు అదృశ్యమయడు. కొంతసేపట్టి తరువాత సాల్వుడు పంపిన మాయ దూత శ్రీకృష్ణుడి దగరకు వచ్చి ప్రభూ! శాల్వుడు మీతండ్రి వసుదేవుడిని బంధించి తెచ్చిన వార్త మీకు చెప్పవలసిందిగా దేవకీదేవి నన్ను మీ దగ్గరకు పంపించారు.” అది వినిన శ్రీకృష్ణుడు తండ్రిమీద ఉన్న మమకారం వలన విషాదంలో మునిగిపోయాడు. శ్రీకృష్ణుడు భగవంతుదైనా మానవుడిగా పుట్టినందుకు కొంతసేపు అదినిజమే అనికొని భ్రమపడాడు. కొంతసేపట్టి తరువాత “మానవ గంధర్వ దేవరాక్షసాదులకు అయినా జయింప సాధ్యం కాని బలరాముడు జాగరూకతతో రక్షిస్తూ ఉండగా, బలహీనుడైన సాల్వుడి చేత వసుదేవుడు ఎలా పట్టుబడతాడు.” అని శ్రీకృష్ణుడు భావించాడు. ఆ దూత మళ్ళీ కనిపించి మాయావసుదేవుడిని కల్పించి, అతనిని బంధించి తీసుకు వచ్చి “ఓ కృష్ణా! పుండరీకముల వంటి కన్నులు ఉన్నాయి కదా చూడు. వీడే నీ తండ్రి నీ కన్నుల ముందే వీడి తల నరికేస్తాను. ఇక ఎవరి కోసం బ్రతుకుతావు? ఇక చాతనైతే రక్షించుకో.” అని దుర్భాషలు పలుకుతూ, భీకరమైన పెద్ద కత్తి జళిపిస్తూ, ఆ మాయావసుదేవుడి తల తరిగి, ఆ శిరస్సు పట్టుకుని సౌభకవిమానం లోనికి వెళ్ళిపోయాడు. అది చూసిన శ్రీకృష్ణుడు కొంతసేపు బాగా దుఃఖంలో మునిగిపోయాడు. అప్పుడు తన సైనికులచే గుర్తు చేయబడి, అది సాల్వుడు ప్రయోగించిన మయ నిర్మిత మాయ అని కృష్ణుడు గ్రహించాడు. ఆ క్షణం లోనే వసుదేవుడు పట్టుబడ్డాడు అని చెప్పిన దూత, ఆ మాయాకళేబరం అదృశ్యం అయిపోయాయి. సమయంలో, మునులు కొంతమంది వచ్చి, మాయా మోహితుడైన కృష్ణుడిని చూసి, చిక్కని భక్తితో నమస్కరించి “ఓ పుండరీకాక్షా! పురుషోత్తమా! సమస్తమైన లోకాలలో ఉన్న మానవులు అందరు రకరకాలుగా సంసారం అనే దుఃఖసముద్రంలో మునిగి దరి చేరలేక కొట్టుమిట్టాడుతున్న దశలో నిన్ను స్మరించి ఆ దుఃఖాలను పోగొట్టుకొంటారు. అలాంటి సద్గుణాలకు నిధివై; దేవతాసమూహానికి ఆధారభూతుడవై; పరబ్రహ్మ స్వరూపుడవై; పరమయోగీశ్వరులకు కూడా అందనివాడవై; చిదానందరూపంతో ప్రకాశించే నీ వెక్కడ? అజ్ఞాన సంజాతాలు అయిన శోక, మోహ, భయాదు లెక్కడ? అవి నిన్ను అంట లేవు.” అని ఈ విధంగా ప్రస్తుతించి ఆ మునీశ్వరులు వెళ్ళిపోయారు. అప్పుడు తన మీద పదునైన బాణాలను గుప్పిస్తున్న సాల్వుడిని చంపటానికి శ్రీకృష్ణుడు నిశ్చయించుకొని, తన తిరుగులేని తీవ్రమైన బాణాలను వర్షధారలవలె ప్రయోగిస్తూ ఆకాశాన్ని కప్పివేసి శత్రువు కిరీటాన్నీ ధనుస్సునూ కవచాన్నీ ఛేదించి వేశాడు. మహాక్రోధంతో శ్రీకృష్ణుడు విశ్వవిఖ్యాతమైన వీరవిజృంభణంతో ఆకాశంనిండా మెరుపులు వ్యాపించేలా గదాదండాన్ని విసిరి సాల్వుడి సౌభకవిమానాన్ని తున్నాతునకలు చేసాడు. ఆ విధంగా మయడు నిర్మించిన మాయావిమానాన్ని శ్రీకృష్ణుడు తన గదాఘాతంతో ముక్కలు చేసి సముద్రమధ్యంలో పడేలా చేసాడు. అప్పుడు సాల్వుడు కోరలు తీసిన క్రూరసర్పంలా దీనుడై మాయాబలం నశించి కూడ, మొక్కపోని పరాక్రమంతో భూమికి దిగాడు. సాల్వుడు భయంకర గదను చేతబట్టి కృష్ణుడిని ఎదుర్కొన్నాడు. వెంటనే శ్రీకృష్ణుడు ఆ గదతో సహితంగా వాడి చేతిని ఖండించివేసాడు. అంతటితో ఆగకుండా శ్రీకృష్ణుడు సుదర్శన చక్రాన్ని సాల్వుడి మీద ప్రయోగించి తలను ఖండించాడు. ఆ విధంగా శ్రీకృష్ణుడు సాల్వుడిని సౌభకవిమానాన్నీ ధ్వంసం చేయటం చూసిన దంతవక్త్రుడు మిక్కిలి భయంకరాకారంతో కృష్ణుడి మీదకు వచ్చాడు. దంతవక్త్రుడు తన గదాదండంతో కృష్ణుడి తలమీద మోదాడు.శ్రీకృష్ణుడు ఆగ్రహించి గదతో వాడి వక్షస్థలాన్ని పగులకొట్టడంతో, వాడు రక్తం కక్కుతూ నేలకూలాడు. తక్షణమే పర్వతంవంటి దేహంతో దంతవక్త్రుడు నేలపడి శిరోజాలు విడివడి చిక్కులు పడేలా తన్నుకుంటూ ప్రాణాలు విడిచాడు. అప్పుడు, వాడి దేహం లోంచి ఒక సూక్ష్మతేజం వెలువడి శ్రీకృష్ణుడి శరీరంలో ఐక్యం అయింది. సకల జీవులూ ఆశ్చర్యపోయారు. ఆ సమయంలో విదూరథుడు అను వాడు అన్న మరణం చూసి అతి కోపంతో ప్రళయకాలపు అగ్నిజ్వాలవంటి భయంకరమైన కత్తి, డాలు ధరించి శ్రీకృష్ణుడి పైకి దూకాడు. కృష్ణుడు తన చక్రాయుధం పూని వేయడంతో, అది వాని శిరస్సును ఖండించింది. మానవులు, మునులు, యోగులు, దేవతలు, రాక్షసులు, గరుడులు, నాగులు, సిద్ధులు, సాధ్యులు, గంధర్వులు, కిన్నరులు, కింపురుషులు, ఖేచరులు మొదలైన వారంతా ఆశ్చర్యానందాలతో శ్రీకృష్ణుని ప్రభావాన్ని స్తుతించారు. దేవతలు పూలవానలు కురిపిస్తుండగా, దేవ దుందుభులు మ్రోగుతుండగా, యాదవ వీరులు సేవిస్తుండగా, వందిమాగధులు తన విజయ గాథలను గానం చేస్తుండగా, బహు మనోజ్ఞములైన వైభవాలతో, నందనందనుడు పరమానందంతో ఒక శుభముహుర్తంలో నవ్యనూతన అలంకారాలతో విరాజిల్లుతున్న ద్వారకానగరం ప్రవేశించాడు.

Bhagavad gita_adhyatmikam1

 భగవద్గీత

అధ్యాయం 12

శ్లోకం 19

తుల్యనిందాస్తుతిర్మౌనీ సంతుష్టో యేన కేనచిత్ |

అనికేతః స్థిరమతిః భక్తిమాన్ మే ప్రియో నరః ||

అర్ధం :-

నిధాస్తుతులకుచాలింపనివాడును, మానానషీలుడును, శరీరనిర్వహణకై లభించిన దానితోడనే తతృపిత్తిపాడువాడును, నివాసస్థానములయందు మమతాసక్తులు లేనివాడును, స్థితప్రజ్ఞడును అగు భక్తుడు నాకు ఇష్టుడు.




    

శ్రీకృష్ణుడు లేనిసమయంలో ద్వారకను ముటడించిన్నా సాల్వుడు


ఓ రాజా! రుక్మిణీ స్వయంవర సమయంలో శిశుపాలుడికి సహాయంగా సైన్యంతో సహా వచ్చి, కృష్ణుడిని ఎదిరించి, అతని చేత చావుదెబ్బలు తిని పరాజితులైన రాజులలో సాల్వుడు అనే రాజు ఒకడు. అతడు విపరీతమైన కోపంతో, మొండిపట్టుదలతో “యాదవులను అందరిని నాశనం చేస్తాను” అని జరాసంధాది రాజుల ఎదురుగా ప్రతిజ్ఞ చేసాడు. ఆతరువాత అతడు అత్యంత నిష్ఠతో ఒక ప్రశాంత ప్రదేశంలో ఈశ్వరుడిని గురించి తపస్సు చేసాడు. సాల్వుడు ప్రతిదినం పిడికెడు దుమ్ము మాత్రం ఆహారంగా స్వీకరిస్తూ పట్టుదలగా పరమేశ్వరుని గురించి భీకర తపస్సు చేసాడు. చెదరని భక్తితో శంకరుని పాదాలపై మనస్సు నిలిపి ఒక సంవత్సరం అలా భీకర తపస్సు చేయగా. అతని భక్తికి పరమేశ్వరుడు సంతోషించాడు. ఈశ్వరుడు ప్రత్యక్షమై “నీవు ఏ వరం కోరినా ఇస్తాను. కోరుకొ” అని సాల్వుడిని అనుగ్రహించాడు. సాల్వుడు పరమ ప్రీతితో శంకరుడికి నమస్కారంచేసి ఇలా అన్నాడు “ఓ శివా! ఆశ్రితుల ఎడ కృప చూపు వాడా! నన్నురక్షించేటట్లయితే నా కోరిక ఏమిటో మనవి చేస్తాను. చిత్తగించు. ఓ ఈశ్వరా! వరదా! ప్రభూ! గరుడ, గంధర్వ, యక్ష, రాక్షస, దేవతాదులకు సాధ్యం కానట్టిది, నా కోరిక ప్రకారం అవసరమైనప్పుడు ఆకాశమార్గంలో సంచరించగలది అయిన అద్భుతమైన విమానాన్ని నాకు ప్రసాదించు.” అలా సాల్వుడు కోరిన విధమైన విమానాన్ని ఈశ్వరుడు “అతడి కోరికకు తగిన పురము నిర్మించి యి” మ్మని మయుడిని ఆదేశించాడు. అతడు చిత్తమని కామగమనమూ మిక్కిలి వెడల్పూ పొడవూ కలిగి లోహమయమైన ఒక విమానాన్ని నిర్మించి దానికి “సౌభకము” అని పేరుపెట్టి సాల్వుడికి ఇచ్చాడు. వాడు పరమానందంతో దానిని ఎక్కి యాదవుల మీద తనకు ఉన్న పూర్వ శత్రుత్వం గుర్తుచేసుకుని గర్వంతో కన్నుమిన్ను గానక తన సేనలతో వెళ్ళి ద్వారకాపట్టణాన్ని ముట్టడించాడు. ద్వారకానగరంలోని సెలయేర్లను ఉపవనాలను ధ్వంసం చేయించాడు; చెఱువులు బావులు పూడిపించాడు; కోటలను ఛిన్నాభిన్నము చేయించాడు; అగడ్తలను పాడుచేసాడు; కోటగోడలను పడగొట్టించాడు; ప్రాకారాలు బురుజులు కూలదోయించాడు; యంత్రాలను ధ్వజపతాకాలనూ నరకించాడు; గోపురాలను మిద్దెలను మేడలను చంద్రశాలలను కాల్చి బూడిద చేసాడు; పట్టణంలోని బంగారాన్ని రత్నాలు మొదలైన వస్తువులను కొల్లగొట్టాడు; ప్రజలను చెఱపట్టాడు; అధికారులను అవమానించాడు; ఇలాగ సాల్వుడు ద్వారకలోని ప్రజలను పెక్కు బాధలకు గురిచేసాడు. అంతటితో వదలిపెట్టకుండ విమానం ఎక్కి సాల్వుడు ఆకాశంలోకి ఎగిరి అక్కడ నుండి చెట్లకొమ్మలు గులకరాళ్ళు బాణాలు కురిపిస్తూ ద్వారకావాసులను బాధించాడు. దుమ్ము ధూళితో సుడిగాలులు ప్రయోగించి కల్లోలపరచాడు. అది చూసి మహాప్రభావశాలి రథికశ్రేష్ఠుడు అయిన రుక్మిణీ పుత్రుడు ప్రద్యుమ్నుడు ప్రజలకు ధైర్యం చెప్పి, మీనకేతనం ప్రకాశిస్తున్న ఉన్నతమైన రథం ఎక్కి, మహోత్సాహంతో అస్త్రశస్త్రాలను ధరించి, సైన్య సమేతంగా యుద్ధభూమికి బయలుదేరాడు. మహా భుజబల పరాక్రమవంతులైన గదుడు, భానువిందుడు, శుకుడు, సాత్యకి, సారణుడు, చారుదేష్ణుడు, సాంబుడు, ప్రద్యుమ్నుని నందననుడు అనిరుద్ధుడు, శఫల్కుని పుత్రుడు అక్రూరుడు మున్నగు యాదవవీరులందరూ కృతవర్మ నాయకత్వంతో యుద్ధభూమికి బయలుదేరారు. యాదవవీరులు చతురంగబలసమేతులై జగత్తు కంపిస్తుండగా, తాము ధరించిన రకరకాల ఆయుధాల కాంతులు సూర్యబింబాన్ని కప్పివేస్తుండగా అరివీర భీకరంగా రణరంగానికి బయలుదేరారు. సమరంలో విస్తారమైన అల్లెత్రాళ్ళ టంకారాలు, మదగజాల ఘీంకారాలు, భటుల హూంకారాలు, భేరీ భాంకారాలు, వీరుల దురహంకారాలు, శత్రుసంక్షోభంగా భూమ్యాకాశాలు నిండాయి. గుఱ్ఱాల గిట్టల తాకిడికి, రథచక్రాల ఒరిపిడికి, భటుల పాదఘట్టనలకు లేచిన ధూళి ఆకాశం అంతా నిండి చీకట్లు వ్యాపించాయి. ఆ చీకట్లను పోగొడుతూ సైన్యం చేతులలోని కత్తులు గదలు మున్నగు ఆయుధాల కాంతులు ఆకాశ విహారుల చూపులకు మిరుమిట్లు గొలుపుతూ ఆకాశం నిండా వ్యాపించాయి. ఇరు పక్షాల సైన్యాలు పూని ఒకరి నొకరు ఎదిరించి బాణ వర్షాలు కురిపించి మర్మస్థానాలను చీల్చేస్తు, క్రోధంతో కన్నులనుండి నిప్పురవ్వలు రాలగా పెద్ద పెద్ద గదలతో తలలపై బాదుకుంటూ, భయంకరంగా పోరాడారు. అలా భీకరంగా పోరుసాగుతున్న సమయంలో అదంతా వీక్షిస్తున్న ప్రద్యుమ్నుడు సాల్వుడు కలుషాత్ముడై పన్నిన అనంత మాయాజాలాలను వీక్షించాడు. వీరావేశంతో విజృంభించి, సూర్యుడు తన కిరణాలతో కారుచీకట్లను పటాపంచలు చేయునట్లు, ప్రద్యుమ్నుడు తన దివ్యాస్త్రాలతో ఆ మాయాజాలాన్ని ఛేదించాడు. గగనచరులు అతని పరాక్రమం చూసి పొగిడారు. గొప్ప అతిరథుడి వలె ప్రద్యుమ్నుడు ఇరవైఐదు వాడి బాణాలతో సాల్వుడి సైన్యాధిపతిని నొప్పించాడు. పిడుగుల్లాంటి బాణాలు అనేకం ప్రయోగించి సాల్వుని మూపు పగలగొట్టాడు. లయకాలపు భైరవుడి లాగ విజృంభించాడు. ప్రద్యుమ్నుడు పదేసి బాణాలు చొప్పున వేసి, సాల్వుడి మిత్రులైన రాజశ్రేష్ఠులను నొప్పించాడు. మూడేసి బాణాలు వేసి రథ, గజ, అశ్వాలను పడగొట్టాడు ఒక్కొక్క బాణం ప్రయోగించి సైనికులను చిందరవందర చేసాడు. ఇలా ప్రద్యుమ్నుడు ఎదురులేని విధంగా పరాక్రమించాడు. అలా మేరుపర్వతం అంత ధైర్యంతో ప్రద్యుమ్నుడు నిర్భయంగా అద్భుత పరాక్రమాన్ని ప్రదర్శించగా, తిలకించిన ఉభయ సైన్యాలు పొగిడారు. అలా సాల్వుడితో యుద్ధం జరుగుతున్న సమయంలో సాల్వుడు సాంబుడి మీద అనేక బాణాలు ప్రయోగించి నొప్పించాడు. అంతట ఆ జాంబవతీ తనయుడు సాంబుడు తన ధనస్సు ఎక్కుపెట్టి సాల్వుడి వక్షాన్ని పదిహేను బాణాలతో కొట్టాడు. వాడి బాణాలు ఇరవై వేసి వాడి సౌభక విమానాన్ని అల్లల్లాడేలా చేసాడు. గొప్ప రథికుడైన గదుడు రాహుముఖం లాంటి బాణాలను ప్రయోగించి శత్రువుల శిరస్సులు ఖండించి గుదులు గుదులుగా నేలకూలుస్తు మొక్కవోని పరాక్రమంతో విజృంభించాడు. ఆకాశంలో అతని పరాక్రమం చూసి దేవతలు ప్రస్తుతించారు. సాత్యకి మహారోషంతో సాల్వుడి చతురంగబలాలను, సౌభక విమానము అనే చీకటిని సూర్యకిరణాల వంటి వాడి యైన బాణాలను ప్రయోగించి పటాపంచలు కావించాడు. సైనికులందరు అతని పరాక్రమాన్ని బహువిధాల ప్రశంసించారు. భానువిందుడు విజృంభించి, శత్రుసైన్యం అనే అడవిని తీవ్రమైన దావానలం వంటి తన బాణాలు అసంఖ్యాకంగా వేసి భస్మీపటలం చేసాడు. అతని ధనుర్విద్యా కౌశల్యాన్ని దేవతా సమూహం ప్రస్తుతించింది. చారుదేష్ణుడు ఆగ్రహంతో విజృంభించి వాడి బాణాలు అనేకం ప్రయోగించి సాల్వుని దండనాథులను సంహరించి సింహనాదం చేసాడు. యోధుడైన శుకుడు యుద్ధవిజయకాంక్షతో చెలరేగి తన భుజబలం విశదం అయ్యేలా శరసమూహంతో శత్రు సేనావ్యూహాన్ని నాశనం చేసాడు. సారణుడు విజృంభించి శత్రువీరులు తన బాహుబలానికి శత్రువులు భయపడేలాగా కుంతాలూ, శక్తులూ, బాణాలూ, గదలూ, కత్తులూ మొదలైన ఆయుధాలతో సాల్వుడి గుఱ్ఱాలను ఏనుగులను రథాలను ధ్వంసం చేసి ఉగ్రస్వరూపుడు అయి శౌర్యంతో సైనికులను సంహరించాడు. అక్రూరుడూ అతని తమ్ముళ్ళూ తిరుగులేని పరాక్రమంతో మెరసి ఈటె, చక్రము మున్నగు రక రకాల సాధనాల ప్రయోగంతో శత్రువులను వధించారు. రాజు కృతవర్మ శత్రువుల కవచాలు భేదించి, వారి శరీరాలను ముక్కలు ముక్కలుగా నరికాడు. ఇది అద్భుతమైన కార్యమని శత్రువులు సైతం పొగిడారు. రథికోత్తముడు అయిన అతడు యుద్ధధర్మాన్ని అవలంబించి విరోధులు పారిపోతుంటే వారిని చంపకుండా వదలిపెట్టాడు. అప్పుడు, సాల్వుడికి బాగా కోపం వచ్చింది. అతడి సౌభకవిమానం తన మాయాప్రభావంతో విజృంభించింది. ఆ సౌభకవిమానం తన మాయా ప్రభావంతో ఒకమారు ఆకాశంలో కనపడుతుంది; ఒకమారు భూమి మీద నిలబడుతుంది; ఒకమారు కొండశిఖరం మీద తిరుగుతుంది; ఒకమారు సముద్రమధ్యంలో విహరిస్తుంది; ఒకసారి ఒక్కటిగా, మరుక్షణంలో అనేక రూపాలతో ప్రత్యక్షమవుతుంది; ఒకమారు సాల్వుడితో కూడి చూపట్టుతుంది; ఒకమారు ఏమీ లేకుండా కనపడుతుంది; ఒకమారు కొరవి తిప్పినట్లుగా భయంకరంగా దర్శనమిస్తుంది; ఈ విధంగా ఆ విమానం శత్రువులు కలవరపడేటట్లు పెక్కువిధాలుగా తిరిగింది. ఇలా సౌభకవిమానం విజృంభించేసరికి అంతకు ముందు యాదవసైన్యంవల్ల భీతిచెందిన తన సైన్యాల్ని సాల్వుడు మళ్ళీ పురిగొల్పి యుద్ధోన్ముఖులను చేసాడు. సాల్వుడు యాదవసైన్యంమీద అగ్నిజ్వాల ల్లాంటి బాణాలను పింజ పింజతాకేలా వేసాడు. అయినా ఆ సైన్యం చెదరక బెదరక వెనుకంజ వేయక ధైర్యంతో నిలచి యుద్ధం చేసింది. ఆ సమయంలో రెండు పక్షాల యోధులూ నదురూ బెదురూ లేకుండా, అలసిపోకుండా గట్టిగా పౌరుషంతో పోరాడారు. అప్పుడు ప్రసిద్ధులైన యోధుల మధ్య ద్వంద్వ యుద్ధం జరగసాగింది. మునుపు ప్రద్యుమ్నుడి బాణాల వలన మిక్కిలి నొచ్చిన సాల్వుడి మంత్రి ద్యుముడు అనేవాడు గదను ధరించి ప్రద్యుమ్నుడిని ఎదుర్కున్నాడు. నేర్పూ బలపరాక్రమాలూ ప్రదర్శిస్తూ ద్యుముడు గదతో కృష్ణకుమారుడు ప్రద్యుమ్నుడి వక్షం పగిలేలా మోదాడు. ఆ దెబ్బకి అతడు మేను గగుర్పడంతో చేతిలోని అస్త్రశస్త్రాలను రథంమీదనే వదిలి కనులు మూతలు పడి మూర్ఛపోయాడు. సారథి దారకుని కుమారుడు; యుద్ధధర్మం చక్కగా తెలిసినవాడు; నీతిశాస్త్ర పారంగతుడు; కనుక, రథాన్ని మళ్ళించి యుద్ధభూమినుండి ప్రక్కకు తోలుకుని పోయాడు. కొంతసేపటికి ప్రద్యుమ్నుడు మూర్ఛ నుండి తేరుకున్నాడు. సారథిని, తేరుకున్న ప్రద్యుమ్నుడు ఇలా మందలించాడు. “కృష్ణుడూ బలరాముడూ ఎగతాళి చేసేలా, శత్రువులు నవ్వేలా రణక్షేత్రం నుండి రథాన్ని తప్పించి, అపకీర్తి తెచ్చావు. యదువంశంలో పుట్టిన వీరకుమారులు పరాక్రమహీనులై ఈ మాదిరి యుద్ధరంగం నుంచి తొలగిపోరు కదా.” ఇలా అంటున్న ప్రద్యుమ్నుడితో సారథి యుద్ధధర్మం ప్రకారం శత్రువుల వలన రథికుడు నొచ్చినపుడు సారథి, సారథి దెబ్బతిన్నప్పుడు రథికుడూ పరస్పరం రక్షించుకోవాలి, కాబట్టి. నేను ఇలా చేసాను. నీవు బాధపడక విరోధులను గెలవడానికి ప్రయత్నించు.” అని అన్నాడు. మహాశూరుడు, అపార బలసంపన్నుడు అయిన ప్రద్యుమ్నుడు సారథి మాటలకు సంతోషించాడు. ధనుష్టంకారంతో శత్రువులను భయభ్రాంతులను చేస్తూ గొప్ప నేర్పుతో ద్యుముడి మీదకి తిరిగి రథాన్ని తోలించాడు. మిక్కిలి ఆగ్రహంతో ప్రద్యుమ్నుడు అవక్రపరాక్రమం ప్రదర్శిస్తూ ఎనిమిది బాణాలను వేసి శత్రువు శరీరాన్ని పగులకొట్టాడు. నాలుగు బాణాలు వేసి అతని గుఱ్ఱాలను కూల్చాడు. రెండు బాణాలతో వాడి పతాకాన్నీ ధనుస్సునూ నుగ్గునుగ్గుచేసాడు. ఒక బాణంతో భయంకరంగా అతని సారథిని సంహరించాడు. పిమ్మట విక్రమించి ప్రద్యుమ్నుడు ఒక అమ్ముతో ద్యుముని కంఠాన్ని భీకరంగా నరికాడు. అది చూసిన సాంబుడు మున్నగు యదు యోధులు ప్రద్యుమ్నుడిని ప్రస్తుతించారు. పదునైన బంగారు పింజలు గల బాణాలతో తాటిపండ్లను నేల రాల్చినట్లు సాల్వుని సైనికుల తలలు ఉత్తరించారు. ఈ విధంగా యాదవ బలాలూ, సాల్వ సైన్యాలూ ఒకరిని ఒకరు జయించాలనే కోరికతో ఇరవైఏడు రోజులు పాటు తూర్పు పడమర సముద్రాలు తలపడి పోరుతున్నాయా అన్నట్లు భీకరంగా యుద్ధం చేశాయి. ఆ సమయంలో ఇంద్రప్రస్థం నుండి శ్రీకృష్ణుడు ద్వారకకు వస్తూ మార్గమధ్యంలో కనపడ్డ చెడ్డ శకునాలను కనుగొని సారథి యైన దారుకుడితో ఇలా అన్నాడు. చూడు దారుకా! అపశకునాలు ఆకాశంలోను, భూమి మీద అతిభీకరంగా కనబడుతున్నాయి. నేను ఇంద్రప్రస్థంలో ఉన్న విషయం తెలుసుకొని శిశుపాలుడి మిత్రులైన రాజులు మన పట్టణం మీద యుద్ధానికి తలపడినట్లు తోస్తున్నది. రథాన్ని వేగంగా పోనియ్యి అని అన్నాడు.

Bhagavad gita_adhyatmikam1

 భగవద్గీత

అధ్యాయం 12

శ్లోకం 18

సమశ్శత్రౌ చ మిత్రే చ తథా మానావమానయోః|

శీతోష్టసుఖదుఃఖేషు సమస్సంగవివర్జితః ||

అర్ధం :-

శత్రుల యందు మిత్రులయాందు సమభావముతో మెలిగేవాడు, మానావమానములు, శీతోష్ణము, సుఖదుఃఖాలు మొదలైన ధ్వంధ్వములను సమానముగా స్వీకరించువాడు ఆసక్తిరాహితుడు.



Bhagavad gita_adhyatmikam1

 భగవద్గీత

అధ్యాయం 12

శ్లోకం 17

యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి |

శుభాశుభపరిత్యాగీ భక్తిమాన్ యస్స మే ప్రియః||

అర్ధం :-

ఇష్టవస్తుప్రాప్తికి పొంగిపోనివాడు, దేనియందు ద్వేషము లేనివాడు, దేనికి శోకింపనివాడు, దేనిని ఆశించనివాడు, శుభాశుభకర్మలను త్యజించినవాడు అయినా భక్తుడు నాకు ప్రియమైనవాడు.




Bhagavad gita_adhyatmikam1

 భగవద్గీత

అధ్యాయం 12

శ్లోకం 16

అనపేక్షః శుచిర్దక్షః ఉదాసీనో గతవ్యథః |

సర్వారంభపరిత్యాగీ యో మద్భక్తస్స మే ప్రియః ||

అర్ధం :-

ఏ మాత్రం కాంక్షలేనివాడు, శరీర ఇంద్రియలు మనస్సు యందు శుచ్చియైనవాడు, దక్షుడు, పక్షపాతరహితుడు, ఎటి దుఃఖాలకు చలించనివాడు, సమస్త కర్మల యందు కర్తవ్యం అబిమానము లేనివాడు అయినా భక్తుడు నాకు ప్రియమైనవాడు.




దూర్యోధనుడి పరభావం


రాజసూయ యాగం విజయవంతంగా సుసంపూర్ణమైన సమయంలో కల్మషచిత్తుడు, వంశనాశకుడు అయిన దుర్యోధనుడు తప్పించి, తక్కిన సమస్త ప్రజలూ రాజసూయయాగ వైభవానికి సంతోషించారు. దుర్యోధనుడు పాండవులకు ఎప్పుడూ అపకారమే చేస్తుంటాడు. అయినా శ్రీకృష్ణుని దయచేత కలిగిన దేవ, దానవ, నరులను పాలించే రాజ్య సంపదలను వైభవం కలవాడైనాడు ధర్మరాజు. ద్రౌపదీదేవి సౌభాగ్యాన్నీ రాజసూయయాగ మహావైభవాన్నీ చూస్తున్న దుర్యోధనుడు అసూయతో లోలోపల బాధపడసాగాడు. ఇలా ఉండగా ఒకనాడు ధర్మరాజు నిండుకొలువు తీర్చి కూర్చున్నాడు. ధర్మరాజు మయసభ మధ్యలో ప్రకాశవంతమైన సింహాసనం మీద ఆసీనుడై కొలువుతీరి ఉన్న ధర్మరాజుని వీక్షించి శ్రీకృష్ణుడు సంతోషించాడు. ఆ సమయంలో దురభిమాని అయిన దుర్యోధనుడు అక్కడకి వచ్చాడు. ఆ మయాసభలో నీరులేని స్థలంలో కట్టుకున్న దుస్తులు పైకి ఎగగట్టుకుని; నీరున్న స్థలంలో దుస్తులు తడుపుకొని; దుర్యోధనుడు భ్రమకు లోను అయ్యాడు. ఈవిధంగా భ్రమకులోనైన దుర్యోధనుడిని చూసిన అక్కడున్న రాజులు స్త్రీ జనము భీముడితోపాటు పెద్దగా పకపకా నవ్వారు. మయసభలో తనకు జరిగిన ఘోరమైన అవమానానికి సిగ్గుపడి దురాగ్రహంతో దుర్యోధనుడు తన పట్టణానికి వెళ్ళిపోయాడు. ఆ సమయంలో సభాసదుల వేళాకోళంతో కూడిన కోలాహలాన్ని చూసిన ధర్మరాజు చిన్నపోయాడు. భూభారాన్ని నివారించడానికి అవతారం ధరించిన శ్రీకృష్ణుడు దుర్యోధనునికి జరిగిన అవమానాన్ని ఖండించ లేదు. తరువాత కృష్ణుడు ధర్మరాజును వీడ్కొని భార్యాబిడ్డలు, బంధుజనులు సేవిస్తుండగా సంతోషంగా కుశస్థలి నుండి ద్వారకానగరానికి వెళ్ళాడు.











Bhagavad gita_adhyatmikam1

 భగవద్గీత

అధ్యాయం 12

శ్లోకం 15

యస్మాన్నోద్విజతే లోకో లోకాన్నోద్విజతే చ యః |

హర్శామర్షభయోద్వేగైః ముక్తోయస్స చ మే ప్రియః ||

అర్ధం :-

లోకములో ఎవరికీ క్షోభ కలిగింపనివాడు, ఎవరివలన తాను ఉద్వేగానికి గురికానివాడు, హర్షము, ఈర్ష్య, భయము, ఉద్వేగము మొదలైన వికారాలు లేనివాడు అయినా భక్తుడు నాకు ప్రియమైనవాడు.





Bhagavad gita_adhyatmikam1

 భగవద్గీత

అధ్యాయం 12

శ్లోకం 14

సంతుష్టస్సతతం యోగీ యతాత్మా దృఢనిశ్చయః |

మయ్యర్పితమనోబుద్ధిః యో మద్భక్తస్స మే ప్రియః ||

అర్ధం :-

సర్వకాల సర్వావస్థలయందు సంతుష్టుడైయుండు యోగి, శరీరేంద్రియ మనస్సులను వశమునందు ఉంచుకొనువాడు, నాయందే దృడమైన నిశ్చయము గలవాడు అయి నాయందే మనోబుద్ధులను అర్పణ చేసిన నా భక్తుడు నాకు ప్రియుడు.




శిశుపాలుని వధ


అంతలో, కృష్ణుని మేనత్త శ్రుతశ్రవస, చేది దేశ రాజు దమఘోషుల కుమారుడైన శిశుపాలుడు ఆ వైభవాన్ని చూసి ఓర్వలేకపోయాడు. అసూయతో మనసులోని భయాన్ని వీడి తన చేతులెత్తి ఆసనం దిగి, నిలబడి శ్రీకృష్ణుడు వినేలా సభాసదులతో ఇలా అన్నాడు. “ఆహా! భలే! భలే! ఎలాంటి కాలం వచ్చేసింది, దీనిని దాటడం చాలా దుర్లభంగా ఉంది. ఈ కాల ప్రభావం చూడండి, ఇంత పసివాడి మాటలకి బుద్ధిమంతులైన ఈ పెద్దల బుద్ధులు నీతిని ఎలా తప్పాయో? నీతి తప్పాయని ఎలా అంటున్నావు అంటారా! యోగ్యత అయోగ్యతలనూ నిర్ణయించ గలిగిన మహా వివేకులు, గొప్ప సత్త్వగుణ సంపన్నులు, పాపరహితులు, సకల విధ మహా తపస్సులు, వ్రతశీలులు, మహా నియమ పాలకులు, అమిత తేజోశాలురు, గొప్ప ఐశ్వర్యవంతులు, బ్రహ్మజ్ఞానులు, సమస్త లోకపాలుర చేత పూజింపబడువారు, యోగీశ్వరులు ఎందరో ఈ సభలో ఉన్నారు. వీరందరినీ లెక్కించక బుద్ధిహీనుడైన ఒక గొల్లపిల్లవాడిని పూజించటానికి ఎలా సమ్మతించారు. యజ్ఞం కోసం ఉద్దేశించిన పురోడాశం నక్కకు ఎలా అర్హమవుతుంది? అంతేకాకుండా ఈ కృష్ణుడికి గురువులు దేవుడు లేరు, కులం గోత్రం లేవు, తల్లితండ్రులు ఎవరో తెలియదు, నీటి మీద శయనిస్తాడు, ఆది మధ్యాంతాలు కానరావు, నటుడిలా అనేక రూపాలు ధరిస్తూ రకరకాలరీతులో ప్రవర్తిస్తుంటాడు, వర్తించే వావివరుసులు లేవు, ఏ బాంధవ్యబంధాలు లేవు. ఇతడు మా కారణంగానే మాననీయుడయ్యాడు కానీ, యయాతిశాపం వలన ఈ యదువంశం ప్రసిద్ధి అణగారిపోయింది. వీరి వంశం బ్రహ్మతేజాన్నికోల్పోయింది. ఇలాంటి ఈ గోపాలకుడు బ్రహ్మర్షుల పూజకు ఎలా అర్హుడవుతాడు? అంటూ అమంగళకరమైన మాటలతో శిశుపాలుడు శ్రీకృష్ణుడిని నిందించాడు. ఇలా శిశుపాలుడు నిందిస్తూ ఉంటే, నక్కకూతలను లెక్కపెట్టని సింహంలాగా శ్రీకృష్ణుడు లక్ష్యపెట్టలేదు కానీ, సభలో ఉన్న ఋషులు, రాజులు, మాత్రం శిశుపాలుడు పలికిన దుర్భాషలకు చాలా బాధపడ్డారు. కృష్ణుడిని నిందిస్తున్న శిశుపాలుడి దురాలాపాలను వినలేక మునులు రాజులు చెవులు మూసుకుని ఆశ్చర్యపడుతూ “ఓ కృష్ణా! వీడిని ఎలా కడతేరుస్తావో ఏమిటో?” అంటూ శిశుపాలుడిని నిందిస్తూ సభ నుంచి నిష్క్రమించారు. పాండవులకు శిశుపాలుడి మీద ఎంతో కోపం వచ్చింది. ఆ సమయంలో కేకయ రాజులు, సృంజయ రాజులు, పాండవులు ఆయుధాలు ధరించి శిశుపాలుడిని అదలించి నిలబడ్డారు. వాడు కూడ భుజబలగర్వంతో పాండ వాదులను లక్ష్యపెట్టక, కత్తీ డాలూ పట్టుకుని కృష్ణుడిని అతడిని అనుసరించే వారిని కోపంగా నిందించసాగాడు. అప్పుడు ముకుందుడు ఆగ్రహంతో లేచి తనకు ఎదురుగా పోరుకు సిద్ధంగా ఉన్న శిశుపాలుడిని తీవ్రంగా చూస్తూ, బహు వాడి కలదైన తన సుదర్శన చక్రంతో వాడి తల తరిగాడు. ఆ భయంకర కలకలాన్ని వినిన చూసిన, శిశుపాలుడి సైన్యము, అతడి పక్షపు రాజులు తత్తరపాటుతో పారిపోయారు.  ఆ సమయంలో శిశుపాలుని దేహంనుంచి దేదీప్యమానమైన తేజస్సు వెలువడి ఆ పద్మనాభుడు కృష్ణుడు శరీరంలో ప్రవేశించింది, మునీశ్వరులు రాజులు అది చూసి ఆశ్చర్యపోయారు.” మధుసూదనుడైన శ్రీహరి మీది మాత్సర్యంతో మదోన్మత్తుడై మూడు జన్మలనుండి విడువకుండా నిందించడం పేర, ఎల్లప్పుడు ఆ విష్ణుమూర్తి దివ్యమైన రూప గుణాలను ధ్యానిస్తూ ఉండడం వలన, పాపాలు సమస్తం నుండి విముక్తుడై ఈ శిశుపాలుడు బ్రహ్మరుద్రాదులకు సైతం అందరాని పదవిని అందుకున్నాడు. ధర్మరాజు తను చేసిన రాజసూయయాగాన్ని భక్తితో చూడడానికి వచ్చిన దేవతలు, మునులు, బ్రాహ్మణ క్షత్రియ వైశ్యశూద్రులు అందరిని ధర్మజుడు సముచిత రీతిలో సత్కరించాడు. వారందరు సంతృప్తి చెంది సంతోషంతో సెలవు పుచ్చుకుని వెళ్ళిపోతూ యజ్ఞానికి విచ్చేసిన వారంతా శ్రీకృష్ణభక్తుడు పాండురాజ సుతుడు అయిన ధర్మరాజు కావించిన రాజసూయ యాగం వైభవాన్ని పొగుడుతూ తమ తమ స్థలాలకు వెళ్ళారు. ధర్మజుడు శ్రీకృష్ణుడిని వదలలేక ఇంకా కొన్ని రోజులు ఉండమని ప్రార్థించాడు. ఇలా ధర్మరాజు చేసిన విన్నపం శ్రీకృష్ణుడు మన్నించాడు. యాదవులను అందరినీ కుశస్థలికి పంపించాడు. తాను మాత్రం కొంత పరివారంతో ధర్మరాజు తృప్తిచెందే దాక ఇంద్రప్రస్థనగరంలోనే సంతోషంగా ఉన్నాడు. రాజసూయం చేయాలనే బహు దుష్కరమైన సముద్రమంతటి తన కోరికను ధర్మరాజు కృష్ణుడనే ఓడ ద్వారా దాటి, మానసికవ్యధ నుండి దూరమై గొప్పఐశ్వర్యంతో సంతోషంతో ప్రకాశించాడు. శ్రీకృష్ణుడి భక్తులకు సాధ్యం కానిది ఏముంది

Bhagavad gita_adhyatmikam1

 భగవద్గీత

అధ్యాయం 12

శ్లోకం 13

అద్వేష్టా సర్వభూతానాం మైత్రిః కరుణ ఏవ చ |

నిర్మమో నిరహంకారః సమదుఃఖసుఖః క్షమీ ||

అర్ధం :-

ఏ ప్రాణియందు ద్వేషభవము లేనివడు, పైగా సర్వప్రాణులయందు అవ్యాజమైనప్రేమ కరుణ కలవాడు, మమతాహంకారములు లేనివాడు, సుఖము ప్రాప్తించినా, దుఃఖము ప్రాప్తించినా సమభవము కలిగి యుండు వాడు, క్షమాగుణము కలవాడు.




రాజసూయ యాగం



శ్రీకృష్ణుడి ఆజ్ఞానుసారం ధర్మరాజు వేదవిజ్ఞానధనులైన బ్రాహ్మణులను యజ్ఞకార్యనిర్వాహకులుగా స్వీకరించాడు.సత్యవతీ కుమారుడు వేదవ్యాసుడు, కశ్యపుడు, ఉపహూతి, భరద్వాజుడు, విశ్వామిత్రుడు, వీతిహోత్రుడు, మైత్రేయుడు, పైలుడు, సుమంతుడు, మధుచ్ఛందుడు, గౌతముడు, సుమతి, భార్గవుడు, వసిష్ఠుడు, వామదేవుడు, అకృతవ్రణుడు, కణ్వుడు, జైమిని, ధౌమ్యుడు, పరాశరుడు, అధర్వుడు, కవషులు, అసితుడు, వైశంపాయనుడు, ఆసురి, దుర్వాసుడు, క్రతువు, వీరసేనుడు, గర్గుడు, త్రికవ్యుడు మొదలైన మునీశ్వరులనూ; ద్రోణుడు, కృపాచార్యుడు ఆది గురువులనూ; భీష్ముడు, ధృతరాష్ట్రుడు, విదురుడు మున్నగు కురువృద్ధులనూ; దుర్యోధనాది బంధుజనాన్నీ; అలా గురు బంధు మిత్ర కులవృద్ధులను అందరినీ, సమస్త బ్రాహ్మణ క్షత్రియ వైశ్య సూద్ర ముఖ్యులనూ; ధర్మరాజు తన యజ్ఞానికి రప్పించాడు. ధర్మరాజు ఆహ్వానించిన వారంతా విచ్చేసి సంతోషంతో ఉచిత కార్యక్రమాలను పర్యవేక్షిస్తుండగా, బ్రాహ్మణశ్రేష్ఠులు శాస్త్ర ప్రకారం యజ్ఞం ప్రారంభించారు. యజ్ఞభూమిని బంగారునాగళ్ళతో దున్నించి, సువర్ణమయమైన పరికారాలతో ఏలోపం రాకుండా పంచపాండవులలో పెద్దవాడైన ధర్మరాజుకు యజ్ఞదీక్ష ఇచ్చారు. అలా బ్రాహ్మణులు నియమం ప్రకారం ఉచితమైన కార్యకలాపాలు నడుపుతున్నారు. ఆ సమయంలో ధర్మరాజు సమస్తభూపతులూ తనకు సమర్పించే ధన, కనక, వస్తు, వాహనాదులైన కానుకలను స్వీకరించటానికి దుర్యోధనుడిని నియమించాడు. కర్ణుడిని యాచకులు అడిగిన వస్తువులను దానం చేయటానికి; భీముడిని షడ్రసోపేత భోజనపదార్థాలను తయారు చేయించటానికి; శ్రీకృష్ణుడికి సేవలు చేయటానికి అర్జునుడిని; నకులుడిని యజ్ఞానికి అవసరమైన సంబారాలను సమకూర్చటానికి; సహదేవుడిని దేవతలను బ్రాహ్మణులను గురువులను పెద్దలను గౌరవించటానికి; యాగానికి విచ్చేసిన సమస్త ప్రజలూ మృష్టాన్నపానాలతో సంతుష్టులయ్యేలా చూడడానికి ద్రౌపదినీ; ధర్మరాజు నియమించాడు. దేవేంద్రుడు మొదలైన దిక్పాలురూ; బ్రహ్మాది దేవతలూ; సిద్ధ, సాధ్య, కిన్నర, చారణ, గరుడ, నాగ మున్నగు దేవగణములు; వచ్చి ధర్మరాజు చేస్తున్న యజ్ఞాన్ని చూసారు. “ఇంతకు పూర్వం యే రాజు కూడా ఇంత గొప్పగా యజ్ఞం చేయలేదు అని మెచ్చుకున్నారు. అంతేకాకుండా, “శ్రీకృష్ణుడి పాదపద్మాలు పూజించే భాగ్యం పొందిన వారికి, పొందలేని దంటూ ఏదీ ఉండదు” అని బ్రహ్మాదులు ప్రస్తుతించారు. దేవతలతో సమానులైన ఋత్విక్కులు రాజసూయ యాగానికి అనువైన మంత్రాలతో హవ్య ద్రవ్యాలను ధర్మరాజుచేత వేలిపించి యాగాన్ని నడిపించారు. ధర్మరాజు ఋత్విక్కులనూ, సభాసదులనూ, పెద్దలనూ, బ్రాహ్మణులనూ యజ్ఞం పరిసమాప్తమైన చివరిదినం పూజించాలని భావించాడు. అలా యాగాంతంలో పెద్దలను పూజించే సందర్భంలో అగ్రపూజకు అర్హులు ఎవరు అని అడుగగా, సభలో ఉన్నవారు ఎవరికి తోచినట్లు వారు తలకొక రకంగా చెప్పసాగారు. వారి మాటలను వారించి, వాక్ చాతుర్యం కలవాడు, బుద్ధిమంతుడు ఐన సహదేవుడు కృష్ణుడిని చూపించి “ఈ మహాత్ముడిని సంతుష్టుణ్ణి చేస్తే సమస్త లోకాలూ సంతోషిస్తాయి.” అని పలికి ధర్మరాజుతో ఇలా అన్నాడు. “కాలము, దేశము, యజ్ఞము, కర్మము, కర్త, భోక్త, లోకాలు, దైవము, గురువు, మంత్రము, అగ్ని, ఆహుతులు, యాజికులు, సృష్టిస్థితిలయాలూ, సమస్తము తానే అయి ప్రకాశించే ఏకైక దివ్యస్వరూపుడు ఈ శ్రీకృష్ణపరమాత్ముడు ఒక్కడే. అటువంటి ఈ శ్రీకృష్ణుడు కనుక, కన్నులు కొద్దిగా మూసుకున్నాడంటే ఈ చరాచర ప్రపంచమంతా నశిస్తుంది. కన్నులు విప్పిచూస్తే ఈలోకాలన్నీ జనిస్తాయి. యజ్ఞ ఫలాన్ని ప్రసాదించే ప్రభువు, ప్రభవిష్ణుడు, సాక్షాత్తు విష్ణు స్వరూపుడు ఐన శ్రీకృష్ణుడే ఈ అగ్రపూజకు అర్హుడు. ఇతడు కాకపోతే మరెవ్వరు తగినవారు కాగలరు? పురుషోత్తముడు, సకలలోకాధిపతి, అనంతుడు సమస్తశక్తులు కలవాడు, చిద్రూపుడు అయిన శ్రీకృష్ణుడిని ప్రప్రథమంగా పూజించి సంతోషింప చేస్తే సమస్త లోకాలూ సంతృప్తి పొందుతాయి. కాబట్టి, వేలమాటలు ఎందుకు, నీవు ఆలస్యం చేయకుండా అన్యధా ఆలోచించకుండా ఈ లక్ష్మీపతికి, శ్రీకృష్ణుడికి అగ్ర పూజ చెయ్యి.” అని సహదేవుడు చెప్పగా ఆ సభాసదులు, రాజులు, ఋషులు మొదలైన వారందరూ సంతోషంతో “ఇదే సముచిత మైనది” అని అంగీకరించారు.

Bhagavad gita_adhyatmikam1

 భగవద్గీత

అధ్యాయం 12

శ్లోకం 12

శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాద్ధ్యానం విశిష్యతే |

ద్యానాత్ కర్మఫలత్యాగః త్యాగాచ్ఛాంతిరనంతరమ్ ||

అర్ధం :-

తత్త్వము తెలుసుకోకుండా చేసే అభ్యాసము కంటే జ్ఞానము శ్రేష్టమైనది. కేవలం పరోక్ష జ్ఞనము కంటే అనగా అనుభవరహితమైన జ్ఞానముకంటె పరమేస్వరస్వరూపద్యానము శ్రేష్ఠం. ధ్యానం కంటే కర్మఫలత్యగము మిక్కిలి శ్రాష్టమైనది. ఎందుకంటే త్యాగము వలన వెంటనే పరమశాంతి లభిస్తుంది.




జరాసంధుని వధ



శ్రీకృష్ణుడు ధర్మరాజుతో ఓ ధర్మరాజా! జరాసంధుడిని చంపడానిక ఒక ఉపాయం ఉంది. నాకు ఉద్ధవుడు చెప్పిన ఆ ఉపాయం వివరిస్తాను విను. మగధరాజైన జరాసంధుడికి బ్రాహ్మణులు అంటే భక్తివిశ్వాసాలు అధికం. వారేది అడిగినా లేదనకుండా తప్పక ఇస్తాడు. కనుక, నేను, భీముడు, అర్జునుడు బ్రాహ్మణ వేషాలతో వెళ్ళి వాడిని యుద్ధభిక్ష కోరతాము. అతడు తప్పకుండా అంగీకరిస్తాడు. మల్లయుద్ధంలో భీముడిచేత అతడిని చంపించవచ్చు” అని శ్రీకృష్ణుడు చెప్పడంతో ధర్మరాజు ఇది బాగుందని అంగీకరించాడు. తరువాత కృష్ణుడు, భీముడు, అర్జునుడు బ్రాహ్మణ వేషాలు ధరించి బయలుదేరారు. అలా బ్రాహ్మణ వేషాలు ధరించిన శ్రీకృష్ణ భీమ అర్జునులు అతి త్వరగా గిరివ్రజానికి వెళ్ళారు. అప్పుడు శ్రీకృష్ణుడు బీముడు, అర్జునితో అక్కడ జరసంధుడి కోటగోడా ప్రకారం మాయకవచంతో నిర్మించాబడింది ఇందులో నుండి బ్రాహ్మణులూ తప్ప మరెవరికి ప్రవేశం లేదు. సహశించి ఎవరైనా ప్రవేశిస్తే గుండె ఆగి మరణిస్తారు అందుకే మనం బ్రాహ్మణ వేషంలో వచ్చాము. మనం జరసంధుని మరణం కోరుతున్నాము కాబట్టి కోట ప్రవేశం ద్వారం గూడా కాకుండా కోట గోడ దూకి వెళదాము అన్నారు. అందుకు బీముడు అర్జునుడు సరే అని ముగ్గురు కోటగోడను దూకి వేళారు. జరసంధుని దగరకు వెళ్లారు. జరసంధుడు వీరిని చూసి బ్రాహ్మణులూ అనుకోని మిక్కిలి శ్రద్ధాభక్తులతో తమకు అతిథి సపర్యలు చేశాడు. అప్పుడు శ్రీకృష్ణుడు జరాసంధుడితో అతిథి సేవ చేయటంలో బాగా పేరు పొందినవాడిగా దిగంత విశ్రాంతమైన నీ కీర్తి విని, నీ దగ్గరకు వచ్చాము. మా కోరిక కాదనక తీర్చు. ఇలా పలుకుతున్న వారి పలుకులు వినిన జరాసంధుడు వారి స్వరూపాలనూ, గంభీరమైన కంఠాలనూ, అల్లెత్రాటి వలన భుజాలమీద ఏర్పడ్డ గుర్తుల్ని యుద్ధలలో రాటు దేలిన శరీరాలను గమనించి, “వీరు బ్రాహ్మణ వేషం ధరించిన రాజశేఖరులు కావచ్చు. ఈ మహాత్ములు వస్తువునే కాదు ప్రాణాలుతో సహా ఏది కోరినా ఇచ్చేస్తాను. అంతేకాదు, పూర్వం బలిచక్రవర్తి బ్రాహ్మణ వేషంతో యాచించిన విష్ణుదేవుడికి తన పదవి పోతుందని తెలిసినా, ఏమాత్రం లెక్కచెయ్యకుండా ముల్లోకాలను దానం చేసి శాశ్వత యశస్సును పొందాడు. క్షత్రబంధుడు అనే పేరు గలవాడు బ్రాహ్మణుల కోసం తన ప్రాణాన్నే త్యాగంచేసి నిర్మలమైన కీర్తిని పొందాడు. అశాశ్వతమైన శరీరాన్ని గురించి ఆలోచించనక్కర లేదు. కీర్తిని పొందటమే ఉచితం” అని ఆలోచించుకొని “ఓ గుణవంతులారా! మీ మనస్సులోని కోరిక ఏమిటో చెప్పండి. మీరేది కోరినా ధైర్యంతో ఇచ్చేస్తాను. అంతేకాదు కోరితే చివరకు నా తలను ఇమ్మన్నా ఇచ్చేస్తాను.”  అని జరసంధుడు శ్రీకృష్ణా బీమా అర్జునుడితో అన్నారు. జరాసంధుడి మాటలు విని శ్రీకృష్ణుడు “మహారాజా! నీ సత్యవ్రత నిష్ఠ మాకు అవగతమైంది. మేము రణభిక్ష కోరుతున్నాం. ఇతడు వాయు పుత్రుడు భీమసేనుడు; ఇతడు ఇంద్రపుత్రుడు అర్జునుడు; నేను కృష్ణుడిని; మాలో ఎవరో ఒకరితో నీవు ద్వంద్వ యుద్ధం చేయాలి.” అని అన్నారు. శ్రీకృష్ణుడి మాటలు విని, జరాసంధుడు నవ్వి “అహో ఎంత ఆశ్చర్యం. నిన్ను నేను యుద్ధరంగంలో తట్టుకోలేక భయంతో చాలా పర్యాయాలు పారిపోయాను. కృష్ణా! రణంలో నిన్ను ఎదిరించటం నాకు చాలా కష్టం కనుక నీవు తప్పుకో. అర్జునుడు బలశాలే కానీ చిన్నవాడు. ఈ భీముడు చూడటానికి నా బాహుబలానికి సమ ఉజ్జీలా ఉన్నాడు. కనుక వీడిని ఎదుర్కొంటాను” అని భయంకరాకారుడైన జరాసంధుడు భీముడితో యుద్ధానికి చేయి ఊపాడు. వాయునందను డైన భీముడికి జరాసంధుడు ఒక భయంకరమైన గదను ఇప్పించాడు. తాను ఒక గదను చేబట్టాడు. పిమ్మట నలుగురూ పట్టణానికి బయట ఒక సమతల ప్రదేశానికి వెళ్ళిభీమ జరాసంధులు ఇద్దరూ భయంకరంగా ద్వంద్వ యుద్ధం చేశారు. గదలతో భీకరంగా కొట్టుకుంటూ, ఒకరి నొకరు తాకుతూ, పైకెగురుతూ, వంగుతూ, త్రోసుకుంటూ, తన్నుకుంటూ, కుడి ఎడమలకు తిరుగుతూ, ఆకాశం బద్దలవుతోందా అన్నట్లు సింహనాదాలు చేస్తూ, రెండు గదల పరస్పర తాకిడులకు ఛట ఛట మంటూ నిప్పురవ్వలు రాలగా విజృంభించి వారు ఘోరంగా పోరు సాగించారు. అలా భీమజరాసంధులు పోరాడుతుండగా వారి గదాలు ఖండఖండాలు విరిగిపోయాయి. దానితో ఇద్దరూ నిరుత్సాహపడకుండా ముష్టియుద్ధానికి తలడారు. అప్పుడు శ్రీకృష్ణుడు జరాసంధుడి పుట్టుక చావుల గురించిన వివరాలు తెలిసినవాడు కాబట్టి, భీముడికి అలసట కలుగకుండా తన దివ్యతేజాన్ని అతడిలో ప్రవేశపెట్టాడు. శత్రుసంహార ఉపాయం ఆలోచించి, భీముడు చూస్తుండగా శ్రీకృష్ణుడు వీణ్ణి ఇలా చేసి చంపు అని సూచన అన్నట్లు, ఒక చెట్టురెమ్మను పట్టుకుని రెండుగా చీల్చి పడేసాడు. అది గ్రహించిన భీముడు తక్షణం జరాసంధుడిని క్రింద పడవేసి ఒక కాలును తన కాలుతో త్రొక్కిపెట్టి, రెండో కాలు చేతులతో గట్టిగా పట్టుకుని వాడిని తల వరకూ చీల్చి చంపేశాడు. ఆ భయంకర దృశ్యాన్ని చూసి పురజనులు భయంతో హహాకారాలు చేశారు. జరాసంధుడిని చంపినందుకు అర్జునుడూ కృష్ణుడూ ఆనందంతో భీముడిని కౌగలించుకున్నారు; అతని పరాక్రమాన్ని ప్రస్తుతించారు. దయామయుడూ భక్తవత్సలుడూ అయిన శ్రీకృష్ణుడు అప్పుడు జరాసంధుడి కుమారుడైన సహదేవుడికి పట్టం గట్టి మగధరాజ్య సింహాసనం మీద కూర్చోబెట్టాడు. జరాసంధుడికి లోబడి అతడి చెరసాలలో దుఃఖంతో మ్రగ్గుతూ, తన పాదపద్మాలనే స్మరిస్తూ ఉన్న ఆ రాజులు అందరినీ అలా ఆ సమయంలో శ్రీకృష్ణుడు మరచిపోకుండా ఆ రాజులు అందరిని కారాగారం నుండి విముక్తులను చేసాడు. వారు చాలాకాలం పాటు చెరసాలలో బంధించబడి అనేక బాధలు పడుతూ ఉండడం వలన రక్తమాంసాలు క్షీణించి, చిక్కిశల్యమై, దుమ్ముకొట్టుకున్న శరీరాలతో, జడలు కట్టిన తలలతో, మాసిన బట్టలతో వాసుదేవుడి వద్దకు వచ్చారు. బంధవిముక్తులైన ఆ రాజులందరూ సంతోషించారు. కృష్ణుని పాదాలకు మ్రొక్కి, చేతులుజోడించి నమస్కారం చేసి అణుకువగా స్తుతించారు. అప్పుడు శ్రీకృష్ణుడు ఆ రాజులతో ఓ రాజులారా! మీ మాట నిజం. రాజ్యమదంతో బ్రాహ్మణులనూ, ప్రజలనూ మిక్కిలి బాధించటం వలననే కదా వేనుడు, నహుషుడు, రావణుడు, కార్తవీర్యార్జునుడు నాశనమయ్యారు. కాబట్టి ధర్మాన్ని పాటించకపోతే కులం, బలం, ఆయుస్సు, ఔన్నత్యం నిలబడవు. కావున, ఈ శరీరం శాశ్వతంకాదని మీరు గ్రహించండి. మీరు ధర్మాన్నీ నీతినీ న్యాయాన్నీ తప్పకుండా ప్రజలు సుఖసంతోషాలలో మునిగితేలేలా పరిపాలన సాగించండి. నన్ను ఉద్దేశించి యజ్ఞయాగాదులను నిర్వహించండి. నా పాదాలను భజిస్తూ పాపరహితులై చక్కగా ప్రవర్తించండి. మీరు కనక అలా నడచుకుంటే ముక్తిని పొందుతారు. నా పాదాలపై మీకు అచంచలమైన భక్తి సిద్ధిస్తుంది.” అని ఆనతి ఇచ్చి, శ్రీకృష్ణుడు ఆ రాజులకు అందరికీ మంగళస్నానాలు చేయించాడు. మణిభూషణాలూ, మాల్య వస్త్ర గంధాలనూ బహుకరించాడు. సుష్ఠుగా భోజన తాంబూలాదులు పెట్టించాడు. వారిని సంతృప్తులను చేసాడు. రథాలు గుఱ్ఱాలు గజాలు ఎక్కింపించి, వారి వారి రాజ్యాలకు పంపించాడు. తమ భార్యా పుత్రులు మిత్రులు మున్నగువారు సంతోషించగా నిర్మలహృదయులై పద్మాక్షుడు శ్రీకృష్ణుడి సద్గుణాలను సంకీర్తిస్తూ, రాజులు అందరూ న్యాయశీలురై శ్రీకృష్ణుడు ప్రబోధించిన ధర్మమార్గాన్ని తప్పక తమ తమ రాజ్యాలను వైభవంగా పరిపాలించుకుంటూ సుఖంగా ఉన్నారు. అలా శ్రీకృష్ణుడు జరాసంధ సంహారం, రాజులందరినీ విడిపించుట నిర్వహించాడు. భీముడు అర్జునుడు తాను జరాసంధుడి కుమారుడు సహదేవుడు చేసిన పూజలను స్వీకరించారు. పిమ్మట, బయలుదేరి భీమార్జున సమేతుడై ఇంద్రప్రస్థపురం చేరాడు. పుర ముఖద్వారంలో వారు విజయశంఖాలు పూరించారు. శత్రు భీకరములు, బంధు ప్రీతికరములు అయిన ఆ విజయసూచకాలైన ఆ శంఖధ్వనులను విని, పౌరులందరూ జరాసంధుడు మరణించాడని గ్రహించి సంతోషించారు. శ్రీకృష్ణుడు భీమార్జున సహితంగా ధర్మరాజును దర్శించి తాము మగధకు వెళ్ళిన వృత్తాంతం అక్కడ జరిగిన జరాసంధ సంహారాది సర్వం వివరించారు.









Bhagavad gita_adhyatmikam1

 భగవద్గీత

అధ్యాయం 12

శ్లోకం 11

అథైతదప్యశక్తోసి కర్తుం మద్యోగమాశ్రితః |

సర్వకర్మఫలత్యాగం తతః కురు యతాత్మవాన్ ||

అర్ధం :-

మత్ర్పాప్తికై కోసం యోగమునాశ్రయించి సాధన చేయటానికి నీవు అసక్తుడవైతే, మనోనుద్ధీంద్రియాలను వశమునందు ఉంచుకొని, సకల కర్మఫలాలను త్యజించు.




ధర్మరాజు రాజసూయ యాగం


శ్రీకృష్ణుడు తన భార్యాపుత్రులతో బంధుమిత్రులతో కలసి ఇంద్రప్రస్థనగరానికి బయలుదేరాడు. ఇలా ప్రయాణిస్తూ శ్రీకృష్ణుడు సౌవీరాది దేశాలను అతిక్రమించి; ఇందుమతీనదిని దర్శించి; దృషద్వతీ, సరస్వతీ నదులను, పాంచాల, మత్స్య దేశాలను గడచి; ఇంద్రప్రస్థ నగరం చేరి, ఆ పట్టణం దగ్గరగా ఉన్న ఉపవనంలో విడిది చేసాడు. శ్రీకృష్ణుడు వచ్చాడు అని తెలుసుకున్న ధర్మరాజు అంతులేని సంతోషంతో సోదరులు, బంధువులు, గురువులు, మంత్రులు, పురోహితులు, సేవకులు మఱియు గజ, అశ్వ, రథ, భటాది చతురంగబలాల సమేతంగా బయలుదేరాడు. శ్రీకృష్ణుడిని దర్శించుకొని సకల మర్యాదలతో ఇంధ్రప్రస్థానికి తీసుకువచ్చారు. శ్రీకృష్ణుడు అంతఃపురం ప్రవేశించాడు. కుంతిభోజమహారాజు పుత్రిక, శ్రీకృష్ణుని మేనత్త అయిన కుంతీదేవి కృష్ణుడిని చూసి వచ్చి కౌగలించుకుంది. కృష్ణుడు ఆమెకు వందనం చేసాడు. ద్రౌపది పాంచాల రాకుమారి శ్రీకృష్ణుడికి నమస్కారం చేసి, కుంతీదేవి ఆజ్ఞ ప్రకారం కృష్ణుడి భార్యలైన రుక్మిణి మున్నగువారికి గంధాక్షతలూ, పువ్వులూ, తాంబూలాలూ, పట్టుచీరలూ, మణిభూషణాలు ఇచ్చి గౌరవించింది. ధర్మరాజు శ్రీకృష్ణుడికీ, ఆయన అంతఃపుర కాంతలకూ, పరివారానికీ అందరికీ వారి వారి యోగ్యతలకు అనుకూలమైన స్థలాలలో విడుదులు ఏర్పాటు చేయించి, సకల నవ్య సౌకర్యాలూ సమకూర్చాడు. శ్రీకృష్ణుడు కూడ ధర్మరాజు ఏర్పాటు చేసిన సముచిత మర్యాదలకు సంతోషించి, అర్జునుడితో కలసి సరసవినోదవిహార కార్యక్రమాలతో కొన్నినెలలు సుఖంగా అక్కడ ఉన్నాడు. ఒకరోజు తన సభాభవనంలో ఉండగా నిండుకొలువులో సింహాసనంపై ధర్మరాజు కూర్చుని శ్రీకృష్ణుడితో ఇలా అన్నాడు. కృష్ణా! రాజసూయయాగం చేయాలని నా మనసు ఉవ్విళ్ళూరుతోంది. దానిని నిర్వహించడానికి నీవు తప్ప నాకు వేరే ఆత్మబంధువులు ఎవరున్నారు? అని అన్నారు. అందుకు శ్రీకృష్ణుడు ధర్మరాజుతో ధర్మరాజా! రాజనీతి విశారదుడవు నీ ఆలోచన సమంజసంగా ఉంది. ఈ రాజసూయ ప్రక్రియ మునులకు, దేవతలకు, పితృదేవతలకు అభీష్టమైనది. అది సమస్త శత్రు క్షయాన్ని, సకల బంధువు ప్రియాన్ని, సమధికమైన పుణ్యాన్ని, శాశ్వతమైన కీర్తిని, విజయాన్ని, సిద్ధింప చేస్తుంది. కాబట్టి శీఘ్రమే ఈ యాగాన్ని ప్రారంభించు. నీ తమ్ముళ్ళు దివ్యమైన ఎదురులేని అస్త్రవిద్యా విశారదులు; యుద్ధభూమిలో ఎదిరించిన శత్రురాజులను సంహరించడంలో చక్కని సామర్థ్యం కలవారు. శత్రురాజులను జయించు; శాశ్వతమైన యశస్సుతో ప్రకాశించు; సమస్త భూమండలంలో నీ శాసనం చెల్లేలాగ స్థిరంగా స్థాపించు. నీవు ఏ కార్యం చెప్తే దానిని చేయటానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇక నిన్ను వేలెత్తి చూపడానికి ఈ లోకంలో రాజులు ఎవ్వరికీ సాధ్యం కాదు. నీకు సాధ్యం కాని కార్యం లేదు. బహు గొప్పదైన ఈ రాజసూయ యాగానికి అవసరమైన సామగ్రిని సమకూర్చు. శత్రువులు అందరినీ జయించడానికి నీ సహోదరులను పంపించు.” ఈవిధంగా పలికిన శ్రీకృష్ణుడి మాటలు వినిన ధర్మజుడు ఎంతో సంతోషించి, శ్రీకృష్ణుడికి నమస్కరించాడు. మహాపరాక్రమవంతులైన తన సహోదరులతో ఉత్సాహంగా ఇలా అన్నాడు. “సహదేవా! నీవు సృంజయ రాజులూ, చతురంగబలాలూ నిన్ను కొలుస్తూ వస్తారు. వారిని తీసుకు వెళ్ళి దక్షిణ దిక్కును జయించి రా” అని సహదేవుడిని ఆజ్ఞాపించాడు. నకులా!నీవు పడమటిదిక్కును జయించి రా అని నకులుడిని పంపించాడు. అర్జునుడిని ఉత్తర దిక్కునా ఉన్న రాజులను జయించి రమ్మని అర్జునుడిని పంపారు. తూర్పుదిక్కును జయించడానికి గొప్ప శౌర్యవంతు లైన మత్స్య, కేకయ, మద్ర రాజులతో కలిసి శత్రు రాజులను జయించటానికి భీముడిని వెళ్ళమని ధర్మరాజు పంపించాడు. ఇలా ధర్మరాజు పంపించగా వెళ్ళిన భీమార్జున నకుల సహదేవులు మహాపరాక్రమవంతు లయిన ఆయా దిక్కులలోని రాజులను ఓడించి; వారిచేత కప్పాలు కట్టించుకుని; బంగారం, మణులు, గుఱ్ఱాలు మొదలైన వస్తు సమూహాన్ని తీసుకుని వచ్చి ధర్మరాజునకు నమస్కారం చేసి అర్పించారు. తాము వెళ్ళివచ్చిన విధానములూ రణరంగంలో రాజులను జయించిన వివరాలూ అన్నగారికి వివరించారు. అందులో జరాసంధుడు మాత్రం కప్పం కట్టలేదని అర్జునుడు ధర్మరాజుకు చెప్పారు.





Bhagavad gita_adhyatmikam1

 భగవద్గీత

అధ్యాయం 12

శ్లోకం 10

అభ్యాసేప్యసమర్థోసి మత్కర్మపరమో భవ|

మదర్థమపి కర్మణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి ||

అర్ధం :-

 అభ్యాసం చే  యటానికి ఆసక్తుడవైతే మత్పరాయణుడవై కర్మలను ఆచరించు. ఈ విధంగా నా నిమిత్తమై కర్మలను ఆచరించటం ద్వారా కూడా నన్నే పొందుతావు.



తమని రక్షించమని శ్రీకృష్ణుడిని వేడుకున్న ఇరవైవేలమంది రాజులు


ఒకరోజు ఒక కొత్త బ్రాహ్మణుడు  వచ్చి సభామధ్యంలో కొలువుతీరి ఉన్న శ్రీకృష్ణుడిని దర్శించాడు. నమస్కారం చేసి, వినయంగా చేతులు జోడించి ఇలా అన్నాడు. “రాజీవలోచనా! రాక్షససంహారా! యోగీశ్వర హృదయ రంజనా! తేజోనిధీ! దివ్యమంగళ విగ్రహా! శ్రీకృష్ణా! అనుగ్రహించు. దయచేసి నా విన్నపములు విను. అతి బలవంతుడైన జరాసంధుడు తనకు లోబడి ఉండని రాజులను అందరినీ వెదకి వెదకి తెప్పించి మరీ తన రాజధాని గిరివ్రజపురంలో కారాగారాలలో బంధించాడు. అలా ఇప్పటికి ఇరవైవేల మంది వరకూ రాజులు బంధీలుగా ఉన్నారు. ఓ పురుషోత్తమా! నేను ఇప్పుడు వారు పంపించగా వచ్చాను. వారి విన్నపాలు నీ కిప్పుడు మనవి చేస్తున్నాను. ఆపైన మీ దయ వారి అదృష్టం.” ఓ పుణ్యాత్మా! ఆర్తులము అయిన మమ్ముల్ని కటాక్షించి రక్షించు. నీవు భక్తుల భయాన్ని పోగొట్టేవాడవు. నిన్ను మనసులో ధ్యానించి, నీకు నమస్కారం చేస్తున్నాము. నీ పాదాలే మాకు దిక్కు. బలవంతులైన దుర్మార్గులను శిక్షించటానికీ; బలహీనులైన సన్మార్గులను రక్షించటానికీ; నీవు ప్రతీ యుగంలోనూ భూమిమీద అవతరిస్తూ ఉంటావు కదా. ఓ కృష్ణా! ఈ లోకంలో నీకు తెలియని విషయం ఏమీ లేదు. మమ్మల్ని కాపాడు. శరణు వేడుకుంటున్న మమ్మల్ని కటాక్షించి మా ఈ నిర్బంధాన్ని తొలగించు. ఆ జరాసంధుడు నీ భుజపరాక్రమాన్ని ఎదిరించ లేక రాజులంతా నవ్వుతుండగా పదునెనిమిదిసార్లు యుద్ధరంగం నుండి పారిపోయాడు కదా. అయినా, వాడు తాను పడిన కష్టాలను గుర్తుపెట్టుకోకుండా మీడిసి పడుతున్నాడు. వాడిని శిక్షించి చెరసాలలో మ్రగ్గుతున్న మమల్ని విడిపించు. మా భార్యాపుత్రులను కలుసుకొనేలా అనుగ్రహించి, మరో దిక్కులేని మమ్మల్ని కాపాడు” అని ఆ రాజులందరూ నీకు విన్నవించమన్నారు” అని బ్రాహ్మణుడు మనవి చేస్తున్న సమయంలో నరద మహర్షి అక్కడకి వచ్చారు. శ్రీకృష్ణుడు తకిన సభలోని వారు అందరు నరదమహర్షిని సాధారంగా ఆహ్వానించారు. అప్పుడు శ్రీకృష్ణుడు నారద మహర్షితో నారదా! ఎక్కడనుండి ఇక్కడికి వచ్చారు. సకల లోకాలలోనూ సంచరించే మీకు తెలియని విషయము ఏదీ ఉండదు. మిమ్మల్ని ఒక సంగతి అడగాలి. పాండవులు ఇప్పుడు ఎక్కడ ఎలా ఉన్నారో తెల్పండి” అని శ్రీకృష్ణుడు అడిగాడు. ప్రపంచంలో నీకు తెలియని విషయం లేదు కదా స్వామి.” “ఓ కృష్ణమహాప్రభు! కమలాక్షా! నీకు తెలియనిది ఏమీ లేకపోయినా, ఒక విషయం విన్నవిస్తాను, విను. ధర్మరాజు బ్రహ్మలోకమును ఆశించి రాజసూయయాగం చేయబోతున్నాడు. ఆత్మబంధుడవూ అయిన నీ సేవ చాలదా సమస్త సౌభాగ్యాలు పొందటానికి. అయినా అతడు యజ్ఞంచేయాలని అనుకోవడం లోకాచారాన్ని అనుకరించం కోసమే తప్ప మరొకటి కాదు. ధర్మజుడు చేయబోయే యజ్ఞాన్ని రక్షించడానికి నీవు రావలసి ఉంది అని అన్న నారద మహర్షి మాటలకూ శ్రీకృష్ణుడు సంతోషించి చిరునవ్వుతో ఉద్ధవుడితో ఇలా అన్నాడు. ఉద్ధవా! పెద్దల సమ్మతించే సరళిలో ఆలోచించి ప్రస్తుత కర్తవ్యం ఏమిటో బాగా అర్థం అయ్యేలా వివరించు. ఇలా సర్వజ్ఞుడైన కృష్ణుడు అమాయకుడిలా ఉద్ధవుడిని ప్రశ్నించాడు. అందుకు ఉద్ధవుడు ఎంతో సంతోషించి, శ్రీకృష్ణుడి పాదాలను మనసులో ధ్యానించుకుని ఇలా అన్నాడు. “దేవా! పెద్దలు సమ్మతించేలా నాకు తెలిసిన విధానం వివరిస్తాను. వినండి నారద మహర్షి చెప్పినట్లుగా మీ భక్తుడైన ధర్మరాజు చేయబోయే యజ్ఞాన్ని రక్షించడం మీ కర్తవ్యం. సమస్త దిక్కులనూ జయించడానికి మూలమైన రాజసూయయాగ సందర్భంలో జరాసంధుణ్ణి సంహరించటం. వాడిచేత బంధించబడ్డ రాజులను చెరనుండి విముక్తులను చేయడం కూడా సిద్ధిస్తుంది. అంతేకాకుండా, పదివేల ఏనుగుల బలం కలవాడూ నూరు అక్షౌహిణుల సైన్యంకలిగిన జరాసంధుణ్ణి చంపడానికి మన భీమసేనుడు తప్ప మరింకెవరూ సమర్థులు కారు. బ్రాహ్మణులు ఏమికోరినా జరాసంధుడు కాదనకుండా ఇస్తాడు. కాబట్టి, కపట బ్రాహ్మణవేషాలతో వెళ్ళి ఆజరాసంధుణ్ణి యుద్ధభిక్ష యాచించి మన భీమసేనుడి ద్వారా వాడిని సంహరించడం జరిగితే సకల ప్రయోజనాలను సాధించినట్లు అవుతుంది.” ఇలా పలికిన ఉద్ధవుడి మాటలు విని నారదుడూ యాదవులూ అందరూ పొగిడారు. అప్పుడు శ్రీకృష్ణుడు ఉద్దవుడితో నీ ఉపాయం బాగుంది. అలాగే చేదాము అని అన్నారు. శ్రీకృష్ణుడు ఆ బ్రాహ్మణుడిని సత్కరించి అతనికి గోవులను సంపదలను దానంగా ఇచ్చి నేను అభయం ఇస్తున్నాను. జరసంధుడి చేరలో ఉన్న ఆ రాజులందరిని విడిపిస్తాను. వారిని భయపడవద్దు అని చేపి ఆ బ్రాహ్మణుడిని పంపించారు. ఆ బ్రాహ్మణుడు సంతోషంతో శ్రీకృష్ణుడిని ఒకసారి దర్శించుకున్నా చాలు ఇంకా జీవితంలో ఎలాంటి భయం లేకుండా బ్రతకగలిగే సంపదలు ఇచ్చారు. అని సంతోషంగా వేళారు. శ్రీకృష్ణుడు కూడా ధర్మరాజు దగ్గరకి బయలుదేరాటానికి సిద్ధం అయ్యారు.

Bhagavad gita_adhyatmikam1

  భగవద్గీత

అధ్యాయం 12

శ్లోకం 9

అథ చిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరమ్ |

అభ్యాసయోగేన తతో మనిచ్ఛాప్తుం ధనంజయ||

అర్ధం :-

మనస్సును సుస్థిరముగా నాయందె నిల్పుటకు సమర్థుడవు కానిచో, అర్జునా! అభ్యాసయోగము ధ్వారా నన్ను పొందుటకు ప్రయత్నించు.




ద్వారకాలో సర్వం శ్రీకృష్ణుడిని దర్శించిన నారద మహర్షి


శ్రీకృష్ణుడు నరకాసురుడిని చంపి, అతని మందిరంలో ఉన్న పదహారువేల మంది అందగత్తెలనూ వరించి, ఒకేమారు అందరికీ అన్ని రూపాలతో కనపడుతూ వివాహం చేసుకున్నాడు అనే వార్త నారదుడు విన్నాడు. ఒకనాడు ఆ కృష్ణవైభవం దర్శించాలనే కోరికతో ద్వారకకు వచ్చాడు. అప్పుడు విశ్వకర్మ చేత నిర్మించబడ్డ అంతఃపురంలోని పదహారువేల సౌధాలలోనూ శ్రీకృష్ణుడిని దర్శించాడు. బంగారు సింహాసనంమీద కొలువుతీరి కూర్చున్న పద్మాక్షుడు శ్రీకృష్ణుడిని ఆ మహర్షి తిలకించాడు. తన వద్దకు వస్తున్న నారదమునిని చూసి శ్రీకృష్ణుడు ఎదురు వచ్చాడు. నరద మహర్షిని ఆహ్వానించి అతిధి మర్యాదలు చేసి తన సింహాసనం పై కూర్చోపెట్టాడు. “ఓ తాపసోత్తమా! మీరు ఏ పని చేయమని ఆజ్ఞాపిస్తే ఆ పని చేస్తాను. సెలవీయండి.” ఇలా పలికిన కృష్ణుడితో నారదుడు ఇలా అన్నాడు. “ఓ దామోదరా! నీ అవతార లక్ష్యం దుర్మార్గులను శిక్షించడానికే కదా! నీవు సమస్తలోకాలకూ ప్రభుడవు; దయా పూరిత మానసుడవు; ప్రపంచాన్ని రక్షించేవాడవు; ఆర్తులకు బాంధవుడవు; అయిన నీవు ఏ పని అయినా చేస్తానని చెప్పడం ఆశ్చర్యం కాదు. బ్రహ్మ, శివుడు మొదలైన దేవతల చేత పూజింపబడే ఓ కృష్ణా! సంసారసాగరాన్ని దాటడానికి సాధనము; మోక్షాన్ని ప్రసాదించేదీ; ఐన నీ పదధ్యానం నా ఆత్మలో నిలిచి ఉండేలా అనుగ్రహించు.” ఆ విధంగా ప్రార్థించి నారదుడు శ్రీకృష్ణుడి అనుగ్రహం పొందాడు. ఆ మందిరం నుంచి బయటకు వచ్చిన ఆ దేవర్షి నారాదుడు వాసుదేవుడి యోగమాయా ప్రభావం తెలుసుకోవాలి అనుకున్నాడు. వేరొక భవనానికి వెళ్ళాడు. అక్కడ ఉద్ధవునితో కలసి పాచికలు ఆడుతున్న శ్రీకృష్ణుడిని చూసి ఆశ్చర్యపోయాడు. అక్కడ కృష్ణుడిచేత పూజించబడి ఆ భవనం నుండి బయటకు వెళ్ళాడు. నారదుడు ఇంకొక భవనానికి వేళారు అక్కడ శ్రీకృష్ణుడు రుక్మిణి దేవితో మాట్లాడుతూ కనిపించాడు. నారదముని వేరొక పద్మాక్షి భవనానికి వెళ్ళి అక్కడ ఉన్న కృష్ణుడిని దర్శించాడు. ఈవిధంగా వాసుదేవుని కనుగొంటూ వెళుతూ ఉన్న నారదుడిని కృష్ణుడు ఒక ఇంటిలో గౌరవించి “నారద మునీంద్రా! ఏ కోరికలూ లేని మిమ్ములను కోరికలు కల మేము ఏవిధంగా సంతృప్తి పరచగలం మీ దర్శనంతో సమస్త శుభాలనూ పొందుతాము.” అని ప్రీతి పూర్వకంగా పలికాడు. కృష్ణుడి మాటలకు మన స్ఫూర్తిగా సంతోషించి చిరునవ్వు నవ్వుతూ నారదుడు ముందుకు సాగిపోయాడు. నారదుడు ఒక స్త్రీరత్నం ఇంటిలో జలకేళి ఆడుతూ ఆనందిస్తున్న ముకుందుడిని చూసాడు. నారదుడు మరొక  ఇంటిలో యోగనిష్ఠలో ఉన్న శ్రీకృష్ణుడిని దర్శించాడు. ఒక ఇంటిలో సంధ్యావందనం చేస్తూ ఉన్న శ్రీకృష్ణుడిని ; మరొక గృహంలో పురాణశ్రవణం చేస్తూ ఉన్న శ్రీకృష్ణుడిని ; ఒక చోట పంచయజ్ఞాలు ఆచరిస్తున్నా శ్రీకృష్ణుడిని మరొక తావున యోగసమాధి నిమగ్నమై ఉన్న శ్రీకృష్ణుడిని ; ఒక స్థలంలో స్నానానికి సిద్ధమవుతూ ఉన్న శ్రీకృష్ణుడిని; ఇంకొక చోట ప్రశస్త భూషణాలతో ప్రకాశిస్తున్న శ్రీకృష్ణుడిని; మరొక ప్రదేశంలో గోదానం చేయాలని కుతూహలపడుతూ ఉన్న శ్రీకృష్ణుడిని; ఇంకొక ప్రదేశంలో తన కుమారులతో ఆడుకుంటున్న శ్రీకృష్ణుడిని ; ఒకచోట సంగీతం మీద ఆసక్తిని చూపుతున్న శ్రీకృష్ణుడిని; మరొక చోట జలకేళి ఆడుతున్నా శ్రీకృష్ణుడిని; ఇంకొక చోట మంచం మీద కుర్చున్న శ్రీకృష్ణుడిని; మరొకచోట బలరాముడి తో కలిసి ఉన్న శ్రీకృష్ణుడిని, యిలా పలుస్థలములలో పలుక్రియలలో నిమగ్నుడై యున్న శ్రీకృష్ణుడిని నారదమహర్షి సందర్శించాడు. శ్రీకృష్ణుడు తన ముద్దులసఖితో ఒక ఇంటిలో ముచ్చటలు ఆడుతున్నాడు; మరో ఇంటిలో మరొక ప్రియసఖితో సరసమాడుతున్నాడు; ఇంకో ఇంటిలో ఒక స్త్రీ రత్నం కోసం హారాలు గుచ్చుతున్నాడు; ఒక ఇంటిలో తన యువతితో కలిసి తాంబూలం సేవిస్తున్నాడు; ఒక ఇంటిలో నవ్వుతున్నాడు; ఒక ఇంటిలో పాడుతున్నాడు; ఒక ఇంటిలో సుఖగోష్టి చేస్తున్నాడు; ఒక ఇంటిలో ఆనందిస్తున్నాడు; ఈ మాదిరి అనేక రూపాలతో కనపడుతూ ఉన్న శ్రీకృష్ణభగవానుడిని దర్శిస్తూ నారదుడు ముందుకు సాగిపోయాడు. మరో మందిరంలో  కృష్ణుడిని కొడుకులూ, మనుమళ్ళూ, కూతుళ్ళూ, భార్యలు మున్నగు వారితో కలసి సామాన్య గృహస్థు వలె ఉండగా దర్శించాడు. మహాపురుషుడైన శ్రీకృష్ణుడు పదహారువేల స్త్రీల నివాసాలలోనూ ఏ స్త్రీ ఇంటిని వదిలిపెట్టకుండా, ప్రతి ఇంట తన మాయా ప్రభావంతో తానే ఉంటూ; ఒక ఇంటిలో ఏనుగులపై గుఱ్ఱాలపై స్వారీచేస్తున్నాడు. ఒక ఇంటిలో భోజనం చేస్తున్నాడు. ఇంకొక ఇంటిలో నిద్రిస్తున్నాడు. ఇలా ఉన్న నిర్మలుడూ, కోరిన వరాలను అనుగ్రహించే వాడూ, బ్రాహ్మణ్యుడూ అయిన ఆ కృష్ణపరమాత్మను నారదుడు దర్శించాడు. అప్పుడు నారదుడు శ్రీకృష్ణునితో “నీ భక్తి అనే అమృతములోని తీయదనములో తేలియాడుతుండే పుణ్యాత్ములు మాత్రమే నీ తత్వాన్ని తెలుసుకోగలరు. అంతే తప్ప, ముల్లోకాలలో బ్రహ్మేంద్రాది దేవతలూ మహర్షులూ సహితంగా ఇతరులు నీ మాయను తెలుసుకోలేరు.” ఈవిధంగా పలికి నారదమహర్షి ఆనందంతో “ఇంక నేను సెలవు తీసుకుంటాను. లోకాలు అన్నింటినీ పవిత్రము చేసేది, సజ్జనులకు ఇష్టమైనదీ అయిన నీ నామసంకీర్తనం సమస్త లోకాలలోనూ ప్రకటిస్తాను” అని అన్నాడు. శ్రీమన్నారాయణుని నామస్మరణ చేసుకుంటూ అక్కడినుండి వెళిపోయాడు.










Bhagavad gita_adhyatmikam1

 భగవద్గీత

అధ్యాయం 12

శ్లోకం 8

మయ్యేవ మన ఆధత్స్వ మయి బుద్ధిం నివేశయ |

నివసిష్యసి మయ్యేవ అత ఊర్ద్వం నసంశయః||

అర్ధం :-

నాయందే మనస్సును నిలుపు. నా యందే బుద్ధిని లగ్నం చెయ్యి. తరువాత నా యందే స్థిరముగా ఉండును. ఇందులో ఏ మాత్రం సందేహం అవసరం లేదు.

 


కాశీనగరాన్ని ధ్వంసం చేసిన శ్రీకృష్ణుడి చక్రాయుధం



ఇక అక్కడ కాశీపట్టణంలో ఆ రాజమందిరంలో, కుండల సహితమైన శిరస్సు పడగానే పురజనులు అందరూ అది తమ రాజు శిరస్సుగా గుర్తించారు. ఆ రాజు భార్యలు, పుత్రులు, మిత్రులు, బంధువులు హాహాకారాలు చేస్తూ దుఃఖించారు. కాశీరాజు కుమారుడు సుదక్షిణుడు తండ్రికి ఉత్తర క్రియలు నిర్వర్తించాడు. తన తండ్రిని యుద్ధంలో సంహరించిన శ్రీకృష్ణుడిని సంహరించడానికి ఉపాయం ఆలోచించాడు. చతురుడైన పురోహితుడిని పిలిపించి నువ్వు నీవూ ఋత్విజులూ బ్రాహ్మణశ్రేష్ఠులూ కలిసి ప్రీతితో అభిచారహోమం చేయి, భూతములతో కూడి, అగ్నిదేవుడు మనల్ని అనిగ్రహిస్తాడు అని అన్నాడు. కొంత కాలం తరువాత సుదక్షిణుడు గొప్పనియమాలతో అభిచార హోమం చేసాడు. అగ్నిదేవుడు కుడి వైపుగా తిరుగుతూ జ్వలించే జ్వాలలతో వెలిగాడు. ఆ అభిచారహోమ గుండంలోని అగ్నిజ్వాలల నుండి ఎఱ్ఱని జుట్టూ; పిడుగుల వంటి కోరలూ; నిప్పులు గ్రక్కే చూపులూ; ముడిపడిన కనుబొమలూ; జేవురించిన ముఖము; కలిగిన “కృత్య” అతిభయంకర ఆకారంతో వెలువడింది. ఆ కృత్య మృత్యుదేవత కరవాలంలా కనిపిస్తున్న నాలుకతో పెదవి మూలలు తడవుకుంటూ, అగ్నిజ్వాలవంటి శూలాన్ని చేతబట్టి, లోకం దద్దరిల్లేలా బొబ్బలు పెడుతూ, నింగినిండా దుమ్ము వ్యాపించేలా తాటిచెట్ల వంటి పాదాలతో అడుగులు వేస్తూ, భూతాలు సేవిస్తుండగా, కళ్ళ నుంచి రాలే నిప్పులతో దిక్కులను కాల్చివేస్తూ, అతివేగంగా శ్రీకృష్ణుని ద్వారకా నగరానికి దిగంబరంగా వచ్చింది. ద్వారకానగరవాసులు అంతా కృత్యను చూచి దావానలాన్ని చూసి పారిపోయే అడవిజంతువుల లాగా పారిపోయి “కాపాడు కాపాడు” అని అరుస్తూ, సుధర్మా సభామండపంలో జూదమాడుతున్న దామోదరుడు, శ్రీకృష్ణుడిని చేరారు. “మన పట్టణాన్ని దహించడానికి ప్రళయకాలాగ్ని వచ్చింది. మమ్మల్ని రక్షించు” అని ప్రార్థించారు. వారికి “భయపడకండి” అని చెప్పి, పుండరీకముల వంటి కన్నులున్న వాడు, విశ్వము అంతటిలోనూ ఆత్మరూపంలో వ్యాపించి ఉండేవాడు, సర్వరక్షకుడు, అయిన శ్రీకృష్ణుడు జరిగిన సంగతంతా దివ్యదృష్టితో తెలిసికొని, కాశీ రాకుమారుడు పంపించిన కృత్యను సంహరించాలని భావించి తన చక్రాయుధాన్ని విడిచి పెట్టారు. ఆ చక్రాయుధం కృత్యను సమీపించింది. తనను చూసి తడబడకుండా కంటగిస్తున్న కృత్యను గెంటివేసి, వెంటబడింది. అప్పుడు, కృత్య తన పూర్వపు రౌద్రరూపాన్ని వదలి తిరిగి కాశీపురం వచ్చింది. తిరిగి వచ్చిన కృత్యను చూసి పౌరులంతా భయపడి భయపడుతుండగా, ఆ కృత్య రోషభీషణమైన ఆకారంతో ఋత్విజులతోపాటు సుదక్షిణుని దహించి వేసింది. అప్పుడు, శ్రీకృష్ణుడి చక్రాయుధం ఆ వచ్చిన వేగంతో కృత్యను సంహారించింది. దానిని సంహారించే సమయంలో కాశీ నగర సౌధ, గోపుర, ప్రాకారాలతోపాటు ఆ నగరాన్ని భస్మీపటలం చేసింది. దేవతలంతా ఆశ్చర్యపడేలా శ్రీకృష్ణుడి వద్దకు తిరిగి వచ్చి చేరి, తన నిజప్రభావంతో ప్రకాశిస్తూ ఉంది.

పౌండ్రిక వాసుదేవ వధ

Bhagavad gita_adhyatmikam1

 భగవద్గీత

అధ్యాయం 12

శ్లోకం 7

తేషామహం సముద్ధర్తా మృత్యుసంసారసాగరాత్ |

భవామి నచిరాత్ పార్థ మయ్యావేశితచేతసామ్||

అర్ధం :-

ఓ అర్జునా!నా యందే లగ్నమనస్కులైన అట్టి పరమభక్తులని నేను శీగ్రముగనే మృత్యురూపసంసారసాగరమునుండి ఉద్ధారిస్తారు.




పౌంద్రిక వాసుదేవ వధ

 


భూలోకంలో వాసుదేవుడు అనే పేరు నాకు ఒక్కడికే చెల్లుతుంది. ఇతరులకు ఏమాత్రం చెల్లదు. కృష్ణుడు పొగరెక్కి వాసుదేవుడనని అనుకుంటున్నాడుట. పోయి వద్దని చెప్పు” అని బలగర్వంతో మదోన్మత్తుడై,   శ్రీకృష్ణుడి దగ్గరకు పౌండ్రకుడు ఆ దూతను పంపించాడు. వాడు వెళ్ళి శ్రీకృష్ణుడు సభతీర్చి ఉండగా సంకోచం లేకుండా ఇలా అన్నాడు “ఓ శ్రీకృష్ణా! మా రాజు చెప్పిన మాటలు విను. ‘భూమిని రక్షించడానికి వాసుదేవుడనే పేరు నాకుండగా, నీవు సిగ్గు విడిచి ఆ పేరు పెట్టుకున్నావు. నా పేరూ, నా చిహ్నాలూ ధరించి సంచరిస్తున్నావు. ఇది నీ పంతమా? ఐనా గోవులకాచుకునే గోపాలుడికి పంతమేమిటి? నీ శక్తి ఎదుటివారిశక్తి ఇక నుంచి అయినా తెలుసుకుని, నా చిహ్నాలు అన్నింటినీ వదలిపెట్టి నాకు సేవకుడవై బ్రతుకు. కాదు పంతానికి పోతాను అంటావా. యుద్ధానికి సిద్ధపడు.” ఇలా పలికిన దూత దుర్భాషలను సభ్యులంతా విని ఒకరి ముఖం మరొకరు చూచుకుంటూ ఆశ్చర్యపోయారు. “ఈవేళ ఎంత విచిత్రపు మాటలు విన్నాము.” అని అనుకున్నారు. అప్పుడు శ్రీకృష్ణుడు ప్రౌండ్రకుడి దూతతో ఇలా అన్నాడు.“ఓరీ! సరిగా విను. మీ రాజు ఏ చిహ్నాలను ధరించాను అని నన్ను గురించి చెప్పాడో; అవే చిహ్నాలను రేపు బయలుదేరి వచ్చి తొందరలోనే ఘోరయుద్ధంలో అతని మీద ప్రయోగిస్తాను. యుద్ధంలో శక్తి కోల్పోయి మరణిస్తావు అని మేము చెప్పినట్లుగా అతనికి చెప్పు.” అని వ ఉద్రేకంగా పలికిన శ్రీకృష్ణుడి పలుకులకు వాడు ఉలికిపడి గుండెజారిపోయి, తన ప్రభువు దగ్గరకు వెళ్ళి, జరిగిన దంతా అతని మనస్సుకు ఆందోళన కలిగేలా విన్నవించాడు. ఆ తరువాత, దారుకుడు అనేక రకాల ఆయుధాలు కలది; బంగారుజెండాతో విలసిల్లుతున్నది; వేగవంతాలైన గుఱ్ఱాలు కట్టినది అయిన రథం సిద్ధంచేసి తీసుకువచ్చాడు. శ్రీకృష్ణుడు పౌండ్రకుడి మీదకు దండయాత్రకు ఉత్సహించి దారుకుడు తెచ్చిన ఆ రథాన్ని అధిరోహించి కాశీనగరానికి వెళ్ళాడు. పౌండ్రకుడు కూడా మిక్కిలి రణోత్సాహంతో రెండు అక్షౌహిణుల సైన్యంతో పట్టణం బయటకు వచ్చాడు. అతని స్నేహితుడైన కాశీరాజు కూడ మూడు అక్షౌహిణుల సైన్యంతో పౌండ్రకునికి సహాయంగా వచ్చాడు. ఈ విధంగా మిత్రసహితుడై యుద్ధరంగానికి వస్తున్న పౌండ్రకుడిని శ్రీకృష్ణుడు చూసాడు. పౌండ్రకుడు శంఖం, చక్రం, గద, కత్తి మొదలైన ఆయుధాలను ధరించాడు. కృత్రిమమైన కౌస్తుభమణి వక్షాన తగిలించుకున్నాడు. మకరకుండలాలు, హారాలు, కంకణాలు ధరించాడు. కంఠంలో వనమాల వేసుకున్నాడు. గరుడకేతనాన్ని చేకూర్చుకున్నాడు. పీతాంబరాన్ని కట్టాడు. వడిగల గుఱ్ఱాలతో గూడిన బంగారురథాన్ని అధిరోహించాడు. కాంతివంతమైన కిరీటాన్ని తలపై అలంకరించుకుని యుద్ధానికి సిద్ధపడుతున్నాడు. ఇలా తన వేషాన్ని ధరించిన పౌండ్రకుని చూసి రంగస్థల నటునిగా భావించి శ్రీకృష్ణుడు పకపకా నవ్వాడు. ఆ పరిహాసానికి పౌండ్రకుడు మండిపడ్డాడు. పరిఘ, విల్లు అమ్ములు, పట్టిసం, ముసలం, సమ్మెట, ఈటె, చక్రం, గద, చిల్లకోల, బాకు, శక్తి ఆయుధము, చురకత్తి, గొడ్డలి, శూలం మొదలైన ఆయుధాలను చేపట్టి శ్రీకృష్ణుడి మీద వేగంగా ప్రయోగించాడు.  దానితో, దానవాంతకుడు కృష్ణుడు భయంకర ప్రళయాగ్ని వలె విజృంభించి విరోధి ప్రయోగించిన ఆయుధాలు అన్నింటినీ తన బాణ సమూహంతో త్రుంచివేశాడు. శత్రుసైన్యాలకు సంచలనం కల్గించే తన పాంచజన్య శంఖాన్ని పూరించాడు. అమితమైన ఆగ్రహంతో సరోజనాభుడు శ్రీకృష్ణుడు, మారి మహామారి వ్యాపించి సంహరించినంత భీకరంగా, వారియొక్క సైన్యాలను నాశనం చేసాడు; రథాలు విరిగిపోయాయి; అశ్వాలు కూలాయి; ఏనుగులు వ్రాలాయి; కాల్బలం గడ్డి కరచింది; మరణించకుండా మిగిలిన సైన్యం పరాక్రమం చెడి పారిపోయాయి.ఆ సమయంలో తనపై కాలుద్రువ్వుతున్న పౌండ్రకుడిని చూసి శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు. ఓ రాజాధమా! పౌండ్రకా! ఈరోజు యుద్ధంలో పౌరుషం అంతా పటాపంచలు చేస్తాను. ఎద్దు క్రొవ్వెక్కి ఆబోతుపై రంకెవేసినట్లు, నా దగ్గరకు దూతను పంపి నన్ను ఆక్షేపించావు. నన్ను వదలివేయమనిన ఆ చక్రాది చిహ్నాలనే నీ మీద నిప్పులు చెలరేగేలా యుద్ధంలో ప్రయోగిస్తాను. అలా చేయలేకపోతే నిన్ను శరణువేడతానులే. నిజంగా నీవు కనుక బలపరాక్రమాలు గల వీరాధివీరుడవు అయితే యుద్ధరంగంలో నిలకడగా ఉండు.” అంటూనే శ్రీకృష్ణుడు వాడి బాణాలను సంధించి, అప్పుడు పట్టుదలతో బాణాలు వేసి, వాడి రథాన్ని కూల్చివేసి, వెంటవెంటనే సారథి తల తెగనరికి, గుఱ్ఱాలను సంహరించాడు. ఉద్దండ ప్రతాపంతో ప్రళయకాల సూర్యుడితో సమానమైన తన చక్రాయుధాన్ని ప్రయోగించి, పౌండ్రకుడి శిరస్సును ఖండించాడు. వజ్రాయుధము దెబ్బకి కూలిన పర్వతంలా పౌండ్రకుడు నేలకూలాడు. అటుపిమ్మట, కాశీరాజు శిరస్సును కూడా శ్రీకృష్ణుడు ఖండించి, ఆ శిరస్సును బంతిలాగ వరుస బాణాలతో పైపైకి ఎగురకొట్టి అతని పట్టణంలో పడేలా కొట్టాడు. ఈ విధంగా మురాంతకుడు శత్రువులను జయించి దేవ, గంధర్వ, సిద్ధ, సాధ్య, గరుడ, ఉరగ గణాలు వారందరూ స్తుతిస్తూ ఉండగా శ్రీకృష్ణుడు మిక్కిలి వైభవంతో తన నగరానికి తిరిగి వచ్చి సుఖంగా కాలం గడుపుతున్నాడు.పౌంద్రిక వాసుదేవుడు బ్రతికినంత శ్రీకృష్ణుడు రూపం ధరించి ద్వేషంతోనే నిరంతరం శ్రీకృష్ణుడిని స్మరించటం వలన మోక్షం పొందాడు.


రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...