శ్రీలలిత త్రిపుర సుందరి అమ్మవారి ఆవిర్భావము

శ్రీలలిత త్రిపుర సుందరి అమ్మవారి ఆవిర్భావము – నేపథ్యము



సహస్రనామ స్తోత్రములు చాలావరకు వ్యాసప్రోక్తములు. శ్రీలలితాసహస్రనామ స్తోత్రము మిగిలిన సహస్రనామస్తోత్రముల వంటిది కాదు. సాక్షాత్తుగా అమ్మవారే వశిన్యాది దేవతల చేత పలికించింది. అమ్మవారే ఫలశ్రుతిని కూడా చెప్పింది. ఒక పెద్ద దేవతాసభలో చెప్పిన లలితాసహస్రనామ స్తోత్రమును వ్యాసభగవానుడు బ్రహ్మాండపురాణములో మనకి అందించాడు.

లలితాసహస్రనామ స్తోత్రము ఆవిర్భావము వెనక చాలా పెద్ద నేపథ్యము ఉన్నది. తారకాసుర సంహారము జరగాలి అంటే పార్వతీ పరమేశ్వరులకు కుమారుడు జన్మించాలి. పార్వతీదేవియందు పరమశివుడు అనురక్తతను పొందడము కోసము మన్మధుడు తన పుష్పబాణములను విడిచి పెట్టాడు. కృద్ధుడైన శివుడు మూడవనేత్రము తెరిస్తే అందులోనుంచి వచ్చిన అగ్నిజ్వాలలో మన్మధుని శరీరము దగ్ధమై పెద్దభస్మరాశి కింద పడింది. మన్మధ బాణములు పడితే పార్వతీ పరమేశ్వరులకు అనురాగము కలుగుతుందని దేవతలు ఆశించారు. మన్మధదహనము జరిగింది. చిత్రకర్మ అనే ఆయన ఆప్రాంతమునకు వచ్చి తెల్లగా ఉన్న బూదికుప్పను చూసాడు. ఆయన కంటికి అందముగా కనపడింది. దానితో ఒక బొమ్మను చెయ్యాలనుకుని తయారు చేసాడు. దానికి ప్రాణప్రతిష్ఠ జరిగింది. అది పరమశివుడు రుద్రమూర్తయి తన మూడవకన్ను తెరిస్తే భస్మమైన మన్మధుని బూది. అందులోనుంచి తయారయిన వ్యక్తి వ్యగ్రతతో ఉన్నాడు. ఆ వ్యక్తిని చూసి బ్రహ్మగారు ‘భండ భండ’ అన్నారు. ఆయనతో పాటుగా విషంగుడు, విశుక్రుడు అని ఇద్దరు జన్మించారు. సోదరులతో భండుడు లోకములను బాధ పెట్టసాగాడు. ఈ లోకములో ఎవరైనా తన ఎదురుగా నిలబడిన వాళ్ళ బలములో సగము బలము ఆయనకు వచ్చేట్లుగా భండుడు రుద్రుని వలన వరము పొందాడు. రాక్షసులకు ఇటువంటి వాడే కావాలి. వారందరూ వచ్చి తమ నాయకునిగా మూర్ధాభిషిక్తుడిని చేసారు. వాళ్ళు ముగ్గురు రాక్షసులకు నాయకులు అయ్యారు. భండుడు ఈవిధముగా భండాసురుడు అయ్యాడు.

భండాసురునికి సమ్మోహిని, కుముదిని, చిత్రాంగి, సుందరి అని నలుగురు భార్యలు. విశుక్రుడు, విషంగుడు, భండాసురుడు ఒకచోట సమావేశమయ్యి మనము ఎలా జన్మించాము అన్నది పక్కన పెట్టి మనలను ఆశ్రయించిన వాళ్ళు, మనము, సుఖములు భోగములు అనుభవించడము చాలా బాగున్నది. మనలను నాయకులుగా అంగీకరించని యక్ష, గంధర్వ, కిన్నెర, కింపురుష దేవతలతో ప్రారంభించి మనుష్యజాతితో సహా ఎన్నో జాతులు లోకములో మనలను నాయకులుగా అంగీకరించడము లేదు. వీళ్ళు భోగములు అనుభవించడానికి వీలులేదని వాళ్ళు ఒక ఆలోచన చేసారు. సుఖములన్నిటికీ ఆలవాలము ఎక్కడ ఉన్నదో చూసి దానిని నిర్వీర్యము చేద్దాము. భండుడు స్వర్గమునకు, విశుక్రుడు భూలోకమునకు, విషంగుడు రసాతలమునకు సూక్ష్మశరీరముతో వెళ్ళి పురుషులకు పుంసత్వమును, స్త్రీలకు రసోత్పతనము రేతస్సు లేకుండా చేస్తే, స్త్రీపురుషుల మధ్య భోగేశ్చ ఉండదు. ప్రత్యుత్పత్తి లేక మనుష్య జాతులు తమంత తాము నశించిపోతాయి. కొన్నాళ్ళకు జంతులోకము నశించిపోతుంది, దేవతలు నశించిపోతారు. మనసుని సంతోషముగా ఉంచుకోవడమన్న ప్రశ్న లేనప్పుడు లలితకళలు నశించిపోయి ప్రతివారు నీరసపడిపోతారు. భోగేశ్చ కలిగిన రాక్షసులు తప్ప ఎవ్వరూ మిగలకూడదు. మనము మాత్రమే భోగము అనుభవించాలని చిత్రమైన ఆలోచన చేసారు. ఆ కోరిక ఎంతో దూరము వెళ్ళింది. ముగ్గురూ బయలు దేరి సమస్తలోకములలో అన్ని జాతులవారికి పుంసత్వము లేకుండా, స్త్రీలలో రసత్వము – రేతస్సు లేకుండా చేసారు.

మనుష్యులలో ఈశ్వరానుగ్రహము వలన పెరిగే వీర్య రేతస్సులే కాంతిగా, స్మృతిగా, ఉత్సాహముగా, ప్రాణశక్తిగా ద్యోతకము అవుతూ ఉంటాయి. అవి నశిస్తే సమస్తజీవకోటి నీరస పడిపోతుంది. ఎక్కడా యజ్ఞములు, యాగములు, హోమములు లేవు. ఎవరిని చూసినా దిగులుగా ఉంటున్నారు. చిరునవ్వులు, సంతోషములు లేవు. ముగ్గురు రాక్షసులు యుద్ధము చేయకుండా లోకములో కామప్రళయమును సృష్టించారు. ఇది లలితా సహస్రనామస్తోత్రమునకు ఆవిర్భావమునకు కారణము. ఎవరికీ ఎందుకు ఇలా ఉన్నామన్న ప్రశ్న వేసుకునే ఉత్సాహముకూడా లేదు. జాతులు నశించి పోవడము ప్రారంభమయింది. లోకమంతా రాక్షసగణములు పెరిగిపోతున్నాయి. ఎక్కడ చూసినా భండాసురుని నాయకత్వము వర్దిల్లుతున్నదని దేవతలు గుర్తించారు. తన సోదరులతో కలసి పైకి కనపడకుండా, మిగిలిన రాక్షసుల వలే యుద్ధము చెయ్యకుండా సూక్ష్మరూపముతో అన్ని లోకములలో ప్రవేశించి అన్ని జాతులవారి తేజస్సునీ పాడుచేస్తున్నాడు. ఈ పరిస్థితులలోనుంచి రక్షణ కల్పించే వారు ఎవరా అనుకుని దేవతలు అందరూ కలసి వైకుంఠమునకు వెళ్ళి స్థితికారుడైన శ్రీమహావిష్ణువుని ప్రార్థన చేసారు. ఆయన ఇదివరకు నేను అవతారములను స్వీకరించి మిమ్ములను కాపాడిన మాట యథార్థము. భండుడికి ఎదుటివారిలోని సగబలమును తీసుకునే వరము ఉన్నది. అతని ముందు ఎవ్వరూ పనికిరారు. బ్రహ్మాండమునకు అవతలున్నవారిని తీసుకుని వచ్చి భండాసురుని నిర్జింపచేయాలి. బ్రహ్మాండము బయటికి వెళ్ళి ఒక తల్లిని పిలవాలి ఆవిడ వచ్చి భండాసురుని నిర్జిస్తుందని చెప్పారు.

శ్రీ వారాహి అనుగ్రహాష్టకం

శ్రీ వారాహి అనుగ్రహాష్టకం



ఈశ్వర ఉవాచ

మాతర్జగద్రచన-నాటక-సూత్రధార

స్త్వద్రూపమాకలయితుం పరమార్థతోయమ్ ।

ఈశోప్యమీశ్వరపదం సముపైతి తాదృక్

కోన్యః స్తవం కిమివ తావకమాదధాతు ॥ 1॥


నామాని కిన్తు గృణతస్తవ లోకతుణ్డే

నాడమ్బరం స్పృశతి దణ్డధరస్య దణ్డః ।

యల్లేశలమ్బిత-భవామ్బునిధిర్యతో యత్

త్వన్నామసంసృతిరియం నను నః స్తుతిస్తే ॥ 2॥


త్వచ్చిన్తనాదర-సముల్లసదప్రమేయా

నన్దోదయాత్ సముదితః స్ఫుటరామహర్షః ।

మాతర్నమామి సుదినాని సదేత్యముం త్వా

మభ్యర్థయేర్థమితి పూరయతాద్ దయాలో ॥ 3॥

ఇన్ద్రేన్దుమౌలి విజి కేశవమౌలిరత్న

రోచిశ్చయోజ్జ్వలిత పాదసరోజయుగ్మే ।

చేతో మతౌ మమ సదా ప్రతివిమ్బితా త్వం

భూయా భవాని విదధాతు సదోరుహారే ॥ 4 ॥


లీలోద్ధృతక్షితితలస్య వరాహమూర్తే-

ర్వారాహమూర్తిరఖిలార్థకరీ త్వమేవ ।

ప్రాలేయరశ్మిసుకలోల్లసితావతంసా

త్వం దేవి వామతనుభాగహరా రహస్య ॥ 5॥


త్వామమ్బ తప్తకన కోజ్జ్వలకాన్తిమన్త-

ర్యే చిన్తయన్తి యువతీతనుమాగలాన్తామ్ ।

చక్రాయుధత్రినయనామ్బరపోతృవక్‍త్రాం

తేషాం పదామ్బుజయుగం ప్రణమన్తి దేవాః ॥ 6॥


త్వత్సేవనస్ఖలిత పాపచయస్య ఘాస-

ర్మోక్షోఽపి యత్ర న సతాం గణనానుఫైతి ।

దేవాసురోరగనృపాలనమస్య పాద-

స్తత్ర శ్రియః పటుగిరః కియషేవమస్తు ॥ 7॥


కిం దుష్కరం త్వయి మనోవిషయం గతాయాం

కిం దుర్లభం త్వయి విధానవదర్చితాయామ్ ।

కిం దుష్కరం త్వయి సకృత్స్మృతిమాగతాయాం

కిం దుర్జయం త్వయి కృతస్తుతివాదపుసామ్ ॥ 8॥


ఇతి శ్రీ వారాహే దేవీ అనుగ్రహాష్టకం సంపూర్ణం

శ్రీ శక్తీ పీఠం నవగ్రహ హోమం రెండొవ రోజు

భగవద్గీత

అద్యాయం 7

శ్లోకం 17

తేషాం జ్ఞానీ నిత్యయుక్త ఏకభక్తిర్విశిష్యతే |

ప్రియో హి జ్ఞానినోత్యర్థమ్ అహం స చ మమ ప్రియః ||

అర్థం :-

ఈ చతుర్విధభక్తులలో నిరంతరము నాయందే ఏకీభావస్థితుడై, అనన్య భక్తియుతుడైన జ్ఞాని అత్యుత్తముడు. ఏలనన, వాస్తవముగ నన్ను తెలిసికొనిన జ్ఞానికి నేను మిక్కిలి ఇష్టుడను. అతడు నాకు మిక్కిలి ఇష్టుడు. 






శ్రీ శక్తీ పీఠం నవగ్రహ హోమం మొదటి రోజు

ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలు

శ్రీ అమ్మవారి దివ్య అలంకారముల వివరాలు




7-10-2021ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి గురువారం రోజున శ్రీ స్వర్ణకవచాలంకృత శ్రీ దుర్గాదేవి.


8-10-2021 విదియ శుక్రవారం రోజున శ్రీ బాలా త్రిపురసుందరి దేవి.


9-10-2021 తదియ శనివారం రోజున శ్రీ గాయత్రీ దేవి.


10-10-2021 చవితి ఆదివారం రోజున శ్రీ లలితా త్రిపురసుందరి దేవి.


11-10-2021 పంచమి,షష్ఠి సోమవారం రోజున శ్రీ అన్నపూర్ణ దేవి, శ్రీ మహాలక్ష్మీ దేవి.


12-10-2021శుద్ధ సప్తమి మంగళవారం రోజున శ్రీ సరస్వతీ దేవి(మూలా నక్షత్రం).


13-10-2021శుద్ధ అష్టమి బుధవారం రోజున శ్రీ దుర్గాదేవి(దుర్గాష్టమి).


14-10-2021శుద్ధ నవమి గురువారం రోజున శ్రీ మహిషాసురమర్దని(మహార్ణవమి).


15-10-2021శుద్ధ దశమి శుక్రవారం రోజున శ్రీ రాజరాజేశ్వరి దేవి(విజయదశమి).


 11-10-2021తేదీ సోమవారం రోజున శుద్ధ పంచమి, షష్ఠి తిధులు వచ్చినందున శ్రీ అమ్మవారు మధ్యాహ్నం 12 గంటల వరకు 

శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారం లోనూ, అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుంచి 

శ్రీ మహాలక్ష్మీ దేవిగా భక్తులకు దర్శనమిస్తారని తెలిపారు.


15వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి కృష్ణా నదిలో హంసవాహన తెప్పోత్సవం జరుగుతుందన్నారు.





శ్రీమహాసరస్వతీసహస్రనామావలీ

॥ శ్రీమహాసరస్వతీసహస్రనామావలీ ॥



ఓం వాచే నమః ।

ఓం వాణ్యై నమః ।

ఓం వరదాయై నమః ।

ఓం వన్ద్యాయై నమః ।

ఓం వరారోహాయై నమః ।

ఓం వరప్రదాయై నమః ।

ఓం వృత్త్యై నమః ।

ఓం వాగీశ్వర్యై నమః ।

ఓం వార్తాయై నమః ।

ఓం వరాయై నమః ॥ 10 ॥


ఓం వాగీశవల్లభాయై నమః ।

ఓం విశ్వేశ్వర్యై నమః ।

ఓం విశ్వవన్ద్యాయై నమః ।

ఓం విశ్వేశప్రియకారిణ్యై నమః ।

ఓం వాగ్వాదిన్యై నమః ।

ఓం వాగ్దేవ్యై నమః ।

ఓం వృద్ధిదాయై నమః ।

ఓం వృద్ధికారిణ్యై నమః ।

ఓం వృద్ధ్యై నమః ।

ఓం వృద్ధాయై నమః ॥ 20 ॥


ఓం విషఘ్న్యై నమః ।

ఓం వృష్ట్యై నమః ।

ఓం వృష్టిప్రదాయిన్యై నమః ।

ఓం విశ్వారాధ్యాయై నమః ।

ఓం విశ్వమాత్రే నమః ।

ఓం విశ్వధాత్ర్యై నమః ।

ఓం వినాయకాయై నమః ।

ఓం విశ్వశక్త్యై నమః ।

ఓం విశ్వసారాయై నమః ।

ఓం విశ్వాయై నమః ॥ 30 ॥


ఓం విశ్వవిభావర్యై నమః ।

ఓం వేదాన్తవేదిన్యై నమః ।

ఓం వేద్యాయై నమః ।

ఓం విత్తాయై నమః ।

ఓం వేదత్రయాత్మికాయై నమః ।

ఓం వేదజ్ఞాయై నమః ।

ఓం వేదజనన్యై నమః ।

ఓం విశ్వాయై నమః ।

ఓం విశ్వవిభావర్యై నమః ।

ఓం వరేణ్యాయై నమః ॥ 40 ॥


ఓం వాఙ్మయ్యై నమః ।

ఓం వృద్ధాయై నమః ।

ఓం విశిష్టప్రియకారిణ్యై నమః ।

ఓం విశ్వతోవదనాయై నమః ।

ఓం వ్యాప్తాయై నమః ।

ఓం వ్యాపిన్యై నమః ।

ఓం వ్యాపకాత్మికాయై నమః ।

ఓం వ్యాళ్ఘ్న్యై నమః ।

ఓం వ్యాళ్భూషాఙ్గ్యై నమః ।

ఓం విరజాయై నమః ॥ 50 ॥


ఓం వేదనాయికాయై నమః ।

ఓం వేదవేదాన్తసంవేద్యాయై నమః ।

ఓం వేదాన్తజ్ఞానరూపిణ్యై నమః ।

ఓం విభావర్యై నమః ।

ఓం విక్రాన్తాయై నమః ।

ఓం విశ్వామిత్రాయై నమః ।

ఓం విధిప్రియాయై నమః ।

ఓం వరిష్ఠాయై నమః ।

ఓం విప్రకృష్టాయై నమః ।

ఓం విప్రవర్యప్రపూజితాయై నమః ॥ 60 ॥


ఓం వేదరూపాయై నమః ।

ఓం వేదమయ్యై నమః ।

ఓం వేదమూర్త్యై నమః ।

ఓం వల్లభాయై నమః ।

ఓం గౌర్యై నమః ॥ ।

ఓం గుణవత్యై నమః ।

ఓం గోప్యాయై నమః ।

ఓం గన్ధర్వనగరప్రియాయై నమః ।

ఓం గుణమాత్రే నమః ।

ఓం గుహాన్తస్థాయై నమః ॥ 70 ॥


ఓం గురురూపాయై నమః ।

ఓం గురుప్రియాయై నమః ।

ఓం గిరివిద్యాయై నమః ।

ఓం గానతుష్టాయై నమః ।

ఓం గాయకప్రియకారిణ్యై నమః ।

ఓం గాయత్ర్యై నమః ।

ఓం గిరిశారాధ్యాయై నమః ।

ఓం గిరే నమః ।

ఓం గిరీశప్రియఙ్కర్యై నమః ।

ఓం గిరిజ్ఞాయై నమః ॥ 80 ॥


ఓం జ్ఞానవిద్యాయై నమః ।

ఓం గిరిరూపాయై నమః ।

ఓం గిరీశ్వర్యై నమః ।

ఓం గీర్మాత్రే నమః ।

ఓం గణసంస్తుత్యాయై నమః ।

ఓం గణనీయగుణాన్వితాయై నమః ।

ఓం గూఢరూపాయై నమః ।

ఓం గుహాయై నమః ।

ఓం గోప్యాయై నమః ।

ఓం గోరూపాయై నమః ॥ 90 ॥


ఓం గవే నమః ।

ఓం గుణాత్మికాయై నమః ।

ఓం గుర్వ్యై నమః ।

ఓం గుర్వమ్బికాయై నమః ।

ఓం గుహ్యాయై నమః ।

ఓం గేయజాయై నమః ।

ఓం గ్రహనాశిన్యై నమః ।

ఓం గృహిణ్యై నమః ।

ఓం గృహదోషఘ్న్యై నమః ।

ఓం గవఘ్న్యై నమః ॥ 100 ॥


ఓం గురువత్సలాయై నమః ।

ఓం గృహాత్మికాయై నమః ।

ఓం గృహారాధ్యాయై నమః ।

ఓం గృహబాధావినాశిన్యై నమః ।

ఓం గఙ్గాయై నమః ।

ఓం గిరిసుతాయై నమః ।

ఓం గమ్యాయై నమః ।

ఓం గజయానాయై నమః ।

ఓం గుహస్తుతాయై నమః ।

ఓం గరుడాసనసంసేవ్యాయై నమః ॥ 110 ॥


ఓం గోమత్యై నమః ।

ఓం గుణశాలిన్యై నమః ।

ఓం శారదాయై నమః ।

ఓం శాశ్వత్యై నమః ।

ఓం శైవ్యై నమః ।

ఓం శాఙ్కర్యై నమః ।

ఓం శఙ్కరాత్మికాయై నమః ।

ఓం శ్రియై నమః ।

ఓం శర్వాణ్యై నమః ।

ఓం శతఘ్న్యై నమః ॥ 120 ॥


ఓం శరచ్చన్ద్రనిభాననాయై నమః ।

ఓం శర్మిష్ఠాయై నమః ।

ఓం శమనఘ్న్యై నమః ।

ఓం శతసాహస్రరూపిణ్యై నమః ।

ఓం శివాయై నమః ।

ఓం శమ్భుప్రియాయై నమః ।

ఓం శ్రద్ధాయై నమః ।

ఓం శ్రుతిరూపాయై నమః ।

ఓం శ్రుతిప్రియాయై నమః ।

ఓం శుచిష్మత్యై నమః ॥ 130 ॥


ఓం శర్మకర్యై నమః ।

ఓం శుద్ధిదాయై నమః ।

ఓం శుద్ధిరూపిణ్యై నమః ।

ఓం శివాయై నమః ।

ఓం శివఙ్కర్యై నమః ।

ఓం శుద్ధాయై నమః ।

ఓం శివారాధ్యాయై నమః ।

ఓం శివాత్మికాయై నమః ।

ఓం శ్రీమత్యై నమః ।

ఓం శ్రీమయ్యై నమః ॥ 140 ॥


ఓం శ్రావ్యాయై నమః ।

ఓం శ్రుత్యై నమః ।

ఓం శ్రవణగోచరాయై నమః ।

ఓం శాన్త్యై నమః ।

ఓం శాన్తికర్యై నమః ।

ఓం శాన్తాయై నమః ।

ఓం శాన్తాచారప్రియంకర్యై నమః ।

ఓం శీలలభ్యాయై నమః ।

ఓం శీలవత్యై నమః ।

ఓం శ్రీమాత్రే నమః ॥ 150 ॥


ఓం శుభకారిణ్యై నమః ।

ఓం శుభవాణ్యై నమః ।

ఓం శుద్ధవిద్యాయై నమః ।

ఓం శుద్ధచిత్తప్రపూజితాయై నమః ।

ఓం శ్రీకర్యై నమః ।

ఓం శ్రుతపాపఘ్న్యై నమః ।

ఓం శుభాక్ష్యై నమః ।

ఓం శుచివల్లభాయై నమః ।

ఓం శివేతరఘ్న్యై నమః ।

ఓం శబర్యై నమః ॥ 160 ॥


ఓం శ్రవణీయగుణాన్వితాయై నమః ।

ఓం శార్యై నమః ।

ఓం శిరీషపుష్పాభాయై నమః ।

ఓం శమనిష్ఠాయై నమః ।

ఓం శమాత్మికాయై నమః ।

ఓం శమాన్వితాయై నమః ।

ఓం శమారాధ్యాయై నమః ।

ఓం శితికణ్ఠప్రపూజితాయై నమః ।

ఓం శుద్ధ్యై నమః ।

ఓం శుద్ధికర్యై నమః ॥ 170 ॥


ఓం శ్రేష్ఠాయై నమః ।

ఓం శ్రుతానన్తాయై నమః ।

ఓం శుభావహాయై నమః ।

ఓం సరస్వత్యై నమః ।

ఓం సర్వజ్ఞాయై నమః ।

ఓం సర్వసిద్ధిప్రదాయిన్యై నమః ।

ఓం సరస్వత్యై నమః ।

ఓం సావిత్ర్యై నమః ।

ఓం సన్ధ్యాయై నమః ।

ఓం సర్వేప్సితప్రదాయై నమః ॥ 180 ॥


ఓం సర్వార్తిఘ్న్యై నమః ।

ఓం సర్వమయ్యై నమః ।

ఓం సర్వవిద్యాప్రదాయిన్యై నమః ।

ఓం సర్వేశ్వర్యై నమః ।

ఓం సర్వపుణ్యాయై నమః ।

ఓం సర్గస్థిత్యన్తకారిణ్యై నమః ।

ఓం సర్వారాధ్యాయై నమః ।

ఓం సర్వమాత్రే నమః ।

ఓం సర్వదేవనిషేవితాయై నమః 

ఓం సర్వైశ్వర్యప్రదాయై నమః ॥ 190 ॥


ఓం సత్యాయై నమః ।

ఓం సత్యై నమః ।

ఓం సత్వగుణాశ్రయాయై నమః ।

ఓం స్వరక్రమపదాకారాయై నమః ।

ఓం సర్వదోషనిషూదిన్యై నమః ।

ఓం సహస్రాక్ష్యై నమః ।

ఓం సహస్రాస్యాయై నమః ।

ఓం సహస్రపదసంయుతాయై నమః ।

ఓం సహస్రహస్తాయై నమః ।

ఓం సాహస్రగుణాలఙ్కృతవిగ్రహాయై నమః ॥ 200 ॥


ఓం సహస్రశీర్షాయై నమః ।

ఓం సద్రూపాయై నమః ।

ఓం స్వధాయై నమః ।

ఓం స్వాహాయై నమః ।

ఓం సుధామయ్యై నమః ।

ఓం షడ్గ్రన్థిభేదిన్యై నమః ।

ఓం సేవ్యాయై నమః ।

ఓం సర్వలోకైకపూజితాయై నమః ।

ఓం స్తుత్యాయై నమః ।

ఓం స్తుతిమయ్యై నమః ॥ 210 ॥


ఓం సాధ్యాయై నమః ।

ఓం సవితృప్రియకారిణ్యై నమః ।

ఓం సంశయచ్ఛేదిన్యై నమః ।

ఓం సాఙ్ఖ్యవేద్యాయై నమః ।

ఓం సఙ్ఖ్యాయై నమః ।

ఓం సదీశ్వర్యై నమః ।

ఓం సిద్ధిదాయై నమః ।

ఓం సిద్ధసమ్పూజ్యాయై నమః ।

ఓం సర్వసిద్ధిప్రదాయిన్యై నమః ।

ఓం సర్వజ్ఞాయై నమః ॥ 220 ॥


ఓం సర్వశక్త్యై నమః ।

ఓం సర్వసమ్పత్ప్రదాయిన్యై నమః ।

ఓం సర్వాశుభఘ్న్యై నమః ।

ఓం సుఖదాయై నమః ।

ఓం సుఖాయై నమః ।

ఓం సంవిత్స్వరూపిణ్యై నమః ।

ఓం సర్వసమ్భీషణ్యై నమః ।

ఓం సర్వజగత్సమ్మోహిన్యై నమః ।

ఓం సర్వప్రియఙ్కర్యై నమః ।

ఓం సర్వశుభదాయై నమః ॥ 230 ॥


ఓం సర్వమఙ్గళాయై నమః ।

ఓం సర్వమన్త్రమయ్యై నమః ।

ఓం సర్వతీర్థపుణ్యఫలప్రదాయై నమః |

ఓం సర్వపుణ్యమయ్యై నమః ।

ఓం సర్వవ్యాధిఘ్న్యై నమః ।

ఓం సర్వకామదాయై నమః ।

ఓం సర్వవిఘ్నహర్యై నమః ।

ఓం సర్వవన్దితాయై నమః |

ఓం సర్వమఙ్గళాయై నమః ।

ఓం సర్వమన్త్రకర్యై నమః ॥ 240 ॥


ఓం సర్వలక్ష్మియై నమః ।

ఓం సర్వగుణాన్వితాయై నమః ।

ఓం సర్వానన్దమయ్యై నమః ।

ఓం సర్వజ్ఞానదాయై నమః ।

ఓం సత్యనాయికాయై నమః ।

ఓం సర్వజ్ఞానమయ్యై నమః ।

ఓం సర్వరాజ్యదాయై నమః ।

ఓం సర్వముక్తిదాయై నమః ।

ఓం సుప్రభాయై నమః ।

ఓం సర్వదాయై నమః ॥ 250 ॥


ఓం సర్వాయై నమః ।

ఓం సర్వలోకవశఙ్కర్యై నమః ।

ఓం సుభగాయై నమః ।

ఓం సున్దర్యై నమః ।

ఓం సిద్ధాయై నమః ।

ఓం సిద్ధామ్బాయై నమః ।

ఓం సిద్ధమాతృకాయై నమః ।

ఓం సిద్ధమాత్రే నమః ।

ఓం సిద్ధవిద్యాయై నమః ।

ఓం సిద్ధేశ్యై నమః ॥ 260 ॥


ఓం సిద్ధరూపిణ్యై నమః ।

ఓం సురూపిణ్యై నమః ।

ఓం సుఖమయ్యై నమః ।

ఓం సేవకప్రియకారిణ్యై నమః ।

ఓం స్వామిన్యై నమః ।

ఓం సర్వదాయై నమః ।

ఓం సేవ్యాయై నమః ।

ఓం స్థూలసూక్ష్మాపరామ్బికాయై నమః ।

ఓం సారరూపాయై నమః ।

ఓం సరోరూపాయై నమః ॥ 270 ॥


ఓం సత్యభూతాయై నమః ।

ఓం సమాశ్రయాయై నమః ।

ఓం సితాసితాయై నమః ।

ఓం సరోజాక్ష్యై నమః ।

ఓం సరోజాసనవల్లభాయై నమః ।

ఓం సరోరుహాభాయై నమః ।

ఓం సర్వాఙ్గ్యై నమః ।

ఓం సురేన్ద్రాదిప్రపూజితాయై నమః ।

ఓం మహాదేవ్యై నమః |

ఓం మహేశాన్యై నమః ॥ 280 ॥


ఓం మహాసారస్వతప్రదాయై నమః ।

ఓం మహాసరస్వత్యై నమః ।

ఓం ముక్తాయై నమః ।

ఓం ముక్తిదాయై నమః ।

ఓం మలనాశిన్యై నమః ।

ఓం మహేశ్వర్యై నమః ।

ఓం మహానన్దాయై నమః ।

ఓం మహామన్త్రమయ్యై నమః ।

ఓం మహ్యై నమః ।

ఓం మహాలక్ష్మ్యై నమః ॥ 290 ॥


ఓం మహావిద్యాయై నమః ।

ఓం మాత్రే నమః ।

ఓం మన్దరవాసిన్యై నమః ।

ఓం మన్త్రగమ్యాయై నమః ।

ఓం మన్త్రమాత్రే నమః ।

ఓం మహామన్త్రఫలప్రదాయై నమః ।

ఓం మహాముక్త్యై నమః ।

ఓం మహానిత్యాయై నమః ।

ఓం మహాసిద్ధిప్రదాయిన్యై నమః ।

ఓం మహాసిద్ధాయై నమః ॥ 300 ॥


ఓం మహామాత్రే నమః ।

ఓం మహదాకారసంయుతాయై నమః ।

ఓం మహాయై నమః ।

ఓం మహేశ్వర్యై నమః ।

ఓం మూర్త్యై నమః ।

ఓం మోక్షదాయై నమః ।

ఓం మణిభూషణాయై నమః ।

ఓం మేనకాయై నమః ।

ఓం మానిన్యై నమః ।

ఓం మాన్యాయై నమః ॥ 310 ॥


ఓం మృత్యుఘ్న్యై నమః ।

ఓం మేరురూపిణ్యై నమః ।

ఓం మదిరాక్ష్యై నమః ।

ఓం మదావాసాయై నమః ।

ఓం మఖరూపాయై నమః ।

ఓం మఖేశ్వర్యై నమః ।

ఓం మహామోహాయై నమః ।

ఓం మహామాయాయై నమః ।

ఓం మాతౢణాం మూర్ధ్నిసంస్థితాయై నమః ।

ఓం మహాపుణ్యాయై నమః ॥ 320 ॥


ఓం ముదావాసాయై నమః ।

ఓం మహాసమ్పత్ప్రదాయిన్యై నమః ।

ఓం మణిపూరైకనిలయాయై నమః ।

ఓం మధురూపాయై నమః ।

ఓం మహోత్కటాయై నమః ।

ఓం మహాసూక్ష్మాయై నమః ।

ఓం మహాశాన్తాయై నమః ।

ఓం మహాశాన్తిప్రదాయిన్యై నమః ।

ఓం మునిస్తుతాయై నమః ।

ఓం మోహహన్త్ర్యై నమః ॥ 330 ॥


ఓం మాధవ్యై నమః ।

ఓం మాధవప్రియాయై నమః ।

ఓం మాయై నమః ।

ఓం మహాదేవసంస్తుత్యాయై నమః ।

ఓం మహిషీగణపూజితాయై నమః ।

ఓం మృష్టాన్నదాయై నమః ।

ఓం మాహేన్ద్ర్యై నమః ।

ఓం మహేన్ద్రపదదాయిన్యై నమః ।

ఓం మత్యై నమః ।

ఓం మతిప్రదాయై నమః ॥ 340 ॥


ఓం మేధాయై నమః ।

ఓం మర్త్యలోకనివాసిన్యై నమః ।

ఓం ముఖ్యాయై నమః ।

ఓం మహానివాసాయై నమః ।

ఓం మహాభాగ్యజనాశ్రితాయై నమః ।

ఓం మహిళాయై నమః ।

ఓం మహిమాయై నమః ।

ఓం మృత్యుహార్యై నమః ।

ఓం మేధాప్రదాయిన్యై నమః ।

ఓం మేధ్యాయై నమః ॥ 350 ॥


ఓం మహావేగవత్యై నమః ।

ఓం మహామోక్షఫలప్రదాయై నమః ।

ఓం మహాప్రభాభాయై నమః ।

ఓం మహత్యై నమః ।

ఓం మహాదేవప్రియఙ్కర్యై నమః ।

ఓం మహాపోషాయై నమః ।

ఓం మహర్ద్ధ్యై నమః ।

ఓం ముక్తాహారవిభూషణాయై నమః ।

ఓం మాణిక్యభూషణాయై నమః ।

ఓం మన్త్రాయై నమః ॥ 360॥


ఓం ముఖ్యచన్ద్రార్ధశేఖరాయై నమః ।

ఓం మనోరూపాయై నమః ।

ఓం మనఃశుద్ధ్యై నమః ।

ఓం మనఃశుద్ధిప్రదాయిన్యై నమః ।

ఓం మహాకారుణ్యసమ్పూర్ణాయై నమః ।

ఓం మనోనమనవన్దితాయై నమః ।

ఓం మహాపాతకజాలఘ్న్యై నమః ।

ఓం ముక్తిదాయై నమః ।

ఓం ముక్తభూషణాయై నమః ।

ఓం మనోన్మన్యై నమః ॥ 370 ॥


ఓం మహాస్థూలాయై నమః ।

ఓం మహాక్రతుఫలప్రదాయై నమః ।

ఓం మహాపుణ్యఫలప్రాప్యాయై నమః ।

ఓం మాయాత్రిపురనాశిన్యై నమః ।

ఓం మహానసాయై నమః ।

ఓం మహామేధాయై నమః ।

ఓం మహామోదాయై నమః ।

ఓం మహేశ్వర్యై నమః ।

ఓం మాలాధర్యై నమః ।

ఓం మహోపాయాయై నమః ॥ 380 ॥


ఓం మహాతీర్థఫలప్రదాయై నమః ।

ఓం మహామఙ్గళ్సమ్పూర్ణాయై నమః ।

ఓం మహాదారిద్ర్యనాశిన్యై నమః ।

ఓం మహామఖాయై నమః ।

ఓం మహామేఘాయై నమః ।

ఓం మహాకాళ్యై నమః ।

ఓం మహాప్రియాయై నమః ।

ఓం మహాభూషాయై నమః ।

ఓం మహాదేహాయై నమః ।

ఓం మహారాజ్ఞ్యై నమః ॥ 390 ॥


ఓం ముదాలయాయై నమః ।

ఓం భూరిదాయై నమః ।

ఓం భాగ్యదాయై నమః ।

ఓం భోగ్యాయై నమః ।

ఓం భోగ్యదాయై నమః ।

ఓం భోగదాయిన్యై నమః ।

ఓం భవాన్యై నమః ।

ఓం భూతిదాయై నమః ।

ఓం భూత్యై నమః ।

ఓం భూమ్యై నమః ॥ 400 ॥


ఓం భూమిసునాయికాయై నమః ।

ఓం భూతధాత్ర్యై నమః ।

ఓం భయహర్యై నమః ।

ఓం భక్తసారస్వతప్రదాయై నమః ।

ఓం భుక్త్యై నమః ।

ఓం భుక్తిప్రదాయై నమః ।

ఓం భేక్యై నమః ।

ఓం భక్త్యై నమః ।

ఓం భక్తిప్రదాయిన్యై నమః ।

ఓం భక్తసాయుజ్యదాయై నమః ॥ 410 ॥


ఓం భక్తస్వర్గదాయై నమః ।

ఓం భక్తరాజ్యదాయై నమః ।

ఓం భాగీరథ్యై నమః ।

ఓం భవారాధ్యాయై నమః ।

ఓం భాగ్యాసజ్జనపూజితాయై నమః ।

ఓం భవస్తుత్యాయై నమః ।

ఓం భానుమత్యై నమః ।

ఓం భవసాగరతారణ్యై నమః ।

ఓం భూత్యై నమః ।

ఓం భూషాయై నమః ॥ 420 ॥


ఓం భూతేశ్యై నమః ।

ఓం భాలలోచనపూజితాయై నమః ।

ఓం భూతాయై నమః ।

ఓం భవ్యాయై నమః ।

ఓం భవిష్యాయై నమః ।

ఓం భవవిద్యాయై నమః ।

ఓం భవాత్మికాయై నమః ।

ఓం బాధాపహారిణ్యై నమః ।

ఓం బన్ధురూపాయై నమః ।

ఓం భువనపూజితాయై నమః ॥ 430 ॥


ఓం భవఘ్న్యై నమః ।

ఓం భక్తిలభ్యాయై నమః ।

ఓం భక్తరక్షణతత్పరాయై నమః ।

ఓం భక్తార్తిశమన్యై నమః ।

ఓం భాగ్యాయై నమః ।

ఓం భోగదానకృతోద్యమాయై నమః ।

ఓం భుజఙ్గభూషణాయై నమః ।

ఓం భీమాయై నమః ।

ఓం భీమాక్ష్యై నమః ।

ఓం భీమరూపిణ్యై నమః ॥ 440 ॥


ఓం భావిన్యై నమః ।

ఓం భ్రాతృరూపాయై నమః ।

ఓం భారత్యై నమః ।

ఓం భవనాయికాయై నమః ।

ఓం భాషాయై నమః ।

ఓం భాషావత్యై నమః ।

ఓం భీష్మాయై నమః ।

ఓం భైరవ్యై నమః ।

ఓం భైరవప్రియాయై నమః ।

ఓం భూత్యై నమః ॥ 450 ॥


ఓం భాసితసర్వాఙ్గ్యై నమః ।

ఓం భూతిదాయై నమః ।

ఓం భూతినాయికాయై నమః ।

ఓం భాస్వత్యై నమః ।

ఓం భగమాలాయై నమః ।

ఓం భిక్షాదానకృతోద్యమాయై నమః ।

ఓం భిక్షురూపాయై నమః ।

ఓం భక్తికర్యై నమః ।

ఓం భక్తలక్ష్మీప్రదాయిన్యై నమః ।

ఓం భ్రాన్తిఘ్నాయై నమః ॥ 460 ॥


ఓం భ్రాన్తిరూపాయై నమః ।

ఓం భూతిదాయై నమః ।

ఓం భూతికారిణ్యై నమః ।

ఓం భిక్షణీయాయై నమః ।

ఓం భిక్షుమాత్రే నమః ।

ఓం భాగ్యవద్దృష్టిగోచరాయై నమః ।

ఓం భోగవత్యై నమః ।

ఓం భోగరూపాయై నమః ।

ఓం భోగమోక్షఫలప్రదాయై నమః ।

ఓం భోగశ్రాన్తాయై నమః ॥ 470 ॥


ఓం భాగ్యవత్యై నమః ।

ఓం భక్తాఘౌఘవినాశిన్యై నమః ।

ఓం బ్రాహ్మ్యై నమః ।

ఓం బ్రహ్మస్వరూపాయై నమః ।

ఓం బృహత్యై నమః ।

ఓం బ్రహ్మవల్లభాయై నమః ।

ఓం బ్రహ్మదాయై నమః ।

ఓం బ్రహ్మమాత్రే నమః ।

ఓం బ్రహ్మాణ్యై నమః ।

ఓం బ్రహ్మదాయిన్యై నమః ॥ 480 ॥


ఓం బ్రహ్మేశ్యై నమః ।

ఓం బ్రహ్మసంస్తుత్యాయై నమః ।

ఓం బ్రహ్మవేద్యాయై నమః ।

ఓం బుధప్రియాయై నమః ।

ఓం బాలేన్దుశేఖరాయై నమః ।

ఓం బాలాయై నమః ।

ఓం బలిపూజాకరప్రియాయై నమః ।

ఓం బలదాయై నమః ।

ఓం బిన్దురూపాయై నమః ।

ఓం బాలసూర్యసమప్రభాయై నమః ॥ 490 ॥


ఓం బ్రహ్మరూపాయై నమః ।

ఓం బ్రహ్మమయ్యై నమః ।

ఓం బ్రధ్నమణ్డలమధ్యగాయై నమః ।

ఓం బ్రహ్మాణ్యై నమః ।

ఓం బుద్ధిదాయై నమః ।

ఓం బుద్ధ్యై నమః ।

ఓం బుద్ధిరూపాయై నమః ।

ఓం బుధేశ్వర్యై నమః ।

ఓం బన్ధక్షయకర్యై నమః ।

ఓం బాధనాశన్యై నమః ॥ 500 ॥


ఓం బన్ధురూపిణ్యై నమః ।

ఓం బిన్ద్వాలయాయై నమః ।

ఓం బిన్దుభూషాయై నమః ।

ఓం బిన్దునాదసమన్వితాయై నమః ।

ఓం బీజరూపాయై నమః ।

ఓం బీజమాత్రే నమః ।

ఓం బ్రహ్మణ్యాయై నమః ।

ఓం బ్రహ్మకారిణ్యై నమః ।

ఓం బహురూపాయై నమః ।

ఓం బలవత్యై నమః ॥ 510 ॥


ఓం బ్రహ్మజాయై నమః ।

ఓం బ్రహ్మచారిణ్యై నమః ।

ఓం బ్రహ్మస్తుత్యాయై నమః ।

ఓం బ్రహ్మవిద్యాయై నమః ।

ఓం బ్రహ్మాణ్డాధిపవల్లభాయై నమః ।

ఓం బ్రహ్మేశవిష్ణురూపాయై నమః ।

ఓం బ్రహ్మవిష్ణ్వీశసంస్థితాయై నమః ।

ఓం బుద్ధిరూపాయై నమః ।

ఓం బుధేశాన్యై నమః ।

ఓం బన్ధ్యై నమః ॥ 520 ॥


ఓం బన్ధవిమోచన్యై నమః ।

ఓం అక్షమాలాయై నమః ।

ఓం అక్షరాకారాయై నమః ।

ఓం అక్షరాయై నమః ।

ఓం అక్షరఫలప్రదాయై నమః ।

ఓం అనన్తాయై నమః ।

ఓం ఆనన్దసుఖదాయై నమః ।

ఓం అనన్తచన్ద్రనిభాననాయై నమః ।

ఓం అనన్తమహిమాయై నమః ।

ఓం అఘోరాయై నమః ॥ 530 ॥


ఓం అనన్తగమ్భీరసమ్మితాయై నమః ।

ఓం అదృష్టాయై నమః ।

ఓం అదృష్టదాయై నమః ।

ఓం అనన్తాయై నమః ।

ఓం అదృష్టభాగ్యఫలప్రదాయై నమః ।

ఓం అరున్ధత్యై నమః ।

ఓం అవ్యయీనాథాయై నమః ।

ఓం అనేకసద్గుణసంయుతాయై నమః ।

ఓం అనేకభూషణాయై నమః ।

ఓం అదృశ్యాయై నమః ॥ 540 ॥


ఓం అనేకలేఖనిషేవితాయై నమః ।

ఓం అనన్తాయై నమః ।

ఓం అనన్తసుఖదాయై నమః ।

ఓం అఘోరాయై నమః ।

ఓం అఘోరస్వరూపిణ్యై నమః ।

ఓం అశేషదేవతారూపాయై నమః ।

ఓం అమృతరూపాయై నమః ।

ఓం అమృతేశ్వర్యై నమః ।

ఓం అనవద్యాయై నమః ।

ఓం అనేకహస్తాయై నమః ॥ 550 ॥


ఓం అనేకమాణిక్యభూషణాయై నమః ।

ఓం అనేకవిఘ్నసంహర్త్ర్యై నమః ।

ఓం హ్యనేకాభరణాన్వితాయై నమః ।

ఓం అవిద్యాయై నమః ।

ఓం అజ్ఞానసంహర్త్ర్యై నమః ।

ఓం అవిద్యాజాలనాశిన్యై నమః ।

ఓం అభిరూపాయై నమః ।

ఓం అనవద్యాఙ్గ్యై నమః ।

ఓం అప్రతర్క్యగతిప్రదాయై నమః ।

ఓం అకళ్ఙ్కారూపిణ్యై నమః ॥ 560 ॥


ఓం అనుగ్రహపరాయణాయై నమః ।

ఓం అమ్బరస్థాయై నమః ।

ఓం అమ్బరమయాయై నమః ।

ఓం అమ్బరమాలాయై నమః ।

ఓం అమ్బుజేక్షణాయై నమః ।

ఓం అమ్బికాయై నమః ।

ఓం అబ్జకరాయై నమః ।

ఓం అబ్జస్థాయై నమః ।

ఓం అశుమత్యై నమః ।

ఓం అంశుశతాన్వితాయై నమః ॥ 570 ॥


ఓం అమ్బుజాయై నమః ।

ఓం అనవరాయై నమః ।

ఓం అఖణ్డాయై నమః ।

ఓం అమ్బుజాసనమహాప్రియాయై నమః ।

ఓం అజరామరసంసేవ్యాయై నమః ।

ఓం అజరసేవితపద్యుగాయై నమః ।

ఓం అతులార్థప్రదాయై నమః ।

ఓం అర్థైక్యాయై నమః ।

ఓం అత్యుదారాయై నమః ।

ఓం అభయాన్వితాయై నమః ॥ 580 ॥


ఓం అనాథవత్సలాయై నమః ।

ఓం అనన్తప్రియాయై నమః ।

ఓం అనన్తేప్సితప్రదాయై నమః ।

ఓం అమ్బుజాక్ష్యై నమః ।

ఓం అమ్బురూపాయై నమః ।

ఓం అమ్బుజాతోద్భవమహాప్రియాయై నమః ।

ఓం అఖణ్డాయై నమః ।

ఓం అమరస్తుత్యాయై నమః ।

ఓం అమరనాయకపూజితాయై నమః ।

ఓం అజేయాయై నమః ॥ 590 ॥


ఓం అజసఙ్కాశాయై నమః ।

ఓం అజ్ఞాననాశిన్యై నమః ।

ఓం అభీష్టదాయై నమః ।

ఓం అక్తాయై నమః ।

ఓం అఘనేనాయై నమః ।

ఓం చాస్త్రేశ్యై నమః ।

ఓం అలక్ష్మీనాశిన్యై నమః ।

ఓం అనన్తసారాయై నమః ।

ఓం అనన్తశ్రియై నమః ।

ఓం అనన్తవిధిపూజితాయై నమః ॥ 600 ॥


ఓం అభీష్టాయై నమః ।

ఓం అమర్త్యసమ్పూజ్యాయై నమః ।

ఓం అస్తోదయవివర్జితాయై నమః ।

ఓం ఆస్తికస్వాన్తనిలయాయై నమః ।

ఓం అస్త్రరూపాయై నమః ।

ఓం అస్త్రవత్యై నమః ।

ఓం అస్ఖలత్యై నమః ।

ఓం అస్ఖలద్రూపాయై నమః ।

ఓం అస్ఖలద్విద్యాప్రదాయిన్యై నమః ।

ఓం అస్ఖలత్సిద్ధిదాయై నమః ॥ 610 ॥


ఓం ఆనన్దాయై నమః ।

ఓం అమ్బుజాతాయై నమః ।

ఓం అమరనాయికాయై నమః ।

ఓం అమేయాయై నమః ।

ఓం అశేషపాపఘ్న్యై నమః ।

ఓం అక్షయసారస్వతప్రదాయై నమః ।

ఓం జయాయై నమః ।

ఓం జయన్త్యై నమః ।

ఓం జయదాయై నమః ।

ఓం జన్మకర్మవివర్జితాయై నమః ॥ 620 ॥


ఓం జగత్ప్రియాయై నమః ।

ఓం జగన్మాత్రే నమః ।

ఓం జగదీశ్వరవల్లభాయై నమః ।

ఓం జాత్యై నమః ।

ఓం జయాయై నమః ।

ఓం జితామిత్రాయై నమః ।

ఓం జప్యాయై నమః ।

ఓం జపనకారిణ్యై నమః ।

ఓం జీవన్యై నమః ।

ఓం జీవనిలయాయై నమః ॥ 630 ॥


ఓం జీవాఖ్యాయై నమః ।

ఓం జీవధారిణ్యై నమః ।

ఓం జాహ్నవ్యై నమః ।

ఓం జ్యాయై నమః ।

ఓం జపవత్యై నమః ।

ఓం జాతిరూపాయై నమః ।

ఓం జయప్రదాయై నమః ।

ఓం జనార్దనప్రియకర్యై నమః ।

ఓం జోషనీయాయై నమః ।

ఓం జగత్స్థితాయై నమః ॥ 640 ॥


ఓం జగజ్జ్యేష్ఠాయై నమః ।

ఓం జగన్మాయాయై నమః ।

ఓం జీవనత్రాణకారిణ్యై నమః ।

ఓం జీవాతులతికాయై నమః ।

ఓం జీవజన్మ్యై నమః ।

ఓం జన్మనిబర్హణ్యై నమః ।

ఓం జాడ్యవిధ్వంసనకర్యై నమః ।

ఓం జగద్యోనయే నమః ।

ఓం జయాత్మికాయై నమః ।

ఓం జగదానన్దజనన్యై నమః ॥ 650 ॥


ఓం జమ్బ్యై నమః ।

ఓం జలజేక్షణాయై నమః ।

ఓం జయన్త్యై నమః ।

ఓం జఙ్గపూగఘ్న్యై నమః ।

ఓం జనితజ్ఞానవిగ్రహాయై నమః ।

ఓం జటాయై నమః ।

ఓం జటావత్యై నమః ।

ఓం జప్యాయై నమః ।

ఓం జపకర్తృప్రియఙ్కర్యై నమః ।

ఓం జపకృత్పాపసంహర్త్ర్యై నమః ॥ 660 ॥


ఓం జపకృత్ఫలదాయిన్యై నమః ।

ఓం జపాపుష్పసమప్రఖ్యాయై నమః ।

ఓం జపాకుసుమధారిణ్యై నమః ।

ఓం జనన్యై నమః ।

ఓం జన్మరహితాయై నమః ।

ఓం జ్యోతిర్వృత్యభిదాయిన్యై నమః ।

ఓం జటాజూటనచన్ద్రార్ధాయై నమః ।

ఓం జగత్సృష్టికర్యై నమః ।

ఓం జగత్త్రాణకర్యై నమః ।

ఓం జాడ్యధ్వంసకర్త్ర్యై నమః ॥ 670 ॥


ఓం జయేశ్వర్యై నమః ।

ఓం జగద్బీజాయై నమః ।

ఓం జయావాసాయై నమః ।

ఓం జన్మభువే నమః ।

ఓం జన్మనాశిన్యై నమః ।

ఓం జన్మాన్త్యరహితాయై నమః ।

ఓం జైత్ర్యై నమః ।

ఓం జగద్యోనయే నమః ।

ఓం జపాత్మికాయై నమః ।

ఓం జయలక్షణసమ్పూర్ణాయై నమః ॥ 680 ॥


ఓం జయదానకృతోద్యమాయై నమః ।

ఓం జమ్భరాద్యాదిసంస్తుత్యాయై నమః ।

ఓం జమ్భారిఫలదాయిన్యై నమః ।

ఓం జగత్త్రయహితాయై నమః ।

ఓం జ్యేష్ఠాయై నమః ।

ఓం జగత్త్రయవశఙ్కర్యై నమః ।

ఓం జగత్త్రయామ్బాయై నమః ।

ఓం జగత్యై నమః ।

ఓం జ్వాలాయై నమః ।

ఓం జ్వాలితలోచనాయై నమః ॥ 690 ॥


ఓం జ్వాలిన్యై నమః ।

ఓం జ్వలనాభాసాయై నమః ।

ఓం జ్వలన్త్యై నమః ।

ఓం జ్వలనాత్మికాయై నమః ।

ఓం జితారాతిసురస్తుత్యాయై నమః ।

ఓం జితక్రోధాయై నమః ।

ఓం జితేన్ద్రియాయై నమః ।

ఓం జరామరణశూన్యాయై నమః ।

ఓం జనిత్ర్యై నమః ।

ఓం జన్మనాశిన్యై నమః ॥ 700 ॥


ఓం జలజాభాయై నమః ।

ఓం జలమయ్యై నమః ।

ఓం జలజాసనవల్లభాయై నమః ।

ఓం జలజస్థాయై నమః ।

ఓం జపారాధ్యాయై నమః ।

ఓం జనమఙ్గళ్కారిణ్యై నమః ।

ఓం కామిన్యై నమః ।

ఓం కామరూపాయై నమః ।

ఓం కామ్యాయై నమః ।

ఓం కామప్రదాయిన్యై నమః ॥ 710 ॥


ఓం కమాల్యై నమః ।

ఓం కామదాయై నమః ।

ఓం కర్త్ర్యై నమః ।

ఓం క్రతుకర్మఫలప్రదాయై నమః ।

ఓం కృతఘ్నఘ్న్యై నమః ।

ఓం క్రియారూపాయై నమః ।

ఓం కార్యకారణరూపిణ్యై నమః ।

ఓం కఞ్జాక్ష్యై నమః ।

ఓం కరుణారూపాయై నమః ।

ఓం కేవలామరసేవితాయై నమః ॥ 720 ॥


ఓం కల్యాణకారిణ్యై నమః ।

ఓం కాన్తాయై నమః ।

ఓం కాన్తిదాయై నమః ।

ఓం కాన్తిరూపిణ్యై నమః ।

ఓం కమలాయై నమః ।

ఓం కమలావాసాయై నమః ।

ఓం కమలోత్పలమాలిన్యై నమః ।

ఓం కుముద్వత్యై నమః ।

ఓం కల్యాణ్యై నమః ।

ఓం కాన్త్యై నమః ॥ 730 ॥


ఓం కామేశవల్లభాయై నమః ।

ఓం కామేశ్వర్యై నమః ।

ఓం కమలిన్యై నమః ।

ఓం కామదాయై నమః ।

ఓం కామబన్ధిన్యై నమః ।

ఓం కామధేనవే నమః ।

ఓం కాఞ్చనాక్ష్యై నమః ।

ఓం కాఞ్చనాభాయై నమః ।

ఓం కలానిధ్యై నమః ।

ఓం క్రియాయై నమః ॥ 740 ॥


ఓం కీర్తికర్యై నమః ।

ఓం కీర్త్యై నమః ।

ఓం క్రతుశ్రేష్ఠాయై నమః ।

ఓం కృతేశ్వర్యై నమః ।

ఓం క్రతుసర్వక్రియాస్తుత్యాయై నమః ।

ఓం క్రతుకృత్ప్రియకారిణ్యై నమః ।

ఓం క్లేశనాశకర్యై నమః ।

ఓం కర్త్ర్యై నమః ।

ఓం కర్మదాయై నమః ।

ఓం కర్మబన్ధిన్యై నమః ॥ 750 ॥


ఓం కర్మబన్ధహర్యై నమః ।

ఓం కృష్టాయై నమః ।

ఓం క్లమఘ్న్యై నమః ।

ఓం కఞ్జలోచనాయై నమః ।

ఓం కన్దర్పజనన్యై నమః ।

ఓం కాన్తాయై నమః ।

ఓం కరుణాయై నమః ।

ఓం కరుణావత్యై నమః ।

ఓం క్లీఙ్కారిణ్యై నమః ।

ఓం కృపాకారాయై నమః ॥ 760 ॥


ఓం కృపాసిన్ధవే నమః ।

ఓం కృపావత్యై నమః ।

ఓం కరుణార్ద్రాయై నమః ।

ఓం కీర్తికర్యై నమః ।

ఓం కల్మషఘ్న్యై నమః ।

ఓం క్రియాకర్యై నమః ।

ఓం క్రియాశక్త్యై నమః ।

ఓం కామరూపాయై నమః ।

ఓం కమలోత్పలగన్ధిన్యై నమః ।

ఓం కలాయై నమః ॥ 770 ॥


ఓం కలావత్యై నమః ।

ఓం కూర్మ్యై నమః ।

ఓం కూటస్థాయై నమః ।

ఓం కఞ్జసంస్థితాయై నమః ।

ఓం కాళికాయై నమః ।

ఓం కల్మషఘ్న్యై నమః ।

ఓం కమనీయజటాన్వితాయై నమః ।

ఓం కరపద్మాయై నమః ।

ఓం కరాభీష్టప్రదాయై నమః ।

ఓం క్రతుఫలప్రదాయై నమః ॥ 780 ॥


ఓం కౌశిక్యై నమః ।

ఓం కోశదాయై నమః ।

ఓం కావ్యాయై నమః ।

ఓం కర్త్ర్యై నమః ।

ఓం కోశేశ్వర్యై నమః ।

ఓం కృశాయై నమః ।

ఓం కూర్మయానాయై నమః ।

ఓం కల్పలతాయై నమః ।

ఓం కాలకూటవినాశిన్యై నమః ।

ఓం కల్పోద్యానవత్యై నమః ॥ 790 ॥


ఓం కల్పవనస్థాయై నమః ।

ఓం కల్పకారిణ్యై నమః ।

ఓం కదమ్బకుసుమాభాసాయై నమః ।

ఓం కదమ్బకుసుమప్రియాయై నమః ।

ఓం కదమ్బోద్యానమధ్యస్థాయై నమః ।

ఓం కీర్తిదాయై నమః ।

ఓం కీర్తిభూషణాయై నమః ।

ఓం కులమాత్రే నమః ।

ఓం కులావాసాయై నమః ।

ఓం కులాచారప్రియఙ్కర్యై నమః ॥ 800 ॥


ఓం కులానాథాయై నమః ।

ఓం కామకలాయై నమః ।

ఓం కలానాథాయై నమః ।

ఓం కలేశ్వర్యై నమః ।

ఓం కున్దమన్దారపుష్పాభాయై నమః ।

ఓం కపర్దస్థితచన్ద్రికాయై నమః ।

ఓం కవిత్వదాయై నమః ।

ఓం కావ్యమాత్రే నమః ।

ఓం కవిమాత్రే నమః ।

ఓం కలాప్రదాయై నమః ॥ 810 ॥


ఓం తరుణ్యై నమః ।

ఓం తరుణీతాతాయై నమః ।

ఓం తారాధిపసమాననాయై నమః ।

ఓం తృప్తయే నమః ।

ఓం తృప్తిప్రదాయై నమః ।

ఓం తర్క్యాయై నమః ।

ఓం తపన్యై నమః ।

ఓం తాపిన్యై నమః ।

ఓం తర్పణ్యై నమః ।

ఓం తీర్థరూపాయై నమః ॥ 820 ॥


ఓం త్రిదశాయై నమః ।

ఓం త్రిదశేశ్వర్యై నమః ।

ఓం త్రిదివేశ్యై నమః ।

ఓం త్రిజనన్యై నమః ।

ఓం త్రిమాత్రే నమః ।

ఓం త్ర్యమ్బకేశ్వర్యై నమః ।

ఓం త్రిపురాయై నమః ।

ఓం త్రిపురేశాన్యై నమః ।

ఓం త్ర్యమ్బకాయై నమః ।

ఓం త్రిపురామ్బికాయై నమః ॥ 830 ॥


ఓం త్రిపురశ్రియై నమః ।

ఓం త్రయీరూపాయై నమః ।

ఓం త్రయీవేద్యాయై నమః ।

ఓం త్రయీశ్వర్యై నమః ।

ఓం త్రయ్యన్తవేదిన్యై నమః ।

ఓం తామ్రాయై నమః ।

ఓం తాపత్రితయహారిణ్యై నమః ।

ఓం తమాలసదృశ్యై నమః ।

ఓం త్రాత్రే నమః ।

ఓం తరుణాదిత్యసన్నిభాయై నమః ॥ 840 ॥


ఓం త్రైలోక్యవ్యాపిన్యై నమః ।

ఓం తృప్తాయై నమః ।

ఓం తృప్తికృతే నమః ।

ఓం తత్త్వరూపిణ్యై నమః ।

ఓం తుర్యాయై నమః ।

ఓం త్రైలోక్యసంస్తుత్యాయై నమః ।

ఓం త్రిగుణాయై నమః ।

ఓం త్రిగుణేశ్వర్యై నమః ।

ఓం త్రిపురఘ్న్యై నమః ।

ఓం త్రిమాత్రే నమః ॥ 850 ॥


ఓం త్ర్యమ్బకాయై నమః ।

ఓం త్రిగుణాన్వితాయై నమః ।

ఓం తృష్ణాచ్ఛేదకర్యై నమః ।

ఓం తృప్తాయై నమః ।

ఓం తీక్ష్ణాయై నమః ।

ఓం తీక్ష్ణస్వరూపిణ్యై నమః ।

ఓం తులాయై నమః ।

ఓం తులాదిరహితాయై నమః ।

ఓం తత్తద్బ్రహ్మస్వరూపిణ్యై నమః ।

ఓం త్రాణకర్త్ర్యై నమః ॥ 860 ॥


ఓం త్రిపాపఘ్న్యై నమః ।

ఓం త్రిపదాయై నమః ।

ఓం త్రిదశాన్వితాయై నమః ।

ఓం తథ్యాయై నమః ।

ఓం త్రిశక్తయే నమః ।

ఓం త్రిపదాయై నమః ।

ఓం తుర్యాయై నమః ।

ఓం త్రైలోక్యసున్దర్యై నమః ।

ఓం తేజస్కర్యై నమః ।

ఓం త్రిమూర్త్యాద్యాయై నమః ॥ 870 ॥


ఓం తేజోరూపాయై నమః ।

ఓం త్రిధామతాయై నమః ।

ఓం త్రిచక్రకర్త్ర్యై నమః ।

ఓం త్రిభగాయై నమః ।

ఓం తుర్యాతీతఫలప్రదాయై నమః ।

ఓం తేజస్విన్యై నమః ।

ఓం తాపహార్యై నమః ।

ఓం తాపోపప్లవనాశిన్యై నమః ।

ఓం తేజోగర్భాయై నమః ।

ఓం తపఃసారాయై నమః ॥ 880 ॥


ఓం త్రిపురారిప్రియఙ్కర్యై నమః ।

ఓం తన్వ్యై నమః ।

ఓం తాపససన్తుష్టాయై నమః ।

ఓం తపతాఙ్గజభీతినుదే నమః ।

ఓం త్రిలోచనాయై నమః ।

ఓం త్రిమార్గాయై నమః ।

ఓం తృతీయాయై నమః ।

ఓం త్రిదశస్తుతాయై నమః ।

ఓం త్రిసున్దర్యై నమః ।

ఓం త్రిపథగాయై నమః ॥ 890 ॥


ఓం తురీయపదదాయిన్యై నమః ।

ఓం శుభాయై నమః ।

ఓం శుభావత్యై నమః ।

ఓం శాన్తాయై నమః ।

ఓం శాన్తిదాయై నమః ।

ఓం శుభదాయిన్యై నమః ।

ఓం శీతళాయై నమః ।

ఓం శూలిన్యై నమః ।

ఓం శీతాయై నమః ।

ఓం శ్రీమత్యై నమః ॥ 900 ॥


ఓం శుభాన్వితాయై నమః ।

ఓం యోగసిద్ధిప్రదాయై నమః ।

ఓం యోగ్యాయై నమః ।

ఓం యజ్ఞేనపరిపూరితాయై నమః ।

ఓం యజ్యాయై నమః ।

ఓం యజ్ఞమయ్యై నమః ।

ఓం యక్ష్యై నమః ।

ఓం యక్షిణ్యై నమః ।

ఓం యక్షివల్లభాయై నమః ।

ఓం యజ్ఞప్రియాయై నమః ॥ 910 ॥


ఓం యజ్ఞపూజ్యాయై నమః ।

ఓం యజ్ఞతుష్టాయై నమః ।

ఓం యమస్తుతాయై నమః ।

ఓం యామినీయప్రభాయై నమః ।

ఓం యామ్యాయై నమః ।

ఓం యజనీయాయై నమః ।

ఓం యశస్కర్యై నమః ।

ఓం యజ్ఞకర్త్ర్యై నమః ।

ఓం యజ్ఞరూపాయై నమః ।

ఓం యశోదాయై నమః ॥ 920 ॥


ఓం యజ్ఞసంస్తుతాయై నమః ।

ఓం యజ్ఞేశ్యై నమః ।

ఓం యజ్ఞఫలదాయై నమః ।

ఓం యోగయోనయే నమః ।

ఓం యజుస్తుతాయై నమః ।

ఓం యమిసేవ్యాయై నమః ।

ఓం యమారాధ్యాయై నమః ।

ఓం యమిపూజ్యాయై నమః ।

ఓం యమీశ్వర్యై నమః ।

ఓం యోగిన్యై నమః ॥ 930 ॥


ఓం యోగరూపాయై నమః ।

ఓం యోగకర్తృప్రియఙ్కర్యై నమః ।

ఓం యోగయుక్తాయై నమః ।

ఓం యోగమయ్యై నమః ।

ఓం యోగయోగీశ్వరామ్బికాయై నమః ।

ఓం యోగజ్ఞానమయ్యై నమః ।

ఓం యోనయే నమః ।

ఓం యమాద్యష్టాఙ్గయోగయుతాయై నమః ।

ఓం యన్త్రితాఘౌఘసంహారాయై నమః ।

ఓం యమలోకనివారిణ్యై నమః ॥ 940 ॥


ఓం యష్టివ్యష్టీశసంస్తుత్యాయై నమః ।

ఓం యమాద్యష్టాఙ్గయోగయుజే నమః ।

ఓం యోగీశ్వర్యై నమః ।

ఓం యోగమాత్రే నమః ।

ఓం యోగసిద్ధాయై నమః ।

ఓం యోగదాయై నమః ।

ఓం యోగారూఢాయై నమః ।

ఓం యోగమయ్యై నమః ।

ఓం యోగరూపాయై నమః ।

ఓం యవీయస్యై నమః ॥ 950 ॥


ఓం యన్త్రరూపాయై నమః ।

ఓం యన్త్రస్థాయై నమః ।

ఓం యన్త్రపూజ్యాయై నమః ।

ఓం యన్త్రితాయై నమః ।

ఓం యుగకర్త్ర్యై నమః ।

ఓం యుగమయ్యై నమః ।

ఓం యుగధర్మవివర్జితాయై నమః ।

ఓం యమునాయై నమః ।

ఓం యమిన్యై నమః ।

ఓం యామ్యాయై నమః ॥ 960 ॥


ఓం యమునాజలమధ్యగాయై నమః ।

ఓం యాతాయాతప్రశమన్యై నమః ।

ఓం యాతనానాన్నికృన్తన్యై నమః ।

ఓం యోగావాసాయై నమః ।

ఓం యోగివన్ద్యాయై నమః ।

ఓం యత్తచ్ఛబ్దస్వరూపిణ్యై నమః ।

ఓం యోగక్షేమమయ్యై నమః ।

ఓం యన్త్రాయై నమః ।

ఓం యావదక్షరమాతృకాయై నమః ।

ఓం యావత్పదమయ్యై నమః ॥ 970 ॥


ఓం యావచ్ఛబ్దరూపాయై నమః ।

ఓం యథేశ్వర్యై నమః ॥ ।

ఓం యత్తదీయాయై నమః ।

ఓం యక్షవన్ద్యాయై నమః ।

ఓం యద్విద్యాయై నమః ।

ఓం యతిసంస్తుతాయై నమః ।

ఓం యావద్విద్యామయ్యై నమః ।

ఓం యావద్విద్యాబృన్దసువన్దితాయై నమః ।

ఓం యోగిహృత్పద్మనిలయాయై నమః ।

ఓం యోగివర్యప్రియఙ్కర్యై నమః ॥ 980 ॥


ఓం యోగివన్ద్యాయై నమః ।

ఓం యోగిమాత్రే నమః ।

ఓం యోగీశఫలదాయిన్యై నమః ।

ఓం యక్షవన్ద్యాయై నమః ।

ఓం యక్షపూజ్యాయై నమః ।

ఓం యక్షరాజసుపూజితాయై నమః ।

ఓం యజ్ఞరూపాయై నమః ।

ఓం యజ్ఞతుష్టాయై నమః ।

ఓం యాయజూకస్వరూపిణ్యై నమః ।

ఓం యన్త్రారాధ్యాయై నమః ॥990 ॥


ఓం యన్త్రమధ్యాయై నమః ।

ఓం యన్త్రకర్తృప్రియఙ్కర్యై నమః ।

ఓం యన్త్రారూఢాయై నమః ।

ఓం యన్త్రపూజ్యాయై నమః ।

ఓం యోగిధ్యానపరాయణాయై నమః ।

ఓం యజనీయాయై నమః ।

ఓం యమస్తుత్యాయై నమః ।

ఓం యోగయుక్తాయై నమః ।

ఓం యశస్కర్యై నమః ।

ఓం యోగబద్ధాయై నమః ॥ 1000 ॥


ఓం యతిస్తుత్యాయై నమః ।

ఓం యోగజ్ఞాయై నమః ।

ఓం యోగనాయక్యై నమః ।

ఓం యోగిజ్ఞానప్రదాయై నమః ।

ఓం యక్ష్యై నమః ।

ఓం యమబాధావినాశిన్యై నమః ।

ఓం యోగికామ్యప్రదాత్ర్యై నమః ।

ఓం యోగిమోక్షప్రదాయిన్యై నమః ॥ 1008॥


॥ ఇతి శ్రీస్కాన్దపురాణాన్తర్గత సనత్కుమార

సంహితాయాం నారద సనత్కుమార సంవాదే

సరస్వతీసహస్రనామస్తోత్రస్య

నామావలీ రూపాన్తరం సమ్పూర్ణమ్ ॥




మీకు తెలుసా శ్రీకృష్ణుడి సంతానం గురించి ?

శ్రీ మాధ్భగవతంలో శ్రీకృష్ణుభగవానుడి భార్యల గురించి వారి సంతానం గురించి చాలా తక్కువమందికి తెలుసు. శ్రీకృష్ణుడికి పదహారువేల ఎనిమిది మంది భార్యలు. వారికీ ఒకొక్కరికీ పదిమంది సంతానం కలిగారు. మొత్తం 160080 మంది సంతానం   



శ్రీ కృష్ణుడు రుక్మిణి సంతనం

1. ప్రద్యుముడు

2. చారుధేష్ణ

3. సుదేష్ణ

4. చారుదేహా

5. సుచారు

6. చారుగుప్త

7. భద్రచారు

8. చారుచంద్ర

9. విచారు

10. చారు

ఇంకా ఒక కుమార్తే చారుమతి      

శ్రీ కృష్ణుడు సత్యభామ సంతానం

1. భాను

2. సుభాను

3. స్వరభాను

4. ప్రభాను

5. భానుమను

6. చంద్రభాను

7. బృహద్ధను

8. అతిభాను

9. శ్రీభాను

10. ప్రతిభాను

శ్రీ కృష్ణుడు జాంబవతి సంతానం
1. సాంబ
2. సుమిత్ర
3. పురుజిత్తు
4. సతజితు
5. సహస్రజిత్తు
6. విజయ
7. చిత్రకేతు
8. వసుమను
9. ద్రవిడ
10. క్రతు

శ్రీ కృష్ణుడు లక్షణ సంతానం
1. ప్రయిష
2. గాత్రవాను
3. సింహ
4. బల
5. ప్రబల
6. వృధాగా
7. మహశక్తి
8. సాహ
9. ఓజ
10. అపరాజిత

శ్రీ కృష్ణుడు కాళింది సంతానం
1. శృత
2. కవి
3. వృష
4. వీర
5. సుభహు
6. భద్ర
7. శాంతి
8. దర్ష
9. పూర్ణమాస
10. సొమక

శ్రీ కృష్ణుడు నాగ్నజితి సంతానం
1. వీర
2. చంద్ర
3. ఆశ్వసేన
4. చిత్రగు
5. వేగవను
6. వృష
7. ఆమ
8. శంకు
9. వాసు
10. కుంతి

శ్రీ కృష్ణుడు భద్ర సంతానం
1. సంగ్రామజిత్
2. బృహత్సేన
3. శూర
4. ప్రహరణ
5. అరిజిత
6. జయ
7. సుభద్ర
8. నామ
9. ఆయు
10. సాత్యక

శ్రీ కృష్ణుడు మిత్రవింద సంతానం
1. వృక
2. హర్హ
3. అనిల
4. గృధ్ర
5. వర్ధన
6. ఉన్నద
7. మహంస
8. పవను
9. వన్హి
10. క్షుధి
వీరు కాకా నరకాసురుడిని నుండి రక్షించిన పదహారువేలమంది భార్యలకు ఒకొక్కలకు పది మంది సంతానం కలిగారు.




రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...