శ్రీ కృష్ణుడి అష్ట వివాహల వెనక ఉన్న రహస్యం

పరమాత్ముడు అయినా శ్రీమహావిష్ణువు ఎన్నో అవతారాలను ఎత్తారు. వాటిలో శ్రీ కృష్ణ అవతారం ఒకటి. శ్రీ కృష్ణ అవతారంలో శ్రీకృష్ణుడు ఎనిమిది మందిని మరియు పదహారు వేలమంది రాజకుమారిలను వివాహం చేసుకున్నాడు. వారిలో ముఖ్యంగా ఎనిమిదిమందిని చెప్పుకుంటారు. అవతారపురుషుడైన శ్రీకృష్ణుడు వారిని వివాహం చేసుకోవటానికి గల కారణాలు ఏమిటి? వాటి వివరములు.




రుక్మిణి 

విదర్భరాజు బీష్మకుని కుమార్తె రుక్మిణి. ఆమెకు ఐదుగురు సోదరులు. వారు రుక్మి, రుక్మరథ, రుక్మకేతు, రుక్మబాహు, రుక్మణీయత. అత్యంత సౌందర్య రాశి రుక్మిణి. ఆమె శ్రీమహాలక్ష్మి అవతారం. ఆమె చిన్న వయస్సు నుంచే శ్రీమహావిష్ణువునే ధ్యానించేది. యుక్తవయస్సు రాగానే శ్రీకృష్ణుని అందచందాలను, పరాక్రమాన్ని గురించి తెలుసుకొని అతనినే వివాహం చేసుకోవాలని శ్రీకృష్ణుడిని ప్రేమించింది. ఈ విషయం తెలుసుకున్నా రుక్మిణి సోదరుడు రుక్మి రుక్మిణిని శిశుపాలునికి ఇచ్చి వివాహం చేయాలని నిర్ణయంచించుకున్నాడు. రుక్మిణి ఎంత వారించినా వినలేదు. రుక్మిణి అగ్ని జోధకుడు అనే పండితుడి ద్వారా శ్రీకృష్ణునికి తనకు ఈ వివాహం ఇష్టం లేదు అని నేను మిమ్మలిని నా భర్తగా భావించాను అని వచ్చి నన్ను వివాహం చేసుకోవాలని సందేశం పంపింది. శ్రీకృష్ణుడు ఆమె సందేశాన్ని అందుకొని ఊరిచివర ఉన్న అమ్మవారి గుడిలో వేచి ఉండమని తనను తీసుకువెళతాను అని చేపి పంపించారు. రుక్మిణి ఆ సందేశాన్ని విని తాను ఆ అమ్మవారి గుడిలో వేచి ఉండగా శ్రీకృష్ణుడు వచ్చి ఆమెను తీసుకు వెళ్లరు. ఈ విషయం తెలుసుకున్న రుక్మి, శిశుపాలుడు శ్రీకృష్ణుడి మీదకి యుద్ధనికి వెళతారు. బలరాముడు తనకు తెలియకుండా శ్రీకృష్ణుడు విదర్భకు వలదు అని తెలుసుకొని అయన కొంతమందిని సేనను తీసుకొని వెళ్లి శ్రీకృష్ణుడికి సహాయం చేస్తారు. యుద్ధంలో రుక్మి ఓడిపోతాడు. శ్రీకృష్ణుడు సుదర్శన చక్రముతో అతనిని వదిద్దాము అనుకునే సమయానికి రుక్మిణీదేవి అడ్డుపడుతుంది. తన సోదరుడిని చంపవద్దుఅని ప్రాధేయపడుతుంది. శ్రీకృష్ణుడు అందుకు అంగీకరించి అతనికి సగం జుట్టును తీసివేస్తారు. శ్రీకృష్ణుడు రుక్మిణిని తీసుకొని ద్వారకకు వచ్చి వారి పెద్దల సమక్షమంలో వివాహం చేసుకుంటారు. అలా రుక్మిణి శ్రీకృష్ణుల వివాహం జరుగుతుంది.


సత్యభామ


శ్రీకృష్ణుని రాజ్యములో ఉన్న సత్రాజిత్తు కుమార్తె సత్యభామ. సత్రాజిత్తు సూర్యభగవానుడిని గురించి తపస్సు చేసి సమంతకమణిని వరంగా పొందుతాడు. ఆ మణి ప్రతిరోజు బంగారాన్ని ఇస్తుంది. ఒక రోజు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేతుడు శమంతకమణిని తీసుకొని అడవిలోకి వేటకి వెళతాడు. మళ్ళీ తిరిగి రాడు. ఈ విషయం తెలియని సత్రాజిత్తు మణిని శ్రీకృష్ణుడే తీసాడు అని శ్రీకృష్ణుడి పై నీలాపనిందలు వేస్తాడు. ఆ నీలాపనిందలు తొలగించుకోవటానికి శ్రీకృష్ణుడు కొంతమంది సేనను అడవికి వెళతాడు. అక్కడ కొంతదూరం వెళాకా ప్రసేతుని మృతదేహం కనిపిస్తుంది. ఒక పులి అతనిని చంపేస్తుంది. అతని మృతదేహాన్ని సేనలకు ఇచ్చి సత్రాజిత్తు దగరకు పంపిస్తాడు. శ్రీకృష్ణుడు మణిని వెతుకుంటూ ముందుకు వెళతారు. కొంతదూరం వెళాకా పులి ఒక బలుకముతో పోరాడి మరణిస్తుంది. ఆ బలుకము పులిదగర ఉన్న మణిని తీసుకు వెళుతుంది. శ్రీ కృష్ణుడు అక్కడి నుంచి బలుకమును వెతుకుంటూ ఒక గృహ దగరకు వెళతారు. సేనలను బయటే ఉండమని చేపి శ్రీకృష్ణుడు లోపలి వెళతారు. అక్కడ ఒక పాపా ఆ మణితో ఆడుకుంటుంది. అది తీసుకోవటానికి ప్రయతించిన శ్రీకృష్ణుడిని బలుకము అడగిస్తుంది. ఆ బలుకముతో శ్రీకృష్ణుడు 28 రోజులు యుద్ధం చేస్తారు. చివరకు బలుకము ఓడిపోయి శ్రీకృష్ణుడిని స్వామి శరణు వేడి నేను జాంబవంతుడిని తమరు ఎవరు అని ప్రార్థిస్తుంది. అందుకు శ్రీకృష్ణుడు నేను శ్రీకృష్ణుడిని నీవు నేను రామావతారంలో ఉన్నపుడు రామరావణ యుద్ధం తరువాత ఒకరోజు నీకు ఏమికావాలి అని అడిగాను అపుడు నువ్వు మీతో యుద్ధం చేయాలని ఉంది అని కోరావు. ఆ వరమే ఎపుడు నెరవేర్చను. జాంబవంతుడు సంతోషించి తన పుత్రికను, సమంతకమణిని ఇస్తాడు. శ్రీకృష్ణుడు రాజ్యానికి తిరిగి వచ్చి సత్రాజిత్తుకు మణిని తిరిగి ఇస్తారు. తన తప్పు తెలుసుకున్న సత్రాజిత్తు తన కుమార్తె సత్యభామను ఇచ్చి వివాహం చేస్తాడు. సత్యభామ భూమాత అంశా. సత్యభామ శ్రీకృష్ణుల వివాహం పెద్దల సమక్షంలో జరుగుతుంది.

జాంబవతి 


జాంబవంతుడు శ్రీకృష్ణుడికి ఇచ్చిన కన్య జాంబవతి. ఆమె గత జన్మలో చంద్రుని కుమార్తె. చిన్నప్పటి నుంచి శ్రీహరి గురించి తెలుసుకొని అయన కధలను వింటూ అయనను భర్తగా పొందాలని మనస్సులో ధ్యానించింది . ఒకసారి చంద్రుడు తిర్థయాత్రలు చేస్తూ శేషాచలంలోని ప్రతి తీర్ధాన్ని దర్శిస్తూ అక్కడి స్థలపురాణాలు వింటూ నరసింహ తీర్ధం చేరుకొని ప్రహ్లాదుడికి లభించిన స్వామి అనుగ్రహం గురించి పులకించి పోతూవుండగా శ్రీహరి ప్రత్యక్షమవుతారు. స్వామిని చుసిన జాంబవతి తనని భార్యగా చేసుకోమని ప్రాధిస్తుంది. అందుకు శ్రీహరి ఆమెకు  వెంకటేశమంత్రని ఉపదేశించి నీవు ఇక్కడే తపస్సు చేయి నీ కోరిక నెరవేరుతుంది అని చెపుతారు. మిగిలిన తీర్ధాలన్నిటిని ధర్శించుకొని చివరకు ఋషి తీర్ధం చేరుకొని అక్కడే తపస్సు చేసి యోగవిద్య ద్వారా తన శరీరాన్ని త్యజించి జాంబవంతుని ఇంటిలో జన్మిస్తుంది. ఆ కన్యనే జాంబవంతుడు శ్రీకృష్ణుడికి ఇస్తాడు. శ్రీకృష్ణుడు జాంబవతిని కూడా పెద్దల సమక్షంలో వివాహం చేసుకుంటారు.     


మిత్రవింద

శ్రీకృష్ణుడికి ఐదుగురు మేనత్తలు. వారిలో సుమిత్రాదేవి అవంతిపురపురాజు జయసేనుని భార్య వీరికి ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు. కుమార్తె పేరు మిత్రవింద. కుమారులు మింద, రువింద. మిత్రవింద శ్రీకృష్ణుడిని ప్రేమిస్తుంది. ఈ విషయం తెలుసుకున్న సోదరులు ఆమెకు స్వయంవరం ఏర్పాటు చేస్తారు. శ్రీకృష్ణుడిని తప్ప అందరిని ఆహ్వానిస్తారు. వారికీ శ్రీకృష్ణుడు అంటే ద్వేషం. అందుకు మిత్రవింద సోదరులకు తెలియకుండా శ్రీకృష్ణుడికి స్వయంవరానికి ఆహ్వానిస్తుంది. శ్రీకృష్ణుడు ఆమె ఆహ్వానాన్ని మనించి స్వయంవరానికి వస్తారు. మిత్రవింద శ్రీకృష్ణుడిని వరిస్తుంది. మిత్రవింద గతజన్మలో శ్రీమహావిష్ణువుని భర్తగా పొందటానికి ఆయనను ఆరాధించింది. నవవిధభక్తిలో శ్రవణాన్ని ఎంచుకొని శ్రీహరి కధలను వింటూ ఆయనకోసం తపిస్తూ మరణిస్తుంది. శ్రీకృష్ణుడు మిత్రవిందను పెద్దల సమక్షంలో వివాహం చేసుకుంటారు.    

    


భద్ర 

శ్రీకృష్ణుడి ఐదుగురు మేనత్తలలో ఒకరు శ్రుతకీర్తి. ఈమె కైకేయ దేశపు రాజునూ వివాహం చేసుకుంటుంది. వీరి కుమార్తె భద్ర. ఈమె పుట్టుకతోనే సర్వ లక్షణ సమన్వితురాలు. భద్ర పూర్వజన్మలో సామాన్యడైన మానవుడి ఇంటిలో జన్మిస్తుంది. ఆమె పుట్టుకతోనే జ్ఞాన సంపన్నురాలు. ఆమె పుటిన నాటినుండి జపతపయజ్ఞయాగఉపవాసాలతో గడిపింది. ఆమెకు యుక్త వయస్సు రాగానే ఆమెకు వివాహం చేయాలని చూస్తారు. భద్ర దానిని తిరస్కరిస్తూ నేను జీవితాంతం శ్రీ హరి ధ్యానంలోనే గడుపుతాను. అడవికి వెళ్లిపోతుంది. ఆమె ఎప్పుడు శ్రీకృష్ణుడికి మరదలిగా జన్మిస్తుంది. పెద్దల సమక్షంలో భద్ర శ్రీకృష్ణుల వివాహం జరుగుతుంది. 


నీల 

ఈమె కుంభకుడి ఇంట్లో జన్మించింది. ఈమెకు యుక్త వయస్సుకు రాగా ఆమె తండ్రి స్వయంవరం ప్రకటించాడు. అతని రాజ్యములో ఏడూ ఋషభలు అల్లకల్లోలం సృష్టించాయి. వాటిని అదుపులోకి తెచ్చిన వారికీ తన కుమార్తె నీలను ఇచ్చి పెళ్లి చేస్తాను అని ప్రకటించాడు. శ్రీకృష్ణుడు వాటిని లొంగదీసుకుంటారు. ఇంతలో నీలను కొంతమంతామంది రాజులూ అపహరిస్తారు. శ్రీకృష్ణుడు వారితో యుద్ధం చేసి వారిని ఓడిస్తారు. నీల పూర్వజన్మలో అగ్నిదేవుని అంశా అయినా కన్యభాహు కుమార్తె. ఈమె చిన్ననాటి నుంచే శ్రీహరిని పూజించేది. ఆమెకు యుక్త వయస్సు రాగానే తండ్రి వివాహం చేయడానికి ప్రయత్నిస్తాడు. అందుకు నీల సున్నితంగా తిరస్కరించి శేషాచలం పర్వతాల దగరకు వెళ్లి శ్రీహరి కోసం తపస్సు చేస్తుంది. తండ్రి చేసేది లేక ఆమెకు రక్షణ కల్పిస్తాడు. ఆమె తీర్వ తపస్సుకి మెచ్చి శ్రీహరి ప్రత్యక్షమవుతారు. ఆమె తనని వివాహం చేసుకోవాలని కోరుకుంటుంది. అందుకు శ్రీహరి కృష్ణ అవతారంలో నీ కోరిక నెరవేరుతుంది అని అభయమిస్తారు. నీల శ్రీకృష్ణుల వివాహం పెద్దల సమక్షంలో జరుగుతుంది. 


కాలింది 
ఈమెనే యమునా అనికూడా పిలుస్తారు. సూర్యుని అంశా అయినా వివశవంత కుమార్తె కాలింది. ఈమె శ్రీహరిని భర్తగా పొందటానికి పాపానుతాపమనే విశిష్టి తపస్సుని యమునా నది ఒడ్డున ఆచరించింది. ఒకరోజు శ్రీకృష్ణార్జునులు అటువైపుగా వచ్చారు. ఆమెను చుసిన శ్రీకృష్ణుడు వివరాలు కనుకోమని ఆమె దగరకు అర్జునుడిని పంపిస్తారు. ఆమెను గురించి తెలుసుకున్న అర్జునుడు అరికృష్ణుడికి చేపి ఇద్దరికి సంధి కుదిర్చి పెద్దల సమక్షంలో వివాహం జరిపిస్తారు.

లక్షణ 
మధురదేశానికీ రాజు అయినా బృహసేనుడి కుమార్త లక్షణ. స్వయంవరంలో మత్స్య యంత్రం చేధించిన వారికీ తన కుమార్తను ఇచ్చి వివాహం చేస్తాను అని ప్రకటిస్తాడు. లక్షణ పూర్వజన్మలో అగ్నిదేవుని పుత్రిక. ఆమె పూర్ణపురుషుడు శ్రీహరి మాత్రమే అని భావించి ఆయనను భర్తగా పొందాలని తపించి ప్రాణత్యాగం చేస్తుంది. అందుకనే శ్రీకృష్ణుడు స్వయంవరానికి వచ్చి మత్స్య యంత్రాన్ని ఛేదించి లక్షణను పెద్దల సమక్షంలో వివాహం చేసుకుంటారు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...