హయగ్రీవ స్వామి అవతార కథ

      హయగ్రీవ స్వామి అవతార కథ                                                 

         పూర్వం గుర్రపు తల ఉన్న ఒక రాక్షసుడు ఆదిపరాశక్తి గురించి గోరమైన తపస్సు చేసాడు. అతని తపస్సుకి మెచ్చి అమ్మవారు ప్రత్యక్షమైంది. హయగ్రీవా నీకు ఏమి వరం కావాలో కోరుకో అని అడుగుతుంది. హయగ్రీవుడు నాకు చావు లేకుండా వరం కావాలి అని అడుగుతాడు. దానికి అమ్మవారు ఈ సృష్టిలో చావులేని వరం ఇవ్వటం కుదరదు అని చెపింది అమ్మ. అందుకు హయగ్రీవుడు అయితే నాకు నా ముఖము గల అతని చేతిలోనే నాకు మరణం రావాలి కోరుకున్నాడు. అమ్మవారు తధాస్తు అని వెళ్లిపోయేది. 

        ఆ వరగర్వంతో పాతాలని, భూలోకాని జయించాడు. చివరకు స్వర్గలోకం మీదకు దండెత్తి వచ్చాడు. దేవతలు అతనితో తలపడలేక బ్రహ్మదేవుని దగరకు వెళ్లరు. బ్రహ్మదేవుడు వారిని తీసుకొని వైకుంఠానికి వెళ్లరు. విష్ణుమూర్తి వారికీ అభయమిచ్చి దేవతలతో కలిసి స్వర్గానికి వచ్చి హయగ్రీవునితో యుద్ధం చేసారు. ఈ యుద్ధం 10 ,౦౦౦ సంవత్సరాలు యుద్ధం జరిగింది. అమ్మవారు వరప్రభావం వాళ్ళ విష్ణుమూర్తి కూడా అతనిని ఓడించలేక పోయారు. ఈలోపు విష్ణుమూర్తి అలసిపోయే ఎవరికీ చెప్పకుండా విశ్రాంతి తీసుకోవటానికి వెళ్లిపోయారు. ఒకచోట పద్మాసనం వేసుకొని విశ్రాంతి తీసుకోవటానికి కూర్చున్నారు. కాని స్వామి తల ఊగుతుంటే తన తలను నిలబెట్టటానికి అయన ధనస్సునే వొంచి అల్లెతాడుని లాగి కటి దాని కోన గడం కింద పెట్టుకొని విశ్రాంతి తీసుకున్నారు. 



          ఇంతలో దేవతలు విష్ణుమూర్తి అక్కడ యుద్ధంలో లేరు అని తెలుసుకొని ఆయనను వెతకటానికి బ్రహ్మదేవునితో కలిసి వైకుంఠానికి వెలారు. అక్కడ స్వామి లేకపోవటంతో స్వామిని క్షిరసాగర ప్రాంతం వెతకసాగారు. ఒకచోట విష్ణుమూర్తి పద్మాసనం వేసుకొని ధనుస్సుని గడం కింద పెట్టుకొని ధ్యాన ముద్రలో ఉన్న స్వామి కనిపించరు. దేవతలు, బ్రహ్మ దేవుడు సంతోషించి స్వామిని ఎవరు నిద్ర లేపాలి అని అనుకొన్నారు. దేవతలు బ్రహ్మదేవుడిని వేడుకున్నారు. బ్రహ్మదేవుడు నేను ఆపని చేయలేను అని శివుడిని వేడుకున్నారు. శివుడు నేను కూడా ఆ పని చేయలేను అన్నారు. ఇక బ్రహ్మ దేవుడు ఒక ఆలోచన చేసి నేను ఒక పురుగును సృష్టిస్తాను. అని వంగ్రా(చెద) అనే పురుగుని సృష్టించి దానికి శ్రీమహా విష్ణువు అల్లే తాడును కొరకమని ఆదేశించారు. అల్లే తాడు కొరకడం వల్ల ధనుస్సు కదిలి స్వామికి మెలకువ వస్తుంది అని ఆ పురుగుకి ఆజ్ఞాపించారు. అందుకు ఆ పురుగు నేను ఈ పాపం చేయలేను అంటుంది. బ్రహ్మదేవుడు అపుడు ఏది క్షారసాగరం దగర పుట్టటం వల్ల దీనికి వేదజ్ఞానం వచ్చింది. అనుకోని ఈ పని చేస్తే నీకు ఏమి వరం కావాలో ఇస్తాను అన్నారు. అందుకు ఆ పురుగుకు బ్రహ్మదేవుడు నీకు యజ్ఞం లో వేసే నేతి హవిసు వేసేటపుడు నేలమీద పడ నేయి నీకె అని వరం ఇస్తారు. దానికి ఆ పురుగు నాకు ఆ వరం చాలదు అంటుంది. దానికి బ్రహ్మదేవుడు నెల మీద పడ ద్రవ పదార్ధం నీకె, ఎవరైనా పురాణం పుస్తకములు చెదవకుండా దాచిన ఆ పుస్తకాలూ నీకె అని వరం ఇస్తారు. ఆ పురుగు సంతోషించి వేలి అల్లే తాడు కొరకగానే విపరీతమైన శబ్దం వచ్చి శ్రీమహావిష్ణువు నిద్ర లేవకపోగా అయన తల తెగి ఎగిరి సముద్రంలో పడింది. దేవతలు కంగారుగా పడిపోయి సముద్రంలో ఎంత వెతికిన కనిపించదు. అనుకోని ఈ సంఘటన వల్ల ఎవరికీ ఏమి చేయాలో అర్ధం కాలేదు. అందరికి ఆ ఆదిపరాశక్తిని ప్రార్ధిదామని అనుకొన్న శక్తీ సరిపోలేదు. అపుడు బ్రహ్మదేవుడు తన దగర ఉన్న నాలుగు వేదములు రూపం ధరించి బయటకు వచ్చాయి. అవి ఆ ఆదిపరాశక్తిని ప్రదించాయి. అపుడు అమ్మవారు అనుగ్రహించి ఆకాశవాణి రూపములో తన వాక్కుతో ఉత్తర దిక్కున నిద్రిస్తున్న గుర్రపు తలను తీసుకువచ్చి అతికించామని చెపింది. బ్రహ్మదేవుడు ఏడుస్తూ ఎలా ఎందుకు జరిగింది అమ్మ అని అడుగుతారు.        

            దానిని అమ్మవారు హయగ్రీవుడు అనే రాక్షసుడు నా గురించి తపస్సు చేసి తనలాగే ఉన్న అతని చేతిలోనే మరణించాలి అని కోరుకున్నాడు. ఇంకొకటి ఒకసారి లక్ష్మిదేవి, విష్ణుమూర్తి ఏకాంతంగా ఉన్న సమయంలో విష్ణుమూర్తి లక్ష్మీదేవిని చూసి నవ్వుతారు. ఈ కారణం లేకుండా తనని చూసి నవ్వుతున్న విష్ణుమూర్తిని చూసి తట్టుకోలేక ఒకరోజు ని తల తెగిపడుతుంది అని శపిస్తుంది. కొంత సేపటి తరువాత తాను చేసిన పనికి బాధపడుతుంది. శ్రీమహావిష్ణువు చిరునవ్వు నవ్వి నువ్వు ఇచ్చిన శాపం కూడా లోకకల్యాణానికే ఉపయోగపడుతుంది అని అభయమిస్తారు  అని అమ్మవారు చెపుతుంది.

              బ్రహ్మదేవుడు అమ్మవారికి నమస్కరించి దేవతలను పంపించి గుర్రపు తలను తెమ్మని పంపిస్తారు. దేవతలు గుర్రం తలని తీసుకువచ్చి విష్ణుమూర్తికి అతికిస్తారు. విష్ణుమూర్తి మళ్ళి లేచి నుంచి మళ్ళి యుద్ధనికి బయలుదేరుతారు. ఆ యుద్ధంలో హయగ్రీవుడిని చంపుతారు శ్రీమహావిష్ణువు. హయగ్రీవుడిని చంపారు కాబట్టి గుర్రపుతల కలిగిన స్వామి కాబట్టి హయగ్రీవా స్వామి అని దేవతలందరు కీర్తించారు. తరువాత విష్ణుమూర్తి తన నిజ స్వరూపాన్ని ధరించి అంశా రూపమున హయగ్రీవస్వామి ఉండిపోయారు. తరువాత విష్ణుమూర్తి వైకుంఠానికి వెళ్లిపోయారు. హయగ్రీవా స్వామి హిమాలయాలకు వెళ్లి అమ్మవారు గురించి గోరతపస్సు చేసి అమ్మవారు రహస్యనామలు అయినా లలిత సహస్ర నామావళి రచించారు. కొంతకలం తరువాత అగస్యమహర్షికి, లోపాముద్రకి ఉపదేశించారు. వారు భూలోకములో ప్రచారం చేసారు.   


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...