ఉంటే దుర్వాసమహామునిలా ఉండాలి అన్నారు!

 ఉంటే దుర్వాసమహామునిలా ఉండాలి అన్నారు!



ఇది దేవి భాగవతంలోని కథ. ఒకసారి దుర్వాసమహాముని లలితాత్రిపురసుందరి అమ్మవారిని చూడాలని తపస్సు ప్రారంభించారు. కొంతకాలం తరువాత అతని తపస్సుకి మెచ్చిన అమ్మవారు దుర్వాసమహామునిని పరీక్షించాలి అనుకుంది. ముందుగా వరుణ దేవుడిని పంపించింది. వరుణదేవుడు దుర్వాసమహాముని దగరకు వచ్చు మీ తపస్సుకి మెచ్చాను నీకు ఏమి వరం కావాలో కోరుకో మన్నారు. అందుకు దుర్వాసమహాముని స్వామి నేను మీ కోసం తపస్సు చేయటం లేదు నేను లలిత పరమేశ్వరి అమ్మవారిని చూడాలి అనుకుంటున్నాను అన్నారు. వరుణ దేవుడు వెళ్లిపోయారు. దుర్వాసమహాముని మళ్ళి తపస్సులో లీనమయ్యారు. మరికొంతకాలానికి ఇంద్రదేవుడిని పంపించింది. దుర్వాసమహాముని దగరకు వచ్చి నీకు ఏమి వరం కావాలో కోరుకోమన్నారు. అందుకు దుర్వాసమహాముని నీకు ఏమి వరం వద్దు నేను అమ్మవారి కోసం తపస్సు చేస్తున్నాను అని అన్నారు. ఇంద్రదేవుడు అక్కడి నుంచి వెళ్లిపోయారు. దుర్వాసమహాముని మళ్ళీ తపస్సులో లీనమయ్యారు. మరికొంతకాలానికి బ్రహ్మదేవుడిని అయన వద్దకు పంపించింది. బ్రహ్మ దేవుడు దుర్వాసమహాముని ఎదుట ప్రత్యక్షమై దుర్వాస నీకు ఏమి వరం కావాలో కోరుకోమన్నారు.  అందుకు దుర్వాసమహాముని నన్ను క్షమించండి బ్రహ్మదేవా నాకు ఏమి వరం వద్దు. నేను అమ్మలగన్న అమ్మ కోసం తపస్సు చేస్తున్నాను. బ్రహ్మదేవుడు సరే అని అక్కడి నుంచి వెళ్లిపోయారు. దుర్వాసమహాముని మళ్ళీ తపస్సులో లీనమయ్యారు. మరికొంతకాలానికి అమ్మవారు శ్రీమహావిష్ణువుని దుర్వాసమహామునిని పరీక్షించామని పంపించారు. శ్రీమహావిష్ణువు దుర్వాసమహాముని ఎదుట ప్రత్యక్షమై దుర్వాస! నీ కఠోర తపస్సుకి మెచ్చాను. నీకు ఏమి వరం కావాలో కోరుకోమన్నారు.  నీవు ఏమి అడిగిన అని నేను నీకు ప్రసాదిస్తాను కోరుకో అన్నారు. సాక్షాత్తు శ్రీమహావిష్ణువే ప్రత్యక్షమయే సరికి దుర్వాసమహాముని ఏడుస్తూ నా జన్మ తరించింది స్వామి మీ దర్శన భాగ్యంతో కానీ నన్ను క్షమించండి స్వామి నాకు ఏమి వరం వద్దు. అమ్మ కావాలి అని చెప్పారు.  అందుకు శ్రీమహావిష్ణువు నీ తపస్సు కఠోరమైనది దుర్వాసా నీ అభిష్టం నెరవేరాలని ఆశీర్వదిస్తున్నాను. తధాస్తు అని వెళ్లిపోయారు. దుర్వాసమహాముని సంతోషించి మళ్ళీ తపస్సుని ప్రారంభించారు. మరికొంతకాలానికి దేవాధిదేవుడైన మహాదేవుడి శివుడు దుర్వాసుడిని పరీక్షించటానికి వచ్చారు. దుర్వాసా నీ తపస్సుకి వెచ్చాను. నీకు ఏమి వరం కావాలో కోరుకొమ్మరు. సాక్షాత్తు దేవాధిదేవుడైన మహాదేవుడు ప్రత్యక్షమై వరం ఇస్తాను అనేసరికి దుర్వాసమహామునికి చాల సంతోషం వేసింది. అయన పాదాలపై పడి స్వామి దయకు పాత్రుడిని అయినందుకు సంతోషంగా ఉంది. కానీ నాకు అమ్మ మాత్రమే కావాలి స్వామి అన్నారు. మహాదేవుడు అతనిని ఎన్నివిధాలా సమాధాన పరచిన అతను అమ్మ మాత్రమే కావాలి అన్నారు. మహాదేవుడైన శివుడు నీ అభిష్టం నెరవేరాలి అని ఆశీర్వధిసున్నాను అని వెళ్లిపోయారు. దుర్వాసమహాముని పట్టు వేదలకుండా అమ్మవారి గురించి తపస్సు చేసారు. అలా పదివేల సంవత్సరాలు జరిగాయి. లలిత మరమేశ్వరి అమ్మవారు ఆయన తపస్సుకి మెచ్చి ప్రత్యక్షమైయేది. దుర్వాస! నీ తపస్సుకి మెచ్చాను.  ఇకనుంచి నువ్వు ఎపుడు కావాలి అంటే అపుడు మణిద్విపానికి రావచ్చు నన్ను దర్శనం చేసుకోవచ్చు. నన్ను సేవించుకోవచ్చు. మా మాటలు విని దుర్వాసుడు పరమానంద భరితుడు అవుతాడు. అమ్మ నా జన్మ ధన్యమైనది. నేను చూడటం కోసం తాపత్రయ పడను. చివరికి నా తపస్సు ఫలించింది అని అమ్మవారిని పరిపరి విధాలా కీర్తించారు.  అమ్మవారు దుర్వాసమహామునిని ఆశీర్వదించి అదృశ్యమయ్యారు. అలా దుర్వాసమహాముని లాగా ఉండాలి అన్నారు. అయన ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకొని దానిని సాధించేవరకు వదిలిపెట్టలేదు. మధ్యలో ఎన్ని అవకాశాలు వచ్చిన వదిలి పెట్టి కేవలం తన లక్ష్యం కోసమే పాటుపడ్డారు. 


ఓం శ్రీమాత్రే నమః 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...