లోభం వల్ల వచ్చే ప్రమాదం

లోభం వల్ల వచ్చే ప్రమాదం 

 ఒకసారి సనకసనందనాదులు శ్రీమహావిష్ణువును దర్శనం చేసుకోవటానికి వచ్చారు కానీ వాళ్లని దర్శనానికి జయవిజయులు అనుమతించలేదు. అందుకు ఆగ్రహించిన సనకసనందనాదులు జయవిజయులును మీరు  శ్రీమహావిష్ణువు సన్నిధిలో ఉన్నామని అహంకారానికి లోనయ్యారు అందుకే మీరు మూడు జన్మలు రాక్షసులై జన్మించి శ్రీమహావిష్ణువుకు విరోధులై ఆయనచేతిలోనే వధించబడతారు. అందుకు జయవిజయులు ఏడుస్తూ శ్రీమహావిష్ణువుని ప్రాదించారు. శ్రీమహావిష్ణువు ప్రత్యక్షమై మీరు ఈ శాపాన్ని అనుభవించవలసిందే అని శాపానంతరం మీరు మళ్ళీ నా సన్నిధికే వస్తారు అని చెప్పారు. కొంతకాలం తరువాత కశ్యప ప్రజాపతి సంధ్యావందనం చేసేటపుడు అయన భార్య దితి వచ్చి నాకు సంతాన భాగ్యం ప్రసాదించండి అని అడుగుతుంది. అందుకు కశ్యప ప్రజాపతి దితి ఏది సమయం కాదు అసుర సంధ్య వేళా ఈ వేళలో రమిస్తే రాక్షసుకు వంటి పుత్రులు పుడతారు అని ఎంత నచ్చచెపిన వినిపించుకోదు. ఇక వేసేది లేక ఆవిడా కోరికను తీర్చి వచ్చి మళ్ళీ అయన తపస్సును కొనసాగించారు. కొన్నాళ్లకి ఆవిడా గర్భం ధరించింది. ఆవిడా వచ్చి తన భర్తను నాకు ఎటువంటి పిల్లలు పుడతారు అని అడుగుతుంది. అందుకు కాశ్యపప్రజాపతి నువ్వు కూడని సమయంలో నన్ను సంతానని కోరావు అందుకు నీకు రాక్షసులు అయినా పిల్లలు పుడతారు. మరి కొంతకాలానికి ఆవిడకి ఇద్దరు కమల పిల్లలు పుడతారు. వారికీ హిరణ్యాక్ష, హిరణ్యకశిపులు అని పేర్లు పెడతాడు. వారు పెరుగుతున్నకొద్దీ లోకకంటకులుగా తయారవుతారు. హిరణ్యకశిపుడు బ్రహ్మ కోసం తపస్సు చేస్తారు.    



హిరణ్యాక్షుడు వారాహి మాతను గురించి తపస్సు చేస్తారు. ఆమె లలిత పరమేశ్వరి అమ్మవారి దగ్గర సర్వ సైన్యాధిపతి. హిరణ్యక్ష్యుడి గోరమైన తపస్సుకి మెచ్చి అమ్మవారు ప్రత్యక్షమై నీకు ఏమి వరం కావాలో కోరుకో అన్నారు. అందుకు హిరణ్యాక్షుడు నాకు చావులేని వరం కావాలి అని కోరుకున్నాడు. అందుకు వారాహి మాత ఆ వరం ఇవ్వటానికి కుదరదు ఇంకేమన్నా కోరుకో అంటుంది. హిరణ్యాక్షుడు అయితే నాకు రెండు వరాలు కావాలి. మొదటిది నన్ను నీలాంటి రూపం ఉన్నవాలె నన్ను చంపాలి. రెండోవది నేను ని భక్తుడిని కనుక నువ్వు నన్ను చంపకూడదు అని అడుగుతాడు. అందుకు అమ్మవారు తధాస్తు అని మాయమవుతుంది. హిరణ్యాక్షుడు మనస్సులో అమ్మవారిని మోసంచేశాను. ఆమెలాంటి రూపం మరొకరికి లేదు ఆమెనన్ను చంపదు అని నాకు ఇంకా చావులేదు అని అహంకారం పెంచుకుంటాడు.



ఆ వర గర్వముతో అన్ని లోకాలలో ఏది కనపడితే లోభంతో అది నాది అని లాకోవటం ప్రారంభించాడు. ఈ లోపు ప్రళయకాలం వచ్చింది భూమి అంత జలమయం అయింది. భూమి సముద్రంలోకి వేలేసరికి సముద్ర గర్భంలో ఉన్న భూమిని పట్టుకొని ఈ భూమి నాది అని అన్నాడు. బ్రహ్మ దేవుడు మనువుని పిలిచి నువ్వు భూమిని ధార్మికంగా పరిపాలించు అన్నారు. మనువు అసలు భూమి ఉంటేకదా పరిపాలించటానికి అంటారు. పాతాళంలో ఉన్న భూమిని ఎవరు పైకి తీసుకువస్తారు అన్నారు. అపుడే బ్రహ్మదేవుడికి తూమువచ్చింది. ఆ తూములోనుంచి ఒక చిన్న వరాహం బయటకు వచ్చింది. అది చూస్తుండగానే పెద్దదయింది. 

అపుడే బ్రహ్మదేవుడికి తూమువచ్చింది. ఆ తూములోనుంచి ఒక చిన్న వరాహం బయటకు వచ్చింది. అది చూస్తుండగానే పెద్దదయింది. ఆ వచ్చినది ఎవరో కాదు సాక్షాత్తు శ్రీమహావిష్ణువే యాజ్ఞవరాహమూర్తిగా వచ్చారు అని నమస్కరించారు. అయన వెంటనే సముద్రంలోకి వెళ్లి మూతితో భూమిని వెతుకుతున్నారు. మరి కాసేపటికి బయటకు వచ్చి తన శరీరాన్ని విదిలించారు. శ్రీమహావిష్ణువు శరీరం నుంచి వచ్చినవి కాబ్బటి అవి అభిషేక జాలం కన్నా పవిత్రమైన అని దేవతలందరు తలలువొంచి స్వకరించారు. మళ్ళీ స్వామి సముద్రంలోకి వెళ్లి భూమిని వెతకటం మొదలు పెట్టారు. పాతాళంలో ఉన్న భూమిని హిరణ్యాక్షుడు పట్టుకొని ఉండటం చూసి వాడిని తోసేసి భూమిని అయన కోరలపై నుంచో పెట్టి పైకి తీసుకువస్తున్నారు. వెనకాలే హిరణ్యాక్షుడు వెంటపడ్డాడు. భూమిని పైకి తీసుకువచ్చిన తరువాత హిరాణ్యాక్షుడితో యుద్ధం చేసి అతనిని సంహరించారు. అలాగా యజ్ఞ వరాహ మూర్తి ఆవిర్భావం జరిగింది. హిరణ్యాక్షుడు తనకు ఉన్న లోభాని జయించలేక చుసిన ప్రతిదీ తనకే కావాలి అని లాకోవటం వల్ల ఆఖరికి భగవంతుని చేతిలోనే మరణం పొందవలసి వచ్చింది. వరాహమూర్తి రక్షించి తెచ్చినది కాబ్బటి ఈ యుగాన్ని వరాహకల్పం అని పేరు వచ్చింది. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...