శ్రీకృష్ణ

    శ్రీకృష్ణుడు యశోదమ్మకు ఇచ్చిన బహుమతి



మహాజ్ఞానులు కూడా దర్శనం చేయలేని కానుకను అమ్మకు ఇద్దాము అనుకున్నారు చిన్నికృష్ణుడు. ఒక రోజు శ్రీకృష్ణుడు, బలరాముడు, గోపబాలురు దాగుడుమూతలు అట ఆడుకుంటున్నారు. అందరూ వెళ్లి దాకున్నారు. శ్రీకృష్ణుడు ఎవరు చూడటం లేదు అని కొంచం మట్టి తీసుకొని తింటున్నారు. దానిని ఒక గోపబాలురు చూసాడు. చూసి వెళ్లి బలరాముడికి చెప్పారు. బలరాముడు, గోపబాలురు చిన్ని కృష్ణుడిని తీసుకొని యశోదమ్మ దగ్గరకు తీసుకొచ్చారు. బలరాముడు యశోదమ్మతో ' అమ్మ! కృష్ణుడు మట్టి తింటున్నాడు' అని చెప్పారు. యశోదమ్మకు కోపం వచ్చి చిన్ని కృష్ణుడిని దగ్గరకు తీసుకొని ' కృష్ణా! మట్టి ఎందుకు తింటున్నావు. ఇంట్లో నీకు వెన్న, పాలు, పెరుగు లేవా. నీకు ఎన్ని సారులు చెప్పాను మట్టి తినదు అని అసలు మట్టి ఎందుకు తింటున్నావు' అంటుంది. అందుకు శ్రీకృష్ణుడు కోపంతో 'అమ్మ! మట్టి తినటానికి నేను చిన్న పిలాడినా, చేతకానివాడిన, వెరివాడిన వీరి మాటలు నమ్మి నన్ను అంటున్నావా. నన్ను నువ్వు కొట్టాలని వీళ్ళు అలా చెపుతున్నారు. నిజంగా నేను మట్టి తింటే నా నోరు వాసనా వస్తే నన్ను కోటు అమ్మ' అని అంటారు. యశోదమ్మా తేలబోయి ఇదేంటి ఇలా అంటున్నాడు అని నోట్లో వాసనా చూదామని మోకాళ్లమీద కూర్చొని చిన్ని కృష్ణుడి నీటిలోకి చూసింది అంతే అయన నోటిలో

సమస్త బ్రహ్మాండాలు, నక్షత్రాలు, గ్రహాలు, సమస్తలోకాలు అందులో ఉన్న భూమి, భూమిలో ఉన్న సమస్త పర్వతాలతో, నదులతో, చెట్టులతో, మనుషులతో, పశువులతో,నందవ్రజంతో తన ఇంటితో తనతో, నందునితో, చిన్ని కృష్ణుడిని నోటిలో చూసి ఆశ్చర్యపోతుంది. యశోదమ్మ ' ఇది కల వైష్ణవమయ, ఏదయినా సంకల్పమా, నిజామా, నేను యశోధనేనా,నేను అసలు ఇంట్లోనే ఉన్నానా  వీడు నా కుమారుడేనా ఇంత చిన్న నోటిలో బ్రహ్మాండాలు ఉన్నాయా ఆలోచిస్తే చాల ఆశ్చర్యంగా ఉంది.  ఆమె ఇలా ఆలోచిస్తుంటే చిన్ని కృష్ణుడు అమ్మ ఇలాగే ఆలోచిస్తే అమ్మకు వైరాగ్యం వస్తుంది నన్ను భగవంతుడు అనుకుంటుంది అనుకోని విష్ణుమాయ కాపేస్తారు. కానీ యశోదమ్మకు ఆ రోజంతా పులకిరింతగానే ఉంటుంది. సాయంత్రం చిన్ని కృష్ణుడికి అన్న పెడుతుంది కానీ ఆలోచిస్తూనే ఉంటుంది అందుకని ఆ ఆలోచనని బాగా తీసేయాలి అనుకోని అప్పటిదాకా తింటున్న అన్నాని మానేసి నాకు అన్నం వద్దు అని మారం చేస్తారు. యశోదమ్మకు కోపం వచ్చి 'కన్నయ్య! నేను పెడితే ఎందుకు తింటావు. కొంచంసేపు అగు మాధవకవళం అని వస్తారు వాళ్లకి ఇచ్చేస్తాను. వాళ్ళు నిన్ను సంచిలో వేసుకుని వెళతారు. వాళ్ళు ఊరంతా అడిగి తెచ్చుకున్న అన్నాని నీకు పెడతారు అపుడు నీకు బుద్ది వస్తుంది నేను పెడితే ఎందుకు నచ్చుతుంది' అని అంటుంది. యశోదమ్మ అలా అంటుంటే చిన్ని కృష్ణుడు బుంగమూతి పెట్టుకుంటాడు. ఈలోపు నిజంగానే మాధవకవళం అంటూ వస్తారు. యశోదమ్మ వచ్చిన వాళ్లకి ఏదో ఒకటి ఇచ్చి  పంపాలి అని వెలబోతుంది. చిన్నికృష్ణుడు వెంటనే చిరకుచ్చిళ్లలో తలపెట్టుకొని అమ్మ వొంక మాధవకవళం వొంక చూస్తారు. యశోదమ్మ నవ్వుకొని 'కన్నయ్య! నేను నిన్ను ఎందుకు వేస్తాను చెప్పు. లేక లేక పుట్టావు. నీవు ఇచ్చేస్తానా ఇవ్వను. బయపడకు ఇక్కడ కూర్చో వచ్చిన వాడికి కొంచం అన్న పెట్టి వస్తాను అని కూర్చోపెట్టి వెళుతుంది. చిన్నికృష్ణుడు అమ్మ మొత్తం మరచిపోయింది అని నవ్వుకుంటారు.   



     

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...