సూర్యవంశం చరిత్ర

శ్రీ మహావిష్ణువు నాభి కమలం నుంచి బ్రహ్మ, అయన అంగుష్ఠా భాగము నుంచి దక్షప్రజాపతి జన్మించారు. ఆయనకుమార్తె అతిధి కాశ్యపప్రజాపతిల కుమారుడు సూర్యుడు జన్మించారు.



సూర్యుని కుమారుడు వైవశ్వతమనువు జన్మించారు. వైవశ్వతమనువుకు తొమిదిమంది కుమారులు జన్మించారు. వారు 

1. ఇక్ష్వాకువు 

2. శర్యాతి 

3. నృగుడు 

4. దృష్ట

5. పృషధ్రుడు 

6. నరిష్యతుడు

7. నభగుడు

8. దిష్ట

9. శశకుడు

ఇంకా మనువుకు ఇలా అను కూతురు, సుద్యుమ్నుడను కొడుకు ఉన్నారు. 

ఇలాకు బుధునకు పురూరవ మహారాజు. 

సుద్యుమ్నుడు ముగ్గురు పుత్రులు వారు 

 ఉత్కళ,

వినత, 

గాయనామ 

శశకుడు(కరుషుడు) నుండి క్షత్రియులు ఉత్పత్తి జరిగింది. వారు కారుషులుగా విఖ్యాతి పొందారు.

నాభాకుడు వైశ్యుడయ్యాడు. అతని కుమారుడి భలందనుడు. అతని కుమారుడు వత్సి ప్రీతి , అతని కుమారుడు పాంశుఖ నిత్రులు, అతని కుమారుడు ఖనితృడు, అతని కుమారుడు భూపుడు, అతని కుమారుడు క్షుపుడు, అతని కుమారుడు వింశుడు, అతని కుమారుడు వివింశజుడు. వివిశకుని వంశంలో వరుసగా ఖనినేత్రుడు, విభూతి, కరంధముడు, అవిక్షితుడు, మరుత్తు, నరిష్యంతుడు, తముడు, రాజవర్ధనుడు, సుధృతి, నరుడు, కేవలుడు, బంధుమానుడు, వేగవానుడు, బుధుడు, తృణబిందువు, విశాలుడు, హేమచంద్రుడు, చంద్రుకుడు, ధూమ్రాశ్వుడు, సృరంజయుడు, సహదేవుడు, కృశాశ్వుడు, సోమదత్తుడు, జనమేజయుడు కలిగారు. వీరంతా వైశాలక రాజులని పిలవబడ్డారు. వీరిలో తృణబిందువుకి అలంబుష అనే అప్సరస ద్వారా ఇలవిలయను కూతురు జన్మించింది.

వైవశ్వతమనువు  కుమారుడు శర్యాతికి సుకన్య అను కుమార్తె జన్మించింది. ఆమెని చ్యవనమహర్షి వివాహం చేసుకున్నారు. శర్యాతి వంశంలో వరుసగా అనంతుడు, రేవతుడు, రైవతుడు జన్మించారు. రైవతుని కుమార్తె రేవతి.
వైవశ్వతమనువు  కుమారుడు ధృష్టునికి ధార్ట్ష అను కుమారుడు జన్మించారు. అతడు వైష్ణవుడు అయ్యాడు. 
వైవశ్వతమనువు  కుమారుడు నభగుని వంశంలో క్రమంగా నేదిష్ఠ, అంబరీష, విరూప, పృషధక్ష, రధీనరులు జన్మించారు. వీరందరూ వాసుదేవ భక్తులు.  

వైవస్వతమనువు కుమారుడు ఇక్ష్వాకునికి వికుక్షి, నిమి, దండకులని ముగ్గురు కుమారులు. వికుక్షి యాజ్ఞియ శశకము(కుందేలు)ను భక్షించి శశధనామముతో విఖ్యాతి పొందాడు. అతని కుమారుడు పురంజనుడు, కాకుతస్థుడు. కాకుతస్థుడు కుమారుడు వేనుడు. అతని కుమారుడు పృధుచక్రవర్తి. అతని కుమారుడు విష్వరథుడు,  ఆర్ద్రుడు, యువనాశ్వుడు, శ్రీవత్సుడు, బృహదశ్వుడు, కువలాశ్వుడు, దృఢాశ్వుడు. ఈయనకే దుందుమారుడనే పేరుతో విఖ్యతి పొందారు. దృఢాశ్వ కుమారులు చంద్రాశ్వుడు, కపిలాశ్వుడు, హర్వశ్యుడు. వారిలో హర్యశ్వుని వంశం వరుసగా నికుంభుడు, హితాశ్వుడు, పూజాశ్వుడు, యువనాశ్వుడు, మాందాత జన్మించారు. మాంధాతకతని భార్య బిందుమతి. విరికి ముచుకుందుడు, అంబరిషుడు, పురుకుత్సుడు అనే ముగ్గురు కుమారులు, యాబైమంది కుమర్తేలు జన్మించరు. మాంధాత కుమర్తెలందరిని సౌభరి మహమునికిచి వివాహం చేసారు.
అంబరీషుని కుమరుడు యువనాశ్వుడు, అతని కుమరుడు హరితుడు. పురుకుత్సునికి నర్మద ద్వారా త్రసదస్యువను కుమరుడు జన్మించాడు. అతని వంశంలో వరుసగా అనరణ్యుడు, హర్వశ్వుడు, వసుమనుడు, త్రిధన్వుడు, త్రయ్యారునుడు, సత్యరతుడు(త్రిశంకువు), హరిశ్చంద్రుడు, రోహితాశ్వుడు, హరీతుడు, చంచు, విజయుడు, రురుకుడు, వృకుడు, బాహువు, సగరుడు జన్మించి చక్రవర్తులైనారు.
సగరునికి ఇద్దరు భార్యలు. వారు సుమతి, కేశిని. సుమతికి అరవైవేల మంది పుత్రులు కలిగారు. వీరు వారి తండ్రి నిర్వహిస్తున్నా అశ్వమేద యగమునకు విడిచి పెట్టిన యగాశ్వామును వెతుకుతు వెళ్ళి కపిలమహముని అశ్రమములో ఉండడాన్ని చుసి నిజం తెలుసుకొకుండా ఆ మహర్షి కోపానికి గురి అయ్యయి కాలి బూడిదయ్యరు.
సగరుని రెండవ భార్య కేశినికి అసమంజసుడు, అతని కుమరుడు అంశుమంతుడు, అతనికి దిలీపుడు, అతని కుమరుడు భగీరథుడు. ఈయనే గంగాను భూమిపైకి తీసుకువచ్చరు. భగీరథుని కుమరుడు శ్రుతుడు అతనికి నాభాగుడు, అతని కుమరుడు అంబరిషుడు, అతని కుమరుడు సింధుద్వీపుడు, అతని కుమరుడు అయుతాయువు, అతని కుమరుడు ఋతుపర్ణుడు, అతని కుమరుడు సర్వకాముడు, అతని కుమరుడు సుదాసుడు, అతని కుమరుడు సౌదాసుడు వరుసగా కల్మషపాదుడు, అశ్వకుడు, మూలకుడు, దశరథుడు, ఐలబిలుడు, విశ్వసహుడు, ఖట్వాంగుడు, దీర్ఘబాహువు(రఘుమహారాజు), అజుడు, దశరథుడు వరుసగా చక్రవర్తులైయరు. 
దశరథుని కుమారులు రాముడు, లక్ష్మణుడు, భరత, శత్రుఘ్నులు. శ్రీరాముని కుమారులు లవకుశులు, లక్ష్మణుని కుమారులు చిత్రాంగద చంద్రకేతువులూ, భరతునికి తరక్ష పుష్కరులూ, శత్రుఘ్నునికి సుబాహు, సురసేనులూ జన్మించారు. 
కుశమహరాజు వంశం వరుసగా అతిధి, నిషధుడు, నలుడు, నభస్సు(నభుడు), పుండరీకుడు, క్షేమధన్వుడు, దేవానీకుడు అహీనకుడు, రురుడు, పారియాత్రుడు, దలుడు, చలుడు, ఉక్థుడు, వజ్రనాభుడు, గణుడు, ఉషితాశ్వుడు, విశ్వసహుడు, హిరణ్యనాభుడు, పుష్పకుడు, ద్రువసంధి, సుదర్శనుడు, అగ్నివర్ణుడు, పద్మవర్ణుడు, శీఘ్రుడు, మరుడు, సుశ్రుతుడు, ఉదావసుడు, నందివర్ధనుడు, సుకేతుడు, దేవరాతుడు, బృహదుక్థుడు, దేవమీఢుడు, విబుధుడు, మహాధృతి, కీర్తిరాతుడు, మహారోముడు, స్వర్ణరోముడు, హ్రస్వరోముడు, సీరధ్వజుడు,భానుమంతుని, శతద్యుమ్నుడు, శుచి, ఊర్జుడు, సనద్వాజుడు, కులి, అనంజనుడు, కులిజిత్తు, ఆధినేమికుడు, శ్రుతాయువు, సుపార్శ్వుడు, సృంజయుడు, క్షేమారి, అనేనుడు, రామరథుడు, ఉపగురువు, ఉపగుప్తుడు, స్వాగతుడు, స్వవరుడు, సువర్చుడు, సుపార్శ్వుడు, సుశ్రుతుడు, జయుడు, విజయుడు, ఋతుడు, సునయుడు, వీతిహవ్యుడు, దృతి, బహులాశ్వుడు, క్రుతి, జనకుడు చక్రవర్తులైనారు.


   

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...