సొంత కుమారుడి చేతిలో మరణించిన అర్జునుడు

 మహాభారతంలో పాండవ మధ్యముడు అర్జునుడు. అర్జునుడికి ద్రౌపతి, సుభద్ర, ఉలూపి, చిత్రంగాధ. చిత్రంగాధ అర్జునుడి కుమారుడు బభృవాహనుడు. అర్జునుడు ఒకసారి అరణ్య వ్యాసానికి వెళ్లరు. మణిపుర రాజ్యానికి వెళ్లరు. అక్కడ అర్జునుడు చిత్రంగాధ ప్రేమించుకొన్నారు. ఈ విషయం తెలుసుకున్న రాజు అర్జునిడితో నాకు ఒక్కగానొక్క కుమార్తె నీవు పెళ్లి చేసుకొని తీసుకువెళితే నా వంశం నిర్వంశం అవుతుంది. అందుకని నీ కుమారుడిని నా రాజ్యానికి వారసునిగా చేస్తే మీ వివాహానికి అంగీకరిస్తాను అంటారు. అందుకు అర్జునుడు ఒప్పుకుంటాడు. వారికీ వివాహం జరుగుతుంది. కొన్నాళ్లకి అర్జునుడికి చిత్రంగాధకి బభృవాహనుడు జన్మిస్తాడు. తరువాత అర్జునుడు మళ్ళి అరణ్యవాసానికి వెళ్లిపోతారు. కొన్ని సంవత్సరాలకి కురుక్షేత్ర సంగ్రామం అయినతరువాత ధర్మరాజు అశ్వమేధ యాగం నిర్వహిస్తారు. ఆ యాగాశ్వము వెనుక అర్జునుడు వెళతాడు. అర్జునుడు పరాక్రమానికి ముందు ఎవరు నిలువలేక పోతారు. ఏది ఎలా ఉండగా నాగలోకంలో అర్జునుడు మరొక భార్య అయినా ఉలూపికి ఒక విషయం తెలుస్తుంది.


కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడు శికండిని అడం పెట్టుకొని భీష్ముడిని వధిస్తారు. ఈ విషయం వసువుల ద్వారా తెలుసుకున్న గంగా నా బిడ్డ ఎలా మరణించాడో అర్జునుడు కూడా తన కుమారుడి చేతిలో మరణిస్తాడు అని శాపం ఇస్తుంది. ఈ విషయం తెలుసుకున్న ఉలూపి బభృవాహనుడు దగరకు వచ్చి నాయన నేను మీ పినతల్లిని నీ తండ్రి అర్జునుడు యాగాశ్వము వెంట వస్తున్నాడు. నీ తండ్రికి శరణు వేడకుండా నీ పరాక్రమాన్ని చూపించు నీ తండ్రి సంతోషిస్తాడు అని అంటుంది. బభృవాహనుడు అర్జునుడితో యుద్ధనికి వెళతాడు. ఆ యుద్దములో బభృవాహనుడు బాణాలవల్ల గంగా దేవి శాపం వల్ల అర్జునుడు మరణిస్తాడు. ఈ విషయం తెలుసుకున్న చిత్రంగాధ ఉలూపిని నిందిస్తుంది. బభృవాహనుడు తన వల్ల జరిగిన పొరపాటుకు మూర్చపోతాడు. ఉలూపి వారి ఇద్దరిని సమాధాన పరచి గంగామాత శాపం గురించి వివరిస్తుంది. తన దగర ఉన్న సంజీవని మణితో అర్జునిడి ఉండెలమీద పెడుతుంది. మరణించిన అర్జునుడు మణి ప్రభావంతో నిద్రలో నుంచి లేచినట్టు లేస్తాడు. ఈ విధముగా అర్జునుడు తన సొంత కుమారుడి చేతిలో మరణించవలసిన పరిస్థితి వచ్చింది.  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...