Bhagavad gita_adhyatmikam1

భగవద్గీత

అద్యాయం 11

శ్లోకం 8

న తు మాం శక్యసే ద్రుష్టుమ్ అనేనౌవ స్వచక్షుషా |

దివ్యం దదామి తే చక్షుః పశ్య మే యోగమైశ్వరమ్ ||

అర్థం :-

కాని, చర్మ చక్షువు(కళ్ళ)లతో నా ఈ రూపమును నీవు నిజముగా చూడలేవు. కనుక, నీకు దివ్య దృష్టిని ప్రసాదిస్తున్నాను. ఈ దివ్యదృష్టితో నా ఈశ్వరీయ యోగశక్తిని చూడుము.





రుద్రాక్షలు - విశేషాలు

రుద్రాక్షలు - విశేషాలు



మన హిందువులలో "రుద్రాక్ష" పేరు విననివారుండరు అంటే అతిశయోక్తి కాదేమో. ఐతే ఈ రుద్రాక్షలు ఏమిటి? వాటి ప్రాముఖ్యత ఏమీటి అనే విషయాలు ఈ కాలంలో చాలా మందికి తెలియదు. రుద్రాక్ష వృక్షం ప్రపంచంలోని ప్రాచీన వృక్షాలలో ఒకటి. రుద్రాక్ష వృక్షం భారతదేశంలో దిగువ హిమాలయాలలో, నేపాల్ లో మరియూ ఇండోనేషియాలో విరివిగా పెరుగుతాయి. రుద్రాక్ష దేవదేవుడైన పరమేశ్వరుని స్వరూపమని హిందువుల నమ్మకం. రుద్రుడు అంటే శివుడు, రాక్షసులతో పోరాడి, మూడు పురములను భస్మం చేసినప్పుడు మరణించిన వారిని చూసి విచారించాడు. అలా ఆయన విచారించినప్పుడు జాలు వారిన కన్నీరు భూమిపై పడి చెట్లుగా మారాయి. అలాంటి వృక్షాలకు కాసిన కాయలను రుద్రాక్షలు అంటారు. రుద్రాక్ష అనగా రుద్రుడి కళ్ళు, కన్నీళ్ళు అని అర్థం. రుద్రాక్షలను శివ రూపాలుగా భావించి పూజించడం . ధరించడం అనాదిగా వస్తోంది. సాధారణంగా శివారాధకులలో కొందరు రుద్రాక్షలను మాలగా ధరించగా, మరికొందరు కంఠం వరకు మాత్రమే ధరిస్తుంటారు. ఇంకొందరు ముంజేతికి ... భుజాలకి ధరిస్తుంటారు. రుద్రాక్షలు పవిత్రమైనవి, శక్తివంతమైనవి, మహిమాన్వితమైనవి. రుద్రాక్షలు ధరించడం వల్ల అనుకున్న పనులు నెరవేరతాయి. ఎలాంటి కష్టనష్టాలు రావు. అడ్డంకులు తొలగిపోయి, సుఖసంతోషాలతో గడిపేందుకు పరమశివుడు ప్రసాదించిన దివ్యమైన కానుక రుద్రాక్ష. ఆత్మసాక్షాత్కారాన్ని పొందడానికి రుద్రాక్ష అసలైన మార్గం చూపుతుంది. రుద్రాక్షను ఋషులు భూమికీ, స్వర్గానికీ మధ్య వారధిగా భావిస్తారు. రుద్రాక్షలలో వివిధ ముఖాలున్నవి మనకు లభ్యమవుతాయి. ముఖ్యంగా 38 రకాల ముఖాలుండే రుద్రాక్షలు ఉన్నట్లు పురాణాల్లో పేర్కొనబడినప్పటికీ, పండితులు మాత్రం 21 ముఖాలు ఉన్న రుద్రాక్షలు మాత్రమే ఉన్నట్లు చెబుతారు. మొత్తం మీద పరిశీలిస్తే 14 ముఖాలున్న రుద్రాక్షలు మాత్రమే ప్రస్తుతం లభ్యవుతున్నాయి. వీటిని మానవులు ధరిస్తున్నారు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేక లక్షణం ఉంది. రుద్రాక్షలను ధరించడం ద్వారా కష్టాలు తొలగిపోయి.. సకల సంపదలు కలుగుతాయని స్కాంద పురాణం వివరిస్తోంది. వీటిని గురువులు, యోగుల సూచనలతో ధరించాలి. మహా శివరాత్రి, మాస శివరాత్రి, సోమవారం, పుష్యమి నక్షత్రం రోజు, ఏదైనా శుభ సమయంలో రుద్రాక్షలను శుద్ధి చేసి శివపూజ చేయాలి. ఆ తర్వాతే రుద్రాక్షను ధరించాలి. పౌర్ణమి, త్రయోదశి, చతుర్దశి తిథుల్లో రుద్రాక్షలను ధరించడం శుభదాయకం. నుదుట విభూతి, కంఠంలో రుద్రాక్షమాల ధరించి శివనామ జపం చేసే వ్యక్తిని దర్శించుకుంటే త్రివేణీ సంగమ స్నానం చేసినంత పుణ్యం ఫలం కలుగుతుంది. రుద్రాక్షలను ధరించిన వారికి అపజయాలు ఉండవు. రుద్రాక్షమాలను ఉంగరంలా ధరించ కూడదు. కుటుంబ సభ్యులు ధరించిన రుద్రాక్ష మాలను మరొకరు వేసుకోరాదు. తీవ్రమైన మానసిక ఒత్తిడితో బాధపడుతున్నవారు, అనారోగ్యం బారినపడ్డవారు రుద్రాక్షలను ధరిస్తే సమస్యలు మటుమాయమవుతాయి. దురలవాట్లకు బానిసలుగా మారిన వ్యక్తులు, అందులోంచి బయట పడలేకపోతే రుద్రాక్షమాలను ధరిస్తే మంచి ఫలితం ఉంటుంది.

                        

ఏకముఖి రుద్రాక్ష (ఒక ముఖము కలిగినది)


అత్యంత శ్రేష్టమయినది. శివుని త్రినేత్రంగా, ఓంకార రూపంగా, శివుని ప్రతిరూపంగా నమ్ముతారు. ఇది దరించిన వ్యక్తికి ఏ విషయంలోనూ కొరత ఉండదు. వ్యక్తి వికాసం, జ్ఞాన సమృద్ది, సంపద చేకూరతాయి. సర్వతోముఖ అభివృద్ధి. అన్ని పాపాలను హరించి అన్ని కోరికలను సిద్ధింపచేస్తుంది.


ద్విముఖి (రెండు ముఖములు కలిగినది)


దీనిని శివపార్వతి రూపంగా-అర్ధనారీస్వర తత్వానికి సంకేతంగా నమ్ముతారు. దీనిని ధరించడం వల్ల కుండలినీ శక్తి పెరుగుతుంది. సౌభాగ్య ప్రదాయని, సర్వపాపహారిణి. ఈ రుద్రాక్ష ఏకత్వాన్ని సూచిస్తుంది. దుష్ట ఆలోచనలు అదుపు చేస్తుంది. వైవాహిక సంబంధాలను మెరుగు పరుస్తుంది. 


త్రిముఖి (మూడు ముఖములు కలిగినది)


దీనిని త్రిమూర్తి స్వరూపంగా, అగ్నికి సంకేతంగా నమ్ముతారు. దీనిని ధరిస్తే ఆరోగ్యానికి, అభ్యుదయానికీ ఉపకరిస్తుంది. సకల సౌభాగ్య దాయని. తరచుగా వచ్చే జ్వరం వంటి వ్యాదులనుండి ఉపశమనం


చతుర్ముఖి (నాలుగు ముఖాలు కలిగినవది)


నాలుగు వేదాల స్వరూపం. బ్రహ్మకు ప్రాతినిధ్యం వహిస్తుంది. పాలలో వేసి త్రాగితే మానసిక రోగాలు నయం అవుతాయి. విద్యార్థులకు బాగా ఉపకరిస్తుంది. ధర్మార్ధ కామ మోక్ష ప్రదాయని. మానవుడు హత్య ద్వారా చేసిన పాపాన్ని హరిస్తుంది. జ్ఞాపకశక్తి ని, తెలివితేటలను పెంపొందిస్తుంది. నరాలకు సంబంధించిన వ్యాధులకు మంచిది.


పంచముఖి (అయిదు ముఖాలు కలిగినది)


పంచభూత స్వరూపం. గుండె జబులున్న వారికి మంచిది. శతృవులను సులభంగా జయించవచ్చు. పాము కాటునుంచి రక్షణ కలుగుతుంది. కోపాన్ని అదుపుచేసి మనసుకు శాంతిని కలగ చేస్తుంది. రక్తపోటు, చక్కెర వ్యాధి, పంటి నొప్పులు మూల వంటి వ్యాదులను నివారిస్తుంది.


షణ్ముఖి (ఆరు ముఖములు కలది)


కార్తికేయునికి ప్రతీక. రక్తపోటు, హిస్టీరియా పోతాయి.కుడి చేతికి కట్టుకుంటే లో బిపి తగ్గుతుంది. బ్రహ్మహత్యా పాతకం నుండి విముక్తి పొందుతారు


సప్తముఖి (ఏడు ముఖాలు కలిగినది)


కామధేనువుకి ప్రతీక. అకాల మరణం సంభవించదని ప్రజల విశ్వాసం. ధన మరియు అభివృద్ధిని ప్రసాదిస్తుంది.


అష్టముఖి (ఎనిమిది ముఖాలు కలిగినది)


విఘ్నేశ్వరునికి ప్రతీక. కుండలినీ శక్తి పెరుగుతుంది. ప్రమాదాల నుండి, ఆపదల నుండి రక్షణ కల్పిస్తుంది


నవముఖి (తొమ్మిది ముఖాలు కలది)

 

నవగ్రహ స్వరూపం. భైరవునికి ప్రతీక. దుర్గ ఆరాధకులకు మంచిది. దీనిని ఎడమ చేతికి ధరించాలి. వివాహ సంబంధిత సమస్యల నుండి విముక్తి. ఆధ్యాత్మిక చింతనను పెంపొందిస్తుంది.


దశ ముఖి (పది ముఖాలు కలిగినది)


దశావతార స్వరూపం. జనార్ధనుడికి ప్రతీక. అశ్వమేధ యాగం చేసినంత ప్రయోజనం కలుగుతుంది. దీనిని స్త్రీలు ఎక్కువగా ధరిస్తారు. నరాలకు సంబంధించిన వ్యాధులకు, జ్ఞాపకశక్తికి సంబంధించిన వ్యాధులకు పనిచేస్తుంది.


ఏకాదశ ముఖి: 11ముఖాలు


రుద్రుని 11 రూపాలకు ప్రతీక. దుష్ట శక్తుల నుంచి కాపాడుతుంది. సంతాన ఆరోగ్య సమస్యలకు మంచిది.


ద్వాదశ ముఖి: 12ముఖాలు

12 మంది ఆద్యులకు ప్రతీక గౌరవం పెరుగుతుంది. రక్త, హృదయ సంబంధిత వ్యాధులకు మంచిది. ధైర్యాన్ని పెంచి శత్రువుల నుండి రక్షణ కలిగిస్తుంది


త్రయోదశ ముఖి: 12ముఖాలు


కామధేవునికీ, కార్తికేయునికీ ప్రతీక.  పాలలో వేసి, ఆ పాలను త్రాగితే అందం పెరుగుతుంది. అభివృద్ధి, ఆత్మవిశ్వాసం పెంపొందిస్తుంది.


చతుర్ధశ ముఖి - 14ముఖాలు


ఉపనిషత్తుల ప్రకారం ఇది పరమశివుని కన్ను. శని సంబంధిత సమస్యలకు మంచిది.


నక్షత్రము ధరించవలసిన రుద్రాక్ష :-

అశ్వని - నవముఖి

భరణి - షణ్ముఖి

కృత్తిక - ఏకముఖి,  ద్వాదశముఖి

రోహిణి - ద్విముఖి

మృగశిర - త్రిముఖి

ఆరుద్ర - అష్టముఖి

పునర్వసు - పంచముఖి

పుష్యమి - సప్తముఖి

ఆశ్లేష - చతుర్ముఖి

మఖ - నవముఖి

పుబ్బ - షణ్ముఖి

ఉత్తర - ఏకముఖి, ద్వాదశముఖి

హస్త - ద్విముఖి

చిత్త - త్రిముఖి

స్వాతి - అష్టముఖి

విశాఖ - పంచముఖి

అనురాధ - సప్తముఖి

జ్యేష్ఠ - చతుర్ముఖి

మూల - నవముఖి

పూర్వాషాఢ - షణ్ముఖి

ఉత్తరాషాఢ - ఏకముఖి లేదా ద్వాదశముఖి

శ్రవణం - ద్విముఖి

ధనిష్ట - త్రిముఖి

శతభిషం - అష్టముఖి

పూర్వాభాద్ర - పంచముఖి

ఉత్తరాభాద్ర - సప్తముఖి

రేవతి - చతుర్ముఖి.

ఓం నమః శివాయ

Bhagavad gita_adhyatmikam1

భగవద్గీత

అద్యాయం 11

శ్లోకం 7

ఇహైకస్థం జగత్ కృత్స్నం పశ్యాద్య సచరాచరమ్ |

మమ దేహే గుడాకేశ యచ్చాన్యద్ద్రష్టుమిచ్ఛసి ||

అర్థం :-

ఓ అర్జునా! నా ఈ రూపమునందు ఒకేచోట స్థితమైయున్న సమస్తచరాచర జగత్తును చూడుము. అంతేగాక, ఇంకను నీవు చూడదలచుకొన్న వాటినన్నింటిని చూడుము.



మాఘ పురాణం 28

మాఘ పురాణం  28 రోజు పారాయణం



శౌనకాది ఋషులకు సూతమహర్షి మాఘమాసం 28వ రోజు పారాయణాన్ని చెప్పటం మొదలు పెట్టారు. పార్వతిమాతకు మహా శివుడు చెపుతున్నారు. పార్వ తి! వశిష్ట మహర్షి దిలీపమహరాజుకి ఓ దిలిపామహారాజా! జహ్నుమహాముని గృతజ్ఞ మహర్షితో మాఘ మాసం చతుర్దశి మహా శివరాత్రి సందర్భముగా శివరాత్రి మహత్యాన్ని చెప్పుకుందాము. మహాశివరాత్రి శివునికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఈ రోజు శివునికి భక్తి శ్రద్ధతో పూజించి శివుని ధ్యానం, ఉపవాసం, జాగరణం చేసి శివుని మహిమలను చెపుకున్నవారికి సాక్షాత్తు శివసానిధ్యం దొరుకుతుంది. ఒక కథ ఉంది చెపుతాను విను. పూర్వం ఒక కిరాతకుడు జంతువులను వేటాడి జీవనాన్ని సాగించేవాడు. అతనికి ఏ రోజు వేట ఆరోజే సరిపోయేది. వేట లేనిరోజు అతను అతని కుటుంబం ఉపవాసం ఉండవలసి వచ్చేది. ఒక రోజు అతను వేటకు బయలుదేరాడు. అతనికి ఆరోజు ఎంత వెతికిన ఒక జంతువు కూడా దొరకలేదు. అతను పొద్దున్ననుంచి సాయంత్రం వరకు వెతికి ఏమి దొరకక చివరికి చీకటి పడటంతో ఒక చెట్టు ఎక్కి కూర్చున్నాడు. ఆ చెట్టుపక్కన ఒక సెలయేరు ఉంది. అక్కడికి తెల్లవారుజామున జంతువులు నీళ్లు తాగతానికి వస్తాయి. అప్పుడు వేటాడుదామని కూర్చున్నాడు. ఆ రాత్రి అంత నిద్ర పోకుండా జంతువు కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు. నిద్ర రాకుండా ఉండటానికి ఆ చెట్టు ఆకులు తుంచి కిందకి వేస్తున్నాడు. ఇంతలో తెల్లవారింది. అతనికి వేట దొరికింది. వేటాడి సంతోషంగా ఇంటికి వేళాడు. ఆ వేటగాడు ముసలివాడు అయినా తరువాత సహజ మరణంతో మరణించాడు. యమభటులు వచ్చి తీసుకువెళుతుంటే అక్కడికి శివగణాలు వచ్చి లాకొని తీసుకువెళ్లారు. యమభటులు ఏమి అనలేక వెళ్లి యమధర్మ రాజుకి చెప్పారు. యమధర్మ రాజు విని అది ఎలా సాధ్యం అతను క్రూరుడు. నిత్యం జీవహింస చేసేవాడు.ఏనాడూ ఎవరికీ మంచి చేయలేదు. దీని గురించి ఆ పరమేశ్వరుడిని అడిగి తెలుసుకుందాము అని యమధర్మరాజు కైలాసానికి వెళ్ళారు. కైలాసంలో పరమేశ్వరుడు ప్రమథగణాలతో పూజలు అందుకుంటున్నారు. యమధర్మరాజు శివునికి నమస్కరించి తనకు కలిగిన సందేహాన్ని వెల్లబుచ్చారు. అందుకు పరమేశ్వరుడు చిద్విలాసంగా నవ్వి ఓ యమధర్మరాజా! నువ్వు చెపింది నిజమే ఆ కిరాతుడు బ్రతికి ఉండగా జీవహింస మానలేదు. కానీ అతనికి ఒకరోజు వేటదొరకలేదు కదా. ఆ రోజు మహాశివరాత్రి అతనికి తెలియకుండానే అతను ఉపవాసం ఉన్నాడు. ఒక చెట్టు ఎక్కి కూర్చున్నాడు కదా. అది బిల్వదళం చెట్టు అతను ఆ రాత్రి అంత నిద్ర పోకుండా జాగరణ చేసాడు. నిద్ర రాకుండా ఉండటానికి బిల్వదళాలను తుంచి కింద వేసాడు. ఆ చెట్టు మొదలులో నా శివలింగం ఉంది. ఆ బిల్వదళాలు నా శివలింగం మీద పడాయి. అందువలన అతనికి శివరాత్రి రోజు ఉపవాసం, జాగారం, బిల్వదళ అర్చన చేసిన పుణ్య ఫలం వచ్చింది. తెలిసి ముట్టుకున్నా తెలియక ముటుక్కున అగ్ని కాలాక మానదు. అలాగే నా పూజ తెలిసి చేసిన తెలియక చేసిన పుణ్యం లభిస్తుంది అని చెప్పారు. యమధర్మ రాజు మళ్ళీ ఒకసారి పరమేశ్వరునికి నమస్కరించి వెళ్లిపోయారు అని జహ్నుమహాముని గృతజ్ఞ మహర్షికి, వశిష్ఠ మహర్షి దిలీప మహారాజుకి మహాశివుడు పార్వతిమాతకి చెప్పారు. ఈ విధముగా శౌనకాది ఋషులకు సూతమహర్షి మాఘమాసం 28వ రోజు పారాయణాన్ని చెప్పటం పూర్తిచేశారు. 

మాఘ పురాణం 27

మాఘ పురాణం  27 రోజు పారాయణం



శౌనకాది ఋషులకు సూతమహర్షి మాఘమాసం 27వ రోజు పారాయణాన్ని చెప్పటం మొదలు పెట్టారు. పార్వతిమాతకు మహా శివుడు చెపుతున్నారు. పార్వ తి! వశిష్ట మహర్షి దిలీపమహరాజుకి ఓ దిలిపామహారాజా! జహ్నుమహాముని గృతజ్ఞ మహర్షితో ధీరుడు, ఉపధీరుడు అనే పండితులు మాఘమాసంలో చంప నదిలో స్నానం చేసి శ్రీహరిని పూజించి శ్రీహరి మహిమలను పారాయణం చేయాలని అక్కడికి వచ్చారు. ఇద్దరు చంప నదిలో స్నానం చేసి అక్కడే ఉన్న రవి చెట్టు నీడలో శ్రీహరిని పూజించి తరువాత మాఘమాస వ్రత మహిమను, శ్రీహరి మహిమలను చెప్పుకున్నారు. ఆ రవి చెట్టు తొర్రలో రెండు పాములు నివసిస్తున్నాయి. అవి కూడా శ్రీహరి మహిమలను విని తరించాయి. ఆ పాములు తోరనుంచి బయటకు వచ్చాయి. వాటిని చుసిన ధీరుడు, ఉపధీరుడు భయపడిపోయారు. అవి బయటకు వచ్చిన కొంత సేపటికి వాటికీ పాము రూపాలు పోయి దివ్యమైన శరీరాలు వచ్చాయి. అది చుసిన ధీరుడు ఉపధీరుడు కొంత ధైర్యం తెచ్చుకొని మీరు ఎవరు అని ప్రశ్నించారు. దానికి వారు ఆ పండితులకి నమస్కరించి మేము ముందు జన్మలో భార్య భర్తలం. మా పేర్లు క్రూర, క్రూరుడు. మాకు ఒక కుమారుడు ఉన్నాడు అతని పేరు జ్ఞాని. అతనికి యుక్త వయస్సు వచ్చిన తరువాత వివాహం చేసాము. మా కోడలు అణకువ, మంచితనానికి మారుపేరు. మేము అహంకారంతో ఆమెను రోజు హింసించేవాళం, రోజు కోటే వాళ్లము. ఏనాటికైనా మాలో మార్పు వస్తుంది అని సహనంతో భరించేది. ఒక రోజు మా కుమారుడు జ్ఞాని మాతో అమ్మ నాన్న మీకు కోడలు అనే అందుకు అంత కోపం. ఆమె మీరు చేపినతే చేస్తుంది కదా. ఆమెను కొట్టకుండా ప్రేమగా చూసుకోవచ్చుకదా. ప్రేమగా కాకపోయినా కనీసం మనిషిగా గుర్తించవచ్చు కదా. మా పైన దయ ఉంచి మమల్ని శుభ్రంగా చూసుకోండి. మీ కోపాన్ని తగించుకోండి అని చెప్పాడు. మేము ఆ మాటలకూ కోపం తెచ్చుకొని నువ్వు మాకే నీతి పాఠాలు చెపుతావా. నీ భార్య నీకు చేపి పంపించిందా. మేము పెద్దవాలం మేము ఏమైనా చేస్తాము నువ్వు మాకు చెపుతావా అని మా కోడలిని, కొడుకుని ఇష్టం వచ్చినట్టు మా కోపం తీరేవరకు కొటాము. మా కుమారుడికి మాపై కోపం వచ్చిన తల్లితండ్రులను గౌరవించాలి అని సహించాడు. మేము అంతటితో ఆగక మా కోడలిని తీసుకెళ్లి గదిలో బందించాము. నా కొడుకు మా కాళ్ళు పట్టుకొని ఎంత బ్రతిమిలాడినా వినలేదు. చుట్టూ పకాలవాళ్ళు, స్నేహితులు, బంధువులు ఎంతచెపీనా మేము వినలేదు. పైగా ఇది మా కుటుంబవిషయం మీరు కల్పించుకోవద్దు అని వారిని పంపేసాము. ఏడూ రోజులు ఆమె అన్న నీరు లేక ఆ గదిలోనే మరణించింది. ఎనిమిదొవరోజు మేము లేని సమయం చూసి మా కుమారుడు ఆ గది తలుపు తెరచి మా కోడలిని చూసాడు.  నా కోడలు మరణించి ఉండటం చూసి నా కుమారుడు తతుకోలేక నిశ్చేతుడై పడిపోయాడు. కొంతసేపటికి నేను వచ్చి చూసి గది తలుపులు ఎవరు తెరిచారు అని గదిలోకి వెళ్లి చూసాను. అక్కడ నా కోడలి మరణం, నా కుమారుడు నిశ్చేస్తుడై పడిపోవటం చూసి నేను చేసిన తప్పు తెలుసా వచ్చింది. గుండెలు బాదుకుంటూ ఏడిచాను. నా ఏడుపు విని చుట్టుపక్కలవాలు వచ్చి చూసారు. కొంతసేపటికి బంధువులు స్నేహితులు వచ్చారు. అందరూ నన్ను, నా భర్తని తిటగలిగినవాలు తిట్టారు. కొంతమంది మమ్మలిని కొట్టారు. కొంతకాలం తరువాత నా కుమారుడు ఇల్లు వదిలి గంగా తీరానికి వెళిపోయాడు. తన భార్య మరణానికి తనుకూడా ఒక కారణం అని తన భార్యను కాపాడుకోలేక పోయాను అని కుమిలిపోయి విచారించి మనోవేధనతో మరణించాడు. కొంతకాలం తరువాత మేము కూడా మరణించాము. యమా భటులు మమ్మలిని తీసుకువెళతానికి వచ్చారు. వారు మమ్మలిని కొట్టుకుంటూ తీసుకువెళ్లి ఆశిపత్రం అనే నరకంలో మమ్మలిని ఉంచారు. ఆశిపత్రం అంటే ఒక పంజరంలో లోపలి సూదులు లాంటి ముళ్ళు ఉండి మధ్యలో మమ్మలిని ఉంచారు. అవి గుచ్చుకొని మేము చాల కాలం నరకం అనుభవించాము. తరువాత ఈ రావిచెట్టు తొర్రలో మేము పాములుగా జన్మించాము. ఈ రోజు మీరు పారాయణం చేసిన శ్రీహరి మహిమల వలన మాకు పాపా విముక్తి కలిగి పూర్వజన్మ స్మృతి వచ్చింది అని చెప్పారు. ధీరుడు ఉపధీరుడు మాఘమాసం వ్రత మహత్యం శ్రీహరి మహిమలను తలుచుకుంటూ సంతోషంగా అక్కడినుంచి వెళ్లిపోయారు అని జహ్నుమహాముని గృతజ్ఞ మహర్షికి, వశిష్ఠ మహర్షి దిలీప మహారాజుకి మహాశివుడు పార్వతిమాతకి చెప్పారు. ఈ విధముగా శౌనకాది ఋషులకు సూతమహర్షి మాఘమాసం 27వ రోజు పారాయణాన్ని చెప్పటం పూర్తిచేశారు. 

Bhagavad gita_adhyatmikam1

భగవద్గీత

అద్యాయం 11

శ్లోకం 6

పశ్యాదిత్యాన్ వసూన్ రుద్రాన్ అశ్వినౌ మరుతస్తథా |

బహూన్యదృష్టరూర్వాణి పశ్యాశ్చర్యాణి భారత ||

అర్థం :-

ఓ అర్జునా! ద్వాదశాదిత్యులను, అష్టవసువులను, ఏకాదశరుద్రులను, అశ్వినీ కుమారులను, మరుద్గణములను నాయందు చూడుము. అంతేగాక, ఇంకను మునుపెన్నడును చూచి యెరుగని అపూర్వమైన ఆశ్చర్యకరములైన రూపములను చూడుము.



మాఘ పురాణం 26

మాఘ పురాణం  26 రోజు పారాయణం



శౌనకాది ఋషులకు సూతమహర్షి మాఘమాసం 26వ రోజు పారాయణాన్ని చెప్పటం మొదలు పెట్టారు. పార్వతిమాతకు మహా శివుడు చెపుతున్నారు. పార్వ తి! వశిష్ట మహర్షి దిలీపమహరాజుకి ఓ దిలిపామహారాజా! జహ్నుమహాముని గృతజ్ఞ మహర్షితో  మాఘ స్నానం  యొక్క  విశిష్టతను తెలియజేసే ఒక కథ ఉంది. చెబుతాను విను పూర్వం  ద్వాపరయుగంలో అంగ దేశాన్ని పాలించే    సులక్షణడు  అనే రాజు ఉండేవాడు. అతనికి వందమంది భార్యలు ఉండేవారు. అతని రాజ్యం సిరి సంపదలతో అష్టైశ్వర్యాలతో ఉండేది. కానీ అతనికి సంతానం లేదు. సంతానం కోసం పూజలు యజ్ఞాలు చేశాడు కానీ ఫలితం లేదు. చివరికి తీర్థయాత్రలు చేయటం మొదలుపెట్టాడు. తీర్థయాత్రలు చేస్తూ నైమిశారణ్యానికి  వెళ్లారు. అక్కడి  ఋషులకు  నమస్కరించి తనకు సంతానం కలిగే మార్గాన్ని చెప్పమని  ప్రార్థించాడు. ఋషులు అతనికి  మంత్రించిన ఒక్క పండుని ఇచ్చారు. దీనిని తీసుకువెళ్లి నీ భార్య లకు తినిపించు. నీకు వందమంది కుమారులు కలుగుతారు అని చెప్పి  ఆశీర్వదించారు.  రాజు సంతోషించి రాజ్యానికి ఆ పండుని తీసుకొని  వెళ్లారు.  రాణులందరి  తమకు సంతానం కలుగుతుందని సంతోషించారు. రాజు వారికి పండును ఇవ్వటానికి ముందు విష్ణుమూర్తికి పూజ చేద్దామని అనుకొని పండుని  తన గదిలో పెట్టి స్నానానికి వెళ్లారు. ఇంతలో రాజు అటు వెళ్ళగానే అతని రెండవ భార్య ఎవరికీ తెలియకుండా ఆ పండుని తానే తినేసింది.  ఈ విషయం ఎవ్వరికీ చెప్పలేదు.  రాజు స్నానానికి వెళ్లి వచ్చి చూసుకుంటే పండు కనిపించలేదు. తన కోట అంతా  వెతికిన   కనిపించలేదు. రాజు తనకు చేతికి అందిన అదృష్టం పోయిందని బాధపడ్డాడు. మూడు రోజుల తర్వాత ఆ పండుని  తానే తిన్నాను అని రాజుకు చెప్పింది. రాజు ముందు బాధపడిన వందమంది కుమారులు కలగకపోయినా కనీసం ఒక్క కుమారుడైన కలుగుతున్న అందుకు సంతోషించాడు. మిగిలిన రాణులకి ఈ విషయం తెలిసి మన అందరికీ కలగవలసిన అదృష్టాన్ని తాను ఒక్కతే అనుభవించింది అని కోపం తెచ్చుకున్నారు. పండు తిన్న రాణి గర్భం ధరించి ఉంది. మిగిలిన రాణులు అసూయతో ఆ రాణి కి మతిచెల్లించింది. ఆమె కొన్ని రోజుల తరువాత అడవిలోకి వెళ్ళిపోయింది. అక్కడే ఆమె ప్రసవించింది.  తరువాత సింహం ఆమెను చంపి తినేసింది. పిల్లవాడిని ఏమి చేయలేదు. ఆ పిల్లవాడు ఆకలికి ఏడుస్తుంటే హంసలు వచ్చి రెక్కలు చాపి నీడను    ఇచ్చాయి. పిల్లవాడి ఆకలిని తీర్చటానికి నోటిలో తేనెను పళ్లరసాలను ఇచ్చాయి. ఇలా ఒక సంవత్సరం గడిచిన తరువాత అడవిలోకి వైశ్య దంపతులు నదీ స్నానం కోసం వచ్చారు. ఎవరు లేకుండా ఉన్న పిల్లవాడిని చూసి అతని తల్లిదండ్రుల కోసం వెతికి చూశారు. కానీ వారికి ఎవరూ కనిపించలేదు. పిల్లవాడి చుట్టుపక్కల తప్ప ఇంకేమీ లేదు. ఆ పిల్లవాడిని దేవుడిచ్చిన ప్రసాదం గా భావించి ఇంటికి తీసుకు వెళ్లారు.  ఆ వైశ్యుడికి  ఇద్దరు భార్యలు. వారికి కూడా సంతానం లేదు. ఆ పిల్లవాడిని నా పిల్లవాడు అంటే పిల్లవాడు  అని అతని ఇద్దరు భార్యలు కొట్టుకోసాగారు. ఇలా కొంతకాలం  ఇలా కొంతకాలం గడిచింది. ఆ పిల్లవాడికి మూడు సంవత్సరాలు వచ్చాయి. వైశ్యుడు పెద్దభార్య ఈ గొడవలు అన్నిటికీ కారణం ఈ పిల్లవాడు అని అతనిని తీసుకు వెళ్లి అడవిలో వదిలేసి వచ్చింది. ఆ పిల్లవాడు ఏడుస్తూ తులసి చెట్టు కిందనే కూర్చున్నారు. అతనికి భయం వేసి ఏడవటం మొదలు పెట్టాడు. అతని ఏడుపు విని మళ్లీ పక్షులన్నీ వచ్చాయి. ఆ పక్షులను చూసి పిల్లవాడు కొంతసేపటిక ఏడుపు మానేశాడు.   ఆ పిల్లవాడికి పండ్లు అవి తీసుకొచ్చి ఇచ్చేవి.  ఆ పిల్లవాడు తులసి చెట్టు కిందనే కూర్చోవటం నిద్రపోవటం చేసేవాడు. కొంతకాలానికి అతని బుద్ధి వికసించి అతనికి  వికసించి అతనికి తెలియకుండానే కృష్ణా గోవిందా నారాయణ మాధవ అనేవాడు. ఇదంతా తులసి చెట్టు మహత్యం వల్ల వచ్చింది. అతని వెళ్లి పండ్లు తెచ్చుకుంటాను పక్కనే ఉన్న సరస్సులో స్నానం చేయటం చేసేవాడు. ఆ పిల్లవాడికి ఒకరోజు అశరీరవాణి వినిపించి ఇప్పుడు మాఘ మాసం ప్రారంభమవుతుంది. రోజు సూర్యోదయం ముందే నిద్ర లేచి  ఈ సరస్సులో స్నానం చెయ్యి అని చెప్పింది. స్నానం చేసిన తర్వాత విష్ణుమూర్తిని ధ్యానం చేయమని చెప్పింది. పిల్లవాడు మాఘమాసం అంతా అలాగే చేశాడు.  శ్రీ మహా విష్ణువు ఆ పిల్లవాడికి దర్శనమిచ్చారు. నేను నీ తపస్సుకి మెచ్చాను. నీకు ఏం వరం కావాలో కోరుకోమన్నారు. ఆ పిల్లవాడు చిరకాలం నీ పాద సన్నిధి లో ఉండే అదృష్టాన్ని ప్రసాదించమని కోరుకున్నాడు. శ్రీ మహావిష్ణువు అలాగే అన్నారు కానీ ముందు నువ్వు భూమండలం అంతా పరిపాలించు తదనంతరం ఉంటావు అని చెప్పారు. ఇప్పుడు నువ్వు నీ తండ్రి దగ్గరికి వెళ్ళు అని చెప్పారు. శ్రీమహావిష్ణువు తన సేవకుడై సనందనుడిని  పిలిచి  ఈ పిల్లవాడిని అతని తండ్రి దగ్గర విడిచి రమ్మని జరిగింది చెప్పమని చెప్పారు. సనందనుడు ఆ పిల్లవాడిని తీసుకొని అతని తండ్రి అయినా సులక్షణుడి  దగ్గరకు  తిసుకు వెళ్ళి జరిగినదంతా వివరించారు. సులక్షణ డు  అతని కుమారుడిని దగ్గరకు తీసుకుని సంతోషించాడు. కుమారుడికి సుధర్ముడు అని పేరు పెట్టారు. ఆ కుమారుడు విద్యాబుద్ధులు అన్నీ చక్కగా నేర్చుకున్నాడు. అతనికి యుక్త వయసు వచ్చినాక సులక్షణ మహారాజు అతనికి రాజా అభిషేకం చేసి తన 99 మంది భార్యలతో వాన ప్రస్థానానికి వెళ్ళిపోయారు. సుధర్ముడు చక్కగా రాజ్యపాలన చేసేవాడు అంతే కాకుండా అతను జీవితాంతం మాఘస్నానం ఫలితాన్ని మర్చిపోకుండా చేశాడు. తన తదనంతరం విష్ణు సాన్నిధ్యాన్ని చేరుకున్నాడు అని జహ్నుమహాముని గృతజ్ఞ మహర్షికి, వశిష్ఠ మహర్షి దిలీప మహారాజుకి మహాశివుడు పార్వతిమాతకి చెప్పారు. ఈ విధముగా శౌనకాది ఋషులకు సూతమహర్షి మాఘమాసం 26వ రోజు పారాయణాన్ని చెప్పటం పూర్తిచేశారు. 


Bhagavad gita_adhyatmikam1

భగవద్గీత

అద్యాయం 11

శ్లోకం 5

శ్రీభగవాన్ ఉవాచ

పశ్వ మే పార్థ రూపాణి శతశో థ సహస్రశః |

నానావిధాని దివ్యాని నానావేర్ణాకృతీని చ ||

అర్థం :-

శ్రీభగవానుడు పలికెను :-

ఓ అర్జునా! అసంఖ్యాకములైన, బహువిధములైన, పెక్కువర్ణములు, ఆకృతులు గల నా అలౌకికరూపములను చూడుము. 



మాఘ పురాణం 25

మాఘమాసం 25వ రోజు పారాయణం



శౌనకాది ఋషులకు సూతమహర్షి మాఘమాసం 25వ రోజు పారాయణాన్ని చెప్పటం మొదలు పెట్టారు. పార్వతిమాతకు మహా శివుడు చెపుతున్నారు. పార్వతి! వశిష్ట మహర్షి దిలీపమహరాజుకి ఓ దిలిపామహారాజా! జహ్నుమహాముని గృతజ్ఞ మహర్షితో పూర్వం కళింగ దేశమునా కిరాతకుడు ఒకడు ఉండేవాడు. అతడు అడవి ప్రాంతములో గొప్ప సంపద, పరివారం కలవాడు. పవివరంతో ఒకరోజు వేటకోసం వెళ్లి అనేక మృగాలను వేటాడి తిరుగుతుండగా ఒక బ్రాహ్మణుడిని చూసాడు. ఆ బ్రాహ్మణుడు నర్మద నది స్నానం చేయటానికి బయలుదేరారు. ఆ మార్గంలో అలసటతో ఒక మరిచెట్టు నీడలో కూర్చున్నారు. ఆ కిరాతకుడు అతనిని చూసి అతని వద్ద ఉన్న ధనాన్ని ఇవ్వమని బెదిరించాడు. ఆ బ్రాహ్మణుడు నా దగ్గర ధనం లేదు నేను పేదవాడిని అని చెప్పారు. అతని దగ్గర ఏమి లేకపోవటంతో ఆ బ్రాహ్మణుడిని కిరాతకుడు చంపేశాడు. అందువలన అతనికి బ్రహ్మహత్య పాపం వచ్చింది. అతడు అలాగే ఆ దారిన వచ్చిన వారిని బెదిరించి ధన్నాన్ని దొంగిలించేవాడు. అతనికి ఒక బంగారు నగలను తాయారు చేసే ఒక మిత్రుడు ఉండేవాడు. అతనుకూడా కిరాతుడిలాగే క్రూరుడు. అతని దగ్గరకు నగలను చేయమని వచ్చేవారి దగ్గర బంగారాన్ని దొంగిలించేవాడు. వీరికి ఇంకొక మిత్రుడు ఉన్నాడు. అతడు కాముకుడు. స్త్రీలను చుస్తే వదిలిపెట్టేవాడు కాదు. అతనికి అతని తండ్రి చిన్ననాడే చనిపోయాడు. అతని తల్లి కూడా స్వచ్ఛ విహారిణి అయి తిరుగుతుండేది. ఒక నాటి రాత్రి ఆమె తన ప్రియుడిని కలవటానికి అర్ధరాత్రి పుట ఒక ప్రదేశానికి వేలింది. అక్కడికి ఆమె కొడుకు కూడా తన ప్రియురాలిని కలివాటానికి వేలాడు. చీకటిలో ఒకరికి ఒకరు కనబడకా వచ్చిన వారే తమ ప్రియులని అనుకోని తెల్లరేవరకు గడిపారు. వెలుతురు వచ్చిన తరువాత వారు ఒకరికి ఒకరు చూసుకొని కంగారు పడ్డారు. అతని తల్లి ఆమె చేసిన పనికి తట్టుకోలేక మరణించింది. ఆమె నరకానికి వెళ్లి అనేక శిక్షలు అనుభవించింది. అతను తాను చేసిన పనికి సిగ్గుపడకుండా మామూలుగానే తిరగసాగాడు. వీరి ముగ్గురికి ఒక బ్రాహ్మణా స్నేహితుడు ఉన్నాడు. అతని పేరు విశ్రుంఖలుడు. అతను కూడా పూజలు మానేసి వీరితోపాటు తిరుగుతూ విరిలాగానే తయారయ్యాడు. ఒక సారి ఆ వీరశృంఖలుడు వేరే ఉరికి వెళుతూ అక్కడ ఒక వీరవ్రతుడు అనే బ్రాహ్మణుడిని కలిసాడు. ఆ వీరవ్రతుడు విశృంకలుడిని చూసి బ్రాహ్మణుడైన అతని ముఖంలో బ్రాహ్మణా కలలేదుఅని దివ్య దృష్టితో చూసి విశ్రుంఖలుడు అతని పాపాలను చెప్పసాగాడు. విశ్రుంఖలుడు అన్ని విని తాను చేసిన తప్పులకి బాధపడి తనను కాపాడమని ఇంక నుంచి మంచిగా ఉంటాను నాకు ప్రాయశ్చిత్తాని చెప్పమని వేడుకున్నారు. అందుకు ఆ వీరవ్రతుడు నువ్వు నీవు చేసిన పాపములను చెపుతూ తీర్ధయాత్రలు చేస్తూ అన్ని నదులలో స్నానం ఆచరించి శివకేశవులకు భేదం చూపకుండా వారిని పూజించి కేవలం బిక్ష చేసుకొనే భుజించాలి. అలాగే ప్రయాగ క్షేత్రంలో మాఘమాసంలో స్నానం ఆచరించి రోజు మాధవుడిని దర్శించు ఇలా పన్నెండు సంవత్సరాలు చేయి అని చెప్పారు. అందుకు ఆ విశ్రుంఖలుడు అలాగే చేస్తాను స్వామి. నాకు ధర్మాన్ని ఉపదేశించండి అని కోరుకున్నారు. అందుకు వీరభద్రుడు నువ్వు ముందు ప్రాయశ్చిత్తం చేసుకొనిరా అపుడు చెపుతాను అని వెళ్లిపోయారు. విశ్రుంఖలుడు అతని మిత్రుల దగరకు వెళ్లి జరిగిన విషయాన్ని చెప్పారు. వారందరు కూడా తమకు నరకం సంభవిస్తుంది అని కంగారు పడ్డారు. అప్పటి నుండు తల ఒకరు తల ఒక దిక్కుకి తీర్థయాత్రలకు బయలుదేరారు. విశ్రుంఖలుడు అలా పన్నెండు సంవత్సరాలు పూర్తిచేసుకొని చివరిగా నైమిశారణ్యానికి వెళ్లారు. అక్కడ తనకు బోధించిన వీరభద్ర బ్రాహ్మణుడు కనిపించారు. విశ్రుంఖలుడు వీరభద్ర  బ్రాహ్మణుడిని చూడగానే అతని కాళ్లకు నమస్కరించి మీరు చేపినటే ఈ పన్నెండు సంవత్సరములు పూర్తిచేసుకొని వచ్చాను. నాకు ధర్మాన్ని ఉపదేశించండి అని వేడుకున్నారు. తీర్ధయాత్రలు చేసిన ఫలితముగా విశృంకలుడి ముఖం పాపములు నశించి కాంతితో వెలిగిపోతుంది. వీరభద్రుడు విశృంకలుడికి ఇక్కడ అనేకమైన మంత్ర జలాలు ఉన్నాయి వాటిలో మూడు రోజులు స్నానం ఆచరించి నిరాహారిగా ఉండి ఇక్కడ ఉన్న వెంకటేశ్వర దేవాలయం, కాళికాలయం, సుత మహర్షి గద్దె అని దర్శించు అనిచెప్పారు. నిరంతరము సంతోషంగా ఉండాలి. నిత్యం నారాయణ నామస్మరణతో గడపాలి. నివ్వు నిత్యం గృహస్థ ఆశ్రమమును స్వకరించామని, ఇంద్రియ నిగ్రహముతో ఉండి నిత్యం అగ్ని హోత్రంతో చేస్తూ అతిధులను సేవిస్తూ నిత్యం దానధర్మాలు తప్పకుండా నారాయణుడిని పూజించు అని చెప్పారు అని జహ్నుమహాముని గృతజ్ఞ మహర్షికి, వశిష్ఠ మహర్షి దిలీప మహారాజుకి మహాశివుడు పార్వతిమాతకి చెప్పారు. ఈ విధముగా శౌనకాది ఋషులకు సూతమహర్షి మాఘమాసం 25వ రోజు పారాయణాన్ని చెప్పటం పూర్తిచేశారు. 

Bhagavad gita_adhyatmikam1

భగవద్గీత

అద్యాయం 11

శ్లోకం 4

మన్యసే యది తచ్ఛక్యం మయా ద్రష్టుమితిప్రభో |

యోగేశ్వర తతో మే త్వం దర్శయాత్మానమవ్యయమ్ ||

అర్థం :-

ఓ యోగేశ్వరా! ఓ ప్రభూ! నీ దివ్య రూపమును చూడటానికి నేను ఆర్హునిగా నీవు భావిస్తే, శశ్వతమైన నీ దివ్యస్వరూపమును నాకు చూపించు. 



        

గురు భక్తి | GURUBHAKTHI | Adi Shankaracharya |


గురు భక్తి

ఆదిశంకరాచార్యుల వారికీ చాల మంది శిష్యులు ఉండేవారు. వారిలో సనందనుడు అనే శిష్యుడు పరమ గురు భక్తి కలిగిన వారు. అతను అంటే మిగిలిన శిష్యులకి అసూయగా ఉండేది. ఈ విషయం తెలుసుకున్న అది శంకరాచార్యులవారు వారి గుణపాఠం చెప్పాలి అనుకున్నారు. ఒకరోజు శిష్యులను తీసుకొని పూర్ణ నది ఒడ్డుకు వెళ్లారు. శిష్యులను పిలచి మీరు అందరూ వెళ్లి నదికి అవతలి వైపున ఉన్న దర్భలు కోసుకురండి అని చెప్పారు. శిష్యులందరు మోకాలు లోతు నీళ్లు మాత్రమే ఉన్న నదిని ధాటి అవతిలి ఒడ్డుకు వెళ్లారు. అక్కడ దర్భలు కోస్తున్నారు. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న పూర్ణ నది ఒక్కసారిగా ఉధృతంగా వరద వచ్చింది. ఆదిశంకరాచార్యులు శిష్యులను పిలచి వెంటనే ఇవతలి ఒడ్డుకు రమ్మన్నారు. శిష్యులందరు దర్భలను కోయటం అపి వెంటనే నదివద్దకు వచ్చారు. నదికి వస్తున్నా వరదను చూసి భయపడిన శిష్యులు గురువుగారు! మేము నది వరద తగిన తరువాత వస్తాము అని చెప్పారు. ఆ శిష్యులలో ఉన్న సనందనుడు ఒక క్షణం కూడా ఆలోచించకుండా నదికి వరద వస్తుంది తాను మునిగిపోతాను అన్న భయం కూడా లేకుండా గురువుగారు చెప్పారు అన్ని నది దాటటం మొదలు పెట్టారు. అతను నది దాటుతుంటే అతని పాదాలు కూడా తడవకుండా అతని పాదాల కింద పద్మాలు వచ్చాయి. అతను నదిని ధాటి గురువుగారి దగరకు వచ్చి అయన పాదాలకు నమస్కరించారు. ఆ రోజు నుంచి సనందనుడు పద్మపాదుడుగా ప్రఖ్యాతి చెందాడు. నదికి వరద ఎలా వచ్చిందో అలాగే తగిపోయింది. మిగిలిన శిష్యులు చిన్నబుచ్చుకొని  నదిదాటి వచ్చి గురువుగారిని క్షమాపణ వేడుకున్నారు. అప్పుడు ఆదిశంకరాచార్యులవారు మిగిలిన శిష్యులతో చూసారా మీరందరు సనందుడిని చూసి అసూయా చెందారు. నిజమైన గురుభక్తి ఎవరికీ ఉన్నదో ఇప్పటికైనా అర్ధమైనదా అని అన్నారు. మీరందరు కలిసిమెలసి ఉండాలి అని అన్నారు. మిగిలిన శిష్యులు తమతప్పు తెలుసుకున్నారు. గురువు మీద భక్తి కలిగిన వారికీ విషం కూడా అమృతం అవుతుంది అంట. ఈ కథలో అది నిజమే అనిపిస్తుంది. 

మాఘ పురాణం 24

మాఘమాసం 24వ రోజు పారాయణం



శౌనకాది ఋషులకు సూతమహర్షి మాఘమాసం 24వ రోజు పారాయణాన్ని చెప్పటం మొదలు పెట్టారు. పార్వతిమాతకు మహా శివుడు చెపుతున్నారు. పార్వతి! వశిష్ట మహర్షి దిలీపమహరాజుకి ఓ దిలిపామహారాజా! జహ్నుమహాముని గృతజ్ఞ మహర్షితో సత్యజిత్తుకి దర్శనం ఇచ్చినపుడు శ్రీమహా విష్ణువు ఏకాదశి వ్రతం గురించి తులసి మహత్యం గురించి చెప్పారు. ముందుగా ఏకాదశి వ్రతం గురించి చెపుతాను. దశమినాడు రాత్రి ఉపవాసం ఉండి మరుసటి రోజు ఏకాదశి రోజున పూర్తిగా ఉపవాసం ఉండి జాగరణలు  ద్వాదశి నాడు ఉదయం నన్ను పూజించి ఎవరైనా బ్రాహ్మణులకు భోజనం పెట్టి తరువాత శక్తికొలది దానధర్మాలు చేసి వారు భోజనం చేసి ద్వాదశి రోజున రాత్రి మళ్ళీ ఉపవాసం ఉండాలి. ఇలా ఏడాదిలో మొత్తం 24  ఏకాదశులు రెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చే అధిక మాసములతో కలిసి మొత్తం 26  ఏకాదశులు చేసిన వారు నన్ను చేరుకుంటారు. వారి వంశములోని అందరూ నా భక్తులై నన్ను పూజించి తరిస్తారు అని చెప్పారు. సత్యజిత్తు దేవతలకు పారిజాత వృక్షాన్ని, శ్రీమహావిష్ణువుకి తులసిని ఇచ్చారు. శ్రీమహావిష్ణువు చేతిలోకి తులసి వెళ్ళగానే స్వామికి నమస్కరించి నన్ను స్వకరించి మీ పాదములపై ధరించండి అని అడిగింది.అందుకు శ్రీమహావిష్ణువు తులసితో నీవు పవిత్రురాలివి. పవిత్రతను కలిగిస్తావు. నిన్ను నేను నా హృదయముపై మాలగా ధరిస్తాను. నిన్ను నిండు దళములతో చుసిన వారికీ గంగా స్నానం చేసిన ఫలితం కలుగుతుంది. నీ దళములతో నన్ను పూజించిన వారు పునర్జన్మ ఉండదు. అమృతం నుండి పుటిన నీ దళములను నాకు మాలగా వేసిన వారికీ నా వైకుంఠములో చాలాకాలం వరకు ఉండి తరువాత నాలో ఐక్యం అవుతారు. నిన్ను తమ ఇంటిలో గాని తోటలోగాని పెంచిన వారికీ పాపములు అంటావు. నిద్ర లేచిన తరువాత మొదటిగా నిన్ను చుసిన వారికీ ఆ రోజు సుఖ సంతోషములు అనుభవిస్తారు. తులసి దళాలతో నీటిని తమ శరీరంపై చలుకున్నవారికి పవిత్రుడవుతారు. నీ చెట్టు యొక్క మొదట్లో మట్టిని తీసి తిలకంగా ధరించిన వారికీ సర్వసుఖములు లభించి యక్ష రాక్షస పిశాచాల వలన వారికీ భాధలు ఉండవు. నిన్ను లక్ష్మితో సమాసంగా భావిస్తాను. శ్రీమహావిష్ణువు స్పర్శ వలన తులసి పవిత్రమై కాంతివంతముగా అందమైన స్త్రీ రూపాన్ని పొంది శ్రీమహావిష్ణువు అంశాన్ని పొందింది. జగదీశ్వరుడైన శ్రీమహావిష్ణువు లోకసంరక్షణార్ధం నియమించారు. శ్రీమహావిష్ణువు ఎడమచేతితో స్పర్శించిన భాగం కృష్ణవర్ణమై కృష్ణ తులసీగా మారింది. తులసి పక్కన ఉన్న ఇతర వృక్షములు కూడా పవిత్రమైనాయి. శ్రీమహావిష్ణువు ఈ విధముగా ఏకాదశి వ్రతం, తులసి విశిష్టతను చెప్పారు అని జహ్నుమహాముని గృతజ్ఞ మహర్షికి, వశిష్ఠ మహర్షి దిలీప మహారాజుకి మహాశివుడు పార్వతిమాతకి చెప్పారు. ఈ విధముగా శౌనకాది ఋషులకు సూతమహర్షి మాఘమాసం 24వ రోజు పారాయణాన్ని చెప్పటం పూర్తిచేశారు.    

Bhagavad gita_adhyatmikam1

భగవద్గీత

అద్యాయం 11

శ్లోకం 3

ఏవమేతద్యథాత్థ త్వమ్ ఆత్మానం పరమేశ్వర |

ద్రష్టుమిచ్చామి తే రూపమ్ ఐశ్వరం పురుషోత్తమ ||

అర్థం :-

ఓ పరమేశ్వరా! నీవు చెప్పినదంత సత్యమే. అందులో సందేహానికి తావు లేదు. కాని ఓ పురుషోతమా! జ్ఞాన, ఐశ్వర్య, శక్తి, బల, వీర్య, తేజోమహితమైన నీ షడ్గుణైశ్వర్య సంపన్న రూపమును ప్రత్యక్షముగా చుడాలని నేను కుతూహుల పడుతున్నాను.



        

మాఘ పురాణం 23

మాఘమాసం 23వ రోజు పారాయణం



శౌనకాది ఋషులకు సూతమహర్షి మాఘమాసం 23వ రోజు పారాయణాన్ని చెప్పటం మొదలు పెట్టారు. పార్వతిమాతకు మహా శివుడు చెపుతున్నారు. పార్వతి! వశిష్ట మహర్షి దిలీపమహరాజుకి ఓ దిలిపామహారాజా! జహ్నుమహాముని గృతజ్ఞ మహర్షితో భూలోకానికి పారిజాత పువ్వులను తీసుకురావటానికి వెళ్లిన గుహ్యకుడు తిరిగి రాకపోవటంతో ఇంద్రుడు విచారించారు. ఇంకా ఇంద్రుడే స్వయముగా దేవతలతో కలిసి పారిజాత వనానికి వచ్చారు. ఆ వనం అందాన్ని చూసి మైమరచిపోయి విష్ణువుకి పుజించి తీసిన నిర్మాల్యని చూసుకోకుండా తొక్కుకుంటూ లోపలి వెళ్లరు. వెంటనే దేవతలందరికీ దివ్య శక్తులు, ఆకాశ గమన శక్తీ పోయింది. దేవతలు అది గుర్తించాలేదు. ఇంద్రుడు పువ్వులను కోసుకుంటుండగా మిగిలిన దేవతలు వచ్చి పువ్వులు ఎందుకు కోయటం పారిజాత వృక్షాన్ని తీసుకువెళదాము అనుకున్నారు. వారి శక్తిని అంత ఉపయోగించి వృక్షాన్ని పెకలించిపోయారు. కానీ అది కొంచం కూడా కదలలేదు. అప్పుడు జరిగిన పొరపాటును గుర్తించి బాధపడ్డారు. తెల్లవారిన తరువాత సత్యజిత్తు పువ్వులను కోసుకుంటాని వచ్చారు. అక్కడ ఉన్న ఇంద్రాది దేవతలను చూసి ఆశ్చర్య పోయారు. ఇంద్రుడితో మీరు దేవుని మేము ఏమి చేయలేమని ఎలా పూవులను దొంగిలిస్తారా అని అడుగుతారు. దేవతలు ఏమి సమాధానం చెప్పలేక ఊరుకున్నారు. సత్యజిత్తుకి కొంతసేపటికి తనవల్లనే దేవతలు ఇక్కడ ఉండిపోయారు అని వారికీ ఆహారము లేకుండా అయిపోయింది అని బాధపడ్డారు. అతను అతని భార్య కూడా ఆహారం తీసుకోకుండా శ్రీమహా విష్ణువుని ప్రార్ధించారు. ఎలా పదకొండురోజుల గడిచింది. శ్రీమహా విష్ణువు వారి ప్రార్ధనను మానించి ప్రత్యక్షం అయ్యారు. అప్పుడు సత్యజిత్తు స్వామి నా వలన ఇంద్రాది దేవతలు భాదపడుతున్నారు వారికీ విముక్తిని ప్రసాదించింది అని వేడుకొన్నారు. అపుడు శ్రీమహావిష్ణువు సత్యజిత్తు ప్రార్ధనను మానించి దేవతలతో దేవతలారా! క్షారసాగర మధనం జరుగుతున్నపుడు అమృతం వచ్చింది కదా. ఆ అమృతపు రెండు భిందువులు భూమిపైపడి తులసి మొక్కగా, పారిజాత వృక్షంగా మారాయి. వాటిని ఇతను ఎంతో జాగ్రత్తగా పెంచి రోజు నా పూజకు తీసుకువచ్చి నన్ను పూజించసాగారు. అటువంటి పువ్వులను అతనికి చెప్పకుండా కోయటం తప్పు కదా అని అన్నారు. దేవతలు తమ తప్పులను ఒప్పుకొని శ్రీమహావిష్ణువుని క్షమించమని కోరుకున్నారు. అపుడు శ్రీమహావిష్ణువు దేవతలారా! మీరు సత్యజిత్తు అతని కుటుంబం ఈ పదకొండు రోజులు ఆహారం తీసుకోకుండా నన్నే ప్రార్ధించారు. అందులోనూ ఏది మాఘమాసం పదకొండోవరోజు ఏకాదశి అవటం చేత మీకు ఈ దివ్య శక్తులను ప్రసాదిస్తున్నాను. ఈ సత్యజిత్తుకి అతని కుటుంబానికి వైకుంఠ సాన్నిధ్యాని అనుగ్రహిస్తునాను అని చేపి శ్రీ మహా విష్ణువు అంతర్ధానమయ్యారు. దేవతలకు వారి దివ్య శక్తులు వచ్చి తిరిగి దేవలోకానికి వెళ్లిపోయారు. సత్యజిత్తు తన మిగిలిన జీవితాన్ని అరిమహావిష్ణువు సేవలో గడిపి తదనంతరం వైకుంటానికి వెళ్లారు అని జహ్నుమహాముని గృతజ్ఞ మహర్షికి, వశిష్ఠ మహర్షి దిలీప మహారాజుకి మహాశివుడు పార్వతిమాతకి చెప్పారు. ఈ విధముగా శౌనకాది ఋషులకు సూతమహర్షి మాఘమాసం 23వ రోజు పారాయణాన్ని చెప్పటం పూర్తిచేశారు.     


Bhagavad gita_adhyatmikam1

భగవద్గీత

అద్యాయం 11

శ్లోకం 2

భవాప్యయౌ హి భూతానాం శ్రుతౌ విస్తరశో మయా |

త్వత్తః కమలపత్రాక్ష మాహాత్మ్యమపి చావ్యయమ్ ||

అర్థం :-

ఓ కమలక్షా! ఓ కృష్ణా! సమస్త ప్రాణుల ఉత్పత్తి ప్రళయములను గూర్చి విరముగా విన్నాను. అట్లే శాశ్వతమైన నీ మహిమలను గురించి విన్నాను.



మాఘ పురాణం 22

మాఘమాసం 22వ రోజు పారాయణం



శౌనకాది ఋషులకు సూతమహర్షి మాఘమాసం 22వ రోజు పారాయణాన్ని చెప్పటం మొదలు పెట్టారు. పార్వతిమాతకు మహా శివుడు చెపుతున్నారు. పార్వతి! వశిష్ట మహర్షి దిలీపమహరాజుకి ఓ దిలిపామహారాజా! జహ్నుమహాముని గృతజ్ఞ మహర్షితో మాఘమాసా వ్రతం, ద్వాదశి వ్రతం చేసిన వారికీ అశ్వమేధ యాగం చేసిన ఫలితం కలుగుతుంది. చివరికి మోక్షం, విష్ణు సాన్నిధ్యం పొందుతారు. పూర్వం దేవదానవులు మీరు పర్వతాన్ని క్షిర సాగరంలో కవంలా వేసి ఆదిశేషుడిని మీరు పర్వతానికి చేతి దేవతలు ఒకవైపు దానవులు ఒకవైపు పట్టుకొని చిలకసాగారు. చిలుకుతుండగా మీరు పర్వతం క్షిర సాగరం లోపలి పడిపోయింది. అపుడు శ్రీమహావిష్ణువు కూర్మావతారం ధరించి తన మూపుమీద మీరు పర్వతాన్ని మునిగిపోకుండా నిలబెట్టుకున్నారు. అప్పుడు దేవతలు ఒకవైపు దానవులు ఒకవైపు పట్టుకొని చిలకసాగారు. అలా చిలకగా కొంత సేపటికి అందులోనుంచి కాలకూటవిషం వచ్చింది. ఆ విషవాయువులు తట్టుకోలేక దేవదానవులు హాహాకారాలు చేసారు. అందరూ కలిసి పరమేశ్వరుడిని ప్రార్ధించారు. అపుడు పరమేశ్వరుడు ఆ కాలకూటవిషాన్ని తీసుకొని తాగేశారు. పార్వతి మాత ఆ విషాన్ని శివుని గర్భంలోకి వెళ్లకుండా కంఠం దగ్గరే ఆపేసింది. దేవదానవులు మళ్ళి మంధర పర్వతాన్ని చిలకటం మొదలు పెట్టారు. ఈ సారిఅందులోనుంచి అప్సరసలు, ఐరావతం, ఉచైస్రావం, పారిజాతవృక్షం మొదలైన సంపదలు ఎన్నో వచ్చాయి. వాటన్నిటి తరువాత శ్రీ మహా లక్ష్మి వచ్చింది. ఆమెని శ్రీమహావిష్ణువు వివాహం చేసుకున్నారు. తరువాత అమృత కలశం తీసుకొని ధన్వంతరి వచ్చారు. అమృతం రాగానే దేవతలు దానవులు వాదన చేసుకోసాగారు. వారి కొడవను తీర్చటానికి శ్రీ మహా విష్ణువు మళ్ళి మోహిని అవతారాన్ని ధరించి వారి ముందుకు వచ్చారు. దేవదానవులు ఆమె సౌందర్యానికి మోహము చెంది ఆమె దగరకు వచ్చారు. మోహిని వారి చేతినుండి అమృత కలశాన్ని తీసుకొంది. దేవతలను ఒకవైపు దానవులను ఒకవైపు కుర్చోపెటింది. దేవతలకు అమృతాన్ని దానవులకు సురను వారికీ అనుమానం రాకుండా పంచసాగింది. అమృతాన్ని తగిన దేవతలు తేజస్సుతో వెలిగిపోతున్నారు. సురను తగిన దానవులు కళావిహీనంగా తయారవుతున్నారు. దీనిని గమనించిన ఒక రాక్షసుడు దేవతగా మరి దేవతల పంక్తిలో కూర్చొని అమృతాన్ని సేవిస్తారు. దీనిని సూర్య చంద్రులు గమనించి మొహినికి సైగచేస్తారు. మోహిని వారిని తన సుదర్శన చక్రంతో కంఠాన్ని ఛేదిస్తుంది. అప్పటికే అమృతం కంఠం లోకి వెళతాం వలన తల మొండెం వేరు అయినా జీవించేవుంటారు. వెళ్లి మోహిని పాదాలపై పది రాక్షసత్వని వదిలేస్తామని ఇకనుంచి దేవతలుగా జీవిస్తామని వేడుకుంటారు. మోహిని వారి ప్రార్ధనను మనించి వారికీ దేవతలలోను, నవగ్రహాలలోను స్థానం కల్పిస్తుంది. అప్పటి నుండి వారు ఒకరుగా కాకా ఇద్దరుగా మరి రాహు కేతువులుగా పేరుగాంచుతారు. మోహిని మిగిలిన అమృతాన్ని దేవతలకు ఇస్తుంది. దేవతలు అమృతాన్ని తీసుకొని స్వర్గానికి వెళతారు. బ్రహ్మ విషు మహేశ్వరులు తమ తమ లోకాలకి వెళ్లిపోయారు. కానీ ఆ సముద్రపు వాడునా రెండు అమృతపు బిందువులు పడ్డాయి. ఒక అమృతపు బిందువేమో పారిజాత వృక్షం అయింది. ఇంకొక అమృతపు బిందువేమో తులసి మొక్క అయింది. కొంతకాలం గడిచిన తరువాత సత్యజితుడు అనే ఒకతను ఆ మొక్కలకు నీళ్లు పోసి జాగ్రత్తగా పెంచసాగారు. అది అందమైన పుల్ల వనంగా మారింది. పారిజాత పువ్వులు, తులసీదళములు తీసుకొని రోజు వాటిని దగ్గరలో ఉన్న విష్ణు ఆలయంలో ఇవ్వసాగారు. ఒక సారి ఇంద్రుడు ఆ వనం మీదుగా ఆకాశ గమనంలో వెళుతూ ఈ వనాన్ని చూసారు. వెంటనే కొన్ని పారిజాత పువ్వుల్ని కోసుకొని తీసుకువెళ్లి తన భార్య ఐన శచి దేవికి తీసుకెళ్లి ఇచ్చారు. శచి దేవి ఆ పువ్వులను చూసి ఇష్టపడి రోజు కావాలని అడిగింది. అప్పుడు ఇంద్రుడు గుహ్యకుడు అనే యక్షుడిని పంపి రోజు ఆ పువ్వుల్ని తెపించుకునేవారు. పువ్వులు రోజు మాయం అయే సరికి సత్యజితుడికి అనుమానం వస్తుంది. ఈ పువ్వులను తీసుకువెళుతున దొంగను ఎలాగైనా పట్టుకోవాలని అనుకుంటారు. ఎన్ని ప్రయత్నాలు చేసిన అతను దొరకడు. చివరికి రోజు తాను పువ్వులు ఇస్తున్న దేవాలయంలో స్వామి కైంకర్యాలు అయినా తరువాత తీసేసిన పువ్వులను తీసుకువచ్చి ఆ వనం చుట్టూ చల్లారు. గుహ్యకుడు అదృశ్య రూపములో ఆ వనం లోపలికి రావటానికి ఆ పువ్వులను దాటారు. ఆ పాపం వలన అతని దివ్య శక్తులు పోయి కనిపించారు. అంటే కాకుండా అతని ఆకాశ గమన శక్తిని కూడా పోగొట్టుకున్నారు. సత్యజిత్తు గుహ్యకుడుని పట్టుకున్నారు. ఈ పువ్వులు ఎందుకు దొంగిలిస్తున్నావు అని అడిగారు. అప్పుడు గుహ్యంగుడు వీటిని ఇంద్రుడు తీసుకురమన్నారు అని చెపుతాడు. గుహ్యకుడు అక్కడే మూడు రోజులు బందీగా ఉన్నారు అని జహ్నుమహాముని గృతజ్ఞ మహర్షికి, వశిష్ఠ మహర్షి దిలీప మహారాజుకి మహాశివుడు పార్వతిమాతకి చెప్పారు. ఈ విధముగా శౌనకాది ఋషులకు సూతమహర్షి మాఘమాసం 22వ రోజు పారాయణాన్ని చెప్పటం పూర్తిచేశారు.     

Bhagavad gita_adhyatmikam1

భగవద్గీత

అద్యాయం 11

అథ ఏకదశో ద్యాయః - విశ్వరూపసందర్శనయోగః

శ్లోకం 1

అర్జున ఉవాచ

మదనుగ్రహాయ పరమం గుహ్యమధ్యాత్మసంజ్ఞితమ్ |

యత్త్వయోక్తం వచస్తేన మోహో యం విగతో మమ ||

అర్థం :-

అర్జునుడు పలికెను :-

ఓ కృష్ణా! నన్ను అనుగ్రహింపదలచి పరమగోప్యమైన ఆద్యాత్మిక విషయములను ఉపదేశించావు. దానివలన నా అజ్ఞానము తొలగిపోయింది.



మాఘ పురాణం 21

మాఘమాసం 21వ రోజు పారాయణం

శివ స్తుతి



శౌనకాది ఋషులకు సూతమహర్షి మాఘమాసం 21వ రోజు పారాయణాన్ని చెప్పటం మొదలు పెట్టారు. పార్వతిమాతకు మహా శివుడు చెపుతున్నారు. పార్వతి! వశిష్ట మహర్షి దిలీపమహరాజుకి ఓ దిలిపామహారాజా! జహ్నుమహాముని గృతజ్ఞ మహర్షితో ముందు అధ్యాయంలో శివుడు, బ్రహ్మ నేను గొప్ప, అంటే నేను గొప్ప అని వాదన జరిగింది కదా. వారి వివాదమును తీర్చటానికి శ్రీమహావిష్ణువు విరాట్ స్వరూపములో కనిపించి వారిని శాంత పరచి మళ్ళి దివ్య స్వరూపములో కనిపించి ముందు తన కుమారుడైన బ్రహ్మను శాంతిపచేసి తరువాత శ్రీ మహా విష్ణువు శివుడిని ఎలా స్తుతిస్తారు. మహేశ్వర నువ్వు నాతో సమానుడవు. మన ఇద్దరికి భేదం లేదు. నివ్వు సర్వ పూజ్యుడవు, సర్వ వ్యాపకుడవు, సర్వోత్తముడవు, సర్వ వ్యాపివి, సర్వాత్మకుడవు నేను ఏటువంటి వంటినో నువ్వు అటువంటివాడివి. నీకు నాకు భేదం లేదు. నేను నారదుడికి నీ మహిమ చెప్పాను. అప్పుడు అతను నీ అనుగ్రహం కోసం తపస్సు చేసాడు. నిన్ను దర్శించాడు. నువ్వు అతనిని అనుగ్రహించవు. అతను నిన్ను ఎలా స్తుతిచాడో గుర్తుంది కదా. నివ్వు అది మధ్యాంత రహితుడవి. తుది మొదలు లేని వాడివి. అప్పుడు నారదుడు చేసిన ఈ స్తోత్రం విని నువ్వు ఎంతో సంతోషించావు కదా. మునులు, ఋషులు, మహర్షులు ఈ స్తోత్రం చేస్తూ నిన్ను పూజించారు కదా. కాబ్బటి నీకు నాకు బ్రహ్మకు భేదము లేదు. మన ముగ్గురికి భేదము ఉంది అని తలచే ముడులు నరకంలో శిక్షలు అనుభవిస్తారు. శ్రీమహా విష్ణువు అంతర్ధానము అయ్యారు. శ్రీమహావిష్ణువు ఈవిధముగా బ్రహ్మ మహేశ్వరుల వివాదమును సరిచేశారు. లోకానికి ఏవిధముగా ఈ విషయాన్ని తెలియచేసారు. మునులకు జరిగిన వాదనను తీర్చటానికి ఇలా ఒక చిన్న నాటకాన్ని ఆడటం జరుగుతుంది. త్రిమూర్తులకు అబేధము లేదు అని లోకానికి ఈ విషయాన్ని తెలియజేసారు. వాస్తవానికి ముగ్గురకు భేదం లేకున్నా భేదం ఉంది అని తలచి వాదించే అహంకార పండితులకు కోసమే ఈ సంఘటన జరిగింది. మాఘ మాస వ్రతాన్ని ఆచరించేవారు ఈ విషయాన్ని తప్పకుండా గ్రహించాలి. అజ్ఞానముతో ఆలోచించకూడదు. బుద్ధి మంతులు సత్వ గుణ ప్రధానుడైన శ్రీమహావిష్ణువునే భావించి జ్ఞానులై ముక్తిని పొందాలి. అజ్ఞానులు మాఘమాస వ్రతం ఆచరించి జ్ఞానులై ఇహములో పారములో సుఖిస్తారు. వృధా వాదనలు అహకారులకే కానీ బుద్ధి మంతులకి కాదు. సర్వాధికులు, సర్వోత్తములు, సర్వవ్యాపకులు అయినా త్రిమూర్తులకు అబేధము ఏమిటి అని గృతజ్ఞ మహర్షి అన్నారు. ఇంకా ఇలా చెప్పసాగుతూ శివుడు విష్ణుమూర్తిని ధ్యానిస్తారు. విష్ణుమూర్తి శివుడిని ధ్యానిస్తారు. జ్ఞానం కలగాలని అహంకారం వదిలి పెట్టాలని మన లాంటి ముర్కులను దారిలో పెట్టాలని ఇటువంటి ఒక సంఘటనను త్రిమూర్తులు సృష్టించారు. గర్వాన్ని, అహంకారాన్ని తగ్గించుకొని మాఘ మాస వ్రతాన్ని ఆచరించాలి అని సూచించారు. విష్ణు కథను విని ధరించాలి. సాటివారికి దయను చూపించాలి. ఉన్నా దాంట్లో ధన ధర్మాలు చేయలి అని జహ్నుమహాముని గృతజ్ఞ మహర్షికి, వశిష్ఠ మహర్షి దిలీప మహారాజుకి మహాశివుడు పార్వతిమాతకి చెప్పారు. ఈ విధముగా శౌనకాది ఋషులకు సూతమహర్షి మాఘమాసం 21వ రోజు పారాయణాన్ని చెప్పటం పూర్తిచేశారు.    

 

Bhagavad gita_adhyatmikam1

భగవద్గీత

అద్యాయం 10

శ్లోకం 42

అథవా బహునైతేన కిం జ్ఞాతేన తవార్జున |

విష్ణభ్యాహమిదం కృత్స్నమ్ ఏకాంశేన స్థితో జగత్ ||

ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే విభూతియోగో నామ దశమో ధ్యాయః

అర్థం :-

ఓ అర్జునా! ఇంతకంటెను విపులముగా తెలిసికొని ప్రయోజనమేమి? ఈ సంపూర్ణజగత్తును కేవలము నా యోగశక్తి యొక్క ఒక్క అంశతోనే ధరిస్తున్నాను.



మాఘ పురాణం 20

మాఘమాసం 20వ రోజు పారాయణం



శౌనకాది ఋషులకు సూతమహర్షి మాఘమాసం 20వ రోజు పారాయణాన్ని చెప్పటం మొదలు పెట్టారు. పార్వతిమాతకు మహా శివుడు చెపుతున్నారు. పార్వతి! వశిష్ట మహర్షి దిలీపమహరాజుకి ఓ దిలిపామహారాజా! జహ్నుమహాముని గృతజ్ఞ మహర్షితో శ్రీ మహా విష్ణువు తత్వాన్ని గురించి ఇంకొక కథ చెపుతాను విను. ఒకసారి బ్రహ్మదేవుడు రజోగుణ ప్రధానుడు, శివుడు తమోగుణ ప్రధానుడు కదా! ఆ గుణములు ఒకసారి ఎక్కువయ్యాయి. దాని మూలంగా బ్రహ్మ, శివుడు నేను గొప్ప అంటే నేను గొప్ప అని వాదన చేసుకోసాగారు. అపుడు బ్రహ్మ నేను జీవుల పుట్టుకకు కారకుడిని కాబ్బటి నేనే గొప్పవాడిని అని అన్నారు. శివుడు నేను నా భక్తులకు సులభసాధ్యుడను కాబట్టి నేనే గొప్ప వాడిని అని అన్నారు. శ్రీ మహా విష్ణువు ఈ వాదనను ఆపటానికి ఒక విశ్వరూపాన్ని ధరించి వారి ముందు ప్రత్యక్షమయ్యారు. ఆ విశ్వరూపము అనేక సూర్యల కాంతితో అనేక కనులతో అనేక  చేతులతో అనేక కాళ్లతో చాల మనోహరంగా ఉంది. శివుడు, బ్రాహ్మలు ఇద్దరు ఆశ్ఛర్యపోయారు. ఈ రూపానికి తుది మొదలు ఎక్కడ ఉన్నదో చూదాం అనుకున్నారు. శివుడు, బ్రహ్మ ఆ విశ్వ రూపాని చూసి భీతి చెందారు. ఆ రూపము తుది మొదలు తెలుసుకున్న వాళ్లే తమలో ఉత్తములని అనుకొంటారు. ఇద్దరు ఆ రూపానికి తుది మొదలుని వెతకటానికి బయలుదేరుతారు. కానీ వారికీ ఎక్కడ కనిపించలేదు. ఏ రూపమైతే మనకు కనపడుతుందో అదే జగత్ కర్త, గురువు రక్షించువాడు. సర్వ ప్రకాశుడు, సర్వ ప్రాణులయందు నివసించేవాడు, మనము విని కంటే అధికులము కాదు. విష్ణుమూర్తిని ఇలా ప్రశంసిస్తున్నారు. అనంతమూర్తి, సర్వాధ్యము, సర్వాధారము, అనంత ప్రకాశము మనోహరమైన నీ స్వరూపముతో మా ముందు ప్రత్యక్షం అవ్వు అని కోరుకున్నారు. శ్రీమహావిష్ణువు వారికీ పీతాంబరమును ధరించి స్వర్ణ భరణాలు, చతుర్భుజాలతో, శంఖు చక్రాలతో గదా పద్మాలతో తులసీమాలలు ధరించి పారిజాతమలాలను ధరించి మనోహరంగా దర్శనం ఇచ్చారు. బ్రహ్మ మహేశ్వరులారా మీరు ఇద్దరు ఇలాగ వివాదపడుతూ ఉండటం వలన మీ వివాదమును ఆపటానికి నేను ఇలా విరాట్ స్వరూపములో ప్రత్యక్షమవవలసి వచ్చింది. మీ వివాదానికి కారణం నాకు తెలుసు. దీనిని ఎవరు పరిష్కరించలేరు. సత్వరజస్తమో ప్రకృతి వలన కలిగాయి. ఈ గుణములకు లోబడిన వారికీ యధార్ధము తెలియదు.  

సత్వ గుణము:- స్వయం ప్రకాశం, శాంతస్వభావము, భగవంతుడిని తెలుసుకోవాలి అని కాంక్ష కలిగినది. ఆత్మకు సేమము, దమము, దయ, అహింస శాంతి మొదలగు గుణములను కలిగించి పరలోకములో సుఖమును కలిగిస్తుంది. 

రజో గుణము :- జీవికి కర్మసక్తిని కలిగిస్తుంది. పరమాత్మ స్వరూప జ్ఞానాన్ని తప్పి ఇహలోక కర్మలపై ఆసక్తిని కలిగిస్తుంది. 

తమోగుణము :- అజ్ఞానము వలన కలుగుతుంది. ఇది జ్ఞానాన్ని పోగొట్టి మొహాన్ని కలిగిస్తుంది. పరమాత్మ జ్ఞానము వెనకపడిపోతుంది. భగవంతుని పట్ల ఆసక్తిని తగిస్తుంది. కార్యాల పట్ల శ్రద్ధ లేకపోవటం, వాయిదాలు వేయటం, కార్యం చేయలేకపోవటం కలిగిస్తుంది. నిద్రను ఎక్కువగా కలిగిస్తుంది.

మీకు రజస్తమో గుణముల వలనే ఈ వివాదము పెరిగింది. సృష్టి ప్రారంభంలో అంత చీకటిగా ఉండేది. పంచభూతములు అపుడు లేవు. పరమాత్మ సృష్టి చేయటానికి ఒక బంగారపు ముద్దలాగా ఉంది. అది క్రమంగా పెరిగి మూడు భాగములుగా విడిపోయింది. ఒక భాగము నుంచి బంగారపు రంగులో బ్రహ్మ లక్ష్మిలు, మరొక భాగము నుంచి తెలుపు రంగులో శివుడు, సరస్వతి. మరొక భాగము నుంచి నలుపు రంగులో నారాయణుడు, నారాయణి జన్మించారు. మనం ముగ్గురము ఒకేసారి జన్మించాము. మనం ముగ్గురము సమానులమే. బ్రహ్మ సృష్టికర్తగాను, విష్ణుమూర్తి పోషకుడిగాను, శివుడు లయకర్తగాను బాధ్యతలు స్వీకరించాము.  కాబ్బటి ఒకే దాని నుంచి వచ్చిన మనకే భేదములేదు కదా.శ్రీ మహా విష్ణువు  బ్రహ్మకు శివునికి అసలు తత్వాన్ని గుర్తుకు తెచ్చారు. బ్రహ్మకి నువ్వు సమర్థుడివి, సృష్టికర్తవు, దేవతలకు ప్రభువువి, వేదములకు స్థానానివి అని యజ్ఞములకు అధిపతివి. అన్ని లోకాలకి సంపదను ఇచ్చేవాడివి. స్వశక్తి తోనే పరమాత్మ యోగాని పొందావు. సర్వ రక్షకుడివి. నా నాభికమలము నుంచి జన్మించిన వాడివి. తండ్రి కొడుకులకి భేదము లేదు. ఏకత్వములో అనేకత్వముగా అన్నిటిలో మనమే ప్రకాశిస్తున్నాము. కాబ్బటి నువ్వు కూడా నా వలనే సమస్త దేవతలకు పూజనీవుడివి అని జహ్నుమహాముని గృతజ్ఞ మహర్షికి, వశిష్ఠ మహర్షి దిలీప మహారాజుకి మహాశివుడు పార్వతిమాతకి చెప్పారు. ఈ విధముగా శౌనకాది ఋషులకు సూతమహర్షి మాఘమాసం 20వ రోజు పారాయణాన్ని చెప్పటం పూర్తిచేశారు.    

Bhagavad gita_adhyatmikam1

భగవద్గీత

అద్యాయం 10

శ్లోకం 41

యద్యద్విభూతిమత్ సత్త్వం శ్రీమదూర్జితమేవ వా |

తత్తదేవావగచ్ఛ త్వం మను తేజోంశసంభవమ్ ||

అర్థం :-

విభూతియుక్తము అనగా ఐశ్వర్యయుక్తము, కాంతియుక్తము, శక్తియుక్తము  ఐన వస్తువేదైనను, నా తేజస్సు యొక్క అంశము నుండే కలుగుతుంది. 




మాఘ పురాణం 19

మాఘమాసం 19వ రోజు పారాయణం



శౌనకాది ఋషులకు సూతమహర్షి మాఘమాసం 19వ రోజు పారాయణాన్ని చెప్పటం మొదలు పెట్టారు. పార్వతిమాతకు మహా శివుడు చెపుతున్నారు. పార్వతి! వశిష్ట మహర్షి దిలీపమహరాజుకి ఓ దిలిపామహారాజా! జహ్నుమహాముని గృతజ్ఞ మహర్షితో గోమతి నది తీరంలో పవిత్రమైన నైమిశారణ్యంలో ఉంది. అక్కడ ఒకసారి మహర్షులు, ఋషులు అందరూ కలిసి ఒక యజ్ఞం చేయాలనీ అనుకున్నారు. ఎందుకంటే అది మాఘమాసం అవటం వలన ఆ మాసమంతా మాఘమాస వ్రతం ఇంకా శ్రీమన్నారాయణుడికి యజ్ఞము చేయవచ్చు అని అనుకున్నారు. యజ్ఞం కొనసాగుతుంది కొంతకాలం తరువాత మహర్షులు, ఋషులు వారిలో వారే మేము గొప్ప అంటే మేము గొప్ప అని వాదనలు చేసుకుంటున్నారు. విషయం తెలుసుకున్న నారద మహర్షి అక్కడకి వచ్చి వారికీ సర్దిచెప్పటానికి చూసారు. కానీ వారు మాటవినలేదు. ఇంకా నారదమహర్షి చేసేది లేక వైకుంఠానికి వెళ్లి శ్రీమన్నారాయణుడి చెప్పారు. శ్రీమన్నారాయణుడు జరిగినది తెలుసుకొని బాధపడి వారి గొడవని తీర్చటానికి ఒక ఉపాయం ఆలోచించారు. నారదమహర్షితో మీరు వెళ్లి సనకసనందనాదులను నైమిశారణ్యానికి వెళ్ళమను. అలాగే వాళ్లకంటే ముందు మార్కండేయమహర్షిని అక్కడికి వెళ్ళమను. నువ్వు కూడా నైమిశారణ్యానికి వేళ్ళు అని శ్రీమన్నారాయణుడు చెప్పారు. సప్త కల్పాల వయస్సు ఉన్న మార్కండేయ మహర్షి నైమిశారణ్యానికి వెళ్లారు. మార్కండేయ మహర్షిని చుసిన ఋషులు, మహర్షులు అన్యమనస్కంగానే మర్యాదలు చేసారు. కొంతసమయం తరువాత అక్కడికి శ్రీహరి నామస్మరణచేస్తూ అక్కడికి సనకానందనాదులు వచ్చారు. వారు రాగానే మార్కండేయ మహర్షి వారికీ నమస్కరించి వినయంగా ఆహ్వానించి అర్ఘ్యపాద్యములను ఇచ్చి కూర్చోపెట్టారు. అక్కడ ఉన్న మహర్షులు, ఋషులు అది అంత చూసి ఆశ్చర్యపోయారు. సనకసనందనాదులు మార్కండేయ మహర్షి మేము నీకన్నా చిన్నవాళ్లము నీ వయస్సు సప్త కల్పాలు మా కన్నా పెద్దవాడివి. నువ్వు మాకు నమస్కరిస్తున్నావేమిటి అని అడుగుతారు. దానికి మార్కండేయ మహర్షి మహానుభావులారా! మీరు బ్రహ్మ ముఖం నుండి జన్మిచారు. మీరు బ్రహ్మ మానస పుత్రులు. నిరంతరం శ్రీహరి నామసంకీర్తన చేస్తుంటారు. నిరంతర పరమాత్మతో కలిసే ఉంటారు. నాకు ఎప్పటికైనా మరణం సంభవిస్తుంది. కానీ మీరు అలాకాదు ఎప్పుడు శ్రీమనారాయణుడితో ఉంటారు. ఆయనకు ఇష్టులు. కాబ్బటి నేను మీకు నమస్కరిస్తున్నాను అని చెప్పారు. ఇదంతా విన్న ఇదంతా విన్న మహర్షులు, ఋషులు తాము చేసిన తప్పు తెలుసుకొని బాధపడి మార్కండేయ మహర్షికి, సనకసనందనాదులకి క్షమాపణలు చెప్పారు. ఆగిపోయిన మాఘమాస వ్రతాన్ని, శ్రీమన్నారాయణుడి యజ్ఞాన్ని మళ్ళీ ప్రారంభించి పూర్తిచేశారు. జరిగినదంతా నారదమహర్షి వైకుంఠములో ఉన్న శ్రీమన్నారాయణుడి తెలియజేసారు. శ్రీమన్నారాయణుడు విని తన పిల్లలు అంత మళ్ళీ కలిసిపోయి లోక క్షేమం కోసం యజ్ఞం చేస్తునందుకు సంతోషించారు. ఎంతయినా మనమందరూ ఆ భగవంతునికి పిల్లలం కదా. మన తప్పులను అయన కాకా ఇంకెవరు సరిచేస్తారు అని జహ్నుమహాముని గృతజ్ఞ మహర్షికి, వశిష్ఠ మహర్షి దిలీప మహారాజుకి మహాశివుడు పార్వతిమాతకి చెప్పారు. ఈ విధముగా శౌనకాది ఋషులకు సూతమహర్షి మాఘమాసం 19వ రోజు పారాయణాన్ని చెప్పటం పూర్తిచేశారు.   

Bhagavad gita_adhyatmikam1

భగవద్గీత

అద్యాయం 10

శ్లోకం 40

నాంతో స్తి దివ్యానాం విభూతీనాం పరంతప |

ఏషతూద్దేశతః ప్రోక్తో విభూతేర్విస్తరో మయా ||

అర్థం :-

ఓ పరంతపా! నా దివ్యవిభూతులకు అంతమే లేదు. నావిభూతుల విస్తృతిని గూర్చి నేను నీకు చాలా సంక్షిప్తముగా వివరించాను.




మాఘ పురాణం 18

మాఘమాసం 18వ రోజు పారాయణం



శౌనకాది ఋషులకు సూతమహర్షి మాఘమాసం 18వ రోజు పారాయణాన్ని చెప్పటం మొదలు పెట్టారు. పార్వతిమాతకు మహా శివుడు చెపుతున్నారు. పార్వతి! వశిష్ట మహర్షి దిలీపమహరాజుకి ఓ దిలిపామహారాజా! జహ్నుమహాముని గృతజ్ఞ మహర్షితో శ్రీమన్నారాయణుడు చేపినట్టుగానే దేవతలు ఇంద్రుడిని శాపవిముక్తిని కలిగించటానికి ప్రయాగ వెళ్లరు. అక్కడ గంగానది తెల్లగాను, యమునా నది నల్లగా ఉంటుంది. అక్కడ విశాలమైన వటవృక్షం ఉంది. సర్వ తీర్ధాలకి రాజైనటువంటిది ప్రాయంగా తీర్ధం. మాఘమాసంలో త్రివేణీసంగమంలో స్నానం చేయటం వలన పన్నెండు నదుల్లో స్నానం చేసిన ఫలితం లభిస్తుంది. దేవతలు త్రివేణి సంగమంలో నీటిని తీసుకొని పద్మగిరి ప్రాంతములో ఇంద్రుడి కోసం వెతుకుతున్నా దేవతలకు చిన్న పాదములు పెద్దశరీరం కలిగిన విచిత్రమైన తొండ  కనిపించింది. ఆ తొండ దేవతలను చూసి భయపడి ధ్వని చేసింది. దేవతలు ఆ దొండను చూసి అది రక్షస్వరూపము అనుకోని దానిని తాడుతో బంధించారు. దేవతల స్పర్శ తగలగానే  తొండ రూపాని వదిలి అందమైన స్త్రీ రూపాని ధరించింది. ఆమె దేవతలను చూచి నమస్కరించింది. దేవతలు ఆమెను ఆశ్చర్య పోయారు. ఎవరు నువ్వు తొండ రూపాని ఎలా పొందావు. నీ కథను వివరించు అని అడిగారు. ఆమె దేవతలకు మళ్ళీ నమస్కరించి నా పేరు సుశీల. కాశ్మీరంలో ఒక బ్రాహ్మణా కుటుంబంలో జన్మిచాను. నా తండ్రి నాకు వివాహం చేసారు. నా దురదృష్టం నా వివాహం జరిగిన నాలుగోవ రోజు నా భర్త మరణించారు. నా తల్లిదండ్రులు చాల ఎక్కువ దుఃఖించారు. నన్ను బంధువులకు అప్పగించి నా తల్లితండ్రులు వనవాసానికి తపస్సు చేసుకోవటానికి వెళ్లిపోయారు. బంధువులు నన్ను పాటించుకోకుండా నిరాదరణ చేసారు. నేను బిక్షాటన చేసి జీవించాను. నాకు వ్రతం చేయాలనీ గాని, స్నానం చేయాలనీ గాని, దానం చేయాలనీ గాని నాకు ఎవరు చెప్పలేదు. దుష్టురాలిగా జీవించాను. ఒకసారి అనుకోకుండా ఆకలితో ఉన్న ఒకరికి అన్నం పెట్టి తరువాత నేను తిన్నాను. కొన్నాళ్లకి మరణించాను. నరకానికి వెళ్లాను. అక్కడా శిక్షలు అనుభవించాను. రకరకాల జంతు జన్మలు ఎత్తాను. నేను చేసిన ఒకే ఒక పుణ్యం ఆకలిగా ఉన్నవారికి అన్నం పెట్టాను. దానివల్లనే దర్శన భాగ్యం కలిగి నాకు శాపవిముక్తి కలిగింది. నామీద దయవుంచి నాకు ఉత్తమగతులు కలగటానికి మార్గాన్ని తెలియజేయండి. వారు ప్రయాగ నుంచి తీసుకువచ్చిన త్రివేణి సంగమం నీరు చాలాగానే ఆమె దైవత్వం కలిగి ఉత్తమగతులకి వెళ్లిపోయింది. దేవతలు ఇంద్రుడిని వెతుకుంటూ వెళ్లరు. వికార పూపములో తిరుగుతున్న ఇంద్రుడిని చూసి బాధపడరు. ఇంద్రుడి దగరకు వెళ్లి శ్రీమన్నారాయణుడు నీ శాప విముక్తికి మార్గాన్ని తెలియజేసారు అని చెప్పారు. ఇంద్రుడిని తీసుకొని తుంగభద్ర నదీతీరంలో త్రివేణి సంగమంనుంచి తెచ్చిన నీటిని అతని పై పోసి తరువాత తుంగ భద్రలో స్నానం ఆచరించగానే ఇంద్రుడికి శాపవిముక్తి కలిగి మాములు రూపం వచ్చింది. ఇంద్రుడు దేవతలను తీసుకొని దేవలోకానికి వెళ్లిపోయారు. జహ్నుమహాముని ఇంకో కధచెపుతాను విను అని గృతజ్ఞ మహర్షి చెప్పసాగారు. పూర్వ కాలంలో పంపానది తీరములో ధనవంతుడైన ఒక వైశ్యుడు ఉండేవాడు. దానం సంపాదించటమే గాని ధన ధర్మాలకు ఎపుడు వినియోగించేవారు కాదు. దైవ ప్రార్ధన కానీ చేయలేదు. అతను కొంతకాలానికి మరణించాడు. నరకానికి వెళ్లి అక్కడ శిక్షలను అనుభవించాడు. మళ్ళీ మానవరూపములో దరిద్రుడై జన్మించి కష్టాలు అనుభవించి మరణించాడు. మరుజన్మలో పిశాచమై పంపా నది తీరములో మరిచెట్టుపై నివసించసాగాడు. ఒక సారి ఆ మరిచెట్టు దగరకు శిష్యులతో కలిసి అక్కడకు వచ్చారు. వశిష్ఠులవారు మాఘస్నానం ఆచరించి ఆ చెట్టు నీడనే కూర్చొని శ్రీమన్నారాయణుడిని ఆరాధించి పురాణం ప్రవచనం వింటున్నాడు. మరిచెట్టు పైన ఉన్న పిశాచరూపములో ఉన్న వైశ్యుడు కూడా వింటున్నాడు. అతను మరిచెట్టు మీదనుంచి కిందపడ్డాడు. తన నిజరూపాన్ని ధరించాడు. వసిష్ఠులవారికి నమస్కరించి తన వృత్తంతం అంత వివరించాడు. విశిష్ఠులవారు అతని పైన గంగా జలాన్ని చల్లారు. అతనిని దివ్య రూపం వచ్చి అతను ఉత్తమ గతులకి వెళ్లిపోయారు అని జహ్నుమహాముని గృతజ్ఞ మహర్షికి, వశిష్ఠ మహర్షి దిలీప మహారాజుకి మహాశివుడు పార్వతిమాతకి చెప్పారు. ఈ విధముగా శౌనకాది ఋషులకు సూతమహర్షి మాఘమాసం 18వ రోజు పారాయణాన్ని చెప్పటం పూర్తిచేశారు.   

మాఘ పురాణం 17

మాఘమాసం 17వ రోజు పారాయణం



శౌనకాది ఋషులకు సూతమహర్షి మాఘమాసం 17వ రోజు పారాయణాన్ని చెప్పటం మొదలు పెట్టారు. పార్వతిమాతకు మహా శివుడు చెపుతున్నారు. పార్వతి! వశిష్ట మహర్షి దిలీపమహరాజుకి ఓ దిలిపామహారాజా! జహ్నుమహాముని గృతజ్ఞ మహర్షితో  ఇలా చెప్పసాగారు. పూర్వం ఒకసారి ఇంద్రుడు రాక్షస సంహారం చేసి భూలోక మార్గంలో వెళుతుండగా తుంగభద్ర నది తీరములో ముద్రవిందుడు అనే మహాముని ఉన్నారు. అయన భార్య మిత్రవింద. ఇంద్రుడు వెళుతున్న సమయంలో స్నానం చేసి బయటకు వచ్చి తన జుట్టును ఆరబెట్టుకుంటుండగా ఇంద్రుడు చూసారు. ఆమెను చుసిన ఇంద్రుడు మొహం పొందు ఆమెను కోరుకొని అక్కడే ఉన్నారు. తన తోటి వచ్చిన దేవతలను పంపించివేశారు. మరుసటి రోజు తెల్లవారుజామున మిత్రవిందుడు తన శిష్యులతో కలిసి వారితోపాటు వేదాధ్యయనం చేయటానికి దూరంగా ఉన్న పర్ణశాలకు వెళ్లరు. ముని బయటకు వెళ్లగానే ఇంద్రుడు మిత్రవింద దగరకు వచ్చారు. మిత్రవిందతో తాను ఇంద్రుడినని తన మనస్సులో ఉన్న కోరికను తీర్చమని అడగగా ఆమె కూడా తిరస్కరించకుండా ఉండిపోతుంది. ఇంద్రుడు తన కోరికను తీర్చుకొని ఇంటినుంచి బయటకు వెళుతుండగా అక్కడికి మిత్రవిందుడు వస్తారు. ఇంద్రుడిని చూసి జరిగింది తెలుసుకొని అతనిని నువ్వు రాక్షసులతో యుద్ధం చేసి తిరిగి వెళ్లకుండా పరుల భార్యపై మొహం చెందవు నువ్వు దేవుడివి కాదు. పశువుగా ప్రవర్తించావు కనుక గాడిద ముఖం వాడివి అయిపో నువ్వు ఇంకా దేవలోకానికి వెళ్ళలేవు అని శపిస్తారు. మిత్రవిందుడు తన భార్యని కూడా రాయివి కమ్మని శపించారు. మిత్రవిందుడు జీవితం మీద విరక్తి చెంది తపస్సు చేసుకోవటానికి వెళ్లి కొంతకాలానికి ఉత్తమ గతులను పొందుతారు. ఇంద్రుడు తన ముఖాన్ని ఎవరికీ చూపించలేక కొండగుహలలో జీవించసాగారు. ఇంద్రుడు లేడు అని తెలిసి రాక్షసులు దేవలోకంపై దండెత్తి వచ్చారు. ఇంద్రుడి న్యాయకత్వం లేక దేవతలు ఓడిపోయారు. ఇలా పన్నెండు మానవ సంవత్సరాలు గడిచిపోయాయి. ఇంద్రుడిని వెతుకుంటూ భూలోకములో నది తీరాలయందు, సముద్ర తీరాలయందు అడవులలో వెతుకుంటూ వచ్చారు. ఒకచోట మునులందరూ కూర్చొని మాఘమాసం గురించి మాట్లాడుకుంటున్నారు. ఆ మాటలను దేవతలు విన్నారు. మాఘమాసం విశిష్టత దాని మహత్యం తెలుసుకున్నారు. మాఘమాసం సూర్యుడు మకరరాశిలో ఉండగా ప్రాతఃకాలంలో నిద్రలేచి నదీతటాకా పుణ్యనదులలో శ్రీమన్నారాయణుడిని స్మరిస్తూ స్నానమాచరించి శ్రీమన్నారాయణుడిని, సూర్యభగవానుడిని, శివుడిని పూజించి పురాణములను చదువుతారు. యధాశక్తి దానధర్మాలు ఆచరిస్తే మోక్షానికి అర్హులు అవుతారు. నెలరోజులు ఈ వ్రతమును చేయాలి. ఈ పురాణాన్ని చదవాలి అని చెప్పారు. మాఘమాసం మాధవుడిని స్మరించాలి. మాఘ శుద్ధ చతుర్దశి యందు గోదానమును, తిలదానమును, పాయసం దానమును, వస్త్ర దానమును శక్తీ కొలది చేయాలి. దేవతలందరు కలిసి శ్రీమన్నారాయణుడిని కీర్తించి ప్రార్ధించారు. శ్రీమన్నారాయణుడు మనోహరమైన, సుందరమైన, వైజయంతి మాలలను ధరించి, దివ్యాభరణాలను ధరించి, తులసి మాలలను ధరించి గంబీరముగా దర్శనం ఇచ్చారు. దేవతలు శ్రీమన్నారాయణుడిని చూసి స్వామి నువ్వు వేదవేద్యుడవు, నీ అనుగ్రహం లేనిదే ఎవరు తరించలేరు. చతుభూజాలయందు శంఖం, చక్రం, గదా, పద్మములను ధరించినవాడారు. ఆర్తజనపోషకుడవు, దయామయుడవు, నిర్వికారుడవు స్వామి నీవు తప్ప మాకు వేరే దిక్కులేదు మాములు రక్షించు అని ప్రార్ధించారు. దేవతలా ప్రార్థనలకు సంతోషించిన శ్రీమన్నారాయణుడు మీకు ఏమి కావాలి అని అడుగుతారు. దేవతలు శ్రీమనారాయణుడితో స్వామి ఇంద్రుడు కనిపించటం లేదు. ఇంద్రుడు లేకపోవటంతో రాక్షసులు దేవలోకంపై పడుతున్నారు. ఇంద్రుడు ఎక్కడ ఉన్నదో మాకు చెప్పండి స్వామి అని అడుగుతారు. శ్రీమన్నారాయణుడు దివ్యదృష్టితో చూసి ఇంద్రుడు ఒక ముని శాపం కారణంగా గాడిద ముఖం పొంది పద్మగిరి పర్వత ప్రాంతాలలోని గుహలలో తిరుగుతున్నాడు. అతని చేత మాఘమాస వ్రతం చేయించండి. అతని చేత గంగా నదీస్నానం చేయించండి. అలా చేయించటం వలన మునిశాపం పోయి వెంటనే మళ్ళీ పూర్వపు ఇంద్రుడిగా వస్తాడు. స్వామి కేవలం నదీస్నానం మాఘ వ్రతం చేయటం వలన శాపం పోతుందా అని అడుగుతారు. అప్పుడు శ్రీమన్నారాయణుడు అవును పూర్యం ఇలాగే ఒక మునికి గంధర్వుడు ఇచ్చిన శాపం కారణంగా కోతిమూకం వచ్చినది. నారద మహర్షి ఉపదేశంతో గంగా నది స్నానం ఆచరించి తన శాపాన్ని పోగొట్టుకున్నాడు. కాబ్బటి దేవతలారా మీరు ఇంద్రుడు దగరకు వెళ్ళండి. ఇంద్రుడిని తీసుకొని మాఘమాసంలో గంగా నదిలో స్నానం చేయించండి. మీకు నేను ఉన్నాను. భయపడవద్దు అని చేపి వెళ్లిపోయారు అని జహ్నుమహాముని గృతజ్ఞ మహర్షికి, వశిష్ఠ మహర్షి దిలీప మహారాజుకి మహాశివుడు పార్వతిమాతకి చెప్పారు. ఈ విధముగా శౌనకాది ఋషులకు సూతమహర్షి మాఘమాసం 17వ రోజు పారాయణాన్ని చెప్పటం పూర్తిచేశారు.   


Bhagavad gita_adhyatmikam1

భగవద్గీత

అద్యాయం 10

శ్లోకం 39

యచ్చాపి సర్వభూతానాం భీజం తదహమర్జున |

న తదస్తి వినా యత్ స్యాత్ మయా భూతం చరాచరమ్ ||

అర్థం :-

ఓ అర్జునా! సర్వప్రాణుల ఉత్పత్తికి కారణమైన భీజమును నేనే. ఏలనన, నేనులేని చరాచర ప్రాణి యేది లేదు.




మాఘ పురాణం 16

మాఘమాసం 16 రోజు పారాయణం



శౌనకాది ఋషులకు సూతమహర్షి మాఘమాసం 16 రోజు పారాయణాన్ని చెప్పటం మొదలు పెట్టారు. పార్వతిమాతకు మహా శివుడు చెపుతున్నారు. పార్వతి! వశిష్ట మహర్షి దిలీపమహరాజుకి ఓ దిలిపామహారాజా! జహ్నుమహాముని గృతజ్ఞ మహర్షితో  ఇలా చెప్పసాగారు. పూర్వం కాలంలో ఒక విద్యాధరుడు సంతానం కోసం బ్రహ్మ గారి కోసం తపస్సు చేసారు. అయన తపస్సుకి మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైయారు. బ్రహ్మదేవుడు విద్యాధరుడితో విద్యాధరా! నీ తపస్సుకి మెచ్చాను. నీకు ఏమి వరం కావాలో కోరుకోమన్నారు. విద్యాధరుడు బ్రహ్మదేవా! నాకు ఇప్పటివరకు సంతానం కలగలేదు నాకు సంతానాన్ని ప్రసాదించు అని కోరుకున్నారు. అందుకు బ్రహ్మదేవుడు విద్యాధరా! నీకు ఈ జన్మలో సంతాన భాగ్యం లేదు. కానీ నీవు నా గురించి తపస్సు చేసావు కాబ్బటి పుత్ర సంతానం లేదు కానీ పుత్రిక సంతానం ప్రసాదిస్తున్నాను అని చేపి వెళ్లిపోయారు. కొంత కాలానికి విద్యాధరా దంపతులకి ఒక కుమార్తె జన్మిస్తుంది. ఆమెను విద్యాధరా దంపతులు ఎంతో ప్రేమగా పెంచసాగారు. ఆమెకు యుక్త వయస్సు వచ్చిన తరువాత ఒకరోజు ఆమె తోటలో ఆడుకుంటుండగా ఒక రాక్షసుడు ఆమెను చూసి ఆమె దగరకు వచ్చాడు. ఆమెతో సుందరిని నివ్వు ఎవరు ఎక్కడ ఎందుకు ఉన్నావు. నువ్వు నాకు బాగా నచ్చవు నేను నిన్ను వివాహం చేసుకుంటాను అని అడుగుతాడు. అందుకు విద్యాధరా కన్యకా నన్ను వివాహం చేసుకోవాలి అనుకుంటే వెళ్లి మా నాన్న గారిని అడగండి అని చెప్పుతుంది. అ రాక్షసుడు విద్యాధరుడిని వెళ్లి మీ కుమార్తెని నాకు ఇచ్చి వివాహం చేయమని అడుగుతాడు. అందుకు విద్యాధరుడు మేము మా కుమార్తెను విడిచి ఉండలేము. మేము విద్యాధరులము విద్యాధరుడికి మా దగ్గరే ఉండేవారికి ఇచ్చి వివాహం చేస్తాము. రాక్షసులకు ఇచ్చి వివాహం చేయము అని చెపుతాడు. ఆ మాటకి ఆ రాక్షసుడికి కోపం వస్తుంది. విద్యాధరుడు ఇంట్లో లేని సమయంలో ఆ విద్యాధరా కన్యకను రాక్షసుడు  అపహరించి సముద్రగర్భంలోని పాతాళంలోని తన నివాసంలో దాచిపెడతాడు. ఆమెను వివాహం చేసుకోవటం కోసం ముహుర్తాన్ని నిర్ణయించామని బ్రహ్మదేవుడి దగరకు వెళతారు. బ్రహ్మదేవుడు మరో ఎనిమిది మాసముల వరకు మంచి ముహూర్తం లేదు. నువ్వు అప్పటివరకు ఎదురుచూడు అని చెపుతారు. రాక్షసుడు తన నివాసానికి తిరిగివచ్చి విద్యాధరా కన్యకతో నిన్ను వివాహం చేసుకోవటానికి మరో ఎనిమిది మాసములవరకు ముహూర్తం లేదు. నువ్వు ఇక్కడే ఉండు నీకు ఏమి కావాలి అన్న నేను చేస్తాను అని అంటాడు. విద్యాధరకన్యక తనకు ఈ వివాహం ఇష్టం లేకపోయినా ఆ రాక్షసుడిని ఎదిరించలేక దేవుడే తనను రక్షంచగలగు అని ఆలోచించుకోండి. ఆ రాక్షసుడితో విద్యాధరా కన్యకా నాకు ఇక్కడ ఒక శివాలయాన్ని చూపించు నేను రోజు శివుడిని పూజించుకుంటాను అని అడుగుతుంది. అందుకు ఆ రాక్షసుడు పాతాళంలో ఉన్న హఠకేశ్వర ఆలయాన్ని చూపించారు. ఆ విద్యాధరా కన్యకా రోజు హఠకేశ్వర ఆలయానికి వెళ్లి శివుడిని పూజిస్తుండేది. కొంతకాలం తరువాత అక్కడికి నారద మహర్షి వచ్చారు. ఆ విద్యాధరా కన్యకను చూసి నువ్వు ఎవరు చుస్తే దేవకన్యలా ఉన్నావు. ఎక్కడ ఎందుకు ఉన్నావు అని అడుగుతారు. ఆ విద్యాధరా కన్యకా జరిగిన విషయం చేపి బాధపడుతుంది. నారద మహర్షి ఆమెకు ధైర్యం చేపి ఇప్పుడు మాఘమాసం వస్తుంది. ఈ నెల రోజులు ఇక్కడే ఉన్న సరస్సులో స్నానం చేసి రోజు నియమనిష్టలతో శివుడిని, శ్రీమన్నారాయణుడిని, సూర్యుడిని ఆరాధించు నీకష్టం తొలగిపోతుంది. నీకు విష్ణు భక్తుడైన ఒక మహారాజు ఆ రాక్షసుడిని చంపి నిన్ను వివాహం చేసుకుంటారు అని చేపి వెళ్లిపోతారు. విద్యాధరా కన్యకా మరుసటి రోజు నుంచి మాఘమాసం అవటం వలన నారద మహర్షి చేపిన విధంగా మాఘమాస వ్రతం ఆచరించింది. నారద మహర్షి ఆమె దగ్గర నుంచి సౌరాష్టానికి వెళ్లి అక్కడ శ్రీమన్నారాయణుడి భక్తుడు ఆ దేశపు రాజైన హరిద్రధుడు దగ్గరకు వెళతారు. నారద మహర్షిని చూడగానే శ్రీమన్నారాయణుడిని చూసినట్టుగా సంతోషించి గౌరవమర్యాదలతో ఆహ్వానించి ఆసనంపై కూర్చోపెట్టి అర్ఘ్య పాద్యములను ఇచ్చి పూజించారు. నారద మహర్షి సంతోషించి ఓ రాజా నీకు ఒక విషయం చెప్పాలని వచ్చాను. అందుకు మహారాజు ఆజ్ఞాపించండి మహర్షి నన్ను ఏమి చేయమంటారు అని అడుగుతారు. అందుకు నారద మహర్షి సముద్రలోని పాతాళంలో ఒక రాక్షసుడి నివాసంలో ఒక విద్యాధరా కన్యకా బందీగా ఉంది. ఆమెను అక్కడి నుంచి విడిపించి నివ్వు వివాహం చేసుకోవాలి అని చెపుతారు. అందుకు ఆ రాజు అక్కడికి ఎక్కడికి వెళ్లాలో చెప్పండి నేను వెంటనే వెళ్లి ఆమెను తీసుకువస్తాను అని చెపుతారు. అప్పుడు నారద మహర్షి అ రాక్షసుడిని చంపటం అంతసులభం కాదు. అతను శివుడి గురించి తపస్సు చేసి శివుడి త్రిసూలాన్ని వరంగా కోరుకొని తీసుకున్నాడు. అతనికి త్రిశులాన్ని ఇస్తూ శివుడు ఇది నీ చేతిలో ఉన్నపుడే నీకు విజయం ఇది నీ శత్రువు చేతిలోకి వెళితే అతడి చేతిలోనే నీకు మరణం వస్తుంది అని చెపుతారు. ఇంకొంత సేపటి తరువాత ఆ రాక్షసుడు త్రిశూలాన్ని తన నివాసంలో ఉంచి బ్రహ్మదేవుడి దగ్గరకు వెళతాడు నువ్వు ఆ సమయంలో అతని నివాసానికి వెళ్లి ఆ త్రిశూలాన్ని తీసుకొని అతను తిరిగి వచ్చాక అతనిని చంపు అని చెపుతారు. నారద మహర్షి మహారాజుని తీసుకొని సముద్రుడి దగరకు వెళ్లి ఆ రాక్షసుడి నివాసానికి దారిని ఇమ్మని చెప్పుతారు. మహారాజు ఆ దారి వెంట వెళ్లి నారద మహర్షి చేపినట్టుగానే చేసారు. ఈలోపు ఆ రాక్షసుడు తన నివాసానికి తిరిగి వచ్చాడు. అక్కడ తన త్రిశూలాన్ని తీసుకున్న ఆ మహారాజుని చూసి తనకు మృత్యువు సమీపించింది అని అర్ధమైంది. అతనితో పోరాడి చనిపోతాడు. ఆ మహారాజు విష్యాధారా కన్యకా దగరకు వెళ్లి జరిగిన విషయం చేపి వివాహం చేసుకుంటారు. ఆమెను తీసుకొని ఆమె తండ్రి ఐన విద్యాధరుడి దగరకు వెళతారు. ఈ విధముగా మాఘమాస వ్రతం ప్రభావం వలన ఆ విద్యాధరా కన్యకా కష్టాలు తిరి జీవితం అంత సంతోషంగా గడపసాగింది అని జహ్నుమహాముని గృతజ్ఞ మహర్షికి, వశిష్ఠ మహర్షి దిలీప మహారాజుకి మహాశివుడు పార్వతిమాతకి చెప్పారు. ఈ విధముగా శౌనకాది ఋషులకు సూతమహర్షి మాఘమాసం 16 రోజు పారాయణాన్ని చెప్పటం పూర్తిచేశారు.  

Bhagavad gita_adhyatmikam1

భగవద్గీత

అద్యాయం 10

శ్లోకం 38

దండో దమయతామస్మి నీతిరస్మిజిగీషతామ్ |

మౌనం చైవాస్మి గుహ్యానాం జ్ఞానం జ్ఞానవతామహమ్ ||

అర్థం :-

శిక్షించువారిలో దండమును అనగా దమనశక్తిని నేనే. జయేచ్ఛకలవారి నీతిని నేనే. గోప్యవిషయరక్షణమున 'మౌనము'ను నేను. జ్ఞనుల యొక్క తత్త్వజ్ఞానమును నేను. 




మాఘ పురాణం 15

మాఘమాసం పదిహేనోవా రోజు పారాయణం



శౌనకాది ఋషులకు సూతమహర్షి మాఘమాసం పదిహేనోవా రోజు పారాయణాన్ని చెప్పటం మొదలు పెట్టారు. పార్వతిమాతకు మహా శివుడు చెపుతున్నారు. పార్వతి! వశిష్ట మహర్షి దిలీపమహరాజుకి ఓ దిలిపామహారాజా! జహ్నుమహాముని గృతజ్ఞ మహర్షితో  ఇలా చెప్పసాగారు. ఓ మహర్షి అ పండితుడికి దర్శనం ఇచ్చిన శ్రీమన్నారాయణుడు నీవు కోరిన పుత్రుడిని ప్రసాదించాను కదా మళ్ళి దేని కోసం తపస్సు చేస్తున్నావు అని అడిగారు. అందుకు అ పండితుడు స్వామి మీరు వరం ఏచిన్నటే నాకు ఒక కుమారుడు జన్మించారు. అతనికి జతకకర్మలు చేస్తున్నపుడు నారద మహర్షులవారు వచ్చి మా కుమారుడిని చూసి ఇతని పన్నెండు సంవత్సరములు మాత్రమే జీవిస్తారు అని చేపి వెళ్లిపోయారు. స్వామి మీరు ఇచ్చిన వరం ఎందుకు ఇలా వ్యర్థం అయింది మేము ఏమి పొరపాటు చేసాము అని అడుగుతారు. అందుకు శ్రీమన్నారాయణుడు ఓ పండితుడా! నీవు గతజన్మలో జ్ఞానశర్మ అనే పేరు గల పండితుడివి. ఆ జన్మలో కూడా నా భక్తుడివి. ఇప్పటి నీ భార్య గతజన్మలో కూడా మీరు భార్యాభర్తలు. మీరు గత జన్మలో కూడా మాఘ మాసం వ్రతం చేసారు. కానీ నీ భార్య మాఘ పూర్ణమ వ్రతం చేసింది కానీ ఆమె చేసిన పాయసాన్ని బ్రాహ్మణులకి పెట్టటం మరచిపోయింది. ఆ దోషం వలన మీకు సంతానం కలగలేదు. నా అనుగ్రహం వలన మీకు సంతానం కలిగింది కానీ మీ కుమారుడు పన్నెండు సంవత్సరాల ఆయుర్ధాయమే వచ్చింది. ఈ దోషం పోవటానికి మీరు మాఘమాసం వ్రతం చేయండి మీ కుమారుడు పూర్ణాయుష్కుడు అవుతాడు. ప్రతిరోజు సూర్యోదయానికి పూర్వమే గంగా నదిలో స్నానమాచరించి నన్ను పూజించి గంగా జలాన్ని నీ కుమారుడిపై చళ్ళు రోజు నీ కుమారుడికి ఉన్న దోషం పోయి పూర్ణాయుష్కుడు అవుతాడు అని చేపి శ్రీమన్నారాయణుడు అంతర్ధానం అయ్యారు. ఆ పండితుడు సంతోషించి ఇంటికి వచ్చి జరిగిన విషయం చేపి మాఘమాసం అంత సూర్యదయానికి ముందే గంగా నదిలో కుటుంబమంతా స్నానం ఆచరించి శ్రీమన్నారాయణుడిని పూజించినా గంగా జలాన్ని తన కుమారుడిపైన చల్లారు. ఈ విధముగా నెలరోజులు చేసారు. కుమారుడికి ఉన్న దోషం పోయి పూర్ణాయుష్కుడు అయ్యాడు. అతను సకల వేద శాస్త్రములను సకల విద్యలను నేర్చుకున్నాడు. అందరి పట్ల వినయంగా విధేయతగా మెలిగేవారు.మాఘమాసం అతి రహస్యం అయింది. అంతగాక మాఘమాస మహిమ కేవలం బ్రహ్మకి విష్ణుమూర్తికి శివునికి సప్తఋషులకి మాత్రమే తెలుసు. పూర్వజన్మ పుణ్యం ఉంటేగాని ఈ మాఘమాస వ్రతం తెలియదు. మాఘమాసం వ్రతాన్ని ఎవరైనా ఆచరించవచ్చి మానవులు, యక్షులు, కీనేరాలు, కింపురుషులు, రాక్షసులు ఎవరైనా చరించవచ్చు అని చెప్పారు. అంతే కాక ఈ రోజు మాఘ పూర్ణమ అత్యంత పవిత్రమైనది. సంవత్సరములో నాలుగు పూర్ణిమలు సముద్ర స్నానం చేయాలనీ చెప్పారు. అవి కార్తీక పూర్ణిమ, మార్గశిర పూర్ణిమ, మాఘపూర్ణిమ, వైశాఖ పూర్ణిమ. మాఘపూర్ణిమ రోజు సముద్రానికి వెళ్లి సముద్రలో శ్రీహరికి ధ్యానం చేస్తూ స్నానం ఆచరించాలి. సూర్య భగవానుడికి అర్ఘ్యం ఇవ్వాలి. మాఘపూర్ణిమ నాడు సముద్ర స్నానం ఆచరించటం వలన సకల పాపములు పోయి పుణ్యం కలుగుతుంది అని జహ్నుమహాముని గృతజ్ఞ మహర్షికి, వశిష్ఠ మహర్షి దిలీప మహారాజుకి మహాశివుడు పార్వతిమాతకి చెప్పారు. ఈ విధముగా శౌనకాది ఋషులకు సూతమహర్షి మాఘమాసం పదిహేనోవా రోజు పారాయణాన్ని చెప్పటం పూర్తిచేశారు.  

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...