మాఘ పురాణం 13

మాఘ మాసం పదమూడోవ రోజు పారాయణం



శౌనకాది ఋషులకు సూతమహర్షి మాఘమాసం పదమూడోవ రోజు పారాయణాన్ని చెప్పటం మొదలు పెట్టారు. పార్వతిమాతకు మహా శివుడు చెపుతున్నారు. పార్వతి! వశిష్ట మహర్షి దిలీపమహరాజుకి ఓ దిలిపామహారాజా! పూర్వం గోదావరినది తీరములో సుశీలుడు అనే వేద పండితుడు ఉండేవాడు. అతను ఒక సారి ఊరికి వెళుతుండగా దారితప్పి ఒక అడవిలోకి ప్రవేశించారు. ఆ అడవి మధ్యలో ఒక ఆకారం కనిపించింది. దానిని కాళ్ళు చెట్టు మొదలుగా నేలలోకి పాతుకుపోయి పైన ఒక భయంకర రాక్షస ఆకారం కనిపించింది. అది బికరంగా బాధతో కదలలేక అరుస్తూ కనిపించింది. దానిని చూసి భయపడిన సుశీలుడు ధైర్యం కోసం వేదమంత్రాలు, హరినామస్మరణ చేసారు. కొంతసేపటికి ఆ రాక్షసుని బాధ తగ్గి అరవటం తగ్గించారు. సుశీలుడు ధైర్యం తెచ్చుకొని నువ్వు ఎవరు అని అడిగారు. ఆ రాక్షసుడు మహాత్మ నాకు ఇన్నాళ్లు వెయ్యి సూదులతో పొడిచినట్టు బాధ ఉండేది. మీరు చేసిన హరినామస్మరణ వలన నాకు బాధ తగ్గింది. నాకు పూర్వజన్మజ్ఞానం కలిగింది. మహాత్మ నేను పూర్వంజన్మలో ఒక పుణ్యకార్యం కూడా చేయలేదు. గోకర్ణ క్షేత్రములో మధువనం అనే గ్రామానికి గ్రామాధికారిగా ఉండేవాడిని. చేయకూడని అన్ని పాపములు చేశాను. దైవ పూజ ఎప్పుడు చేయలేదు. కష్టం అని నా దగరకు వచ్చిన వారికీ ఏమి చేయలేదు. ఇలా ఉండగా కొంతకాలానికి నేను మరణించాను. మరణించిన తరువాత చాల కాలం నేను నరకంలోనే ఉన్నాను. తరువాత కుక్క, పిల్లి జన్మలు ఎత్తాను. ఈ జన్మలో ఇలా రాక్షసుడి ఆకారం ధరించాను. నా యందు దయ ఉంచి నాకు ఈ నరకం నుంచి విముక్తిని ప్రసాదించండి అని ప్రార్ధించారు. సుశీలుడికి జాలికలిగి ఇక్కడ సమీపములో ఏమైనా జలాశయములు ఉన్నాయా అని అడిగారు. అప్పుడు ఆ రాక్షసుడు ఇక్కడికి పనేండు యోజనముల దూరములో ఒక చెరువు ఉన్నదీ అని చెప్పాడు. అపుడు సుశీలుడు సరే నివ్వు మరణించేనాటికి నీకు సంతానం ఉన్నదా అని అడిగారు. అప్పుడు రాక్షసుడు నాకు నలుగురు కుమారులు ఉన్నారు. వాళ్ళు నా లాగే ఉన్నారు. వారి పిల్లలు కూడా నా లాంటి వాళ్ళే ఇక్కడ దగరలో నా వంశస్థుడు భాష్కలుడు గ్రామాధికారిగా ఉన్నారు అని చెప్పారు. సుశీలుడు ఆ రాక్షసుడికి ధైర్యం చెప్పి నేను మీ భాధను పోగొడతాను అని చెప్పి వెళ్లారు. సుశీలుడు ఆ రాక్షసుడి వంశస్థుడు అయినా భాష్కలుడిని వెతుకుంటూ వెళ్లారు. భాస్కలుడి దగ్గరకు వెళ్లి నాయన నీ పూర్వీకుడైన ఒక అతను రాక్షసుడై చెట్టు మానుగా భూమిలోకి కూరుకుపోయి నరకం అనుభవిస్తున్నాడు అని జరిగినది వివరించి అతని అవస్థను పోగొట్టటానికి నువ్వు ఒక పని చేయాలి అని అడిగారు. ఆ భాష్కలుడు చెప్పండి మహాత్మ మీరు ఏమి చెప్పిన అది చేస్తాను. అప్పుడు సుశీలుడు ఇప్పుడు మాఘమాసం ఈ మాసములో నది స్నానం చేసి శివకేశవులని గాని, అమ్మవారిని గాని పూజించి నీ పెద్దలకూ తర్పణాలు వదిలితే వారికీ సత్ గతులు ప్రాప్తిస్తాయి. అప్పుడు భాష్కలుడు సూర్యదయం ముందే నిద్ర లేచి నది స్నానం చేసి శ్రీహరిని పూజించి తమ వంశస్తుడైన రాక్షసుడిగా ఉన్న అతని పేరుని తలచుకొని తర్పణం వదిలారు. భాష్కలుడు తర్పణం వదలగానే అక్కడ రాక్షసుడికి విముక్తి కలిగి సత్ గతులు పొందారు అని వశిష్ఠ మహర్షి దిలీప మహారాజుకి మహాశివుడు పార్వతిమాతకి చెప్పారు. ఈ విధముగా శౌనకాది ఋషులకు సూతమహర్షి మాఘమాసం పదమూడోవ రోజు  పారాయణాన్ని చెప్పటం పూర్తిచేశారు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...