మాఘ పురాణం

మాఘ పురాణం రోజు 1



ఒకసారి నైమిశారణ్యలోని మహర్షులు 12 సంవత్సరాలా యజ్ఞం చేయాలని ప్రారంభించారు. ఆ యజ్ఞ చూడాలని సూతమహర్షి వచ్చారు. ఆయానా రాగానే మహర్షులు అర్ఘ్యం, పాద్యం ఇచ్చారు. మహర్షులు సూతమహామునితో మహానుభావా మా పుణ్యం వలన మీరు ఇక్కడికి వచ్చారు. ఇపుడు మాఘమాసం వచ్చింది కదా. ఆ మాసం విశిష్టత తెలుపండి అని విన్నవించుకున్నారు. అప్పుడు సూతమహర్షి ఇలా వివరించారు. ఈ మాఘమాసం విశిష్టత బ్రహ్మాండ పురాణంలో, పద్మ పురాణంలో వివరించటం జరిగింది. మనం అసంకల్పితం గా మానవులు పాపములు చేస్తారు. వాళ్ళ పాపములు పోగొట్టుకోవటం ఎలా అని పార్వతిమాత మహా శివుడిని అడిగింది. అప్పుడు మహా శివుడు నువ్వు చాలా మంచి ప్రశ్నలు వేశావు. ఈ మాఘమాసంలో స్నానానికి అధిక ప్రాధాన్యతను ఇస్తుంది. ప్రాతఃకాలం స్నానం చేసిన వారికీ ముక్తి వస్తుంది. పాపా విముక్తుడు అవుతారు. ఈ మాఘమాసంలో గంగాదేవి అని జలలో నివసిస్తుంది. మాఘమాసంలో మొదటి స్నాసం చేసిన వారికీ సర్వపాపాలు పోతాయిపోతాయ్. రెండొవసారి స్నానం చేసిన వారికీ వైకుంఠ ప్రాప్తి వస్తుంది. మూడవ స్నానం చేస్తే మహావిష్ణువే ఇంకా ఇతనికి ఏమి ఇవ్వాలి అని ఆలోచిస్తారు అంట. ప్రయాగలోని గంగలో మాఘమాసంలో స్నానం చేస్తే పునర్జన్మ ఉండదు. స్నానం చేసి పురాణం విన వారికీ మరుజన్మలో ఋషి ఐయి జన్మిస్తారు. మాఘమాసంలో దానములు చేయాలి. నువ్వులు దానం చేయటం వలన విశేష వి ఇస్తుంది. ఈ మాసమంతా ములంగి  తినకూడదు. నువ్వులు పంచదార కలిపి తినాలి. ఈ మాసమంతా సూర్య భగవానుడికి సూర్య నమస్కారాలు, ఆదిత్య హృదయం పారాయణం, సూర్యునికి అర్ఘ్యం ఇవ్వటం వలన ఆరోగ్యం సిద్ధిస్తుంది. పూర్యం దిలీపుడు వేటకు వెళ్లి అలసిపోయి సేదతీరిన తరువాత వెళుతుంటే ఒక మహర్షి అపి నువ్వు మహాఘమాసం స్నానం చేయకుండా వెళుతున్నావు. మాఘస్నానం చేయటం వలన విశేష ఫలితం ఇస్తుంది. దిలీపుడు నమస్కరించి ఆ విశిష్టతను వివరించండి అని కోరారు. ఈ రోజు స్నానం చేసి వేళ్ళు మీ గురువైన వసిష్ఠుడు నీకు వివరిస్తారు అని చెప్పారు. దిలీపుడికి వసిష్ఠుడు ఏమి చెప్పారో అని మహా శివుడు పార్వతితో, శౌనకదులకు సూతమహాముని వివరించారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...