మాఘ పురాణం 10

మాఘ మాసం పదోవరోజు పారాయణం



శౌనకాది ఋషులకు సూతమహర్షి మాఘమాసం పదవరోజు పారాయణాన్ని చెప్పటం మొదలు పెట్టారు. పార్వతిమాతకు మహా శివుడు చెపుతున్నారు. పార్వతి! వశిష్ట మహర్షి దిలిపామహారాజుకి మాఘమాస విశిష్టత వివరిస్తూ పూర్వం మృగశృంగుడు అనే మహర్షి ఉండేవారు. అయన పుటినప్పటినుంచే దైవభక్తి కలిగి ఉండేవాడు. అతని విద్యాబ్యాసం పూర్తయిన తరువాత తల్లి తండ్రుల అనుమతితో దేశాటన చేయటానికి వెళ్లరు. అతనికి అతని తల్లి తండ్రి సుశీల అనే అమ్మాయిని ఇచ్చి వివాహం చేసారు. అయితే సుశీలకి ఇద్దరు స్నేహితులు ఉండేవారు. వారు కూడా మృగశృంగుడు దగరకు వచ్చి మేము మా స్నేహితురాలిని వదిలి ఉండలేము మమ్మలిని కూడా వివాహం చేసుకోమని అడిగారు. అందుకు మృగశృంగుడు ఒప్పుకోలేదు. ఒకరు ఒకరినే వివాహం చేసుకోవాలి నేను అలా చేయలేను అన్నారు. సుశీల స్నేహితులు వెళ్లి బ్రాహ్మణా పండితులను అడిగారు. వారు వచ్చి మృగశృంగా ఆడపిల్లలు తమంతట తామే వచ్చి వివాహం చేసుకోమంటే తప్పు లేదు నువ్వు వీరిని కూడా వివాహం చేసుకోమని చేపి మృగశృంగుడిని ఒపించారు. అదే వివాహంలో మిగతా ఇద్దరిని కూడా వివాహం చేసుకున్నారు. వీరు నలుగురు చాల సంతోషంగా ఉండేవారు. వీరులో ముందుగా సుశీల గర్భం ధరించింది. మృకండుడు అనే కుమారుడు కలిగాడు. తరువాత వారి ఇద్దరికి కూడా సంతానం కలిగిన మృకండుడు పెద్దకుమారుడు అవటం వలన ముగ్గురు తల్లులు ఎంతో ప్రేమగా పెంచారు. మృకండుడు కూడా బాల్యం నుంచే దైవభక్తి, పెద్దలపట్ల వినయం, విద్య పట్ల ఆసక్తిగా ఉండేవాడు. అతనికి యుక్త వయస్సు వచ్చాక మరుధ్వతి అనే కన్యను ఇచ్చి వివాహం చేసారు. కొన్నాళ్లకి మృగశృంగుడికి వైరాగ్యం కలిగి భార్యలతో వానప్రస్థ ఆశ్రమం స్వీకరించారు. మృకండుడికి ఇంటి బాథ్యతలు అప్పగించారు. అయితే ఎంతకాలమైనా మృకండుడికి సంతానం కలగలేదు అందుకు విచారించేవారు. అక్కడ ఉన్న మునులు ఋషులు కాశీకి వెళ్లి విశ్వనాధుడిని దర్శనం చేసుకొని రమ్మని సలహా ఇచ్చారు. మృకండుడు తన కుటుంబనంతటిని తీసుకొని కాశీకి ప్రయాణమయ్యారు. కాశీలో మణికర్ణికాలో స్నానం ఆచరించి విశ్వనాధుడిని దర్శనం చేసుకున్నారు. మరుధ్వతి, మృకండుడు సంతానం కోసం అక్కడే తపస్సు చేయసాగారు. కొంతకాలానికి మృగశృంగుడు అతని భార్యలు శివైక్యం చెందారు. సంతానం కోసం చాలాకాలం తపస్సు చేసారు. తరువాత శివపార్వతులు ప్రత్యక్షం అయ్యారు. మృకండుడు సంతోషించి తనకు సంతానని ప్రసాదించమని ప్రార్ధించారు. అప్పుడు శివుడు మృకండా నీకు సంతాన యోగం లేదు కానీ నువ్వు చేసిన తపస్సుకి నీకు సంతానని ప్రసాదిస్తున్నాను. నీకు జీవితాంతం వైధవ్యం ఉన్న కుమార్తె కావాలా, బుద్ధిమంతుడు అల్పాయుష్కడు అయినా కుమారుడు కావాలా అని అడిగారు. అందుకు మృకండుడు స్వామి ఎమీకి నాకు ఈ పరీక్షా జీవితాంతం వైధవ్యంతో ఉన్న కూతురిని కోరుకుంటే ఆమె ఏడుస్తూ ఉండతం చూడాలి. అది నా వాళ్ళ కాదు బుద్ధిమంతుడైన అల్పాయుష్కుడు అయినా కుమారుడిని ప్రసాదిచండి. శివపార్వతులు తధాస్తు అని వెళ్లిపోయారు. కొంతకాలానికి మరుధ్వతికి సంతానం కలిగింది. చాల కాలం తరువాత మృకండుడికి సంతానం కలిగే సరికి చుట్టూ పక్కల మునులు ఋషులు చూడటానికి వచ్చారు. మృకండుడు తన కుమారుడికి మార్కండేయుడు అని నామకరణం చేసారు అని వశిష్ఠ మహర్షి దిలీప మహారాజుకి మహాశివుడు పార్వతిమాతకి చెప్పారు. ఏవిధముగా శౌనకాది ఋషులకు సూతమహర్షి మాఘమాసం పదోవరోజు పారాయణాన్ని చెప్పటం పూర్తిచేశారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...