మాఘ పురాణం 2

మాఘ పురాణం రెండొవ రోజు పారాయణం


ఈ రోజు సూతమహాముని శౌనకాది మునులకు రెండొవరోజు పారాయణం గురించి చెపుతూ మునీశ్వరులారా! పార్వతి మాత మహా శివునితో మాఘ పురాణం విశిష్టత వివరిస్తున్నా రఘువంశంలోని దిలీప చక్రవర్తి కథను వివరిస్తున్నారు. ఒకసారి దిలీప చక్రవర్తి సభలో ఉండగా ఆ రాజ్యంలో ఉన్న గూడెం వాళ్ళు వచ్చి మామాలిని అడవి పందులు బాధిస్తున్నాయి అని విన్నవించుకున్నారు. దిలీప చక్రవర్తి వేటకు భయాలుదేరారు. అడవి పందులు ఎక్కడకి వస్తాయో తెలుసుకొని రాత్రి చెట్లపై ఎక్కి కాపుకాసి అడవి పందులు రాగానే వాటిని హతమార్చారు. తెలవారుతుండగా చెట్టు దిగి మళ్ళి  తన సైన్యముతో తిరిగి రాజ్యానికి వెళుతుండగా దారిలో ఒక వృథాహరితుడు అనే ముని కనిపించేసరికి తన గుర్రాన్ని దిగి మునికి నమస్కరించారు. ఆ ముని దిలీప మహారాజ! ఈ రోజు నుంచి మాఘ మాసం వస్తుంది. మాఘ స్నానం చాలా విశిష్టమైనది అని చెప్పారు. అందుకు దిలీప మహారాజు మునివర్యా! నా యందు దయ యుంచి నాకు మాఘ మాసం గురించి వివరించండి అని వినయంగా వేడుకున్నారు. అందుకు ముని దిలీప మహారాజ! నాకు ఇప్పుడు సమయం లేదు. కొన్ని ఘడియలలో సూర్యదయం అవుతుంది. ఎప్పుడు పురాణం చెప్పుకునే సమయం కాదు. నువ్వు కూడా నాతోపాటు మాఘస్నానం చేసి సూర్యునికి అర్ఘ్యం ఇవ్వు నువ్వు రాజ్యానికి వెళ్లిన తరువాత మీ గురువైన వశిష్ఠ మహామునిని అడిగి తెలుసుకొండి అని చెప్పారు. దిలీప మహారాజు ఆ వృథాహరితుడు చూపిన విషముగా చేసి రాజ్యానికి వెళ్లారు. వెళ్లిన వెంటనే అయన నిత్యం చేసుకునే పూజాదికాలు, యజ్ఞము చేసుకొని తన భార్యని తీసుకొని వసిష్ఠమహాముని దగ్గరకు వెళ్లరు. వసిష్ఠమహామునికి వినయంతో నమస్కరించి గురువర్యా! నేను నిన్న వేటకు వెళ్ళాను. తిరిగి వస్తుండగా వృథాహరితుడు అనే ముని కనిపించి మాఘస్నానం గురించి చెప్పారు. మాఘ మాస విశిష్టత గురించి అడుగగా మిమ్మలిని అడిగి తెలుసుకోమని చెప్పారు. నాకు మాఘ మాసం గురించి వివరించండి అని అడిగారు. అందుకు వసిష్ఠ మహాముని దిలీప మహారాజ! నువ్వు అడిగిన ప్రశ్న చాలా మంచిది. లోకంలో ఉన్న మానవులందరికీ ఉపయోగపడుతుంది.  మాఘ స్నానం చేయటం వలన స్వర్గ ప్రాప్తి లభిస్తుంది. ధాన్యం, సువర్ణం, గోవు దానం చేయటం వలన వచ్చేస్వర్గం మాఘస్నానం చేయటం వలన లభిస్తుంది. మాఘమాసములో ముఖ్యంగా స్నానం, జపం, దానం చేయాలి. మాఘమాసం నందు నదులలో చెరువులలో, కొలనులో, సెలయేరులా స్నానం చేసి అక్కడే సూర్యునికి అర్ఘ్యం ఇచ్చి అక్కడే శ్రీమహా విష్ణువుని శివుడిని పూజించాలి. మాఘమాసం మొత్తం సూర్యదయానికి ముందే స్నానం చేసిన వారికీ మరుజన్మంలో భూపతి అవుతారు మహారాజ. 12 సంవత్సరాలు ఈ విధముగా మాఘస్నానం చేయటం వలన దేవతల తల్లి అయినా అతిథికి ద్వాదశ ఆదిత్యులు జన్మిచారు. రోహిణి నక్షత్రం కూడా మాఘస్నానం చేయటం వలన భర్తకు ప్రీతిపాత్రమైనది.అలాగే శచీదేవి ఈ మాఘస్నానం వ్రతం చేయటం వలన పతివ్రతాలలో స్థానం సంపాదిచుకుంది. మాఘస్నానం వ్రతం చేసేవారు మనస్సులో కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. ఈ మాఘస్నానం చేసినవారికి బెల్లం నువ్వులు దానం చేయాలి. గోవుని దానం చేయటం వలన గోవు ఒంటిమీద ఎన్ని రోమాలు ఉంటాయో అన్ని సంవత్సరారు స్వర్గంలో ఉంటారు. తరువాత బ్రాహ్మణుడికి భోజనం పెట్టటం వలన పితృదేవతారు సంతోషిస్తారు. ఈ మాఘమాసంలో మాఘస్నానం సూర్యానికి అర్ఘ్యం ఇవ్వటం సూర్యునికి నమస్కరించటం సూర్యని కిరణాలూ మానవులమీద పడటం వలన ఆరోగ్యము లభిస్తుంది అని దిలీప చక్రవర్తికి వసిష్ఠమహాముని,  మహాశివుడు పార్వతిమాతకు, సూతుడు శౌనకాది మహామునులకు రెండొవరోజు మాఘపురాణం వివరించారు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...