మాఘ పురాణం 14

మాఘమాసం పధ్నాలుగోవ రోజు పారాయణం



శౌనకాది ఋషులకు సూతమహర్షి మాఘమాసం పధ్నాలుగోవ రోజు పారాయణాన్ని చెప్పటం మొదలు పెట్టారు. పార్వతిమాతకు మహా శివుడు చెపుతున్నారు. పార్వతి! వశిష్ట మహర్షి దిలీపమహరాజుకి ఓ దిలిపామహారాజా! పూర్వ కాలములో గృతజ్ఞ మహర్షిని చూసి జహ్నుమహాముని ఇలా అన్నారు. ఓ మహర్షి మాఘమాసం చాల పవిత్రమైనది అన్నారు. మానవులకి జ్ఞానాన్ని మోక్షాన్ని ప్రసాదిస్తుందా అని అడిగారు. జహ్నుమహాముని చెపుతూ నాయన! పూర్వకాలములో గంగా తీరములో ఒక బ్రాహ్మణుడు ఉండేవారు. అతను వేదవేదాంగాలు చదివారు. ఉత్తముడు. ఇంద్రియ జయించినవాడు. ఆచారవంతుడు, నీతి దయా కలిగిన కలిగినవాడు, అతని భార్య కూడా ఉత్తమురాలు. కానీ వారికీ సంతానం లేదు. గుణవంతుడైన పుత్రుడి కోసం కాశీకి వెళ్లి తపస్సు చేస్తాను అని భార్యకు చెపుతారు. దానికి అతని భార్య కూడా నేను కూడా మీతోవచ్చి తపస్సు చేస్తాను నాకు అనుమతిని ఇవ్వండి అని అడుగుతుంది. అందుకు అతను సరే అని ఒప్పుకుంటారు. ఇద్దరు కలిసి వెళ్లి కాశీలో తపస్సు చేయటం మొద్దలు పెడతారు. కొంతకాలానికి వీరి తపస్సుకి మెచ్చి శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షం అవుతారు. అయినా అ పండితుడు ధ్యానం నుంచి బయటకు రాకపోవటంతో మనస్సులోనే శ్రీమన్నారాయణుడిని దర్శనం చేసుకుంటున్నారు. అతని ధ్యాననిష్ఠకి మెచ్చి శ్రీమన్నారాయణుడే అతని ధ్యానానికి భంగం కలిగించి దర్శనం ఇచ్చారు. అ పండితుడు కళ్ళు తెరచి శ్రీమన్నారాయణుడిని చూసి సంతోషముతో స్తోత్రం చేయసాగారు. అతని స్తోత్రానికి మెచ్చిన శ్రీమన్నారాయణుడు నీకు ఏమి వరం కావాలో కోరుకోమన్నారు. అందుకు అ పండితుడు తనకు పుత్ర సంతతిని ప్రసాదించమని కోరుకున్నారు. శ్రీమన్నారాయణుడు తధాస్తు అని అంతర్ధానమయ్యారు. కొంతకాలానికి అ పండితుని దంపతులకు ఒక పుత్రుడు జన్మిస్తారు. అతని జాతక కర్మలు నిర్వహిస్తుండగా నారదమహర్షి అ బాలుడిని చూసి అతని ఆయుష్షు పనేందు సంవత్సరాలే అని చెపుతారు. అది విని ఆ పండిత దంపతులు ఎంతో దుఃఖిస్తారు. ఆ పండితుడు శ్రీమన్నారాయణుడు ఇచ్చిన వరం ఇలా ఎందుకు అయింది. నేను వెళ్లి మళ్ళీ తపస్సు చేసి స్వామి వారినే అడుగుతాను అని భార్యకు చేపి తపస్సు చేయటానికి గంగాతీరానికి వెళతారు. అక్కడ ఇంతకుముందుకంటే నిష్ఠగా శ్రీమన్నారాయణుడి గురించి తపస్సు చేస్తారు. కొంతకాలానికి శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమై ఓ పండితుడా నువ్వు అడిగిన వరాన్ని నేను ఇచ్చాను కదయ్యా మళ్ళీ ఏమి ఆశించి తపస్సు చేస్తున్నావు అని అడుగుతారు అని జహ్నుమహాముని గృతజ్ఞ మహర్షికి, వశిష్ఠ మహర్షి దిలీప మహారాజుకి మహాశివుడు పార్వతిమాతకి చెప్పారు. ఈ విధముగా శౌనకాది ఋషులకు సూతమహర్షి మాఘమాసం పధ్నాలుగోవ రోజు పారాయణాన్ని చెప్పటం పూర్తిచేశారు.  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...