మాఘ పురాణం 17

మాఘమాసం 17వ రోజు పారాయణం



శౌనకాది ఋషులకు సూతమహర్షి మాఘమాసం 17వ రోజు పారాయణాన్ని చెప్పటం మొదలు పెట్టారు. పార్వతిమాతకు మహా శివుడు చెపుతున్నారు. పార్వతి! వశిష్ట మహర్షి దిలీపమహరాజుకి ఓ దిలిపామహారాజా! జహ్నుమహాముని గృతజ్ఞ మహర్షితో  ఇలా చెప్పసాగారు. పూర్వం ఒకసారి ఇంద్రుడు రాక్షస సంహారం చేసి భూలోక మార్గంలో వెళుతుండగా తుంగభద్ర నది తీరములో ముద్రవిందుడు అనే మహాముని ఉన్నారు. అయన భార్య మిత్రవింద. ఇంద్రుడు వెళుతున్న సమయంలో స్నానం చేసి బయటకు వచ్చి తన జుట్టును ఆరబెట్టుకుంటుండగా ఇంద్రుడు చూసారు. ఆమెను చుసిన ఇంద్రుడు మొహం పొందు ఆమెను కోరుకొని అక్కడే ఉన్నారు. తన తోటి వచ్చిన దేవతలను పంపించివేశారు. మరుసటి రోజు తెల్లవారుజామున మిత్రవిందుడు తన శిష్యులతో కలిసి వారితోపాటు వేదాధ్యయనం చేయటానికి దూరంగా ఉన్న పర్ణశాలకు వెళ్లరు. ముని బయటకు వెళ్లగానే ఇంద్రుడు మిత్రవింద దగరకు వచ్చారు. మిత్రవిందతో తాను ఇంద్రుడినని తన మనస్సులో ఉన్న కోరికను తీర్చమని అడగగా ఆమె కూడా తిరస్కరించకుండా ఉండిపోతుంది. ఇంద్రుడు తన కోరికను తీర్చుకొని ఇంటినుంచి బయటకు వెళుతుండగా అక్కడికి మిత్రవిందుడు వస్తారు. ఇంద్రుడిని చూసి జరిగింది తెలుసుకొని అతనిని నువ్వు రాక్షసులతో యుద్ధం చేసి తిరిగి వెళ్లకుండా పరుల భార్యపై మొహం చెందవు నువ్వు దేవుడివి కాదు. పశువుగా ప్రవర్తించావు కనుక గాడిద ముఖం వాడివి అయిపో నువ్వు ఇంకా దేవలోకానికి వెళ్ళలేవు అని శపిస్తారు. మిత్రవిందుడు తన భార్యని కూడా రాయివి కమ్మని శపించారు. మిత్రవిందుడు జీవితం మీద విరక్తి చెంది తపస్సు చేసుకోవటానికి వెళ్లి కొంతకాలానికి ఉత్తమ గతులను పొందుతారు. ఇంద్రుడు తన ముఖాన్ని ఎవరికీ చూపించలేక కొండగుహలలో జీవించసాగారు. ఇంద్రుడు లేడు అని తెలిసి రాక్షసులు దేవలోకంపై దండెత్తి వచ్చారు. ఇంద్రుడి న్యాయకత్వం లేక దేవతలు ఓడిపోయారు. ఇలా పన్నెండు మానవ సంవత్సరాలు గడిచిపోయాయి. ఇంద్రుడిని వెతుకుంటూ భూలోకములో నది తీరాలయందు, సముద్ర తీరాలయందు అడవులలో వెతుకుంటూ వచ్చారు. ఒకచోట మునులందరూ కూర్చొని మాఘమాసం గురించి మాట్లాడుకుంటున్నారు. ఆ మాటలను దేవతలు విన్నారు. మాఘమాసం విశిష్టత దాని మహత్యం తెలుసుకున్నారు. మాఘమాసం సూర్యుడు మకరరాశిలో ఉండగా ప్రాతఃకాలంలో నిద్రలేచి నదీతటాకా పుణ్యనదులలో శ్రీమన్నారాయణుడిని స్మరిస్తూ స్నానమాచరించి శ్రీమన్నారాయణుడిని, సూర్యభగవానుడిని, శివుడిని పూజించి పురాణములను చదువుతారు. యధాశక్తి దానధర్మాలు ఆచరిస్తే మోక్షానికి అర్హులు అవుతారు. నెలరోజులు ఈ వ్రతమును చేయాలి. ఈ పురాణాన్ని చదవాలి అని చెప్పారు. మాఘమాసం మాధవుడిని స్మరించాలి. మాఘ శుద్ధ చతుర్దశి యందు గోదానమును, తిలదానమును, పాయసం దానమును, వస్త్ర దానమును శక్తీ కొలది చేయాలి. దేవతలందరు కలిసి శ్రీమన్నారాయణుడిని కీర్తించి ప్రార్ధించారు. శ్రీమన్నారాయణుడు మనోహరమైన, సుందరమైన, వైజయంతి మాలలను ధరించి, దివ్యాభరణాలను ధరించి, తులసి మాలలను ధరించి గంబీరముగా దర్శనం ఇచ్చారు. దేవతలు శ్రీమన్నారాయణుడిని చూసి స్వామి నువ్వు వేదవేద్యుడవు, నీ అనుగ్రహం లేనిదే ఎవరు తరించలేరు. చతుభూజాలయందు శంఖం, చక్రం, గదా, పద్మములను ధరించినవాడారు. ఆర్తజనపోషకుడవు, దయామయుడవు, నిర్వికారుడవు స్వామి నీవు తప్ప మాకు వేరే దిక్కులేదు మాములు రక్షించు అని ప్రార్ధించారు. దేవతలా ప్రార్థనలకు సంతోషించిన శ్రీమన్నారాయణుడు మీకు ఏమి కావాలి అని అడుగుతారు. దేవతలు శ్రీమనారాయణుడితో స్వామి ఇంద్రుడు కనిపించటం లేదు. ఇంద్రుడు లేకపోవటంతో రాక్షసులు దేవలోకంపై పడుతున్నారు. ఇంద్రుడు ఎక్కడ ఉన్నదో మాకు చెప్పండి స్వామి అని అడుగుతారు. శ్రీమన్నారాయణుడు దివ్యదృష్టితో చూసి ఇంద్రుడు ఒక ముని శాపం కారణంగా గాడిద ముఖం పొంది పద్మగిరి పర్వత ప్రాంతాలలోని గుహలలో తిరుగుతున్నాడు. అతని చేత మాఘమాస వ్రతం చేయించండి. అతని చేత గంగా నదీస్నానం చేయించండి. అలా చేయించటం వలన మునిశాపం పోయి వెంటనే మళ్ళీ పూర్వపు ఇంద్రుడిగా వస్తాడు. స్వామి కేవలం నదీస్నానం మాఘ వ్రతం చేయటం వలన శాపం పోతుందా అని అడుగుతారు. అప్పుడు శ్రీమన్నారాయణుడు అవును పూర్యం ఇలాగే ఒక మునికి గంధర్వుడు ఇచ్చిన శాపం కారణంగా కోతిమూకం వచ్చినది. నారద మహర్షి ఉపదేశంతో గంగా నది స్నానం ఆచరించి తన శాపాన్ని పోగొట్టుకున్నాడు. కాబ్బటి దేవతలారా మీరు ఇంద్రుడు దగరకు వెళ్ళండి. ఇంద్రుడిని తీసుకొని మాఘమాసంలో గంగా నదిలో స్నానం చేయించండి. మీకు నేను ఉన్నాను. భయపడవద్దు అని చేపి వెళ్లిపోయారు అని జహ్నుమహాముని గృతజ్ఞ మహర్షికి, వశిష్ఠ మహర్షి దిలీప మహారాజుకి మహాశివుడు పార్వతిమాతకి చెప్పారు. ఈ విధముగా శౌనకాది ఋషులకు సూతమహర్షి మాఘమాసం 17వ రోజు పారాయణాన్ని చెప్పటం పూర్తిచేశారు.   


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...