మాఘ పురాణం 9

మాఘ మాసం తొమ్మిదోరోజు పారాయణం



శౌనకాది ఋషులకు సూతమహర్షి మాఘమాసం తొమ్మిదోరోజు పారాయణాన్ని చెప్పటం మొదలు పెట్టారు. పార్వతిమాతకు మహా శివుడు చెపుతున్నారు. పార్వతి! దత్తాత్రేయ స్వామి కార్తవీర్యార్జునుడికి చెప్పటం మొదలు పెట్టారు. ఈ మాసంలో శివ కేశవులను పూజిస్తారు. నదులలో గంగానది పవిత్రమైనది. ఈ మాసంలో గంగానదిలో స్నానం ఆచరిస్తే సర్వపాపములు పోతాయి. దీనికి సంబంధించిన ఒక కథ ఉంది.  కొంతకాలం కిందట మగధ రాజ్యంలో పురోహిత వృతితోటి జీవిస్తున్న నలుగురు బ్రాహ్మణులూ ఉండేవారు. వారికీ ఒకొకరికి ఒకో కుమార్తె ఉన్నారు. ఒకసారి ఈ నలుగురు కన్యలు నీరు తీసుకొని రావటానికి కోనేరుకి వెళ్లారు. అక్కడ ఒక ముని కుమారుడు స్నానమాచరిస్తున్నాడు. అతనిని చూచి ఈ నరుగురు కన్యలు మోహించి ఆ ముని కుమారుడి వద్దకు వెళ్లి తమని వివాహం చేసుకోమని అడిగారు. కానీ ముని కుమారుడు లేదు నా విద్యాబ్యాసం పూర్తికాలేదు. విద్యాబ్యాసం ఐన తరువాత మా గురుదేవులు ఆజ్ఞ ఇచ్చిన తరువాతనే వివాహం చేసుకుంటాను. ఇపుడు వివాహం చేసుకోలేను అని చెప్పారు. ఆ నలుగురు కన్యలు మమ్మలిని వివాహం చేసుకోవలసిందే అని అతనిని అల్లరి చేయటం మొదలుపెట్టారు. అతను విసుకుంటూ ఏమిటి ఈపని మీ తల్లితండ్రులు చుస్తే ఎంత అవమానం ముందు మీరు మీ ఇళ్లకు వెళ్ళండి అని విసుకున్నారు. అయినా వారు వినలేదు ఇంకా ఎక్కువ అల్లరి చేయటం మొదలు పెట్టారు. ముని కుమారుడు విసిగిపోయి పిశాచాలుగా పీడిస్తునారు పిశాచులు అయిపొండి అని శపించాడు. ఆ నలుగురు కన్యకలు కూడా వివాహం చేసుకోమని వస్తే మమ్మలిని శపిస్తావా నువ్వుకూడా పిశాచానివైపో అని ప్రతిశాపం ఇచ్చారు. అలా ఐదుగురు పిశాచాలై అక్కడే ఉన్న చెట్టుమీద నివసిస్తూ కోనేరు దగ్గరకి వచ్చిన మనుషులను అల్లరి చేయటం మొదలు పెట్టారు. కొన్నాళ్లకి ఆ కోనేరు దగ్గరకి ఒక సిధుడు వచ్చారు. ఆయన్ని కూడా అల్లరి చేయాలనీ వచ్చాయి. సిద్ధుడు వాటిని అదిలించి తరిమేశారు. వారి గురించి తన దివ్యదృష్టితో తెలుసుకొని వారి తల్లి తండ్రుల దగ్గరకు ముని కుమారుడి గురువు దగ్గరకు వెళ్లి జరిగిన విషయం చెప్పారు. పిల్లలు కనిపించటం లేదు అని కంగారు పడుతున్న వారికీ సిద్ధుడి మాటల ధ్వారా ఊరట కలిగింది. తమ పిల్లలకి శాపవిమోచనం కలిగే మార్గం తెలుపమని ప్రాధేయ పడ్డారు. మీ పిల్లలను తీసుకొని వెళ్లి గయలో ఉన్న గంగానది దగ్గరకు తీసుకు వెళ్లి గంగానదిలో స్నానం చేయించండి వారి శాపం పోతుంది అని చెప్పారు. స్వామి  మేము అంటే మనుష్యులము వెళ్లగలము కానీ అవి ఎలావస్తాయి అని అడిగారు. నేను వాటికీ నా శక్తితో ఆజ్ఞాపిస్తాను మీతోపాటు వస్తాయి అని చెప్పారు. సిద్ధుడు చేపినట్టుగానే చేసారు. వారందరు గయకు వెళ్లి గంగానదిలో స్నానం చేసి వారి శాపాన్ని పోగొట్టుకున్నారు.ఆ నలుగురు కన్యలు తాము చేసిన తప్పు తెలుసుకొని క్షమాపణలు తెలిపారు. దత్తాత్రేయ స్వామి ఇంకా చెప్పుతూ గంగానది విశిష్టత గురించి మరొక కథ కూడా ఉంది చెపుతాను విను కార్తవీర్యార్జునా. పూర్వం ఒకసారి ఒక గంధర్వుల జంట భూలోకంలో గంగా నది దగ్గరకు వచ్చారు. గంధర్వుడు తన భార్యతో మనం మాఘమాసంలో ఎక్కడికి వచ్చాము వెళ్లి గంగానదిలో స్నానం చేద్దాము అని అన్నారు. ఆ గంధర్వుడి భార్య నేను చేయను నాకు చలివేస్తుంది. భూలోకంలో చేయను స్వర్గంలో ఉన్న గంగానదిలో చేస్తాను అని అన్నది. భర్త ఎంత సాధి చూపిన వినలేదు. ఆమె వినటం లేదు అని గంధర్వుడు వెళ్లి నదీస్నానం చేశారు. ఆమె నది స్నానం తిరస్కరించటం వలన ఆమె దివ్య శక్తులు పోయాయి. గంధర్వుడు విమానం ఎక్కి గంధర్వలోకాన్నికి వెళ్లారు. ఆమె ఇక్కడే ఉండిపోయింది. అక్కడే కొంతకాలం తిరగసాగింది. అక్కడ కొంతదూరములో ఒక ఋషి ఆశ్రమం ఉంది. ఆమె అక్కడికి వెళ్లి ఆ ఋషిని చూసి మెహించింది. ఋషికూడా తన ఋషిత్వాన్ని వదిలేసి ఇద్దరు కలిసి తిరగసాగారు. కొంతకాలానికి తన భార్య ఎల్లా ఉందొ చూద్దమని గంధర్వుడు తిరిగి వచ్చి వీరిని చూసేసరికి కోపం వచ్చింది. గంధర్వుడు తన భార్యతో నువ్వు గంగా నదిలో స్నానం చేయమంటే చేయలేక పోయావు కానీ ఎటువంటి పనులుచేస్తావా నువ్వు పాషాణానివైపో అని శపించారు. ఆ ఋషితో పరుల భార్యతో ఉన్నావు నీకు తప్పు అనిపించలేదా నీకు కోతిమూకం అవుతుంది అని శపించి వెళిపోయాడు. ఆ ఋషి తాను చేసిన తప్పుకు పశ్చాత్తాపపడి ఆ అడవిలోనే తిరగా సాగారు. కొన్నాళ్లకి నారద మహర్షి అక్కడికి వచ్చారు. జరిగినది తెలుసుకొని ఆ ఋషితో నివ్వు వెళ్లి గంగానదిలో స్నానం చేసి శివకేశవులను షాడోశోపచారాలతో పూజించు నీకు శాపవిమోచనం కలుగుతుంది. తరువాత గంగానది నీటిని తీసుకువచ్చి ఆ పాషాణం పై చళ్ళు ఆమెకి శాపవిముక్తి అవుతుంది అని చెప్పారు. ఆ ఋషి అలాగే చేశారు. అతనికి శాపవిమోచనం అయింది. గంగా నది నీటిని తీసుకొచ్చి ఆ పాషాణం పై చల్లారు. ఆమెకి శాపవిమోచనం అయి ఆమె దివ్యశక్తులు అందుకు వచ్చాయి. ఆమె తన తప్పు తెలుసుకొని గంగానదికి నమస్కరించి తన లోకానికి వెళ్లిపోయింది అని దత్తాత్రేయ స్వామి కార్తవీర్యజునికి, మహాశివుడు పార్వతిమాతకి చెప్పారు. ఏవిధముగా శౌనకాది ఋషులకు సూతమహర్షి మాఘమాసం తొమ్మిదోరోజు పారాయణాన్ని చెప్పటం పూర్తిచేశారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...