మాఘ పురాణం 20

మాఘమాసం 20వ రోజు పారాయణం



శౌనకాది ఋషులకు సూతమహర్షి మాఘమాసం 20వ రోజు పారాయణాన్ని చెప్పటం మొదలు పెట్టారు. పార్వతిమాతకు మహా శివుడు చెపుతున్నారు. పార్వతి! వశిష్ట మహర్షి దిలీపమహరాజుకి ఓ దిలిపామహారాజా! జహ్నుమహాముని గృతజ్ఞ మహర్షితో శ్రీ మహా విష్ణువు తత్వాన్ని గురించి ఇంకొక కథ చెపుతాను విను. ఒకసారి బ్రహ్మదేవుడు రజోగుణ ప్రధానుడు, శివుడు తమోగుణ ప్రధానుడు కదా! ఆ గుణములు ఒకసారి ఎక్కువయ్యాయి. దాని మూలంగా బ్రహ్మ, శివుడు నేను గొప్ప అంటే నేను గొప్ప అని వాదన చేసుకోసాగారు. అపుడు బ్రహ్మ నేను జీవుల పుట్టుకకు కారకుడిని కాబ్బటి నేనే గొప్పవాడిని అని అన్నారు. శివుడు నేను నా భక్తులకు సులభసాధ్యుడను కాబట్టి నేనే గొప్ప వాడిని అని అన్నారు. శ్రీ మహా విష్ణువు ఈ వాదనను ఆపటానికి ఒక విశ్వరూపాన్ని ధరించి వారి ముందు ప్రత్యక్షమయ్యారు. ఆ విశ్వరూపము అనేక సూర్యల కాంతితో అనేక కనులతో అనేక  చేతులతో అనేక కాళ్లతో చాల మనోహరంగా ఉంది. శివుడు, బ్రాహ్మలు ఇద్దరు ఆశ్ఛర్యపోయారు. ఈ రూపానికి తుది మొదలు ఎక్కడ ఉన్నదో చూదాం అనుకున్నారు. శివుడు, బ్రహ్మ ఆ విశ్వ రూపాని చూసి భీతి చెందారు. ఆ రూపము తుది మొదలు తెలుసుకున్న వాళ్లే తమలో ఉత్తములని అనుకొంటారు. ఇద్దరు ఆ రూపానికి తుది మొదలుని వెతకటానికి బయలుదేరుతారు. కానీ వారికీ ఎక్కడ కనిపించలేదు. ఏ రూపమైతే మనకు కనపడుతుందో అదే జగత్ కర్త, గురువు రక్షించువాడు. సర్వ ప్రకాశుడు, సర్వ ప్రాణులయందు నివసించేవాడు, మనము విని కంటే అధికులము కాదు. విష్ణుమూర్తిని ఇలా ప్రశంసిస్తున్నారు. అనంతమూర్తి, సర్వాధ్యము, సర్వాధారము, అనంత ప్రకాశము మనోహరమైన నీ స్వరూపముతో మా ముందు ప్రత్యక్షం అవ్వు అని కోరుకున్నారు. శ్రీమహావిష్ణువు వారికీ పీతాంబరమును ధరించి స్వర్ణ భరణాలు, చతుర్భుజాలతో, శంఖు చక్రాలతో గదా పద్మాలతో తులసీమాలలు ధరించి పారిజాతమలాలను ధరించి మనోహరంగా దర్శనం ఇచ్చారు. బ్రహ్మ మహేశ్వరులారా మీరు ఇద్దరు ఇలాగ వివాదపడుతూ ఉండటం వలన మీ వివాదమును ఆపటానికి నేను ఇలా విరాట్ స్వరూపములో ప్రత్యక్షమవవలసి వచ్చింది. మీ వివాదానికి కారణం నాకు తెలుసు. దీనిని ఎవరు పరిష్కరించలేరు. సత్వరజస్తమో ప్రకృతి వలన కలిగాయి. ఈ గుణములకు లోబడిన వారికీ యధార్ధము తెలియదు.  

సత్వ గుణము:- స్వయం ప్రకాశం, శాంతస్వభావము, భగవంతుడిని తెలుసుకోవాలి అని కాంక్ష కలిగినది. ఆత్మకు సేమము, దమము, దయ, అహింస శాంతి మొదలగు గుణములను కలిగించి పరలోకములో సుఖమును కలిగిస్తుంది. 

రజో గుణము :- జీవికి కర్మసక్తిని కలిగిస్తుంది. పరమాత్మ స్వరూప జ్ఞానాన్ని తప్పి ఇహలోక కర్మలపై ఆసక్తిని కలిగిస్తుంది. 

తమోగుణము :- అజ్ఞానము వలన కలుగుతుంది. ఇది జ్ఞానాన్ని పోగొట్టి మొహాన్ని కలిగిస్తుంది. పరమాత్మ జ్ఞానము వెనకపడిపోతుంది. భగవంతుని పట్ల ఆసక్తిని తగిస్తుంది. కార్యాల పట్ల శ్రద్ధ లేకపోవటం, వాయిదాలు వేయటం, కార్యం చేయలేకపోవటం కలిగిస్తుంది. నిద్రను ఎక్కువగా కలిగిస్తుంది.

మీకు రజస్తమో గుణముల వలనే ఈ వివాదము పెరిగింది. సృష్టి ప్రారంభంలో అంత చీకటిగా ఉండేది. పంచభూతములు అపుడు లేవు. పరమాత్మ సృష్టి చేయటానికి ఒక బంగారపు ముద్దలాగా ఉంది. అది క్రమంగా పెరిగి మూడు భాగములుగా విడిపోయింది. ఒక భాగము నుంచి బంగారపు రంగులో బ్రహ్మ లక్ష్మిలు, మరొక భాగము నుంచి తెలుపు రంగులో శివుడు, సరస్వతి. మరొక భాగము నుంచి నలుపు రంగులో నారాయణుడు, నారాయణి జన్మించారు. మనం ముగ్గురము ఒకేసారి జన్మించాము. మనం ముగ్గురము సమానులమే. బ్రహ్మ సృష్టికర్తగాను, విష్ణుమూర్తి పోషకుడిగాను, శివుడు లయకర్తగాను బాధ్యతలు స్వీకరించాము.  కాబ్బటి ఒకే దాని నుంచి వచ్చిన మనకే భేదములేదు కదా.శ్రీ మహా విష్ణువు  బ్రహ్మకు శివునికి అసలు తత్వాన్ని గుర్తుకు తెచ్చారు. బ్రహ్మకి నువ్వు సమర్థుడివి, సృష్టికర్తవు, దేవతలకు ప్రభువువి, వేదములకు స్థానానివి అని యజ్ఞములకు అధిపతివి. అన్ని లోకాలకి సంపదను ఇచ్చేవాడివి. స్వశక్తి తోనే పరమాత్మ యోగాని పొందావు. సర్వ రక్షకుడివి. నా నాభికమలము నుంచి జన్మించిన వాడివి. తండ్రి కొడుకులకి భేదము లేదు. ఏకత్వములో అనేకత్వముగా అన్నిటిలో మనమే ప్రకాశిస్తున్నాము. కాబ్బటి నువ్వు కూడా నా వలనే సమస్త దేవతలకు పూజనీవుడివి అని జహ్నుమహాముని గృతజ్ఞ మహర్షికి, వశిష్ఠ మహర్షి దిలీప మహారాజుకి మహాశివుడు పార్వతిమాతకి చెప్పారు. ఈ విధముగా శౌనకాది ఋషులకు సూతమహర్షి మాఘమాసం 20వ రోజు పారాయణాన్ని చెప్పటం పూర్తిచేశారు.    

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...