మాఘ పురాణం 11

 మాఘ మాసం పదకొండోవరోజు పారాయణం



శౌనకాది ఋషులకు సూతమహర్షి మాఘమాసం పదకొండోవరోజు పారాయణాన్ని చెప్పటం మొదలు పెట్టారు. పార్వతిమాతకు మహా శివుడు చెపుతున్నారు. పార్వతి! వశిష్ట మహర్షి దిలీపమహరాజుకి మృగశృంగుని వివాహము అతని తపస్సు శివ ప్రసాదం వలన కలిగిన పుత్రుని గురించి చెప్పారు. జన్మించిన ఆ బాలుడికి మార్కండేయుడు అని నామకరణం చేసారు. అతనికి ఆరు సంవత్సరాలు వచ్చిన తరువాత విద్యాబ్యాసం చేయటానికి గురువుల దగ్గరకి పంపించారు. మార్కండేయుడు అతి తక్కువకాలంలోనే సకలశాస్త్రాలు అభ్యసించారు. గురువుల దగ్గర వినయవిధేయతలతో మెలిగేవారు. అతనికి పదిహేను సంవత్సరాలు వచ్చాయి. మార్కండేయుని తల్లీతండ్రులకి మార్కండేయుడి వయస్సు పెరుగుతున్న కొద్ది దిగులు పడుతుండేవారు. అతనికి పదిహేను సంవత్సరాలు వచ్చాయి కనుక అతనికి జన్మదిన వేడుకలను చేసారు. అక్కడ ఉన్న మునులు ఋషులు అతనిని దీర్ఘాయుష్షుమన్ భావ అని దీవించారు. చివరిగా వశిష్ఠ మహర్షి దగ్గరకు వచ్చేసారి అయన మార్కండేయుడిని నమస్కరించవద్దని వారించారు. ఎందుకు అని అందరూ అడిగితే అప్పుడు వశిష్ఠ మహర్షి ఇతనికి మహాశివుడు పదహారు సంవత్సరములు మాత్రమే ఆయుష్షు ఇచ్చారు. ఇతని ఆయుష్షు ఇంకో సంవత్సరం మాత్రమే. నేను ఆ శివుని వరాన్నికి వ్యతిరేకంగా ఎలా దివిస్తాను అని వివరించారు. అందుకు మునులందరూ విచారించారు. ఈ బాలుడిని తీసుకొని మనం బ్రహ్మదేవుని దగ్గరకు వెళదాము. ఆయనే సమాధానం చెపుతారు. అందరూ కలిసి బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్లరు. బ్రహ్మదేవుడు ఆ మార్కండేయుడిని చూడగానే దీర్ఘాయుష్మాన్ భవ అని దీవించారు. విశిష్ట మహర్షి బ్రహ్మదేవునికి కూడా శివుని వరాన్ని మార్కండేయుని మరణాన్ని గురించి వివరించారు. బ్రహ్మదేవుడు తాను చేసిన పొరపాటుకు విచారించి మార్కండేయునికి నివ్వు కాశీకి వెళ్లి అక్కడ శివుని గురించి తపస్సు చేయి తరువాత అంత ఆ శివుడే చూసుకుంటారు అని చెప్పారు. మార్కండేయుడు తన తల్లితండ్రుల దగ్గరకు  వచ్చి బ్రహ్మదేవుని ఆజ్ఞను వివరించి తాను కాశీకి వెళతాను అని చెపుతారు. మార్కండేయుని తల్లితండ్రులు కూడా మేము కాశీకి వస్తాము అని చేపి అతనితోపాటు కాశీకి వెళ్లారు. మార్కండేరుడు విశ్వనాధుడికి దర్శనం చేసుకొని అక్కడికి దగ్గరలో ఆలయాన్ని నిర్మించుకొని శివుడిని పూజించటం మొదలు పెట్టారు. అలా సంవత్సరం గడిచింది. మార్కండేయునికి పదహారు సంవత్సరములు వచ్చాయి. యమధర్మరాజు యామభటులను పిలచి మార్కండేయుడిని ప్రాణాలను తీసుకురమ్మని పంపించారు. యమభటులు మార్కండేయుని దగ్గరకు రాలేకపోయారు. యమభటులు యమధర్మరాజు దగ్గరకు వెళ్లి మార్కండేయుని దగ్గరకు వెళ్లలేక పోతున్నామని అతనిని తేజస్సు కాపాడుతుంది అని వివరించారు. యమధర్మరాజు మార్కండేయుని దగ్గరకు వచ్చి యమపాశాని విసిరారు. ఆ పాశం దేబకు భయపడి మార్కండేయుడు శివలింగాన్ని కౌగిలించుకొని శివశివ అని ప్రార్ధించారు. యమధర్మరాజు మళ్ళీ పాశం వేసేసరికి అది మార్కండేయునికి శివలింగానికి చుట్టుకుంది. శివలింగం నుంచి శివుడు రౌద్రాకారంతో బయటకు వచ్చి యమధర్మరాజుతో ఎడమ కాలితో తన్ని త్రిశులని ఎత్తారు. దానితో భయపడిన యమధర్మరాజు తనని క్షమించమని ప్రార్ధించారు. శివుడు శాంతించి యమధర్మరాజుని అక్కడి నుంచి పంపించివేశారు. మార్కండేయుడికి నీకు చిరంజీవివై వర్ధిలుతావు అని వరాన్ని ఇచ్చి వెళ్లిపోతారు. మార్కండేయుడు సంతోషించి తన తల్లితండ్రులకు జరిగిన విషయాన్ని చెపుతారు. మార్కండేయుని తల్లితండ్రులు తమకుమారుడికి అకాలమృత్యువు పోయి చిరంజీవి అయినందుకు సంతోషిస్తారు అని వశిష్ఠ మహర్షి దిలీప మహారాజుకి మహాశివుడు పార్వతిమాతకి చెప్పారు. ఈ విధముగా శౌనకాది ఋషులకు సూతమహర్షి మాఘమాసం పదకొండోవరోజు  పారాయణాన్ని చెప్పటం పూర్తిచేశారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...