మాఘ మాసం విశిష్టత

మాఘ మాసం విశిష్టత

మాఘ మాసం కార్తీక మాసం లగే విశిష్టమైనది. మాఘం అంటే యజ్ఞం అని అర్థం. ఈ మాసం లో సూర్య భగవానుడిని పూజిస్తారు. సూర్యోదయానికి ముందే నిద్ర లేచి వేడి నీటితో గాని నదులలో, సముద్రాలలో స్నానం ఆచరిస్తే పరమ పవిత్ర మైనది. స్నానం తరువాత సూర్యుడి ఎదురుగా నుంచొని అర్ఘ్యం ఇవ్వటం చేస్తే ఆరోగ్యం చేకూరుతుంది. ఈ మాఘమాసంలో ఈ నెలరోజులు గంగాదేవి అని జలాలలో ఉంటుంది. ఈ నెల అంత ఆదిత్య హృదయ చదువుకోవాలి. త్రేతాయుగంలో ఈ మాసంలోనే శ్రీరాముడు వారధిని కట్టటం మొదలుపెట్టారు. ఈ మాసంలో సూర్యుడు ఏడూ గుర్రాల పైన ప్రయాణిస్తారు. ఎక్కడి నుంచి మనకు ఎండలు పెరుగుతాయి. ఈ మాఘమాసంలో దానానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. 



గుప్తా నవరాత్రులు:-

మాఘ పాడ్యమి నుంచి నవమి వరకు అమ్మవారి గుప్తా నవరాత్రులు వస్తాయి. శ్యామల అమ్మవారిగా పూజలు చేస్తుంటారు. ఈ అమ్మవారిని ఆరాధించటం వలన వాక్కును శుద్ధి చేస్తుంది. పిల్లలకు చదువులో చురుకుగా ఉంటారు. ఈ నవరాత్రుల్లో ఏదైనా మంచి పని తలపెడితే అది ఫలిస్తుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ఈ శ్యామల అమ్మవారు లలితపరమేశ్వరి అమ్మవారి దగ్గర మంత్రిని దేవత. నవరాత్రుల లాగా దీక్ష తీసుకొని చేసుకోవచ్చు. పూజ అయినా తరువాత పిల్లలని కూర్చోపెట్టుకొని శ్యామల దండకం చదవాలి. నవరాత్రి దీక్ష తీసుకొని చేయలేనివాళు అమ్మవారి శ్యామల దండకం చదువుకోవచ్చు. 

వసంత పంచమి:-

మాఘమాసం గురించి బ్రహ్మాడా పురాణంలో పద్మ పురాణం లో వివరించబడింది. మాఘశుద్ధ పంచమిని శ్రీపంచమి, వసంత పంచమి అంటారు. ఈ రోజున సరస్వతి దేవిని పూజిస్తారు. ఈ రోజున చిన్న పిల్లలకు అక్షరాబ్యాసం చేస్తారు.

రథ సప్తమి :-

ఈ మాఘమాసంలో రథసప్తమి వస్తుంది. ఈ రోజున ఆవు పిడకలపై పాలను పొంగించి నైవేద్యం చేసి చీకుడు ఆకులపై నైవేద్యాన్ని సూర్యభగవానుడికి నివేదిస్తారు. ఈ రోజునే సూర్య భగవానుడు తనను పూజించిన సత్రాజిత్తుకి సత్రాజిత్తుకు 'శమంతకమణి' ప్రాదించారు. ఈ రోజునే హనుమంతుడు వ్యాకరణాన్ని నేర్చుకున్నారు. మహా శివుడు ఈ రోజునే యాజ్ఞవల్కుడికి యజుర్వేదాని బోధించారు. ఈ రోజున ఆదిత్య హృదయం పారాయణ చేయాలి.

భీష్మ ఏకాదశి :-

మాఘమాసంలోనే ఏకాదశి నాడు భీష్ముడు తన ప్రాణాలను స్వచ్చంధంగా విడిచి పెట్టి మోక్షాన్ని పొందారు. ఈ రోజునే భీష్ముల వారికీ తర్పణాలు వదులుతారు. 

ఈ మాఘమాసంలో ప్రతి ఆదివారం పర్వదినాలు. మాఘమాసంలో పౌర్ణమి రోజునా సముద్ర స్నానాలు చేయటం విశేష ఫలితాలని ఇస్తుంది. ఈ మాసం చివరిలో మహాశివరాత్రి కూడా వస్తుంది.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...