మాఘ పురాణం 12

మాఘ మాసం పన్నెండవ రోజు పారాయణం



శౌనకాది ఋషులకు సూతమహర్షి మాఘమాసం పన్నెండవ రోజు పారాయణాన్ని చెప్పటం మొదలు పెట్టారు. పార్వతిమాతకు మహా శివుడు చెపుతున్నారు. పార్వతి! వశిష్ట మహర్షి దిలీపమహరాజుకి ఓ దిలిపామహారాజా! ఈ మాసంలో నది స్నానం చేస్తే పరమ పవిత్రం. వీటిలో గంగానది చాల పవిత్రమైనది. పూర్వం భగీరథ మహర్షి  గంగానదిని భూమికి తీసుకురావటానికి బ్రహ్మ కోసం పదివేళ్ళ సంవత్సరాలు తపస్సు చేసారు. బ్రహ్మ దేవుడు ప్రత్యక్షమై నీకు ఏమి వరం కావాలో కోరుకోమన్నారు. అప్పుడు భగీరధుడు మా పూర్వీకుల పాపములు పోయి వారికీ సత్ గతులు  రావటానికి గంగామాతను ప్రసాదించండి అని కోరారు. అందుకు బ్రహ్మ దేవుడు నువ్వు నా కోసం కాదు తపస్సు చేయవలసింది. గంగాదేవి గురించి తపస్సు చేయి నీ ప్రయత్నం ఫలిస్తుంది అని దీవించారు. భగీరధుడు గంగా మాత కోసం మరొక పదివేళ్ళ సంవత్సరాలు తపస్సు చేసారు. గంగా మాత భగీరథుని తపస్సుకి మెచ్చి ప్రత్యక్షమైంది. నీకు ఏమి వరం కావాలో కోరుకోమన్నారు. అందుకు భగీరధుడు మాత పాతాళంలో ఉన్న మా పూర్వీకుల పాపములను పోగొట్టి వారికీ సత్ గతులను ప్రసాదించటానికి మీరు నాతోపాటు భూలోకానికి రావాలి అని కోరారు. అందుకు గంగా మాత నేను నివ్వు అడిగిన వరాన్ని ఇస్తాను. కానీ నా వేగాన్ని భూమాత భరించలేదు అందుకు నీవు శివుని కోసం తపస్సు చేయి అని చేపి వెళ్లిపోయారు. భగీరధుడు మళ్ళీ పదివేల సంవత్సరములు శివుడి కోసం తపస్సు చేసారు. శివుడు ప్రత్యక్షమై నీకు ఏమి వరం కావాలో కోరుకోమన్నారు. అందుకు భగీరధుడు స్వామి! మా పూర్వీకుల సత్ గతులను ప్రసాదించటానికి నాకు మీ ద్వారా గంగా మాతను ప్రసాదించండి అని కోరుకుంటారు. శివుడు తన జడలను విపి గంగా దేవిని తన శిరస్సు మీదగా ప్రవహించామని ఆజ్ఞాపించారు. గంగా మాత శివుని శిరస్సు మీదుగా ప్రవహించింది. శివుడు తన జడలతో మొత్తం గంగా నదిని బంధించి ఒక పాయను మాత్రం వదిలిపెట్టారు. గంగా మాత భగీరథుని వెంట భూలోకానికి వచ్చి తరువాత పాతాళలోకానికి వెళ్లి భగీరథుని పూర్వీకులకు సత్ గతులను ప్రసాదించింది. అలా గంగా మాత భూమిపై అవతరించింది. అంత పరమ పవితమైన గంగా నదిలో మాఘమాసంలో స్నానం ఆచరించిన సకల పాపములు చివరికి బ్రహ్మహత్య పాపములు కూడా తొలగుతాయి. అప్పుడు దిలీపమహారాజు మరి ఇంకా ఏమయినా నదుల విశిష్టతలను వివరించండి అని కోరారు. అప్పుడు వసిష్ఠ మహర్షి గౌతమ మహర్షి తపస్సు వలన గంగానది దక్షిణ భారతదేశంలో గోదావరి నదిగా భూమిపైకి వచ్చి ప్రవహిస్తుంది అని చెప్పారు. దిలీపమహారాజు మాఘ మాసంలో గంగానది స్నానం చేయటం బ్రహ్మహత్య పాపం పోతుంది అని చెప్పారు కదా దాని గురించి ఏదైనా కథ ఉంటె వివరించండి అని అడిగారు. వసిష్ఠ మహర్షి ఇలా చెప్పసాగారు. పూర్వం ఒకసారి శివునికి బ్రహ్మదేవునికి నేను అంటే నేనే గొప్ప అని వివాదం వచ్చింది. ఆ వివాదంలో బ్రహ్మదేవుని తలను శివుడు ఖండించారు. బ్రహ్మదేవుడు బ్రాహ్మణుడు కావటం వలన శివునికి బ్రహ్మహత్యా పాతకం వచ్చి బ్రహ్మ దేవుని తల శివుని చేతులకి అంటుకుపోయింది. శివుడు ఆ బ్రహ్మహత్యా పాతకాని పోగొత్తుకోవటానికి ఇంటింటికి తిరికి ఆ బ్రహ్మకపాలం నిండేవరకు భిక్షను అడుగుతూ ముల్లోకాలను తిరుగుతున్నారు. అలా తిరుగుతూ భూలోకానికి వచ్చారు. భూలోకములో సప్తఋషులా భార్యలు శివుని రూపానికి ముగ్ధులై పరవశించి పదే పదే భిక్షను వేస్తున్నారు. ఇది అంత చుసిన సప్తఋషులు వచ్చింది శివుడు అని తెలియక అందరూ కలిసి నువ్వు నపుంసకుడివి అవ్వు అని శపించారు. శివుడు వెంటనే లింగరూపముగా మారిపోయారు. అసలే బ్రహ్మహత్య పాతకం ఇప్పుడు సప్తఋషుల శాపం వలన శివుని నుంచి తట్టుకోలేని తేజస్సు వెలువడసాగింది. ఆ తేజస్సు ప్రళయంలా వచ్చి భూమండలంఅంతటిని మింగివేస్తుందా అని అందరూ భయపడిపోయారు. సప్త ఋషులు ఆ లింగమును తీసుకొని ప్రయాగ క్షేత్రానికి తీసుకువెళ్ళు అక్కడ శివునికి అభిషేకాలు షాడోశోపచారా పూజలు నిర్వహించారు. శివుడు నిజరూపాన్ని ధరించి అక్కడే ప్రయాగ క్షేత్రములో స్నానం ఆచరించారు. శివునికి అక్కడే  అయన చేతికి అంటి ఉన్న బ్రహ్మ కపాలం ఊడిపోయి ఆయనకు బ్రహ్మహత్య పాతకం పోయింది అని వశిష్ఠ మహర్షి దిలీప మహారాజుకి మహాశివుడు పార్వతిమాతకి చెప్పారు. ఈ విధముగా శౌనకాది ఋషులకు సూతమహర్షి మాఘమాసం పన్నెండవ రోజు  పారాయణాన్ని చెప్పటం పూర్తిచేశారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...