భగవద్గీత-అధ్యాయం2-శ్లోకం31

అధ్యాయం 2

శ్లోకం 31

స్వధర్మమపి చావేక్ష్య న వికంపితుమర్హసి |

ధర్మ్యాద్ధి యుద్ధాచ్ఛ్రేయోన్యత్ క్షత్రియస్య న విద్యతే ||

అర్ధం :-

స్వధర్మమునుబట్టియు నీవు భయపడనక్కరలేదు. ఏలనన, క్షత్రియునకు ధర్మయుద్ధమునకు మించినట్టి కర్తవ్యము మరోకటి ఏదియును లేదు.

భగవద్గీత-అధ్యాయం2-శ్లోకం30

అధ్యాయం 2

శ్లోకం 30

దేహి నిత్యమవద్యోయం దేహే సర్వస్య భారత |

తస్మాత్ సర్వాణి భూతాని న త్వం శోచితుమర్హసి ||

అర్ధం :-

ఓ అర్జునా ! ప్రతిదేహమునందును ఉండెడి ఈ ఆత్మ వధించుటకు వీలుకానిది. కనుక,ఏ ప్రాణిని గూర్చియైనను నీవు శోకింపదగదు. 

భగవద్గీత-అధ్యాయం2-శ్లోకం29

అధ్యాయం 2

శ్లోకం 29

ఆశ్చర్యవత్పశ్యతి కశ్చిదేనమ్ ఆశ్చర్యవద్వదతి తథైవ చాన్యః |

ఆశ్చర్యవచ్చైనమన్యః శృణోతి శ్రుత్వాపేనం వేద న చైవ కశ్చిత్ ||

అర్ధం :- 

ఎవరో ఒక మహపురుషుడు మాత్రమే ఈ అత్మను ఆశ్చర్యకరమైన దానినిగా చూచును. మరియొక మహాత్మడు దీని తత్త్వమును ఆశ్చర్యకరముగా వర్ణించును. వేరోక పురుషుడు దీనిని ఆశ్చర్యకరమైన దానినిగా వినును. ఆ విన్నవారిలో కూడ కొందరు దీనినిగూర్చి ఏమియు ఎఱుగరు.

భగవద్గీత-అధ్యాయం2-శ్లోకం28

అధ్యాయం 2

శ్లోకం 28

అవ్యక్తాదీని భూతాని వ్యక్తమద్యాని భారత |

అవ్యక్తనిధనాన్యేవ తత్ర కా పరిదేవనా ||

అర్ధం :-

ఓ అర్జునా! ప్రాణులన్నియును పుట్టుకకుముందు ఇంద్రియగోచరములు గావు. మరణానంతరముగూడ అవి అవ్యక్తములే. ఈ జననమరణముల మధ్యకాలమునందు మాత్రమే అవి ప్రకటితములు అగుచుండును. ఇట్టి స్థితిలో వాటికై పరితపించుట నిష్ర్పయోజనము.

భగవద్గీత-అధ్యాయం2-శ్లోకం27

అధ్యాయం 2

శ్లోకం 27

జాతస్య హి ద్రువో మృత్యు: ద్రువం జన్మ మృతస్య చ |

తస్మాదపరిహార్యే ర్థే న త్వం శోచితుమర్హసి ||

అర్ధం :-

పుట్టినవానికి మరణము తప్పదు. మరణించినవానికి పునర్జన్మ తప్పదు. కనుక, అపరిహార్యములైన ఈ విషయములయందు నీవు శోకింపదగదు.

భగవద్గీత-అధ్యాయం2-శ్లోకం26

అధ్యాయం 2

శ్లోకం 26

అథ చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతమ్ |

తథాసి త్వం మహాబాహో నైనం శోచితుమర్హసి ||

అర్ధం :-

కనుక ఓ అర్జునా! నీవు దీనికై శోకింపదగదు. ఓ అర్జునా! ఈ ఆత్మకు జననమరణములు కలవని ఒకవేళ నీవు భావించినప్పటికిని దీనికై నీవు శోకింపదగదు.

భగవద్గీత-అధ్యాయం2-శ్లోకం25

అధ్యాయం 2

శ్లోకం 25

అవ్యక్తో యమచింత్యో యమ్ అవికార్యో యముచ్యతే |

తస్మాదేవం విదిత్వైనం నానుశోచితుమర్హసి ||

అర్ధం :-

ఈ అత్మ అవ్యక్తమైనది. అచింత్యము వికారములు లేనిది. దీనిని గూర్చి ఇట్లు తెలిసికొనుము.

భగవద్గీత-అధ్యాయం2-శ్లోకం24

అధ్యాయం 2

శ్లోకం 24

అచ్చేద్యో యమదాహ్యో యమ్ అక్లేద్యో శోష్య ఏవ చ |

నిత్యః సర్వగతః స్థాణుః అచలో యం సనాతనః |

అర్ధం :-

ఈ ఆత్మ చేదించుటకును, తడుపుటకును, శోషింపజేయుటకును, సాధ్యము కానిది. ఇది నిత్యము. సర్వవ్యాపి, చలింపనిది స్థాణువు సనాతనము.    

భగవద్గీత-అధ్యాయం2-శ్లోకం23

అధ్యాయం 2

శ్లోకం 23

నైనం ఛిందంతి శస్త్రాణి నైనం దహతిపావక |

న చైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః ||

అర్ధం :-

ఈ ఆత్మను శస్త్రములు ఛేదింపజాలవు. అగ్ని దహింపజాలదు. నీరు తడుపజాలదు. వాయువు ఆరిపోవునట్లు చేయజాలదు.

భగవద్గీత-అధ్యాయం2-శ్లోకం22

అధ్యాయం 2

శ్లోకం 22

వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్లాతి నరో సరాణి |

తథా శరీరాణి విహయ జీర్ణాన్యన్యాని సంయాతి నవాని దేహీ ||

అర్ధం :-

మానవుడు జీర్ణవస్త్రములను త్యజించి, నూతన వస్త్రములను ధరించినట్లు, జీవాత్మ  ప్రాతశరీరములను వీడి నూతనశరీరములను పొందును.

భగవద్గీత-అధ్యాయం2-శ్లోకం21

అధ్యాయం 2

శ్లోకం 21

వేదావినాశినం నిత్యం య ఏనమజమవ్యయమ్ |

కథం స పురుషః పార్థ కం ఘాతయతి హంతి కమ్ |

అర్ధం :-

ఓ పార్థా !  ఈ ఆత్మ నాశరహితము,నిత్యము అనియు,జననమరణములు లేనిదనియు, మార్పులేనిదనియు తెలిసికొనిన పురుషుడు ఎవరిని ఎట్లు చంపించును?ఎవరిని ఎట్లు చంపును?

భగవద్గీత-అధ్యాయం2-శ్లోకం20

అధ్యాయం 2

శ్లోకం 20

న జాయతే మ్రియతే నాకదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయ |

అజో నిత్యః శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే ||

అర్ధం :-

ఈ ఆత్మ ఏ కాలమునందును పుట్టదు, గిట్టదు. పుట్టి ఉండునది కాదు. ఇది భవ వికారములు లేనిది. ఇది జన్మ లేనిది. నిత్యము, శాశ్వతము, పురాతనము. శరీరము నశిస్తుంది. ఆత్మ నశించదు.



భగవద్గీత-అధ్యాయం2-శ్లోకం19

అధ్యాయం 2

శ్లోకం 19

య ఏనం వేత్తి హంతారం యశ్సైనం మన్యతే హతమ్ 

ఉభౌ తౌన విజానీతో నాయం హంతి నహన్యతే ||


అర్ధం :-

ఆత్మ ఇతరులను చంపునని భావించువాడును, ఆత్మ ఇతరులచే చంపబడునని భావించువాడును, ఆ ఇద్దరును అజ్ఞానులే.ఏలననగా, వాస్తవముగా ఆత్మ ఎవ్వరినీ చంపదు, ఎవ్వరిచేతను చంపబడదు.

భగవద్గీత-అధ్యాయం2-శ్లోకం18




అధ్యాయం 2

 శ్లోకం 18

అంతవంత ఇమే దేహా నిత్యశ్యోక్తాః శరీరిణః |

అనాశినో ప్రమేయస్య తస్మాద్యుధ్యస్వ భారత ||

అర్ధం :-

ఈ శరీరములు అన్నియును నశించునవియే. కాని, జీవాత్మ నాశరహితము, అప్రమేయము. నిత్యము. కనుక ఓ భరతవమ్శి! అర్జునా! నీవు యుద్దము చేయుము.

భగవద్గీత-అధ్యాయం2-శ్లోకం17




అధ్యాయం 2
శ్లోకం 17

అవినాశి తు తద్విద్ధి యేన సర్వమిదం తతమ్ |

వినాశమవ్యయస్యాస్య న కశ్చిత్ కర్తుమర్హతి ||

అర్ధం :-

నాశరహితమైన ఆ సత్యము జగత్తునందు అంతటను వ్యాపించియున్నదని యెరుంగుము. శాశ్వతమైన దానినెవ్వరును నశింపజేయజాలరు.

భగవద్గీత-అధ్యాయం2-శ్లోకం16


అధ్యాయం 2
శ్లోకం 16

నాసతో విద్యతే భావో నాభావో విద్యతేసతః |

ఉభయోరపి దృష్టోంతః త్వనయోస్తత్త్వదర్శిభిః ||

అర్ధం :-

అతడే మోక్షమును పొందుటకు అర్హుడు. అసత్తు అనుదానికి ఉనికియే లేదు. ఈ విధముగ ఈ రెండింటియొక్క వాస్తవస్వరూపములను తత్త్వజ్ఞానియైనవాడే ఎఱుంగును.

భగవద్గీత-అధ్యాయం2-శ్లోకం15

అధ్యాయం 2

శ్లోకం 15

యం హి న వ్యథయంత్యేతే పురుషం పురుషర్షభ |

సమదుఃఖసుఖం ధీరం సో మృతత్వాయ కల్పతే ||



అర్ధం :-

ఏలనన, ఓ పురుషశ్రేష్ఠా ! ధీరుడైనవాడు సుఖదుఃఖములను సమానముగా చూచును. అట్టి పురుషుని విషయేంద్రియ సంయోగములు చలింపజేయజాలవు.

భగవద్గీత-అధ్యాయం2-శ్లోకం14


అధ్యాయం 2
శ్లోకం 14

మాత్రాస్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణసుఖదుఃఖదాః |

ఆగమాపాయినో నిత్యాః తాంస్తితిక్షస్వ భారత ||

అర్ధం :-

ఓ కౌంతేయా ! విషయేంద్రియసంయోగమువలన శీతోష్ణములు, సుఖదుఃఖములు కలుగుచున్నవి. అవి ఉత్పత్తి వినాశశిలములు. అనిత్యములు. కనుక భరతా ! వాటిని పట్టించుకొనకుము.

భగవద్గీత-అధ్యాయం2-శ్లోకం13




అధ్యాయం 2

శ్లోకం 13

దేహినో స్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా |

తథా దేహంతరప్రాప్తిః ధీరస్తత్ర న ముహ్యతి ||        

అర్ధం :-

జీవాత్మకు ఈ దేహమునందు కౌమారము, యౌవనము, వార్ధక్యము ఉన్నట్లే మఱియొక దేహప్రప్తియు కలుగును. ధీరుడైనవాడు ఈ విషయమున మోహితుడు కాడు. 


     

                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                   

భగవద్గీత-అధ్యాయం2-శ్లోకం12

అధ్యాయం 2 


శ్లోకం 12

న త్వేవాహం జాతు నాసం న త్యం నేమే జనధిపా: |

న చైవ న భవిష్యామః సర్వే వయమతః పరమ్ ||                                                                                                                                                                     

అర్ధం :-

నీవుగాని, నేనుగాని, ఈ రాజులుగాని ఉండని కాలమే లేదు. ఇక ముందు కూడ మనము ఉండము అనుమాటయే లేదు.



        

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...