భగవద్గీత

అధ్యాయం 4

శ్లోకం 17

కర్మణో హ్యపి బోద్ధవ్యం చ వికర్మణః|

అకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణో కర్మణో గతిః||

అర్ధం :-

'కర్మ' తత్తమును తత్తమును తెలిసికొనవలెను,  అట్లే 'అకర్మ' స్వరూపమును గూడ ఎరుగవలెను,  ' వికర్మ' లక్షణములనుకూడా తెలిసికొనుట చాల అవసరము.  ఏలనన,  కర్మ తత్త్వము అతినిగూఢమైనది. 

తిరుప్పావై

పాశురము 17

    అమ్బరమే తణ్ణీరే! శోఱే! అఱమ్ శెయ్యుమ్

    ఎమ్బెరుమాన్! నన్దగోపాలా! ఎళిందిరాయ్

    కొంబనార్కెల్లామ్ కొళున్దే! కులవిళక్కే

    ఎమ్బెరు మాట్టి యశోదాయ్! అఱివుఱాయ్

    అమ్బర మూడఱుత్తు ఓంగి యులగళన్ద

    ఉమ్బర్ కోమానే ఉఱంజ్గాదు ఎళిందరాయ్

    శెమ్ పొఱ్కళలడిచ్చెల్వా; బలదేవా

    ఉమ్బియమ్ నీయుమ్ ఉఱంగేలో రెమ్బావాయ్

అర్ధం :-

ద్వారాపాలకులు గోపాంగనలను లోనికి అనుమతించగా వారు మొదట అన్న, వస్త్ర, తీర్ధాదులను ధర్మబుద్ధితో దానము చేసే నందగోపులను 'స్వామి! మేలుకొను' మని ప్రార్ధించారు. తరువాత 'ప్రబ్బలి తీగవంటి స్త్రీల కందరకును, తీగవలె ముఖ్యమైనదానా! గొల్లకులమునకు మంగళదీపము వంటిదానా! మాకును స్వామినివైన ఓ యశోదమ్మా! లేమ్మా!' అని వేడుకొనిరి. 'ఆకాశమంత ఎత్తుకెదిగి సమస్త లోకాలను కొలిచి దేవతలకే రాజైన ఓ కృష్ణా! ఇక నిద్ర చాలునయ్యా! మేలుకో!' అని ప్రార్ధించిరి. ఆయన వేళకుండుట చూచి, బలరాముని లేపక తప్పు చేసితిమని ఎరిగి 'మేలిమి బంగరు కడియములతో శోభించు పాదయుగళిని గల ఓ బాలరామా! నీ తమ్ముడు శ్రీకృష్ణుడును, నీవును యింకను నిదురించుట తగదు. కావున శీఘ్రమే లేచి రండు!' అని అందరినీ క్రమము తప్పక మేల్కొలుపుచున్నారు. వారి కృపను వేడుచున్నారు.



భగవద్గీత

అధ్యాయం 4

శ్లోకం 16

కిం కర్మ కిమకర్మేతి కవయోప్యత్ర మోహితాః|

తత్తే కర్మ ప్రవక్ష్యామి యద్ జ్ఞత్వా జ్ఞత్వామోక్ష్యసే శుభాత్||

అర్ధం :-

కర్మ అనగా నేమి? అకర్మ అనగా నేమి? ఈ విషయమును నిర్ణయించుటలో విద్వాంసులు సైతము తికమకపదుతున్నారు. కనుకా, కర్మతత్త్వమును నీకు చక్కగా వివరిస్తాను. దానిని తెలుసుకొని నీవు ఆశుభముల నుండి అనగా కర్మబంధములనుండి ముక్తుడవవుతవు. 

తిరుప్పావై

పాశురము 16

    నాయగనాయ్ నిన్ఱనన్దగోపనుడైయ
    కోయిల్ కాప్పానే! కొడిత్తోన్ఱుమ్ తోరణ
    వాశల్ కాప్పానే! మణిక్కదవమ్ తాళ్ తిఱవాయ్,
    ఆయర్ శిఱుమియరో ముక్కు; అఱైపఱై
    మాయన్ మణివణ్ణన్ నెన్నలే వాయ్ నేర్ న్దాన్;
    తూయోమాయ్ వన్దోమ్, తుయలెళ పాడువాన్,
    వాయాల్ మున్న మున్నమ్ మాత్తాదే, అమ్మా! నీ,
    నేశ నిలైక్కదవమ్ నీక్కేలో రెమ్బావాయ్.

అర్ధం :-

తిరుమాళిగను రక్షించువాడా! మమ్ము లోనికి పోనిమ్ము. మేము వ్రేపల్లెలో నుండు గొల్లపిల్లలము. స్వామిని దర్శింపవచ్చాము. పరిశుద్ధులమయి వచ్చాము. మణులతో కూడిన గడియను తెరువుము. మేము స్వామికి శరణాగతి చేసినవారము. గొల్లకులమయిన పుట్టిన అజ్ఞానులమైననూ స్వామి యందత్యదిక ప్రేమానురాగములు కలవారము. స్వామికి సుప్రభాతము పాడి మేలుకొలుప వచ్చినాము. గొల్లవంశంలో పుట్టిన మాకు ఆశ్చర్య గుణ చేష్ఠితుడును. ఇంద్రనీల మణివర్ణముగల శరీరము కలవాడును అగు శ్రీకృష్ణుడు మాకు 'పఱై' అను ధ్వనించెడు వాద్యము నిత్తునని నిన్ననే వాగ్దానము చేసినాడు. ఇప్పుడనన్య ప్రయోజనులమై స్వామి నిద్రలేచునట్లుగ సుప్రభాతమును పాడగా వచ్చాము. స్వామీ! నీ నోటితో వద్దని చెప్పకుము. మమ్ములను అడ్డుకొనక ధృడముగా బంధించిన తలుపు గడియను వెంటనే తెరిచి లోనికి పోనీయమని కావలి వానిని వేడుకొంటున్నారు.




భగవద్గీత

అధ్యాయం 4

శ్లోకం 15

ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభిః|

కురు కర్మైవ తస్మాత్ త్వం పూర్వైః పూర్వతరం కృతమ్||

అర్ధం :-

ఓ అర్జునా! ప్రాచినులైన ముముక్షువులు ఈ విధముగా తెలుసుకొని కర్మల నాచరించారు.  కావున,  నీవును ఆ పూర్వులవలేనే నిష్కామ భవముతో కర్మలనాచరించు. 

తిరుప్పావై

పాశురము 15

 ఎల్లే ఇళజ్గిళియే ఇన్నముఱజ్గదియో

శిల్లెన్ఱళై యేన్మిన్ నజ్గైమీర్ పోదరుగిన్ఱేన్
వల్లై యున్ కట్టురైకళ్ పణ్డేయున్ వాయఱితుమ్
వల్లీర్ కళ్ నీజ్గశే, నానేదానాయిడుగ
ఒల్లై నీపోదాయ్ ఉనక్కెన్న వేరుడైమై
ఎల్లారుమ్ పోన్దారో పోన్దార్ పోన్దెణ్ణిక్కొళ్
వల్లానైకోన్ఱానై మాత్తారై మాత్తళిక్క
వల్లానై ,మాయనైప్పాడేలో రెమ్బావాయ్.

అర్ధం :-
ఈ మాలిక సంభాషణ రూపంలో వున్నది - 
బయటివారు - ఓ లేత చిలుకా! ఇంకను నిద్రిస్తున్నావా? ఇదేమి ఆశ్చర్యమే! 
లోపలి గోపాంగన - పూర్ణులైన పూబోడులారా! ఇదిగో వస్తున్నాను. 
బయటివారు - శ్రీఘ్రముగా రావమ్మా! 
లోపలి గోపాంగన - అబ్బా! గొల్లుమని ఉలికి పడునట్లు గొంతెత్తి చెవులు గడియలు పడునట్లు పిలువకండి. వస్తాలే!
బయటివారు - ఓ చిన్ని చిలుకా! నీవు చాలా చమత్కారంగా మాటాడుతావు. నీ నేర్పిరితనము, నీ పుల్లవిరుపు మాటలు మేమిదివరకే యెరుగుదుములేమ్మ!
లోపలి గోపాంగన - మీరే అట్టి సమర్ధులమ్మా! నేనేమీ కాదులే! ఐనా మీరన్నట్లు నేనట్టిదానినేనేమో! రావలసిన వారందరూ వచ్చిరా?
బయటివారు - ఆ అందరూ వచ్చి చేరారు. నీవే వచ్చి లెక్కజూడవచ్చు కదా!
లోపలి గోపాంగన - వచ్చి నేనేమి చేయవలెనో చెప్పరాదు?
బయటివారు - కువలయాపీడమనే కంసుని గజమును, కంసాది శత్రువులను సంహరించిన సర్వేశ్వరుడైన శ్రీ కృష్ణుని కల్యాణ గుణములను కీర్తింపగా రమ్ము. ఇట్లు చేసినగాని మనము చేయు వ్రతము శుభప్రదముగ పూర్తికాదు' అని బయటినుంచి సమాధానము చెప్పి ఆమెను కూడ తమ గోష్ఠిలోనకి చేర్చుకొన్నారు గోపికలు.


భగవద్గీత

అధ్యాయం 4

శ్లోకం 14

న మాం కర్మాణి లింపంతి న మే కర్మఫలే స్పృహ|

ఇతి మాం యో భిజానాతి కర్మభిర్న స బధ్యతే||

అర్ధం :-

నాకు కర్మఫలాసక్తి లేదు. కావున, కర్మలు నన్నంటవు. ఈ విధముగా నాతత్త్వమును తెలిసినవారు కర్మబద్ధులు కారు.

తిరుప్పావై

పాశురము 14

ఉజ్గళ్ పుళైక్కడై త్తోట్టత్తు వావియుళ్
శెజ్గళు నీర్ వాయ్ నెగిళ్ న్దు అమ్బల్ వాయ్ కూమ్బినకాణ్
శెజ్గల్ పొడిక్కూఱై వెణ్బల్ తవత్తవర్
తజ్గళ్ తిరుక్కోయిల్ శజ్గిడువాన్ పోగిన్ఱార్
ఎజ్గళై మున్నమ్ ఎళుప్పువాన్ వాయ్ పేశుమ్
నజ్గాయ్! ఎళున్దిరాయ్ నాణాదాయ్ నావుడైయాయ్!
శజ్గొడు శక్కర మేన్దుమ్ తడక్కైయన్
పజ్గయక్కణ్తానై ప్పాడేలో రెమ్బావాయ్.

అర్ధం :-

ఏమె సఖీ! ఇదేమి? ముందుగ మమ్ములను లేపుదునంటివికదా! ఇంతవరకును పండుకొనే వున్నావేమి? లే! లెమ్ము! తెల్లవారిపోయినది. చూడు. మీ పెరటిలోని ఎర్రకలువలు విచ్చుకున్నవి. నీలోత్పలాలు ముకుళించినవి. కాషాయంబరులైన మునులు. యోగులు తెల్లని పలువరుసలు కలిగిన వారందరూ దేవాలయాలలో భగవదారాధన నిమిత్తమై కోవెల తలుపులు తీయటానికి 'కుంచెకోలను' తాళపు చెవులను తీసికొని వెళ్ళుచున్నారు. ఇవన్నీ ప్రాతః కాలమగు సూచనలేకదా! నీవు చేసిన వాగ్దానమును మరచితివా? నీకేమి? నీవు పూర్ణురాలవుకదా! సరే! ఇకనైన లేచిరమ్ము. వాగ్దానమును మరచిన దానా? లేవవమ్మా అనగా 'నన్నేల నిందింతురు? నేనేమి చేయవలె?; ననగా శ్రీ శంఖచక్రములచే విరాజిల్లుచున్న విశాల సుందర భుజములు గలవానిని, పంక జాక్షుని ఆ శ్రీకృష్ణుని గుణగణములను మధురమైన స్వరమున కీర్తించవలెను. మేమును నీతో కలిసి పాడెదము. ఇట్లు గోష్ఠిగా సంకీర్తనము చేసిన మన వ్రతము ఫలించగలదు. కావున వెంటనే మేలుకొనుమమ్మా' అని గోదాదేవి యీ తొమ్మిదవ గోపికను లేపిచున్నది.     



భగవద్గీత

అధ్యాయం 4

శ్లోకం 13

చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మవిభగశః|

తస్య కర్తారమపి మాం విద్ధ్యకర్తారమవ్యయమ్||

అర్ధం :-

బ్రహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణముల వారిని వారి గుణకర్మల ననుసరించి వేర్వేరుగా సృష్టించితిని. ఈ సృష్టి కార్యక్రమమునకు నేనే కర్తనైనను, శాశ్వతుడను పరమేశ్వరుడను ఐన నన్ను వాస్తవముగా అకర్తనుగా తెలుసుకొనుము. 

తిరుప్పావై

పాశురము 13

పుళ్ళిన్ వాయ్ కీణ్డానైప్పొల్లా వరక్కనై,
క్కిళ్ళిక్కళైన్దానై క్కీర్తిమై పాడిప్పోయ్,
ప్పిళ్ళైగ ళెల్లారుమ్ పావైక్క ళమ్బుక్కార్,
వెళ్ళియెళు న్దువియాళముఱజ్గిత్తు,
పుళ్ళుమ్ శిలుమ్బివ గాణ్ పోదరి క్కణ్ణినాయ్,
కుళ్ళక్కుళిరక్కుడైన్దు నీరాడాదే,
పళ్ళిక్కిడత్తియో పావాయ్ నీనన్నాళాల్,
కళ్ళమ్ తవిర్ న్ధు కలన్దేలో రేమ్బావాయ్.


అర్ధం :-

కంసునిచే పంపబడిన బకాసురుని నోటిని చీల్చిన శ్రీకృష్ణుని యొక్క, దుష్టుడైన రావణుని పది తలలను గిల్లి పారవైచిన శ్రీరాముని యొక్క కల్యాణ గుణ సంకీర్తనం చేస్తూ శ్రీకృష్ణుని సంశ్లేషముననుభవింపగోరు గోపికలందరును సంకేతస్థలమునకెప్పుడో చేరిపోయిరి. నీవింకను లేవ కుండా ఉన్నావు. తెల్లవారినదని సూచించుచు శుక్రుడుదయించెను బృహస్పతి అస్తమించెను. ఇవిగో! పక్షులన్నియు తమ ఆహారాన్వేషణ నిమిత్తం అరచుకొంటూ ఆకాశంలోకి ఎగిరిపోతున్నాయి' అని గోపికలు చెప్పగా నిద్రిస్తున్న గోపిక తన కనులు తెరి చూచింది, ఆమె నేత్ర సౌందర్యానికి ముగ్ధులై వికసించిన తామరపూవులందు వ్రాలిన తుమ్మెద వంటి కన్నులు గలదానా! ఇకనైనను లేచి రావమ్మా! నీ నేత్ర సౌందర్యానికి ముగ్ధుడై శ్రీకృష్ణస్వామి తానే నీవద్దకు వచ్చునని భ్రమించకు. శ్రీ కృష్ణ విరహతాపమును దీర్చుకొనుటకు యీ చల్లని నీటిలో అందరితో కలిసి స్నానమాడగా రావమ్మా! ఇంకను పరుండరాదు. మనము నోచే యీ వ్రతమునకు ఇది శుభ సమయము, మంచి కాలము. ఓ సుందరీ! నీ కపటమును వీడి మా గోష్ఠిలో కలిసి మహిమాన్వితమగు యీ వ్రతము సాంగోపాంగముగ పూర్తి చేయుటకు సహకరించుము. అన్నింటను శుభములే కలుగును' అని గోదాదేవాదులు ఎనిమిదవ గోపికను మేల్కొలుపుతున్నారు.



భగవద్గీత

అధ్యాయం 4

శ్లోకం 12

కాంక్షంతః కర్మణాం సిద్ధిం యజంత ఇహదేవతః |

క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజా ||

అర్ధం :-

ఈ లోకమున కర్మఫలములను ఆశించువారు ఇతర దేవతలను పూజింతురు. ఏలనన, అట్లు చేయుటచే కర్మలవలన కలుగు సిద్ధి వారికి శీఘ్రముగా లభించును. 

తిరుప్పావై

పాశురము 12

కనైత్తిళజ్గత్తెరుమై కన్ఱుక్కిరజ్గి,
నినైత్తుములై వళియే నిన్ఱుపాల్ శోర,
ననైత్తిల్లమ్ శేఱాక్కుమ్ నఱ్చెల్వన్తజ్గాయ్!
పనిత్తలైవీళ నిన్ వాశల్ కడైపత్తి
చ్చినత్తినాల్ తెన్నిలజ్గైక్కోమానైచ్చెత్త
మనత్తుక్కినియానై ప్పాడవుమ్ నీవాయ్ తిఱవాయ్
ఇనిత్తా నెళున్దిరాయ్ ఈదెన్న పేరు ఱక్కమ్
అనైత్తిల్లత్తారు మఱిన్దేలో రెమ్బావాయ్.


అర్ధం :-

లేగ దూడలను తలుచుకొని గేదెలు పాలను నిరాటంకంగా స్రవిస్తూ వున్నాయి. ఆ పాల ధారలతో ఇంటి ప్రాంగణమంతా తడిసి బురదయైపోయింది. ఇంత సంపద కలిగిన గోపాలునికి నీవు చెల్లిలివైతివి. ఓయమ్మా! మేమందరము నీవాకిటకు వచ్చి పైనమంచు కురియుచున్నను సహించి నీ గడపనానుకొని నిలిచియున్నాము. పైన మంచు కురియుచున్నది క్రింద పాలధారలు బురద చేయుచున్నవి. మేమంతా మనస్సులో మాధవునే నింపుకొని వున్నాము. పైన మంచు కురియటమనే శ్రీసూక్తి ధారల ప్రవాహం సాగిపోతూంది. కాళ్ళ క్రింద పాలధారలనే ఆచార్య ఉపదేశ ప్రవాహం సాగిపోతోంది. మనస్సులలో నిరంతర మాధవ సంశ్లేష భక్తి ధారల విచ్చిన్నంగా పొంగిపొరలుతున్నా ఈ ముప్పేట ధారలతో తడిసి, తడిసి కూడా నిన్ను మా గోష్ఠిలో చేర్చుకొనుటకై నీవాకిట గుమ్మాన్ని పట్టుకొని నిలబడి వున్నామమ్మా! ఆనాడు సీతమ్మను అపహరించాడన్న క్రోధముతో పరమాత్ముడైన శ్రీరాముడు ఆ స్వర్ణలంకాధిపతియైన పది తలల రావణుని మట్టుబెట్టిన వాని గుణగణాలను స్తుతిస్తున్నాము. కీర్తిస్తున్నాము. పాడుతున్నాము. మేమింత చేయుచున్ననూ నీవు నోరైన మెదుపుట లేదేమి తల్లీ! ఇది యేమి మొద్దు నిద్దరమ్మా! నీ గొప్పతనాన్ని మేమెరిగితిమిలేవమ్మా. నీ మొద్దు నిద్దుర విషయమంతా ఊరూ వాడ తెలిసిపోయిందిలే! ఇక నీ మొద్దునిద్దర చాలించి మేలుకో! మా గోష్ఠిలో చేరి వ్రతాన్ని సాంగోపాంగంగా పూర్తిచేయటానికి సహాయపడు అంటూ ఏడవ గోపికను లేపుచున్నారు. 



భగవద్గీత

అధ్యాయం 4

శ్లోకం 11

యే యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహమ్|

మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః||

అర్ధం :-

పార్థా! భక్తులు నన్ను సేవించిన రీతికి అనుగుణముగ నేను వారిని అనుగ్రహింతును. మనుష్యులందరును వివిధ రీతులలో నా మార్గమునే అనుసరింతురు.  

తిరుప్పావై

పాశురము 11

కత్తుక్కఱవై క్కణంగళ్ పల కఱన్ధు
శెత్తార్ తిఱ లళియ చ్చెన్ఱు శెరుచ్చెయ్యుమ్
కుత్త మొన్ఱిల్లాద కోపలర్ దమ్ పొఱ్కొడియే
పుత్తర వల్ గుల్ పునమయిలే పోదరాయ్
శుత్తత్తు తోళిమారెల్లారుమ్ వనుమ్ నిన్
ముత్తమ్ పుగున్థు ముగిల్ వణ్ణన్ పేర్పాడ
శిత్తాదే పేశాదే శెల్వప్పెణ్డాట్టి, నీ
ఎత్తుక్కు ఱజ్ఞమ్ పొరుళే లోరెమ్బావాయ్.

అర్ధం :-

ఓ గోపాలకుల తిలకమా! ఓ చిన్నదానా! లేత వయస్సు కలిగిన పశువుల యొక్క అనేకమైన సమూహ సంపద కలిగిన మీ వంశం చాలా గొప్పది. ఆ సమూహాల పాలు పిదుకతగినవారును, శత్రువులు నశించునట్లు యుద్ధం చేయగలవారును, ఒక్క దోషమైనను లేనట్టి గొల్ల కులమున పుట్టిన బంగారు తీగవంటి అందమైనదానా! పుట్టలోని పాము పడగతో సమానమైన నితంబము కలదానా! ఓ వనమయూరమా! రమ్ము. నీ సఖులు, బంధువులును అందరు వచ్చి నీ వాకిట నిలిచియున్నారు. వీరందరూ నీలి మేఘమును బోలు శరీరకాంతిగల శ్రీకృష్ణుని అనేకమైన తిరునామములను పాడుచున్నారు. ఐనను నీవు మాత్రము చలించక, మాటాడక, ఏల నిదురించుచున్నావు? అని అనుచున్నారు. అనగా యింత ధ్వనియగుచున్ననూ ఉలకక, పలకక (ధ్యానములో) ఎందుకున్నావు? ఇది శ్రీకృష్ణ సంశ్లేష అనుభవానందమే కదా! మరి యీ సంశ్లేషాను భవానందమును నీ వొకతెవెకాక అందరును అనుభవించునట్లు చేయవలెకాన, మా గోష్ఠిలో కలిసి యీ వ్రతము పూర్తిగావించుము అనుచున్నారు.



భగవద్గీత

అధ్యాయం 4

శ్లోకం 10

వీతరాగభయక్రోధా మన్మయా మాముపాశ్రితాః |

బహవో జ్ఞానతపసా పూతా మద్భావమాగతాః||

అర్ధం :-

ఇదివరకు కూడా సర్వదా రాగభయక్రోధరహితులైనవారు, ధృడమైన భక్తి తాత్పర్యములతో స్థిరబుద్ధి కలిగి, నన్ను ఆశ్రయించిన భక్తులు పెక్కుమంది జ్ఞాన తపస్సంపన్నులై పవిత్రులై నా స్వరూపమును పొందియుండిరి.

తిరుప్పావై

పాశురము 10

నోత్తు చ్చువర్ క్కమ్ పుగుగిన్ఱ అమ్మనాయ్!
మాత్తముమ్ తారారో వాశల్ తిఱవాదార్
నాత్తత్తుళాయ్ ముడి నారాయణన్; - నమ్మాల్
పోత్తప్పఱై తరుమ్ పుణ్ణియనాల్! పణ్డోరునాళ్
కూత్తత్తిన్ వాయ్ వీళ్ న్ద కుమ్బకరణనుమ్
తోత్తు మునక్కే పెరున్దుయిల్ తాన్ తన్దానో?
ఆత్త అనన్దలుడైయాయ్! అరుజ్గలమే!
తేత్తమాయ్ వన్దు తిఱ వేలో రెమ్బావాయ్.


అర్ధం :-

నోము నోచి శ్రీకృష్ణ సంశ్లేష సుఖానుభవమును పొందుచున్న ఓయమ్మా! తలుపును తెరువుము, తలుపును తెరవకపోయినను మానెగాని, నోటినైనను తెరచి పలుకవచ్చునుకదా తల్లీ! పరిమళాలను వెదజల్లే తులసి మాలలను కిరీటముగా ధరించిన శ్రీ నారాయణుడు మనచే స్తోత్రము చేయబడినవాడై సంతసించి మనకు వ్రతోపక రణాలను ఇచ్చునుకద! పూర్వమొకనాడు ధర్మస్వరూపుడైన పరమాత్మ రామావతారుడై అవతరించి కుంభకర్ణుణ్ణి సంహరించాడు. ఆ కుంభకర్ణుడు తన పెనునిద్రను నీకేమైనా కానుకగా యిచ్చెనాయేమి? ఓ పెద్ద నిద్ర కలదానా! లేచిరమ్ము. నీవు మాకు శిరోభూషణమైనదానివి కద! తొట్రుపడక లేచివచ్చి మా గోష్ఠిలో చేరి మా వ్రతాన్ని పూర్తి చేయాలి. కనుక నీ యోగ నిద్రను వీడి లేచి రావమ్మా! అని ఐదవ గోపికను మేల్కొలుపుచున్నారు.



తిరుప్పావై

పాశురము 9

తూమణి మాడత్తు చ్చుత్తుమ్ విళక్కెరియ
తూపమ్ కమళ త్తుయిలణై మేల్ కణ్ వళరుమ్
మామాన్ మగళే! మణిక్కదవమ్ తాళ్ తిఱవాయ్
మామీర్! అవళై యెళుప్పీరో! ఉన్ మగళ్ దాన్
ఊమైయో? అన్ఱిచ్చెవిడో? ఆనన్దలో
ఏమప్పెరున్దుయిల్ మన్దిరప్పట్టాళో?
"మామాయన్, మాదవన్; వైగున్దన్" ఎన్ఱెన్ఱు
నామమ్ పలవుమ్ నవి న్ఱేలో రెమ్బావాయ్!

అర్ధం:-

నిర్దోషమలైన మాణిక్యములతో నిర్మించిన భవనంలో చుట్టునూ దీపాలు వెలుగుతుండగా, అగరు ధూపములను పరిమళాలను వెదజల్లుచుండగా, అతిమెత్తనైన హంసతూలికా తల్పముపై పరుండి నిద్రిస్తున్న ఓ మేనమామ కూతురా! మణిమయ ప్రభలతో ప్రకాశించుచున్న నీ భవనపు గడియను తీయవమ్మా! ఏమమ్మా! మేనత్తా! నీవైనా ఆమెను లేపుమమ్మా! ఏమి? నీ పుత్రిక మూగదా? చెవిటిదా? లేక బద్దకస్తురాలా? లేక ఆమె లేవకుండగ ఎవరినైన కావలి వుంచినారా? లేక యింత మైమరచి నిద్రించుటకేమైన మంత్రించి వుంచినారా? ఆమెకేమైనది నిద్ర లేచుటలేదు? 'ఓ ఆశ్చర్య గుణచేష్టితుడా! ఓ శ్రియః పతీ! ఓ పరమపదవాసీ!' అని అనేకమైన తిరునామాలను అనుసంధిస్తున్ననూ ఆమెకు వినబడుటలేదేమి? ఇంకను లేవదేమి? అని సంపదలతో తులతూగుతున్న ఒక కన్యను లేపుచున్నారు.



భగవద్గీత

అధ్యాయం 4

శ్లోకం 9

జన్మ కర్మ చ మే దివ్యమ్ ఏవం యో వేత్తి తత్త్వతః |

త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సో ర్జున ||

అర్ధం :-

ఓ అర్జునా! నా జన్మలు, కర్మలు దివ్యమైనవి. అనగా నిర్మలములు.అలౌకికములు. ఈ తత్త్వరహస్యమును తెలిసికొనినవాడు తనువు చాలించిన పిమ్మట మళ్లీ జన్మిచాడు సరికదా! నన్ను చేరుతారు. 


తిరుప్పావై

పాశురము 8

కీళ్ వానమ్ వెళ్ళెన్ఱు ఎరుమై శిఱు వీడు
మేయ్ వాన్ పరన్దనకాణ్! మిక్కుళ్ళపిళ్ళైగళుమ్
పోవాన్ పొగిన్ఱారై ప్పోగామల్ కాత్తున్నై
కూవువాన్ వన్దు నిన్ఱోమ్; కోదుకల ముడైయ
పావాయ్! ఎళున్దిరాయ్, పాడిప్పఱై కొణ్డు
మావాయ్ పిళన్దానై మల్లరై మాట్టియ
దేవాది దేవనైచ్చెన్ఱు నామ్ శేవిత్తాల్
ఆవా వెన్ఱారాయ్ న్దు అరుళేలో రెమ్బావాయ్.


అర్ధం :-

తూర్పు దిక్కంతయు ఆకాశము తెల్లివారింది. గేదెలు మంచుమేత మేయటానికై విడువబడినాయి. అవి మేతకై స్వేచ్ఛగా తిరుగాడుతున్నాయి. తోటి గోపికలందరూ శ్రీకృష్ణుడు చేరక ముందుగనే అతని వద్దకు చేరవలెనని, అట్లు చేసిన అతడు చాల సంతోషించునని తలుస్తున్నారు. అందరును కలిసి గోష్ఠిగ పోవుటే మంచిదని యెంచి వారినందరినీ అచట నిలిపి నీ కొరకు వచ్చితిమి. నీకును అతనిని చేరుటకు కుతూహలముగనే వున్నదికదా! మరింక ఆలస్యమెందుకు? లెమ్ము! ఆశ్వాసురరూపుడైన కేశిని, చాణూర ముష్టికాదులను చీల్చి చెండాడిన శ్రీకృష్ణుని సన్నిధికి పోయి, మన నోమునకు కావలసిన 'పఱై' అనే సాధనమును పొందుదము. అతని రాకకు ముందే మనమటకు పోయిన అతడు 'అయ్యో! మీరు నాకంటే ముందుగనే వచ్చితిరే!' యని నొచ్చుకొని మన అభీష్టములను వెంటనే నెరవేర్చును.



భగవద్గీత

అధ్యాయం 4

శ్లోకం 8

పవిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతమ్ |

ధర్మసంస్థాపనార్ధాయ సంభవామి యుగే యుగే ||

అర్ధం :-

సత్పురుషులను రక్షించుటకు, దుష్టులను రూపుమాపుటకు, ధర్మమును సుస్థిరము చేయుటకు నేను ప్రతియుగములో అవతరిస్తాను. 

తిరుప్పావై

పాశురము 7

కీశు కీశెన్ఱెజ్గు మానైచ్చాత్త జ్గలన్దు 

పేశిన పేచ్చరవమ్ కేట్టిలైయా పేయ్ ప్పెణ్ణే! 

కాశుమ్ పిఱప్పుమ్ కలగలప్పక్కై పేర్తు     

వాశ నరుజ్గళ లాయ్ చ్చియర్; మత్తినాల్  

ఓశైప్పడుత్త త్తయిరరవమ్ కేట్టిలైయో   

నాయకప్పెణ్పిళ్లాయ్! నారాయణన్ మూర్తి    

కేశవనైప్పాడవుమ్ నీకేట్టే కిడత్తియో              

తేశముడై యాయ్! తిఱ వేలోరెమ్బవాయ్.

అర్ధం :-

ఓయీ! పిచ్చిపిల్లా! భరద్వాజ పక్షులన్నీ కీచుకీచుమంటూ చేస్తున్న కలకలములు వినపడలేదా? అదిగో! సువాసనలు వెదజల్లుతున్న కురులుగల ఆ గోప కాంతులు తాము ధరించిన ఆ భరణాలన్నీ ధ్వనించేట్టుగా చేతుల త్రిప్పుచూ కవ్వాలతో పెరుగు చిలుకుతున్నారు. ఆ ధ్వనులేవీ వినబడలేదా? నీవు మాకు నాయకురాలివికద! భాగవద్విషయానుభవము నెరిగినదానవు.

సాక్షాత్తూ శ్రీమన్నారాయణుడే ఇపుడు శ్రీకృష్ణునిగా మన భాగ్యంకొద్దీ అవతరించాడు. మనకొరకే 'కేశి' మొదలైన రాక్షసులను చంపి మన కష్టాలను గట్టెక్కించాడు. మనమంతా అతనికి కృతజ్ఞులమై అతని గుణగానం చేస్తున్నాము. ఐనా... వానిని వింటూనే యింకనూ పడుకొనే వుంటివే? మేము పాడే యీ పాటల ఆనందముతో నీవు మెరిసిపోతున్నావులే! ఇకనైననూ లేచి రామ్మాతల్లీ! వ్రతం ఆచరించటానికి ఇంకనూ అలస్యందేనికి? అని 'ఒక గోపకన్యను లేపుతోంది ఆండాళ్ తల్లి.


భగవద్గీత

అధ్యాయం 4

శ్లోకం 7

యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతిభారత |

అభ్యుత్థానమధర్మస్య తదాత్మనం సృజామ్యహమ్ ||

అర్ధం :-

ఓ అర్జునా! ధర్మమునకు హాని కలిగినప్పుడు. ఆధర్మము ఎక్కువగా పెరిగినపుడు నాకు నేను అవతరిస్తాను. అనగా సాకారరూపముతో ఈ లోకములో అవతరిస్తాను. 

తిరుప్పావై

పాశురం 6

పుళ్ళుమ్ శిలుమ్బినకాణ్ పుళ్ళరైయన్ కోయిలిల్
వైళ్లైవిళిశజ్గన్ పేరరవమ్ కేట్టిలైయో
పిళ్ళాయ్! ఎళున్దిరాయ్ పేయ్ ములైనఞ్జణ్డు
కళ్లచ్చగడమ్ కలక్కళియక్కాలోచ్చి
వెళ్లత్తరవిల్ తుయి లమర్ న్దవిత్తినై
ఉళ్ళత్తు క్కొణ్డు మునివర్ గళుమ్ యోగిగళుమ్
మెళ్ళ వెళున్దు అరియెన్ఱ పేరరవమ్
ఉళ్ళమ్ పుగున్దు కుళిర్ న్దేలో రెమ్బావాయ్


అర్ధం :-

అందరికంటె ముందుగనే మేల్కొన్నవారు, ఇంక నిద్రిస్తు  లేవకుండ ఉన్న ఒక గోపికను గమనించి 'తెల్లవారిందమ్మా! ఇక లేచిరావె!' అని లేపుతున్నారు. వేకువనే మేల్కోన్న పక్షులు ఒకరినొకరు పిలుచుకొంటూ 'మేతకు పోదాం రండర్రా!' అంటూ  కూస్తూ పోతున్నాయి. అరె! పక్షిరాజు గరుత్మంతునికి రాజైన ఆ శ్రీమన్నారాయణుని కోవెలలో మ్రోగిన శంఖధ్వనిని నీవు విన లేదా? ఓసీ! పిచ్చిపిల్లా! (భగవద్విషయము నెరుగనిదానా!) లేచి రావమ్మా! ఇదిగో పూతనస్తనముల యందున్న విషాన్ని ఆరగించినవాడు, తనను చంపటానికి వచ్చిన శకటాసురుని కీళ్ళూడునట్లు తన కాళ్లతో తన్నినవాడు అయిన ఈ శ్రీకృష్ణుడే ఆ పాల సముద్రంలో ఆదిశేషునిపై హాయిగా యోగనిద్రలో శయనించిన శ్రీమన్నారాయణడు. ఆ శ్రీమన్నారాయణుడినే యోగులు, బుషులు తమ హృదయాలలో నిల్పుకొన్నారు. అతనికి శ్రమ కలుగకుండునట్లుగ మెల్లగ 'హరీ! హరీ!  అని అతనిని స్మరిస్తూ చేసిన ధ్వని పెద్దగా ధ్వనించి మా హృదయాలను చేరి చల్లబరిచింది. వణికించింది. మేమంతా మేల్కొన్నాము. మరి నీవుమాత్రము కదలక అట్లే పడుకున్నావేమమ్మా! ఇదీ నీకు వినబడలేదా! రమ్మ! రమ్మ! మాతో ఉండి  వ్రతము చేయి.



భగవద్గీత

అధ్యాయం 4

శ్లోకం 6

అజో పి సన్నవ్యయాత్మా భూతానామీశ్వరో పి సన్ |

ప్రకృతిం స్వమాధిష్ఠాయ సంభవామ్యత్మమాయయా ||

అర్ధం:-

నేను జన్మరాహితుడిని. నిత్యుడని, సమస్త ప్రాణులకు ఈశ్వరుడును. అయినాను, నా ప్రకృతిని అధీనంలో ఉంచుకొని, నా యోగ మాయచే అవతరించుచుందును. 

తిరుప్పావై

పాశురము-5

మాయనై మన్ను వడమదురై మైన్దనై
త్తూయ పెరునీర్ యమునై త్తుఱైవనై
ఆయర్ కులత్తినిల్ తోన్ఱుమ్ మణివిళక్కై
త్తాయైక్కుడల్ విళక్కమ్ శెయ్ త తామోదరనై
తూయోమాయ్ వన్దు నామ్ తూమలర్ తూవిత్తొళుతు
వాయినాల్ పాడిమనత్తినాల్ శిన్ధిక్క
ప్పోయపిళైయుమ్ పుగుదరువా నిన్ఱనవుమ్
తీయినిల్ తూశాగుమ్ శెప్పేలో రెమ్బాబాయ్.


అర్ధం :-

మిక్కిలి ఆశ్చర్యకరమైన గుణములను, చేష్టలను కలవాడు శ్రీకృష్ణుడు. అతడు ఉత్తర మధురకు నిర్వాహకునిగ జన్మించాడు. భాగత్సంబంధము ఎడతెగనట్టి మధురకు ప్రభువే. యమునా నదీతీరమందున్న గొల్ల కులమున జన్మించి, ఆ గొల్లకులాన్ని ప్రకాశింపజేసినవాడు. గొల్లకుల మాణిక్య దీపము తల్లి యశోదా గర్భమును కాంతివంతమొనర్చిన దామోదారుడు. వ్రతకారణముగా శ్రీకృష్ణుని చేరి, మనము ఇతరములైన కోరికలేవీ కోరక, పవిత్రమైన మనస్సులతో స్వామికి పూలనర్పించి, నమస్కరించి, నోరార అతని కల్యాణ గుణములను సంకీర్తన చేసి, ధ్యానించిన -సంచిత పాపములను, ఇక ఆగామి పాపములను తప్పించుకొనవచ్చును. అతని గుణకీర్తనం చేయటం వలన పాపములన్ని అగ్నిలో పడిన దూదివలె భస్మమై పోయేవే! కావున స్వామియొక్క తిరునామములను అనుసరించండి. 



భగవద్గీత

అధ్యాయం 4

శ్లోకం 5

శ్రీభగవాన్ ఉవాచ 

బహూని మే వ్యతీతాని జన్మాని ధవాచార్జున |

తాన్యహం వేద సర్వాణి న త్వం వేత్థ పరంతప ||

అర్ధం :-

శ్రీభగవానుడు పలికెను :- ఓ పరంతపా! అర్జునా! నాకును పెక్కు జన్మలు వచ్చాయి. కాని వాటిని అన్నింటిని నేను తెలుసుకున్నాను. నువ్వు తెలుసుకోలేదు. 

తిరుప్పావై

తిరుప్పావై

పాశురము-4

ఆళి మళైక్కణ్ణాః ఒన్ఱు నీ కైకర వేల్
ఆళి యుళ్ పుక్కు మగన్ధు కొడార్ త్తేఱి
ఊళి ముదల్వనరువమ్ పోల్ - మెయ్ కఱుత్తు
పాళి య న్దోళుడై ప్పఱ్పనాబన్ కైయిల్
ఆళి పోల్ మిన్ని వలమ్బురి పోల్ నిన్ఱ దిర్ న్దు
తాళాదే శార్ ఙ్గం ముదైత్త శరమళై పోల్
వాళ వులగినిల్ పెయ్ దిడాయ్ - నాజ్గళుమ్
మార్ గళి నీరాడ్ మాగిళ్ న్దేలో రెమ్బావాయ్.


అర్ధం:-

ఓ పర్జన్య దైవమా! వర్షమును కురిపించుటలో లోభత్వమును చూపకు. నీవు సముద్రములోని నీటి నంతను కడుపు నిండ తాగు, అటుపిదప నీవు పైకెగసి, సృష్టికంతకును కారణభూతుడైన ఆ శ్రీమన్నారాయణుని శరీరపు రంగు వలె నీ శరీరమునకును ఆ నలుపురంగును రాసుకో. స్వామి కుడి చేతియందున్న సుదర్శన చక్రము వలె మేరువు. ఎడమ చేతిలోని పాంచజన్య శంఖమువలె గంభీరముగా గర్జించు. స్వామి సారంగమను ధనుస్సు నుండి వెడలే అవిరళ శరాలుగ వర్షధారలను కురిపించు. మేమందరం యీ వర్ష ధారలలో స్నానం చేస్తాము. లోకము సుఖించునట్లు వర్షించు. మా వ్రతమును నిరాటంకముగ చేసుకోవటానికి యిక ఏ మాత్రమూ ఆలస్యం చేయకుండా వెంటనే వర్షించు  స్వామీ!



భగవద్గీత

అధ్యాయం 4

శ్లోకం 4

అర్జున ఉవాచ 

అపరం భావతో జన్మ పరం జన్మవివస్వతః |

కథమేతద్విజానీయాం త్వమాదౌ ప్రోక్తవానితి ||

అర్ధం :-

అర్జునుడు పలికెను:- కృష్ణా! నీ జన్మ ఇటీవలదే. సూర్యుని జన్మ కల్పాది యందు జరిగినది. అనగా అతి ప్రాచీనమైనది. కనుక నీవు సూర్యునకు ఉపదేశించటం ఇలా సాధ్యం? దీనిని నేను విశ్వసించుట ఎట్లు?

తిరుప్పావై

తిరుప్పావై

పాశురము-3

ఓఙ్గి యులగళన్ద ఉత్తమన్ పేర్ పాడి
నాఙ్గిళ్ నంబావైక్కు చ్చాత్తినీరాడినాల్
తీఙ్గిన్ఱి  నాడెల్లామ్ తిజ్గిళ్ ముమ్మారిపెయ్ దు
ఓఙ్గువళై ప్పోదిల్ పొఱివండు కణ్ పడుప్ప
తేఙ్గాదే పుక్కిరున్దు శీర్ త్తములై పత్తి
వాఙ్గ-  క్కుడమ్ నిఱైక్కుమ్ వళ్ళల్ పెరుమ్ పశుక్కళ్
నీఙ్గాద శెల్వమ్ నిఱైన్దేలో రెమ్బావాయ్.

అర్ధం :-

ఈ వ్రతానికి ప్రధాన ఫలము శ్రీ కృష్ణ సంశ్లేషమే! ఐనా దీనిని చేయటానికి అనుమతించిన వారికి కూడా ఫలితం కలుగుతుంది. బలిచక్రవర్తి నుండి మూడడుగుల దానాన్ని పొందిన శ్రీకృష్ణ పరమాత్మ అత్యంతానందాన్ని పొంది ఆకాశమంత ఎత్తుకెదిగి మూడు లోకాలను కొలిచాడు. ఆ పరమానంద మూర్తి దివ్యచరణాలను, అతని దివ్య నామాలను పాడి, యీ దివ్య ధనుర్మాస వ్రతాన్ని చేసే నిమిత్తం మార్గళిస్నానాన్నాచరిస్తే - దుర్భిక్షమాం అసలు  కలుగదు. నెలకు మూడు వర్షాలు కురుస్తాయి. పంటలన్నీ త్రివిక్రముని వలె ఆకాశమంత ఎత్తుకెదిగి ఫలిస్తాయి. పంటచేల మధ్యనున్న నీటిలో పెరిగిన చేపలు త్రుళ్లిపడుతూ ఆనంద సమృద్దిని సూచిస్తాయి. ఆ నీటిలో విరిసిన కలువలను చేరిన తుమ్మెదలు అందలి మకరందాన్ని తాగి మత్తుగా నిద్రిస్తాయి. ఇవన్నీ సమృద్దికి సంకేతాలే! ఇక పాలు పిదుక గోవుల పోదుగలను తాకగానే - కలశాలు నిండునట్లు క్షీరధారలు నిరంతరంగా కురుస్తాయి. ఇలా తరగని మహదైశ్వర్యంతో లోకమంతా నిండిపోతుంది. కావున వ్రతాన్ని చేద్దాం రమ్మని సఖులందరినీ పిలుస్తోంది గోదాదేవి.


భగవద్గీత

అధ్యాయం 4

శ్లోకం 3

స ఏవాయం మయా తే ధ్య యోగః ప్రొక్తః పురాతనః|

భక్తో సి మే సఖా చేతి రహస్యం హ్యేతదుత్తమమ్ ||

అర్ధం :-

ఈ యోగము ఉత్తమమైనది. రహస్యముగా ఉంచదగినది. నీవు నాకు భక్తుడవు.ప్రియసఖుడవు. కనుక మిక్కిలి పురాతనమైన ఈ యోగమును నేడు నీకు తెలుపుతున్నాను. 

తిరుప్పావై

తిరుప్పావై

పాశురము-2

వైయత్తు వాళ్ వీర్ గళ్! నాముమ్ నమ్బావైక్కు
శేయ్యుం కిరిశైగళ్ కేళీరో, పాఱ్కడలుళ్
పైయ త్తుయిన్ఱ పరమనడిపాడి
నెయ్యుణ్ణోమ్ పాలుణ్ణోమ్ నాట్కాలే నీరాడి
మైయిట్టెళుదోమ్ మలరిట్టు నామ్ ముడియోమ్
శెయ్యాదన శెయ్యోమ్ తీక్కుఱళైచ్చెన్ఱోదోమ్
ఐయముమ్ పిచ్చైయుంఆన్దనై యుంకైకాట్టి
ఉయ్యుమాఱెణ్ణి యుగన్దేలో రెమ్బావాయ్.

అర్ధం :-

భూలోకంలోని గోకులంలో పుట్టిన భాగ్యవతులారా! మనం చేయబోయే వ్రతానికి ముఖ్యంగా ఆచరించవలసిన నియమాలు వినండి. 
శ్రీ మన్నారాయణుని పాదారవిందాలకు కీర్తిస్తాము. అతనితో కలిసిఉన్న విశ్లేష సమయాన ఇతర భాహ్య  విషయాలను తలవకూడదు. పాలను త్రాగకూడదు. కన్నులకు కాటుక పెట్టుకోకూడదు. నెయ్యి తినకూడదు. జడలో పూలను పెట్టుకోకూడదు. అనగా శాస్త్ర విరుద్దములైన ఎటువంటి పనులను చేయకూడదు. ఒకరిపై చాడీలను చెప్పకూడదు. సత్పాత్రదానము చేయాలి. సన్యాసులకు, బ్రహ్మచారులకు సత్పత్రదానము చేయాలి. ఇంక ఆచరించు మార్గములేవైన యున్న వాటిని  తెలుసుకొని సంతోషముతో ఆచరిస్తాము. ఇలా ఈ  ధనుర్మాస మాసమంతా  కొనసాగిస్తాము. ఇదే మన వ్రత విధానం.



తిరుప్పావై

తిరుప్పావై

పాశురము-1

మార్గళి త్తిజ్ఞ్గల్ మది నిరైన్ద నన్నాళాల్
నీరాడ ప్పోదువీర్, పోదుమినో నేరిలైయీర్
శీర్ మల్గుమ్ ఆయ్ ప్పాడి శెల్వచ్చిరు మీర్ కాళ్
కూర్వేల్ కొడున్దొళిలన్ నన్దగోపన్ కుమరన్
ఏరార్ న్ద కణ్ణి యశోదై యిళంశింగమ్
కార్మేనిచ్చజ్ఞ్గణ్ కదిర్మదియం బోల్ ముగత్తాన్
నారాయణనే నమక్కే పరైతరువాన్
పారోర్ పుగళప్పడిన్దేలో రెమ్బావాయ్

అర్ధం :-
సుసంపన్నమైన గోకులంలో పుట్టి సుశోభితులైన గోపికలారా మార్గశీర్ష మాసం ఎంతో మంచిది. వెన్నెలలు కురిపిస్తుంది. చాలా మంచి రోజులివి. శూరుడైన నందగోపుని కుమారుడును, విశాల నేత్రియగు యశోదకు బాల సింహము వంటి వాడును, నల్లని మేఘము వంటి శరీరిమును, చంద్రునివలె ఆహ్లాదకరుడును, సూర్యునివలె తేజోమయుడును యైన నారాయణునే తప్పు, యితరములను కోరని మనకు ఆ స్వామి వ్రతమునకు కాలవసినవిచ్చుటకు సిద్ధపడినాడు. కావున మీరందరూ యీ వ్రతములో ప్రవేశించి లోకము ప్రకాశించునట్లుగ దాని అందమైన మార్గళి స్నానము చేయు కోరికగల వారందరును ఆలస్యం చేయకుండా త్వరగా  రండని శ్రీ గోదాదేవి గోపికలందరిని ఆహ్వానిస్తుంది.

గోదాదేవి

గోదాదేవి పనేందు ఆళ్వారులో ఒకరు. గోదాదేవి విష్ణుచిత్తుడు అనే ఆళ్వారుకి తులసి చెట్టు దగ్గర దొరుకుతుంది. ఆమె చిన్ననాటి నుంచి శ్రీరంగ నాధుడినే ఆరాధిస్తూ వస్తుంది. పెరిగి పెద్దయినా తరువాత శ్రీరంగ నాధుడిని వివాహం చేసుకోవాలని పట్టు పటింది. దానికి విష్ణుచిత్తుడు ఇదిఅంతా జరిగేపనికాదు అని వదిలేసారు. కానీ గోదాదేవి పండితుల ద్వారా ద్వాపరయుగములో గోపికలు శ్రీకృష్ణుడిని భర్తగా పొందటానికి కాత్యాయని వ్రతాన్ని చేసారని తెలుసుకొని తనుకూడా ఆ వ్రతాన్ని చేస్తుంది. విష్ణుచిత్తుడు ప్రతిరోజు శ్రీరంగనాధుడి కోసం పూవులను సిద్ధం చేసారు. వాటిని గోదాదేవి అలంకరించుకొని తండ్రి వచ్చేలోపు వాటిని వాటి స్థానంలో ఉంచేది ఇలా 30రోజులు గడిచాయి. ఆమె ఈ ముపై రోజులు ప్రతిరోజు ఒక పాశురాని రాసి, పాడింది. ఒకరోజు విష్ణుచిత్తుడు స్వామి కోసం పూవులు తీసుకువెళుతుండగా అందులో పొడవైన వెంట్రుకలు కనిపిస్తాయి. గోదాదేవిని పిలిచి అడుగుతారు. గోదాదేవి చేసినా పనిని తెలుసుకొని ఆమెను మందలిస్తారు. ఆరోజు రాత్రి కలలో శ్రీకృష్ణుడు కనిపించి గోదాదేవిని పెళ్లి కుమార్తెగా అలంకరించి ఆలయానికి తీసుకురమ్మని ఆజ్ఞాపిస్తారు. ఆ దేశరాజు, పెద్దలు, పండితులు, విష్ణుచిత్తుడు అందరూ కలిసి గోదాదేవిని సాలంకృత కన్యగా ఆలంకరించి దేవాలయానికి తీసుకువస్తారు. గోదాదేవి స్వామిని అర్చిస్తున సమయంలో అందరూ చుట్టునుండగా స్వామిలో ఐక్య అవుతుంది. 

కార్తీక పురాణము 30వ రోజు

కార్తీకవ్రత మహిమ ఫలశ్రుతి 

నైమిశారణ్యములో ఆశ్రమములో శౌనకాది మహామునులకు సూతమహర్షి తెలియజేసిన కార్తీకమాస మహత్యం, విష్ణు మహిమలు, శివమహిమలు విన శౌనకాది మునులు సుతునితో ఇంకా కార్తీకమాస విశేషాలు తెలియజేయండి అని అడిగారు. అందుకు సుతుడు "మునీశ్వరులారా! కార్తీక మాస మహిమ ఎంతవిన తనివితీరదు. ఈ మాసములో ప్రతిరోజు సూర్యదయమునకు ముందే నిద్రలేచి దగ్గరలో ఉన్న నదిలో స్నానము చేసి దేవాలయమునకు వెళ్లి దపారాధలు, దానధర్మాలు, దీపధానములు చేయాలి.  ప్రతిరోజు సాయంత్రం పురాణపఠనం చేయాలి. ఇలా నెలరోజులు చేసినా సకల పాపములు పోతాయి. కార్తీక వ్రతాన్ని నిష్టతో చేస్తే చివరకు వైకుంఠప్రాప్తి కలుగుతుంది. ఈ కార్తీకమాసం లో సదా హరినామస్మరణ చేసినా సకల పాపాలు నశిస్తాయి. 

స్వస్తి.............. 



కార్తీక పురాణము 29వ రోజు

అంబరీషుడు దుర్వాసుని పూజించుట - ద్వాదశీ పారాయణము 

అత్రిమహాముని అగస్త్యుల వారితో ఈ విధముగా - సుదర్శన చక్రము అంబరీషునికి అభయమిచ్చి రక్షించి, భక్తికోటికి దర్శనమిచ్చి అంతర్ధానమైన విధానాన్ని చేపి ఇంకా ఇలా చెప్పసాగారు. 

ఆ తరువాత అంబరీషుడు దుర్వాసుని భోజనానికి ఆహ్వానించి అతనికి అతిధి మర్యాదలు చేసి అందరూ కలిసి శ్రీమహావిష్ణువుని పూజించి ద్వాదసిపారణము చేసారు. తరువాత అందరూ భోజనము చేసారు. తరువాత అంబరీషుడు దుర్వాసునితో "స్వామి! మీవంటి తాపశాలిని సేవించటం నా భాగ్యం నాయందు దయవుంచి నేను ఇపుడు సాధువులను, సన్యాసులను గౌరవించి, పూజించి ఇపుడు నా మనసులో హరినామస్మరణ విడవకుండా ఉండేలా నన్ను ఆశీర్వదించండి" అని దుర్వాసుడిని కోరాడు అందుకు దూర్వాసుడు "అంబరీషా! నువ్వు ధన్యుడవు. ప్రజా రంజకంగా పరిపాలిస్తున్నావు. నువ్వు శ్రీహరి భక్తులలో శ్రేష్ఠుడవు. నువ్వు అడిగిన ఈ చిన్న వరాన్ని నీకు ఇస్తున్నాను. ఇకనుంచి నీవు నాకు ఇష్టుడవు. ఎవరైతే ప్రతి ఏకాదశి నాడు కటిక ఉపవాసం చేసి ద్వాదశినాడు శ్రీమహావిష్ణువుని పూజించి శక్తికొలది దానధర్మలు చేసి బ్రాహ్మణులతో సహా ద్వాదశిఘడియలు దాటకుండా భోజనము చేస్తారో వారికీ వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. 



భగవద్గీత

అధ్యాయం 4

శ్లోకం 2

ఏవం పరంపరాప్రాప్తమ్ ఇమం రాజర్షయోవిదుః |

స కాలేనేహ మహతా యోగో నష్ట: పరంతప ||

అర్ధం :-

ఓ పరంతపా! ఈ విధముగా పరంపరాప్రాప్తమైన ఈ యోగమును రాజర్షులు ఎరుగుతురు. కాని, అనంతరము ఈ యోగము కాలక్రమమున భూలోకమునందు లుప్తప్రాయమయ్యెను.

కార్తీక పురాణము 28వ రోజు

విష్ణు సుదర్శన చక్ర మహిమ

           అత్రి మహాముని అంబరీషునితో దూర్వాసుడు విష్ణుమూర్తి దగ్గర సెలవు తీసుకొని తనని తరుముకువస్తున సుదర్శన చెక్రనికి భయపడి అంబరీషుని వద్దకు వెళ్లి అతని పాదాలపై పడి వేడుకొన్నాడు. అంబరీషా నను క్షమించు. నేనే తాపశాలిని అనే గర్వముతో ముందు వెనక ఆలోచించకుండా నీ పట్ల అన్యాయం చేశాను.  ఇపుడు ఫలితం అనుభవిస్తున్నాను. నన్ను క్షమించు రక్షించు అని వేడుకొన్నాడు. అంబరీషుడు దుర్వాసుడిని లేవదీసి సుదర్శన చెక్రనికి నమస్కరించి కోరిన వాళ్లకి నా దగ్గర వున్నది లేకుండా యిచ్చిన వాడనయితే నేను ఎప్పుడూ ధర్మము తప్పకుండా ప్రవర్తించిన వాడనయితే నేను చేసిన పూజలకు శ్రీమన్నారాయణ సంతోషమును పొందిన వాడయితే నీవు ఈనాడు మహర్షిని సంహరించాలని ఉద్యుక్తతను పొందుతున్న దానివి ప్రశాంతతను పొంది, శాంతిని పొంది నీ యథాస్థానమునకు మరలి పొడువు గాక!” అన్నాడు. దుర్వాసుని రక్షించడానికి తాను చేసిన తపస్సునంతటిని ఒట్టు పెట్టాడు. ఉత్తర క్షణం ప్రశాంతతను పొంది సుదర్శన చక్రం వైకుంఠమునకు వెళ్ళిపోయింది.




కార్తీక పురాణము 27వ రోజు

దుర్వాసుడు అంబరీషుని ఆశ్రయించుట

         అత్రి మహాముని అగస్యునికి ఇలా చెప్పసాగారు. అగస్యా!  శ్రీ హరి దుర్వాసుని యెంతో ప్రేమతో చేరదీసి ఇలా చెప్పసాగారు. 

            ఓ దుర్వాసముని!  నువ్వు అంబరీషుని శపించినట్లు గానే  ఆపది జన్మలు నాకు సంతోషకరమైనవే.  నేను అవతారాలు ధరించడం కష్టం కాదు. నువ్వు తప్పసాలివి.  మీ మాటకు విలువ ఇవ్వాలి.  అందుకే నేను అంగీకరిస్తున్నాను.  బ్రాహ్మణుల మాట సత్యాలు అయితే వారికి గౌరవం ఉండదు.  ఇటు భక్తులను కాపాడటం అటు బ్రాహ్మణుల మాట తప్పకుండా ఉండటం నా కర్తవ్యం.  నువ్వు అంబరీషుని ఇంట్లో భుజించకుండా వచ్చావు.  అందుకే అతడు నా వలన దుర్వాసమహర్షి ప్రాణాలకు ముప్పు వచ్చింది అని ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధపడుతున్నాడు.  ఆ కారణం వల్లనే విష్ణుచక్రం నిన్ను బాధిస్తుంది.  వెంటనే నువ్వు అంబరీషుని దగ్గరకు వెళ్ళు. మీ ఇద్దరికి శాంతి శాంతి లభిస్తుంది.  విష్ణువు దుర్వాసునికి నచ్చజెప్పి అంబరీషుని దగ్గరకి పంపారు.  దూర్వాసుడు వెంటనే అంబరీషుని దగ్గరకు భయాలుదేరారు. 




కార్తీక పురాణము 26వ రోజు

దూర్వాసుడు శ్రీహరిని శరణువేడుట

ఈ విధంగా అత్రిమహాముని అగస్త్యునితో దుర్వాసుని కోపమువలన జరిగిన ప్రమాదం గురించి చేపి ఇంకా చెప్పసాగారు. దూర్వాసుడు అని లోకాలను తిరిగి తనని రక్షించేవాళ్ళు ఒక శ్రీహరి అని వైకుంఠానికి వెళ్లి శ్రీమన్నారాయణ నన్ను రక్షించండి. నీ భక్తుడైన అంబరీషుడికి కీడు చేయాలి అని చూసి నేను బ్రాహ్మణుడిని ముకోపినై ముందు వెనక చూడకుండా మహాపరాధము చేశాను. నీవు బ్రాహ్మణప్రియుడవు. నీ భక్తునికి శాపమిచ్చిన నేనుకూడా రక్షించండి. శ్రీహరి! నీ చక్రాయుధము నను తరుముకొస్తుంది. అని దూర్వాసుడు అహంకారాన్ని వదిలి అనేకవిధాలుగా వేడుకొన్నాడు. శ్రీహరి చిరునవ్వు నవ్వి దుర్వాస! బ్రాహ్మణా రూపములో పుటిన రుద్రుడవు. నీ వంటి తపోధనులు నాకు ఇష్టులు. ప్రతియుగములో గో, బ్రాహ్మణ, దేవా, సాదుజనులకు సంభవించే ఆపదలను పోగొట్టటానికి నేను అవతారాలు ధరిస్తాను. నీవు అకారణంగా అంబరీషుడిని శపించావు. నేను శత్రువుకైనను మనోవకాయకర్మలలో హాని తలపేటను. అంబరీషుడు ధర్మయుక్తంగా ప్రజాపాలన చేస్తున్నాడు. కానీ అటువంటి భక్తుడిని అనేక విధాలా ధూషించావు. నీ ఎడమ పాదముతో తన్నావు. అతని ఇంటికి నువ్వు అతిథివై వెళ్లి నీకు ఆలస్యం అయితే ద్వాదశి ఘడియలు ముగియక ముందే భోజన చేయమని చెప్పలేదు. అతడు వ్రతభంగానికి భయపడి నీళ్లు మాత్రమే తాగాడు. అంతకంటే అపరాధము ఏమి చేయలేదు. చాతుర్వర్ణాల వారికీ భోజన నిషిద్ధ సమయంలో కూడా దాహంతీర్చుకోవటానికి నీళ్లు త్రాగటం మంచిదే కదా. మంచి నీళ్లు తాగాడని నా భక్తుడిని తిట్టి శపించావు. అతడు వ్రతభంగానికి భయపడి నీళ్లు మాత్రమే తాగాడు కానీ నిన్ను అవమానించటానికి కాదు కదా. నువ్వు కోపంగా ఉన్న అతడు నిన్ను భ్రతిమి లాడాడు. ఎంత బ్రతిమిలాడినా నువ్వు శాంతించలేదు. అందుకే అతను నన్ను శరణు వేడాడు. నేనపుడు రాజు హృదయములో ప్రవేశించాను. నీ శాపము పది జన్మలలో అనుభవిస్తాను అని నేనే పలికాను. అతడు ని వల్ల భయముతో  శరణువేడుతున్నాడు.  తనని తాను తెలుసుకోలేని స్థితిలో ఉన్నాడు.  నీ శాపమును అతడు వినలేదు.  అంబరీషుడు నా భక్తులలో శ్రష్ఠుడు.  నిరపరాధి.  విచారించకు.  ఆ శాపాన్ని లోకోపకారంకై  నేనే అనుభవిస్తాను. 

            మీ శాపం లో మొదటి జన్మ ఈ కల్పాని  రక్షించటానికి మత్యవతారం గాను,  రెండొవ జన్మ క్షిరసాగరమధనంలో కూర్మావతారం గాను, మూడవ జన్మ భూమిని కాపాడటానికి వరాహ అవతారం గాను, నాలుగోవ అవతారం ప్రహ్లదుడిని కాపాడతానికి నరసింహావతారం గాను, ఐదొవ అవతారం బలిచేక్రవర్తిని పాతాళానికి వామామవతారం గాను, ఆరొవ అవతారం పరశురామ అవతారం గాను, ఎడొవ అవతారం రాముని గాను, ఎనిమిదోఅవతారం కృష్ణుడి గాను, తోమిదొవ అవతారం బుధ్ధుడిగాను, పదోవ అవతారం కల్కి గాను అవతరిస్తాను. ఈ పది అవతారములు ఎవరైనా నిత్యం స్మరించిన వారికీ వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. 



భగవద్గీత

శ్రీమద్భవద్గీత

అథ చతుర్థోధ్యాయః-జ్ఞానకర్మసన్న్యసయోగః

శ్లోకం 1

శ్రీభగవాన్ ఉవాచ

ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయమ్|

వివస్వాన్ మనవే ప్రాహ మనురిక్ష్వాకవే బ్రవీత్||

అర్ధం :-

శ్రీభగవానుడు పలికెను:- నేను నిత్యసత్యమైన ఈ యోగమును సూర్యునకు తెలిపితిని. సూర్యుడు తనపుత్రుడైన వైవశ్వతమనువునకు దీనిని  భోదించారు. ఆ మనువు తన కుమారుడైన ఇక్ష్వాకునకు ఉపదేశించెను. 

కార్తీక పురాణము 25వ రోజు

దూర్వాసుడు అంబరీషుని శపించుట 

అంబరీషా!పూర్వజన్మలో కొంత పాపవిశేషం వలన నికి యనర్ధము వచ్చింది. నీ బుద్ధిచే దీర్ఘముగా అలోచించి నీకెలా అనిపిస్తుందో అలానే చేయి. ఇక మాకు సెలవు ఇపించండి. అని పండితులు పలికారు. తరువాత అంబరీషుడు పండితులారా! నా అభిప్రాయును విని వెళ్ళండి. ద్వాదశీనిష్టను విడిచి పెట్టటం కన్నా, బ్రాహ్మణశాపమును పొందటం మేలు కొద్దిగా నీళ్లు తాగటం వలన బ్రాహ్మణుని అవమానించటం కాదు. ద్వాదశిని విడిచి పెట్టటం కాదు. అప్పుడు నన్ను ఎందుకు నిందిస్తాడు? నిందించడు. నా తొలి పుణ్యఫలమును నశించదు. కనుక జలపానమొనరించి ఉరుకుంటాను. అని వారి ఎదురుగానే నీళ్లు తాగుతాను. 

           అంబరీషుడు నీళ్లు తగిన వెంటనే దూర్వాసుడు స్నానజపాదులు పూర్తి చేసుకొని అక్కడకు వచ్చారు. వచ్చిన వెంటనే ఆ ముని కోపముతో అంబరీషుడిని నన్ను భోజనానికి రమ్మని, నేను రాకుండానే నీవేల భోజనము చేసావు. ఎంత దుర్మార్గము? ఎంత నిర్లక్ష్యము? ఎంతటి ధర్మ పరిత్యాగివి? అతిథికి అన్నము పెడతానని పెట్టకుండా నువ్వు తింటావా. అట్టి అధముడు మరుజన్మలో పురుగైపుట్టును. నీవు అతిధిని విడిచి భుజించినావు కాన, నీవు నమ్మకద్రోహివి హరిభక్తుడవు ఇలా అవుతావు? శ్రీహరి బ్రాహ్మణుడిని అవమానించటమే. నీవంటి హరినిందపరుడు వేరొకడు లేడు. నువ్వు మహా భక్తుడనని నీకు గర్వము కలవాడివై ఉన్నావు. ఆ గర్వముతో నీవు నన్ను భోజనానికి ఆహ్వానించి అవమానపరచి నిర్లక్ష్యముగా నీళ్లు పుచ్చుకున్నావు. అంబరీష నీవు ఎలా పవిత్రకుటుంబములో పుట్టావు. నీ వంశము కళంకం కాలేదా. అని కోపం నోటికివచ్చినటు తిట్టాడు. అంబరీషుడు మునికోపమునకు గడగడా వణుకుతూ నమస్కరించి మునివర్యా నను క్షమించండి. నేను ధర్మహీనుడిని. నా అజ్ఞానముతో ఈ పని చేశాను. నన్ను రక్షించండి. బ్రాహ్మణునకు శాంతియే ప్రధానము. మీరు తపోధనులు, దయాదాక్షణ్యాలు గలవారు. నను కాపాడండి. అని అతని పాదాలపై పడి, దయలేని వాడై దూర్వాసుడు అంబరీషుని తలను తన ఎడమకాలితో తని "నువ్వు దోషివి దోషికి శాపం ఇవ్వకుండా ఉండకూడదు. నువ్వు మొదటి జన్మలో చేపగాను, రెండొవజన్మలో తాబేలుగాను, మూడవజన్మలో పందిగాను, నాలుగోవజన్మలో సింహముగాను, ఐదొవజన్మలో వామనుడిగాను, ఆరొవజన్మలో క్రూరుడైన బ్రాహ్మణుడిగాను ఎడొవజన్మలో మూఢుడవైన రాజుగాను, ఎనిమిదొవ జన్మలో రాజ్యముగాని సింహాసనము లేనట్టి రాజుగాను, తొమ్మిదొవజన్మలో పాషండ మతస్థునిగాను, పదోవ జన్మలో పాపబుద్ధిగల దయలేని బ్రాహ్మణుడిగాను పుట్టాలి గాక "అని వెనక ముందు ఆలోచించకుండా శపించాడు. ఇంకా కోపం తగనందు వల్ల మళ్లి శపించటానికి చూస్తుండగా, శ్రీమహావిష్ణువు బ్రాహ్మణ శాపము వృధాకాకూడదు అని తన భక్తునికి ఈ అపాయము కలగకూడదని అంబరీషుని హృదయములో ప్రవేశించి "మునివర్యా అలాగే నీ శాపమును అనుభవిస్తాను అని ప్రాధేయపడాడు. కానీ దూర్వాసుడు ఇంకా కోపంపెంచుకొని మళ్లీ శపించబోగా, శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చెక్రాని అడుపెట్టారు. సుదర్శన చెక్రము నిప్పులు కక్కుతూ దుర్వాసునిపై పడబోయింది. దూర్వాసుడు ఆ చెక్రము తనను మసిచేస్తుంది అని తలచి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని అక్కడినుండి పరిగెత్తాడు. తనను కాపాడమని భూలోకంలో ఉన్న మహా మునులను దేవలోకంలో ఉన్న దేవేంద్రుడిని, బ్రహ్మలోకములో ఉన్న బ్రహ్మను, కైలాసమునకు వెళ్లి ఎంత ప్రదించిన వారు సైతము ఛేక్రాయుధము బారి నుంచి దుర్వాసుడిని కాపాడలేకపోయారు. 



భగవద్గీత

అధ్యాయం 3

శ్లోకం 43

ఏవం బుద్ధేః పరం బుద్ధ్వా సంస్తభ్యాత్మానమాత్మనా|

జహి శత్రుం మహాబాహొ కామరూపం దురాసదమ్ ||

ఓం తత్పాదితి శ్రీమధ్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశస్త్రే శ్రీకృష్ణాఃర్జునసంవాదే కర్మయోగో నామ తృతీయోద్యాయః

అర్ధం:-

ఈ విధముగా బుద్ధికంటెను ఆత్మపరమైనదని అనగా సూక్ష్మము, బలీయము, మిక్కిలి శ్రేష్ఠము ఐనదని తెలిసికొని, ఓ మహాబాహు!బుద్ధిధ్వారా మనస్సును వశపరుచుకొని, దుర్జయశత్రువైన కామమును నిర్మూలించాలి.

కార్తీక పురాణము 24వ రోజు

 అంబరీషుని ద్వాదశీవ్రతము 

అత్రిమహాముని మళ్లీ అగస్త్యునితో "అగస్త్య మహర్షి! కార్తీకవ్రత ప్రభావము  వివరించిన తనివితీరదు. కార్తీక మాసములో శుద్ధ ద్వాదశిరోజునాడు చేసే వ్రతానికి అత్యంత ప్రాముఖ్యత ఉన్నది.  ఆ రోజు చేసే దాన ధర్మాలకు అధిక ప్రాముఖ్యత ఉన్నది. ఈ ద్వాదశీవ్రతము ఎలాచేయాలి వివరిస్తాను విను. 

        కార్తీక శుద్ధ దశమి రోజున పగటిపూట మాత్రమే భుజించి ఆ మరుసటిరోజు అనగా ఏకాదశిరోజు ఎటువంటి ఆహారము తీసుకోక కటిక ఉపవాసము చేసి ద్వాదశి గడియలు వచ్చిన తరువాత భోజనము చేయాలి. ఎందుకు ఒక ఇతిహాసము ఉన్నది. అదికూడా వివరిస్తాను. 

          పూర్వము అంబరీషుడను రాజు ఉన్నాడు. అతడు పరమ భాగవతోత్తముడు. ద్వాదశీవ్రత ప్రియుడు. అంబరీషుడు ప్రతి ద్వాదశినాడు తప్పకుండా వ్రతము చేస్తుండేవాడు. ఒక ద్వాదశినాడు ద్వాదశిఘడియలు స్వల్పంగా ఉన్నాయి. అందుకే ఆరోజు త్వరగా వ్రతమును ముగించి బ్రాహ్మణసమారాధన చేయదలచి సిధ్ధముగా ఉన్నాడు. అదే సమయానికి అక్కడికి కోపస్వభావము కలిగిన దుర్వాస మహర్షి వచ్చారు. అంబరీషుడు ఆమునిని గౌరవించి, ద్వాదశి ఘడియలలో పారాయణ చేయాలి కనుక తొందరగా స్నానమునకేగి రమ్మనమని కోరాడు. అందుకు దుర్వాసుడు అంగీకరించి దగ్గరలో ఉన్న నదికి వెళ్లారు. అంబరీషుడు ఎంతసేపు ఎదురుచూసిన దుర్వాస మహర్షి రాకపోయేసరికి తనలోతానుద్వాదశిఘడియాలి దాటిపోతున్నాయి. మహర్షి ఇంకారాలేదు. ఇపుడు ఏమిచేయాలి. అని తన రాజ్యములో ఉన్న పండితులను పిలిచి ఇలా చెప్పసాగారు. ఇంటివచ్చిన దుర్వాసమహర్షి భోజనానికి రమ్మన్నాను. మహర్షి స్నానానికి వెళ్లి ఇంకా రాలేదు. మహర్షిని భోజనానికి పిలిచి తాను ముందు భోజనము చేయటం ధర్మమూ కాదు. మహర్షి వచ్చేవరకు ఉంటే వ్రతభంగము అవుతుంది. ద్వాదశి వ్రతము విడిస్తే శ్రీహరి భక్తిని వదిలిన వాడిని అవుతాను. దుర్వాసమహర్షి మహా కోపము కలవాడు. అయన రాకుండా భోజనము చేస్తే మహర్షి శపిస్తారు. ద్వాదశి విడిచి భుచించిన భగవంతునికి, భోజముచేసిన దుర్వాసమహర్షికి కోపం వస్తుంది. ఈ రెండిటిలో ఏది ఉత్తమమైనది తెలియజేయండి. పండితులు అందరూ కలిసి మహారాజ! సమస్త ప్రాణకోటికి గర్భకుహరములో జఠరాగ్ని రూపములో రహస్యముగానున్న అగ్నిదేవుడు ఆకలిని పుటించి ప్రాణులు భుజించిన చాతురిధాన్నమును పచనముగావించి దేహేంద్రియాలకు శక్తిని ఇస్తున్నాడు. ప్రాణవాయువు సహాయముతో జఠరాగ్ని చెలరేగి ఆకలి దప్పికలి కలుగును. ఆ తాపముము చల్లార్చవలెనన్న అన్నము, నీరు పుచ్చూకొని శాంతపరచవలెను. శరీరమునకు శక్తి కలుగచేయువాడు అగ్నిదేవుడు, దేవతల అందరి కంటే అధికుడై దేవపూజ్యుడు. ఆ అగ్నిదేవుడిని అందరు సదాపూజించాలి.గృహస్థుడు, ఇంటికివచ్చిన అతిథి కడజాతివాడైన భోజనము పెడతాను అని చేపి వానికి పెట్టకుండా తినకూడదు. అందులోనూ వేదవేదంగావిద్యావిశారదుడు, మహాతాపశాలి, సదాచారసంపనుడు అయినా దుర్వాస మహర్షిని భోజనానికి పిలిచి అతనికి పెట్టకుండా తాను భుజించటం వలన మహాపాపము కలుగుతుంది. అందువలన ఆయుఃక్షిణము కలుగుతుంది. దుర్వాస మహాముని అంతటి వానిని అవమానమొనరించిన పాపము కలుగుతుంది అను వివరించారు............



భగవద్గీత

అధ్యాయం 3

శ్లోకం 42

ఇంద్రియాణి పరాణ్యాహుః ఇంద్రియేభ్యః పరం మనః|

మనసస్తు పరా బుద్ధిః యో బుద్ధేః పరతస్తు సః||

అర్ధం :-

స్థూలశరీరముకంటె ఇంద్రియములు బలమైనవి. సూక్ష్మములు, శ్రేష్ఠములు అని పేర్కొంటారు. ఇంద్రియములకంటే మనస్సు, దానికంటేను బుద్ధి శ్రేష్టమైనవి. ఆ బుద్ధికంటెను అత్యంత శ్రేష్టమైనది, సూక్ష్మమైమది ఆత్మ. 

కార్తీక పురాణము 23వ రోజు

శ్రీరంగక్షేత్రమున పురంజనుడు ముక్తిని పొందింది

          అగస్యుడు మళ్లీ అత్రిమహర్షిని చూసి "మునిపుంగవా! విజయముపొంచిన పురంజయుడు ఏమిచేసాడు నాకు వివరించండి". అందుకు అత్రిమహాముని ఇలా చెప్పారు. అగస్యమహర్షి! పురంజయుడు కార్తీక మాసవ్రతప్రభావము వలన అసమాన బలోపేతుడై తన శత్రురాజులను అందరిని ఓడించి నిరాటంకంగా తన రాజ్యమును ఏలుతున్నాడు. అతని విష్ణు భక్తి ప్రభావం వలన అధర్మ మార్గాన్ని విడి ధర్మ మార్గాన్ని ఆచరిస్తు రాజ్య ప్రజలను పాలిస్తున్నాడు. కొంతకాలానికి పురంజనుడికి అశరీరవాణి ఇలా వినిపించింది పురంజనా!కావేరి నదీతీరమున శ్రీరంగక్షేత్రముంది. దానిని రెండొవ వైకుంఠమని పిలుస్తారు. నువ్వు అక్కడికి వెళ్లి శ్రీరంగనాథస్వామిని అర్చింస్తే నువ్వు సంసాగరమును ధాటి మోక్షప్రాప్తి కలుగుతుంది అని వినిపించింది. 

     తరువాత పురంజయుడు రాజ్యమును మంత్రులకు అప్పగించి రాజ్య సపరివారంగా బయలుదేరి మార్గమధ్యంలో వస్తున్న పుణ్యక్షేత్రాలను దర్శించి, పుణ్య నదులలో స్నానమాచరించు శ్రీరంగానికి చేరుకున్నారు. అక్కడ కావేరి నది రెండు పాయలుగా ప్రవహిస్తుండగా మధ్యలో శ్రీరంగఆలయంలో శేషశయ్యపై పవ్వళించి ఉన్న శ్రీరంగ స్వామిని దర్శించుకున్నారు. కార్తీకమాసమంతా శ్రీరంగమునందే గడిపి తరువాత అయోధ్యకు బయలుదేరారు. కార్తీక మాస వ్రతప్రభావము వలన అతని రాజ్యములోని ప్రజలందరూ సిరిసంపదలతో, ఆయురారోగ్యాలతో ఉన్నారు. అతడు ధర్మాభిలాషుడై దైవభక్తిపరాయణుడై అరిషడ్వార్గాలను జయించి రాజ్యపాలన చేస్తున్నాడు. కొంతకాలానికి అతనికి వృధాప్యము రాగా అతని కుమారుడికి రాజ్యపాలనము అప్పగించి వాన ప్రస్థాశ్రమానికి స్వకరించి అరణ్యానికి వెళ్ళాడు. అతడు వానప్రస్థాశ్రమంలో కూడా ప్రతి సంవత్సరం కార్తీక మాసవ్రతమును ఆచరించి మరణించిన తరువాత వైకుంఠానికి వెళ్ళాడు. కనుక ఓ అగస్యమహర్షి కార్తీక మాసవ్రత మహత్యం ఫలప్రదమైనది. దానిని ప్రతివారు ఆచరించాలి. ఈ కథ విన్నవారికి చదివిన వారికీ కూడా వైకుంఠప్రాప్తి కలుగుతుంది. 



కార్తీక పురాణము 22వ రోజు

పురంజయుడు కార్తీక మాస వ్రతం చేయటం 

అత్రి మహాముని అగస్త్యునికి ఇలా చెప్పసాగారు. పురంజయుడు వశిష్ఠులవారు చెప్పిన ప్రకారం కార్తీక పౌర్ణమి రోజున శుచియై దేవాలయమునకు వెళ్లి శ్రీమన్నారాయణుని షోడశోపచారాలతో పూజించి, శ్రీహరిని ప్రార్ధించి, సాష్టాంగ నమస్కారం చేసి, సూర్యోదయము కాగానే నదికి వెళ్లి స్నానమాచరించి తన గృహానికి వెళ్ళాడు. అదే సమయిజంలో విష్ణుభక్తుడైన ఒక వృద్దబ్రాహ్మణుడు మెడనింద తులసీమాలలు ధరించి పురంజయుడి దగ్గరకు వచ్చి "రాజా! విచారించకు. నువ్వు వెంటనే చెల్లచెదురైనా సైన్యాన్ని కూడదీసుకుని నీ శత్రురాజులతో యుద్ధం చేయి. నీ రాజ్యము నీకు దక్కుతుంది" దీవించి వెళ్లారు. బ్రహ్మానుడి మాటలు నమ్మి పురంజయుడు శత్రురాజులతో ఘోరంగా యుద్ధం చేసాడు. శ్రీమన్నారాయుని ఆశీర్వాదముతో పురంజయుడు ముందు యుద్దములో నిలువలేక శత్రురాజులు పారిపోయారు. పురంజయుడు విజయం పొంది తన రాజ్యాని తాను తిరిగి సంపాదించాడు. శ్రీమన్నారాయుని కటాక్షం వలన భక్తులకు శత్రువుల భయం ఉండదు కదా!




కార్తీక పురాణము 21వ రోజు

పురంజనుడు కార్తీకమాస వ్రత ప్రభావము తెలుసుకొనుట 

                 ఈ విధంగా యుద్ధానికి సిద్ధమైన వచ్చిన పురంజనునకు కాంబోజాది రాజులకు భయంకరమైన యుద్ధం జరిగింది.  ఈ యుద్ధంలో పురంజయుడు ఓటమి పాలైయాడు.  దానితో పురంజనుడు రహస్య మార్గంలో శత్రువుల కంటబడకుండా  అడవిలోకి వెళ్ళి పోయాడు. శత్రురాజులు రాజ్యాన్ని ఆక్రమించుకున్నారు. పురంజనుడు విచారిస్తున్న సమయంలో వశిష్ఠులు వచ్చి పురంజనుడిని ఓదార్చి "రాజా! ఇంతకుముందు నీ దగరకు ఒకసారి వచ్చినపుడు నీవు ధర్మము తప్పి ఉన్నావు. నేను నీకు అధర్మ మార్గాన్ని విడిచిపెట్టి ధర్మమార్గములో హితబోధచేసిన నీవు నా మాట వినిపించుకోలేదు. ధర్మ మార్గం తప్పటం వల్లనే ఈ రోజు ఇలా యుద్దములో ఓడిపోవలసి వచ్చింది. జయాపజయములు దైవాధీనాలు. రేపు కార్తీక పౌర్ణమి స్నానజపాది నిత్య కర్మలను ఆచరించి దేవాలయానికి వెళ్లి దేవుని సన్నిధిలో దీపారాధన చేసి భాగవనామస్మరణతో నాట్యము చేయి. ఇలా చేసినా నీకు పుత్ర సంతానం కలుగుతుంది. శ్రీమన్నారాయణుని సేవించటం వలన అయన సంతోషించి నీవు యుద్దములో గెలవటానికి సహాయం చేస్తారు. రేపు ఇలా చేసినా పోగొట్టుకున్నా రాజ్యమును పొందుతావు. కనుక నువ్వు ఇకనుంచి అధర్మ మార్గాన్ని విడి ధర్మ మార్గంలో ప్రవర్తించు. అని వశిష్టమహాముని హితబోధ చేసారు. 

భగవద్గీత

అధ్యాయం 3

శ్లోకం 41

తస్మాత్ త్వమింద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ |

పాప్మానం ప్రజహి హ్యేనం జ్ఞానవిజ్ఞానశనమ్ ||

అర్ధం :-

కావున ఓ అర్జునా! మొదట ఇంద్రియములను వశపరచుకోవాలి. పిదప జ్ఞానవిజ్ఞానములను నశింపజేయునట్టి మహాపాపియైన ఈ కామమును అవశ్యముగా సర్వశక్తులనోడ్డి రూపుమాపాలి. 

కార్తీక పురాణము 20వ రోజు

 పురంజయుడు దురాచారుడగుట 

           జనకమహారాజు వసిష్ఠునితో "గురువర్యా! కార్తీక మహత్యం ఇంకా వినాలని ఉంది. ఈ వ్రతముము గురించి ఇంకా ఏమన్నా కథలు ఉన్నాయా వివరించండి."  వసిష్ఠులవారు విని మందహాసములో "ఓ రాజా! కార్తీక మాస మహత్యం గురించి అగస్త్యమాజమునికి, అత్రిమహామునికి జరిగిన ప్రసంగము ఒకటి ఉన్నది. దానిని వివరిస్తాను. శ్రద్ధగా విను". 

            పూర్వము ఒకపుడు అగస్యమహర్షి, అత్రిమహాముని దగరకు వచ్చి "ఓ అత్రిమహాముని! నీవు విష్ణుమూర్తి అంశతో జన్మించావు. కార్తీకమాస మహత్యం మీకు వివరంగా తెలుసు. దానిని నాకు వివరించండి" అని కోరెను. అందుకు అత్రిమహాముని "అగస్యమహర్షి! నీవు అడిగిన ప్రశ్న శ్రీమన్నారాయణుని ప్రీతికరమైనది. కార్తీకమాసంతో సమానమైన మాసం, వేదములతో సమానమైన శాస్త్రము, ఆరోగ్యముతో సమానమైన సంపద వేరొకటి లేదు. ఏ మానవుడైన కార్తీకమాసమున నదిలో స్నానము చేసినా, శివకేశవుల ఆలయములో దీపారాధన చేసినా, లేక దీపదానము చేసినా కలుగు ఫలితము అపారమైనది. దీనికి ఒక ఇతిహాసము ఉన్నది. 

               త్రేతాయుగములో పురంజయుడు సూర్యవంశపు రాజు అయోధ్య నగరమును రాజధానిగా చేసుకొని రాజ్యమేలుతున్నాడు. అతడు సకల శాస్త్రములు చదివారు. న్యాయముగా రాజ్యపాలన చేస్తున్నారు. ప్రజలకు ఇటువంటి ఆపదలు రాకుండా పాలిస్తున్నాడు. కొంతకాలానికి పురంజయుడు అమిత ధనాశ కలిగి, రాజ్యాధికార గర్వముతో జ్ఞానహీనుడై దయాదాక్షణ్యాలు లేక దేవబ్రాహ్మణ మాన్యములు లాగుకొని, పరమలోభియై, చోరులను చేరదీసి వీరిచే దొంగతనములు దోపిడీలు చేయించి దొంగలు తెచ్చిన ధనమును సగం వాటా లాకొని ప్రజలను భయభ్రాంతులను చేస్తుండేవాడు. కొంతకాలానికి అతని దౌర్జన్యం గురించి చుటుపక్కల రాజ్యాలైన కాంభోజ, టెంకణ, కొంకణ, కళింగాది రాజుల చెవులో పడింది. వారు తమలో తాము ఆలోచించుకొని కాంభోజరాజుని నాయకునిగా చేసుకొని రథ, గజ, తురగ, పదాతి సైన్య బలముతో రహస్య మార్గములో అయోధ్య నగరాన్ని ముట్టడించి, నలువైపులా శిభిరాలు నిర్మించి నగరాన్ని దిగ్భాధానం చేసి యుద్ధనికి సిద్దపడారు. 

             అయోధ్య నగరాన్ని ముట్టడించిన సంగతి చరుల ద్వారా తెలుసుకొన పురంజయుడు తనుకూడా సర్వసన్నధ్ధుడై వున్నాడు. అయినా ఎదుటి పక్షము బలముగా ఉన్న తాను బలహీనంగా ఉన్న ఏ మాత్రము భయంము చెందకుండా రధము ఎక్కి సైన్యాధిపతులను పురికొల్పి, చతురంగబల సమేతుమైన సైన్యముతో యుధ్ధాసన్నధ్ధుడై వారిని ఎదొర్కొనడానికి యుద్ధ భేరిని మోగించి, శత్రుసైన్యముతో యుద్ధం చేస్తున్నారు. 


 

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...