కార్తీక పురాణము 20వ రోజు

 పురంజయుడు దురాచారుడగుట 

           జనకమహారాజు వసిష్ఠునితో "గురువర్యా! కార్తీక మహత్యం ఇంకా వినాలని ఉంది. ఈ వ్రతముము గురించి ఇంకా ఏమన్నా కథలు ఉన్నాయా వివరించండి."  వసిష్ఠులవారు విని మందహాసములో "ఓ రాజా! కార్తీక మాస మహత్యం గురించి అగస్త్యమాజమునికి, అత్రిమహామునికి జరిగిన ప్రసంగము ఒకటి ఉన్నది. దానిని వివరిస్తాను. శ్రద్ధగా విను". 

            పూర్వము ఒకపుడు అగస్యమహర్షి, అత్రిమహాముని దగరకు వచ్చి "ఓ అత్రిమహాముని! నీవు విష్ణుమూర్తి అంశతో జన్మించావు. కార్తీకమాస మహత్యం మీకు వివరంగా తెలుసు. దానిని నాకు వివరించండి" అని కోరెను. అందుకు అత్రిమహాముని "అగస్యమహర్షి! నీవు అడిగిన ప్రశ్న శ్రీమన్నారాయణుని ప్రీతికరమైనది. కార్తీకమాసంతో సమానమైన మాసం, వేదములతో సమానమైన శాస్త్రము, ఆరోగ్యముతో సమానమైన సంపద వేరొకటి లేదు. ఏ మానవుడైన కార్తీకమాసమున నదిలో స్నానము చేసినా, శివకేశవుల ఆలయములో దీపారాధన చేసినా, లేక దీపదానము చేసినా కలుగు ఫలితము అపారమైనది. దీనికి ఒక ఇతిహాసము ఉన్నది. 

               త్రేతాయుగములో పురంజయుడు సూర్యవంశపు రాజు అయోధ్య నగరమును రాజధానిగా చేసుకొని రాజ్యమేలుతున్నాడు. అతడు సకల శాస్త్రములు చదివారు. న్యాయముగా రాజ్యపాలన చేస్తున్నారు. ప్రజలకు ఇటువంటి ఆపదలు రాకుండా పాలిస్తున్నాడు. కొంతకాలానికి పురంజయుడు అమిత ధనాశ కలిగి, రాజ్యాధికార గర్వముతో జ్ఞానహీనుడై దయాదాక్షణ్యాలు లేక దేవబ్రాహ్మణ మాన్యములు లాగుకొని, పరమలోభియై, చోరులను చేరదీసి వీరిచే దొంగతనములు దోపిడీలు చేయించి దొంగలు తెచ్చిన ధనమును సగం వాటా లాకొని ప్రజలను భయభ్రాంతులను చేస్తుండేవాడు. కొంతకాలానికి అతని దౌర్జన్యం గురించి చుటుపక్కల రాజ్యాలైన కాంభోజ, టెంకణ, కొంకణ, కళింగాది రాజుల చెవులో పడింది. వారు తమలో తాము ఆలోచించుకొని కాంభోజరాజుని నాయకునిగా చేసుకొని రథ, గజ, తురగ, పదాతి సైన్య బలముతో రహస్య మార్గములో అయోధ్య నగరాన్ని ముట్టడించి, నలువైపులా శిభిరాలు నిర్మించి నగరాన్ని దిగ్భాధానం చేసి యుద్ధనికి సిద్దపడారు. 

             అయోధ్య నగరాన్ని ముట్టడించిన సంగతి చరుల ద్వారా తెలుసుకొన పురంజయుడు తనుకూడా సర్వసన్నధ్ధుడై వున్నాడు. అయినా ఎదుటి పక్షము బలముగా ఉన్న తాను బలహీనంగా ఉన్న ఏ మాత్రము భయంము చెందకుండా రధము ఎక్కి సైన్యాధిపతులను పురికొల్పి, చతురంగబల సమేతుమైన సైన్యముతో యుధ్ధాసన్నధ్ధుడై వారిని ఎదొర్కొనడానికి యుద్ధ భేరిని మోగించి, శత్రుసైన్యముతో యుద్ధం చేస్తున్నారు. 


 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...