తిరుప్పావై

పాశురము 16

    నాయగనాయ్ నిన్ఱనన్దగోపనుడైయ
    కోయిల్ కాప్పానే! కొడిత్తోన్ఱుమ్ తోరణ
    వాశల్ కాప్పానే! మణిక్కదవమ్ తాళ్ తిఱవాయ్,
    ఆయర్ శిఱుమియరో ముక్కు; అఱైపఱై
    మాయన్ మణివణ్ణన్ నెన్నలే వాయ్ నేర్ న్దాన్;
    తూయోమాయ్ వన్దోమ్, తుయలెళ పాడువాన్,
    వాయాల్ మున్న మున్నమ్ మాత్తాదే, అమ్మా! నీ,
    నేశ నిలైక్కదవమ్ నీక్కేలో రెమ్బావాయ్.

అర్ధం :-

తిరుమాళిగను రక్షించువాడా! మమ్ము లోనికి పోనిమ్ము. మేము వ్రేపల్లెలో నుండు గొల్లపిల్లలము. స్వామిని దర్శింపవచ్చాము. పరిశుద్ధులమయి వచ్చాము. మణులతో కూడిన గడియను తెరువుము. మేము స్వామికి శరణాగతి చేసినవారము. గొల్లకులమయిన పుట్టిన అజ్ఞానులమైననూ స్వామి యందత్యదిక ప్రేమానురాగములు కలవారము. స్వామికి సుప్రభాతము పాడి మేలుకొలుప వచ్చినాము. గొల్లవంశంలో పుట్టిన మాకు ఆశ్చర్య గుణ చేష్ఠితుడును. ఇంద్రనీల మణివర్ణముగల శరీరము కలవాడును అగు శ్రీకృష్ణుడు మాకు 'పఱై' అను ధ్వనించెడు వాద్యము నిత్తునని నిన్ననే వాగ్దానము చేసినాడు. ఇప్పుడనన్య ప్రయోజనులమై స్వామి నిద్రలేచునట్లుగ సుప్రభాతమును పాడగా వచ్చాము. స్వామీ! నీ నోటితో వద్దని చెప్పకుము. మమ్ములను అడ్డుకొనక ధృడముగా బంధించిన తలుపు గడియను వెంటనే తెరిచి లోనికి పోనీయమని కావలి వానిని వేడుకొంటున్నారు.




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...