తిరుప్పావై

పాశురం 6

పుళ్ళుమ్ శిలుమ్బినకాణ్ పుళ్ళరైయన్ కోయిలిల్
వైళ్లైవిళిశజ్గన్ పేరరవమ్ కేట్టిలైయో
పిళ్ళాయ్! ఎళున్దిరాయ్ పేయ్ ములైనఞ్జణ్డు
కళ్లచ్చగడమ్ కలక్కళియక్కాలోచ్చి
వెళ్లత్తరవిల్ తుయి లమర్ న్దవిత్తినై
ఉళ్ళత్తు క్కొణ్డు మునివర్ గళుమ్ యోగిగళుమ్
మెళ్ళ వెళున్దు అరియెన్ఱ పేరరవమ్
ఉళ్ళమ్ పుగున్దు కుళిర్ న్దేలో రెమ్బావాయ్


అర్ధం :-

అందరికంటె ముందుగనే మేల్కొన్నవారు, ఇంక నిద్రిస్తు  లేవకుండ ఉన్న ఒక గోపికను గమనించి 'తెల్లవారిందమ్మా! ఇక లేచిరావె!' అని లేపుతున్నారు. వేకువనే మేల్కోన్న పక్షులు ఒకరినొకరు పిలుచుకొంటూ 'మేతకు పోదాం రండర్రా!' అంటూ  కూస్తూ పోతున్నాయి. అరె! పక్షిరాజు గరుత్మంతునికి రాజైన ఆ శ్రీమన్నారాయణుని కోవెలలో మ్రోగిన శంఖధ్వనిని నీవు విన లేదా? ఓసీ! పిచ్చిపిల్లా! (భగవద్విషయము నెరుగనిదానా!) లేచి రావమ్మా! ఇదిగో పూతనస్తనముల యందున్న విషాన్ని ఆరగించినవాడు, తనను చంపటానికి వచ్చిన శకటాసురుని కీళ్ళూడునట్లు తన కాళ్లతో తన్నినవాడు అయిన ఈ శ్రీకృష్ణుడే ఆ పాల సముద్రంలో ఆదిశేషునిపై హాయిగా యోగనిద్రలో శయనించిన శ్రీమన్నారాయణడు. ఆ శ్రీమన్నారాయణుడినే యోగులు, బుషులు తమ హృదయాలలో నిల్పుకొన్నారు. అతనికి శ్రమ కలుగకుండునట్లుగ మెల్లగ 'హరీ! హరీ!  అని అతనిని స్మరిస్తూ చేసిన ధ్వని పెద్దగా ధ్వనించి మా హృదయాలను చేరి చల్లబరిచింది. వణికించింది. మేమంతా మేల్కొన్నాము. మరి నీవుమాత్రము కదలక అట్లే పడుకున్నావేమమ్మా! ఇదీ నీకు వినబడలేదా! రమ్మ! రమ్మ! మాతో ఉండి  వ్రతము చేయి.



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...