కార్తీక పురాణము 19వ రోజు

 చాతుర్మాస్య వ్రత ప్రభావనిరూపణ

                ఈ విధంగా  నైమిశారణ్యంలో ఉన్న మహామునులు అందరూ కలిసి  శ్రీహరిని స్తోత్రం చేసిన తర్వాత  జ్ఞానసిద్దుడను మహాయోగి " దీనబంధువా! వేదవైద్యుడవని, వేదవ్యాసుడవని, అద్వితీయుడవని  సూర్యచంద్రులు నేత్రములుగా కలవాడని  సర్వాంతర్యామి అని,  సర్వేజనులచే స్తుతించబడుతున్న ఓ మాధవా!  మేము ఈ సంసారా బంధం నుండి బయటపడలేక పోతున్నాము.  మమ్మల్ని రక్షించు. మానవులు ఎన్ని పురాణాలు చదివినా ఎన్ని శాస్త్రములు విన్నా నీ దర్శన భాగ్యం కలుగదు.  నీ భక్తులకు మాత్రమే నీవు  కనిపిస్తావు.  రుషికేశా!  నన్ను కాపాడు" అని మైమరిచి స్తోత్రం చేయగా.  శ్రీహరి చిరునవ్వు నవ్వి  జ్ఞానసిద్ద! ఈ స్తోత్ర వచనములకు నేను సంతోషించాను. నీకు ఏం వరం కావాలో కోరుకో". అందుచేత జ్ఞాన సిద్ధుడు శ్రీహరి! నేను సంసారబంధమునుండి విముక్తుడిని కాలేకపోతున్నాను. నా ధ్యాస ఎపుడు నీ పాద పద్మములపై ఉండేటట్లు అనుగ్రహించు. మారేది అక్కరలేదు. అలాగే జ్ఞానసిదుడా! నీ కోరిక ప్రకారమే వరమిచ్చాను. మరొక వారము కూడా ప్రసాదిస్తాను అడుగు.  ఈ లోకంలో అనేక మంది దురాచారు  బలహీనుని అనేక పాపకార్యములు చేస్తున్నారు. ఇటువంటి వారు పాపాలు పోగొట్టడానికి ఒక వ్రతమును కల్పిస్తున్నాము. ఈ వ్రతమును సర్వ జనులు ఆచరించవచ్చును. 

       నేను ఆషాఢ శుద్ధ దశమి రోజున లక్ష్మీదేవి సహితముగా పాల సముద్రములో శేషశయ్యపై పావళిస్తాను. తిరిగి కార్తీక మాసంలో శుద్ధ ద్వాదశి రోజున  నిద్ర లేస్తాను. ఈ మధ్యలో వుండే కాలానికి చాతుర్మాస్యం అని పేరు. ఈ కాలంలో చేసే వ్రతము నాకు చాలా ఇష్టమైనది. ఈ వ్రతము చేసే వారికి సకల పాపాలు నశిస్తాయి. వారు నా సన్నిధికి వస్తురు.  ఈ వ్రత మహత్యం తెలుసుకొని ఇతరులచేత కూడా ఆచరింప చేసి చేసేవారికి జన్మ, జరా, వ్యాధుల వలన కలుగు బాధలు పోతాయి. దీని నిమిత్తం ఆషాఢ శుద్ధ దశమి మొదలు శాకములను,  శ్రావణమాసం దశ మొదలు పెరుగును, భాద్రపద మాసం ప్రసన్నమగును పాలను, ఆశ్వయుజ మాసం శుద్ధ దశమి మొదలు పప్పు దినుసులను విసర్జించాలి. నా భక్తులను పరీక్షించటానికి నేనెలా శయనిస్తాను.  ఇప్పుడు నీవు పట్టించిన స్తోత్రాన్ని మూడు సంధ్యలలో భక్తితో పటిస్తే నా సన్నిధికి వస్తారు.  అని శ్రీమన్నారాయణుడు మహామునులకు బోధించే శ్రీమహాలక్ష్మి తో సహా పాల సముద్రంలోకి వెళ్లి పవళించారు.

         వశిష్టుడు జనక మహారాజుతో రాజా! ఈవిధంగా విష్ణుమూర్తి, జ్ఞానసిద్ధి మొదలైన మునులకు చాతుర్మాస్య వ్రత మహత్యం ఉపదేశించారు. నేను నీకు వివరించాను  ఈ వ్రతమును ఆచరించుటకు స్త్రీ పురుష భేదం లేదు. అన్ని జాతుల వారు చేయవచ్చు. శ్రీమన్నారాయణుని ఉపదేశం ప్రకారం ముని పుంగవులు అందరూ ఈ చాతుర్మాస్య వ్రతాన్ని ఆచరించి వైకుంఠానికి వెళ్లారు.





కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...