Bhagavad gita_adhyatmikam1

భగవద్గీత

అద్యాయం 10

శ్లోకం 30

ప్రహ్లదశ్చస్మి దైత్యానాం కలయతామహమ్ |

మృగాణాం చ మృగేంద్రో హం వైనతేయశ్చ పక్షిణామ్ ||

అర్థం :-

దైత్యులలో నేను ప్రహ్లదుడను. గణించువారిలో నేను కాలమును. మృగములలో మృగరాజు సింహమును నేను. పక్షులలో పక్షిరజైన గరుత్మంతుడను నేనే.



 

Bhagavad gita_adhyatmikam1

భగవద్గీత

అద్యాయం 10

శ్లోకం 29

అనంతశ్చస్మి నాగానాం వరుణో యదసామహమ్ |

పితౄణామర్యమా చస్మి యమః సంయమతామహమ్ ||

అర్థం :-

నాగజాతివారిలో ఆదిశేషుడను నేను. జలచరములకు అధిపతియైనవరుణుడును నేను. పితరులలో పితృగణ ప్రభువును నేను. శాసకులలో యమధర్మరాజును నేను. 




Bhagavad gita_adhyatmikam1

భగవద్గీత

అద్యాయం 10

శ్లోకం 28

ఆయుధానామహం వజ్రం ధేనూనామస్మి కామధుక్ |

ప్రజనశ్చాస్మి కందర్పః సర్పాణామస్మి వాసుకిః ||

అర్థం :-

ఆయుధములలో వజ్రయుధమును నేను. పాడి ఆవులలొ కామధేనువును నేను. శాస్త్రవిహితరీతిలో సంతానోత్పత్తికి కారణమైన మన్మథుడను నేను. సర్పములలో వాసుకిని నేను. 




Bhagavad gita_adhyatmikam1

భగవద్గీత

అద్యాయం 10

శ్లోకం 27

ఉచ్చైఃశ్రవసమశ్వానాం విద్ధి మామమృతోద్భవమ్ |

ఐరావతం గజేంద్రాణాం నరాణాం చ నరాధిపమ్ ||

అర్థం :-

అశ్వములలో ఉచ్చైశ్రవమును నేను. భద్రగజములలో ఐరవతమును నేను. మనుష్యులలో ప్రభువును నేను. 



Bhagavad gita_adhyatmikam1

భగవద్గీత

అద్యాయం 10

శ్లోకం 26

అశ్వత్థః సర్వవృక్షాణాం దేవర్షీణాం చ నారదః |

గంధర్వాణాం చిత్రరథః సిద్ధానాం కపిలో మునిః ||

ర్థం :-

వృక్షములలో నేను అశ్వత్థమును (రావిచెట్టును). దేవర్షులలో నారదుడను నేను. గంధర్వులలో నేను చిత్రరథుడను. సిద్దులలో నేను కపిలమునిని.



Bhagavad gita_adhyatmikam1

భగవద్గీత

అద్యాయం 10

శ్లోకం 25

మహర్షీణాం భృగురహం గిరామస్మ్యేకమక్షరమ్ |

యజ్ఞానాం జపయజ్ఞో స్మి స్థావరాణాం హిమాలయః ||

అర్థం :-

మహర్షులలో భృగువును నేను. శభ్దములలో ఏకాక్షరమును అనగా ఓంకారమును నేను. యజ్ఞములయందు జపయజ్ఞమును నేను. స్థావరములలో హిమాలయమును నేను.




Bhagavad gita_adhyatmikam1

 భగవద్గీత

అద్యాయం 10

శ్లోకం 24

పురోధసాం చ ముఖ్యం మాం విద్ధి పార్థ బృహస్పతిమ్ |

సేనానీనామహం స్కందః సరసామస్మి సాగరః ||

అర్థం :-

పార్థా! పురోహితులలో ముఖ్యుడైన బృహస్పతిని నేనే. సేనాపతులలో కుమారస్వామిని నేను. జలాశయములలో నేను సాగరుడను.




Bhagavad gita_adhyatmikam1

 భగవద్గీత

అద్యాయం 10

శ్లోకం 23

రుద్రాణాం శకరశ్చాస్మి విత్తేశో యక్షరక్షసామ్ |

వసూనాం పావకశ్చాస్మి మేరుః శిఖరిణామహమ్ ||

అర్థం :-

ఏకాదశ రుద్రులలో శంకరుడు నేను. యక్షరాక్షసులలో ధనాధిపతియైన కుబేరుడను నేను. అష్టవసువులలో అగ్నిని నేను. పర్వతములలో 'సుమేరు' పర్వతమును నేను.




Bhagavad gita_adhyatmikam1

 భగవద్గీత

అద్యాయం 10

శ్లోకం 22

వేదానాం సామవేదో స్మి దేవానామస్మివాసవః |

ఇంద్రియాణాం మనశ్చస్మి భూతానామస్మి చేతనా ||

అర్థం :-

వేదములలో నేను సామవేదమును. దేవతలలో ఇంద్రుడను నేనే. ఇంద్రియములలో నేను మనస్సును. ప్రాణులలో చైతన్యమును నేను.





పరమాత్మతో గోపాలబాలురి భోజనం

పరమాత్మతో గోపాలబాలురి భోజనం


ఇక్కడ వ్యాసభగవానుడు, పోతనగారు గోపాల బాలురు తిన్న చద్దాన్నని అంతగా వివరించటానికి కారణం పరమాత్మ స్వరూపుడైన శ్రీ కృష్ణ భగవానుడితో గోపాలబాలురు తినటమే. శ్రీమహా విష్ణువు కేవలం యజ్ఞయాగాది క్రతువులతో వేదమంత్రాలతో హవిస్సులను పవిత్రంగా ఇస్తేనే స్వీకరిస్తారు. అటువంటిది ఇప్పుడు గోపాలబాలురతో చద్దన్నం తింటున్నారు కనుక అది అమృత భోజనం అయింది. పరమాత్మతో భోజనం తినే గోపాలబాలురు ఎంత అదృష్టవంతులో కదా! గర్గసంహితలో ఈ గోపాలబాలురు మూడు కోట్ల సంవత్సరాలు భాగవతం విన్నారు. అందుకనే వీరికి శ్రీకృష్ణుడితో కలిసి తినే, ఆడుకొనే, కలిసి తిరిగే అదృష్టం కలిగింది.

గోపాల బాలురు అఘాసురుడు చనిపోయిన ప్రదేశము నుంచి కొంచం ముందుకు నడుచుకుంటూ వెళ్లరు. అక్కడ ఒక చెరువు ఉంది. శ్రీ కృష్ణుడు గోపాలబాలురతో స్నేహితులారా! మనం ఇక్కడే భోజనం చేద్దాము. ఎందుకంటే ఇక్కడ దూడలకు నీరు తాగటానికి నీరు ఉన్నాయి. మనం భోజనం చేయటానికి నీడ ఉన్నది. మనం ఇక్కడే భోజనం చేసి విశ్రాంతి తీసుకుందాము అని అన్నారు. గోపాలబాలురు సరే అన్నారు. అప్పుడు గోపాలబాలురు అందరూ శ్రీకృష్ణుడు మాకు ఎదురుగా కూర్చోవాలి అని కోరారు. శ్రీ కృష్ణుడిని మధ్యలో కూర్చోపెట్టి గోపాలబాలురు చుట్టూ కూర్చున్నారు. గోపాలబాలురు కొంతమంది చద్దన్నంలో మీగడగడ్డపెరుగు వేసుకొని అందులో ఆవకాయ, మాగాయ, గోంగూర ఇలా రకరకాల పచ్చడులు వేసుకొని వచ్చారు. కొందరు లడ్డులు, తీపి పదార్ధములు తీసుకొచ్చారు. కొందరు గోపాలబాలురు అరె మనం ఎవరు తెచ్చిన భోజనం వాళ్ళు తింటే ఎలాగా అందరము భోజనాన్ని ఒకచోట పెట్టి అందరము తిందాము అన్నారు. అందరూ సరే అన్నారు. గోపాలబాలురు తామరాకులు, గడ్డిపరకలు, తామరరేఖలు పరిచి ఒకచోట పెరుగన్నని, ఇంకోచోట ఆవకాయ పచ్చడిని, ఇంకోచోట మాగాయి పచ్చడిని, ఇంకోచోట గోంగూర పచ్చడిని వేసి ఇంకోచోట తీపి పదార్ధములు,వేసి అందరూ వరుసలో కూర్చొని అన్ని పదార్ధాలను వడ్డించుకొని తినసాగారు. ఇంకా శ్రీకృష్ణుడు గోపాలబాలురా మధ్యలో కూర్చున్నారు. అయన నీలిమేగా చాయగా ఉన్నారు. అయన చేతులు, అరికాళ్ళు పాదములు,అయన పెదవులు లేత ఎరుపు రంగులో ఉన్నాయి. అయన దూడలను కొట్టటానికి ఒక వెదురు కర్రకు బంగారు పూత పూసిన కర్రను చంకలో పెట్టుకున్నారు. శ్రీకృష్ణుడు చేతి వేళ్ళ మధ్యలో మాగాయి ముక్కలు, ఆవకాయ ముక్కలు పెట్టుకొని గోంగూర పచ్చడి నంచుకుని మీగడగడ్డపెరుగు చద్దన్నం తింటున్నారు. ఇలా తింటున్నపుడు అక్కడే వదిలిన లేగ దూడలు కనిపించలేదు. తింటున్న శ్రీకృష్ణుడు గోపాలబాలుర మీరు తింటూ ఉండండి నేను వెళ్లి దూడలను వెతికి తీసుకువస్తాను అని చేపి శ్రీకృష్ణుడు వెదురు కర్రను తీసుకొని బయలుదేరారు. 

శ్రీ కృష్ణ - అఘాసుర వధ

Bhagavad gita_adhyatmikam1

 భగవద్గీత

అద్యాయం 10

శ్లోకం 21

ఆదిత్యానామహం విష్ణుః జ్యోతిషాం రవిరంశుమాన్ |

మరీచిర్మరుతామస్మి వక్షత్రాణామహం శశీ ||

అర్థం :-

అదితియొక్క ద్వాదశపుత్రులైన ఆదిత్యులలో విషుఃవును నేను జ్యోతిర్మయ స్వరూపులలో నేనౌ సూర్యుడను. 49 మంది వాయుదేవతలలోని 'తేజము' నేను. నక్షత్రాధిపతియైన చంద్రుడను నేను.



Bhagavad gita_adhyatmikam1

 భగవద్గీత

అద్యాయం 10

శ్లోకం 20

అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థితః |

అహమాదిశ్చ మధ్యం చ భూతానామంత ఏవ చ ||

అర్థం :-

ఓ అర్జునా! సమస్తప్రాణుల హృదయములయందున్న ఆత్మను నేనే. సకల భూతముల ఆదియు, మద్యస్థితియు, అంతము నేనే.




Bhagavad gita_adhyatmikam1

 భగవద్గీత

అద్యాయం 10

శ్లోకం 19

శ్రీ భగవాన్ ఉవాచ

హంత తే కథయిష్యామి దివ్యా హ్యాత్మవిభూతయః |

ప్రాధాన్యతః కురుశ్రేష్ఠ నాస్త్యంతో విస్తరస్య మే ||

అర్థం :-

శ్రీ భగవానుడు పలికెను:- ఓ అర్జునా! నీవు లెస్సగా పలికితివి. నా దివ్యవిభూతుల విస్తృతికి అంతమే లేదు. వాటిలో ప్రధానమైనవాటిని కొన్నింటిని మాత్రము నీకు తెలుపుచున్నాను.



బోగి పండుగా విశిష్టత

ఈ బోగి పండుగ రోజు తెల్లవారుజామునే నిద్ర లేచి బోగి మంటలలో ఈ ధనుర్మాసం నెలరోజుల పాటు ముగ్గులతో పెట్టిన గొబెమ్మలను గొబెమ్మ మీద పెట్టిన పూవులతో సహా పిడకలు తాయారు చేసి దందాగా గుచ్చి బోగి మంటలలో చేస్తారు. పేదలు ఎలా చేయటం వలన వాతావరణంలో ఉన్న సూక్ష్మక్రిములు చనిపోయి చుట్టూ ఉన్న వాతావరణం శుద్ధి అవుతుంది అంటారు. పేదలు మనకు అందులో వీటిని అలవాటు చేసారు. సూర్యుడు ఈ రోజు నుంచి దక్షిణాయనం నుంచి ఉత్తయానానికి ప్రయాణం మొదలు పెడతారు. అందుకే బోగి మంటలు వేసి సూర్యునికి స్వాగతం పలుకుతారు. ఈ రోజు అందరూ అబ్యగానా స్నానం(ఒంటికి నువ్వులనూనె రాసుకొని కుంకుడికాయలతో స్నానం) చేస్తారు. ఈ రోజు సూర్య భగవానుడిని ఆరాధిస్తారు. ఈ రోజు పరమాన్నం నైవేద్యం చేస్తారు. ఈ రోజు పిండి వంటలు చేస్తారు. పేరంటాలు, బొమ్మల కొలువులు చేస్తారు. ఈ రోజు సాయంత్రం చిన్న పిల్లలకు బోగి పండ్లు పోస్తారు.ఆ బోగి పండ్లలలో రేగిపండ్లు(సూర్య భగవానుడి ప్రతీకగా చెపుతారు), చెరుకు ముక్కలు, పువ్వులు రూపాయి బిళ్ళలు కలిపి బోగి పండ్లు తాయారు చేస్తారు.


మీకు మీ కుటుంబ సభ్యులకు బోగి పండుగా శుభాకాంక్షలు 


గోదా దేవి కళ్యాణం

గోదా దేవి కళ్యాణం



విల్లి పుత్తూరు అనే గ్రామంలో ఒకరోజు గరుత్మంతుని అంశ ఐనా భాటనాధులు(పెరియాళ్వార్) పూల తోటలో స్వామి కోసం పువ్వులు కోసి తులసి వనంలోకి వెళ్లి తులసి మొక్కలను నాటడానికి అని భూమిని తవ్వుతుంటే గోదా దేవి అయోనిజగా దొరికింది. పెరియాళ్వార్ ఆయనకు ఏది దొరికిన స్వామి వారికీ అర్పించటం అలవాటు. ఆ ఆడపిల్లను తీసుకెళ్లి స్వామి వారి పాదాలవద్ద తీసుకొచ్చి పెట్టారు. అపుడు ఆ ఆలయంలో విష్ణుమూర్తి అశరీరవాణి వినిపించింది. పెరియాళ్వార్ ఈమె భూదేవి అంశ ఈమెని తీసుకెళ్లి నీ కన్నా కూతురిలాగా పెంచుకో అని చెప్పింది. పెరియాళ్వార్ ఆ పాపను తీసుకొని తన భార్యకు వెళ్లి ఇచ్చారు. ఆ పాపకు గోదా దేవి అని పేరు పెట్టి అల్లారు ముందుగా పెంచుకుంటున్నారు. ఆమెకు ప్రతిరోజు  శ్రీ కృష్ణ భగవాన్ కధలు, విష్ణుమూర్తి కధలు చెప్పేవారు. ఆ కధలు వింటూ పెరిగిన గోదా దేవి విష్ణుమూర్తిని వివాహం చేసుకోవాలన్నీ నిర్ణయించుకుంది. పెరియాళ్వార్ రోజు స్వామి కోసం పువ్వులు కోసి గోదాదేవికి ఇచ్చేవారు. గోదాదేవి వాటిని స్వామికి మాలలు కట్టేది. కొన్ని రోజులకి విష్ణుమూర్తికి కట్టే పూల మాలలను ఆమె వేసుకొని బావిలోనో, నీటిలోనో చూసుకొని మళ్ళి వాటిని యధావిధిగా స్వామి కోసం మాలలు తీసుకువెళ్లే బుట్టలో పేటేసేది. వీటినే పెరియాళ్వార్ స్వామి వారి ఆలయానికి స్వామి అలంకరణ కోసం ఇచ్చేవారు. అర్చకులు ఆ పూలమాలలను చూసి ఆశ్చర్యపోయారు. అందుకేంటే అవి రోజు కన్నా సువాసన వస్తున్నాయి. ఆ దివ్య పరిమళానికి సంతోషంతో స్వామివారికి అలంకరణ చేసేవారు. కొన్ని రోజులకి అర్చకులు ఆ పువ్వులకు అంత సువాసన ఎలావస్తుంది అని పరీక్షించి చూసేసరికి అందులో ఒక వెంట్రుక ఉంటుంది. ఆ వెంట్రుకను పరీక్షించు చూడగా అది ఒక స్త్రీ వెంట్రుక అని తెలిసింది. ఆలయ అర్చకులు పెరియాళ్వార్ వారికీ పిలిచి ఇది సంగతి అని  చెప్పారు. పెరియాళ్వార్ బాధపడి ఇంటికి ఆ రోజు పువ్వులను తిరిగి తీసుకొచ్చేసారు. తరువాత రోజు పరీక్షించగా ఆ పువ్వులను తన కూతురు గోదాదేవిని అలంకరించుకుంటుంది అని తెలుసుకొని బాధపడి గోదాదేవి దగరకు వెళ్లి అమ్మ గోదాదేవి ఎంత పని చేశావమ్మా స్వామి వారికీ నువ్వు అలాంకరించుకొని స్వామి వారికీ సమర్పిస్తున్నావు. అది అంత పాపమూ అమ్మ ఇప్పుడు స్వామి వారికీ ఎంత కోపం వస్తుందో అని భయపడరు. తన తండ్రికి తన వల్ల భాధ కలిగింది అని గోదా దేవి బాధపడింది. ఆ రోజు రాత్రి పెరియాళ్వార్ వారి కలలో విష్ణుమూర్తి కనిపించి పెరియాళ్వార్ నాకు గోదాదేవి వేసికొని తీసిన మాలలు అంటే చాల ఇష్టం వాటిని నాకు తీసుకొచ్చి సమర్పించు అని చెప్పారు. అందుకు పెరియాళ్వార్ స్వామి నాకు మాత్రమే కాదు ఆలయ అర్చకులతో కూడా చెప్పండి స్వామి అని వేడుకున్నారు. విష్ణుమూర్తి ఆ ఆలయ అర్చకుల కలలో కూడా కనిపించి చెప్పారు. ఆరోజు నుంచి పెరియాళ్వార్ గోదా దేవి వేసుకొని తీసిన పూల మాలను స్వామి వారికీ సమర్పించేవారు. అప్పటి నుంచి గోదా దేవికి ఆముక్తమాల్యద అని పేరు వచ్చింది. గోదా దేవి స్వామి మీద భక్తితో పాశురాలను రచించింది.  గోదా దేవి పెరిగి యుక్తి వయస్సు వచ్చింది. గోదా దేవి తండ్రి గోదా దేవి దగరకు వచ్చి నీకు వివాహ వయస్సు వచ్చింది అని నీకు ఎవరు ఇష్టం చెప్పు వారికీ ఇచ్చి వివాహం చేస్తాను అని చెప్పారు. అందుకు గోదా దేవి నాన్న నాకు చిన్నపాటి నుంచి విష్ణుమూర్తిని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాను.



అమ్మ గోదా దేవి శ్రీ మహా విష్ణువు అవతారాలు మొత్తం 108 ఉన్నాయమ్మా అని చెప్పారు. ఆ అవతార విశేషాలు చెపుతుంటే స్వయంగా శ్రీమహావిష్ణువే వచ్చి పెరియాళ్వార్ ఏ అవతార విశేషం చెపితే ఆ అవతారంలో గోదా దేవికి కనిపించరు. గోదా దేవి ఆ అవతార విశేషాలు విని నాన్న నాకు శ్రీరంగంలో ఉన్న శ్రీరంగానాధ స్వామి స్వరూపం నచ్చింది. నేను ఆయననే వివాహం చేసుకుంటాను అని గోదా దేవి చెపింది. పెరియాళ్వార్ శ్రీరంగనాథున్ని విన్నవించుకున్నారు. శ్రీరంగనాధ స్వామి సమయం వచ్చినపుడు నేను కబురు పంపించి వివాహం చేసుకుంటాను అని చెప్పారు. కొన్ని రోజులకి గోదా దేవి దగ్గరకు స్వామి వారి వచ్చి ఆమెకు బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించారు. శ్రీరంగనాథుడు ఆ దేశా రాజైన పాండ్య రాజు కలలో కనిపించి నేను విల్లి పుత్తూరులో గోదా దేవిని నేను వరించాను. ఆమెను తీసుకువచ్చి నాకుతో వివాహం జరిపించు ఆమెను తీసుకురావటానికి బంగారు పల్లకి పంపించు అని చేపి వెళ్లిపోయారు. పాండ్య రాజు సంతోషానికి అవధులు లేవు. సాక్షాత్తు భగవంతునికే వివాహం జరిపించే అవకాశం వచ్చింది అని సంతోషించారు. వెంటనే గోదాదేవి కోసం బంగారు పల్లకీ పంపించారు.  గోదా దేవి పెళ్లి కూతురిగా అలంకరించటానికి చెల్లికట్లను, బంగారు ఆభరణాలను, పట్టు వస్త్రాలను పంపించారు. గోదా దేవిని పెళ్లి కూతురుగా అలంకరించి బంగారు పల్లకిలో శ్రీరంగానికి తీసుకువచ్చారు. గోదాదేవి ఆ ఆలయానికి వచ్చే సరికి చీకటి పడుతుంది. మరుసటి రోజు గోదాదేవికి శ్రీరంగనాధ స్వామి ఉత్సవిగ్రహానికి వివాహం చేసారు. వివాహం జరిగిన తరువాత గోదాదేవి స్వామి వారి గర్భగుడిలోకి వెళ్లి స్వామి వారికీ హారతి ఇచ్చి స్వామి వారికీ ప్రదక్షణలు చేసి అందరూ చూస్తుండగా శ్రీరంగనాధ స్వామి పాదాల దగ్గర కూర్చొని స్వామిలో అదృశ్యమైపోయింది. అలా గోదా దేవి కళ్యాణం జరిగింది. గోదా దేవి కళ్యాణం అంటే ఆత్మ, పరమాత్మ తో కలిసి మోక్షం పొందటం. గోదా దేవి పాశురాలు అన్ని కూడా స్వామిని ఎల్లా పూజించాలి. ఎలా స్వామిని చేరుకోవాలో వివరిస్తుంది. 


గోదాదేవి పాశురాలు

తరువాత కాలంలో గోదాదేవి పాశురాములు యమణాచార్యులవారు ప్రాచుర్యములయంలోకి తీసుకువచ్చారు. అయన శ్రీవైష్ణవంను ప్రసిద్ధిలోకి తీసుకొచ్చారు. బ్రహ్మ సూత్రాలకు భాష్యం రాసారు. 

Bhagavad gita_adhyatmikam1

భగవద్గీత

అద్యాయం 10

శ్లోకం 18

విస్తరేణాత్మనో యోగం విభూతిం చ జనార్దన |

భూయః కథయ తృప్తిర్హి శృణ్వతో నాస్తి మృతమ్ ||

అర్థం :-

ఓ జనార్దనా! నీ యోగశక్తిని గూర్చియు, నీ విభూతి వైభవములను గురించి విస్తృతముగా ఇంకను తెలుపుము. ఏలనన, నీ అమృతమయ వచనములను ఎంతగా విన్నను తనివియే తీరదు.


 


వైకుంఠ (ముక్కోటి) ఏకాదశి విశిష్టత

 వైకుంఠ (ముక్కోటి) ఏకాదశి విశిష్టత



ఒకసారి సనకనానందనాదులు భూలోకం తీర్ధయాత్రలు చెందామని వస్తారు. కొంతకాలం భూలోకంలో తీర్ధయాత్రలు చేసి తిరిగి వైకుంఠానికి వెళ్లరు. శ్రీమహా విష్ణువుని దర్శనం చేసుకొని ఇలా అడిగారు. "స్వామి! మేము భూలోకంలో తీర్ధయాత్రలు చేస్తున్నపుడు భూలోకములో మానవులందరు చాలా భాధలు అనుభవిస్తున్నారు. వారికీ భాదలు తీరే మార్గం చూపించండి" అని కోరుకున్నారు. అప్పుడు శ్రీమహావిష్ణువు చిరునవ్వు నవ్వి " సనకసనందనాదులారా! వైకుంఠానికి నాలుగు ద్వారములు ఉన్నాయి. తూర్పు ద్వారం నుంచి దేవతల రక్షణకి వెళతాను. పశ్చిమ ద్వారము నుంచి రాక్షసులను వధించటానికి వెళతాను. దక్షిణాయనంలో భూలోకములో ఆషాఢమాసంలో శుక్లపక్షంలో ఏకాదశినాడు దక్షిణ ద్వారము నుంచి వచ్చి మానవులను రక్షించి మళ్ళి తిరిగి వైకుంఠానికి వెళ్లి యోగ నిద్రలోకి వెళతాను. మళ్ళి తిరిగి వైకుంఠ ఏకాదశినాడు ఉత్తర ద్వారం గుండా బయటకు వచ్చి మానవులను రక్షిస్తాను. ఆ సమయంలో నేను యోగ శక్తితో ఉంటాను. ఈ వైకుంఠ ఏకాదశి నాడు ముకోటి దేవతలు, ఋషులు వచ్చి నన్ను దర్శించుకుంటారు. వెంకటాచలం, సోనాచలం, సింహాచలం, సహ్యపర్వతం, అహోబిలం, గరుడాద్రి వంటి ముఖ్యమైన నేను వెలసిన క్షేత్రాలలో ఉత్తర ద్వారం గుండా బయటకు వచ్చి దర్శనం ఇస్తాను. నన్ను దర్శించుకున్న మానవులకి భాదలు పోతాయి. తెలిసి తెలియక చేసిన పాపాలు తొలగిపోతాయి. వైకుంఠ ఏకాదశి రోజునే సముద్ర మషాణంలో హాలాహలం పుట్టింది. ఈ వైకుంఠ ఏకాదశి రోజునే అమృతం పుట్టింది. సంవత్సరానికి మొత్తం 24  ఏకాదశులు ఉన్నాయి. ఈ ఏకాదశులలో వైకుంఠ ఏకాదశి రోజున ఏకాదశ వ్రతం చేసిన వారికీ వైకుంఠ ప్రాప్తి లభిస్తుంది. ఈ వైకుంఠ ఏకాదశి నాకు నా దర్శనానికి నియమాలు ఉన్నాయి. వైకుంఠ ఏకాదశి నాకు బ్రాహ్మముహూర్తంలో(తెలవారిక ముందే) చల్లని నీటితో తల స్నానం చేసి నా నామస్మరణ చేయాలి. నా దర్శనం అయేంతవరకు ఉపవాసం ఉండాలి. ప్రతి ఏకాదశి నాడు ఉపవాసం ఉండలేక పోయిన ఈ వైకుంఠ ఏకాదశి నాడు ఉపవాసం ఉండి జాగరణ చేసి ద్వాదశి నాడు పండితునికి స్వయంపాకం లేచి ఉపవాసమును విరముంచాలి. ఇలా సంవత్సరంలో ఉన్నా 24 ఏకాదశి నాడు ఏకాదశి వ్రతం ఆచరించిన వారికీ శాశ్వత వైకుంఠ ప్రాప్తి లభిస్తుంది" అని శ్రీ మహా విష్ణుమూర్తి సనక సనందనాదులతో చెప్పారు. ఈ ఏకాదశి వ్రతముల వల్లనే అంబరీషుడు ప్రసిద్ధి చెందారు. పూర్వం రుక్మాంగదుడు అనే మహారాజు ఉండేవారు. అయన పరమవిష్ణు భక్తుడు. ఏకాదశి వ్రతం క్రమం తప్పకుండా చేసేవారు. ఒకసారి మోహిని అనే ఆవిడా రుక్మగదుడిని నాశనం వచ్చింది. మహారాజ నాకు ఒక వరం ప్రసాదించండి అని అడిగింది. మహరాజ నువ్వు ఏకాదశి ఉపవాసం మానేస్తావా లేక నీ కుమారుడిని చంపేస్తావా అని అడిగింది. అపుడు మహారాజు మోహిని నీకు మాట ఇచ్చాను కాబ్బటి నేను ఏకాదశి వ్రతం మానను కానీ నా కుమారుడిని చంపేస్తాను అని చేపి కత్తి ఎత్తారు. వెంటనే వైకుంఠము నుంచి విమానం వచ్చింది. విష్ణు దూతలు విమానం నుంచి దిగి రుక్మాగదుడిని అతని కుమారుడిని సశరీరంగా వైకుంఠానికి తీసుకొని వెళ్లారు. భీముడు ఒకసారి బదరి క్షాత్రానికి వెళ్లరు. నరనారాయణులు దర్శనం చేసుకున్నారు. అప్పుడు నరనారాయణులు భూమిడితో నువ్వు వెంటనే కేదారినాధకు వెళ్ళు అని చెప్పారు. భుముడు కేదారినాధ్ వెళ్లేసరికి వైకుంఠ ఏకాదశి వచ్చింది. శివుడిని దర్శనం చేసుకున్నారు. శివుడు భీమునికి దర్శనం ఇచ్చి సరియైన సమయానికి వచ్చావు నువ్వు ఈ రోజు వైకుంఠ ఏకాదశి నువ్వు ఉపవాసం ఉండు అనిచెప్పారు. అప్పుడు భీముడు స్వామి నేను ఆకలికి తట్టుకొనే నాకు ఇతర మార్గం ఏదైనా ఉంటె చెప్పండి అని అడిగారు. అప్పుడు శివుడు భీమా నువ్వు పూర్తిగా ఉండలేక పోతే పాలు,పళ్ళు, ఉప్పుడు తీసుకొని ఉండవచ్చు అని చెప్పారు. భీముడు శివుడు చేపినట్టుగానే తెలవారుజామునే నిద్ర లేచి విష్ణుమూర్తి నామ జపం చేసారు. ఏకాదశి వ్రతం పూర్తయిన వెంటనే బదరినారాయణుడు దర్శనం ఇచ్చారు. నివ్వు తదనంతరం వైకుంఠానికి చేరుకుంటావు అని వరం ఇచ్చారు. భీముడు కేదారినాధ్ లో ఏకాదశి వ్రతం చేస్తే బదరి నారాయణుడు దర్శనం ఇచ్చారు. దీనిని భక్తి శివకేశవులకు బేధం లేదుగాని తెలియచేసారు. ఈ వైకుంఠ ఏకాదశి బంగారం దానం చేసిన వారికీ వెయ్యి రేట్లు ఫలితం వస్తుంది అని చెప్పారు. ఈ వైకుంఠ ఏకాదశి నాడు శ్రీ హరి నామస్మరణా, గానం, కీర్తనం అంటే చాలా ఇష్టం అందుకే ఈ రోజు భక్తులు శ్రీ మహా విష్ణువు పురాణం వినటం, చదవటం, శ్రీ మహా విష్ణువు పాటలు పాడుకోవటం చేయాలి.


Bhagavad gita_adhyatmikam1

 భగవద్గీత

అద్యాయం 10

శ్లోకం 17

కథం విద్యా మహం యోగిన్ త్వాం సదా పరిచింతయన్ |

కేషు కేషు చ భావేషు చింత్యో సి భగవన్ మయా ||

అర్థం :-

ఓ యోగీశ్వరా! నిరంతరము చింతనచేయుచూ నిన్ను ఏవిధముగా తెలిసికొగలను? హే భగవాన్! ఏయేభావములతో నాద్వారా చింతన చేయదగిన వాడవు? నిన్ను నేను ఎల్లా చింతన చేయలి?




Bhagavad gita_adhyatmikam1

 భగవద్గీత

అద్యాయం 10

శ్లోకం 16

వక్తుమర్హస్యశేషేణ దివ్యా హ్యాత్మ విభూతయః |

యాభిర్విభూతిభిర్లోకాన్ ఇమాం స్త్వం వ్యాప్య తిష్ఠసి ||

అర్థం :-

సమస్త లోకములయందును నీ దివ్యవిభూతులద్వారా వ్యాపించి, స్థితుడవైయున్నావు. మహామహితములైన ఆ దివ్యవిభూతులను సంపూర్ణముగా తెల్పుటకు నీవే సమర్థుడవు.





Bhagavad gita_adhyatmikam1

భగవద్గీత

అద్యాయం 10

శ్లోకం 15

స్వయమేవాత్మనాత్మనం వేత్థ త్వం పురుషోత్తమ |

భూతభావన భూతేశ దేవదేవ జగత్పతే ||

అర్థం :-

ఓ జగదుత్పత్తికారకా! ఓ సర్వభూతేశ! ఓ జగన్నాథా! ఓ పురుషోత్తమా! నీ తత్త్వమును నీవే స్వయముగా ఎరుంగుదువు. 




Bhagavad gita_adhyatmikam1

భగవద్గీత 
అద్యాయం 10

శ్లోకం 14

సర్వమేతదృతం మన్యే యన్మాం వదసి కేశవ |

నహి తే భగవన్ వ్యక్తిం విదుర్దేవా న దావవాః ||

అర్థం :-

ఓ కేశవా! నీవు చెప్పునది అంతయునుసత్యమే. హే భగవన్! నీ లీలా మయస్వరూపమును దేవతలు గాని దానవులు గాని తెలిసికొనజాలరు.




Bhagavad gita_adhyatmikam1

భగవద్గీత 
అధ్యాయం 10
శ్లోకం 13
ఆహుస్త్వామ్   ఋషయః సర్వే దేవర్షిర్నారదస్తథా |
అసితో  దేవలో  వ్యాసః స్వయం చైవ బ్రవీషి  మే ||
అర్థం :-
 దేవర్షి నారదుడ, అసితుడు,  దేవలుడు,  వ్యాసమహర్షియు  స్తుతింతురు. నీవును నాకు ఆ విధముగానే  తెలుపుచున్నావు. 


Bhagavad gita_adhyatmikam1

 భగవద్గీత 

అద్యాయం 10

శ్లోకం 12

ఆర్జున ఉవాచ

పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవన్ |

పురుషం శాశ్వతం దివ్యమ్ ఆదిదేవమజం విభుమ్||

అర్థం :-

అర్జునుడు పలికెను :- నీవు పరబ్రహ్మవు. పరంధాముడవు. పరమపవిత్రుడవు. మహర్షులునిన్ను సనాతనుడవనియు, దివ్యపురుషుడవనియు, దేవదేవుడవనియు, జన్మరహితుడవనియు, సర్వవ్యాపివనియు ప్రస్తుతింతురు.



Bhagavad gita_adhyatmikam1

 భగవద్గీత 

అద్యాయం 10

శ్లోకం 11

తేషామేవానుకంపార్థమ్ అహమజ్ఞానజం తమః |

నాశయామ్యాత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వతా ||

అర్థం :-

ఓ ఆర్జున! వారి యంతఃకరణములయందు స్థితుడనైయున్న నేను వారిని అనుగ్రహించుటకై తేజోమయమైన తత్త్వజ్ఞానరూప దీపమును వెలిగించి, వారి అజ్ఞానాంధకారమును పారద్రోలుతాను.



Bhagavad gita_adhyatmikam1

భగవద్గీత 

అద్యాయం 10

శ్లోకం 10

తేషాం సతతయుక్తానాం భజతాంప్రీతిపూర్వకమ్ |

దదామి బుద్ధియోగం తం యేన మాముపయాంతి తే||

అర్థం :- 

వారు సంతతము నాయందే రమించుచుందురు. అట్లు నిరంతరము ధ్యానాదులద్వారా నాయందే లగ్నమనస్కులై భక్తిశ్రద్ధలతో నన్నే భజించువారికి నేను బుద్ధియోగమును అనగా తత్త్వజ్ఞానరూప యోగమును ప్రసాదించెదను. దాని ద్వారా వారు నన్నే పొందుతారు.



         

        


 

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...