గోదా దేవి కళ్యాణం

గోదా దేవి కళ్యాణం



విల్లి పుత్తూరు అనే గ్రామంలో ఒకరోజు గరుత్మంతుని అంశ ఐనా భాటనాధులు(పెరియాళ్వార్) పూల తోటలో స్వామి కోసం పువ్వులు కోసి తులసి వనంలోకి వెళ్లి తులసి మొక్కలను నాటడానికి అని భూమిని తవ్వుతుంటే గోదా దేవి అయోనిజగా దొరికింది. పెరియాళ్వార్ ఆయనకు ఏది దొరికిన స్వామి వారికీ అర్పించటం అలవాటు. ఆ ఆడపిల్లను తీసుకెళ్లి స్వామి వారి పాదాలవద్ద తీసుకొచ్చి పెట్టారు. అపుడు ఆ ఆలయంలో విష్ణుమూర్తి అశరీరవాణి వినిపించింది. పెరియాళ్వార్ ఈమె భూదేవి అంశ ఈమెని తీసుకెళ్లి నీ కన్నా కూతురిలాగా పెంచుకో అని చెప్పింది. పెరియాళ్వార్ ఆ పాపను తీసుకొని తన భార్యకు వెళ్లి ఇచ్చారు. ఆ పాపకు గోదా దేవి అని పేరు పెట్టి అల్లారు ముందుగా పెంచుకుంటున్నారు. ఆమెకు ప్రతిరోజు  శ్రీ కృష్ణ భగవాన్ కధలు, విష్ణుమూర్తి కధలు చెప్పేవారు. ఆ కధలు వింటూ పెరిగిన గోదా దేవి విష్ణుమూర్తిని వివాహం చేసుకోవాలన్నీ నిర్ణయించుకుంది. పెరియాళ్వార్ రోజు స్వామి కోసం పువ్వులు కోసి గోదాదేవికి ఇచ్చేవారు. గోదాదేవి వాటిని స్వామికి మాలలు కట్టేది. కొన్ని రోజులకి విష్ణుమూర్తికి కట్టే పూల మాలలను ఆమె వేసుకొని బావిలోనో, నీటిలోనో చూసుకొని మళ్ళి వాటిని యధావిధిగా స్వామి కోసం మాలలు తీసుకువెళ్లే బుట్టలో పేటేసేది. వీటినే పెరియాళ్వార్ స్వామి వారి ఆలయానికి స్వామి అలంకరణ కోసం ఇచ్చేవారు. అర్చకులు ఆ పూలమాలలను చూసి ఆశ్చర్యపోయారు. అందుకేంటే అవి రోజు కన్నా సువాసన వస్తున్నాయి. ఆ దివ్య పరిమళానికి సంతోషంతో స్వామివారికి అలంకరణ చేసేవారు. కొన్ని రోజులకి అర్చకులు ఆ పువ్వులకు అంత సువాసన ఎలావస్తుంది అని పరీక్షించి చూసేసరికి అందులో ఒక వెంట్రుక ఉంటుంది. ఆ వెంట్రుకను పరీక్షించు చూడగా అది ఒక స్త్రీ వెంట్రుక అని తెలిసింది. ఆలయ అర్చకులు పెరియాళ్వార్ వారికీ పిలిచి ఇది సంగతి అని  చెప్పారు. పెరియాళ్వార్ బాధపడి ఇంటికి ఆ రోజు పువ్వులను తిరిగి తీసుకొచ్చేసారు. తరువాత రోజు పరీక్షించగా ఆ పువ్వులను తన కూతురు గోదాదేవిని అలంకరించుకుంటుంది అని తెలుసుకొని బాధపడి గోదాదేవి దగరకు వెళ్లి అమ్మ గోదాదేవి ఎంత పని చేశావమ్మా స్వామి వారికీ నువ్వు అలాంకరించుకొని స్వామి వారికీ సమర్పిస్తున్నావు. అది అంత పాపమూ అమ్మ ఇప్పుడు స్వామి వారికీ ఎంత కోపం వస్తుందో అని భయపడరు. తన తండ్రికి తన వల్ల భాధ కలిగింది అని గోదా దేవి బాధపడింది. ఆ రోజు రాత్రి పెరియాళ్వార్ వారి కలలో విష్ణుమూర్తి కనిపించి పెరియాళ్వార్ నాకు గోదాదేవి వేసికొని తీసిన మాలలు అంటే చాల ఇష్టం వాటిని నాకు తీసుకొచ్చి సమర్పించు అని చెప్పారు. అందుకు పెరియాళ్వార్ స్వామి నాకు మాత్రమే కాదు ఆలయ అర్చకులతో కూడా చెప్పండి స్వామి అని వేడుకున్నారు. విష్ణుమూర్తి ఆ ఆలయ అర్చకుల కలలో కూడా కనిపించి చెప్పారు. ఆరోజు నుంచి పెరియాళ్వార్ గోదా దేవి వేసుకొని తీసిన పూల మాలను స్వామి వారికీ సమర్పించేవారు. అప్పటి నుంచి గోదా దేవికి ఆముక్తమాల్యద అని పేరు వచ్చింది. గోదా దేవి స్వామి మీద భక్తితో పాశురాలను రచించింది.  గోదా దేవి పెరిగి యుక్తి వయస్సు వచ్చింది. గోదా దేవి తండ్రి గోదా దేవి దగరకు వచ్చి నీకు వివాహ వయస్సు వచ్చింది అని నీకు ఎవరు ఇష్టం చెప్పు వారికీ ఇచ్చి వివాహం చేస్తాను అని చెప్పారు. అందుకు గోదా దేవి నాన్న నాకు చిన్నపాటి నుంచి విష్ణుమూర్తిని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాను.



అమ్మ గోదా దేవి శ్రీ మహా విష్ణువు అవతారాలు మొత్తం 108 ఉన్నాయమ్మా అని చెప్పారు. ఆ అవతార విశేషాలు చెపుతుంటే స్వయంగా శ్రీమహావిష్ణువే వచ్చి పెరియాళ్వార్ ఏ అవతార విశేషం చెపితే ఆ అవతారంలో గోదా దేవికి కనిపించరు. గోదా దేవి ఆ అవతార విశేషాలు విని నాన్న నాకు శ్రీరంగంలో ఉన్న శ్రీరంగానాధ స్వామి స్వరూపం నచ్చింది. నేను ఆయననే వివాహం చేసుకుంటాను అని గోదా దేవి చెపింది. పెరియాళ్వార్ శ్రీరంగనాథున్ని విన్నవించుకున్నారు. శ్రీరంగనాధ స్వామి సమయం వచ్చినపుడు నేను కబురు పంపించి వివాహం చేసుకుంటాను అని చెప్పారు. కొన్ని రోజులకి గోదా దేవి దగ్గరకు స్వామి వారి వచ్చి ఆమెకు బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించారు. శ్రీరంగనాథుడు ఆ దేశా రాజైన పాండ్య రాజు కలలో కనిపించి నేను విల్లి పుత్తూరులో గోదా దేవిని నేను వరించాను. ఆమెను తీసుకువచ్చి నాకుతో వివాహం జరిపించు ఆమెను తీసుకురావటానికి బంగారు పల్లకి పంపించు అని చేపి వెళ్లిపోయారు. పాండ్య రాజు సంతోషానికి అవధులు లేవు. సాక్షాత్తు భగవంతునికే వివాహం జరిపించే అవకాశం వచ్చింది అని సంతోషించారు. వెంటనే గోదాదేవి కోసం బంగారు పల్లకీ పంపించారు.  గోదా దేవి పెళ్లి కూతురిగా అలంకరించటానికి చెల్లికట్లను, బంగారు ఆభరణాలను, పట్టు వస్త్రాలను పంపించారు. గోదా దేవిని పెళ్లి కూతురుగా అలంకరించి బంగారు పల్లకిలో శ్రీరంగానికి తీసుకువచ్చారు. గోదాదేవి ఆ ఆలయానికి వచ్చే సరికి చీకటి పడుతుంది. మరుసటి రోజు గోదాదేవికి శ్రీరంగనాధ స్వామి ఉత్సవిగ్రహానికి వివాహం చేసారు. వివాహం జరిగిన తరువాత గోదాదేవి స్వామి వారి గర్భగుడిలోకి వెళ్లి స్వామి వారికీ హారతి ఇచ్చి స్వామి వారికీ ప్రదక్షణలు చేసి అందరూ చూస్తుండగా శ్రీరంగనాధ స్వామి పాదాల దగ్గర కూర్చొని స్వామిలో అదృశ్యమైపోయింది. అలా గోదా దేవి కళ్యాణం జరిగింది. గోదా దేవి కళ్యాణం అంటే ఆత్మ, పరమాత్మ తో కలిసి మోక్షం పొందటం. గోదా దేవి పాశురాలు అన్ని కూడా స్వామిని ఎల్లా పూజించాలి. ఎలా స్వామిని చేరుకోవాలో వివరిస్తుంది. 


గోదాదేవి పాశురాలు

తరువాత కాలంలో గోదాదేవి పాశురాములు యమణాచార్యులవారు ప్రాచుర్యములయంలోకి తీసుకువచ్చారు. అయన శ్రీవైష్ణవంను ప్రసిద్ధిలోకి తీసుకొచ్చారు. బ్రహ్మ సూత్రాలకు భాష్యం రాసారు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...