పరమాత్మతో గోపాలబాలురి భోజనం

పరమాత్మతో గోపాలబాలురి భోజనం


ఇక్కడ వ్యాసభగవానుడు, పోతనగారు గోపాల బాలురు తిన్న చద్దాన్నని అంతగా వివరించటానికి కారణం పరమాత్మ స్వరూపుడైన శ్రీ కృష్ణ భగవానుడితో గోపాలబాలురు తినటమే. శ్రీమహా విష్ణువు కేవలం యజ్ఞయాగాది క్రతువులతో వేదమంత్రాలతో హవిస్సులను పవిత్రంగా ఇస్తేనే స్వీకరిస్తారు. అటువంటిది ఇప్పుడు గోపాలబాలురతో చద్దన్నం తింటున్నారు కనుక అది అమృత భోజనం అయింది. పరమాత్మతో భోజనం తినే గోపాలబాలురు ఎంత అదృష్టవంతులో కదా! గర్గసంహితలో ఈ గోపాలబాలురు మూడు కోట్ల సంవత్సరాలు భాగవతం విన్నారు. అందుకనే వీరికి శ్రీకృష్ణుడితో కలిసి తినే, ఆడుకొనే, కలిసి తిరిగే అదృష్టం కలిగింది.

గోపాల బాలురు అఘాసురుడు చనిపోయిన ప్రదేశము నుంచి కొంచం ముందుకు నడుచుకుంటూ వెళ్లరు. అక్కడ ఒక చెరువు ఉంది. శ్రీ కృష్ణుడు గోపాలబాలురతో స్నేహితులారా! మనం ఇక్కడే భోజనం చేద్దాము. ఎందుకంటే ఇక్కడ దూడలకు నీరు తాగటానికి నీరు ఉన్నాయి. మనం భోజనం చేయటానికి నీడ ఉన్నది. మనం ఇక్కడే భోజనం చేసి విశ్రాంతి తీసుకుందాము అని అన్నారు. గోపాలబాలురు సరే అన్నారు. అప్పుడు గోపాలబాలురు అందరూ శ్రీకృష్ణుడు మాకు ఎదురుగా కూర్చోవాలి అని కోరారు. శ్రీ కృష్ణుడిని మధ్యలో కూర్చోపెట్టి గోపాలబాలురు చుట్టూ కూర్చున్నారు. గోపాలబాలురు కొంతమంది చద్దన్నంలో మీగడగడ్డపెరుగు వేసుకొని అందులో ఆవకాయ, మాగాయ, గోంగూర ఇలా రకరకాల పచ్చడులు వేసుకొని వచ్చారు. కొందరు లడ్డులు, తీపి పదార్ధములు తీసుకొచ్చారు. కొందరు గోపాలబాలురు అరె మనం ఎవరు తెచ్చిన భోజనం వాళ్ళు తింటే ఎలాగా అందరము భోజనాన్ని ఒకచోట పెట్టి అందరము తిందాము అన్నారు. అందరూ సరే అన్నారు. గోపాలబాలురు తామరాకులు, గడ్డిపరకలు, తామరరేఖలు పరిచి ఒకచోట పెరుగన్నని, ఇంకోచోట ఆవకాయ పచ్చడిని, ఇంకోచోట మాగాయి పచ్చడిని, ఇంకోచోట గోంగూర పచ్చడిని వేసి ఇంకోచోట తీపి పదార్ధములు,వేసి అందరూ వరుసలో కూర్చొని అన్ని పదార్ధాలను వడ్డించుకొని తినసాగారు. ఇంకా శ్రీకృష్ణుడు గోపాలబాలురా మధ్యలో కూర్చున్నారు. అయన నీలిమేగా చాయగా ఉన్నారు. అయన చేతులు, అరికాళ్ళు పాదములు,అయన పెదవులు లేత ఎరుపు రంగులో ఉన్నాయి. అయన దూడలను కొట్టటానికి ఒక వెదురు కర్రకు బంగారు పూత పూసిన కర్రను చంకలో పెట్టుకున్నారు. శ్రీకృష్ణుడు చేతి వేళ్ళ మధ్యలో మాగాయి ముక్కలు, ఆవకాయ ముక్కలు పెట్టుకొని గోంగూర పచ్చడి నంచుకుని మీగడగడ్డపెరుగు చద్దన్నం తింటున్నారు. ఇలా తింటున్నపుడు అక్కడే వదిలిన లేగ దూడలు కనిపించలేదు. తింటున్న శ్రీకృష్ణుడు గోపాలబాలుర మీరు తింటూ ఉండండి నేను వెళ్లి దూడలను వెతికి తీసుకువస్తాను అని చేపి శ్రీకృష్ణుడు వెదురు కర్రను తీసుకొని బయలుదేరారు. 

శ్రీ కృష్ణ - అఘాసుర వధ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...