సంకల్పబలం ఉంటె ఏదైనా సాధిచవచ్చు అని చేపిన కథ

సంకల్పబలం ఉంటె ఏదైనా సాధిచవచ్చు అని చేపిన కథ


 

సముద్రపు వడ్డున ఒక చెట్టు మీద ఒక పక్షి జంట నివసిస్తుంది. ఒక రోజు ఆ పక్షి గుడ్లు పెటింది. మరుసటి రోజు అవి ఆహారం కోసం బయటకు వేలాయి. అవి అటు వెళ్ళగానే సముద్ర జలాలు వచ్చి ఆ పక్షి గూడుని గుడ్లను పడేశాయి. ఆ పక్షులు వచ్చి చూసి విలవిలా దుఃఖించాయి. మళ్ళి కొనాలకి ఆ పక్షి మళ్ళి గుడ్లు పెటింది. మళ్ళి అలాగే సముద్రపు అలలు వచ్చి మళ్ళి పక్షి గూడుని పడేశాయి. ఇలా పదే పదే జరగటం వలన ఆ పక్షి జంటకి సముద్రుడి మీద కోపం వచ్చింది. ఆ పక్షులు మిగిలిన పక్షులతో మేము సముద్రాన్ని పూడుస్తాము అన్నాయి. అందుకు మిగిలిన పక్షులు వీటి మాటలు విని ఎగతాళిగా మీరు ఎంత ఉన్నారు. సముద్రం ఎంతవుంది ఇది సాధ్యమైయే పనేనా అని నవ్వాయి. అవి ఎగతాళి చేసిన వదలకుండా మేము చేస్తాము అని వెళ్లిపోయాయి. ఆ పక్షి జంట సముద్రం లో నీటిలో వాటి రెక్కలను తడుపుకొని సముద్రం వడ్డున ఉన్న ఇసుకలో దొర్లాయి. ఆ తడికి వాటికీ ఇసుక అంటింది. మళ్ళి ఆ ఇసుకని తీసుకొని వెళ్లి సముద్రంలో మునిగాయి. ఇలా కొని సంవత్సరాల పాటు చేస్తూనే ఉన్నాయి. వాటి పట్టుదల చూసి మిగిలిన అన్ని పక్షులు కూడా వీటికి తోడుగా ఇసుకను సముద్రంలో వేయసాగాయి. ఆ జంట పక్షులకి కొన్ని వేళా పక్షులు తోడయ్యాయి. ఈ మాట ఆ నోటా ఈనోటా పక్షి రాజు అయినా గరుత్మంతునికి తెలిసి అయ్యో నా జాతి పక్షులు ఇంత కష్టపడుతున్నాయి. నేను వాళ్లకి సహాయం చేయాలి. అనుకోని పెద్ద పెద్ద బండరాళ్లను, కొండలని తీసుకొచ్చి సముద్రంలో వేయసాగారు గరుత్మంతుడు. ఇలా కోణాలు జరిగింది. ఒకసారి శ్రీమహావిష్ణువు తన వాహనం అయినా గరుత్మంతుడు కనిపించటం లేదు అని చూడగా గరుత్మంతుడు సముద్రంలో పెద్ద పెద్ద కొండలను వేస్తూ కనిపించారు. వెంటనే శ్రీమహావిష్ణువు వైకుంఠము వదిలి గరుత్మంతుడి దగరకు వచ్చి విషయం తెలుసుకొని  ఆ చిన్ని పక్షుల సంకల్ప బలానికి ఆ దేవాధిదేవుడు ముచ్చటపడి స్వామి సముద్రుడిని పిలచి వాటి గుడ్లు వాటికీ ఈపించి ఇంకెప్పుడు వాటి జోలికి రావద్దు అని హెచ్చరించి వెళ్లరు ఆ శ్రీమహా విష్ణువు. సంకల్ప బలం తో ఒకచిన్న పక్షి జంట చేసిన ప్రయత్నం సాక్షాత్తు శ్రీమహా విష్ణువునే కదిలించాయి. 




రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...