devotional storys లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
devotional storys లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

గురు భక్తి | GURUBHAKTHI | Adi Shankaracharya |


గురు భక్తి

ఆదిశంకరాచార్యుల వారికీ చాల మంది శిష్యులు ఉండేవారు. వారిలో సనందనుడు అనే శిష్యుడు పరమ గురు భక్తి కలిగిన వారు. అతను అంటే మిగిలిన శిష్యులకి అసూయగా ఉండేది. ఈ విషయం తెలుసుకున్న అది శంకరాచార్యులవారు వారి గుణపాఠం చెప్పాలి అనుకున్నారు. ఒకరోజు శిష్యులను తీసుకొని పూర్ణ నది ఒడ్డుకు వెళ్లారు. శిష్యులను పిలచి మీరు అందరూ వెళ్లి నదికి అవతలి వైపున ఉన్న దర్భలు కోసుకురండి అని చెప్పారు. శిష్యులందరు మోకాలు లోతు నీళ్లు మాత్రమే ఉన్న నదిని ధాటి అవతిలి ఒడ్డుకు వెళ్లారు. అక్కడ దర్భలు కోస్తున్నారు. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న పూర్ణ నది ఒక్కసారిగా ఉధృతంగా వరద వచ్చింది. ఆదిశంకరాచార్యులు శిష్యులను పిలచి వెంటనే ఇవతలి ఒడ్డుకు రమ్మన్నారు. శిష్యులందరు దర్భలను కోయటం అపి వెంటనే నదివద్దకు వచ్చారు. నదికి వస్తున్నా వరదను చూసి భయపడిన శిష్యులు గురువుగారు! మేము నది వరద తగిన తరువాత వస్తాము అని చెప్పారు. ఆ శిష్యులలో ఉన్న సనందనుడు ఒక క్షణం కూడా ఆలోచించకుండా నదికి వరద వస్తుంది తాను మునిగిపోతాను అన్న భయం కూడా లేకుండా గురువుగారు చెప్పారు అన్ని నది దాటటం మొదలు పెట్టారు. అతను నది దాటుతుంటే అతని పాదాలు కూడా తడవకుండా అతని పాదాల కింద పద్మాలు వచ్చాయి. అతను నదిని ధాటి గురువుగారి దగరకు వచ్చి అయన పాదాలకు నమస్కరించారు. ఆ రోజు నుంచి సనందనుడు పద్మపాదుడుగా ప్రఖ్యాతి చెందాడు. నదికి వరద ఎలా వచ్చిందో అలాగే తగిపోయింది. మిగిలిన శిష్యులు చిన్నబుచ్చుకొని  నదిదాటి వచ్చి గురువుగారిని క్షమాపణ వేడుకున్నారు. అప్పుడు ఆదిశంకరాచార్యులవారు మిగిలిన శిష్యులతో చూసారా మీరందరు సనందుడిని చూసి అసూయా చెందారు. నిజమైన గురుభక్తి ఎవరికీ ఉన్నదో ఇప్పటికైనా అర్ధమైనదా అని అన్నారు. మీరందరు కలిసిమెలసి ఉండాలి అని అన్నారు. మిగిలిన శిష్యులు తమతప్పు తెలుసుకున్నారు. గురువు మీద భక్తి కలిగిన వారికీ విషం కూడా అమృతం అవుతుంది అంట. ఈ కథలో అది నిజమే అనిపిస్తుంది. 

బోగి పండుగా విశిష్టత

ఈ బోగి పండుగ రోజు తెల్లవారుజామునే నిద్ర లేచి బోగి మంటలలో ఈ ధనుర్మాసం నెలరోజుల పాటు ముగ్గులతో పెట్టిన గొబెమ్మలను గొబెమ్మ మీద పెట్టిన పూవులతో సహా పిడకలు తాయారు చేసి దందాగా గుచ్చి బోగి మంటలలో చేస్తారు. పేదలు ఎలా చేయటం వలన వాతావరణంలో ఉన్న సూక్ష్మక్రిములు చనిపోయి చుట్టూ ఉన్న వాతావరణం శుద్ధి అవుతుంది అంటారు. పేదలు మనకు అందులో వీటిని అలవాటు చేసారు. సూర్యుడు ఈ రోజు నుంచి దక్షిణాయనం నుంచి ఉత్తయానానికి ప్రయాణం మొదలు పెడతారు. అందుకే బోగి మంటలు వేసి సూర్యునికి స్వాగతం పలుకుతారు. ఈ రోజు అందరూ అబ్యగానా స్నానం(ఒంటికి నువ్వులనూనె రాసుకొని కుంకుడికాయలతో స్నానం) చేస్తారు. ఈ రోజు సూర్య భగవానుడిని ఆరాధిస్తారు. ఈ రోజు పరమాన్నం నైవేద్యం చేస్తారు. ఈ రోజు పిండి వంటలు చేస్తారు. పేరంటాలు, బొమ్మల కొలువులు చేస్తారు. ఈ రోజు సాయంత్రం చిన్న పిల్లలకు బోగి పండ్లు పోస్తారు.ఆ బోగి పండ్లలలో రేగిపండ్లు(సూర్య భగవానుడి ప్రతీకగా చెపుతారు), చెరుకు ముక్కలు, పువ్వులు రూపాయి బిళ్ళలు కలిపి బోగి పండ్లు తాయారు చేస్తారు.


మీకు మీ కుటుంబ సభ్యులకు బోగి పండుగా శుభాకాంక్షలు 


గోదా దేవి కళ్యాణం

గోదా దేవి కళ్యాణం



విల్లి పుత్తూరు అనే గ్రామంలో ఒకరోజు గరుత్మంతుని అంశ ఐనా భాటనాధులు(పెరియాళ్వార్) పూల తోటలో స్వామి కోసం పువ్వులు కోసి తులసి వనంలోకి వెళ్లి తులసి మొక్కలను నాటడానికి అని భూమిని తవ్వుతుంటే గోదా దేవి అయోనిజగా దొరికింది. పెరియాళ్వార్ ఆయనకు ఏది దొరికిన స్వామి వారికీ అర్పించటం అలవాటు. ఆ ఆడపిల్లను తీసుకెళ్లి స్వామి వారి పాదాలవద్ద తీసుకొచ్చి పెట్టారు. అపుడు ఆ ఆలయంలో విష్ణుమూర్తి అశరీరవాణి వినిపించింది. పెరియాళ్వార్ ఈమె భూదేవి అంశ ఈమెని తీసుకెళ్లి నీ కన్నా కూతురిలాగా పెంచుకో అని చెప్పింది. పెరియాళ్వార్ ఆ పాపను తీసుకొని తన భార్యకు వెళ్లి ఇచ్చారు. ఆ పాపకు గోదా దేవి అని పేరు పెట్టి అల్లారు ముందుగా పెంచుకుంటున్నారు. ఆమెకు ప్రతిరోజు  శ్రీ కృష్ణ భగవాన్ కధలు, విష్ణుమూర్తి కధలు చెప్పేవారు. ఆ కధలు వింటూ పెరిగిన గోదా దేవి విష్ణుమూర్తిని వివాహం చేసుకోవాలన్నీ నిర్ణయించుకుంది. పెరియాళ్వార్ రోజు స్వామి కోసం పువ్వులు కోసి గోదాదేవికి ఇచ్చేవారు. గోదాదేవి వాటిని స్వామికి మాలలు కట్టేది. కొన్ని రోజులకి విష్ణుమూర్తికి కట్టే పూల మాలలను ఆమె వేసుకొని బావిలోనో, నీటిలోనో చూసుకొని మళ్ళి వాటిని యధావిధిగా స్వామి కోసం మాలలు తీసుకువెళ్లే బుట్టలో పేటేసేది. వీటినే పెరియాళ్వార్ స్వామి వారి ఆలయానికి స్వామి అలంకరణ కోసం ఇచ్చేవారు. అర్చకులు ఆ పూలమాలలను చూసి ఆశ్చర్యపోయారు. అందుకేంటే అవి రోజు కన్నా సువాసన వస్తున్నాయి. ఆ దివ్య పరిమళానికి సంతోషంతో స్వామివారికి అలంకరణ చేసేవారు. కొన్ని రోజులకి అర్చకులు ఆ పువ్వులకు అంత సువాసన ఎలావస్తుంది అని పరీక్షించి చూసేసరికి అందులో ఒక వెంట్రుక ఉంటుంది. ఆ వెంట్రుకను పరీక్షించు చూడగా అది ఒక స్త్రీ వెంట్రుక అని తెలిసింది. ఆలయ అర్చకులు పెరియాళ్వార్ వారికీ పిలిచి ఇది సంగతి అని  చెప్పారు. పెరియాళ్వార్ బాధపడి ఇంటికి ఆ రోజు పువ్వులను తిరిగి తీసుకొచ్చేసారు. తరువాత రోజు పరీక్షించగా ఆ పువ్వులను తన కూతురు గోదాదేవిని అలంకరించుకుంటుంది అని తెలుసుకొని బాధపడి గోదాదేవి దగరకు వెళ్లి అమ్మ గోదాదేవి ఎంత పని చేశావమ్మా స్వామి వారికీ నువ్వు అలాంకరించుకొని స్వామి వారికీ సమర్పిస్తున్నావు. అది అంత పాపమూ అమ్మ ఇప్పుడు స్వామి వారికీ ఎంత కోపం వస్తుందో అని భయపడరు. తన తండ్రికి తన వల్ల భాధ కలిగింది అని గోదా దేవి బాధపడింది. ఆ రోజు రాత్రి పెరియాళ్వార్ వారి కలలో విష్ణుమూర్తి కనిపించి పెరియాళ్వార్ నాకు గోదాదేవి వేసికొని తీసిన మాలలు అంటే చాల ఇష్టం వాటిని నాకు తీసుకొచ్చి సమర్పించు అని చెప్పారు. అందుకు పెరియాళ్వార్ స్వామి నాకు మాత్రమే కాదు ఆలయ అర్చకులతో కూడా చెప్పండి స్వామి అని వేడుకున్నారు. విష్ణుమూర్తి ఆ ఆలయ అర్చకుల కలలో కూడా కనిపించి చెప్పారు. ఆరోజు నుంచి పెరియాళ్వార్ గోదా దేవి వేసుకొని తీసిన పూల మాలను స్వామి వారికీ సమర్పించేవారు. అప్పటి నుంచి గోదా దేవికి ఆముక్తమాల్యద అని పేరు వచ్చింది. గోదా దేవి స్వామి మీద భక్తితో పాశురాలను రచించింది.  గోదా దేవి పెరిగి యుక్తి వయస్సు వచ్చింది. గోదా దేవి తండ్రి గోదా దేవి దగరకు వచ్చి నీకు వివాహ వయస్సు వచ్చింది అని నీకు ఎవరు ఇష్టం చెప్పు వారికీ ఇచ్చి వివాహం చేస్తాను అని చెప్పారు. అందుకు గోదా దేవి నాన్న నాకు చిన్నపాటి నుంచి విష్ణుమూర్తిని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాను.



అమ్మ గోదా దేవి శ్రీ మహా విష్ణువు అవతారాలు మొత్తం 108 ఉన్నాయమ్మా అని చెప్పారు. ఆ అవతార విశేషాలు చెపుతుంటే స్వయంగా శ్రీమహావిష్ణువే వచ్చి పెరియాళ్వార్ ఏ అవతార విశేషం చెపితే ఆ అవతారంలో గోదా దేవికి కనిపించరు. గోదా దేవి ఆ అవతార విశేషాలు విని నాన్న నాకు శ్రీరంగంలో ఉన్న శ్రీరంగానాధ స్వామి స్వరూపం నచ్చింది. నేను ఆయననే వివాహం చేసుకుంటాను అని గోదా దేవి చెపింది. పెరియాళ్వార్ శ్రీరంగనాథున్ని విన్నవించుకున్నారు. శ్రీరంగనాధ స్వామి సమయం వచ్చినపుడు నేను కబురు పంపించి వివాహం చేసుకుంటాను అని చెప్పారు. కొన్ని రోజులకి గోదా దేవి దగ్గరకు స్వామి వారి వచ్చి ఆమెకు బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించారు. శ్రీరంగనాథుడు ఆ దేశా రాజైన పాండ్య రాజు కలలో కనిపించి నేను విల్లి పుత్తూరులో గోదా దేవిని నేను వరించాను. ఆమెను తీసుకువచ్చి నాకుతో వివాహం జరిపించు ఆమెను తీసుకురావటానికి బంగారు పల్లకి పంపించు అని చేపి వెళ్లిపోయారు. పాండ్య రాజు సంతోషానికి అవధులు లేవు. సాక్షాత్తు భగవంతునికే వివాహం జరిపించే అవకాశం వచ్చింది అని సంతోషించారు. వెంటనే గోదాదేవి కోసం బంగారు పల్లకీ పంపించారు.  గోదా దేవి పెళ్లి కూతురిగా అలంకరించటానికి చెల్లికట్లను, బంగారు ఆభరణాలను, పట్టు వస్త్రాలను పంపించారు. గోదా దేవిని పెళ్లి కూతురుగా అలంకరించి బంగారు పల్లకిలో శ్రీరంగానికి తీసుకువచ్చారు. గోదాదేవి ఆ ఆలయానికి వచ్చే సరికి చీకటి పడుతుంది. మరుసటి రోజు గోదాదేవికి శ్రీరంగనాధ స్వామి ఉత్సవిగ్రహానికి వివాహం చేసారు. వివాహం జరిగిన తరువాత గోదాదేవి స్వామి వారి గర్భగుడిలోకి వెళ్లి స్వామి వారికీ హారతి ఇచ్చి స్వామి వారికీ ప్రదక్షణలు చేసి అందరూ చూస్తుండగా శ్రీరంగనాధ స్వామి పాదాల దగ్గర కూర్చొని స్వామిలో అదృశ్యమైపోయింది. అలా గోదా దేవి కళ్యాణం జరిగింది. గోదా దేవి కళ్యాణం అంటే ఆత్మ, పరమాత్మ తో కలిసి మోక్షం పొందటం. గోదా దేవి పాశురాలు అన్ని కూడా స్వామిని ఎల్లా పూజించాలి. ఎలా స్వామిని చేరుకోవాలో వివరిస్తుంది. 


గోదాదేవి పాశురాలు

తరువాత కాలంలో గోదాదేవి పాశురాములు యమణాచార్యులవారు ప్రాచుర్యములయంలోకి తీసుకువచ్చారు. అయన శ్రీవైష్ణవంను ప్రసిద్ధిలోకి తీసుకొచ్చారు. బ్రహ్మ సూత్రాలకు భాష్యం రాసారు. 

వైకుంఠ (ముక్కోటి) ఏకాదశి విశిష్టత

 వైకుంఠ (ముక్కోటి) ఏకాదశి విశిష్టత



ఒకసారి సనకనానందనాదులు భూలోకం తీర్ధయాత్రలు చెందామని వస్తారు. కొంతకాలం భూలోకంలో తీర్ధయాత్రలు చేసి తిరిగి వైకుంఠానికి వెళ్లరు. శ్రీమహా విష్ణువుని దర్శనం చేసుకొని ఇలా అడిగారు. "స్వామి! మేము భూలోకంలో తీర్ధయాత్రలు చేస్తున్నపుడు భూలోకములో మానవులందరు చాలా భాధలు అనుభవిస్తున్నారు. వారికీ భాదలు తీరే మార్గం చూపించండి" అని కోరుకున్నారు. అప్పుడు శ్రీమహావిష్ణువు చిరునవ్వు నవ్వి " సనకసనందనాదులారా! వైకుంఠానికి నాలుగు ద్వారములు ఉన్నాయి. తూర్పు ద్వారం నుంచి దేవతల రక్షణకి వెళతాను. పశ్చిమ ద్వారము నుంచి రాక్షసులను వధించటానికి వెళతాను. దక్షిణాయనంలో భూలోకములో ఆషాఢమాసంలో శుక్లపక్షంలో ఏకాదశినాడు దక్షిణ ద్వారము నుంచి వచ్చి మానవులను రక్షించి మళ్ళి తిరిగి వైకుంఠానికి వెళ్లి యోగ నిద్రలోకి వెళతాను. మళ్ళి తిరిగి వైకుంఠ ఏకాదశినాడు ఉత్తర ద్వారం గుండా బయటకు వచ్చి మానవులను రక్షిస్తాను. ఆ సమయంలో నేను యోగ శక్తితో ఉంటాను. ఈ వైకుంఠ ఏకాదశి నాడు ముకోటి దేవతలు, ఋషులు వచ్చి నన్ను దర్శించుకుంటారు. వెంకటాచలం, సోనాచలం, సింహాచలం, సహ్యపర్వతం, అహోబిలం, గరుడాద్రి వంటి ముఖ్యమైన నేను వెలసిన క్షేత్రాలలో ఉత్తర ద్వారం గుండా బయటకు వచ్చి దర్శనం ఇస్తాను. నన్ను దర్శించుకున్న మానవులకి భాదలు పోతాయి. తెలిసి తెలియక చేసిన పాపాలు తొలగిపోతాయి. వైకుంఠ ఏకాదశి రోజునే సముద్ర మషాణంలో హాలాహలం పుట్టింది. ఈ వైకుంఠ ఏకాదశి రోజునే అమృతం పుట్టింది. సంవత్సరానికి మొత్తం 24  ఏకాదశులు ఉన్నాయి. ఈ ఏకాదశులలో వైకుంఠ ఏకాదశి రోజున ఏకాదశ వ్రతం చేసిన వారికీ వైకుంఠ ప్రాప్తి లభిస్తుంది. ఈ వైకుంఠ ఏకాదశి నాకు నా దర్శనానికి నియమాలు ఉన్నాయి. వైకుంఠ ఏకాదశి నాకు బ్రాహ్మముహూర్తంలో(తెలవారిక ముందే) చల్లని నీటితో తల స్నానం చేసి నా నామస్మరణ చేయాలి. నా దర్శనం అయేంతవరకు ఉపవాసం ఉండాలి. ప్రతి ఏకాదశి నాడు ఉపవాసం ఉండలేక పోయిన ఈ వైకుంఠ ఏకాదశి నాడు ఉపవాసం ఉండి జాగరణ చేసి ద్వాదశి నాడు పండితునికి స్వయంపాకం లేచి ఉపవాసమును విరముంచాలి. ఇలా సంవత్సరంలో ఉన్నా 24 ఏకాదశి నాడు ఏకాదశి వ్రతం ఆచరించిన వారికీ శాశ్వత వైకుంఠ ప్రాప్తి లభిస్తుంది" అని శ్రీ మహా విష్ణుమూర్తి సనక సనందనాదులతో చెప్పారు. ఈ ఏకాదశి వ్రతముల వల్లనే అంబరీషుడు ప్రసిద్ధి చెందారు. పూర్వం రుక్మాంగదుడు అనే మహారాజు ఉండేవారు. అయన పరమవిష్ణు భక్తుడు. ఏకాదశి వ్రతం క్రమం తప్పకుండా చేసేవారు. ఒకసారి మోహిని అనే ఆవిడా రుక్మగదుడిని నాశనం వచ్చింది. మహారాజ నాకు ఒక వరం ప్రసాదించండి అని అడిగింది. మహరాజ నువ్వు ఏకాదశి ఉపవాసం మానేస్తావా లేక నీ కుమారుడిని చంపేస్తావా అని అడిగింది. అపుడు మహారాజు మోహిని నీకు మాట ఇచ్చాను కాబ్బటి నేను ఏకాదశి వ్రతం మానను కానీ నా కుమారుడిని చంపేస్తాను అని చేపి కత్తి ఎత్తారు. వెంటనే వైకుంఠము నుంచి విమానం వచ్చింది. విష్ణు దూతలు విమానం నుంచి దిగి రుక్మాగదుడిని అతని కుమారుడిని సశరీరంగా వైకుంఠానికి తీసుకొని వెళ్లారు. భీముడు ఒకసారి బదరి క్షాత్రానికి వెళ్లరు. నరనారాయణులు దర్శనం చేసుకున్నారు. అప్పుడు నరనారాయణులు భూమిడితో నువ్వు వెంటనే కేదారినాధకు వెళ్ళు అని చెప్పారు. భుముడు కేదారినాధ్ వెళ్లేసరికి వైకుంఠ ఏకాదశి వచ్చింది. శివుడిని దర్శనం చేసుకున్నారు. శివుడు భీమునికి దర్శనం ఇచ్చి సరియైన సమయానికి వచ్చావు నువ్వు ఈ రోజు వైకుంఠ ఏకాదశి నువ్వు ఉపవాసం ఉండు అనిచెప్పారు. అప్పుడు భీముడు స్వామి నేను ఆకలికి తట్టుకొనే నాకు ఇతర మార్గం ఏదైనా ఉంటె చెప్పండి అని అడిగారు. అప్పుడు శివుడు భీమా నువ్వు పూర్తిగా ఉండలేక పోతే పాలు,పళ్ళు, ఉప్పుడు తీసుకొని ఉండవచ్చు అని చెప్పారు. భీముడు శివుడు చేపినట్టుగానే తెలవారుజామునే నిద్ర లేచి విష్ణుమూర్తి నామ జపం చేసారు. ఏకాదశి వ్రతం పూర్తయిన వెంటనే బదరినారాయణుడు దర్శనం ఇచ్చారు. నివ్వు తదనంతరం వైకుంఠానికి చేరుకుంటావు అని వరం ఇచ్చారు. భీముడు కేదారినాధ్ లో ఏకాదశి వ్రతం చేస్తే బదరి నారాయణుడు దర్శనం ఇచ్చారు. దీనిని భక్తి శివకేశవులకు బేధం లేదుగాని తెలియచేసారు. ఈ వైకుంఠ ఏకాదశి బంగారం దానం చేసిన వారికీ వెయ్యి రేట్లు ఫలితం వస్తుంది అని చెప్పారు. ఈ వైకుంఠ ఏకాదశి నాడు శ్రీ హరి నామస్మరణా, గానం, కీర్తనం అంటే చాలా ఇష్టం అందుకే ఈ రోజు భక్తులు శ్రీ మహా విష్ణువు పురాణం వినటం, చదవటం, శ్రీ మహా విష్ణువు పాటలు పాడుకోవటం చేయాలి.


శ్రీ కృష్ణ - అఘాసుర వధ

శ్రీ కృష్ణ - అఘాసుర వధ



శ్రీ కృష్ణుడు బకాసుర సంహారం చేసిన తరువాత రోజు మళ్ళీ చద్దన్నం కట్టుకొని లేగదూడలను తీసుకొని అడవికి వెళ్లరు. ఆ రోజు బలరాముడు అడవికి రాలేదు. శ్రీ కృష్ణుడు ముందు నడుస్తుంటే వెనక ఉన్న గోపాలబాలురు అందరూ మన అందరిలో ఎవరైతే ముందువెళ్లి శ్రీ కృష్ణుడిని పట్టుకుంటే వాళ్ళు గెలిచినట్టు అని పందెం పెట్టుకున్నారు. అందరూ పరిగెత్తటం మొదలు పెట్టారు. అందులో శ్రీధాముడు ముందు వెళ్లి శ్రీకృష్ణుడికి పట్టుకున్నారు. నేనే గెలిచాను అని సంతోషంతో శ్రీధాముడు తిరిగాడు. గోపాలబాలురు అందరూ శ్రీ కృష్ణుడితో కలిసి ఆదుకున్నారు. శ్రీ కృష్ణుడి మీద పడి ఆడుకున్నారు. అలా ఆడుకుంటూ వెళుతుండగా గోపాలబాలురుకి ఒక ఎనిమిది కిలోమీటరుల పొడవు ఉన్న కొండ చిలువ అడాసురుడనే రాక్షసుడు నోరు తెరుచుకొని ఉన్నది అది వాళ్ళకి కొండగుహల కనిపిచింది. దాని నుండి ఉచ్ఛస్వ నిశ్వాసలు వేడిగా వస్తున్నాయి. గోపాలబాలురు లోపలి వెళదామని అనుకొన్నారు. అందులో ఒకరు ఒరే ఇది ఏమైనా రాక్షసుడేమోరా లోపలి వెళితే మనలని మింగేస్తుందేమో అనుకున్నాడు. అందరూ శ్రీ కృష్ణుడు ఉండగా మనకు భయమేముంది అని వెనక్కి తిరిగి శ్రీ కృష్ణుడిని చూసారు. శ్రీ కృష్ణుడు నవ్వుతు కనిపించారు. అది చుసిన గోపాలబాలురు ఇంక మనకు భయము లేదు అని లోపలి వెళ్లిపోయారు. గోపాలబాలురు, గోవులు లోపలికి వెళ్లగానే నాలుకతో వాళ్ళని పొట్టలో పడేసుకుంది. లోపలవేడికి గోపాలబాలురు, గోవులు మరణించారు. తరువాత శ్రీ కృష్ణుడు లోపలకి వెళ్లారు. శ్రీ కృష్ణుడు లోపలి వెళ్లగానే అఘాసురుడు నోరు మూసేసాడు. శ్రీ కృష్ణుడు గొంతులోనుంచి లోపలి వెళ్లకుండా అక్కడే ఆగిపోయి పెద్దగా పెరిగిపోయారు. ఆలా పెరిగిన శ్రీ కృష్ణుడు వల్ల గొంతు ముసుకుపోయి ఊపిరి ఆడక చనిపోయాడు అఘాసురుడు. అతని తల నుంచి బొటన వేళ్ళు అంత జ్యోతి వచ్చి ఆకాశంలోకి వెళ్లి నుంచుంది. శ్రీ కృష్ణుడు దాని నోరు తెరచి చనిపోయిన గోపాలబాలురు, గోవులను బయటకు తీసుకువచ్చి ఒకొక్కలని భ్రతికించారు. గోపాలబాలురకు సంతోషం వేసి గంతులువేస్తూ శ్రీకృష్ణుడిని కీర్తిస్తూ కొమ్ముబూరల ఊదుతూ శ్రీకృష్ణుడి చుట్టు తిరుగుతున్నారు. దేవతలు ఈ దృశ్యం చూసి పులా వాన కురిపించి తపేటలు తాళాలు వాయించారు. ఇలా జరుగుతున్న సమయంలో ఆకాశంలో ఉన్న అఘాసుర జ్యోతి వచ్చి శ్రీకృష్ణుడిలో కలిసిపోయింది. ఈ లీలను గోపాలబాలురు బృందావనంలోని తలితండ్రులకు సంవత్సరం తరువాత చెపుతారు.

అది ఎలాగో వచ్చేభాగంలో తెలుసుకుందాము. 

శ్రీ కృష్ణ - బకాసుర వధ

శ్రీ కృష్ణ - బకాసుర వధ



శ్రీ కృష్ణుడు వత్సాసురుడిని వధించిన తరువాత రోజునే మల్లి శ్రీ కృష్ణుడు, బలరాముడు, గోపాలబాలురు లేగదూడలను తీసుకొని మళ్ళీ అడవుల్లోకి వెళ్లరు. ఈ రోజు బలరాముడు, గోపాలబాలురు వెనక నడుస్తుంటే కొంచం ముందు శ్రీ కృష్ణుడు ముందు నడుస్తున్నారు. అక్కడ పర్వతమంత ఎత్తున ఉన్న ఒక తెల్ల కొంగ జపం చేస్తునట్టు కదలకుండా నోరు తెరుచుకొని దీక్షగా కూర్చుంది. ఈ కొంగ బకాసురుడు అనే రాక్షసుడు. పూతన అనే రాక్షసికి సోదరుడు. తన సోదరిని చంపినా శ్రీ కృష్ణుడిని చంపటానికి కంసుడు పంపగా వచ్చాడు. శ్రీ కృష్ణుడు దానిని చూసారు. ఆ వచ్చింది రాక్షసుడు అని తెలుసు కొని దాని దగరకు వెళ్లరు. శ్రీ కృష్ణుడు దగరకు రావటంతో వెంటనే నోటిలో వేసేసుకుంది. ఈ దృశ్యం చుసిన బలరాముడు, గోపాలబాలురు కదలిక లేకుండా పడిపోయారు. శ్రీ కృష్ణుడు ఏది చూసి కొంగ గొంతులో అడంగా ఉండి అగ్ని గోళంగా మారారు. కొంగా ఆ వేడిని తట్టుకోలేక శ్రీ కృష్ణుడు బయటకు వదిలేసింది. బయటకు కృష్ణుడు రాగానే కింద పడిపోయిన బలరాముడు, గోపాలబాలురకు మెలకువ వచ్చింది. బయటకు వచ్చిన వెంటనే శ్రీ కృష్ణుడు కొంగ ముక్కును రెండుగా చీల్చారు. కొంగ రూపంలో ఉన్న బకాసురుడు మరణించాడు. బకాసురుడు మరణించగానే అతనిలోనుంచి ఒక తేజస్సు బయటకు వచ్చి శ్రీ కృష్ణుడిలో కలిసిపోయింది. శ్రీ కృష్ణుడు, బలరాముడు, గోపాలబాలురు సాయంత్రం ఇంటికి రాగానే యశోదమ్మకు జరిగిన విషయం చెప్పారు. యశోదమ్మ ఈ సారి భయపడలేదు. రాక్షసులు ఇలాగే వస్తుంటారులే నా కృష్ణుడికి ఏమి కాదు అని అనుకోను ఊరుకుంది. 

శ్రీ కృష్ణ - వత్సాసుర వధ

శ్రీ కృష్ణ - వత్సాసుర వధ



నందవ్రజంలో నుంచి గోపాలకులు బృందావనం వెళ్లరు. కొన్నాళ్లకి నందుడు, గోపాలకులు అందరూ ఇల్లు నిర్మించుకొని నివసించసాగారు. శ్రీ కృష్ణుడు తన అన్న బలరాముడు, స్నేహితులతో కలిసి ఆడుకొనసాగారు. నందుడు తన కుమారులకు ఆవుల్ని పోషించటం నేర్పించాలని లేగ దూడలను బృందావనానికి కొంచం దూరంగా ఉన్న చిన్న అడవిలో మెపూకురమని చెప్పారు. యశోదమ్మ భయపడింది. అసలే కొత్త ప్రదేశం శ్రీ కృష్ణుడు ఇంకా చిన్న పిల్లవాడు, అల్లరివాడు. ఏ జంతువన్న లాక్కుపోతుందేమో అని పంపనంది. శ్రీ కృష్ణుడు తన తల్లికి ధర్యం చెపుతూ. అమ్మ మేము ఎక్కువ దూరం వెళ్ళాము. ఇంట్లో ఉంటె ఏమి తోయటం లేదు. మేము జాగ్రత్తగా వెళ్లి వస్తాము అన్నారు. యశోదమ్మ మరుసటి రోజు పిల్లలిద్దరికి చద్దన్నం కటిచ్చి లేగ దూడలను ఇచ్చి పంపించింది. శ్రీ కృష్ణుడు తన స్నేహితులతో కలిసి అడవిలో ఉండగా అక్కడికి ఒక లేగ దూడ వచ్చింది. అది మందలోనిది కాదు. చూడటానికి చాల అందంగా ఉంది. శ్రీ కృష్ణుడు దానిని చూడగానే వచ్చింది ఎవరో కనిపెటేసారు. తన స్నేహితులను పిలిచి "గోపాలులారా! ఇటు చుడండి ఈ లేగదూడ ఎంత బాగుందో దీని తోక దీని కళ్ళు దీని కాళ్ళు ఎంత అందంగా ఉందొ చుడండి" అని చెపుతూ దాని దగరకు వచ్చి ఎవరు ఉహిచని విధంగా దాని నాలుగు కాళ్లను దాని తోకతో చుట్టి గిరగిరా తీపి పక్కనే ఉన్న వెలగా చెట్టుమీద వేశారు. గోపాలబాలురు కృష్ణా, కృష్ణా అంటుండగానే అంత జరిగిపోయింది. దూడ పడిన బరువుకి వెలగ చెట్లు ఒక దాని మీద ఒకటి పడి ఎనభై చెట్లు పడిపోయాయి. గోపాలురు ఏమిటి కృష్ణ దూడని చంపేసావు అని అనేలోపే ఆ దూడ కాస్త ఆరు కిలో మీటర్ల పొడవున్న వత్సాసురుడు అనే రాక్షసురికి మారిపోయాడు. గోపాల బాలురు అందరూ మా కృష్ణుడు ఏమి చేసిన మన మంచికే చేస్తాడు ఒక వెల్ల కృష్ణుడు ఆ రాక్షసుడిని చంపకపోతే వాడు మనలనందరిని చంపేసి తేనేసేవాడేమో అని భయపడరు. చనిపోయి పడిఉన్న రాక్షసుడి శరీరం చుటూ తిరుగుతూ ఆదుకున్నారు. శ్రీ కృష్ణుడు, బలరాముడు, గోపాలబాలురు అందరూ చీకటి పడక ముందే ఇళ్ళకి వెళ్లిపోయారు. శ్రీ కృష్ణుడు ఇంటికి వెళుతూనే వెనకే వచ్చిన గోపాల బాలురు అందరూ యశోదమ్మతో "యశోదమ్మ! ఈ రోజు శ్రీ కృష్ణుడు ఏమి చేసాడో తెలుసా ఒక రాక్షుసుడు లేగదూడ రూపములో వచ్చాడు. శ్రీ కృష్ణుడు దానిని చంపేశాడు" అని చెప్పారు. యశోదమ్మ భయపడుతూ ఆ నారాయణ స్వామికి "హే నారాయణ! నా కుమారుడిని వెంటే ఉంది రక్షించినందుకు నీకు కోటి కోటి ప్రణామాలు తండ్రి" అని క్షణం పెటింది. ఈ లోపు నందుడు, ఉప నందుడు అక్కడికి వచ్చారు. ఈ విషయం తెలుసుకొని శ్రీ కృష్ణుడికి ఇంత దూరం వచ్చిన ఆపదలు తప్పటం లేదు అనుకున్నారు కానీ వారికీ ఏదో దైవ శక్తీ వచ్చి శ్రీ కృష్ణుడిని రక్షిస్తుంది అని భావించారు. శ్రీ కృష్ణుడు ఈమాటలు అన్ని విని నవ్వుకొని ఊరుకున్నారు.

శ్రీ కృష్ణ - బృందావన పయనం

మోక్షద ఏకాదశి, గీత జయంతి శుభాకాంక్షలు

మోక్షద ఏకాదశి, గీత జయంతి శుభాకాంక్షలు


మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు మోక్షద ఏకాదశి అని అంటారు. ఈ రోజునే శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి భగవద్గీతను భోదించారు. ఈ రోజున ఏకశసి వ్రతం చేసేవారికి మోక్షం వస్తుందని నమ్ముతారు. 

ఏకాదశి కథ

పద్మ పురాణం ప్రకారం పూర్వం మోర అనే రాక్షసుడు బాధలు పడలేక శ్రీ మహా విష్ణువు దగరకు వెళ్లరు. శ్రీ మహా విష్ణువు వారి మొరలను విని తనలో నుంచి ఒక శక్తీని పుట్టిస్తారు. శ్రీ మహా విష్ణువు ఆ శక్తిని ఏకాదశినాడు పుట్టించారు కాబట్టి ఆ శక్తికి ఏకాదశి అని పేరు పెట్టారు. ఏకాదశి వెళ్లి మోర అనే రాక్షసుడిని సంహరించింది. శ్రీ మహా విష్ణువు సంతోషించి నీకు ఏమి వరం కావాలో కోరుకోమన్నారు. అందుకు ఏకాదశి ఈ ఏకాదశి రోజున ఏకాదశి వ్రతం చేసిన వారికీ మోక్షం ప్రసాదించమని కోరుకుంటుంది శ్రీ మహా విష్ణువు తధాస్తు అని వరమిస్తారు. 

మోక్షద ఏకాదశి కథ 

పూర్వం గోకుల నగరంలో వైఖానసుడు అనే రాజు ఉండేవాడు. అతనికి ఒక రోజు రాత్రి కలలో అతని తండ్రి నరకంలో శిక్షలు అనుభవిస్తూ కుమారుడిని తనకు మోక్షం వచ్చేలా చేయమని ఈ శిక్షలు అనుభవించలేక పోతున్నాని బాధపడరు. వైఖానసుడు మరుసటిరోజు ఉదయం నిద్ర లేచి చూసుకునే సరికి తనకు వచ్చింది కల అని తెలుస్తుంది. వెంటనే సభను ఏర్పాటు చేసి తన మంత్రులకి చెపుతారు. మంత్రులు ఎలాంటి విషయాలు మునులను, ఋషులను కనుకోవాలని చెప్పారు. రాజు వెళ్లి మునులను ఋషులను అడుగుతారు. వాలందరు ఒకటే చెప్పారు. మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు ఏకాదశి వ్రతం చేయి ఆ వ్రతఫలితాని మీ తండ్రి గారికి ధారపోయి. అతనికి మోక్షం లభిస్తుంది అని చెప్పారు. అతని అలాగే మార్గశిర శుద్ధ ఏకాదశి వ్రతం చేసి అతని తండ్రికి ధారపోశారు. అతని తండ్రికి మోక్షం లభిస్తుంది. అందుకని ఈ ఏకాదశిని మోక్షద ఏకాదశి అన్నారు. 

గీత జయంతి
ప్రపంచ వ్యాప్తంగా హింధువులు అందరూ మార్గశిర శుద్ధ ఏకాదశి రోజునా గీత జయంతి జరుపుకొంటారు. భగవద్గీత, మహాభారత ఇతిహాసములోని భీష్మ పర్వము 25వ అధ్యాయము మొదలు 42వ అధ్యాయము వరకు 18 అధ్యాయములు భగవద్గీతగా ప్రసిద్ధము. కౌరవ పాండవ యుద్దములో అర్జునుడు తన బంధువులను చూసి నిరసించి యుద్ధం చేయనని కూర్చున్నాడు. శ్రీ కృష్ణుడు, అర్జునుడిని కార్యన్ముఖుడిని చేయటానికి భగవద్గితను భోదించారు. అర్జునుడికే కాదు, కర్తవ్య నిర్వహణలో ఎదురయ్యే సమస్యలకి సందిగ్దతకి సమాధానంగా భగవద్గీత ఈ నాటికీ ఏ నాటికీ ప్రమాణంగా నిలుస్తుంది. శ్రీ కృష్ణ భగవానుడు మానవులకు అందించిన వరం భగవద్గీత. మానవులకు మానవత్వం గురించి నేర్పిచిన గ్రంధం భగవద్గీత. మానవులు వచ్చే ప్రతి సమస్యకు పరిస్కారం ఈ భగవద్గీత. సిద్ధాంత గ్రంథమైన భగవద్గీతయందు వేద, వేదాంత, యోగ విశేషాలున్నాయి. భగవద్గీతను తరచుగా "గీత" అని సంక్షిప్త నామంతో పిలుస్తారు. దీనిని "గీతోపనిషత్తు" అని కూడా అంటారు. భగవద్గీతలో భగవంతుని తత్వము, ఆత్మ తత్వము, జీవన గమ్యము, గమ్యసాధనా యోగములు బోధింపబడినవి. నేను గీతను ఆశ్రయించి ఉంటాను. గీత నా నివాసం. గీతాధ్యయనము చేయువాడు భగవంతుని సేవించినట్లే (వరాహ పురాణం).ఆత్మ నిత్య సత్యమైనది, చావు లేనిది. మృత్యువు వారిని శరీరాల నుండి వేరుచేస్తుందే కానీ ఆత్మను చంపదు. సత్యమైన జ్ఞానము ఆత్మ జ్ఞానమే అంటే తనను తాను తెలుసుకోవడమే, తనలోని అంతరాత్మ గురించి తెలుసుకోవడమే. అభ్యాస వైరాగ్యముల ద్వారా యోగి, వస్తు ప్రపంచాన్ని వదలి సర్వోత్కృష్టమైన పరబ్రహ్మాన్ని చేరగలడు. భక్తి, కర్మ, ధ్యాన, జ్ఞాన మార్గాలలో భగవంతుని చేరవచ్చును.

భగవద్గీత నుండి మార్గదర్శకత్వము పొందినవరిలో ఎందరో యోగులు, తాత్త్వికులు ఉన్నారు. వారిలో శ్రీ చైతన్య మహాప్రభు ఒకరు. ఈయన "హరే కృష్ణ" మంత్రోపాసకులు. 

మహాత్మ గాంధి తన అహింస సిద్ధాంతానికి గీత నుండే స్ఫూర్తిని పొందారు. గాంధీ మహాభారత యుద్ధాన్ని నిత్య జీవితంలో జరిగే సంఘర్షణలన్నిటికి వేదిక వంటిదని వర్ణించారు. అంతిమంగా గీత సారము ఆయనకు బ్రిటిష్ వారి వలస పాలనను ఎదిరించడానికి ఒక ఆయుధము వంటి స్ఫూర్తిని ఇచ్చింది. నిరాశ, సందేహములు నన్ను చుట్టుముట్టినపుడు, ఆశాకిరణములు గోచరించనపుడు నేను భగవద్గీతను తెరవగానే నన్ను ఓదార్చే శ్లోకము ఒకటి కనిపిస్తుంది. ఆ దుఃఖంలో కూడా నాలో చిరునవ్వులుదయిస్తాయి. భగవద్గీతను మననం చేసేవారు ప్రతిరోజు దానినుండి క్రొత్త అర్ధాలు గ్రహించి ఆనందిస్తారు.

శ్రీ రామకృష్ణ పరమహంస శిష్యులలో అగ్రగణ్యుడైన స్వామి వివేకానంద గీతలోని భక్తి, జ్ఞాన, కర్మ రాజ యోగాలకు ఎంతో విపులంగా నూతన భాష్యాన్ని వ్రాశారు. యోగులు కాదలచిన వారు గీతలోని ప్రతి అధ్యాయాన్ని వివరంగా చదవమని స్వామి శివానంద బోధించారు. ఒక యోగి ఆత్మ కథ రచయిత అయిన పరమహంస యోగానంద, గీతను ప్రపంచములోని అత్యుత్తమ పవిత్ర గ్రంథముగా పేర్కొన్నారు.




శ్రీ కృష్ణ - బృందావన పయనం

శ్రీ కృష్ణ - బృందావన పయనం



శ్రీ కృష్ణుడు మది చెట్లు పడిపోయిన తరువాత అందరికి అనుమానం వచ్చింది. ఇంత పెద్ద చెట్లు ఎలా పడాయి అని ఆలోచించసాగారు. చెట్లను నరకలేదు. గాలివాన రాలేదు. అసలు ఎలా పడాయి అని ఆలోచించసాగారు. అక్కడే ఆడుకుంటున్న పిల్లలు వచ్చి శ్రీ కృష్ణుడు చెట్ల మధ్యలో నుంచి వచ్చారు. ఆ చెట్లు పడిపోయి అందులోనుంచి దేవతలు బయటకు వచ్చి శ్రీ కృష్ణుడిని ప్రార్ధన చేసి వెళ్లిపోయారు. అందరూ చిన్న పిల్లవాడు ఎల్లా చేస్తారు. పిల్లలు ఏదోచెపుతున్నారు. ఏ భూతమో పడేసి ఉంటాయి అని అన్నారు గాని అందరికి మనసులో అనుమానంగా ఉంది. శ్రీ కృష్ణుడు ఈ విషయాన్ని కనిపెట్టి వారందరిని ఈ విషయాలు మరచిపోయేలా చేయాలి అని అనుకున్నారు. ఆ రోజు నుంచి తండ్రి అయినా నందుడు ఇంటికి రాగానే చిన్న పిలాడిలానే ఎదురు వెళ్లి నాన్నని పలకరించడం. పెద్దవాళ్ళు ఎవరైనా మంచినిళ్లు ఎవరంటే ఇచ్చేవారు. ఒకరోజు యశోదమ్మ దగరకు వచ్చి శ్రీ కృష్ణుడు అమ్మ ఎవరో నన్ను కొట్టాలని చుస్తునారు అతను ఆచం నాలాగే ఉన్నారు అని యశోదమ్మను తీసుకెళ్లి నీటితో నిండిన చిన్న తొట్టిని చూపించి ఏడిచాడు. యశోదమ్మ నవ్వు కొన్ని ఎవరు లేరమ్మ అది నీ ప్రతిభింబం అని సర్ధిచెపింది. ఇంకోరోజు యశోదమ్మ దగరకు వచ్చి అమ్మ నాకు అన్నయ్యలాగా జుట్టు లేదు ఎందుకు అని అడిగారు. యశోదమ్మ కన్నయ్య అన్నయ పాలు, పెరుగు బాగా తిట్టాడు అందుకే జుట్టు ఎక్కువగా ఉంది. వెంటనే పక్కనే ఉన్న బిందిలోని పాలను తాగేసి నా జుట్టు పెరిగిందా అని అడిగారు. యశోదమ్మ శ్రీ కృష్ణుడి అమాయకత్వానికి నవ్వుకుంది. ఒకరోజు నందవ్రజంలోకి పండ్లను అమ్ముకుంటానికి ఒక ఆవిడా వచ్చింది. ఆమె పండ్లకు బదులు ధాన్యాన్ని తీసుకుంటుంది. ఆ పండ్ల ఆవిడా యశోదమ్మ ఇంటికి వచ్చింది. యశోదమ్మ ధాన్యాన్ని ఇచ్చి పండ్లని తీసుకుంది. శ్రీ కృష్ణుడు కూడా తన చిన్ని చిన్ని చేతులతో ఒక నాలుగు ధాన్యాపు గింజలను తీసుకొని ఆవిడా దగరకు వచ్చి కొన్ని పండ్లను ఇవ్వమన్నారు. ఆవిడా చిన్ని కృష్ణుడి అమాయకత్వానికి మురిసిపోయి అతని చేతుల్లోని నాలుగు ధాన్యపు గింజలను తీసుకొని ఆ చిన్ని చేతుల నిండా పండ్లను ఇచ్చింది. శ్రీ కృష్ణుడు ఆవిడా వైపే చూస్తూ చూస్తూ వెళ్లరు. ఆవిడా వెళ్లటానికి పండ్ల బుట్టని తీసుకొని వెళ్లబోతుంటే బుట్ట బరువుగా అనిపించింది. ఆవిడా దించి చూసుకుంది. బుట్ట నిండా బంగారం, రత్నాలు ఉన్నాయి. ఒకసారి నందవ్రజంలో పెద్దలందరూ సమావేశమయ్యారు. శ్రీ కృష్ణుడు పుటిన దగర నుంచి నందవ్రజంలో ప్రమాదాలు జరుగుతున్నాయి. అవి కూడా శ్రీ కృష్ణుడికే జరుగుతున్నాయి. దేవుడు రక్షిస్తున్నారు అనుకోని ఇక్కడే ఉంటె కృష్ణుడికి మరింత ప్రమాదం పెరుగుతుంది. కాబ్బటి మనం శ్రీ కృష్ణుడు కోసంమైన ఈ ప్రదేశాన్ని వదిలి వెళ్ళాలి అన్నారు. నందుడు తమ కుమారుడిపైన నందవ్రజంలో ఉన్న ప్రజలు చూపిస్తున్న ప్రేమకి సంతోషించి మీరు ఎలాగా చెపితే అలాగే చేద్దాము అన్నారు. కానీ మనం కొత్త ప్రదేశానికి వేళలో అంతే మనకి పశుసంపద ఎక్కువ కనుక నీళ్లు గడి ఎక్కువ దొరికే ప్రదేశానికి వేళలో అక్కడ పండ్లచెట్లు కూడా ఎక్కువగా ఉండాలి. ఏమి సంపద లేకపోతే కనీసం పండ్లు అయినా తినిబ్రతకచ్చు అని ఆలోచించసాగారు. పెద్దలు ఇక్కడికి దగరలో బృందావనం ఉంది మనం అక్కడికి వెళదాము అనుకొన్నారు. అందరూ సంతోషించారు. మరుసటి రోజు అందరూ తయారు అయి బండ్లు కట్టుకొని బయలుదేరారు. ఆడవాళ్లు, చిన్న పిల్లలు బండ్లలో వెళ్లరు. వెళుతున్న దారిలో యశోదమ్మ చిన్ని కృష్ణుడి గురించి పాటలు పడుకుంది. బృందావనం రాగానే చిన్ని కృష్ణుడు చాల సంతోషించారు. ప్రజలందరూ తాము వచ్చిన బండ్లను వలయాకారంలో పెట్టి తాము ఇళ్ళు కట్టుకునే వరకు అక్కడే ఉండాలి అని నిశయించుకున్నారు.  

శ్రీ కృష్ణ - మది చెట్టులా శాపవిమోచన లీల

మహాస్వామి వారి లీలలు - కాఫీ తెచ్చిన తంటా

మహాస్వామి వారి లీలలు - కాఫీ తెచ్చిన తంటా


చంద్రశేఖర భారతి మహా స్వామి వారికీ కాఫీ అంటే ఇష్టం ఉండేది కాదు. మహాస్వామి వారు తమ భక్తులకు  కాఫి మానేయాలి అని చెప్పేవారు. ఎందుకంటే కాఫీ ఆరోగ్యానికి మంచిది కాదు అని. ఒక సారి ఒక భక్తురాలు మహాస్వామి వారిని దర్శనం చేసుకుంటానికి వచ్చింది.  మహాస్వామి వారు ఆమెను చూడగానే అమ్మ ఇకనుంచి మీరు మీ కుటుంబ సభ్యులు కాఫీ తాగటం మానేయండి అది ఆరోగ్యానికి మంచిది కాదు అని అన్నారు. ఆ భక్తురాలు తడపడుతూనే అలాగే మహాస్వామి అన్నారు. ఆవిడా ఇంటికి తిరిగి వచ్చి ఆమె భర్తతో మహాస్వామి వారి దర్శనయానానికి వెళ్లి వచ్చాను. మహాస్వామి వారు మనల్ని కాఫీ మానేయమని చెప్పారు అండి. అయన కూడా మహాస్వామి వారి పరమ భక్తుల. ఈ విషయం విని మహాస్వామివారు చెప్పారా సరే అలాగే మానేస్తాను అన్నారు. అయన పొద్దునే నిద్ర లేవగానే కాఫీ, టిఫన్ తినంగానే కాఫీ, ఆఫీసుకి వెళ్ళేటపుడు కాఫీ, ఆఫీసుకి వెళినదగరనుంచి వచ్చేవరకు ఐదు, ఆరు సారులు కాఫీలు, ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన తరువాత రాత్రి భోజనం చేసేలోపు మూడు సారులు కాఫీ తాగేవారు. అటువంటి అయన మహాస్వామి చెప్పారు అని మానేస్తాను అని చెప్పారు. కాని కాఫీ బాగా అలవాటు అయిపోవటం వలన కష్టపడి రెండు రోజులు మానేశారు. ఇంకా మూడవరోజు నుంచి ఉండలేక మహాస్వామి వారి పటం ముందు ఆయనకు ప్రసాదంగా వేడివేడి కాఫీ పేటి తరువాత అయన తీసుకునేవారు. ఒక నెల రోజుల తరువాత మహాస్వామి వారి దర్శనానికి ఆ భార్యాభర్తలు వచ్చారు. మహాస్వామి వారు వాళ్లను చూడంగానే ఏమయ్యా నేను మిమ్మలిని కాఫీ మానేయమని చెప్తే అదే నాకు నైవేద్యంగా పెడతావా. ఆ కాఫీ వేడికి నామొఖం మండుతుంది ఇంకా నాకు కాఫీ నైవేద్యం పెట్టకు అన్నారు. ఆ భక్తుడు మహా స్వామి వారి పాదములపైపడి మహాస్వామి! ఇంక నేను కాఫీ తాగాను నన్ను క్షమించండి అని వేడుకున్నారు. ఇంక ఎపుడు అతను కాఫీ తాగలేదు.

మార్గశిరమాసం గురువారం లక్ష్మిదేవి వ్రతకథ

మార్గశిరమాసం గురువారం లక్ష్మిదేవి వ్రతకథ



పూర్వం కళింగదేశములో ఒక బ్రాహ్మణా కుటుంబం ఉండేది. ఆ దంపతులకు సుశీల అని ఒక కుమార్తె ఉండేది. ఆమె పుటిన కొంత కాలానికి ఆమె తల్లి మరణించింది. తండ్రి మళ్ళి వివాహం చేసుకున్నాడు. సవతి తల్లి ఆమె పిల్లలను ఎత్తుకొని ఆడించామని ఒక బెల్లం ముక్క తినమని ఇచ్చేది. సుశీల ఆ ఊరిలో వారు మార్గ శిరమాసం గురువారం వ్రతం చేసుకోవటం చూసి తనుకూడా చేసుకోవాలని మట్టితో లక్ష్మి ప్రతిమని చేసుకొని పెరడులో ఉన్న జిలేడు పువ్వులను, అక్కడ దొరికిన ఆకులతో లక్ష్మి దేవికి షోడశోపచరాలతో పూజ చేసి ఆమె సవతి తల్లి తనకు తినమని ఇచ్చిన బెల్లం ముక్కను నైవేద్యంగా పెటింది. లక్ష్మి దేవి ఆమె పూజకు మెచ్చి సకలైశ్వర్యములు ఇచ్చింది. కొంతకాలానికి సుశీలకు ఆమె తండ్రి వివాహం చేసి అత్తవారింటికి పంపించారు. సుశీల తాను పూజించుకుంటున లక్ష్మీదేవి ప్రతిమను కూడా తీసుకువెళ్ళింది. 

సుశీల వెళ్లిన దగర నుంచి పుటింటి వారి దారిద్ర్యం వచ్చింది. ఈ పని చేసిన కలిసి రాకపోవటం జరిగింది. సుశీల అత్తవారింటికి వెళ్లిన దగర నుంచి వాళ్లకు బాగా కలిసి వచ్చింది. సుశీల సవతి తల్లి వారి దారిద్ర్యం భరించలేక తన కుమారుడిని పిలిచి అక్క దగరకు వెళ్లి మన పరిస్థితిని చేపి అక్కని సహాయం చేయమని అడుగు అని పంపించింది. తమ్ముడు సుశీల దగరకు వచ్చి జరిగిన విషయం చేపి తమ సహాయం చేయమని అడుగుతారు. సుశీల తమ్ముడి మాటలకూ బాధపడి ఒక కర్రను తొలిపించి అందులో వరహాలు నింపి పంపించింది. తమ్ముడు ఆ కర్రను తీసుకొని వెళుతుందగా ఆ కర్ర ఎక్కడో పడిపోయింది. ఇంటికి వెళ్లి అక్క కర్ర ఇచ్చింది అని అది దారిలో పడిపోయింది అని చెప్పాడు. తల్లి బాధపడుతుంది. మరి కొంతకాలానికి మళ్ళి పంపిస్తుంది తమ్ముడు మళ్ళి అక్కదరరకు వెళతాడు. కర్రను ఇంటికి తీసుకువెళ్లలేక పోయాను అని చెపుతాడు. సుశీల బాధపడి ఈ సారి చూపులలో వరహాలు పేటి చెప్పులు కుటించి తమ్ముడికి ఇస్తుంది. తమ్ముడు వాటిని తీసుకువెళ్ళుతూ దారిలో మంచినీరు తాగటానికి చెప్పులను గట్టుమీద పేటి చెరువులోకి దిగుతాడు. మంచి నీరు తాగి వచ్చేసరికి చెప్పులు కనిపించవు. ఇంటికి వెళ్లి జరిగిన విషయం తల్లికి చెపుతాడు. తల్లి బాధపడుతుంది. మరి కొంతకాలానికి మళ్ళి తమ్ముడిని అక్క దగరకు పంపిస్తుంది. సుశీల జరిగినది తెలుసుకొని బాధపడి ఒక గుమ్మడి కాయను తొలిపించి దాని నిండా వరహాలు నింపి జాగ్రత్తగా తీసుకువెళ్ళమని తమ్ముడికి చెపుతుంది. తమ్ముడు వెళుతుండగా సంధ్య సమయం అయింది అని సంధ్య వార్చటానికి చెరువులోకి దిగుతారు. సంధ్య వార్చుకొని వచ్చి చుస్తే గట్టుమీద పెట్టిన గుమ్మడికాయ కనిపించదు. ఇంటికి వచ్చి తల్లికి విషయం చెపుతాడు. అయ్యో సుశీల మనకు ఎదో సహాయం చేయాలనీ చూస్తుంది కానీ అది మనకు చేరటం లేదు. 

ఈ సారి నేనే వెళాతాను అని పిల్లలను తీసుకొని బయలుదేరింది. సుశీల దగరకు వచ్చి జరిగినది చేపి బాధపడింది. సుశీల తల్లితో అమ్మ రేపటి నుంచి మార్గశిరమాసం గురువారం నేను లక్ష్మీదేవి పూజ చేస్తాను నువ్వుకూడా చేసుకో అని చెప్పి పూజ అయేంతవరకు ఏమి తినదు అని చెపుతుంది. తల్లి సరే అంటుంది. మరునాడు పిల్లలకి చద్దన్నం పెడుతూ ఒక ముద్ద నోటిలో వేసుకుంటుంది. సుశీల ఈ విషయం తెలుసుకొని తాను ఒకతె లక్ష్మి దేవి పూజ చేసుకుంటుంది. రెండోవారం మళ్ళి చెపుతుంది తల్లికి జాగ్రత్తగా ఉండమని తల్లి సరే అంటుంది. కానీ పిల్లలకి నూనె రాసి తనుకూడా రాసుకుంటుంది. అలా రెండోవారం కూడా కుదరదు. మూడోవారం సుశీల ఇలా కాదు అని తల్లిని ఒక గోతిలో కూర్చోపెట్టి పైన ఒక గంప పెట్టి మూస్తుంది. పిల్లలు అరటి పండ్లు తిని గంపమీద వేస్తారు. తల్లి ఏమి తోయక అరటి తొక్కలలో ఉన్న అరటి పండు గుజ్జుని తింటుంది. మూడోవారం కుదరదు. నాలుగోవారము సుశీల ఈసారి తన తల్లిని కొంగున కట్టుకొని వెంటే తిప్పుకొంటుంది. 

ఈ సరి తల్లి చేత వ్రతాన్ని పూర్తి చేయిస్తుంది. వాయనం అందుకోవటానికి లక్ష్మి దేవిని పిలుస్తుంది. లక్ష్మి దేవి సుశీల ఇచ్చిన వాయనని తీసుకొని ఆమె తల్లి ఇచ్చిన వాయనని తీసుకోనని వెళ్ళిపోతుంది. సుశీల ఏడుస్తూ లక్ష్మి దేవి పాదాలపై పడుతుంది. లక్ష్మి దేవి మీ సవతి తల్లి నువ్వు నా పూజ చేస్తున్నపుడు నిన్ను చుపురుతో కోటింది నేను అనే వాయనని తీసుకోను అన్నది. సుశీల తన తల్లి తప్పును క్షమించమని కోరుతుంది.లక్ష్మి దేవి కనికరించి సరే ఈ సరి మీ అమ్మ చేత వ్రతం చేయించు నేను వాయనం అందుకుంటాను అని చెప్పింది. సుశీల సంతోషించి అలాగే ఐదొవ గురువారం తన తల్లి చేత వ్రతం చేయిస్తుంది. జీవించినంతకాలం అష్టఐశ్వర్యాలతో  జీవించి మరణించిన తరువాత వైకుంఠం ప్రాపిస్తుంది అని దీవించింది లక్ష్మి దేవి.  అప్పటి నుండి పుటింటి వారికీ కూడా సకల అష్టఐశ్వర్యాలు వస్తాయి.సుశీల తల్లి తన తప్పుని తెలుసుకొని తన జీవించి నంతకాలం మార్గశిరమాసం గురువారం లక్ష్మి వ్రతం నియమ నిష్ఠలతో చేస్తాని కుమార్తెకి చెపుతుంది.   

సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా

సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా



సుబ్రహ్మణ్య షష్ఠిని స్కంద షష్ఠి అని కూడా అంటారు. సుబ్రహ్మణ్యశ్వరుడు జన్మించిన రోజును సుబ్రహ్మణ్య షష్ఠిగా జరుపుకుంటారు. సుబ్రహ్మణ్యడు జన్మించిన వివరణ స్కాందపురాణంలో, రామాయణంలోని బాలకాండలో విశ్వమిత్రుడు, రామలక్ష్మణులకు వివరించినట్టు ఉంది. తారకాసురుడు అనే రాక్షసుడు శివుని కోసం ఘోరతపస్సు చేసి శివుడి నుంచి మరణం లేకుండా వరం కావాలి అని కోరుకున్నారు. శివుడు మరణం లేకుండా వరం ఇవ్వటం కుదరదు ఇంకేమన్నా కోరుకోమన్నారు. తారకాసురుడు ఇలా ఆలోచించసాగాడు. అప్పటికే సతీదేవి యోగాగ్నితో మరణించింది. శివుడు మళ్ళి ఇప్పుడే వివాహం చేసుకోరు అని అనుకోని శివుడితో స్వామి! నాకు మీ కుమారుని వల్లనే నాకు మరణం రావాలి అని కోరుకుంటారు. శివుడు తధాస్తు అంటారు. తారకాసురుడు అహంకారంతో దేవతలను, మానవులను అందరిని పీడించటం మొదలు పెట్టారు. దేవతలు అతని బాధలు తట్టుకోలేక బ్రహ్మ దేవుని దగరకు వెళ్లరు. బ్రహ్మ దేవుడు దేవతల బాధలను విని తారకాసురుడు కేవలం శివుని కుమారుడిని వల్లనే మరణిస్తాడు. కానీ శివుడు సతీదేవి వియోగంతో తీర్వమైన తపస్సు చేస్తున్నారు. ఇంకా సతీదేవి పార్వతీదేవి రూపంలో హిమవంతుని కుమార్తెగా జన్మించింది. శివపార్వతులు వివాహం జరిగితే మీ బాధలు తీరుతాయి అని బ్రహ్మ దేవుడు చెప్పారు. పార్వతి దేవి శివుని కోసం తీర్వ తపస్సు చేసి శివుని మేపించి వివాహం చేసుకుంటుంది. తరువాత శివపార్వతులు ఏకాంతంగా ఉన్న సమయంలో దేవతలు శివునికి మొరపెట్టుకుంటానికి వచ్చారు. అదేసమయంలో శివుడు తన తేజస్సుని పార్వతికి ప్రసాదిస్తున్నారు. దేవతల మహాదేవ సదాశివ కాపాడండి కాపాడండి అని మొరపెట్టుకొని గట్టిగా అరిచారు. శివునికి ధ్యాన భంగం అయింది. శివుడు బయటకు వచ్చి ఎంతపని చేసారు దేవతలారా మేము మీకోసమే యోగమార్గము ద్వారా సంతాన ఉత్పత్తి చేస్తున్నాము మీరు దానిని పాడు చేసారు. ఇంకో వంద సంవత్సరముల వరకు నేను మళ్ళి సంతాన తేజస్సును ఉత్పత్తి చేయలేను అన్నారు. దేవతలు క్షమించండి స్వామి మేము తారకాసుర బాధలు భరించలేక ఇక్కడికి వచ్చాము. ఇప్పుడు మా పరిస్థితి ఏమిటి అని అడిగారు. శివుడు నేను చేయగలిగింది ఏమి లేదు ఇంకో వంద సంవత్సరములు ఓపిక పట్టాలి అని శివుడు వెళ్లిపోయారు. దేవతలు తమ తొదరపాటు తనానికి విచారిస్తూ తిరిగి వెళ్లిపోయారు. మళ్ళి వంద సంవత్సరముల తరువాత మళ్ళి పార్వతి పరమేశ్వరులు ఏకాంతములోకి వెళ్లరు. శివపార్వతులు ధ్యానంలో యోగ మార్గం ద్వారా సంతానమును సంపాందించి తేజస్సును ఉత్పత్తి చేసారు.

దేవతలు మళ్ళి తొదరపాటు తనంతో ఆ తేజస్సు తారకాసురుడు ఎక్కడ నాశనం చేస్తారో అని అగ్ని దేవుడిని ఆ తేజస్సుని అక్కడినుంచి తీసుకురమ్మని చెపుతారు ఇంద్రుడు. దేవతలు తమ సంతానని తీసుకొని వెళ్లిపోయారు అని తెలుసున్న పార్వతిమాత దేవతలు అందరికి తమ భార్యల ధర సంతానం కలుగదు అని శపించింది. తేజస్సుని తీసుకున్న అగ్ని దేవుడిని నీకు శుద్ధం, అశుద్ధం అని లేకుండా అన్నిటిని దహిస్తావు అని శపించింది. అగ్ని దేవుడు ఆ తేజస్సుని భరించలేక దానిని భూమాతకి అప్పగిస్తారు. ఈ విషయం తెలుసుకున్న భూమాతను నీకు బహు భర్తలు ఉంటారు. భూమిని పాలించేరాజు నీకు భర్త అవుతారు. అప్పటి నుంచే భూమిని పాలించేరాజులకు భూపతి అని పేరు వస్తుంది. భూమాత కుడా కొంతసేపటికి ఆ తేజస్సుని భరించలేకపోయింది. దానిని గంగామాతకి అప్పగించింది. గంగామాత కూడా ఆ తేజస్సుని భరించలేక దానిని హిమవత్ పర్వతం మీద వదిలేసింది. హిమవత్ పర్వతం మీద పడటం వాళ్ళ సుబ్రమణ్య స్వామికి స్కందుడు అని పేరు వచ్చింది.శివుని తేజస్సు హిమవత్ పర్వతం మీద నుంచి జారీ రెళ్ళ పొదలలో పడుతుంది. కొంతసేపటికి శివ తేజస్సు బాలుని రూపములో రూపాంతరం చెందింది. పుట్టటమే అయన ఆరు ముఖములతో జన్మించి నాలుగు వేదములు చదువుతున్నారు. అటుగా వచ్చిన కృత్తికలు ఆ బాలుడిని చూసి దగరకు తీసుకున్నారు. దేవతలు ఆ బాలునికి పలు ఇచ్చి పెంచమని చెప్పారు. కృత్తికలు మేము ఈ బాలునికి పాలు ఇస్తాము కానీ ఇతను మా బిడగానే పేరు పొందాలి అని అడుగుతారు. దేవతలు సరే అంటారు. కొంతకాలానికి కృత్తికలు ఆ బాలుడిని తీసుకొని కైలాసానికి వచ్చి శివపార్వతులకు అప్పగిస్తారు. కృత్తికలు పెంచారు కాబట్టి సుబ్రహ్మణ్యనికి కుమారస్వామి అని కార్తికేయుడని పేరులు వచ్చాయి. శివుడు సుబ్రహ్మణ్యుడికి సకల యుద్ధవిద్యలు నేర్పించారు. శివుడి సుబ్రహ్మణ్యుడి ప్రణవ మంత్రాన్ని ఉపదేశించారు. పార్వతిమాత సుబ్రహ్మణ్యుడి శక్తీ ఆయుధాన్ని ఇచ్చారు. సుబ్రహ్మణ్యుడిని దేవతలకు సేనాధిపతిగా నియమించి దేవతల సహాయంతో తారకాసురుని మీదకు యుద్ధనికి వెళ్లి తరకాసురుడిని సంహరించారు. దుష్ట శిక్షణ శిష్టరక్షణ జరిగిపోయాయి. 

సుబ్రహ్మణ్య షష్ఠి రోజునా షణ్ముకోత్పత్తి చదివిన విన్న సంతానం లేని వారికీ సంతానం కలుగుతుంది. సుబ్రహ్మణ్య షష్ఠి రోజునా సుబ్రహ్మణ్య స్వామిని నాగేంద్ర స్వామిగా భావించి ఈ రోజునా ఉపవాసం ఉండి పుటలో పాలుపోస్తారు. సుబ్రహ్మణ్య పూజలు నిర్వహిస్తారు. తమిళనాడు ప్రాంతాలలో సుబ్రమణ్య ఆలయాలలో తిరునాళ్లు, ఉత్సవాలు జరుగుతాయి.సుబ్రహ్మణ్య స్వామికి వల్లి, దేవసేన అనే ఇద్దరు భార్యలు ఉన్నారు. సుబ్రహ్మణ్య స్వామికి ఈ రోజునా కల్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తారు.

 

శ్రీ కృష్ణ - మది చెట్టులా శాపవిమోచన లీల

శ్రీ కృష్ణ

శ్రీ కృష్ణుడు, నల్లకుబేర మణిగ్రీవులకు శాప విముక్తిని ప్రసాదించిన లీల  



యశోదమ్మ చిన్ని కృష్ణుడుని రోలుకు కాటేసి ఇంటిలోకి వెళ్లిపోతుంది. చిన్ని కృష్ణుడు రోలుని విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ ఏడుస్తూ ఉన్నారు. కొంతసేపటి తరువాత చిన్ని కృష్ణుడు పాకటం మొదలు పెట్టారు. ఆయనతో పాటు రోలు కూడా దొర్లుకుంటూ వస్తుంది. చిన్ని కృష్ణుడు పాకుతూ రెండు మది చెట్టుల మధ్య నుంచి వెళ్లారు. ఆయనతో పాటు రోలుకూడా వచ్చింది. రోలు మది చెట్టులా నుంచి వెళ్లక చిన్ని కృష్ణుడు గట్టిగా లాగేసరికి మది చెట్టులు రెండు విరిగి పడిపోయి అందులో నుంచి ఇద్దరు దివ్య పురుషులు బయటకు వచ్చారు. వచ్చిన వారు చిన్ని కృష్ణుడు పరబ్రహ్మముగా భావించి స్తోత్రం చేసారు. చిన్ని కృష్ణుడు ఏమి తెలియని వాడిలా అమాయకంగా ఏడుస్తున్నారు. ఆ దివ్య పురుషులకు అసలు శాపం ఎలావచింది.



ఒకరోజు కుబేరుడి కుమారులైన నల్లకుబేర మణిగ్రీవులు ఆకాశ గంగలో గాంధర్వకన్యలతో దిగ్బంగారంగా స్నామము ఆచరిస్తున్నారు. అంతలో అటువైపు ఆకాశమార్గములో నారదమహర్షి వెళుతున్నారు. నారద మహర్షిని చుసిన గంధర్వకన్యలు వెంటనే వస్త్రాలను కట్టుకొని నారదునికి నమస్కరించారు. నల్లకుబేర మణిగ్రీవులు మాత్రం మద్యం మత్తులో నారదమహర్షిని నమస్కరించలేదు కదా కనీసం పాటించుకోలేదు. అపుడు నారద మహర్షి ఇలా అనుకున్నారు. ధనాధిపతిఅయిన కుబేరుని కుమారులు అతని సంపదకు వారసులు అయ్యారు కానీ అతని సంస్కారానికి వారసులు కాలేకపోయారు. వారిని దారిలోకి తీసుకురావాలి అనుకున్నారు. నల్లకుబేర మణిగ్రీవులతో నారద మహర్షి మీకు పెద్దల పట్ల భయభక్తులు లేవు. మహర్షులు సన్యాసులను గౌరవించాలి అని జ్ఞానం లేదు. పెద్దల ఎదుట ఇలా దిగంబరంగా ఉండకూడదు అని లేదు. మీరు నూరు దివ్య సంవత్సరములు మది చెట్లుగా పడియుండండి. నూరు దివ్య సంవత్సరముల తరువాత శ్రీమహా విష్ణువు భూలోకములో నందవ్రజంలో కృష్ణుడికి అవతరిస్తారు. ఏమి తెలియని అమాయకపు చిన్ని కృష్ణుడికి నమస్కరించే రోజు వస్తుంది అని చేపి నారదుడు అక్కడి నుంచి వెళ్లిపోయారు. నల్లకుబేరుల, మణిగ్రీవులు వెంటనే మది చెట్టులుగా మారిపోయారు. ఆలా బయటకు వచ్చిన దివ్య పురుషులు చిన్ని కృష్ణుడికి నమస్కరించి తమ వృతంతాని చేపి స్వామి మీ దయ వల్ల మాకు శాపవిమోచనం కలిగింది. ఎన్ని సంవత్సరాలుగా మీకోసం ఎదురు చూస్తాము అని చేపి చిన్ని కృష్ణుడికి నమస్కరించి వల్ల లోకానికి వెళ్లిపోయారు. మది చెట్టులు పడిన శబ్దం విని అందరూ పరిగెత్తుకు వచ్చారు. చిన్ని కృష్ణుడికి ఏమయిందో అని కంగారు పడుతూ వచ్చారు. యశోదమ్మ ఏడుస్తూ వచ్చి చిన్ని కృష్ణుడిని రోలు నుంచి విడదీస్తుంది. ఇంకా ఎప్పుడు రోలుకి కట్టాను అని ఏడుస్తుంది. చిన్ని కృష్ణుడు తన లీలలను తలుచుకొని నవ్వుకొని యశోదమ్మ ప్రేమను ఆస్వాదిస్తారు.


శ్రీ కృష్ణ -దామోదర లీలా

శ్రీ కృష్ణ

దామోదర లీలా



           ఒకరోజు యశోదమ్మ చల్ల చిలుకుతుంటే ఎక్కడినుంచి వచ్చారో చిన్ని కృష్ణుడు వచ్చి యశోదమ్మ చిలుకుతున చల్లని చేతితో పట్టుకొని అమ్మ నాకు ఆకలి వేస్తుంది. నాకు పాలు ఇవ్వు నేను మళ్ళి వెళ్లి ఆడుకోవాలి అని అడుగుతారు. యశోదమ్మా చల్ల చిలకటం ఆపేసి చిన్ని కృష్ణుడుని ఒళ్ళో కూర్చోపెట్టుకొని పాలు ఇస్తున్నారు. ఈ లోపు వంటగదిలో పోయి మీద పాలు పొంగుతుంటే చిన్ని కృష్ణుడిని కిందన పీట వేసి కూర్చోపెట్టి పాలు దింపటానికి వెళ్లారు. అంతే చిన్ని కృష్ణుడికి కోపం వచ్చింది. నాకు పాలు ఇవ్వకుండా మా అమ్మకు పొయ్యిమీద పాలు ముఖ్యమయ్యాయ అని అక్కడ ఉన్న చిన్న రాయి తీసుకొని చల్ల కుండను పగలకోటేసారు. దాంతో కుండలోని మజిగా, వెన్న బయటకు వచ్చేసాయి. అమ్మ నాకు పాలు ఇవ్వలేదు అని ఏడుస్తున్నారు. కొంత సేపటికి ఇదంతా మాజీగా వెన్న అయిపోయాయి అమ్మ చుస్తే కొడుతుంది అని నాలుగు వెన్న ముద్దలు గోబాగోబా నోటిలో పెట్టుకొని ఇంకో రెండు వెన్న ముద్దలు చేతితో తీసుకొని పెరడులోకి పరిగెత్తి అక్కడ రోలు ఉంటె దానిమీదకు ఎక్కి అక్కడే ఉన్న కోతులకు వెన్న పెడుతున్నారు. ఈలోపు యశోదమ్మ పాలు దించి వచ్చి చూసేసరికి ఇలంతా వెన్న మజిగా ఒలికిపోవటాని చూసి యశోదమ్మకి కోపం వచ్చింది. చిన్ని కృష్ణుడు ఎక్కడ ఉన్నాడా అని వెతుకుతూ పెరడులోకి వేస్తే అక్కడ కోతులకి వెన్న తినిపిస్తున్న చిన్ని కృష్ణుడు కనిపించారు. 



        యశోదమ్మ కోపంతో చిన్ని కృష్ణుడిని పట్టుకోవాలని వచ్చేసరికి చిన్ని కృష్ణుడు పారిపోయారు. చిన్ని కృష్ణుడు పరిగెత్తుకుంటూ వెళ్లి ఇంటి వరండాలో దాక్కున్నారు. యశోదమ్మ వెనకాలే వచ్చింది. వరండాలో స్తంభాల వెనకాల దాక్కున్నారు. ఆ స్తంభం నుంచి ఈ స్తంభం దగరకు ఈ స్తంభం దగర నుంచి ఆ స్తంభం దగరకు అమ్మకు దొరకుండా పరిగెడుతున్నారు. యశోదమ్మకు పరిగెత్తి పరిగెత్తి అలుపు వచ్చింది. యశోదమ్మ ఒకచోట కుంచుంటే ఏడుస్తూ చిన్ని కృష్ణుడు దగరకు వచ్చారు. వెంటనే యశోదమ్మ చిన్ని కృష్ణుడుని పట్టుకుంది. కొడదామని చేయి ఏతేసరికి చిన్ని కృష్ణుడి ఏడుపు మొహం చూసి కోటలేక తీసుకువెళ్లి రోలుకు కట్టాలని రోలుకి కఠిన తాడుతో చిన్ని కృష్ణుడి నడుముకి కడదామని చుస్తే రెండు అంగుళాలు తక్కువ వచ్చింది. ఇంకోతాడు ఈతాడుకి మళ్ళి కట్టి చుస్తే మళ్ళి రెండు అంగుళాలు తక్కువ వస్తుంది. ఈల చాల సేపటి తరువాత అమ్మ నన్ను కాటేయాలని నాకోసం కష్టపడుతుంది అని  చిన్ని కృష్ణుడికి యశోదమ్మ చేతితో రోలుకు కట్టబడ్డారు. అలా రోలుకు చిన్ని కృష్ణుడిని కటినపుడు చిన్ని కృష్ణుడి నడుము దగ్గర ఒక మచ్చ ఏర్పడింది. అప్పటినుంచే చిన్ని కృష్ణుడికి దామోదరుడు అని పేరు వచ్చింది. అయన చేసిన ఈ లీలను దామోదర లీలా అన్నారు.   

శ్రీకృష్ణుడు యశోదమ్మకు ఇచ్చిన బహుమతి

మార్గశిర మాసం విశిష్టత

మార్గశిర మాసం విశిష్టత 

మాసాలోకేలా శ్రేష్టమైనది, ముఖ్యమైనది, శ్రీమహావిష్ణువుకు ప్రీతికరమైనది మార్గశిరమాసం. ఈ మాసములో ఏమైనా భగవంతునికి సంబంధిచిన ఉపాసనలు త్వరగా ఫలితాన్ని ఇస్తాయి అని ప్రతీతి. 



బృహత్సామ తథా సామ్నాం గాయత్రీ ఛందసామహమ్ |

మాసానాం మార్గ శీర్షోహమ్ ఋతూనాం కుసుమాకరః ||

గానము చేయుటకు అనువైన శ్రుతులతో బృహత్సోమా మును నేను. చంధస్సులలో " గాయత్రిచంధస్సు"ను నేను. మాసములో మార్గశీరమాసమును, ఋతువులలో వసంతఋతువును నేనే అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో భగవద్గితలోని విభూతి యోగంలో వివరించారు. 


మాస సంక్రమణం

సూర్య భగవానుడు 12 నెలలో ఒక్కో నెల చపున్న ఒక్కో రాశిలో మారుతూ ఉంటారు. ఇలా మారుతూ ఉండటాన్ని " మాస సంక్రమణం" అంటారు. ఇలా ఒకో ఏడాది 12 సంక్రమణలు వస్తాయి. సూర్యుడు తులారాశి నుండి వృశ్చిక రాశిలోకి మారటానికి వృశ్చిక సంక్రమణం అంటారు. ఈ మార్గశిరమాసం శ్రీమహాలక్ష్మీదేవికి, శ్రీమహావిష్ణువుకి, సూర్యభగవానుడికి ఎంతో ప్రీతికరమైనది. 


మార్గశిర మాసంలోని ప్రత్యకమైన రోజులు

ఈ మాసంలో మొదట సుబ్రమణ్యషష్టి వస్తుంది. ఈ రోజున సుబ్రమణ్య స్వామికి పాలుపోసి పూజలు చేస్తారు. మార్గశిర మాసంలో ప్రతి గురువారం మహాలక్ష్మి దేవిని పూజిస్తారు. ఈ మాసములో ఏకాదశి రోజునా గీతా జయంతి వస్తుంది. శ్రీ కృష్ణ భగవానుడు లోకానికి భగవద్గిత అందించారు. ఈ ఏకాదశినే మోక్ష ఏకాదశి, ముకోటి ఏకాదశి అంటారు. ఈ మాసములో ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ఆ రోజునే హనుమద్వైతం, ప్రదోష వ్రతం జరుపుకుంటారు. తరువాత ఈ మాసములో దత్తాత్రేయ జయంతి వస్తుంది. తరువాత మార్గశిర పూర్ణమ ఆ తరువాత సంకష్టహర చేతుర్దశి, ఆ రోజునే శబరిమల అయ్యప్ప స్వామి మండల పూజ ప్రారంభమవుతాయి. తరువాత సఫల ఏకాదశి తరువాత కంచిపరమాచర్య ఆరాధన, రమణ మహర్షి జయంతి. తరువాత ప్రదోష వ్రతం వస్తుంది. తరువాత ఈ మాసం చివరిలో మాసశివరాత్రి వస్తుంది.  

పోలి స్వర్గం కథ, పోలి పాడ్యమి పూజ విశిష్టత

పోలి స్వర్గం కథ, పోలి పాడ్యమి పూజ విశిష్టత

పూజ విధానం

పోలి పాడ్యమి పూజ కార్తీక మాసం అమావాస్య పూర్తయి తెల్లవారుజామున పోలి పాడ్యమి  (మార్గశిర పాడ్యమి)పూజను నిర్వహిస్తారు. కార్తీక మాసం అంత పూజ చేయలేనివారు ఈ రోజునా ముపై వత్తులతో అరటి దోనెలలో ఆవునేతితో వెలిగించి నదిలో వదులుతారు. మార్గశిర పాడ్యమి రోజునా తెల్లవారుజామున నిద్ర లేచి నది స్నానానికి వెళ్లి స్నామమాచరించి అరటి దోనెలలో తిప్పలు వెలిగించి నదిలో వదలాలి. నదిలో దీపాలను శివుడు, విష్ణువు, గంగా, ,మహాలక్ష్మి దేవిగా భావిస్తారు. పూజ చేసి కార్తీక దామోదరుడిగా భావిస్తారు. దీపాన్ని వదిలేటపుడు పోలి స్వర్గం కథ చదువుకుంటారు. నదికి వెళ్లలేని వాళ్ళు చెరువుల దగ్గర కానీ, భావి దగ్గర కానీ లేక ఇంటిలోనే ఒక తోటేలో దీపాన్ని వదులుతారు.



పోలి స్వర్గం కథ

పూర్వం కృష్ణ తీరములో పోలమ్మ అనే ఒక మహిళా ఉంది. పోలమ్మ(పోలి) చిన్ననాటి నుంచి దైవ భక్తి ఎక్కువ. ఆమె ఊహ వచ్చినప్పటి నుంచి ప్రతి సంవత్సరం కార్తీక మాసం క్రమం తప్పకుండా చేసేది. ఆమెకు యుక్తి వయస్సు వచ్చిన తరువాత వివాహం జరిగింది. ఆమె అత్తగారి ఇంట్లో ఆమె ముగ్గురు తోడికోడళ్లు ఉండేవారు. ఆమె అత్త గారి మహా గయ్యాళి. పోలమ్మ భక్తి శ్రద్ధలను చూసి ఓర్వలేక పోయింది. పోలమ్మ వివాహం అయినా మొదటి సంవత్సరం కార్తీక మాసం వచ్చింది. ఆమె అత్తగారు ఆమెను పూజ చేసుకోనివ్వలేదు. ఆమె ఇంటిలోనే వదిలి పేటి మిగతా ముగ్గురు కొండలను తీసుకొని కృష్ణ నది స్నానానికి వేలాది. పోలమ్మను పూజ చేయనివ్వకూడదని ఆమెకు పూజ సామాను అందకుండా చేసేది అత్తగారు.  ఆమెకు సమయం ఉండకుండా ఇంటిపనులన్ని చెప్పేది. పోలమ్మ వాటినన్నిటిని ఓర్పుతో చేసి ప్రతి రోజు తెలవరకుండానే భావి దగర స్నానం చేసి పెరడులో పతిచెట్టు దగరకు వెళ్లి పతిని కోసి దానిని వతిగా చేసి ఇంటిలో ఉన్న వెన్నను పతికి రాసి కొబ్బరి చిప్పలో దీపాన్ని వెలిగించేది. దీపం ఎవరికీ కనపడకుండా బూటా బోర్లించేది. ఇలా నెల రోజులు చేసింది. ఆఖరి రోజు కార్తీక అమావాస్య వెళ్లి మార్గశిర పాడ్యమి రోజునా అలాగే చేసింది. ఆమె భక్తికి మెచ్చి శ్రీమహా విష్ణువు ఆమెను సశేరీరంగా వైకుంఠానికి తీసుకుంటామని విష్ణు దూతలను పంపించారు. విష్ణు దూతలు వెంటనే అక్కడికి వచ్చారు. పోలమ్మను వైకుంఠానికి తీసుకువెళతానికి విమానంలో ఏకించుకున్నారు. ఆ విమానాన్ని చుసిన పోలమ్మ అత్తగారు ఆ విమానం తమ కోసమే వచ్చింది అని అనుకోని దగరకు చెలగా అందులో పోలమ్మ కనిపించింది. మాకు దక్కనిది పోలమ్మకు ఎందుకు దక్కాలి అని ఆమె కళ్ళు పట్టుకొని లాగబోయారు. అప్పటికే విమానం పైకి వెళ్లిపోయింది. పోలమ్మ అత్తగారు పోలమ్మ కళ్ళు పట్టుకుంది. ఆ అత్తగారి వెనక ముగ్గురు కోడలు ఒకరికలు ఒకరు పట్టుకొని విమానంతో వెలసాగారు. కొంతదూరం వెళ్లిన తరువాత విష్ణు దూతలు పోలమ్మ అత్తగారి చేతులమీద కొట్టారు వాలు కిందపడి మరణించారు. అందరూ చూస్తుండగా పోలమ్మ సశరీరంగా వైకుంఠానికి వెళ్లిపోయింది. ఆమె అత్తగారు, ఆమె ముగ్గురు తోడికోడళ్లు యమభటులు వచ్చి తీసుకు వెళ్లరు. ఈ కథను దీపాన్ని వదిలేటపుడు చెప్పుకుంటారు. 


నాగేశ్వర జ్యోతిర్లింగం విశిష్టత

 నాగేశ్వర జ్యోతిర్లింగం విశిష్టత



పూర్వం దారుక వనంలో దారుకా, దారుకుడు అనే రాక్షస దంపతులు ఉండేవారు. వారిలో దారుక పార్వతి అమ్మవారి కోసం దారుక వనంలో ఆరు సంవత్సరములు తపస్సు చేసింది. ఆమె తపస్సుకు మెచ్చి పార్వతి అమ్మవారు ప్రత్యక్షమైనది. దారుకాను వరం కోరుకోమనది. దారుకా అమ్మవారితో 'అమ్మ! నాకు, నా భర్తకు ఇతరుల వాళ్ళ, కానీ శివుడి వాళ్ళ కానీ మాకు ఆపదలు వచ్చినపుడు నువ్వు వచ్చి నన్ను రక్షించాలి' అని అడిగింది. అమ్మవారు "తధాస్తు" అని అమ్మవారు అదృశ్యమైయింది. ఇక ఆ వరముతో అహంకారం పెరిగి దారుకా, దారుకుడు మిగిలిన రాక్షసులు దేవతలపైనా, మునులపైనా, మానవులపైనా విజృంభించి అందరిని చంపి తినటం మొదలు పెట్టింది. వీళ్ళ అకృత్యాలు భరించలేక దేవతలు, మానవులు, మునులు, ఋషులు కలిసి భృగువు మహర్షి  కుమారుడు ఐన అరువుడు మహర్షిని శరణు కోరారు.

అరువుడు వారి విన్నపాలు విని మీకు ఏమి కష్టం వచ్చింది. ఎందుకని అలా భయపడుతున్నారు అని అడిగారు. దానికి దేవతలు దారుకా అనే రాక్షసి పార్వతి దేవి వరం తో విజృభించి ఆమె భర్త ఆమె పరివారం కలిసి మానవులను, మునులను, ఋషులను చంపి తినేస్తున్నారు. మాతో యుద్ధం చేసి మా సామ్రాజ్యం లాక్కున్నారు. మాకు నువ్వు దిక్కు అని శరణువేడారు. అరువుడు వారికీ అభయమిచ్చి వారి కోసం యజ్ఞం చేసారు. అందులో నుంచి అమృతం వచ్చింది. దానిని వారికీ ఇస్తూ ఈ అమృతం తాగటం వాళ్ళ మీ శరీరం వజ్రం లాగా తయారవుతుంది. రాక్షసులు మిమ్మలిని ఏమి చేయలేరు. ఈ అమృతం ప్రభావం సంవత్సరం ఉంటుంది అని చేపి ఇచ్చారు. దేవతలు, మానవులు, మునులు, ఋషులు అందరూ ఆ అమృతం తాగారు. వెంటనే అందరూ వెళ్లి రాక్షసులతో యుద్ధం చేసారు. రాక్షసులలో మూడు వంతులు రాక్షుసులను చంపేశారు. రాక్షసులందరు పారిపోయారు. 

దారుకా తన రాక్షసులందరిని తీసుకొని సముద్రంలోని ఒక ద్విపానికి తీసుకొని వేలింది. మనం ఒక సంవత్సరం ఇక్కడే ఉందాము. సముద్రంలో ఓడలో వచ్చే వారిని చంపి తిన్నెదాము. సంవత్సరం తరువాత మనం మళ్ళి అక్కడకు వెళదాము అని చెప్పింది. రాక్షసులందరు అక్కడే ఉండేవారు. సముద్రంలో ప్రయాణం చేస్తున్న మానవులను తినటం మొదలు పెట్టారు. కొంతకాలం తరువాత అటువైపుగా సుప్రియుడు అనే వ్యాపారి పద్నాలుగు ఓడలను తీసుకొని వ్యాపారనిమిత్తం సముద్రంలో ప్రయాణించటం మొదలు పెట్టారు. ఈ సుప్రియుడు గొప్ప శివభక్తుడు అతను రోజు శివునికి పూజ చేస్తే గాని మంచినీరుని కూడా తీసుకొనే వారు కాదు. రాక్షసులు అటుగా వెళుతున్న ఓడలను చూసారు. వాళ్ళు ఆ ఓడలను ఒడ్డుకు తీసుకొచ్చి  అందులో ఉన్న సుప్రియుడు అతని పరివారాన్ని ఆ ద్విపములోని దారుకావనంలో బంధించారు. వారిలో ఉన్న కొంతమందిని తీసుకొని వెళ్లి చంపి తినేశారు. సుప్రియుడు అక్కడే ఉన్న ఇసుకతో ఒక శివలింగం చేసి శివ పూజ చేయటం మొదలు పెట్టారు. మీరందరు భయపడకండి మనకు శివుడే రక్షా అని శివుడిని ప్రార్ధన చేసారు. అందుకో కాసేపటికి శివ తేజస్సు వచ్చింది. ఏమి జరిగిన శివ పూజ మానకూడదు అని శివ పంచాక్షరీ జపిస్తూ అక్కడే ఉన్న ఇసుకనే సమస్త పూజ ద్రవ్యాలుగా భావించి పూజించటం మొదలు పెట్టారు. వీళ్ళు ఈ పూజ చేస్తుంటే వీరికి కాపలా కాస్తున్న రాక్షసులు భయపడి వెళ్లి దారుకకి చెప్పారు. దారుకా మండిపడుతూ వారి దగరకు వచ్చింది. అక్కడికి వచ్చిన దారుకకి, ఆమె భర్తకి అక్కడ శివలింగాన్నికి బదులు ఒక చిన్న పిల్లవాడు కూర్చొని ఉన్నారు. ఆ చిన్న పిల్లవాడు పది చేతులతో, ఐదు తలాలతో కనిపించరు. దారుకా భయపడిని వెంటనే తేరుకొని నువ్వు ఏమి చేస్తున్నావు. నీవు చేస్తున్న పూజను ఆపు లేకపోతే నిన్ను చంపేస్తాను అను బెదిరించింది. కానీ సుప్రియుడు భయపడకుండా నాకు సర్వం శివమయమే నాకు ఎన్ని రోజులు శివుడు భోగములు ఇచ్చారు. ఇప్పుడు నువ్వు నన్ను చంపినా అదికూడా శివుడే నన్ను చంపి తనలో లీనం చేసుకుంటున్నాడు అనుకుంటాను అని చెప్పారు. అతను అలా అంటుండేనే అతను చేసిన శివలింగం కాస్త జ్యోతిర్లింగంగా మారింది అక్కడ ఇక ఆలయం వచ్చింది. ప్రమాదాగణములు కూడా ప్రత్యక్షమైనారు. శివుడు, ప్రమాధానములు కలిసి రాక్షసులను చంపేశారు. ఆఖరికి దారుకుడిని చంపటానికి శివుడు శూలం వేశారు. వెంటనే దారుకా అమ్మ పార్వతి దేవి నా పసుకు కుంకుమలు కాపాడమని ప్రాదించింది. అమ్మవారు అక్కడ ప్రత్యక్షమైది. దారుకుడిని రక్షచింది కానీ దారుకాని మందలిస్తూ నీవు చేస్తుంది తప్పు నేను వరం ఇచ్చాను అనే గర్వంతో విర్రవీగి అందరిని చంపి తినటం మొదలు పెట్టావు అని ఆగ్రహించింది. అమ్మవారి ఉగ్రరూపం చూసి దారుకా వణికిపోతూ నన్ను క్షమించు అమ్మ నేను తప్పు చేశాను. ఇకనుంచి రాక్షసత్వాన్ని విడిచి పెడతాను. ఎవరిని ఈబంధి పెట్టాను ఎవరిని తినను అని వేడుకుంది. పార్వతి దేవి శాంతించి నువ్వు, నీ భర్త ఈ రోజునుంచి అదృశ్య రూపములో ఇక్కడికి వచ్చిన వారిని సేవించండి. పార్వతిమాత శివునితో స్వామి మీరు ఎవరికోసమైతే ఎక్కడికి వచ్చారో అతని కోసం మీరు ఇక్కడే జ్యోతిర్లింగంగా వేలమంది. ఈ సుప్రిథుడి కుమారుడైన నాగేశ్వరుని పేరుమీద నాగేశ్వర జ్యోతిర్లింగంగా ఇక్కడే వెలసి కలియుగాంతం వరకు ఉండండి. ఆ శివలింగంలో అమ్మవారి తేజస్సు కూడా వచ్చి కలిసింది. దారుకతో మీరు ఇకనుంచి అదృశ్య రూపములో జ్యోతిర్లింగాని సేవిస్తూ ఎక్కడికి వచ్చిన భక్తులను గౌరవించండి అని ఆజ్ఞాపించింది. సుప్రితుడిని అతని పరివారాన్ని బంధనాలు నుంచి విడిపించింది. వ్యాపారంలో నష్టాలు, కష్టాలు వచ్చిన వారికీ ఇక్కడికి  వచ్చి నాగేశ్వరుడిని పూజించిన వారికీ  వ్యాపారంలో నష్టాలు పోయి లాభాలు వస్తాయి అని ఆశీర్వదించింది. శివుడు కూడా పార్వతీదేవి కోరినట్టు కలియుగాంతంవరకు ఇక్కడే ఉంటాను. 



రామేశ్వర జ్యోతిర్లింగం విశిష్టత

రామేశ్వర జ్యోతిర్లింగం విశిష్టత



పూర్వం రామరావణ యుద్ధం తరువాత సీత సమేతంగా రాముడు పుష్పకవిమానం మీద వస్తుండగా సముద్రం ఇవతల దిగ్గారు. రావణాసురుడు ఎంత దుర్మార్గుడు మైన పుట్టుకతో బ్రాహ్మణుడు కనుక అతనిని వధించటం వలన తనకు బ్రహ్మహత్యాపాతకం చుట్టుకుంది అని రాముడు శివలింగాన్ని ప్రతిష్టించాలి అని అనుకున్నారు. విభీషణుడు ముహూర్తం పెట్టారు. రాముడి దగ్గర హనుమంతుడు కైలాసానికి వెళ్లి శివలింగమును తీసుకురావటానికి వెళ్లారు. హనుమంతుడు వెళ్లి చాలాసేపయింది కదా అని ఈ లోపు సీతామాత ఇసుకతో ఒక శివలింగాన్ని తయారుచేసింది. శ్రీరాముడు ముహూర్తసమయం అయింది ఆ ఇసుక లింగాన్ని శాస్త్రోప్తంగా ప్రతిష్టించారు. తరువాత ఆంజనేయుడు శివుడిని అడిగి శివలింగాన్ని తీసుకువచ్చారు. ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్టించటం చూసి ఆంజనేయస్వామికి కోపం వచ్చింది చాల బాధపడ్డారు. శ్రీరాముడు వచ్చి ఆంజనేయ బాధపడకు ముహూర్తం దాటిపోతుంది అని ఇసుక లింగాన్ని ప్రతిష్టించను. అనే కాదు స్వామి నేను చాల కష్టపడి శివలింగాన్ని తీసుకువచ్చాను దానినే ప్రతిష్టించాలి అన్నారు. శ్రీరాముడు ఎంత చూపిన ఆంజనేయ స్వామి వినటం లేదు అని సరే నేను ప్రతిష్టించిన శివలింగాన్ని తీసెయ్యి నువ్వు తెచ్చింది ప్రతిష్టిద్దాము అన్నారు. వెంటనే ఆంజనేయస్వామి తన తోకతో శివలింగాన్ని చుట్టి కదపటానికి ప్రయతించారు. ఎంత ప్రయతించిన శివలింగం కదలక పోవటంతో ఆంజనేయస్వామికి ఏమి చేయాలో అర్థం కాలేదు. శివుడు ఆ లింగములో ప్రత్యక్షమై ఆంజనేయ బాధపడకు ఆ శివలింగాన్ని సాక్షాత్తు అమ్మవారు స్వరూపమైన సీతాదేవి వలన తాయారు చేయబడి శ్రీమహావిష్ణువు స్వరూపుడైన శ్రీరాముడితో ప్రతిష్టించబడింది కాబ్బటి అది జ్యోతిర్లింగం అయింది. శ్రీరాముడి చేతప్రతిష్టించబడినది కాబ్బటి ఈ శివలింగం రామేశ్వర జ్యోతిర్లింగం అయింది. నీవు తెచ్చిన శివలింగం నా అనుగ్రహంతో స్పటిక లింగం అవుతుంది. ఈ లింగాన్ని కూడా ప్రతిష్టించాంది. హనుమన్నతుని చేత ప్రతిష్టించిన లింగం కాబ్బటి హనుమంతేశ్వర లింగం అని పేరు వస్తుంది. రామేశ్వర శివలింగం తో పటు ఈ శివ లింగాన్ని కూడా దర్శనం చేసుకుంటే జ్యోతిర్లింగాన్ని దర్శనం చేసుకున్నా పుణ్యం ఫలితం వస్తుంది అని శివుడు అదృశ్యమయ్యారు. ఈ రామేశ్వర జ్యోతిర్లింగం దర్శనం చేసుకున్న, ఈ కథ చదివిన సకల పాపములు శాశించిపోతాయి.

డాకిని భీమశంకర జ్యోతిర్లింగం విశిష్టత

డాకిని భీమశంకర జ్యోతిర్లింగం విశిష్టత



            కామరూప దేశంలో పూర్వకాలంలో అడవులలో భీముడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతని తల్లి పేరు కర్కాసి. భీముడు ఒకసారి తోటిపిల్లలతో ఆడుకుంటుండగా తోటిపిల్లలు ఆటలలో కాపురాలు చెప్పుకుంటూ మా నాన్న నాన్న అంటూవుంటే భీముడికి అనుమానం వచ్చి వెంటనే తల్లి అయినా కర్కాసి దగరకు వెళ్లి అమ్మ! మా నాన్న ఎవరు. నాన్న మన దగర ఎందుకు ఉండటం లేదు అని అడిగాడు. అందుకు తల్లి మీ నాన్న కుంభకర్ణుడు. మీ పెద్దనాన్న రావణుడు. మీ నాన్న కుంభకర్ణుడు రాముడి యుద్దములో మరణించాడు. మా నాన్న పేరు కర్కాటుడు. కొన్నాళ్లకి నేను జన్మించాను. నాకు మా పేరే నాకు కూడా కర్కటి అని పెట్టారు. నేను పెద్ద అయినా తరువాత విరాజుడుకి లేచి వివాహం చేసారు. రాముడు వనవాసం చేస్తూ వచ్చి రాముడికి విరాజుడికి యుద్ధం జరిగి విరాజుడు మరణించాడు. ఆడదానిని కనుక నను ఏమి చేయలేదు. నేను అడవిలోకి పారిపోయాను. అడవిలో భయపడుతూ ఉండగా ఒకసారి కుంభకర్ణుడు నను చూసి మోహించి నాకు నిన్ను ఇచ్చారు. నను వివాహం చేసుకోలేదు. కుంభకర్ణుడుతో నను కూడా తనతో తీసుకు వెళ్ళమని అడిగాను. అయన ఒప్పుకోలేదు నన్ను ఇక్కడే వదిలేసారు. నా భర్త విరాజుడు, మీ తండ్రి కుంభకర్ణుడు. నేను ఇంకా అక్కడ ఉండలేక నా తల్లీతండ్రుల దగరకు వేళ్లను. కోణాలకు నువ్వు జన్మిచావు. కొన్నాళ్లకి కర్కాసి తల్లితండ్రులకు నరమాంసం తినాలని అనిపించి చూస్తుండగా అక్కడకి అగస్యమహర్షి శిష్యుడు సుతిషుణుడు అక్కడకి వచ్చారు. అతనిని చంపాలని కర్కాసి తల్లితండ్రులు పడ్డారు. ఆ మహర్షికి కోపంతో హుంకారం చేసారు వాళ్ళు మాడిమసయిపోయారు. నేను భయపడి నిన్ను తీసుకొని ఈ కొండా గుహలో దాక్కున్నాను. ఇక్కడే ఉండిపోయాను. కొన్నాళ్లకి రామరావణ యుద్ధంలో కుంభకర్ణుడు, రావణుడు మరణించారు. నువ్వు పెరిగి పేదవాడివయ్యావు. నా మాట విని నువ్వు రాముడి మీద పగ పెట్టుకోకు అంత శక్తివంతుడైన మీ తండ్రే రాముడి ముందు నిలబడలేదు. నా ఇద్దరు భర్తలు మరణించారు. నా తల్లి తండ్రులు మరణించారు. నీకు ఉంది నువ్వు ఒక్కడివే అని బాధపడింది. అంత విన్నాడు కానీ భీముడికి మనసులో తన తండ్రిని చంపినా వాళ్లపై పగ తీర్చుకోవాలి అని అనుకున్నాడు. ఒకరోజు భీముడు ఆలోచిస్తుండగా అక్కడికి రావణుడికి కొంతకాలం పురోహితుడిగా పనిచేసిన మాల్యవంతుడు వచ్చాడు. భీముడి మాల్యవంతుడు ఒకరిగురించి ఒకరు తెలుసుకొని భీముడు నాకు మాతండ్రిగారి మరణంపై ప్రతీకారం తీర్చుకోవాలి అని ఉంది నాకు మార్గం చెప్పండి అని వేడుకున్నాడు. మాల్యవంతుడు భీముడితో భీమా! నువ్వు తపస్సు చేసి బ్రహ్మ దేవుడి గురించి తపస్సు చేసి వరం అడుగు నీ కోరిక నెరవేరుతుంది అన్నారు. భీముడు వెంటనే డాకిని అనే ప్రదేశానికి వెళ్లి తపస్సు చేయటం మొదలు పెట్టాడు. మరికొంతకాలానికి భీముడి తపస్సు తీవ్రతరం అయింది. అతని తపస్సుకి మెచ్చి బ్రహ్మ దేవుడు మెచ్చుకొని ప్రత్యక్షమయ్యారు. భీముడు నమస్కరించి నాకు చావులేకుండా వరం ఇవ్వు అని అడిగారు. అందుకు బ్రహ్మదేవుడు చావు లేకుండా వరం ఇవ్వటం కుదరదు. ఇంకా ఏమయినా అడుగు అన్నారు. భీముడు అయితే నాకు మతిముద్దలోనుంచి ఒక తేజస్సు వచ్చి నన్ను చంపాలి అని కోరుకున్నారు. బ్రహ్మ దేవుడు తధాస్తు అని అదృశ్యమయ్యారు. బీముడి అహంకారంతో తన తల్లి దగరకు వెళ్లి చూసావా అమ్మ నేన్ను బ్రహ్మ దేవుడి దగర వారములు పొందాను. నాకు ఇంకా ఎదురు లేదు అని విర్రవీగాడు. అతని తల్లి నువ్వు ఏమయినా చేయి ఎవరినైనా ఎదిరించు కానీ విష్ణుమూర్తి గోలికి వేలకు నీకు పుణ్యం ఉంటుంది. రాముడు ఈపాటికే దేహత్యాగం చేసారు అంట అన్నది. భీముడు సరే అన్నారు. వెంటనే యుధ్ధానికి బయలుదేరాడు. సమస్తలోకములపై దండయాత్ర చేసి అన్నిటిని వశం చేసుకున్నాడు. ఒక కామరూప దేశం పైన కూడా దండయాత్ర చేసి రాజు సుధక్షుణుడిని ఓడించి ఆ రాజుని అతని భార్యని గొలుసులతో కాటేసి చెరసాలలో బంధించారు. ఈ సుధక్షుణుడు గొప్ప శివ భక్తుడు. అతను ఏమి చేసిన చేయక పోయిన శివ పూజ చేయకుండా ఉండలేరు. చెరసాల మట్టినేల అవటం వాళ్ళ ఆ మట్టినే పోగుచేసి మట్టిముద్దను చేసి దానితో శివలింగాన్ని చేసారు. పూజకి ఏమిలేకపోయిన వాటిని మనస్సులోనే ఊహించుకుంటూ మానసిక పూజ చేయటం మొదలు పెట్టారు. కొంతకాలానికి దేవతలు భీముడి భాదలు పడలేక బ్రహ్మ దేవుని దగ్గరకు వెళ్లరు. వారి భాదలు మొరపెట్టుకున్నారు. బ్రహ్మదేవుడు వీరిని తీసుకొని కైలాసానికి వెళ్లరు. మహాదేవుడు వారి మొరలను విని వారితో భీముడి తపస్సు వలన వచ్చిన పుణ్యం అయిపోవచ్చింది. అతనిని సంహరించటానికి సమయం ఆసన్నమైనది. కానీ నేను నేరుగా వెళ్లి సంహరించలేను ఎందుకంటే బ్రహ్మ దేవుడు అతనికి మట్టిముద్దలో నుంచివచ్చిన తేజస్సు వచ్చి సంహరించాలి అని కోరుకున్నారు. నేను బ్రహ్మ దేవుడు ఇచ్చిన వరమును గౌరవిస్తున్నాను. భీముని చెరసాలలో నా పరమ భక్తుడు అయినా సుధక్షుణుడు ఉన్నాడు. దేవతలారా మీరు వెళ్లి సుదక్షునితో రేపు భీముని మరణం ఆసన్నమైనది. ప్రాణం పోయిన కూడా ఏమి జరిగిన శివ పూజ మాత్రం మానదు అని చెప్పమని చెప్పారు మహాదేవుడు. దేవతలు అదృశ్య రూపములో వెళ్లి సుదక్షిణుడికి చెప్పారు. అపుడు సుధక్షుణుడు అలాగే స్వామి రేపు ఏమి జరిగిన నేను మరణించేవరకు శివ పూజ మానను అని చెప్పారు. ఇక్కడ భీముడు భటులతో సుధక్షుణుడు మారాడా నన్ను స్మరిస్తున్నారా వెళ్లి ఒక సారి చూసి రండి అని చెప్పారు. శివుడు కూడా సుధక్షుణుడు పూజ చేస్తున్న శివలింగంలోకి వచ్చేసారు. భటులు చూసి వచ్చి భీముడితో మహారాజ సుధక్షుణుడు శివుడిని పూజ చేస్తున్నాడు. మిమల్ని పూజించటం లేదు అని చెపుతారు. భీముడికి కోపం వచ్చింది వెంటనే సుధక్షుణుడి దగరకు వచ్చి సుధక్షుణుడిని ఇవతలకు లాగి కొట్టసాగారు. భీముడు ఎంత కొట్టిన శివ శివ అనటం మానలేదు. శివలింగాన్ని పడేస్తాను అని మట్టి శివలింగం మీదకి తన కత్తిని విసిరాడు. కతివెళ్లి శివలింగం మధ్యలో గుచ్చుకుంది. వెంటనే శివలింగంలో నుంచి శివుడు భీకర ఆకారంతో వచ్చారు. భీముడు వెంటనే అహంకారంతో శివుడి మీదకు యుద్ధనికి వేలాడు. శివుడు ఒక హుంకారం చేసారు వెంటనే భీముడు రాక్షసులతో సహా కాలి భూడిద అయిపోయారు. భీముడు భస్మమై శివుడి మీద పడి భస్మాభిషేకం చేసినట్టు అయింది. ఇక నుంచి భస్మంతో నన్ను పూజించిన వారికీ సకల కోరికలు వేరవేరతాయి. నా భక్తులందరూ భస్మం(విభూధిని) ధరించినా వారు నాకు ప్రీతిపాత్రులు. విభూధిని ధరించి ఉండగా మరణం సంభవిస్తే వారు నరకానికి వెళ్లారు. నా సన్నిధానానికి వస్తారు. భీముడిని సంహరించిన ప్రదేశం కాబటి నేను భీమశంకరా జ్యోతిర్లింగంగా వెలుస్తాను. సుదక్షిణ మహా రాజా ఈ డాకిని ప్రదేశములోనే నేను వెలిసాను కాబటి నాకు ఇక్కడ ఒక ఆలయాన్ని నిర్మిచు అని చెప్పారు. శివునికి ఆలయాన్ని నిర్మించే అదృష్టం తనకు కలిగినందుకు సుధక్షుణుడు సంతోషించారు. సుధక్షుణుడికి అప్పటి నుండి ఎటువంటి ఆపదలు రాకుండా సురక్షితంగా రాజ్యాన్ని పాలించారు. ఆఖరున శివ సాన్నిధ్యం చేరుకున్నారు.

వైద్యనాథ జ్యోతిర్లింగం విశిష్టత

వైద్యనాథ జ్యోతిర్లింగం విశిష్టత



పూర్వం పులస్తుడు అనే ప్రజాపతి ఉండేవారు. విశ్రవసు అనే కుమారుడు ఉన్నాడు అతని రెండొవ భార్య కైకసి. వీరికి ముగ్గురు కుమారులు ఒక కుమార్తె వాళ్ళు రావణుడు, కుంభకర్ణుడు, సూర్పనఖ, విభిషణుడు. ఒకసారి వీళ్ళు ఒకసారి తమ తల్లి కైకసి దగరకు వెళ్లరు. వాళ్ళు అమ్మ నీకు ఏమైనా కోరిక ఉంటె చూపు తీరుస్తాము అన్నారు. ఈ కైకసి గొప్ప శివభక్తురాలు. నాకు శివ జ్యోతిర్లింగం కావాలి. దానిని ప్రతిరోజు పూజచేసుకుంటాను లంక నగరానికి తీసుకురండి అన్నారు. వారిలో రావణుడు నేనే తీసుకువస్తాను అని బయలుదేరారు. కైలాసపర్వతం దగరకు వెళ్లరు శివుడిని అత్యంత భక్తితో ప్రాదించారు. శివుడు ప్రత్యక్షమవలేదు. హిమాలయాలలో దక్షిణభాగములోకి వెళ్లి అక్కడ అగ్నిని మండించి అందులో కూర్చొని తపస్సు చేయటం మొదలు పెట్టాడు. తరువాత ఎంత తపస్సు చేసిన శివుడు ప్రత్యక్షం కాలేదు. రావణాసురుడు ఇక తపస్సు చాలించి తన తలలను అగ్నిలో వేయటం మొదలు పెట్టాడు. తొమ్మిది తలలు వేసాడు. పదోవతల వేసేటపుడు శివుడు ప్రత్యక్షమయ్యారు. రావణ ని తపస్సుకి నీ త్యాగానికి మెచ్చాను. నీకు ఏమివరం కావాలో కోరుకో అన్నారు. అపుడు రావణుడు పరమేశ్వర నాకు జ్యోతిర్లింగం కావాలి నేను లంకలో ప్రతిష్టించి పూజించుకుంటాను. అపుడు మహాదేవుడు రావణ అలాగే నువ్వు అడిగిన వరం ఇస్తున్నాను. కానీ జ్యోతిర్లింగానికి కొన్ని నియమాలు ఉన్నాయి. నీవు జ్యోతిర్లింగంతో ఆకాశగమనం చేయకూడదు ఇది శక్తివంతమైనది నడిచే వెళాళ్లి. ఇంకొకటి ఈ జ్యోతిర్లింగం లంకకు వెళ్లెవరకూ భూమిపైనా పెట్టకూడదు. భూమిపైనా పెడితే నేను కూడా తీయలేను అని చేపి జ్యోతిర్లింగం రావణుడికి ఇచ్చి మహాదేవుడు అదృశ్యం అయ్యారు. రావణుడు సంతోషంతో జ్యోతిర్లింగం తీసుకొని నడిచి వెళతాం మొదలు పెట్టారు. మహాదేవుడు రావణుడికి జ్యోతిర్లింగాని ఇచ్చాను కానీ అతని ఆలోచన మంచిగా లేదు. ఇప్పటికే రావణుడు చాలా పాపాలు చేస్తున్నాడు. దేవతలు అందరూ మొరపెట్టుకున్నారు. ఇపుడు నా జ్యోతిర్లింగం కూడా వెళితే నా బలం కూడా పెరిగి రావణుడు ఇంకా రెచ్చిపోతాడు. ఇతను పాపాలకి ఇంకా అడ్డుఅదుపు ఉండదు అని రావణాసురుడిని పరీక్షించాలి అనుకున్నారు. మహారాష్ట్రకు రాగానే మూత్రవిసర్జనకు వెళ్లవలసి వచ్చింది. ఆపుకోలేనంత బాధవచేసింది. రావణుడు చుటూ చూసాడు అక్కడ ఒక గోపాలబాలుడు ఉన్నాడు. అతనిని పిలచి ఈ శివలింగాన్ని కాసేపు పట్టుకో నేను ఇపుడే వస్తాను. నేను వచ్చేవరకు పట్టుకో ఇకు ఏమి కావాలి అంటే అది ఇస్తాను అని చేపి ఆ శివలింగాన్ని ఆ గోపాలుడికి ఇచ్చారు. ఆ గోపాలుడు శివలింగాన్ని మోయలేక మోతున్నాను చాలా బరువుగా ఉంది నువ్వు తొందరగా రామన్నాడు. రావణుడు మూత్ర విసర్జనకు వెళ్లరు. రావణుడు వచ్చేలోపు ఈ శివలింగం బరువు మోయలేక రావణుడిని పిలిచి నేను కింద పెటేసి వెళ్లి పోయాడు. రావణుడు వచ్చి శివలింగాన్ని కదిలించటానికి ప్రయతించాడు. కానీ రాలేదు. భూమి అదిరిపోయింది కానీ శివలింగం కదలలేదు. మహాదేవుడు ప్రత్యక్షమై రావణ జ్యోతిర్లింగం భూమి ఆకర్షణ శక్తికి పైకి రాదు. నేను కూడా తీయలేను. దీనిని ఇక్కడే ఉండనే ఉండనీయి. ఈ జ్యోతిర్లింగాన్ని పెకలించటానికి ప్రయత్నిచి శరీరమంతా గాయాలు అయ్యాయి. ఈ జ్యోతిర్లింగానికి అర్చన చేయి నీ గాయాలు మాయ మవుతాయి. ఇకనుంచి ఈ జ్యోతిర్లింగానికి వైద్యనాధ జ్యోతిర్లింగం అని పిలుస్తారు. ఈ వైద్యనాధ జ్యోతిర్లింగం మొదలు కోనా బీహార్లో ఉంటుంది. ఈ వైద్యనాధ జ్యోతిర్లింగం పూజించిన వారికీ సకల దీర్ఘకాల వ్యాధులు తగిపోతాయి. రావణుడు సంతోషించి లంకకు వెళ్లరు. తన తల్లికి జరిగినదంతా పెట్టాడు. అప్పటి నుంచి రావణుడు ప్రతిరోజు వైద్యనాధ జ్యోతిర్లింగంను నియమనిష్టలతో పూజించేవాడు.  

రావణుడు జ్యోతిర్లింగాని పూజించటం వల్ల అతని శక్తులు ఇంకా పెరిగాయి వేయి ఏనుగుల బలం వచ్చింది. ఇది అంత చుసిన నారదమహర్షి అందరూ చాలా భాద పడుతున్నారు. దీని ఎలాగైనా ఆపాలి అని రావణుడి దగరకు వెళ్లరు. రావణుడు నారదమహర్షిని ఆహ్వానించి కుర్చోపెట్టాడు. నారదమహర్షి రావణుడితో రావణ! నువ్వు చాలాగొప్ప వాడివి. సాక్షాత్తు జ్యోతిర్లింగాని సంపాదిచారు. కానీ కొంత మంది మహాదేవుడిని అయితే మేపించారు కానీ కైలాస పర్వతాన్ని పెకలించలేరు అని అంటున్నారు. ఆ మాట విగానే రావణుడికి కోపం వచ్చింది. నారద మహర్షితో శివుడు గొప్పవాడు కాదు నేను తపస్సు చేయటం వల్ల ఆయనకు ఆ గొప్పతనం వచ్చింది. వెంటనే బయలుదేరి కైలాసానికి వెళ్లరు. నారద మహర్షి అహంకారం ఎంత పనినైనా చేయిస్తుంది. అనుకోని అక్కడినుంచి వెళ్లిపోయారు. రావణుడు కైలాసానికి వేరేటప్పటికీ శివ పార్వతులు తాండవం చేస్తున్నారు. రావణుడు వెంటనే తన పది తలలు ఇరవై చేతులతో కైలాసాని ఎత్తటం మొదలు పెట్టాడు. రావణుడి వల్ల కాలేదు. అయినా పట్టువదలకుండా ప్రయత్నిచి అతని పది తలల పైన పెట్టుకున్నాడు. ఆ కుదుపుకి నాట్యం చేస్తున్న పార్వతీదేవి పక్కకు ఒరిగింది. శివుడు అది చూసి ఎంత అహంకారం ఏ జ్యోతిర్లింగం దకిందని నువ్వు ఇంత అహంకరిస్తునావో ఆ జ్యోతిర్లింగాని మరచిపోవుతువు గాక, ఈ చేతులు, తలలు ఉన్నాయని విర్రవీగుతున్నావో వాటిని శ్రీమన్నారాయణుడు మానవుడై జన్మించి వాటిని తరువాత నిను సంహరిస్తాడు అని శపించారు. ఇది జరగాలని నారదమహర్షి ఆశించారో లోకకల్యాణం కోసం జరిగింది అని సంతోషించి రావణుడి దగరకు వచ్చారు. రావణుడికి శివుడు శపించిన విషయం తెలియదు. నారద మహర్షి కూడా చెప్పలేదు. మల్లి చెపితే శివుడి కాలపై పడి మళ్ళి వరాలు అడుగుతాడు అని చెప్పలేదు నారద మహర్షి. రావణుడు అహకారంతో సంతోషించి ఇంటికి వేళాడు. తరువాత రామరావణ యుద్ధంలో రావణుడు మరణించాడు. ఈ వైద్యనాధ జ్యోతిర్లింగాన్ని పూజించిన వారికీ ఈ కథ విన్నవారికి అప్పటి వరకు చేసిన పాపములు పోతాయి అని వరం ఇచ్చారు మహాదేవుడు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...