నాగేశ్వర జ్యోతిర్లింగం విశిష్టత

 నాగేశ్వర జ్యోతిర్లింగం విశిష్టత



పూర్వం దారుక వనంలో దారుకా, దారుకుడు అనే రాక్షస దంపతులు ఉండేవారు. వారిలో దారుక పార్వతి అమ్మవారి కోసం దారుక వనంలో ఆరు సంవత్సరములు తపస్సు చేసింది. ఆమె తపస్సుకు మెచ్చి పార్వతి అమ్మవారు ప్రత్యక్షమైనది. దారుకాను వరం కోరుకోమనది. దారుకా అమ్మవారితో 'అమ్మ! నాకు, నా భర్తకు ఇతరుల వాళ్ళ, కానీ శివుడి వాళ్ళ కానీ మాకు ఆపదలు వచ్చినపుడు నువ్వు వచ్చి నన్ను రక్షించాలి' అని అడిగింది. అమ్మవారు "తధాస్తు" అని అమ్మవారు అదృశ్యమైయింది. ఇక ఆ వరముతో అహంకారం పెరిగి దారుకా, దారుకుడు మిగిలిన రాక్షసులు దేవతలపైనా, మునులపైనా, మానవులపైనా విజృంభించి అందరిని చంపి తినటం మొదలు పెట్టింది. వీళ్ళ అకృత్యాలు భరించలేక దేవతలు, మానవులు, మునులు, ఋషులు కలిసి భృగువు మహర్షి  కుమారుడు ఐన అరువుడు మహర్షిని శరణు కోరారు.

అరువుడు వారి విన్నపాలు విని మీకు ఏమి కష్టం వచ్చింది. ఎందుకని అలా భయపడుతున్నారు అని అడిగారు. దానికి దేవతలు దారుకా అనే రాక్షసి పార్వతి దేవి వరం తో విజృభించి ఆమె భర్త ఆమె పరివారం కలిసి మానవులను, మునులను, ఋషులను చంపి తినేస్తున్నారు. మాతో యుద్ధం చేసి మా సామ్రాజ్యం లాక్కున్నారు. మాకు నువ్వు దిక్కు అని శరణువేడారు. అరువుడు వారికీ అభయమిచ్చి వారి కోసం యజ్ఞం చేసారు. అందులో నుంచి అమృతం వచ్చింది. దానిని వారికీ ఇస్తూ ఈ అమృతం తాగటం వాళ్ళ మీ శరీరం వజ్రం లాగా తయారవుతుంది. రాక్షసులు మిమ్మలిని ఏమి చేయలేరు. ఈ అమృతం ప్రభావం సంవత్సరం ఉంటుంది అని చేపి ఇచ్చారు. దేవతలు, మానవులు, మునులు, ఋషులు అందరూ ఆ అమృతం తాగారు. వెంటనే అందరూ వెళ్లి రాక్షసులతో యుద్ధం చేసారు. రాక్షసులలో మూడు వంతులు రాక్షుసులను చంపేశారు. రాక్షసులందరు పారిపోయారు. 

దారుకా తన రాక్షసులందరిని తీసుకొని సముద్రంలోని ఒక ద్విపానికి తీసుకొని వేలింది. మనం ఒక సంవత్సరం ఇక్కడే ఉందాము. సముద్రంలో ఓడలో వచ్చే వారిని చంపి తిన్నెదాము. సంవత్సరం తరువాత మనం మళ్ళి అక్కడకు వెళదాము అని చెప్పింది. రాక్షసులందరు అక్కడే ఉండేవారు. సముద్రంలో ప్రయాణం చేస్తున్న మానవులను తినటం మొదలు పెట్టారు. కొంతకాలం తరువాత అటువైపుగా సుప్రియుడు అనే వ్యాపారి పద్నాలుగు ఓడలను తీసుకొని వ్యాపారనిమిత్తం సముద్రంలో ప్రయాణించటం మొదలు పెట్టారు. ఈ సుప్రియుడు గొప్ప శివభక్తుడు అతను రోజు శివునికి పూజ చేస్తే గాని మంచినీరుని కూడా తీసుకొనే వారు కాదు. రాక్షసులు అటుగా వెళుతున్న ఓడలను చూసారు. వాళ్ళు ఆ ఓడలను ఒడ్డుకు తీసుకొచ్చి  అందులో ఉన్న సుప్రియుడు అతని పరివారాన్ని ఆ ద్విపములోని దారుకావనంలో బంధించారు. వారిలో ఉన్న కొంతమందిని తీసుకొని వెళ్లి చంపి తినేశారు. సుప్రియుడు అక్కడే ఉన్న ఇసుకతో ఒక శివలింగం చేసి శివ పూజ చేయటం మొదలు పెట్టారు. మీరందరు భయపడకండి మనకు శివుడే రక్షా అని శివుడిని ప్రార్ధన చేసారు. అందుకో కాసేపటికి శివ తేజస్సు వచ్చింది. ఏమి జరిగిన శివ పూజ మానకూడదు అని శివ పంచాక్షరీ జపిస్తూ అక్కడే ఉన్న ఇసుకనే సమస్త పూజ ద్రవ్యాలుగా భావించి పూజించటం మొదలు పెట్టారు. వీళ్ళు ఈ పూజ చేస్తుంటే వీరికి కాపలా కాస్తున్న రాక్షసులు భయపడి వెళ్లి దారుకకి చెప్పారు. దారుకా మండిపడుతూ వారి దగరకు వచ్చింది. అక్కడికి వచ్చిన దారుకకి, ఆమె భర్తకి అక్కడ శివలింగాన్నికి బదులు ఒక చిన్న పిల్లవాడు కూర్చొని ఉన్నారు. ఆ చిన్న పిల్లవాడు పది చేతులతో, ఐదు తలాలతో కనిపించరు. దారుకా భయపడిని వెంటనే తేరుకొని నువ్వు ఏమి చేస్తున్నావు. నీవు చేస్తున్న పూజను ఆపు లేకపోతే నిన్ను చంపేస్తాను అను బెదిరించింది. కానీ సుప్రియుడు భయపడకుండా నాకు సర్వం శివమయమే నాకు ఎన్ని రోజులు శివుడు భోగములు ఇచ్చారు. ఇప్పుడు నువ్వు నన్ను చంపినా అదికూడా శివుడే నన్ను చంపి తనలో లీనం చేసుకుంటున్నాడు అనుకుంటాను అని చెప్పారు. అతను అలా అంటుండేనే అతను చేసిన శివలింగం కాస్త జ్యోతిర్లింగంగా మారింది అక్కడ ఇక ఆలయం వచ్చింది. ప్రమాదాగణములు కూడా ప్రత్యక్షమైనారు. శివుడు, ప్రమాధానములు కలిసి రాక్షసులను చంపేశారు. ఆఖరికి దారుకుడిని చంపటానికి శివుడు శూలం వేశారు. వెంటనే దారుకా అమ్మ పార్వతి దేవి నా పసుకు కుంకుమలు కాపాడమని ప్రాదించింది. అమ్మవారు అక్కడ ప్రత్యక్షమైది. దారుకుడిని రక్షచింది కానీ దారుకాని మందలిస్తూ నీవు చేస్తుంది తప్పు నేను వరం ఇచ్చాను అనే గర్వంతో విర్రవీగి అందరిని చంపి తినటం మొదలు పెట్టావు అని ఆగ్రహించింది. అమ్మవారి ఉగ్రరూపం చూసి దారుకా వణికిపోతూ నన్ను క్షమించు అమ్మ నేను తప్పు చేశాను. ఇకనుంచి రాక్షసత్వాన్ని విడిచి పెడతాను. ఎవరిని ఈబంధి పెట్టాను ఎవరిని తినను అని వేడుకుంది. పార్వతి దేవి శాంతించి నువ్వు, నీ భర్త ఈ రోజునుంచి అదృశ్య రూపములో ఇక్కడికి వచ్చిన వారిని సేవించండి. పార్వతిమాత శివునితో స్వామి మీరు ఎవరికోసమైతే ఎక్కడికి వచ్చారో అతని కోసం మీరు ఇక్కడే జ్యోతిర్లింగంగా వేలమంది. ఈ సుప్రిథుడి కుమారుడైన నాగేశ్వరుని పేరుమీద నాగేశ్వర జ్యోతిర్లింగంగా ఇక్కడే వెలసి కలియుగాంతం వరకు ఉండండి. ఆ శివలింగంలో అమ్మవారి తేజస్సు కూడా వచ్చి కలిసింది. దారుకతో మీరు ఇకనుంచి అదృశ్య రూపములో జ్యోతిర్లింగాని సేవిస్తూ ఎక్కడికి వచ్చిన భక్తులను గౌరవించండి అని ఆజ్ఞాపించింది. సుప్రితుడిని అతని పరివారాన్ని బంధనాలు నుంచి విడిపించింది. వ్యాపారంలో నష్టాలు, కష్టాలు వచ్చిన వారికీ ఇక్కడికి  వచ్చి నాగేశ్వరుడిని పూజించిన వారికీ  వ్యాపారంలో నష్టాలు పోయి లాభాలు వస్తాయి అని ఆశీర్వదించింది. శివుడు కూడా పార్వతీదేవి కోరినట్టు కలియుగాంతంవరకు ఇక్కడే ఉంటాను. 



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...