మహాకాళేశ్వర జ్యోతిర్లింగ విశిష్టత

మహాకాళేశ్వర జ్యోతిర్లింగ విశిష్టత


రత్నమాల అనే పర్వతము మీద దూషణుడు అనే రాక్షసుడు ఉన్నారు. అతను హిరణ్యాక్షుడు వంశానికి చెందిన వాడు. అతనికి ఒకసారి నేనే దేవుడిగా ఉండాలి. దేవతలను పూజించకూడదు అని బ్రహ్మ కోసం తపస్సు చేసారు. కొన్నాళ్లకి అతని తపస్సుకి మెచ్చి బ్రహ్మ దేవుడు ప్రత్యక్షమైనాడు. అప్పుడు దూషణుడు ఈ ప్రపంచాన్ని ఏలే శక్తీ రావాలి. బ్రహ్మ దేవుడు అలాగే తధాస్తు అని అందరూ నీమాట వింటారు. నీకు ఎదురు వచ్చిన వారు ఓడిపోతారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో వేదముల జోలికి శివ భక్తుల జోలికి వెళ్లకూడదు  అని చేపి అదృశ్యమయ్యారు. అప్పుడు దూషణుడు అసలు నేను తపస్సు చేసిందే శివ భక్తులను నాశనం చేయటానికి అని అహంకరించాడు. వెంటనే తన రాజ్యానికి వచ్చాడు. అతనికి పది కోట్లమంది సైనికులు ఉన్నారు. వారందరిని యజ్ఞములు పాడుచేయమని, రాజ్యాలను వశం చేసుకోమని వినని వారిని చంపేయమని ప్రపంచం నలుమూలలకు పంపించారు. అతని సైనికు భూమండలాన్ని మొత్తం జయించారు. కొంతకాలానికి దూషణుడికి ఒక ఆలోచన వచ్చింది అసలు భూమండలం మొత్తం జయించామ లేక ఇంకా ఎక్కడైనా మనకు వశం కానీ రాజ్యం ఉన్నదా అని సైనికుల్ని మల్లి పంపించారు. వారు కొంతకాలం అన్వేషించి తమ రాజుగారి దగరకు వచ్చి ప్రభు! భూమండలం మొత్తం జయించాము కానీ ఉజాయిని అనే రాజ్యం మనకు వశం కాలేదు. ఆ రాజ్యాన్ని పాలిస్తున్న రాజు గొప్ప శివ భక్తుడు. అతనికి రాజ్యములో వేదప్రియుడు అనే పండితుడు ఉన్నాడు. అతనికి నలుగురు కుమారులు ఉన్నారు. వారు దేవప్రియుడు, ప్రియమేధసుడు, సుకృతుడు, ధర్మవాహి. వారందరు తపఃశక్తి సంపనులు. వారి రాజ్యాన్ని కాపాడతారు అని నమ్మకంతో ఉన్నారు. దూషణుడికి కోపం వచ్చింది. వెంటనే ఆ రాజ్యం మీదకి దండెత్తి వచ్చారు. ఆ రాజ్యం చుట్టు బలమైన గోడ ఉన్నది. దానిని బద్దలు కోటి రాజ్యం మీద పడ్డారు. దొరికిన వాళ్ళ నందరిని చంపేయటం మొదలు పెట్టారు. రాజ్యంలో ఉన్న వాళ్ళంతా వేదవ్రతుడి దగరకు వెళ్లరు. వేదవ్రతుడు వారితో  మనలను శివుడు తప్ప మరెవరు కాపాడలేరు కాబట్టి మనం శివుడిని ధ్యానం చేద్దాము. అని శివలింగం చుట్టు కూర్చొని శివపంచాక్షరీ మంత్రాన్ని జపించటం మొదలు పెట్టారు. ఏమి జరిగిన పంచాక్షరీ మంత్రం ఆపకూడదు అనుకున్నారు. దూషణుడు అక్కడకు వచ్చారు. వచ్చి వారిని చంపబోతుంటే శివుడు పాతాళం నుంచి శివలింగంలాగా  ప్రత్యక్షమై తరువాత ఐదు ముఖంతో మహాదేవునిగా కనిపించి దూషణుడిని చూసి హూంకరించారు అంతే దూషణుడితో సహా  మొత్తం సైన్యం అంత  అక్కడిక్కడే మరణించారు. అక్కడ ఉన్న ప్రజలు సంతోషించారు. సదాశివ మహాదేవ మా యందు దయ ఉంచి మమల్ని కాపాడారు. అలాగే ఇక్కడే జ్యోతిర్లింగంగా వెలిసి మా కష్టాలను తొలగించు అని ప్రార్థించారు. శివుడు వారి ప్రార్థనలకు మెచ్చి వారికీ అభయం ఇచ్చి నేను ఇక్కడే జ్యోతిర్లింగంగా వెలుస్తాను. నాకు ఈ ఉజాయిని అత్యంత ప్రీతిపాత్రమైనది. ఇక్కడ నాకు ప్రతి రోజు తెల్లవారు జమునా భస్మాభిషేకం జరుగుతుంది. నా ఆలయం పక్కన ఉన్న స్మశానంలో ప్రతిరోజు సంపూర్ణ ఆయుష్షు తీరిన ఒకరు కాలం చేస్తారు. వారిని దహించి చితి నుంచి వచ్చిన భస్మం తీసుకువచ్చి నాకు అభిషేకం చేస్తారు. వారి చితాభస్మం అభిషేకం జరిగిన తరువాత వారు నా గణాలలో ఒకరుగా నిలుస్తారు అని వరం ఇచ్చి అదృశ్యం అవుతారు. శివుడు అదృశ్యం అయినా చోట ఒక శివలింగం వస్తుంది. దానినే మహాకాళేశ్వర జ్యోతిలింగంగా ప్రసిద్ధి చెందింది. అక్కడే సతీదేవి శరీరభాగములలో  ఒకటి అక్కపడి మహాకాళికాదేవి వెలిసి శక్తిపీఠం వెలిసింది. ఈ క్షేత్రంలో వేకువజామున అభిషేకం ప్రసిద్ధిచెందింది. 

మహాకాళేశ్వర జ్యోతిర్లింగ విశిష్టత 2


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...