ధన్వంతరి జయంతి సందర్బంగా


ధన్వంతరి ఆయుర్వేద చరిత్రలో ఒక విశిష్టమైన వ్యక్తి. అతను దేవతల వైద్యుడు మరియు అద్భుతమైన శస్త్రవైద్యుడు. ధన్వంతరిని ఆయుర్వేద పితామహుడిగా పిలుస్తారు.  చరక సంహిత ప్రకారం, ఆయుర్వేదం యొక్క జ్ఞానం శాశ్వతమైనది మరియు విశ్వం యొక్క సృష్టి ప్రతి చక్రంలో వెల్లడి చేయబడింది. ధన్వంతరి, శ్రీ మహావిష్ణువు యొక్క అవతారం. 

ఆయుర్వేదం పుట్టుక

బ్రహ్మ మానవజాతిని సృష్టించడానికి ముందే ఆయుర్వేదాన్ని కంపోజ్ చేశాడని ధన్వంతరి పేర్కొన్నాడు, 1,000 అధ్యాయాలలో అమర్చబడిన 100,000 శ్లోకాలలో అథర్వవేదంలోని ఉపాంగాలలో ఒకదాన్ని ఏర్పరిచాడు, ఇది మనుష్యుల పరిమిత తెలివితేటలు వారి స్వల్ప జీవిత కాలంలో నేర్చుకోవడం సులభం కాదు. కాబట్టి ధన్వంతరి ఋషుల అభ్యర్థనకు కట్టుబడి, బ్రహ్మ ఆయుర్వేదాన్ని 8 విభాగాలుగా విభజించారు. అవి 

శల్య, శలాక్య, కాయాచికిత్స, భూతవిద్య, కౌమారభృత్య, అగాదతంత్ర, రసాయనతంత్ర, వాజీకరణతంత్రం పునర్నిర్మించి భోదించారు.

ధన్వంతరి అవతారం

దేవతలు, రాక్షసులు కలిసి క్షిరసాగర మధనం చేస్తున్నపుడు. మొదట హాలాహలం వచ్చింది. దానిని మహాదేవుడైన శివుడు స్వీకరించారు. తరువాత కల్పవృక్షం, అపసరసాలు, ఐరావతం, ఉచైస్రావం, శ్రీమహాలక్ష్మి, అమృతాన్ని తీసుకొని ధన్వంతరి అవతరించారు. ఆయనా పీనాయుత బాహు దండాలను, కంబుకంఠాన్ని, పద్మారుణ లోచనాలను, విశాల వక్షఃప్రదేశాన్ని, సుస్నిగ్ధ కేశజాలాన్ని, నీల గాత్ర తేజాన్ని కలిగి, పీతాంబరం కట్టి, మణికుండలాలు ధరించి, పుష్పమాలా సమలంకృతుడై, హస్తతలాన అమృత కలశాన్ని దాల్చి ఆవిర్భవించారు. అతని విష్ణుదేవుని అంశాంశ వలన పుట్టినవారు, యజ్ఞభాగ భోజనుడు, ఆయుర్వేదజ్ఞుడు, మహనీయుడని బ్రహ్మాదులు గ్రహించి అతనికి "ధన్వంతరి" అని పేరు పెట్టారు. ఆయనా దేవతల వైద్యుడుగా ఉన్నారు. తరువాత ఆయుర్వేదాన్ని దానిని మూలలను మానవులకి అందించటానికి ధన్వంతరిని అవతరించామని ఇంద్రుడు ఆయనను నియమించారు.  

భాగవతంలోనే నవమ స్కంధంలో కాశీరాజు ధన్వంతరి గురించి పురూరవ వంశక్రమంలో ఉంది. ఆ ప్రకారం పురూరవునికి క్షత్రవృద్ధుడు, అతనికి సుహోత్రుడు, సుహోత్రునకు కాశ్యుడు, అతనికి కాశి, కాశికి దీర్ఘతపుడు, దీర్ఘతపునికి ధన్వంతరి జన్మించారు. ధన్వంతరి హరి అంశతో ప్రభవించి ఆయుర్వేద ప్రవర్తకుడయ్యాడు. ధన్వంతరి ఆయుర్వేద శాస్త్రాన్ని ఎనిమిది భాగాలుగా (ఆష్టాంగాలుగా) విభజించారట. అవి.

1. కాయ చికిత్స 

2. కౌమారభృత్య లేదా బాలచికిత్స 

3. భూతవైద్యం లేదా గ్రహచికిత్స 

4. శలాక్యతంత్ర 

5. శల్యతంత్ర

6. విషతంత్ర 

7. రసాయన తంత్ర 

8. వశీకరణ తంత్ర

ధన్వంతరి ఆలయాలు 

తమిళనాడు:-  శ్రీరంగం రంగనాధస్వామి ఆలయం ఆవరణలో ఒక ధన్వంతరి మందిరంలో నిత్య పూజలు జరుగుతున్నాయి. మందిరం వద్దనున్న శిలాఫలకం ప్రకారం అది 12వ శతాబ్దానికి చెందినది. అప్పటి గొప్ప ఆయుర్వేద వైద్యుడు గరుడవాహన భట్టార్ ఈ మందిరంలో మూర్తిని ప్రతిష్ఠించినట్లు తెలుస్తున్నది. ఇక్కడ తీర్ధంగా కొన్ని మూలికల రసం (కషాయం) ఇస్తారు.

కేరళ:- గురువాయూర్, త్రిస్సూర్‌లకు మధ్య 20 కి.మీ. దూరంలో "నెల్లువాయ" అనే గ్రామంలో ఒక ధన్వంతరి గుడి ఉంది. ఇది గురువాయూర్ దేవస్థానం అంత పురాతనమైనదని భావిస్తారు. తమ చికిత్సావృత్తి ప్రాంభానికి ముందు చాలా మంది ఆయుర్వేద వైద్యులు ఈ మందిరాన్ని దర్శిస్తుంటారు. కేరళలోనే కాలికట్ పట్టణం పరిసరాలలో ఒక "ధన్వంతరి క్షేత్రం" ఉంది. ఈ మందిరం ఇప్పుడు అధికంగా జనాదరణ పొందుతున్నది. వ్యాధి నివారణకు, ఆరోగ్యానికి ఇక్కడి దేవుడిని దర్శించి ప్రార్థనలు చేస్తుంటారు.

ఆంధ్రప్రదేశ్:-  తూర్పు గోదావరి జిల్లాలోని చింతలూరులో ప్రసిద్ధమైన ధన్వంతరి భగవానుని దేవాలయం ఉంది.

ధన్వంతరి ఆలయాలు ప్రత్యేకంగా కనిపించడం అరుదు. వారాణసిలోని సంస్కృత విశ్వవిద్యాలయం మ్యూజియంలో ఒక ధన్వంతరి విగ్రహం ఉంది. ఢిల్లీలోని "ఆయుర్వేద, సిద్ధ పరిశోధన మండలి కేంద్రం" లో ఒక పెద్ద, ఒక చిన్న ధన్వంతరి విగ్రహాలున్నాయి.

ఆరోగ్య దేవుడైన ధన్వంతరి పుట్టినరోజు వేడుకలు ఉత్సాహభరితమైన మరియు ఆహ్లాదకరమైన వాతావరణంలో జరుగుతాయి. ధన్వతరి జయంతిని భారతదేశం అంతటా భారతీయ సాంప్రదాయ వైద్యమైన ఆయుర్వేద అభ్యాసకులు జరుపుకుంటారు. ఈ ఆలయాల్లో ధన్వంతరి జయంతిని అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు. 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...