సోమనాథ జ్యోతిర్లింగ విశిష్టత

                సోమనాథ క్షేత్రం గుజరాత్ లోని సౌరాష్ట్రాలోని వేరావాల్ రేవు పట్టణానికి 5 కిలోమీటర్ల దూరములో అరేబియా సముద్ర తీరములో ఉంది. ఈ ఆలయం సముద్ర తీరానికి 25 అడుగుల ఎత్తులో ఉంది. ఈ ఆలయం లోని శివలింగం 4 అడుగుల ఎత్తులో ఓంకారం ఆకారం లో ఉంది. ద్వాదశ జ్యోతిర్లింగాలలో మొదటిది. అంతే కాకా శ్రీ కృష్ణ భగవానుడు తన అవతారని చివరి క్షణంలో ఇక్కడే త్యజించారు అని ప్రతీతి. సోమనాథ క్షేత్రాన్ని " ప్రభాత క్షేత్రం" అని కూడా పిలుస్తారు. ఈ ఆలయంలో ప్రతి రోజు సంధ్య హారతి ఉంటుంది. 

ఆలయ చరిత్ర

                కృతయుగంలో దక్షప్రజాపతికి 60 మంది కుమార్తెలు ఉన్నారు. వారిలో 27 మంది కాలంలో నక్షతలుగా విరాజిల్లలు. వారిని దక్షప్రజాపతి, అత్రిమహాముని అనసూయల కుమారుడు చంద్రునికి ఇచ్చి వివాహం చేసారు. వివాహ సమయంలో దక్షప్రజాపతి చంద్రుని దగర నుంచి ఒక మాట తీసుకున్నారు. అది నా కుమార్తెలు అందరిని సమానంగా చూడాలి. ఒకరిని ఎక్కువగా ఒకరిని తక్కువగా చూడకూడదు అని తీసుకున్నారు. చంద్రుడు కూడా దానికి సమ్మతించారు. చంద్రుడు తన భార్యలు అయినా 27 మందిని తీసుకొని చంద్రలోకానికి వెళ్లరు. మొదటిలో కొన్ని రోజులు అందరితో బాగానే ఉన్నారు. కొన్ని రోజులకి అందరితో చనువుగా ఉండటం తగ్గించి రోహిణితో మాత్రమే సమయాన్ని గడిపేవారు. భర్త ప్రేమ దూరమైన మిగిలిన వారు భాదపడుతూ తమ తండ్రి దగ్గరకు వెళ్లి తమ ఆవేదన వ్యక్తం చేసారు. దక్షప్రజాపతి వారి భాధను చూసి భరించలేక చంద్రుడిని పిలిచి మందలించారు. అయినా వినకపోవడంతో దక్షప్రజాపతి చంద్రునికి క్షయ వ్యాధిగ్రస్తుడివికమ్మని శపించారు. చంద్రుడు అతనికి ఉన్న 16 కళలను కోల్పోయి కళావిహీనం మారిపోయారు. చంద్రుడి శాపం మూలంగా చంద్రుడి కన్నా దేవతలు ఎక్కువగా బాధపడరు. చంద్రుడి వాళ్ళ సముద్రం ఆటుపోట్లు మారిపోయాలు. రుతుపవనాల స్థితిగతులు మారిపోయాయి. చంద్రుడి కాంతి కిరణాల వల్ల కొన్ని ఔషధాలు పెరుగుతాయి. చంద్రుడి లేకపోవటం వల్ల లోకం సమతుల్యం తప్పాయి. అందుకే దేవతలు అందరూ కలిసి బ్రహ్మ దేవుని దగ్గరకు వెళ్లి మొరపెట్టుకున్నారు. బ్రహ్మ దేవుడు దేవతలతో చంద్రుడిని తీసుకొని పశ్చిమ తీరములో ప్రభాత క్షేత్రమునకు తీసుకు వెళ్లి ఇసుకతో శివలింగాన్ని చేసి మహా మృత్యుంజయ మంత్రాన్ని జపించమని చెప్పారు. 

              దేవతలు చంద్రుడిని తీసుకొని పశ్చిమ తీరములో ప్రభాత తీర్ధములో చంద్రుడి చేత ఇసుకతో శివలింగాన్ని చేయించి చంద్రుడితో కలిసి మహా మృత్యుంజయ మంత్రాన్ని జపించటం మొదలుపెట్టారు. చంద్రుడికి అంత క్షయ వ్యాధి, నీరసం, దగ్గు, ఓపిక లేకపోయినా పట్టుదలతో మంత్రాన్ని జపించారు. సముద్రంలోని నీటినే శివునికి అభిషేకానికి ఉపయోగించారు. ఇలా 6 నెలలు గడిచాయి. చంద్రుడి భక్తికి మెచ్చి శివుడు చంద్రునికి దర్శనమిచ్చారు. చంద్రుడు శివుడిని ప్రార్థించి తనకు ఉన్న క్షయ వ్యాధిని తగించామని శాపాన్ని నుంచి విముక్తిని ప్రసాదించమని ప్రార్థించారు. శివుడు చంద్రునితో " చంద్రా! నువ్వు నీ భార్యల యందు ద్రోహం చేసావు. వారినందరిని సమానంగా చూడాలి. అంతేకాక దక్షప్రజాపతి నా పరమభక్తుడు. అతను ఇచ్చిన శాపాన్ని పూర్తిగా నేను విరమించారు. అతను నా భక్తుడు కాబట్టి అతని శాపాన్ని నేను గౌరవిస్తునాను. అందుకన్ని నీకు ఉన్న 16 కళలను మాసంలో 15 రోజులు తగ్గుతాయి. మళ్ళీ 15 రోజులు పెరుగుతాయి అని అభయమిచ్చారు. చంద్రునికి వరం ఇవ్వగానే బ్రహ్మాది దేవతలు వచ్చారు. బ్రహ్మ దేవుడు శివుడితో "మహాదేవ! నీవు ఎంత భక్త పరాధీనుడివి చంద్రుడు చేసిన కేవలం 6 నెలల తపస్సుకి మెచ్చి అతనికి అభయం ఇచ్చావు. నీకు భక్తితో నమస్కరిస్తున్నాను స్వామి. ఈ భూలోకంలో మానవులు అనేక వ్యాధులతో భాధపడుతుంటారు. వారిని ఉద్దరించటానికి కలియుగాంతంవరకు నీవు ఈ శివలింగములోనే జ్యోతిర్లింగంగా కొలువైవుండు" అని ప్రార్థించారు. శివుడు అలాగే నువ్వు అడిగినట్లు గానే చంద్రునివల్ల ఈ శివలింగం ప్రతిష్టించారు కాబ్బటి అతని పేరు మీద సోమనాథ లింగముగా పిలవబడుతుంది. చంద్రుడు ఎక్కడ ఉన్న కుండములో ప్రతిరోజు స్నానం చేసి నా కోసం తపస్సు చేసారు కాబ్బటి ఇకనుంచి ఇది చంద్రకుండంగా పిలవబడుతుంది. ఇందులో కలియుగాంతం వరకు నీరు ప్రవహిస్తుంది. ఇందులో స్నానం చేయటం వల్ల ఎటువంటి వ్యాధులైన నయమవుతాయి. సోమనాథ లింగాన్నిదర్శించిన వారికీ సమస్త పాపములు నశిస్తాయి.

 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...