భగవద్గీత

అధ్యాయం 3

శ్లోకం 8

నియతం కురు కర్మ త్వం కర్మ జ్యాయో హ్యకర్మణః l

శరీరయాత్రా పి చ తే న ప్రసిద్ధ్యేదకర్మణః ll

అర్ధం :-

నీవు శాస్త్రవిహితకర్తవ్యకర్మలను ఆచరింపుము. ఏలనన, కర్మలను చేయకుండుటకంటెను చేయుటయే ఉత్తమము. కర్మలను ఆచరింపనిచో శరీర నిర్వహణముగూడ సాధ్యము గాదు.

భగవద్గీత

అధ్యాయం 3

శ్లోకం 7

యస్త్విద్రియాణి మనసా నియామ్యరభతేర్జున l

కర్మేంద్రియైః కర్మయోగమ్ అసక్తిః విశిష్యతే  ll

అర్ధం :-

కాని, అర్జునా! మనస్సుతో ఇంద్రియములను వశపరుచుకొని, అనాసక్తుడై ఇంద్రియములద్వారా కర్మయోగాచరణమును కావించు పురుషుడు శ్రేష్ఠుడు.

భగవద్గీత

అధ్యాయం 3

శ్లోకం 6

కర్మేoద్రియాణి సంయమ్య య ఆస్తే మనసా స్మరన్ l

ఇంద్రియార్ధన్ విమూఢత్మ మిథ్యాచారః స ఉచ్యతే ll

అర్ధం :-

ప్రతి వ్యక్తియు కర్మను ఆచరింపవలసియే యుండును. బలవంతముగా, బాహ్యముగా ఇంద్రియవ్యాపారములను నిగ్రహించి, మానసికముగా ఇంద్రియవిషయములను చిమ్మెత్తించునట్టి మూఢుని మిథ్యాచారి అనగా దంభి అనియందురు.




భగవద్గీత

అధ్యాయం 3

శ్లోకం 5

న హి కశ్చిత్ క్షణమపి జాతుతిష్ఠత్యకర్మకృత్ l

కార్యతే హ్యవశ: కర్మ సర్వ: ప్రకృతిజైర్గుణైః ll

అర్ధం :-

ఏ మనుష్యుడైనను ఏ కాలమునందైనను క్షణమాత్రముగూడ కర్మను ఆచరింపకుండా ఉండలేడు. ఇందు ఎట్టి సందేహమునకును తావులేదు. ఏలనన,  మనుష్యులందరును ప్రకృతిజనితములైన గుణములకు లోబడి కర్మలను చేయుటకు భాధ్యులగుదురు. 



సిద్ధిధాత్రి


         నవదుర్గలలో  తొమ్మిదోఅవతారం సిద్ధిధాత్రి అమ్మవారు.  ఈ అమ్మవారిని ఉపాసించిన వారికీ సర్వ సిధులను ప్రసాదిస్తుంది. శివునికి కూడా ఈ అమ్మవారు సిధ్ధులను ప్రసాదించింది అని దేవి భాగవతం చెపుతుంది. 

           సిద్ధిధాత్రి దేవి కమలంపై ఆసీనురాలై ఉంటుంది. ఈ మాత కుడి చేతిలో చెక్రము, మరొక చేతిలో గద, ఎడమ చేతిలో శంఖము, మరొకచేతిలో కమలాలు ధరించి ఉంటుంది.

     ఈ మాత కృపవలన భక్తుల,  యోగుల మనసులో ఉన్న లౌకికమైన,  పరమార్ధికమైన కోరికలని నెరవేరును.  ఈ మాతను ఉపాసించేవారికి కోరికలు అనేవి లేకుండాపోతాయి.  ఐహిక విషయాలమీద విరక్తి కలిగి ముక్తిని కోరుకొని ఆఖరికి ఈ అమ్మవారిని చేరుకుంటారు.



మహాగౌరిదేవి

           నవదుర్గలలో ఎనిమిదొవ అవతారం మహాగౌరీదేవి. ఈ అమ్మవారు ఎప్పుడు ఎనిమిది ఎనిమిది సంవస్త్రారాలుగా కనిపిస్తుంది. ఈ మాత కోరిన కోరికలు తీర్చి గతంలో పాపాలను పోగొట్టి మరణం తరువాత మోక్షమును ప్రసాదిస్తుంది. 

          ఆ జగన్మాత హిమవంతుని కుమార్తెగా జన్మించి శివుని కోసం తపస్సు చేస్తుంది. అలా తపస్సు చేస్తున్న సమయంలో అమ్మవారు గాలి, వానలకు, కరువుకు ప్రకృతి మార్పులకు తట్టుకొని తపస్సు చేస్తుంది. అందువల్ల మాత శరీరం నలుపు రంగులోకి మారింది. శివుడు మాత తపస్సుకు మెచ్చి ప్రత్యమైయి అమ్మవారిపైనా గంగా జలంలో తడిపాడు. అమ్మవారికి పవిత్రమైన గంగా జలం తగలగానే నలుపు వర్ణంలో ఉన్న అమ్మవారు తెలుపు వర్ణంలోకి వచ్చింది. శివుడిని ఎల్లపుడు సంతోషంగా ఉంచుతుంది.అప్పటి నుంచి ఈ అమ్మవారిని మహాగౌరి అన్న పేరు వచ్చింది.




భగవద్గీత

అధ్యాయం 3

శ్లోకం 4

న కర్మాణమనారంభాత్ నైష్కర్మ్యం పురుషోస్నుతే l

న చ సన్న్యసనాదేవ సిద్ధిo సమాధిగచ్చతి  ll

అర్ధం :- 

మనుష్యుడు కర్మలను ఆచరింపకయే నైష్కర్మ్యము అనగా యోగనిష్టసిద్ధి అతనికి లభింపదు. అట్లే కేవలము కర్మలను త్యజించినంత మాత్రమున సిద్ధిని అనగా సంఖ్యానిష్ఠను అతడు పొందజాలడు. 




కాళరాత్రి

నవదుర్గలలో ఎడొవ అవతారం కాళరాత్రి మాత. కాళరాత్రి మరణం జరిగిన రోజు యొక్క రాత్రిని పాలించే దేవత.  ఈ మాత శరీరం నలుపు వర్ణంలో నూనె కారుతునాటు  ఉంటుంది. పెద్దనోరు, గుండ్రనికళ్ళు,  అరుణ వస్త్రాలు ధరించి,  మేడలో ముళ్లగొలుసు చూడటానికి భయంకరంగా జుట్టు విరబోసుకొని ఉంటుంది. 

యోగులు ఈ మాతను సహస్రను చక్రంలో సాధన చేస్తారు.

కాళరాత్రి మాతను ఉపాసిస్తే సర్వ భయాలనుంచి, కాపాడుతుంది. ఇహపర సుఖాలను, మరణించిన తరువాత ముక్తిని ప్రసాదిస్తుంది. 




భగవద్గీత

అధ్యాయం 3

శ్లోకం 3

శ్రీభగవాన్ ఉవాచ 

లోకే స్మిన్ ద్వివిధా నిష్ఠ పురప్రోక్త మాయనఘ l

జ్ఞానయోగేన సంఖ్యానాం కర్మయోగేన యోగునామ్ ll

అర్ధం :-

శ్రీభగవానుడు పలికెను :- ఓ అనఘా! అర్జునా! ఈ లోకమున రెండు నిష్టలు గలవని ఇంతవకుముందే చెప్పియుంటిని. వానిలో సాంఖ్యయోగులకు జ్ఞానయోగముద్వారా.యోగులకు కర్మయోగము ద్వారా నిష్ఠ కలుగును.








భగవద్గీత

అధ్యాయం 3

శ్లోకం 2

వ్యామిశ్రేనేవ వాక్యేన బుద్ధిo మోహయసీవమే l

తదేకం వద నిశ్చిత్య యేవ శ్రేయో హమాప్నుయామ్ ll

అర్ధం :-

కలగాపులగమువంటి నీ మాటలతో నా బుద్ధి భ్రమకు లోనగునట్లు చేయుచున్నావు. కనుక, నాకు శ్రేయస్కరమైన ఒక మార్గమును నిశ్చయముగా తెల్పుము.





కాత్యాయని దేవి

      నవదుర్గ అవతారాలలో ఆరొవ అవతారం కాత్యాయని దేవి. కాత్యాయనుడు అను మహర్షి అమ్మవారి కోసం తపస్సు చేసాడు. అమ్మవారు ఆ మహర్షిని అనుగ్రహించటానికి ఒక బాలిక రూపములో అతని ఇంట్లో కొంతకాలం నడయాడింది. అందుకని ఆ అమ్మవారికి కాత్యాయని అని పేరు వచ్చింది. 

           మహిషాసురయుద్ధంలో అమ్మవారు ఆరో రోజున కాత్యాయని అవతారంలో వెలింది. ఈ అమ్మవారి వాహనం పెద్దపులి.

       ద్వాపర యుగంలో గోపికలు, కృష్ణుడిని ఆత్మభర్తగా పొందటానికి కాత్యాయని అమ్మవారి వ్రతం చేస్తారు. ఆ వ్రతా ఫలితాన్ని పొందుతారు. కాత్యాయని వ్రతం పెళ్లికాని ఆడపిల్లలు మంచి భర్త రావాలని చేస్తారు.

          కాత్యాయని దేవి ఆజ్ఞా చక్రానికి అధిష్టాన దేవత. యోగులు ఈ రోజున ఆజ్ఞా చక్రంలో కాత్యాయని మాతను ఉపాసన చేస్తారు.




         





భగవద్గీత

 శ్రీమద్భగవద్గీత

అథ తృతీయో ధ్యాయ: - కర్మయోగః 

శ్లోకం 1

అర్జున ఉవాచ 

జ్యాయపీ చేత్ కర్మణస్తే మతాబుద్ధిర్వజనార్దన l

తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయపి కేశవా ll

అర్ధం :-

అర్జునుడు పలికెను :- ఓ జనార్దనా!కేశవా! నీ అభిప్రాయమును బట్టి కర్మకంటెను జ్ఞానమే శ్రేష్ఠమైనచో, భయంకరమైన ఈ యుద్దకార్యమునందు నన్నెలా వియోగించుచున్నావు?




స్కందమాత

నవదుర్గ అవతారాలలో 5అవతారం స్కందమాతదేవి. ఈ అమ్మవారు మోక్ష, శక్తి, ఐశ్వర్య ప్రదాయినిగా భక్తుల విశ్వాసం. ఈ మాత అగ్నికి అధిదేవత. 

               శివపార్వతులకు వివాహం జరిగిన తరువాత తారకాసురుడు సంహారం కోసం దేవతలు మొరపెట్టుకోగా శివపార్వతులు ధ్యానంలో లీనమై శివశక్తులనుండి ఒక శక్తి వచ్చింది. తరువాత అది పిండంగా రూపాంతరం చెందింది. దేవతల రాజు అయినా ఇంద్రుడు పిండం త్వరగా బిడ్డగా రూపాంతరం చెందాలని పిండిని తీసుకొని అగ్నిదేవుడికి ఇస్తాడు. 

             అగ్నిదేవుడు ఆ పిండిని తీసుకొని ఒక గుహలో దాకుంటాడు. కొంతసేపటికి శివ తేజస్సుని భరించలేక దానిని తీసుకెళ్లి గంగాదేవికి ఇస్తాడు. గంగామాత కూడా కొంతసేపటికి ఆ శక్తిని భరించలేక రెళ్లపొదలలో విడిచిపెడుతుంది. రెళ్లపొదలో ఉన్న పిండిని ఆరుగురు కృత్తికలు పిండాన్ని పోషించగా కుమారస్వామి జన్మిస్తాడు.

             ధాన్యం నుంచి బయటకు వచ్చిన పార్వతి దేవికి విషయం తెలిసి కోపంతో దేవతలకి సంతానం ఉండకూడదని శపించింది. శివుడు, పార్వతిదేవిని శాంతిపజేస్తాడు. తరువాత పార్వతీదేవి కుమారస్వామిని తీసుకొస్తుంది. కుమారస్వామి మరొక పేరు స్కంధుడు. స్కంధుడు మాత కాబ్బటి పార్వతిదేవికి స్కందమాత అని పిలుస్తారు. 

         శంభు, నిశంభులతో యుద్ధ సమయంలో ఐదవ రోజున అమ్మవారు స్కందమాతా దేవి అవతారంలో రణరంగానికి వెళ్ళి కొంతమంది అసురులను చంపుతుంది.

        యోగులు ఈ రోజు అమ్మవారిని విశుద్ధచక్రంలో ధ్యానం నిలిపి ఉపాసన చేస్తారు.




     

భగవద్గీత

అధ్యాయం 2

శ్లోకం 72

ఏషా బ్రాహ్మీ స్థితి:పార్ధ నైనాం విముహ్యతి l

స్థిత్వాశ్యామంతకాలే పి బ్రహ్మనిర్వాణమృచ్చతి ll

  ఓం తత్పదితి  శ్రీమయోగద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయం యోగశాస్ర్తే  శ్రీకృష్ణార్జునసంవాదే సాంఖ్యయోగోనామ ద్వితియో ధ్యాయ:

అర్ధం :-

ఓ అర్జునా! బ్రాహ్మిస్థితి యనగా ఇదియే. ఈ బ్రాహ్మిస్థితిని పొందిన యోగి ఎన్నడును మోహితుడు కాడు. అంత్యకాలమునందును ఈ బ్రాహ్మిస్థితియందు స్థిరముగానున్నవాడు బ్రహ్మానందమును పొందును.






కూష్మాండదేవి

          నవదుర్గలో నాలుగో అవతారం కూష్మాండ దేవి. ఈ అమ్మవారిని పూజిస్తే ఆరోగ్యము, ఐశ్వర్యం, శక్తి లభిస్తాయని భక్తుల విశ్వసం. 

        ఈ విశ్వం లేనపుడు అంతా చీకటే అలుముకుని ఉంది. కూష్మాండ దేవి తన చిరునవ్వుతో ఈ విశ్వాన్ని సృష్టించింది. ఈ మాత సూర్యుని మధ్యభాగంలో నివసిస్తుంది. కూష్మాండ మాత తేజసుతోనే సూర్యుడుకి వెలుగు వస్తుంది అని దేవి పురాణం చెపుతుంది.



     కూష్మాండ దేవి అనాహత చక్రానికి అధిష్టాన దేవత. యోగులు, సాధకులు ఈ అమ్మవారిని సాధన చేస్తారు.

కూష్మాండ దేవి 8 చేతులతో ఉంటుంది.ఆ చేతులతో చక్రం, ఖడ్గం, గద, పాశం, ధనువు, బాణాలు, ఒక చేతిలో తేనె భాడం, మరొక చేతిలో రక్త భండం ఉంటాయి. ఈ అమ్మవారి వాహనం పులి.



భగవద్గీత

అధ్యాయం 2

శ్లోకం 71

విహాయ కామాన్ యః సర్వాన్ పుమాంశ్చరతి ని:స్పృహః l

నిర్మమో నిరహంకార: స శాంతిమాధిగచ్చతి ll

అర్ధం :-

కోరికలన్నింటిని త్యజించి, మమతా - అహంకార, స్పృహరహితుడై చరించునట్టి పురుషుడే శాంతిని పొందును. 





చంద్రఘంటా

          దుర్గాదేవి తొమ్మిది అవతారాల్లో మూడవ అవతారం చంద్రఘంటా . చంద్రఖండ, చండికా, రణచండీ అని కూడా ఈ అమ్మవారిని పిలుస్తారు. చంద్రఘంటా అంటే అర్ధచంద్రాకారంతో, గంట కలగి ఉన్నది అని అర్ధం. చంద్రఘంటా దేవి ధైర్యానికీ, శక్తికీ, తేజస్సుకూ ప్రతీకగా భక్తులు భావిస్తారు. ఆమె తన తేజస్సుతో పూజించినవారి పాపాలు, ఈతిబాధలు, రోగాలు, మానసిక రుగ్మతలు, భూత భయాలు దూరం చేస్తుంది.

          శివుడు, పార్వతి దేవిని వివాహం చేసుకోవటానికి ఒప్పుకున్నా తరువాత మేనకా, హిమవంతులు కూడా సంతోషించారు. పెళ్లి రోజున శివుడు దేవతలు,  మునులు, తనగణములు, శ్మశానంలో తనతో ఉండే భూత, ప్రేత, పిశాచాలతోను, తరలి విడిదికి వస్తాడు. వారందరిని,  శివుని వేషాన్ని చూసి మేనకా కళ్ళు తిరిగి పడిపోతుంది. పార్వతిమాత చంద్రఘంటా దేవి రూపంలో  శివునికి దర్శనం ఇస్తుంది. తన కుటుంబం భయపడకుండా ఉండేలా శివుడిని రూపం మార్చుకోమని కోరుతుంది. ఆమె కోరికను మనించి శివుడు రాజకుమారుడిలా తయారవుతాడు.  వివాహ సమయంలో మొదటి సారి పార్వతీధరిస్తుంది దేవి చంద్రఘంటా దేవి అవతారం ధరిస్తుంది. 

శివ, పార్వతులకు కౌషికి అనే కుమార్తె జన్మిస్తుంది. శుంభ, నిశుంభులను సంహరించామని పార్వతిమాతను ప్రాదించారు. అమ్మవారు యుద్ధం చేస్తుండగా, ఆమె అందం చూసి రాక్షుసులు మోహితులు అవుతారు. ఆమెను తన తమ్మునికి నిశంభునికి ఇచ్చి వివాహంచేయాలని శంభుడు అనుకుంటాడు. అనుకున్నదే తడవుగా ధూమ్రలోచనుణ్ణి కౌశికిని ఎత్తుకు రమ్మని పంపిస్తారు. అమ్మవారు మరల రెండొవసారి చంద్రఘంటా అవతారం ధరించి ధూమ్రలోచనుణ్ణి అతని పరివారాన్ని సంహరిస్తుంది.

              చంద్రఘంటా దేవి ఎనిమిది చేతులతో ఉంటుంది. పులి మీదగానీ, సింహంమీదగానీ ఎక్కుతుంది. ఈ వాహనాలు ధైర్యానికి, సాహసానికీ ప్రతీకలు.  అమ్మవారి కిరీటంలో అర్ధచంద్రుడు ఉండగా, ఫాలభాగంలో మూడో నేత్రంతో ప్రకాశిస్తుంది ఆ తల్లి. అమ్మవారు బంగారు వర్ణంలో మెరిసిపోతూంటుంది.

         చంద్రఘంటా దేవిని ఈరోజు యోగులు మణిపూరక చక్రంలో సాధన చేస్తారు.




భగవద్గీత

అధ్యాయం 2

శ్లోకం 70

ఆపూర్యమానమాచలప్రతిష్టిం సముద్రమాపః ప్రవిశంతి యద్యత్ l

తధ్వత్ కామా యం ప్రవిశంతి సర్వే స శాంతిమాప్నోతి న కామకామీ ll

అర్ధం :-

సమస్తదిశలనుండి పొంగి ప్రవహించుచు వచ్చిచేరిన నదులన్నియును పరిపూర్ణమై నిశ్చలముగానున్న సముద్రమును ఏమాత్రము చలింపజేయకుండగానే అందులో లీనమగును. అట్లే, సమస్తభోగములును స్థితప్రజ్ఞునియందు ఎట్టి వికారములు కలిగింపకయే వానిలో లీనమగును. అట్టి పురుషుడే పరమశాంతిని పొందును. భోగాసక్తుడు శాంతిని పొందజాలడు. 



బ్రహ్మచారిణి

          నవదుర్గ స్వరూపములలో రెండోవ స్వరూపము బ్రహ్మచారిణి. ఆమె తెల్లని చీర ధరించి, కుడి చేతిలో జపమాల, కమండలం, ఎడమ చేతిలో కలశం ధరించి ఉంటుంది. 

          పార్వతి దేవి శివుడిని వివాహం చేసుకోవాలి అనుకుంటుంది. ఈ విషయం తల్లితండ్రులైన మేనకా, హిమవంతులకి ఈవిషయం చెపుతుంది. దానికి వారు సంతోషించి పార్వతిని తీసుకొని శివుడు తపస్సు చేసుకుంటున్న ప్రదేశానికి వెళతారు. హిమవంతుడు శివుడితో మీరు అనుమతిస్తే నా కుమార్తె పార్వతీదేవి మీకు సపర్యలు చేస్తుంది అని కోరతారు. దానికి శివుడు అంగీకరిస్తాడు.  అప్పటినుండి పార్వతి దేవి శివునికి సేవ చేస్తుంది. 

              ఈ విషయం తెలుసుకున్న తారాకాసురుడు ఊరుకున్నాడు. ఎందుకంతే తారకాసురుడు బ్రాహ్మ కోసం తపస్సు చేసి తనకి శివ సంతానమే తనని వదిచాలని వరం కోరతాడు.  అతని ధీమా ఏమిటంతే సతీదేవి మరణించిన తరువాత శివుడు వైరాగ్యము చెంది తపస్సు చేసుకుంటున్నాడు. శివుడు మళ్ళీ వివాహం చేసుకోరని అతని నమ్మకం. 

         ఇంకోవైపు తారకాసురుడు ఆగడాలు ఎక్కువ అయ్యాయి. అందుకు దేవతలు బ్రహ్మను ప్రదించారు. అందుకు బ్రహ్మ దేవతలకు అభయం ఇచ్చి పార్వతి దేవికి శివునికి వివాహం జరిగితే తప్ప మీ కష్టాలు తీరవు అని చేపి మన్మధుడిని పిలిచి నీవు వెళ్లి శివునిమీద పూలబాణం వేయమని పంపారు. పూలబాణం వేసిన మన్మధుడిని శివుడు దగ్ధం చేస్తాడు.  శివుడు ఇంకా స్త్రీ గాలి సోకని ప్రదేశానికి తపస్సుకు వెళ్లిపోతాడు. 

         నిరాశ చెందిన పార్వతి దేవి శివునికోసం తపస్సుకు వెళుతుంది. సన్యాసిని వల్లనే వస్త్రములు ధరించి బ్రహ్మచారిణి అయి 5000 సంవత్సరములు తపస్సు చేస్తుంది. బ్రహ్మచారిణి తపస్సుకు మెచ్చిన శివుడు ఆమెను పరీక్షించటానికి సాధువు వేషం ధరించి వచ్చి శివుని నిందచేస్తాడు ఇది విన పార్వతి సాధువు మాటలు నమ్మక మళ్ళీ తపస్సు చేసుకుంటుంది. శివుని నిజరూప దర్శనం ఇచ్చి బ్రహ్మచారిణితో ని తపస్సుకు మెచ్చినాను. త్వరలో వచ్చి నిను వివాహం చేసుకుంటాను. నీవు ఇంకా ఇంటికి వెళ్ళు అని చెపుతాడు. సంతోషించిన బ్రహ్మచారిణి మాత మళ్ళీ పార్వతి అయి ఇంటికి వెళుతుంది.

          స్వాధిష్ఠానచక్రానికి అదిష్టానదేవత బ్రహ్మచారిణి మాత. నవరాత్రుల్లో రెండొవరోజు యోగులకు, సాధువులకు ముఖ్యమైన రోజు స్వాధిష్ఠాన చక్రంలో బ్రహ్మచారిణి మాతను దర్శించి పూజిస్తారు. 



భగవద్గీత

అధ్యాయం 2

శ్లోకం 69

య నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ l

యస్యాం జాగ్రతి భూతవి సా నిశా పశ్యతో మునే: ll

అర్ధం :-

అది ఇతరప్రాణులన్నింటికిని రాత్రితో సమానము. నశ్వరమైన ప్రాపంచిక సుఖప్రాప్తికై ప్రాకులాడుచు ప్రాణులనియు మేల్కొని యుండును. అది పరమాత్మ తత్వమునెరిగిన మునికి రాత్రితో సమానము.






భగవద్గీత

అధ్యాయం 2

శ్లోకం 68

తస్మాద్యస్య మహాబాహో! నిగృహీతాని సర్వశ:l

ఇంద్రియాణీంద్రియార్థేభ్య: తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా ll

అర్ధం :-

ఓ అర్జునా! ఇంద్రియములను ఇంద్రియార్థములనుండి అన్ని విధములుగ పూర్తిగా నిగ్రహించిన పురుషునియొక్క బుద్ధి స్థిరముగానుండును.నిత్యజ్ఞానస్వరూపపరమానందప్రాప్తియందు స్థితప్రజ్ఞుడైన యోగి మేల్కొని యుండును.




శైలపుత్రి

     

         అవతారాలలో మొదటి అవతారం శైలపుత్రిమాత. ఆదిపరాశక్తిని కూతురిగా పొందటానికి హిమవంతుడు, మేనకా తపస్సును చేసారు. ఆదిపరాశక్తి వారి తపస్సుకు మెచ్చి వారికీ కూతురిగా పుడతాను అని వరం ఇచ్చింది. వారి తపస్సు ఫలించినందుకు వారు సంతోషించారు. ఆ మాత రాక కోసం వారు ఎదురుచూస్తున్నారు. ఒక శుభదినమున మేనకా గర్భవతి అయినది. అప్పటినుండి మేనకా, హిమవంతులు మహర్షులకు సేవ చేస్తూ అమ్మవారి రాక కోసం ఎదురు చుస్తునారు. ఒక  శుభముహుర్తమున మేనకా ప్రసవించింది. అందుకు హిమవంతుడు సంతోషించి మహర్షులకు దానధర్మాలు చేసారు. పర్వతరాజు పుత్రి పార్వతి అని పిలిచారు.  శైలం అంటే కొండ. పర్వతమైన హిమవంతుని కుమార్తె కాబటి శైలపుత్రి అని పిలిచారు. 



        మహిషాసురుని సంహరించేందుకు యుద్ధంలో మొదటిరోజు ఆదిపరాశక్తి శైలపుత్రిదేవిగా వచ్చింది. 

         యోగమార్గంలో ఉన్నవారు ఇంకా ఆధ్యామికంగా ఎదగాలి అనుకునేవారు శైలపుత్రిమాతను ఉపాసిస్తే స్వస్వరూప జ్ఞానం పొంది ఉన్నత స్థానాలకు చేరవచ్చు అని దేవి భాగవతం,  శివ పురాణం చెపుతున్నాయి. మూలాధార చక్రానికి అధిష్టాన దేవత శైలపుత్రిమాత. శైలపుత్రిమాత మూలాధార చక్రాన్ని జాగృతం చేస్తుంది. 

      శైలపుత్రి మాత శివుని కోసం తపస్సు చేసి భర్తగా పొందింది. ఆమె నందిపై కూర్చొని మూలాధార చక్రానికి తన ప్రయాణాన్ని ప్రారంభించింది. లౌకికంగా తండ్రి అయినా హిమవంతుడి నుండి భర్త అయినా శివుని వెతుక్కుంటూ ప్రయాణించింది.

               -: శైలపుత్రి ధ్యానం:-

వందే వాంఛితలాభాయ చంద్రార్ధకృత శేఖరం 

వృషారూఢం శూలధరాం శైలపుత్రీo యశస్వనీమ్

                           -:అర్ధం:-

వృషభాన్ని అధిరోహించి కిరీటంలో చంద్రవంకను ధరించి యశశ్శు కలిగి భక్తుల మానః వాంఛలను తీర్చే మాత శైలపుత్రీ దుర్గ దేవికి నా వందనం ఆర్పుస్తున్నాను. 

          -:శైలపుత్రీదేవి ఆలయం:-

ఉత్తరప్రదేశ్ లోని వారణాశిలో మర్హియ ఘాట్ వద్ద శైలపుత్రీ దేవి ఆలయం ఉంది.





భగవద్గీత

అధ్యాయం 2

శ్లోకం 67

ఇంద్రియాణాం హి చరతాం యన్మనో ను విషియాతే l

తదస్య హారతి ప్రజ్ఞం వాయుర్నావమివాంభసి ll

అర్ధం :-

మనశాంతి లేనివానికి సుఖము ఎట్లు లభించును? నీటిపై తేలుచున్న నావను గాలినెట్టివేయును. అట్లే ఇంద్రియార్ధముల యందు సంచరించు ఇంద్రియములలో మనస్సు ఏ ఒక్క ఇంద్రియముతో కూడియున్నాను ఆ ఒక్క ఇంద్రియమే మనోనిగ్రహములేని మనుజునిబుద్ధిని అనగా విచక్షణా శక్తిని హరించివేయును. 



భగవద్గీత

అధ్యాయం 2

శ్లోకం 66

నాస్తి  బధిరయుక్తస్య న చాయుక్తస్యభావనా l

న చాభావయతః శాంతి: అశాంతస్య కుతః సుఖమ్ ll

అర్ధం :-

ఇంద్రియములు, మనస్సు వశమునందు ఉండని వానియందు నిశ్చయాత్మక బుద్ధి ఉండదు. అట్టి అయుక్తమనుష్యుని అంతఃకరణమునందు ఆస్థికభావమే కలుగదు. తద్భావనాహీనుడైన వానికి శాంతి లభించదు. 



భగవద్గీత

అధ్యాయం 2

శ్లోకం 65

ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే l

ప్రసన్నచేతసో హ్యాశు బుద్ధి: పర్యవతిష్ఠితే ll

అర్ధం :-

మనఃప్రసన్నతను పొందిన వెంటనే అతని దుఃఖములన్నియును నశించును. ప్రసన్నచిత్తుడైన కర్మయోగియొక్క బుధ్ది అన్నివిషయములనుండి వైదొలగి, పరమాత్మయందు మాత్రమే పూర్తిగా స్థిరమగును.





భగవద్గీత

అధ్యాయం 2

శ్లోకం 64

రాగద్వేషవియుక్టైస్తు విషయానింద్రియైశ్చరన్ l

ఆత్మవశైర్విదేయాత్మ ప్రసాదమాదిగచ్ఛతి ll

అర్ధం :-

అంతఃకరణమును వశమునందుంచుకొనిన సాధకుడు రాగద్వేషరహితుడై, ఇంద్రియముల ధ్వారా విషయములను గ్రహించుచున్నను మనశ్శoతిని పొందును. 



భగవద్గీత

అధ్యాయం 2

శ్లోకం 63

క్రోదాద్భవతి సమ్మోహః సమ్మోహత్ స్మృతివిభ్రమః l

స్మృతిభ్రంశాద్భుద్ధినాశో బుధినాశాత్ ప్రణశ్యతి ll

అర్ధం :-

అట్టి క్రోధమువలన వ్యామోహము కలుగును. దాని ప్రభావమున స్మృతిభాష్టమైనందున బుధ్ది అనగా జ్ఞానశక్తి నశించును. బుధ్ది నాశమువలన మనుష్యుడు తన స్థితినుంచి పతనమగును. 



భగవద్గీత

అధ్యాయం 2

శ్లోకం 62

ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే l

సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధో భిజాయతే ll

అర్ధం :-

విషయచింతన చేయు పురుషునకు ఆ  విషయములయందు ఆసక్తి ఏర్పడును. ఆసక్తివలన ఆ విషయములను పొందుటకై కోరికలు కలుగును. ఆ కోరికలు తీరనప్పుడు క్రోధము ఏర్పడును. 



భగవద్గీత

అధ్యాయం 2

శ్లోకం 61

తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః l

విశే హి యస్యేoద్రియాణి తస్య ప్రజ్ఞాప్రతిష్ఠితా ll

అర్ధం :-

కనుక, సాధకుడు ఆ ఇంద్రియములను అన్నింటిని వశము నందుంచుకొని, సమాహితచిత్తుడై మత్పరాయణుడై, ధ్యానమునందు కూర్చొనవలెను. ఏలనన, ఇంద్రియములను వశమునందుంచుకొనువాని బుధ్ది స్థిరముగా నుండును.






భగవద్గీత

అధ్యాయం 2

శ్లోకం 60

యతతో హ్యాపి కౌంతేయ పురుషస్య విపశ్చితః l

ఇంద్రియాణి ప్రమాథీని హరంతి ప్రసభం మనః ll

అర్ధం :-

ఓ అర్జునా! ఇంద్రియములు ప్రధానశీలములు. మనుష్యుడు వాటిని నిగ్రహించుటకు ఎంతగా ప్రయత్నించినను, ఆసక్తి తొలగి పోనంతవరకు అవి అతని మనస్సును ఇంద్రియార్థములవైపు బలవంతముగా లాగికొనిపోవుచునే యుండును.





భగవద్గీత

అధ్యాయం 2

శ్లోకం 59

విషయా వినివర్తంతే నిరాహారస్య  దేహినః l

రసావర్జo రసోప్యస్య పరం దృష్ట్వా  నివర్తతే ll

అర్ధం :-

ఇంద్రియముల ద్వారా విషయములను గ్రహింపనివానినుండి ఇంద్రియార్థములు మాత్రము వైదొలగును. కాని, వాటిపై ఆసక్తి మిగిలియుండును. స్థితప్రజ్ఞునకు పరమాత్మ సాక్షాత్కారమైనందు వలన వానినుండి ఆ ఆసక్తిగూడ తొలగిపోవును.





భగవద్గీత

అధ్యాయం 2

శ్లోకం 58

యదా సంహరతే చాయ కూర్మోoగానీవ సర్వశః l

ఇంద్రియాణీంద్రియార్థేభ్య: తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా ll

అర్ధం :-

తాబేలు తన అంగములను అన్నివైపులనుండి లోనికి ముడుచుకొనునట్లుగా,  ఇంద్రియములను  ఇంద్రియార్థముల నుండి అన్నివిధముల ఉపసంహరించుకొనిన పురుషుని యొక్క బుద్ధి స్థిరముగా ఉన్నట్లు భావింపవలెను.




భగవద్గీత


అధ్యాయం 2
శ్లోకం 57

యః  సర్వత్రానభిస్నేహః తత్తత్  ప్రాప్య శుభాశుభమ్ l 

నాభినందతి న ధ్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా l

అర్ధం :-

దేనియందును  మమతాసక్తులు లేనివాడును, అనుకూల  పరిస్థితులయందు హర్షము, ప్రతికూల పరిస్థితులయందు  ద్వేషము మొదలగు  వికారములకు లోనుగానివాడును అగు పురుషుడు స్థితప్రజ్ఞుడు అనబడును.


క్విజ్ = Quiz

శ్రీ కృష్ణుడు ఎక్కడ జన్మించాడు ?


(1) వ్రేపల్లె              (2) మధుర నగరం 


(3) ద్వారకా నగరం           (4) బృందావనం


కామెంట్ చేయండి

క్విజ్ = Quiz

 శ్రీ కృష్ణుడి వామ పాదం తగిలి మొక్షం పోందిన రాక్షసుడు ఎవరు ?


 (1) శిశుపాలుడు            (2) కంసుడు
 (3)శకటాసురుడు            (4) కాళియుడు

కామెంట్ చేయండి 

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...