భగవద్గీత

అధ్యాయం 2

శ్లోకం 70

ఆపూర్యమానమాచలప్రతిష్టిం సముద్రమాపః ప్రవిశంతి యద్యత్ l

తధ్వత్ కామా యం ప్రవిశంతి సర్వే స శాంతిమాప్నోతి న కామకామీ ll

అర్ధం :-

సమస్తదిశలనుండి పొంగి ప్రవహించుచు వచ్చిచేరిన నదులన్నియును పరిపూర్ణమై నిశ్చలముగానున్న సముద్రమును ఏమాత్రము చలింపజేయకుండగానే అందులో లీనమగును. అట్లే, సమస్తభోగములును స్థితప్రజ్ఞునియందు ఎట్టి వికారములు కలిగింపకయే వానిలో లీనమగును. అట్టి పురుషుడే పరమశాంతిని పొందును. భోగాసక్తుడు శాంతిని పొందజాలడు. 



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...