స్కందమాత

నవదుర్గ అవతారాలలో 5అవతారం స్కందమాతదేవి. ఈ అమ్మవారు మోక్ష, శక్తి, ఐశ్వర్య ప్రదాయినిగా భక్తుల విశ్వాసం. ఈ మాత అగ్నికి అధిదేవత. 

               శివపార్వతులకు వివాహం జరిగిన తరువాత తారకాసురుడు సంహారం కోసం దేవతలు మొరపెట్టుకోగా శివపార్వతులు ధ్యానంలో లీనమై శివశక్తులనుండి ఒక శక్తి వచ్చింది. తరువాత అది పిండంగా రూపాంతరం చెందింది. దేవతల రాజు అయినా ఇంద్రుడు పిండం త్వరగా బిడ్డగా రూపాంతరం చెందాలని పిండిని తీసుకొని అగ్నిదేవుడికి ఇస్తాడు. 

             అగ్నిదేవుడు ఆ పిండిని తీసుకొని ఒక గుహలో దాకుంటాడు. కొంతసేపటికి శివ తేజస్సుని భరించలేక దానిని తీసుకెళ్లి గంగాదేవికి ఇస్తాడు. గంగామాత కూడా కొంతసేపటికి ఆ శక్తిని భరించలేక రెళ్లపొదలలో విడిచిపెడుతుంది. రెళ్లపొదలో ఉన్న పిండిని ఆరుగురు కృత్తికలు పిండాన్ని పోషించగా కుమారస్వామి జన్మిస్తాడు.

             ధాన్యం నుంచి బయటకు వచ్చిన పార్వతి దేవికి విషయం తెలిసి కోపంతో దేవతలకి సంతానం ఉండకూడదని శపించింది. శివుడు, పార్వతిదేవిని శాంతిపజేస్తాడు. తరువాత పార్వతీదేవి కుమారస్వామిని తీసుకొస్తుంది. కుమారస్వామి మరొక పేరు స్కంధుడు. స్కంధుడు మాత కాబ్బటి పార్వతిదేవికి స్కందమాత అని పిలుస్తారు. 

         శంభు, నిశంభులతో యుద్ధ సమయంలో ఐదవ రోజున అమ్మవారు స్కందమాతా దేవి అవతారంలో రణరంగానికి వెళ్ళి కొంతమంది అసురులను చంపుతుంది.

        యోగులు ఈ రోజు అమ్మవారిని విశుద్ధచక్రంలో ధ్యానం నిలిపి ఉపాసన చేస్తారు.




     

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...